BJ Watling
-
WTC Final: వేలు విరిగింది..అయినా క్యాచ్‌లు పట్టాడు
సౌథాంప్టన్: భారత్‌తో సౌథాంప్టన్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తన అఖరి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ గొప్ప పోరాట పటిమని కనబర్చాడు. కుడిచేతి వేలు విరిగినప్పటికీ కీపింగ్ చేసిన వాట్లింగ్.. విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రవీంద్ర జడేజా క్యాచ్‌లను అందుకున్నాడు.వాట్లింగ్ పోరాట పటిమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్ మధ్యలోనే అభినందిచాడు. వాస్తవానికి బుధవారం తొలి సెషన్లోనే వాట్లింగ్ కుడిచేతి ఉంగరం వేలు విరిగింది.న్యూజిలాండ్ కెప్టన్ కేన్ విలియమ్సన్ విసిరిన త్రోని వికెట్ల వెనుక నుంచి వాటింగ్ అందుకునే ప్రయత్నం చేయగా వేగంగా వచ్చిన బంతి అతని చేతి వేలిని బలంగా తాకింది.దాంతో వేలు విరగగా వెంటనే ఫిజియో సాయం తీసుకుని వికెట్ కీపింగ్ కొనసాగించాడు. లంచ్ విరామంలో వైద్యం చేయించుకున్నాడు.ఆ తరువాత మళ్లీ మైదానంలో అడుగు పెట్టాడు.టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు మే నెలలోనే వాట్లింగ్ ప్రకటించేశాడు. చదవండి:అశ్విన్ టాప్, రహానే కంటే రోహిత్.. వార్నర్ బాదుడు కూడా! -
WTC Final తర్వాత ఆటకు గుడ్‌బై
ఆక్లాండ్: న్యూజిలాండ్ వికెట్ కీపర్ వాట్లింగ్ అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నాడు. భారత జట్టుతో వచ్చే నెలలో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ తన కెరీర్లో చివరి మ్యాచ్ కానుందని 35 ఏళ్ల వాట్లింగ్ మంగళవారం ప్రకటించాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన వాట్లింగ్ ఇప్పటివరకు 73 టెస్టులు ఆడి 3,773 పరుగులు (8 సెంచరీలు)... 28 వన్డేలు ఆడి 573 పరుగులు... 5 టి20 మ్యాచ్‌లు ఆడి 38 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 282 క్యాచ్ లు తీసుకొని, ఎనిమిది స్టంపింగ్‌లు చేశాడు. చదవండి: కోహ్లి అండతోనే నేనిలా... -
ఇలా జరుగుతుందని అస్సలు ఊహించి ఉండడు
క్రైస్ట్‌చర్చి: పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. రెండో టెస్టులో కివీస్ 176 పరుగులు ఇన్నింగ్స్ తేడాతో పాక్‌పై ఘనవిజయం సాధించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీతో మెరవడమేగాక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ విలియమ్సన్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. (చదవండి: 'టీమిండియాను వదిలి రావడం బాధగా ఉంది') కివీస్ సహచర ఆటగాడు బీజే వాట్లింగ్ విలియమ్సన్ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. దీంతో అనుకోని సంఘటనతో మొదట విలియమ్సన్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అయితే వెంటనే చిరునవ్వు అందుకుంటూ వాట్లింగ్ తెచ్చిన షర్ట్‌పై తన సంతకాన్ని చేశాడు. ఈ వీడియోనూ బ్లాక్ క్యాప్స్ తన ట్విటర్లో షేర్ చేయగా ఇది కాస్త వైరల్‌గా మారింది. పోస్ట్ మ్యాచ్ కాన్ఫరెన్స్ సందర్భంగా సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో తన సహచర ఆటగాడు ఆటోగ్రాఫ్ అడుగుతాడని విలియమ్సన్ బహుశా ఊహించి ఉండంటూ' క్యాప్షన్ జత చేసింది. కాగా రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 158.5 ఓవర్లలో 6 వికెట్లకు 659 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దాంతో 362 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. తొమ్మిది గంటల పాటు మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన కెరీర్లో నాలుగో డబుల్ సెంచరీ (238; 28 ఫోర్లు) సాధించాడు. అంతేకాకుండా టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక హెన్రీ నికోల్స్ (157; 18 ఫోర్లు, సిక్స్), డారిల్ మిచెల్ (102 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా శతకాలు బాదడంతో కివీస్ భారీ స్కోరును అందుకుంది. విలియమ్సన్, నికోల్స్ నాలుగో వికెట్‌కు 369 పరుగులు జోడించారు. 362 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్తాన్ కివీస్ బౌలర్ కైల్ జేమిసన్ దాటికి 186 పరుగులకే చేతులెత్తేసి ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. అజహర్ అలీ(37), జాఫర్ గౌహర్(37) చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో జెమీసన్ మొత్తంగా 10 వికెట్లు తీసి సత్తా చాటాడు.(చదవండి: ముంబైలో అయినా ఓకే: ఆసీస్ కెప్టెన్) "What is going on?" 🤔 Not much, just BJ Watling fanboying Kane Williamson in the middle of a press conference 😄pic.twitter.com/aLJ2ypQUef — ICC (@ICC) January 6, 2021 -
వాట్లింగ్ వాట్ ఏ రికార్డు..
మౌంట్ మాంగని (న్యూజిలాండ్): ద్విశతకం సాధించిన తొలి న్యూజిలాండ్ వికెట్ కీపర్‌గా వాట్లింగ్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో వాట్లింగ్(205; 473 బంతుల్లో 24 ఫోర్లు, 1 సిక్సర్) అద్వితీయమైన ఆటతీరుతో జట్టును కష్టకాలంలో ఆదుకున్నాడు. ఆదుకోవడమే కాకుండా డబుల్ సెంచరీతో కివీస్‌కు భారీ ఆధిక్యాన్ని అందించాడు. వాట్లాంగ్కు తోడు సాన్ట్నెర్ (126; 269 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో వాట్లింగ్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 261 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఇక వాట్లింగ్ డబుల్ సెంచరీ సాధించడంతో కివీస్ దిగ్గజ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్ రికార్డు తుడుచుపెట్టుకపోయింది. ఇప్పటివరకు అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన కివీస్ వికెట్ కీపర్‌గా మెకల్లమ్(185; బంగ్లాదేశ్‌పై 2010లో) రికార్డును ఈ వికెట్ కీపర్ బ్రేక్ చేశాడు. ఇక ఓవరాల్‌గా టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన తొమ్మిదో వికెట్ కీపర్‌గా వాట్లింగ్ నిలిచాడు. ఈ జాబితాలో కుమార సంగక్కర అత్యధిక డబుల్ సెంచరీలతో తొలి స్థానంలో ఉండగా.. అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన వికెట్ కీపర్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండ్రీ ఫ్లవర్(232 నాటౌట్; భారత్‌పై 2000లో) రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇక టీమిండియా తరుపున ఏకైక డబుల్ సెంచరీ సాధించిన వికెట్ కీపర్‌గా మాజీ సారథి ఎంఎస్ ధోని(224; ఆస్ట్రేలియాపై 2013లో) నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వాట్లింగ్, సాన్ట్నెర్ రాణించడంతో కివీస్ 615/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ బర్న్స్(31) , డొమినిక్ సిబ్లీ(12), జాక్ లీచ్(0) పూర్తిగా విఫలమయ్యారు. ప్రస్తుతం జోయ్ డెన్లీ(7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ ఇంకా 207 పరుగుల వెనుకంజలో ఉంది. ఇంకా ఒక రోజు ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇంగ్లండ్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే సారథి రూట్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రాణింపుపైనే ఆధారపడి ఉంది. -
విలియమ్సన్, వాట్లింగ్ రికార్డు
న్యూజిలాండ్ 524/5 డిక్లేర్డ్ శ్రీలంక లక్ష్యం 390 వెల్లింగ్టన్: విలియమ్సన్ (438 బంతుల్లో 242 నాటౌట్; 18 ఫోర్లు) కెరీర్లో తొలి డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. అటు వాట్లింగ్ (333 బంతుల్లో 142 నాటౌట్; 9 ఫోర్లు; 1 సిక్స్) కూడా శతకం నమోదు చేశాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 365 పరుగులు జోడించి ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో... శ్రీలంకతో రెండో టెస్టులో న్యూజిలాండ్ పటిష్ట స్థితికి చేరింది. విలియమ్సన్, వాట్లింగ్ల అత్యద్భుత ఆటతీరుతో మంగళవారం నాలుగో రోజు న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లకు 524 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో లంకకు 390 పరుగుల భారీ లక్ష్యం ఎదురయింది. బుధవారం ఆటకు చివరి రోజు. మూడో రోజు ఆటలో విలియమ్సన్ రెండు క్యాచ్‌లను మిస్ చేసిన లంక ఫీల్డింగ్ నాలుగో రోజు కూడా అదే రీతిన సాగింది. తను 104 పరుగుల వద్ద ఉన్నప్పుడు కీపర్ ప్రసన్న జయవర్ధనే క్యాచ్ వదిలేయగా... 233 వద్ద ఉన్నప్పుడు స్టంప్ చేయలేకపోయాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక మంగళవారం ఆట మగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. -
విలియమ్సన్ 242 నాటౌట్
వెల్లింగ్టన్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ సాధించాడు. కష్టాల్లో పడిన జట్టును అజేయ ద్విశతకంతో ఆదుకున్నాడు. విలియమ్సన్ కు తోడు బీజే వాల్టింగ్ సెంచరీ చేయడంతో రెండో ఇన్నింగ్స్ లో కివీస్ భారీ స్కోరు చేసింది. 524/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 390 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. విలియమ్సన్ 438 బంతుల్లో 18 ఫోర్లతో 242 పరుగులు చేశాడు. వాల్టింగ్ 333 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ తో 142 పరుగులు సాధించాడు. ఆరో వికెట్ కు వీరిద్దరూ 365 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసింది.