కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (LMIA) మద్దతుతో ఉద్యోగ ఆఫర్‌కు సంబంధించినఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను రద్దు చేయాలని భావిస్తోంది. జాబ్ ఆఫర్‌పేరుతో జరుగుతున్న మోసపూరిత పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను త్వరలో తొలగించనున్నట్లు ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు.
ఇది కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ (CRS) కట్-ఆఫ్ స్కోర్‌ను చేరుకోవడానికి , అక్కడ శాశ్వత నివాసం పొందే అసలైన లబ్ధిదారులను ప్రభావితం చేయనుందని నిపుణులు భావిస్తున్నారు.
తాత్కాలిక విదేశీ వర్కర్ (TFW) ప్రోగ్రామ్‌లో సంస్కరణల్లో భాగంగా ఇది మొదటిసారిగా 2014లో ప్రవేశపెట్టారు. స్టీఫెన్ హార్పర్ ప్రభుత్వం "అర్హత కలిగిన కెనడియన్లు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన పూర్తి తీవ్రమైన కార్మికుల కొరతను నివారించేం పరిష్కారంగా" భావించింది. అంటే సాధారణంగా దేశంలోని వివిధ సంస్థలు నిపుణులైన, అర్హులైన ఉద్యోగులను అందుబాటులో లేనపుడు అప్పటికే శాశ్వత నివాసం ఉన్నవారిలో లేకపోతే విదేశీ వ్యక్తులను నియమించుకునే వెసులుబాటు కలుగుతుంది. కెనడాలోని సంస్థలు ఒక విదేశీ ఉద్యోగిని నియమించుకోవాలనుకుంటే, వారు ముందుగా LMIA దరఖాస్తును పూర్తి చేయాలి. ఫెడరల్ ప్రభుత్వం అనుమతి పొందాలి. ఉద్యోగం చేయడానికి కెనడియన్లు లేదా ఇతర శాశ్వత నివాసితులు లేరని కూడా వారు ధృవీకరించాల్సి ఉంటుంది.
అలా లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (ఎల్‌ఎంఏఐ) కింద దరఖాస్తు చేసుకుంటాయి. ఈ సందర్భంగా జాబ్ ఆఫర్ ద్వారా ఆయా వ్యక్తులకు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పేరుతో 50 పాయింట్లు అదనంగా లభిస్తాయి. దీంతో.. ఆ వ్యక్తులు కెనడాలో శాశ్వత నివాసం లేదా తాత్కాలిక నివాసం కోరుకుంటే ఈ పాయింట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుంది.
అయితే ఈ పేరుతో పలు సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయని, విదేశీ వ్యక్తులు వీటిని కొనుగోలు చేసి.. శాశ్వత నివాసాలు పొందేందుకు అవకాశంకల్పిస్తున్నాయని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భావిస్తోంది. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
అయితే కెనడాలో శాశ్వత నివాసం పొందేందుకు జాబ్ ఆఫర్ల పేరిట మోసాలు జరుగు తున్నాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. కొంతమంది ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు చట్టవిరుద్ధంగా LMIAలను వలసదారులకు లేదా శాశ్వత నివాసం పొందడానికి వారి CRS స్కోర్‌ను పెంచుకుంటోందన్న పలు నివేదికల నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment