
వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆందోళన కొనసాగు తుండగానే కెనడా ప్రభ్తుత్వం కూడా షాకిస్తోంది. స్టడీ, వర్క్ వీసాలపై కొత్త రూల్స్‌ను అమలు చేయనుంది.. ఇటీవల తమ దేశంలోని ప్రవేశించిన అక్రమ వలసదారులను గుర్తించి, వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టిన అమెరికా బాటలోనే కెనడా కూడా నడుస్తోంది.
కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త వీసా నియమాలు భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు ఒక పీడకలగా మారవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ కొత్త నియమాలు ఫిబ్రవరి నుండి అమల్లోకి వచ్చాయి . ఉద్యోగులు, వలసదారుల వీసా స్థితిని ఎప్పుడైనా మార్చడానికి కెనడియన్ సరిహద్దు అధికారులకు విచక్షణాధికారాలను ఇస్తున్నాయి.
జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ద్వారా బోర్డర్ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్ (ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్ వీసా (టీఆర్‌వీ) వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. అయితే, పర్మిట్లు, వీసాలను తిరస్కరించడానికి కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. బస గడువు ముగిసిన తర్వాత వ్యక్తి కెనడాను విడిచిపెడతారని నమ్మకం లేకపోతే, గడువు ఉన్నప్పటికీ ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు లేదా వారి అనుమతిని రద్దు చేయవచ్చు. తాజా చర్యలు భారతదేశం నుండి వచ్చిన వారితో సహా పదివేల మంది విదేశీ విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటికే కెనడాలో ఉంటున్న వారి అనుమతులు రద్దైన పక్షంలో విదేశీయులను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ(ఎయిర్‌పోర్టు) నుంచే వెనక్కు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
భారతీయులను ఎక్కువగా వెళుతున్న దేశాల్లో కెనడా కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలి ట్రంప్ ఆంక్షల తరువాత కెనడాను ఎంచుకుంటున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు. ప్రభుత్వ డేటా ప్రకారం కెనడాలో సుమారు 4.2లక్షల మంది భారతీయులు ఉన్నత విద్యనభ్యిస్తున్నారు.ఇక భారతీయ టూరిస్టుల విషయానికి వస్తే 2024లో 3.6 లక్షల మంది భారతీయులకు టూరిస్టు వీసాలు జారీ చేసింది. అంతకుముందు 3.4 లక్షల మంది టూరిస్టు వీసాపై కెనడాను సందర్శించారు. మూడు నెలల క్రితమే (2024 నవంబర్), కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ లేదా SDS వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేసిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment