
సౌథాంప్టన్: భారత్‌తో సౌథాంప్టన్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తన అఖరి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ గొప్ప పోరాట పటిమని కనబర్చాడు. కుడిచేతి వేలు విరిగినప్పటికీ కీపింగ్ చేసిన వాట్లింగ్.. విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రవీంద్ర జడేజా క్యాచ్‌లను అందుకున్నాడు.వాట్లింగ్ పోరాట పటిమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్ మధ్యలోనే అభినందిచాడు.
వాస్తవానికి బుధవారం తొలి సెషన్‌లోనే వాట్లింగ్ కుడిచేతి ఉంగరం వేలు విరిగింది.న్యూజిలాండ్ కెప్టన్ కేన్ విలియమ్సన్ విసిరిన త్రోని వికెట్ల వెనుక నుంచి వాటింగ్ అందుకునే ప్రయత్నం చేయగా వేగంగా వచ్చిన బంతి అతని చేతి వేలిని బలంగా తాకింది.దాంతో వేలు విరగగా వెంటనే ఫిజియో సాయం తీసుకుని వికెట్ కీపింగ్ కొనసాగించాడు. లంచ్ విరామంలో వైద్యం చేయించుకున్నాడు.ఆ తరువాత మళ్లీ మైదానంలో అడుగు పెట్టాడు.టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు మే నెలలోనే వాట్లింగ్ ప్రకటించేశాడు.
చదవండి:అశ్విన్ టాప్, రహానే కంటే రోహిత్.. వార్నర్ బాదుడు కూడా!
Comments
Please login to add a commentAdd a comment