
ఆక్లాండ్: న్యూజిలాండ్ వికెట్ కీపర్ వాట్లింగ్ అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నాడు. భారత జట్టుతో వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తన కెరీర్‌లో చివరి మ్యాచ్ కానుందని 35 ఏళ్ల వాట్లింగ్ మంగళవారం ప్రకటించాడు.
2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన వాట్లింగ్ ఇప్పటివరకు 73 టెస్టులు ఆడి 3,773 పరుగులు (8 సెంచరీలు)... 28 వన్డేలు ఆడి 573 పరుగులు... 5 టి20 మ్యాచ్‌లు ఆడి 38 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 282 క్యాచ్ లు తీసుకొని, ఎనిమిది స్టంపింగ్‌లు చేశాడు.
చదవండి: కోహ్లి అండతోనే నేనిలా...
Comments
Please login to add a commentAdd a comment