కివీస్‌ను వైట్‌వాష్‌ చేశాక ఇంగ్లండ్‌ ఏ పొజిషన్‌లో ఉందంటే..? | World Test Championship 2021 23 Points Table After ENG VS NZ 3rd Test | Sakshi
Sakshi News home page

WTC 2021-23 Points Table: కివీస్‌ను వైట్‌వాష్‌ చేశాక ఇంగ్లండ్‌ ఏ పొజిషన్‌లో ఉందంటే..? 

Published Mon, Jun 27 2022 8:30 PM | Last Updated on Mon, Jun 27 2022 9:56 PM

World Test Championship 2021 23 Points Table After ENG VS NZ 3rd Test - Sakshi

World Test Championship 2021-23 Points Table: ఐసీసీ వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2021-23లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను ఆతిధ్య ఇంగ్లండ్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ క్రమంలో ఆ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ న్యూజిలాండ్‌ 8వ స్థానానికి దిగజారింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 సిరీస్‌లు ఆడిన ఇంగ్లండ్‌ 52 పాయింట్లతో 28.89 విన్నింగ్‌ పర్సంటేజ్‌ను సాధించింది. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా నాలుగు సిరీస్‌లు ఆడి 28 పాయింట్లతో 25.93 విన్నింగ్‌ పర్సంటేజ్‌ను నమోదు చేసింది. 

ఈ జాబితాలో ఆస్ట్రేలియా (75 విన్నింగ్‌ పర్సంటేజ్‌) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా (71.43), టీమిండియా (58.33) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్‌తో రీ షెడ్యూల్డ్‌ టెస్ట్‌ (జులై 1-4) ముగిసాక పాయింట్ల పట్టికలో టీమిండియా తొలి రెండు స్థానాల్లోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. గతేడాది కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఫలితం తేలకుండా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో 4 మ్యాచ్‌ల అనంతరం టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. కాగా, నిర్ణీత సీజన్‌లో ఓ జట్టు ఆడిన సిరీస్‌లు, గెలుపు, ఓటములు, డ్రాల సంఖ్య ఆధారంగా పాయింట్ల కేటాయింపు జరుగుతుంది.
చదవండి: మరోసారి రెచ్చిపోయిన బెయిర్‌స్టో.. కివీస్‌ను ఊడ్చేసిన ఇంగ్లండ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement