points
-
పోలీస్ వ్యవస్థపై పెరుగుతున్న నమ్మకం
ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతా అంశాలపై అమెరికాకు చెందిన గాలప్ సంస్థ తన వార్షిక నివేదికలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒక దశాబ్దకాలం క్రితం కంటే.. నేడు ఎంతో సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. 👉గ్లోబల్ సేఫ్టీ ట్రెండ్లను అనుసంచి.. 2023లో ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది పెద్దలు రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితంగా భావించారు. ఆసియా, పసిఫిక్, పశ్చిమ ఐరోపా దేశాలలోని 75 శాతం మంది భద్రత విషయంలో ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఉత్తర ఆఫ్రికాలో 74 శాతం మంది ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.👉యురేషియా ప్రాంతానికి చెందిన 20,063 మంది ఈ సర్వేలో పాల్గొనగా, ఇక్కడ భద్రత విషయంలో 34 శాతం పాయింట్ల మెరుగుదల కనిపించింది. దీంతో యూరేషియా భద్రత విషయంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పుకోవచ్చు. 👉ఇక భద్రతపై ఆందోళన కలిగించే ప్రాంతాల విషయానికొస్తే ఉప సహారా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్లు అత్యల్ప భద్రతను కలిగి ఉన్నాయని తేలింది. 👉పోలీసులపై నమ్మకం విషయానికొస్తే 2023లో ప్రపంచవ్యాప్తంగా 71 శాతం మంది ప్రజలు స్థానిక పోలీసులపై నమ్మకాన్ని కలిగివున్నట్లు తెలిపారు. ఇది దశాబ్ధకాలంతో పోలిస్తే 62 శాతానికి పెరిగింది. కాగా ఈక్వెడార్ భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 👉2023లో కేవలం 27శాతం ఈక్వెడారియన్లు మాత్రమే రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.👉ఇజ్రాయెల్‌లో సంఘర్షణల ప్రభావం భద్రతా లేమిని స్పష్టంగా చూపింది. హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌లో భద్రతతో ఉన్నామనే భావన అక్కడి వారిలో మరింతగా క్షీణించింది. 2022లో ఈ అంశం 82 పాయింట్లుగా ఉండగా, ఇప్పుడది 68 శాతానికి పడిపోయింది.ఇది కూడా చదవండి: కమలా హారీస్ ఆఫీసుపై కాల్పులు -
రోజుకు అరగంట రెస్ట్.. అమెజాన్ ఏర్పాట్లు!
న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా డెలివరీ పార్ట్నర్స్ కోసం విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ప్రాజెక్ట్ ఆశ్రయ్ పేరుతో దేశవ్యాప్తంగా రాబోయే సంవత్సరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. తాగు నీరు, ఫోన్ చార్జింగ్ స్టేషన్స్, వాష్‌రూమ్స్, విశ్రాంతి ప్రదేశం ఈ కేంద్రాల్లో ఉంటాయని వివరించింది.ఉద్యాస ఫౌండేషన్ సహకారంతో ప్రయోగాత్మకంగా ఢిల్లీ, ఎన్సీఆర్, బెంగళూరు, ముంబైలో ముందుగా ఇవి రానున్నాయి. తాము కార్యకలాపాలు సాగిస్తున్న అన్ని నగరాల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక అని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అభినవ్ సింగ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కంపెనీకి 1,800 డెలివరీ స్టేషన్స్ ఉన్నాయని చెప్పారు.ఇతర కంపెనీలకు చెందిన డెలివరీ ప్రతినిధులు సైతం ఈ కేంద్రాల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. ఒకేసారి 15 మంది వరకు విశ్రాంతి పొందవచ్చు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో డెలివరీ ప్రతినిధి రోజులో 30 నిముషాలు మాత్రమే ఇక్కడ గడపవచ్చు. ప్రాజెక్ట్ ఆశ్రయ్‌లో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో సైతం విశ్రాంతి కేంద్రాలను నెలకొల్పాలని అమెజాన్ భావిస్తోంది. -
ఉద్యోగుల రివార్డుల్లో ‘నవ’శకం!
ఉద్యోగుల శ్రమకు గుర్తింపుగా సర్టిఫికెట్లు, గిఫ్టుల వంటివి ఇవ్వడం పరిపాటే. అయితే, అన్ని రంగాల్లో ఇప్పుడు నవతరం జెన్ జెడ్ అడుగుపెట్టడంతో ఈ ట్రెండ్ క్రమంగా మారుతోంది. సిబ్బందికి రివార్డుల్లో భారత కార్పొరేట్ కంపెనీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సాంప్రదాయ బహుమతులు, సరి్టఫికెట్లకు బదులు డిజిటల్ బాట పడుతూ ‘సోషల్’ కల్చర్‌తో వారిలో నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి.భారత కార్పొరేట్ రంగంలో కొత్త రివార్డుల సంస్కృతికి తెరలేచింది. కంపెనీలు తమ ఉద్యోగులకు అందించే బహుమతుల ప్రోగ్రామ్‌ను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇప్పుడంతా డిజిటల్ రివార్డులకే ఓటేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా యువ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుండటంతో వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి కంపెనీలు. ఉద్యోగుల విజయాలు, కొత్తగా నేర్చుకున్న స్కిల్స్‌కు గుర్తింపుగా బ్యాడ్జ్‌లు, పాయింట్లు, నోట్స్ వంటివి అందిస్తుండటంతో ఎంప్లాయీస్ మూడు షేర్.. ఆరు లైక్‌లతో ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఎప్సిలాన్ ఇండియా ‘సిటిజన్ ఆఫ్ ‘యూ’నివర్స్’ పేరుతో ‘పాస్‌పోర్ట్’ను ప్రవేశపెట్టింది. యువతరం కోరుకునే వినోదం, సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చింది. ‘ఈ రోజుల్లో ప్రజలు, ముఖ్యంగా యువత దేన్నైనా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేస్తున్నారు. ఆఫీస్ సమావేశం లేదా ఈవెంట్లో పాల్గొన్న ప్రతిసారి ‘పాస్‌పోర్ట్’పై స్టాంప్ పడుతుంది. ఈ గుర్తింపును వారు షేర్ చేసుకోవడం ద్వారా ఇతరులతో పంచుకోవచ్చు’ అని కంపెనీ హెచ్ఆర్ హెడ్ సోనాలి దేసర్కార్ పేర్కొన్నారు. రోషె ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ఇండియా కూడా అప్లాజ్ పేరుతో అంతర్గత స్టోర్‌ను ఉద్యోగులకు అందుబాటులోకి తెచి్చంది. గుర్తింపులో భాగంగా లభించే పాయింట్లతో సిబ్బంది హెడ్ఫోన్ల నుంచి ఈవెంట్ టిక్కెట్ల వరకు ఏదైనా కొనుక్కునే అవకాశాన్ని కలి్పస్తున్నట్లు కంపెనీ ఎండీ రాజా జమలమడక చెప్పారు.అంతా ‘సోషల్’మయం... ఉద్యోగులు, ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో మునిగితేలుతుండటంతో.. కంపెనీలు తప్పనిసరిగా ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాయి. ‘యువతరంలో సోషల్ ఆరాటం, భావోద్వేగాలు చాలా ఎక్కువ. అందుకే వారు సాధించే విజయాలను సీనియారిటీతో సంబంధం లేకుండా సహచరులు ఒకరికొకరు అభినందించుకోవడానికి, కృతజ్ఞతలు తెలియజేయడానికి లీడర్షిప్బోర్డ్లు వీలు కలి్పస్తున్నాయి’ అని థ్రైవ్ డిజిటల్ ప్రెసిడెంట్, సీఈఓ శంకరనారాయణన్ చెప్పారు. ఇక మెర్క్ ఇండియా వార్షిక గుర్తింపు వారం, ప్యానెల్ ఆధారిత అవార్డులు, స్పాట్ అవార్డులు.. ఇలా మూడు రకాలను అమలు చేస్తోంది. ఆల్స్టేట్ ఇండియా ప్రతి ఉద్యోగికి నెలనెలా 100 పాయింట్లు అందిస్తోంది. వీటిని ఒకరికొకరు ఇచి్చపుచ్చుకోవచ్చు, అంతర్గత స్టోర్‌లో రిడీమ్ చేసుకోవచ్చు.డిజిటల్ బ్యాడ్జ్‌లకు ప్రాచుర్యంఉద్యోగుల విజయాలు, నైపుణ్యాలకు అద్దంపట్టే డిజిటల్ బ్యాడ్జ్‌లకు అన్ని కంపెనీల్లోనూ బాగా ప్రాచుర్యం లభిస్తోంది. సిబ్బంది తమ సాఫల్యాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేసుకునే విధంగా కంపెనీలు ఈ బ్యాడ్జ్‌లను రూపొందిస్తున్నాయి. ‘ఉద్యోగులు పనిలో మరింత ఎంగేజ్ అయ్యేలా, స్ఫూర్తి నింపడంలో గేమిఫికేషన్ సమర్థ సాధనంగా మారుతోంది. ముఖ్యంగా ప్రస్తుత గ్లోబల్ కేపబిలిటీ ఎకోసిస్టమ్‌లో ఇది చాలా కీలకం. ఒకరినొకరు అభినందించుకోవడం, రివార్డులను షేర్ చేసుకోవడం వంటివి పరస్పర గౌరవాన్ని పెంచడంతో పాటు టీమ్‌లను బలోపేతం చేస్తుంది’ అని ర్యాండ్‌స్టాడ్ డిజిటల్ ఇండియా ఎండీ మిలింద్ షా అభిప్రాయపడ్డారు. → ఎప్సిలాన్ ఇండియా కొత్తగా ‘పాస్‌పోర్ట్’ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. ఆఫీస్ సమావేశాల్లో పాల్గొన్న ప్రతిసారీ ఉద్యోగులకు ‘స్టాంప్’ పడుతుంది. సోషల్ మీడియాలో ప్రతిదీ షేర్ చేసుకోవాలని పరితపించే నవతరం ఉద్యోగులకు ఇది తెగ నచ్చేస్తోందట!→ రోషె ఇన్ఫర్మేషన్ సొల్యూషన్స్ ‘అప్లాజ్’ పేరుతో అంతర్గత స్టోర్ తెరిచింది. ఉద్యోగులకిచ్చే పాయింట్లను రీడీమ్ చేసుకొని ఇక్కడ హెడ్‌ఫోన్స్, టిక్కెట్ల వంటివి కొనుక్కోవచ్చు.→ కొత్త స్కిల్స్, బాధ్యతల్లో విజయాలకు ప్రతిగా టాలెంట్‌ను గుర్తించేందుకు ఇస్తున్న డిజిటల్ బ్యాడ్జ్‌లు (బెస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది మంత్ వంటివి) కంపెనీల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.→ మెర్క్ ఇండియా, ఆల్స్టేట్ ఇండియా, థ్రైవ్ డిజిటల్లీడర్షిప్ బోర్డులను అమలు చేస్తున్నాయి. సీనియారిటీతో సంబంధం లేకుండా సహోద్యోగులు ఒకరికొకరు అభినందనలు తెలియజేసేందుకు ఇది తోడ్పడుతోంది. -
అక్షయ్ కుమార్ పేరెంటింగ్ స్టైల్!..తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సినవి..!
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్క్రీన్‌పై యాక్షన్ హీరో అయినా ఆఫ్ స్క్రీన్‌పై మాత్రం ఓ మంచి తండ్రిగా కుటుంబంతో గడిపేందుకే ప్రాధాన్యత ఇస్తాడు. తన తల్లిదండ్రులు ఎలాంటి విలువలు నేర్పారో అవే తన పిల్లలకు నేర్పించానని సగర్వంగా చెబుతుంటాడు. ఇక్కడ అక్షయ్ దంపతుల నుంచి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన కీలక విషయాలేంటో సవివరంగా చూద్దాం..!.చెఫ్‌గా మొదలైన అక్షయ్ కుమార్ ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ స్టార్‌లో ఒకడిగా చెలామణి అవుతున్నాడు. ఆయన ఎన్నో వెవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే బుల్లితెరపై యాంకర్‌గా ఫియర్ ఫ్యాక్టర్ సిరీస్‌తో అలరించాడు కూడా. అలాంటి ఆయన ఓ ఫ్యామిలీ మ్యాన్‌గా ఎంతలా ఉంటాడో చాలామందికి తెలియదు. ఆఫ్ స్క్రీన్‌పై తన భార్య ట్వింకిల్ ఖన్నా, ఇద్దరు పిల్లలతో టైం స్పెండ్ చేసేందుకే ఇష్టపడతాడు. ఆయనకు మొదటి సంతానంగా 21 ఏళ్ల ఆరవ్, రెండో సంతానంగా 11 ఏళ్ల నితారా అనే కుమార్తె ఉంది. ఆయన ఓ తండ్రిగా, భర్తగా ఏం చేయాలో అవన్నీ పుల్‌ఫిల్ చేస్తుంటాడు. అతడి పేరెంటింగ్ నుంచి నేర్చుకోవాల్సినవి ఇవే..సమాయన్ని కేటాయించడం..నటుడిగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పిల్లల కోసం సమయం కేటాయిస్తాడు. వాళ్లతో కలిసి వాకింగ్ లేదా పార్కులో గడుపుతాడు. పిల్లలు కూడా ఫిట్నెస్తో ఉండేలా కేర్ తీసుకుంటాడు. కాస్త విరామం దొరికిన పిల్లలతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తాడు.కలిసి చదవడం..తన కూతురు నితారా చిన్నప్పటి నుంచి ఆమె చదువు బాధ్యత అంతా అక్షయ్‌నే చూసుకున్నాడు. తనతో కలిసి కొత్త పదాలు నేర్చుకోవడం, చదవడం, వినడం వంటివి చేస్తానని పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు అక్షయ్. అలాగే ఆమెకు కథ చెప్పే నైపుణ్యం నేర్పించడమే గాక, కొన్ని విలువలను కథల రూపంలో అర్థమయ్యేలా వివరించేవాడినని అంటారు అక్షయ్. కూతురికి తండ్రిగా ఉండటాన్ని గర్వంగా ఫీలవుతాడు..కూతురికి తండ్రి అవ్వటం సిగ్గుపడే విషయం కాదని అంటాడు. తన కూతురు నితారాతో కలిసి డాల్ హౌస్‌లను నిర్మించడం, ఆమె క్రియేటివిటీని తన కాలి గోళ్లపై నెయిల్ పాలిష్ రూపంలో ఆమె చేత వేయించుకుంటాడు. పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో అలానే ఫ్రీగా ఉండనిస్తా..ఎట్టిపరిస్థితుల్లోనూ బలవంతం చెయ్యను. కొన్ని విషయాల్లో మాత్రం హద్దులు పెడతాను, స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన వాటిల్లో ఉంటానని నొక్కి చెబుతున్నారు అక్షయ్. పిల్లలకు సరైన విలువలను నేర్పడం అత్యంత ముఖ్యం. అవే తన తల్లిదండ్రులు తనకు నేర్పించారని తాను కూడా వారి బాటనే అనుసరిస్తున్నానని సగర్వంగా చెప్పారు. జీవిత పాఠాలు..అక్షయ్ తన పిల్లలు కష్టపడి సంపాదించటం గురించి, దాని ప్రాముఖ్యతను తెలుసుకునేలా చూసుకుంటానని అన్నారు. కొడుకు ఆరవ్‌కి కష్టం విలువ నేర్పించాడు. అలాగే నైతికత అంటే చెబుతానని, కష్టపడి పనిచేస్తేనే ప్రత్యేక హక్కు వస్తుందని వివరిస్తానని చెప్పారు. ఇటీవల తాము సెలవుల్లో విహార యాత్రకు వెళ్లాలనుకున్నాం. అయితే తన కొడుకు ఆరవ్ బిజినెస్ క్లాస్‌లో వెళ్లాలనుకున్నాడు. అందుకోసం కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటేనే తల్లిదండ్రులను ఖరీదైన కోరికలు కోరుకునే హక్కు ఉంటుందని చెప్పాను. ఆరవ్ కూడా దాన్నే నిజం చేస్తూ..ఫస్ట్-డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించి తన కోరిక నెరవేర్చుకున్నాడని వివరించారు. ఇలాంటివే పిల్లలకు నేర్పించాలే తప్ప ఏది అడిగితే అదే తెచ్చే తండ్రిలా పెంచి పిల్లలను భారంగా మార్చుకోవద్దని సూచిస్తున్నారు అక్షయ్. అలాగే కృజ్ఞతతో కలిగి ఉండటం, బాధ్యతయుతంగా వ్యవహరించడం వంటివి తెలియజేయాలని చెబుతున్నారు. పనులు పంచుకోవడం..ప్రతి ఒక్కరికీ కుటుంబ సమయం ముఖ్యం. పిల్లలు తమ తల్లితో సమయం గడపేలా తండ్రే బాధ్యత తీసుకోవాలి. అందుకే తాను కొన్ని ఇంటి పనుల్లో బాధ్యత తీసుకుంటానని అన్నారు. తద్వారా ఇంటి భారమంతా మహిళలపైనే పడదు. అలాగే ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను తన భార్య ట్వింకిల్ ఖన్నా చాలా బాగా పెంచిందన్నారు. నిజానికి వివాహం తర్వాత ఆమె నన్ను కూడా తల్లిలా బాగా చూసుకుందని ఆనందంగా చెప్పారు. ఇక్కడ తల్లిదండ్రులుగా పిల్లలకు కలిసి నేర్పించాల్సిన విషయాలు, విలువలను ఇరువురు సఖ్యతతో నేర్పిస్తేనే..పిల్లలు మంచిగా పెరుగుతారని చెప్పకనే చెప్పారు.(చదవండి: నోట్లో వేసుకుంటే కరిగిపోయే 'పైన్ నట్స్'..ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!) -
పంద్రాగస్టు: తెలుసుకోవలసిన 10 విషయాలు
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమానికి మహాత్మా గాంధీ నాయకత్వం వహించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం లభించింది. భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తిక అంశాలు..1. స్వాతంత్య్రం వచ్చిన రోజున మహాత్మా గాంధీ ఢిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోఖాలీలో ఉన్నారు. అక్కడ హిందువులు- ముస్లింల మధ్య నెలకొన్న మతపరమైన హింసను నియంత్రించేందుకు నిరాహార దీక్ష చేపట్టారు.2. ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందని తెలియగానే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్‌లు మహాత్మా గాంధీకి ఒక లేఖ పంపారు. ఆ లేఖలో ‘ఆగస్టు 15వ తేదీ మన దేశ తొలి స్వాతంత్య్ర దినోత్సవం. జాతిపితగా ఉత్సవాల్లో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి’ అని రాశారు.3. అయితే దీనికి సమాధానంగా గాంధీజీ ‘కలకత్తాలో హిందువులు- ముస్లిములు పరస్పరం ఘర్షణ పడుతున్నప్పుడు నేను సంబరాలు చేసుకోవడానికి ఎలా వస్తాను? ఈ అల్లర్లను అదుపు చేయడానికి నేను నా జీవితాన్ని త్యాగం చేస్తాను’ అంటూ ఒక లేఖ ద్వారా సమాధానం పంపారు.4. ఆగస్ట్ 14న అర్ధరాత్రి వైస్రాయ్ లాడ్జ్ (ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుండి జవహర్లాల్ నెహ్రూ ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’ అనే చారిత్రాత్మక ప్రసంగం చేశారు. అప్పటికి నెహ్రూ ప్రధాని కాలేదు. ప్రపంచం మొత్తం ఈ ప్రసంగాన్ని విన్నది.5. ఆగస్ట్ 15, 1947న లార్డ్ మౌంట్ బాటన్ తన కార్యాలయంలో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ తన మంత్రివర్గం జాబితాను అతనికి అందించారు. తరువాత ఇండియా గేట్ సమీపంలోని ప్రిన్సెస్ గార్డెన్లో జరిగిన సమావేశంలో ప్రసంగించారు.6. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం నాడు భారత ప్రధాని ఎర్రకోట నుండి జెండాను ఎగురవేస్తారు. కానీ ఇది ఆగస్ట్ 15, 1947 న జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్ పరిశోధనా పత్రంలోని వివరాల ప్రకారం నెహ్రూ 1947 ఆగస్టు 16న ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు.7. అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ప్రెస్ సెక్రటరీ క్యాంప్‌బెల్ జాన్సన్ తెలిపిన వివరాల ప్రకారం జపాన్ మిత్రరాజ్యాల దళాలకు లొంగిపోయిన రెండవ వార్షికోత్సవం ఆగస్టు 15న జరగబోతోంది. ఆ రోజున భారతదేశానికి విముక్తి కల్పించడానికి బ్రిటీషర్లు నిర్ణయం తీసుకున్నారు.8. భారతదేశం- పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖ 1947, ఆగస్టు 15 నాటికి నిర్ణయం కాలేదు. ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్ ప్రకటన ద్వారా దీనిని నిర్ణయించారు.9. భారతదేశం 1947, ఆగష్టు 15న స్వాతంత్య్రం పొందింది. కానీ జాతీయ గీతం రూపొందలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే ‘జన గణ మన’ రాశారు. ఈ జాతీయ గీతానికి 1950లో రూపకల్పన జరిగింది.10. ఆగస్టు 15న మరో మూడు దేశాలకు కూడా స్వాతంత్య్రం లభించింది. దక్షిణ కొరియాకు 1945 ఆగష్టు 15న జపాన్ నుండి స్వాతంత్య్రం లభించింది. బహ్రెయిన్ 1971 ఆగష్టు 15న బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కాంగో 1960, ఆగస్టు 15న ఫ్రాన్స్ నుండి స్వాతంత్య్రం పొందింది. -
డెలివరీ పార్ట్నర్స్కు శీతల పానీయాలు
న్యూఢిల్లీ: ఎండ వేడిమి నుంచి ఉపశమనానికి డెలివరీ పార్ట్నర్స్ సేద తీరేందుకు ఫుడ్ డెలివరీ, ఈ–కామర్స్ కంపెనీలు పలు చర్యలకు శ్రీకారం చుట్టాయి. దేశవ్యాప్తంగా 450 రెస్ట్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్టు జొమాటో ప్రకటించింది. డెలివరీ పార్ట్నర్స్ ఈ కేంద్రాల్లో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్‌రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. 250 నగరాలు, పట్టణాల్లో 450 కేంద్రాల్లో డెలివరీ పార్ట్నర్స్కు అందించేందుకు శీతల పానీయాలు, పళ్ల రసాలు, గ్లూకోస్ వంటి 5 లక్షల ప్యాక్‌లను కంపెనీ కొనుగోలు చేసింది. అత్యవసర వైద్యం అవసరమైతే 15 నిముషాల్లో చేరుకునేలా 530కిపైగా నగరాలు, పట్టణాల్లో అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేసింది. ఫుల్ స్లీవ్, డ్రై ఫిట్ టీ–షర్టులను అందుబాటులోకి తెచి్చనట్టు జొమాటో సీఈవో రాకేశ్ రంజన్ తెలిపారు. అత్యవసరం అయితే తప్ప ఎండ తీవ్రత ఉన్న సమయంలో ఫుడ్ ఆర్డర్ చేయకూడదని కంపెనీ తన కస్టమర్లకు ఎక్స్ వేదికగా విన్నవించింది. బీమా కవరేజ్ సైతం.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 900లకుపైగా రీచార్జ్ జోన్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో సీటింగ్, మొబైల్ చార్జింగ్, మంచి నీరు, వాష్‌రూమ్స్ ఏర్పాట్లు ఉంటాయి. అత్యవసర వైద్యం కోసం జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్ తన యాప్‌లో ఎస్‌వోఎస్ సపోర్ట్ ప్రవేశపెట్టింది. డెలివరీ పార్ట్నర్స్ వేచి ఉండే ప్రాంతాల్లో ఎయిర్ కూలర్స్‌ను ఏర్పాటు చేసినట్టు బ్లింకిట్ సీఈవో అల్బీందర్ ధిండ్సా తెలిపారు. జొమాటో, బ్లింకిట్ డెలివరీ పార్ట్నర్స్ ఆసుపత్రిలో చేరితే రూ.1 లక్ష వరకు, ఔట్ పేషెంట్ సేవలు పొందితే రూ.5,000 వరకు బీమా కవరేజ్ ఆఫర్ చేస్తోంది. గ్లూకోస్ పానీయాలను అందిస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఫెసిలిటీస్ వద్ద ఫ్యాన్స్, కూలర్స్‌ను అదనంగా ఏర్పాటు చేసినట్టు వివరించింది. -
IPL 2024: టాప్‌లో రాజస్థాన్.. గెలిచినా ఆఖర్లోనే ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్ ఆఖరి దశకు చేరింది. ప్లే ఆఫ్స్‌కు ముందు మరో 24 మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఏప్రిల్ 28 నాటికి 46 మ్యాచ్‌లు పూర్తయాయ్యి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా..కేకేఆర్, సీఎస్కే, సన్‌రైజర్స్, లక్నో, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.9 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు సాధించిన రాజస్థాన్ అనధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. మిగతా మూడు బెర్తుల కోసం ఐదు జట్ల (కేకేఆర్, సీఎస్కే, సన్‌రైజర్స్, లక్నో, ఢిలీ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గుజరాత్, పంజాబ్, ముంబై, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరలేవు. ఏప్రిల్ 29 నాటికి ఐపీఎల్ 2024 సీజన్ పాయింట్ల పట్టిక..జట్టుమ్యాచ్లుగెలుపుపాయింట్లురన్రేట్ఆడాల్సిన మ్యాచ్‌లు రాజస్థాన్98160.6945కేకేఆర్85100.9726సీఎస్కే95100.8105సన్‌రైజర్స్95100.0755లక్నో95100.0595ఢిల్లీ10510-0.2764గుజరాత్1048-1.1134పంజాబ్936-0.1875ముంబై936-0.2615ఆర్సీబీ1036-0.4154 -
3 రోజుల నష్టాలకు చెక్
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల రికవరీ, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ 3 రోజుల నష్టాల నుంచి గట్టెక్కింది. సెన్సెక్స్ 261 పాయింట్లు పెరిగి 66,428 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 19,812 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 393 పాయింట్లు పెరిగి 66,560 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు బలపడి 19,850 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే చివర్లో పలు రంగాల్లో లాభాల స్వీకరణతో స్వల్పంగా లాభాలు కోల్పోయాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు వరుసగా 0.70%, 0,40% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.264 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.113 కోట్ల షేర్లు కొన్నారు. సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆశావహన అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో సియట్ లిమిటెడ్ షేరు 4.50% లాభపడి రూ.2,197 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 11% దూసుకెళ్లి రూ.2,334 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గతేడాది క్యూ2 సంస్థ నికర లాభం రూ.6.4 కోట్లుగా ఉంది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.388 కోట్లు పెరిగి రూ. 8,887 కోట్లకు చేరింది. కల్యాణ్ జ్యువెల్లర్స్ కంపెనీ షేరు 4.09% లాభపడి రూ.295 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.298 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,000 కోట్ల మైలురాయిని అధిగమించి రూ.30,422 కోట్లకు చేరింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు కంపెనీ షేరు 133% దూసుకెళ్లింది. రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు కనబరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1% పెరిగి రూ.1,541 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 2% ర్యాలీ చేసి రూ.1,558 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఎల్రక్టానిక్ సేవల తయారీ సంస్థ సైయెంట్ డీఎల్ఎం షేరు 3% ఎగసి రూ.709 వద్ద స్థిరపడింది. క్యూ2 లో కంపెనీ నికర లాభం 106% వృద్ధి చెందడం షేరు ర్యాలీకి కారణమైంది. ట్రేడింగ్‌లో 8.50% ఎగసి రూ.748 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
యుద్ధ భయాల నుంచి కోలుకున్న మార్కెట్
ముంబై: ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధ భయాల నుంచి దలాల్ స్ట్రీట్ తేరుకుంది. షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతో మంగళవారం సూచీలు దాదాపు ఒకశాతం లాభపడ్డాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న రికవరీ ర్యాలీ కలిసొచ్చింది. క్రూడాయిల్ ధరలు గరిష్ట స్థాయిల నుంచి దిగివచ్చాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్ఎఫ్) తాజాగా 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ భారత వృద్ధి రేటును 20 బేసిస్ పాయింట్లు పెంచి 6.3 శాతానికి పెంచింది. ఫలితంగా ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆటో, ఐటీ షేర్లలో నెలకొన్న కొనుగోళ్లతో సెన్సెక్స్ 567 పాయింట్లు పెరిగి 66,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 177 పాయింట్లు బలపడి 19,690 వద్ద నిలిచింది. ఒకదశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 66,180 వద్ద, నిఫ్టీ 206 పాయింట్లు దూసుకెళ్లి 19,718 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఇటీవల అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్న చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆస్తకి చూపారు. ఫెడ్ రిజర్వ్ అధికారుల సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్‌లో పనిచేస్తున్న తమ ఉద్యోగుల భద్రతకు తగిన చర్యలు తీసుకున్నామని, ఉద్యోగులందరూ సురక్షితంగా ఉన్నారని అదానీ పోర్ట్స్, సెజ్ వివరణ ఇవ్వడంతో ఈ కంపెనీ షేరు 4% లాభపడి చేసి రూ.819 వద్ద స్థిరపడింది. పండుగ డిమాండ్‌తో సెప్టెంబర్ రిటైల్ అమ్మకాల్లో 20% వృద్ధి నమోదైనట్లు డీలర్ల సమాఖ్య ఫెడా ప్రకటనతో ఆటో షేర్లు దూసుకెళ్లాయి. టాటా మోటార్స్ 2%, ఎంఅండ్ఎం 1.50%, మారుతీ 1.32% లాభపడ్డాయి. అశోక్ లేలాండ్ 1.22%, హీరో మోటో 0.66%, బజాబ్ ఆటో 0.64%, ఐషర్ 0.42%, టీవీఎస్ 0.36% పెరిగాయి. -
ఆసీస్‌పై అద్భుత విజయం.. అయినా ఐదో స్థానంలో టీమిండియా
వన్డే వరల్డ్‌కప్-2023 భాగంగా ఆసీస్‌తో నిన్న జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. ఆడిన తొలి మ్యాచ్‌లోనే గెలవడంతో టీమిండియా వరల్డ్‌కప్ పాయింట్ల పట్టికలో ఒకటి లేదా రెండు స్థానాల్లో ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే నిదానంగా ఆడటం కారణంగా భారత్ మెరుగైన రన్‌రేట్‌ను సాధించలేక, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో 41.2 ఓవర్లో విజయం సాధించిన భారత్.. కేవలం 0.883 రన్‌రేట్ సాధించి, ఇప్పటివరకు గెలుపొందిన జట్ల జాబితాలో ఆఖరి స్థానంలో నిలిచింది. భారత్ చేతిలో ఓడిన ఆసీస్ ఆరో స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు వరుసగా 7 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్‌లో బంపర్ విక్టరీ సాధించిన న్యూజిలాండ్ 2.149 రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. భారీ స్కోర్ చేసి శ్రీలంకను మట్టికరిపించిన సౌతాఫ్రికా 2.040 రన్‌రేట్‌తో రెండో ప్లేస్‌లో ఉంది. నెదర్లాండ్స్‌పై ఓ మోస్తరు విజయం సాధించిన పాక్ 1.620 రన్‌రేట్‌తో మూడో స్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్ 1.438 రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ప్రస్తుతానికి అన్ని జట్లు చెరో మ్యాచ్ మాత్రమే ఆడాయి. లీగ్ దశలో ప్రతి జట్టు ఇంకా తలో 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాగా, ఆసీస్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బుమ్రా (10-0-35-2), రవీంద్ర జడేజా (10-2-28-3), కుల్దీప్ యాదవ్ (10-0-42-2), అశ్విన్ (10-1-34-1), సిరాజ్ (6.3-1-26-1), హార్దిక్ (3-0-28-1) ధాటికి 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ కాగా.. కోహ్లి (116 బంతుల్లో 85; 6 ఫోర్లు), రాహుల్ (115 బంతుల్లో 97 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్సర్లు)ల చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ల సాయంతో భారత్ 41.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చారిత్రక విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ 3, స్టార్క్ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్, ఇషాన్‌లతో పాటు శ్రేయస్ అయ్యర్ డకౌట్లయ్యారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో (అక్టోబర్ 11) న్యూఢిల్లీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడుతుంది. -
ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే...
ముంబై: విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, ఆసియా మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్ మార్కెట్ మంగళవారం అరశాతం పతనమైంది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఒకశాతానికి పైగా క్షీణించి సూచీలను నష్టాల వైపు నడిపించాయి. సెన్సెక్స్ 316 పాయింట్లు క్షీణించి 65,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 19,529 వద్ద నిలిచింది. 3 రోజుల వరుస సెలవుల తర్వాత స్వల్ప నష్టాలతో మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 484 పాయింట్లు పతనమై 65,345 వద్ద, నిఫ్టీ 158 పాయింట్లు క్షీణించి 19,480 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. ప్రైవేట్ బ్యాంకింగ్, ఆటో, ఐటీ స్టాకులు షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు, మీడియా, రియల్టి, కన్జూ్యమర్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,034 కోట్ల ఈక్విటీ షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,361 కోట్ల షేర్లను కొన్నారు. వడ్డీరేట్ల పెంపు ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా కదలాడుతున్నాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు... ఆర్బీఐ పాలసీ, కార్పొరేట్ క్యూ2 ఫలితాల ప్రకటనకు ముందు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లకు భారీ డిమాండ్ లభించింది. యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్, పీఎన్బీ, పీఎస్బీ, ఐఓబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 5–3% ర్యాలీ చేశాయి. యుకో బ్యాంక్, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు 2% లాభపడ్డాయి. ఎస్బీఐ బ్యాంక్ షేరు ఒకశాతం పెరిగింది. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు ఇండెక్స్ రెండున్నర శాతం ర్యాలీ చేసింది కేంద్ర పెట్రోలియం శాఖ దేశీయ సహజ వాయువు ధరలు 7% పెంచడంతో ఓఎన్బీసీ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల అనూహ్య రికవరీ సైతం ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా ఈ షేరు బీఎస్ఈలో 4% నష్టపోయి రూ.185 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 4.50% క్షీణించి రూ.184 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇండెక్సుల్లో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ఐషర్ మోటార్స్ షేరు 3% నష్టపోయి రూ.3351 వద్ద స్థిరపడింది. మోటార్ సైకిళ్ల అమ్మకాలు సెపె్టంబర్లో తగ్గిపోవడం షేరు పతనానికి కారణమైంది. హిట్... ఫ్లాట్ నష్టాల మార్కెట్లోనూ జేఎస్‌డబ్ల్యూ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిస్టింగ్ బంపర్ హిట్ కొట్టింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.119)తో పోలిస్తే 20% ప్రీమియంతో రూ.143 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్ ఆద్యంతం కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా షేరు 32.18% ర్యాలీ చేసి ఇంట్రాడే గరిష్ట స్థాయి రూ.157 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.33,033 కోట్లుగా స్థిరపడింది. ఎక్సే్చంజీలో మొత్తం 57.99 లక్షల ఈక్విటీ షేర్లను చేతులు మారాయి. మనోజ్ వైభవ్ జెమ్స్ ఎన్ జ్యువెలర్స్ షేరు ఫ్లాటుగా లిస్టయింది. ఇష్యూ ధర (రూ.215)తో పోలిస్తే బీఎస్ఈలో లాభ, నష్టాలు లేకుండా రూ.215 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో రూ.210–222 మధ్య ట్రేడైంది. చివరికి 0.30% స్వల్ప లాభంతో రూ.216 వద్ద క్లోజైంది. మార్కె ట్ విలువ రూ.1,053 కోట్లుగా నమోదైంది. -
చంద్రబాబు వాదన సరైంది కాదు: సీఐడీ
-
చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
-
నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు!
చెట్లు అందించే ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే పట్టణాల్లోని చెట్లు ఆ ప్రాంతానికి మరింత ప్రయోజనాన్ని కల్పిస్తాయి. అవేమిటో 12 పాయింట్లలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉష్ణోగ్రత నియంత్రణ ఒక పెద్ద వృక్షం 10 ఎయిర్ కండిషనింగ్ యూనిట్లకు సమానం. అది అందిచే నీడ ఆ ప్రాంత ఉష్ణోగ్రతను 30 శాతానికి మించి తగ్గిస్తుంది. 2. శబ్ద కాలుష్యానికి చెక్ చెట్లు 50 శాతం మేరకు శబ్ద కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వాహనాలు, నిర్మాణ పనులు, సైరన్లు ఇతరత్రా శబ్దాలతో నిండిన పట్టణ ప్రాంతాల్లో చెట్లు ఆ శబ్దాన్ని నిరోధించడానికి ఉపకరిస్తాయి. ఇళ్లు, కార్యాలయాలను నిశ్శబ్దంగా ఉంచడానికి వృక్షాలు దోహదపడగాయి. 3. స్వచ్ఛమైన గాలి చెట్ల నుంచి విడుదలయ్యే గాలి.. హానికరమైన కాలుష్య కారకాలను, టాక్సిన్లను భారీ మొత్తంలో తొలగిస్తాయి. పట్టణ ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో చెట్లు మనకు పరిశుభ్రమైన గాలిని అందిస్తాయి. 4. ఆక్సిజన్ అందిస్తూ.. కాలుష్యాలను తరిమికొట్టే చెట్లు మరింత ఆక్సిజన్‌ను కూడా అందిస్తాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరాల్లో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా తక్కువగా ఉంటాయి. చెట్లు ఈ సమస్యను పరిష్కరించడానికి దోహదపడతాయి. 5. నీటి నిర్వహణ చెట్లు మనకు భవనాలకు మించిన ఆశ్రయం కల్పిస్తాయి. వర్షాలు కురిసే సమయంలో చెట్లు భారీ మొత్తంలో నీటిని గ్రహిస్తాయి. వరదల తీవ్రతను నియంత్రిస్తాయి. వరదలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. చెట్లు కాలుష్య కారకాలను గ్రహిస్తాయని, నీటి వనరులను కాపాడుతాయనే విషయాన్ని మనం మరచిపోకూడదు. 6. మానసిక ఆరోగ్యం పరిశుభ్రమైన పట్టణ పరిసరాల కంటే ప్రకృతి మధ్యలో మెలిగే మనుషులు సంతోషంగా ఉంటారని పలు అధ్యయనాల్లో తేలింది. మన భావోద్వేగాలు, ప్రవర్తన, ఆలోచనలు మనం ఉంటున్న ప్రదేశాలపై ఆధారపడివుంటాయి. చెట్లు మన మనస్తత్వంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. మనిషి శాంతియుతంగా ఉండటం వల్ల కలిగే ప్రయోజనాలు అపారం. 7. శారీరక ఆరోగ్యం చెట్లు గాలి నాణ్యతను మెరుగు పరుస్తాయి. పట్టణంలోని చెట్లతో కూడిన వాతావరణం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చెట్లు విరివిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో సైక్లింగ్, రన్నింగ్, నడక మొదలైనవి ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. 8. గోప్యత చెట్లు గోప్యతను అందిస్తాయి. ఇంటివాతావరణాన్ని కల్పిస్తాయి. 9. ఆర్థికపరంగా.. పట్టణంలోని చెట్లు అందించే ఆర్థిక ప్రయోజనాలను లెక్కించడం కష్టం. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల మరమ్మతులకు చెట్లు ఉపకరిస్తాయి. చెట్లను పెంచే ఖర్చు కంటే అవి అందించే ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. చెట్లు నగరాలను సంపన్నం చేస్తాయి. 10. వన్యప్రాణులకు ఆవాసం పక్షులు,క్షీరదాలు, కీటకాలతో సహా వందలాది విభిన్న జాతులకు ఆవాసంగా చెట్లు ఉపకరిస్తాయి. 11. కాంతి కాలుష్యం చెట్లు కాంతి కాలుష్యాన్ని అడ్డుకోవడమే కాకుండా, మనల్ని, మన నగరాలను చల్లగా ఉంచుతాయి. చెట్లు ఉన్న నగరాల్లో ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. 12. ఆహ్లాదాన్ని అందిస్తూ.. చెట్లు అందంగా ఉంటాయి. గ్రేస్కేల్ రోడ్లు, భవనాలు, అంతులేని ట్రాఫిక్ మధ్య చెట్లు ఉపశమనాన్ని కల్పిస్తాయనడంలో సందేహం లేదు. 12 Reasons Why Cities Need More Trees: 1. Temperature Control One large tree is equivalent to 10 air conditioning units, and the shade they provide can reduce street temperature by more than 30%. 2. Noise Reduction Trees can reduce loudness by up to 50%. In urban areas… pic.twitter.com/KRfskttfxx — The Cultural Tutor (@culturaltutor) August 28, 2023 -
సరికొత్తగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకొటకు 1800 మంది ప్రత్యేక అతిథులు..
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 77వ స్వాతంత్య్ర వేడుకలు ఎర్రకోట వేదికగా అట్టహాసంగా జరగనున్నాయి. ఇందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే.. ఈసారి వినూత్నంగా వేడుకలు జరగనున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది దాదాపు 1800 మంది అతిథులు తమతమ జీవిత భాగస్వామితో కలిసి ఉత్సవాల్లో పాలుపంచుకోనున్నారు. ఇందులో రైతులు, చేపలు పట్టేవారు, నర్సులు సహా వివిధ కులవృత్తులు చేసేవారు ఉండనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 75 జంటలు సాంప్రదాయ శైలిలో వేడుకల్లో కనువిందు చేయనున్నారు. ప్రత్యేక అతిథుల్లో 660 గ్రామాల నుంచి 400 మంది సర్పంచులు, 250 మంది రైతు సంఘాల సభ్యులు, 50 చొప్పున ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన సభ్యులు, సెంట్రల్ విస్టాకు చెందిన 50 మంది కార్మికులు, 50 మంది ఖాదీ కార్మికులు, స్కూల్ టీచర్లు, నర్సులు, చేపలు పట్టేవారు ఇందులో పాలు పంచుకోనున్నారు. ఈ ప్రత్యేక అతిథులు కొంత మంది జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్నారు. జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన ఈ ప్రత్యేక అతిథులకు వసతి సౌకర్యం కల్పించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి ప్రతి రాష్ట్రం నుంచి దాదాపు 75 జంటలు తమతమ సాంప్రదాయ శైలిలో వేడుకల్లో పాల్గొంటారు. ఈ ఉత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ జెండాకు వందనం చేయనున్నారు. జాతిని ఉద్దేశించి ఉపన్యాసం ఇస్తారు. ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్.. దేశంలో ఉన్న పథకాలపై 12 సెల్ఫీ లొకేషన్స్‌ను వేడుకల్లో ఏర్పాట్లు చేశారు. వాక్సిన్, యోగా, ఉజ్వల్ యోజన, స్పేస్ పవర్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా సహా తదితర స్కీలకు సంబంధించిన లొకేషన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆగష్టు 15 నుంచి ఆగష్టు 20 వరకు ఆన్లైన్ సెల్ఫీ కంటెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఆయా ప్రదేశాల్లో సెల్ఫీ దిగి మై గౌవ్ పోర్టల్‌లో అప్లోడ్ చేసిన 12 మందిని విజేతలుగా నిర్ణయిస్తారు. వారికి రూ.10,000 చొప్పున ప్రైజ్‌మనీని కూడా ఇస్తారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులకు ప్లాన్.. హై అలర్ట్ జారీ.. -
4 రోజుల్లో 1,200 పాయింట్లు ప్లస్
ముంబై: ఆటుపోట్ల మధ్య వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్ 123 పాయింట్ల వృద్ధితో 62,969కు చేరింది. నిఫ్టీ 35 పాయింట్లు బలపడి 18,634 వద్ద ముగిసింది. అమెరికా రుణ పరిమితి పెంపు డీల్ ఓకే కావడంతో ఇన్వెస్టర్లకు జోష్ వచ్చినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,195 పాయింట్లు జమ చేసుకోగా.. నిఫ్టీ 348 పాయింట్లు పురోగమించింది. అయితే ఇంట్రాడేలో సెన్సెక్స్ 63,036 వద్ద గరిష్టాన్ని, 62,737 వద్ద కనిష్టాన్ని తాకింది. దీంతో వరుసగా రెండో రోజు 63,000 స్థాయిని అధిగమించింది. ఇక నిఫ్టీ 18,622– 18,576 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఎన్ఎస్ఈలో మీడియా, ఎఫ్ఎంసీజీ, ప్రయివేట్ బ్యాంక్స్ 0.6 శాతం చొప్పున పుంజుకోగా.. ప్రధానంగా మెటల్ ఇండెక్స్ 1 శాతం క్షీణించింది. బ్యాంక్ నిఫ్టీ ఏడాది గరిష్టానికి చేరింది. -
2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో BJP అనుకూల మరియు ప్రతికూల పాయింట్లు
-
SA Vs BAN: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా.. అగ్ర స్థానంలోకి ప్రోటీస్
టీ20 ప్రపంచకప్-2022లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. సూపర్-12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సెంచరీతో చెలరేగిన రిలీ రోసో ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రుసౌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ బావుమా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోసౌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ డికాక్ 63 పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఆల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టగా, హసన్ మహ్మద్, టాస్కిన్ అహ్మద్ తలా వికెట్ సాధించారు. నిప్పులు చేరిగిన నోర్జే 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ప్రోటీస్ పేసర్ అన్రిచ్ నోర్జే చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన నోర్జే.. బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. అతడిపాటు స్పిన్నర్ షమ్సీ కూడా మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బ తీశాడు. ప్రోటీస్ బౌలర్ల ధాటికి బంగ్లా టైగర్స్ 101 పరుగులకే కుప్పకూలింది. నెం1 స్థానంలో దక్షిణాఫ్రికా బంగ్లాదేశ్‌పై అద్భుతమైన విజయం సాధించిన దక్షిణాఫ్రికా గ్రూప్-2 నుంచి పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకుంది. అదే విధంగా ధక్షిణాఫ్రికా రన్‌రేట్(+5.200) కూడా భారీగా మెరుగు పడింది. ఇక జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ గెలుపు దగ్గరగా ఉన్న సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. చదవండి: T20 WC 2022: పాపం బంగ్లాదేశ్.. 5 పరుగుల పెనాల్టీ! ఎందుకంటే? -
కివీస్‌ను వైట్‌వాష్ చేశాక ఇంగ్లండ్ ఏ పొజిషన్లో ఉందంటే..?
World Test Championship 2021-23 Points Table: ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2021-23లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆతిధ్య ఇంగ్లండ్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్ 8వ స్థానానికి దిగజారింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 4 సిరీస్‌లు ఆడిన ఇంగ్లండ్ 52 పాయింట్లతో 28.89 విన్నింగ్ పర్సంటేజ్‌ను సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ కూడా నాలుగు సిరీస్‌లు ఆడి 28 పాయింట్లతో 25.93 విన్నింగ్ పర్సంటేజ్‌ను నమోదు చేసింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (75 విన్నింగ్ పర్సంటేజ్) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా (71.43), టీమిండియా (58.33) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్‌తో రీ షెడ్యూల్డ్ టెస్ట్ (జులై 1-4) ముగిసాక పాయింట్ల పట్టికలో టీమిండియా తొలి రెండు స్థానాల్లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. గతేడాది కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఫలితం తేలకుండా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌ల అనంతరం టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. కాగా, నిర్ణీత సీజన్లో ఓ జట్టు ఆడిన సిరీస్‌లు, గెలుపు, ఓటములు, డ్రాల సంఖ్య ఆధారంగా పాయింట్ల కేటాయింపు జరుగుతుంది. చదవండి: మరోసారి రెచ్చిపోయిన బెయిర్‌స్టో.. కివీస్‌ను ఊడ్చేసిన ఇంగ్లండ్ -
‘సన్’ స్ట్రోక్స్! ఆన్లైన్ క్లాస్‌ల పేరిట గేమ్‌లకు బానిసగా...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని యువకుల తల్లిదండ్రులకు ఇటీవల ‘సన్’ స్ట్రోక్స్ ఎక్కువగా తగులుతున్నాయి. ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటు పడుతున్న యువత వాటిలో గెలవడానికి బానిసలుగా మారిపోతున్నాయి. దీనికోసం ఆయా కంపెనీల ట్రాప్‌లో పడి యూసీ పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి తల్లిదండ్రుల క్రెడిట్, డెబిట్ కార్డులు వారికి తెలియకుండా వాడేస్తున్నారు. అంబర్‌పేట ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఫ్రీఫైర్ గేమ్ కోసం తన తల్లి, తాతల బ్యాంకు ఖాతాల్లోని రూ.36 లక్షలు వాడిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం కంపెనీల వ్యవహారం.. కోవిడ్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి. దీంతో దాదాపు ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్‌లు వచ్చి చేరాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న విద్యార్థులు వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దీనిప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. పాయింట్లతో బలపడతావంటూ... ఇలా తమ గేమ్‌కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్‌లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్‌లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. దీంతో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన యువతలో కలిగిస్తారు. ఆపై అసలు కథ మొదలెట్టి.. కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ మెలికపెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్న యువత తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్‌లో పడిపోతున్నారు. అలా తమ తల్లిదండ్రుల కార్డులు తీసుకుని వారికి తెలియకుండా పేమెంట్లు చేస్తున్నారు. యువత అనునిత్యం రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చు చేసేస్తోంది. నేరగాళ్ల పనిగా భావిస్తున్న తల్లిదండ్రులు.. ఇలా అనునిత్యం తమకు తెలియకుండా కార్డులు, ఖాతాల నుంచి చిన్న మొత్తాలు పోతుండటాన్ని తల్లిదండ్రులు తక్షణం గుర్తించలేకపోతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇవి పెద్ద మొత్తాలుగా మారిన తర్వాత తెలుసుకుంటున్నారు. ఆ పని చేసింది సైబర్ నేరగాళ్లుగా భావించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. యువకులే డబ్బు పెట్టి ఆడుతున్నారు యువకులతో పాటు యువతులూ ఇలాంటి గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. పిల్లలు ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలు కాకుండా చూసుకోవాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: అరువుపై ఎరువులు ఇవ్వం) -
దక్షిణాఫ్రికా చేతిలో పరాభవాన్ని ఎదుర్కొన్న టీమిండియాకు మరో షాక్..
World Test Championship 2021-23: దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో చేజార్చుకున్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దిగజారింది. కేప్‌టౌన్ టెస్ట్‌లో పరాభవానికి ముందు నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా.. ఓ స్థానాన్ని కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోగా.. టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయాన్ని సాధించిన దక్షిణాఫ్రికా.. ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది. డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా జరిగిన 9 మ్యాచ్‌ల్లో టీమిండియా 4 విజయాలు, 3 పరాజయాలు, 2 డ్రాలతో 49.07 పాయింట్ల శాతాన్ని(53 పాయింట్లు) సాధించగా.. సఫారీ జట్టు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయంతో 66.66 పాయింట్ల శాతాన్ని(24 పాయింట్లు) నమోదు చేసింది. ఇక ఆడిన రెండు టెస్ట్‌ల్లోనూ విజయాలు సాధించిన శ్రీలంక.. 100 శాతం పాయింట్లతో(24 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్.. 4 మ్యాచ్‌ల్లో ఓ డ్రా, 3 విజయాలతో 83.33 పాయింట్ల శాతాన్ని(40 పాయింట్లు) సాధించి రెండో ప్లేస్‌లో కొనసాగుతుంది. ఈ జాబితాలో పాకిస్థాన్ 36 పాయింట్ల(4 టెస్ట్‌ల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో 75 శాతం పాయింట్లు)తో మూడో స్థానంలో నిలువగా.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు వరుసగా 6, 7, 8, 9 స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, కేప్‌టౌన్ టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పరాజయంపాలై, సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. చదవండి: IPL 2022: కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్.. -
పాక్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా..
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(2021-23) పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో సిరీస్ విజయం సాధించిన(అనధికారికంగా) భారత్.. దాయాది పాకిస్తాన్‌ను వెనక్కు నెట్టి 26 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరింది. ప్రస్తుత డబ్ల్యూటీసీలో భాగంగా టీమిండియా ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడగా.. అందులో 2 మ్యాచ్‌ల్లో గెలుపు, ఓ మ్యాచ్‌లో ఓటమి, మరో మ్యాచ్ డ్రా చేసుకుకోవడం ద్వారా 54.17 విజయాల శాతం నమోదు చేసింది. ఆగస్ట్‌లో జరిగిన విండీస్ పర్యటనలో ఒక టెస్ట్‌ను కోల్పోయి మరో మ్యాచ్‌లో గెలుపొందిన పాక్.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో ప్లేస్‌లో నిలచింది. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్ ద్వారా పాక్ 50 శాతం విజయాలతో 12 పాయింట్లు సాధించింది. ఈ సిరీస్‌లో పాక్ ప్రత్యర్ధి విండీస్ సైతం ఇదే గణాంకాలు నమోదు చేసి పాక్‌తో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఇక స్వదేశంలో కోహ్లి సేనపై 2 పరాజయాలు, ఓ డ్రా, ఓ విజయం నమోదు చేసిన రూట్ సేన 14 పాయింట్లు ఖాతాలో వేసుకుని 29.17 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీలో భాగంగా పాయింట్లను కాకుండా విజయాల శాతాన్ని పరిగణలోకి తీసుకుని ర్యాంక్‌ల కేటాయింపు జరుగుతుంది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య సిరీస్‌లో ఐదో టెస్ట్ రద్దు కావడంతో పాయింట్ల కేటాయింపుపై సందిగ్ధత నెలకొంది. దీంతో ప్రస్తుత గణాంకాలు నాలుగో టెస్ట్ వరకు మాత్రమే పరిగణలోకి తీసుకుని కేటాయించారు. మరోవైపు, ఈ సిరీస్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్, ఇంగ్లండ్ జట్లకు చెరి రెండు పాయింట్లు కోత విధించారు. చదవండి: సిరీస్ ఇలా ముగియడం సిగ్గుచేటు.. ఆఖరి టెస్ట్ రద్దుపై ఆండర్సన్ భావోద్వేగం -
వచ్చే డబ్ల్యూటీసీలో అన్ని మ్యాచ్‌లకు సమాన పాయింట్లు
దుబాయ్: రాబోయే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో సిరీస్ ప్రకారం కాకుండా ఒక్కో టెస్టు మ్యాచ్ విజయానికి పాయింట్లు కేటాయించాలని ఐసీసీ యోచిస్తోంది. తొలి డబ్ల్యూటీసీలో ఒక్కో సిరీస్‌కు ఐసీసీ 120 పాయింట్లు ఇచ్చింది. మూడు టెస్టుల సిరీస్ అయితే ఒక్కో టెస్టు విజయానికి 40 పాయింట్లే దక్కేవి. అదే రెండు టెస్టుల సిరీస్ అయితే ప్రతీ గెలుపునకు జట్టు ఖాతాలో 60 పాయింట్లు చేరాయి. దీనిని సరిదిద్దేందుకు సిరీస్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఉన్నా... ఒక్కో టెస్టుకు విడిగా పాయింట్లు కేటాయిస్తే అన్ని జట్లకు సమాన అవకాశం ఉంటుందని ఐసీసీ భావిస్తోంది. -
వీడియో గేములతోనూ గాలం!
సాక్షి, హైదరాబాద్: శతకోటి దరిద్రాలకు.. అనంతకోటి ఉపాయాలు అన్న సామెత సైబర్ నేరగాళ్ల విషయంలో సరిగ్గా సరిపోతుంది. టిక్‌టాక్ ప్రో, చాక్లెట్ బాక్సులు, ప్రేమపెళ్లి అంటూ రకరకాల కారణాలతో బ్యాంకు ఖాతాలు ఖాళీ చేసే సైబర్ నేరగాళ్లు మరో కొత్త ఎత్తుగడ ఎంచుకున్నారు. చిన్నారులు అమి తంగా ఇష్టపడే ఆన్లైన్ వీడియో గేముల్లోనూ తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉచితం పేరుతో మాల్వేర్ లింకులు.. సాధారణంగా పిల్లలు షూటింగ్ గేమ్‌లను ఇష్టపడతారు. అందులో రకరకాల స్టేజీలు ఉంటాయి. తరువాత స్టేజ్‌లోకి వెళ్లాలంటే.. నిర్దేశిత పాయింట్లు సాధించాలి లేదా ఆయుధాలు పొందాల్సి ఉంటుంది. ఒకవేళ సరైనన్ని పాయింట్లు, ఆయుధాలు లేకపోతే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆన్లైన్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లోసుగునే సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అలా గేమ్‌లు ఆడే చిన్నారులకు సైబర్ నేరగాళ్లు మాల్వేర్ను ఉంచిన లింకులను పంపుతున్నారు. సదరు లింకులను క్లిక్ చేస్తే.. ఉచితంగా పాయింట్లు, ఆయుధాలు పొందవచ్చని ఎరవేస్తున్నారు. ఇవేమీ తెలియని చిన్నారులు, విద్యార్థులు వాటిని క్లిక్ చేసి గేమ్‌లో ముందుకు పోతున్నారు. కానీ, మొత్తం మొబైల్‌ను వారి చేతికి ఇచ్చేశాం అన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో జొరబడిన మాల్వేర్ పనిచేయడం మొదలుపెడుతుంది. బ్యాంకు ఖాతాల వివరాలతోపాటు, వ్యక్తిగత వివరాలు క్షణాల్లో సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతాయి. వారు అంతేవేగంగా స్మార్ట్‌ఫోన్‌కు లింక్ అయి ఉన్న ఖాతాల్లోని మొత్తం నగదును మాయం చేస్తారు. ఈ సమయంలో నగదును కొట్టేసినట్లు మన మొబైళ్లకు ఎలాంటి సందేశాలు రావు. దీంతో ఈ విషయం తెలిసే సరికి పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. అందుకే, వీడియోగేమ్‌లు ఆడుకునేందుకు పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులు ఈ విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. -
యూకేలో ‘పాయింట్స్ బేస్డ్ వీసా’
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ, అత్యంత తెలివైన నిపుణులను తమ దేశంలోకి ఆహ్వానించే నూతన పాయింట్స్ ఆధారిత వీసా విధానాన్ని బ్రిటన్ బుధవారం ఆవిష్కరించింది. నిపుణులు కాని, చవక కార్మికుల వలసలను నిరోధించే దిశగా ఈ విధానాన్ని రూపొందించామని భారత సంతతికి చెందిన యూకే హోం మంత్రి ప్రీతి పటేల్ పేర్కొన్నారు. ఈ తాజా వీసా విధానం వచ్చే సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యాలు, వృత్తులు, వేతనాలు.. మొదలైన వాటికి పాయింట్లను కేటాయించి, అవసరమైన అర్హత పాయింట్లు సాధించిన వారికే వీసా ఇచ్చేలా ఈ విధానాన్ని రూపొందించారు. ‘ఈ రోజు చరిత్రాత్మకం. ఈ దేశ పౌరులు కోరుకుంటున్నట్లుగా, పాయింట్ల ఆధారిత వీసా విధానాన్ని ప్రారంభిస్తున్నాం’ అని ఈ సందర్భంగా ప్రీతి పటేల్ పేర్కొన్నారు. తాజా వీసా విధాన ప్రకారం యూకేకి రావాలనుకునేవారు కచ్చితంగా ఆంగ్లం మాట్లాడగలగాలి. అర్హత ఉన్న యాజమాన్యం నుంచి తమ నైపుణ్యానికి సంబంధించిన ఉద్యోగ ఆహ్వానం పొంది ఉండాలి. నైపుణ్యాల ద్వారా వారికి పాయింట్లు వస్తాయి. యూకేలో నిపుణులైన ఉద్యోగుల కొరత అధికంగా ఉన్న రంగాలకు ఉపాధి కోసం వచ్చేవారికి ప్రత్యేక పాయింట్లు ఉంటాయి. వివిధ రంగాల్లో అత్యుత్తమ నైపుణ్యత కలిగినవారికి వెంటనే వీసా ఇచ్చే ఫాస్ట్ ట్రాక్ గ్లోబల్ టాలెంట్ స్కీమ్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందని హోం శాఖ వెల్లడించింది. యూకేలోని కంపెనీలు, విద్యా సంస్థల నుంచి ఉద్యోగ ఆహ్వానం లేని ఈయూ దేశాల్లోని నిపుణులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఈ ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామన్నారు.