team india
-
చెలరేగిన అభిషేక్ శర్మ..తొలి టి20లో భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
IND VS IRE 1st T20: వర్షం అంతరాయం.. ఐర్లాండ్‌పై టీమిండియా విజయం
ఐర్లాండ్‌తో 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో టీమ్ ఇండియా డక్‌వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో ఇవాళ (ఆగస్ట్ 18) జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. ఫలితంగా ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 139 పరుగులకు పరిమతమైంది. భారత బౌలర్లలో బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అర్షదీప్ సింగ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఐర్లాండ్ బ్యాటర్లలో (51 నాటౌట్), కర్టిస్ క్యాంఫర్ (39)రాణించగా.. మిగతావారంతా విఫలమయ్యారు. ఆండ్రూ బల్బిర్నీ (4), పాల్ స్టిర్లింగ్ (11), లోక్కాన్ టక్కర్ (0), హ్యారీ టెక్టార్ (9), జార్జ్ డాక్రెల్ (1), మార్క్ అదైర్ (16) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. ఆఖర్లో, ముఖ్యంగా అర్షదీప్ వేసిన చివరి ఓవర్లో మెక్‌కార్తీ చెలరేగి ఆడాడు. అ ఓవర్లో అతను ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఇందులో 2 సిక్సర్లు, ఓ బౌండరీ ఉంది. ఆఖరి బంతికి సిక్సర్ బాదిన మెక్‌కార్తీ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అతను ఓ రికార్డు కూడా సాధించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో 8 లేదా అంతకంటే కింది స్థానాల్లో వచ్చి అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ స్థానంలో వచ్చి కేశవ్ మహారాజ్ చేసిన 41 పరుగులే అత్యధికంగా ఉండేది. కాగా, దాదాపుగా ఏడాది తర్వాత బంతి పట్టిన బుమ్రా.. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ, ఆతర్వాత ప్రభావం చూపించలేకపోయాడు. -
రోహిత్ కు విశ్రాంతి మరి కోహ్లీ సంగతి ఏంటి..!
-
తదుపరి కెప్టెన్ రహానే..!
-
పుజారాకు షాక్ పాండ్యకు ప్రమోషన్..!
-
టెస్టింగ్ టైమ్స్ మ్యాగజైన్ స్టోరీ
-
రాన్నున్న T -20 సిరీస్ లో ఈ యువ ఆటగాళ్లు
-
'టీ20 ప్రపంచకప్‌లో అతడే టీమిండియా టాప్ రన్ స్కోరర్'
టీ20 ప్రపంచకప్-2022 మెగా సమరానికి మరో రెండు రోజుల్లో తెరలేవనుంది. జిలాంగ్ వేదికగా ఆక్టోబర్ 16న శ్రీలంక-నమీబియా మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక టీమిండియా విషయానికి వస్తే.. రోహిత్ సేన తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా దాయాది జట్టు పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మెగా ఈవెంట్‌కు రెండు వారాల ముందే ఆస్ట్రేలియాకు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతోంది. టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత్.. రెండో మ్యాచ్‌లో పరజాయం పాలైంది. అయితే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైనప్పటికీ.. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతులు రాహల్ 74 పరుగులు చేశాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ టీమిండియా తరపున టాప్ రన్ స్కోరర్‌గా నిలుస్తాడని భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా జోస్యం చెప్పాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ.. "టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ తరపున టాప్ రన్ స్కోరర్ కేఎల్ రాహుల్ కావచ్చు. అతడు ఓపెనర్‌గా వస్తాడు కాబట్టి మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఆస్ట్రేలియాలో పిచ్‌లు బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తాయి. అక్కడ బంతి బ్యాట్‌పైకి చక్కగా వస్తుంది. అక్కడి పిచ్‌లు కేఎల్ రాహుల్‌కు సరిగ్గా సరిపోతాయి" అని పేర్కొన్నాడు. చదవండి: Ind Vs WA XI: రాహుల్ ఇన్నింగ్స్ వృథా.. కుప్పకూలిన మిడిలార్డర్.. టీమిండియాకు తప్పని ఓటమి -
'కోహ్లి, బాబర్ కాదు.. రాబోయే రోజుల్లో అతడే స్టార్ బ్యాటర్'
టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం భీకర ఫామ్‌లోఉన్నాడు. హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 36 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 పరుగులు సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా ప్రశంసల వర్షం కురిపించాడు. రాబోయే ఏళ్లలో విరాట్ కోహ్లి, బాబర్ ఆజాం వంటి స్టార్ ఆటగాళ్లను సూర్య అధిగమిస్తాడని కనేరియా అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సూర్యకుమార్ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడని అతడు కొనియాడాడు. కాగా సూర్య ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మూడో స్దానంలో ఉన్నాడు. ప్రత్యర్ది బౌలర్లకు వెన్నులో వణుకు "ప్రపంచ టీ20 క్రికెట్లో అత్యుత్తమ బ్యాటరల్లో సూర్యకుమార్ ఒకడు. నేను గత కొంత కాలంగా ఇదే చెబుతున్నాను. 360 డిగ్రీలలో అతడు ఆడే షాట్లు అద్భుతమైనవి. అతడు క్రీజులో ఉంటే ప్రత్యర్ది బౌలర్లకు వెన్నులో వణుకు పుడుతోంది. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో సూర్య మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్య రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద స్టార్ ఆటగాడు అవుతాడు. అతడు బ్యాటింగ్ చేసే విధానం.. ఇతర బ్యాటింగ్ దిగ్గజాలందరినీ మరచిపోయేలా చేస్తుంది. కోహ్లి, బాబర్ ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు. కానీ రాబోయే రోజుల్లో వీరిద్దరిని అధిగమించి ప్రపంచ క్రికెట్ చరిత్రలో తన పేరును లిఖించుకుంటాడు" అని కనేరియా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. కెప్టెన్‌గా ధావన్.. వైస్ కెప్టెన్‌గా శాంసన్! -
'ఇదేం నాకు ప్రత్యేకమైన రోజు కాదు.. నా కష్టానికి ప్రతిఫలం దక్కిందంతే'
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. భారత విజయంలో తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో పాండ్యా కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌లో 51 పరుగులతో అదరగొట్టిన పాండ్యా.. అనంతరం బౌలింగ్‌లోనూ నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా తన టీ20 కెరీర్లో హార్ధిక్‌కు ఇదే తొలి ఆర్ధసెంచరీ కావడం గమనార్హం. ఇక మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తొలి టీ20లో తన అనుభవాన్ని ఇషాన్ కిషన్‌తో హార్థిక్ పంచుకున్నాడు. "ఇదేం నాకు ప్రత్యేకమైన రోజు కాదు. జీవితంలో ఒక సాధారణ రోజులా అనిపిస్తుంది. అయితే ఇన్నాళ్లు నా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. ఈ మ్యాచ్‌లో 90.5 కి.మీ వేగంతో బౌలింగ్ చేయడం సంతోషంగా ఉంది. జట్టు కోచింగ్ స్టాప్ కృషి వల్లే నేను ఈ స్పీడ్‌తో బౌలింగ్ చేయగలిగాను. కాబట్టి ఈ క్రెడిట్ మొత్తం సహాయక సిబ్బందికే దక్కాలి. ముఖ్యంగా సోహమ్ దేశాయ్, హర్ష ఇంగ్లండ్ సిరీస్‌కు మమ్మల్ని సిద్ధం చేయడంలో చాలా కష్టపడ్డారు" అని హార్ధిక్ పాండ్యా పేర్కొన్నాడు. చదవండి: IND vs ENG: 'టీమిండియా ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ వద్దు.. కోహ్లిని పంపండి' From bowling fast ⚡️ to scoring big 👌 and crediting those behind the scenes. 👏 👏 𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦 as @hardikpandya7 chats with @ishankishan51 after #TeamIndia's win in the first #ENGvIND T20I. 👍 👍 - By @Moulinparikh Full interview 🎥 🔽https://t.co/1wJyFRDJqL pic.twitter.com/kIbTSD8mpB — BCCI (@BCCI) July 8, 2022 -
'దక్షిణాఫ్రికాతో సిరీస్ భారత ఆటగాళ్లకు చాలా కీలకం'
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్ భారత యువ ఆటగాళ్లకు ఎంతో కీలకమని టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా ఐపీఎల్-2022లో అదరగొట్టి భారత జట్టులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ అద్భుతంగా రాణించాలని రైనా ఆకాంక్షించాడు. దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌కు పేస్ సంచలనాలు ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్‌లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. "ఈ సిరీస్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఐపీఎల్లో అద్భుతంగా రాణించిన యువ ఆటగాళ్లు ప్రొటీస్‌తో సిరీస్‌కు భారత జట్టులో భాగమై ఉన్నారు. అయితే టీమిండియా తరపున వారు ఎలా రాణిస్తారు అనేది ముఖ్యం. ఉమ్రాన్ మాలిక్ చాలా టాలెంట్ ఉన్న బౌలర్. అదే విధంగా అర్ష్‌దీప్ ఐపీఎల్లో బౌలింగ్ చేసిన విధానం అద్భుతమైనది. ఇక కెప్టెన్‌గా రాహుల్ ఐపీఎల్లో అద్భుతంగా రాణించాడు. కానీ ఇప్పుడు భారత జట్టు వంతు వచ్చింది. అయితే అతడు జట్టును విజయం పథంలో నడిపిస్తాడని నేను భావిస్తున్నాను "అని రైనా పేర్కొన్నాడు. ఇక ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 జూన్9న ఢిల్లీ వేదికగా జరగనుంది. చదవండి: SL Vs AUS 1st T20: తొలి టీ20.. తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా -
శ్రేయస్ అయ్యర్‌ను అందుకే పక్కన పెట్టాం: రోహిత్ శర్మ
India Vs West Indies 2nd T20: ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా శ్రేయస్ అయ్యర్ స్ధానంలో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. కాగా శ్రేయస్‌కు తుది జట్టులో చోటు దక్కపోవడానికి గల కారణాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. "శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాడిని బయట కూర్చోబెట్టడం చాలా కఠినమైన నిర్ణయం. కానీ మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసే ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోవాలని మేము భావించాం. ఈ క్రమంలోనే శ్రేయస్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. జట్టులో అయ్యర్ స్ధానానికి తీవ్రమైన పోటీ ఉంది. ఫామ్‌లో లేని ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం కంటే ఇలా పోటీ ఉండటం సంతోషించే విషయం. ఇక త్వరలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ గురించి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. మేము శ్రేయస్ అయ్యర్‌తో ప్రపంచకప్ ప్రణాళికల గురించి చర్చించాం. జట్టు అవసరనానికి తగ్గట్టు ఏ నిర్ణయం తీసుకున్న అందరు ఆటగాళ్లు దానికి కట్టుబడి ఉన్నారు" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. చదవండి: Surajit Sengupta: భారత ఫుట్ బాల్ దిగ్గజం సురజిత్ కన్నుమూత -
వెస్టిండీస్‌తో సిరీస్.. భారత అభిమానులకు గుడ్ న్యూస్
India-West Indies T20 series: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న మాడు టీ20ల సిరీస్‌కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్- వెస్టిండీస్ మధ్య జరగబోయే మ్యాచ్‌లకు 75 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు బెంగాల్ ప్రభుత్వం అంగీకరించింది. అన్ని ఇండోర్, అవుట్డోర్ స్టేడియాల్లో జరిగే క్రీడలకు 75 శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మ్యాచ్‌లకు సుమారు 50,000 మంది ప్రేక్షకుల హాజరయ్యే అవకాశం ఉంది. గత ఏడాది ఇంగ్లండ్‌తో సిరీస్‌తో తర్వాత ఈ వేదికలో తొలిసారి అభిమానుల మధ్య టీమిండియా ఆడనుంది. కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకులు లేని ఖాళీ క్రికెట్ స్టేడియంలలోనే బీసీసీఐ మ్యాచ్‌లు నిర్వహించింది. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 16న జరగనుంది. ఇక భారత పర్యటనలో భాగంగా విండీస్ జట్టు మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇక ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ -
ఫుట్‌బాల్ మ్యాచ్ .. గొడవపడ్డ అశ్విన్, పుజారా!
దక్షిణాఫ్రికా పర్యటనకు చేరుకున్న టీమిండియా ఒక్క రోజు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. జోహన్నెస్‌బర్గ్‌లో ఫుట్‌వాలీ మ్యాచ్‌తో వారి తొలి ప్రాక్టీస్ సెషన్‌ను మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్‌తో పాటు సహచర ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు అశ్విన్ సారథ్యం వహించగా, మరో జట్టుకు ద్రవిడ్ నాయకత్వం వహించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియోలో అశ్విన్, పుజారా సీరియస్‌గా ఏదో గొడవపడినట్లు కనిపిస్తుంది. అదే విధంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫుట్‌బాల్ స్కిల్స్‌ను చూసి కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశ్చర్యపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్26న భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడిని కచ్చితంగా తీసుకోవాలి.. How did #TeamIndia recharge their batteries ahead of their first training session in Jo'Burg? 🤔 On your marks, get set & Footvolley! ☺️😎👏👌#SAvIND pic.twitter.com/dIyn8y1wtz — BCCI (@BCCI) December 18, 2021 -
సౌతాఫ్రికాతో సిరీస్.. కోహ్లి కీలక నిర్ణయం!
టీమిండియా వన్డే కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తొలిగించి రోహిత్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో కెప్టెన్‌గా కొనసాగాలని భావించాడు. అయితే అనూహ్యంగా కోహ్లిని తప్పించి రోహిత్‌కు సారథ్య బాధ్యతలు బీసీసీఐ అప్పజెప్పింది. దీంతో కోహ్లి అసహానానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా టూర్లో వన్డే సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉండనున్నట్లు వార్తలు వినిసిస్తున్నాయి. ది టెలిగ్రాఫ్‌లో ప్రచురించిన కథనాలు ప్రకారం కోహ్లి తన పేరును ఉపసంహరించుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై విరాట్ కోహ్లి ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం. అయితే ఈ నిర్ణయాన్ని కొంతమంది సమర్ధిస్తుంటే.. మరి కొంత మంది తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. కాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు జట్టును ప్రకటించిన బీసీసీఐ.. ఇంకా వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించలేదు. డిసెంబర్ 26న సెంచూరియాన్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్ అనంతరం జనవరి 19 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ చదవండి: Virat Kohli: వన్డే, టి20లకు గుడ్‌బై చెప్పే యోచనలో కోహ్లి! -
భారత్‌పై విజయం.. ఇప్పుడు పాకిస్తానే టైటిల్ ఫేవరెట్: షేన్ వార్న్
Shane warne comments Pakistan: టీ20 ప్రపంచకప్-2021లో భారత్‌పై సంచలన విజయం నమోదు చేసిన పాకిస్తాన్‌పై ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్‌పై విజయం సాధించడంతో పాకిస్తానే టైటిల్ ఫేవరెట్ అని అతడు అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఒత్తిడిని తట్టుకుంటూ రిజ్వాన్, బాబర్ అద్బుతంగా ఆడారాని వార్న్ కొనియాడాడు. "టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై విజయం సాధించి పాక్ సత్తా చాటింది. నా అభిప్రాయం ప్రకారం ఈసారి పాకిస్తాన్ ఛాంపియన్‌గా నిలుస్తుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో పాక్ ఆదరగొట్టింది. బాబర్ ఆజం ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా తన ఖ్యాతిని పెంచుకుంటూనే ఉన్నాడు" అని వార్న్ ట్వీట్ చేశాడు. కాగా మ్యాచ్‌లో తొలుత విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 7 వికెట్ల నష్టానికి చేసింది. ఛేదనలో దూకుడుగా ఆడేసిన పాకిస్థాన్ ఓపెనర్లు బాబర్ అజామ్, రిజ్వాన్ అలవోకగా ఆ జట్టుని గెలిపించారు. దీంతో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. చదవండి: T20 World Cup 2021 Ind Vs Pak: ‘అసలేం చేశారయ్యా.. ఆ సెలక్షన్ ఏంటి?’ -
టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో అభయ్ శర్మ..
Abhay Sharma set To Apply for India Fielding Coach: భారత యువ జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన అభయ్ శర్మ ఇప్పుడు సీనియర్ జట్టుకు సేవలందించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం త్వరలోనే దరఖాస్తు చేయనున్నాడు. 52 ఏళ్ల అభయ్ శర్మకు ఢిల్లీ తరఫున 89 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. జాతీయ క్రికెట్ అకాడమీలో డైరెక్టర్ ద్రవిడ్ సహాయక సిబ్బందిలో ఫీల్డింగ్ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. భారత్ ‘ఎ’, అండర్–19, భారత సీనియర్ మహిళల జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. చదవండి: T20 WC 2021 IND Vs PAK: పఠాన్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్.. అశ్విన్‌కు నో ప్లేస్ -
రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. ఐదో రోజు హైలైట్స్ ఇవే
లండన్: ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం 368 పరుగుల ఛేదనలో తడబడిన ఇంగ్లండ్ టీమ్ 210 పరుగులకే కూప్ప కూలింది. భారత జట్టు విజయంలో ఓపెనర్ రోహిత్ శర్మ, బౌలర్లు ఉమేశ్ యాదవ్, బుమ్రా, జడేజా, శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 తో ఆధిక్యం సాధించింది. 127 పరుగుల సాధించి టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించిన రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. చదవండి: సిరీస్ వేటలో విజయబావుటా -
విరాట్ కోహ్లిపై.. ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
ఓవల్: భారత్‌తో జరిగిన మూడో టెస్టులో ఘన విజయం సాధించి సిరీస్ 1-1తో సమం చేసిన ఇంగ్లండ్ నాలుగో టెస్ట్‌కు సిద్దమైంది. ఈ సందర్భంగా ఇంగ్లండ్ సారధి జో రూట్ మీడియాతో మాట్లాడూతూ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పై అసక్తికర వాఖ్యలు చేసాడు. మేము టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవాలంటే విరాట్ కోహ్లిని నిశ్శబ్దంగా ఉంచాల్సిన అవసరం ఉందని రూట్ అన్నాడు. ఇప్పటి వరకు విజయవంతంగా ఆ పని చేశామని, మిగతా మ్యాచ్‌ల్లో కూడా దాన్ని కొనసాగించాలన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో కోహ్లీ కేవలం ఒక్కసారి మాత్రమే 50 పైగా పరుగులు చేశాడని.. జేమ్స్ ఆండర్సన్ అతడిని రెండుసార్లు పెవిలియన్‌కు పంపాడని రూట్ తెలిపాడు. ఇక ప్రపంచ స్థాయి ఆటగాడు అయిన కోహ్లీని త్వరగా ఔట్ చేయడంలో తమ బౌలర్లకే మొత్తం క్రెడిట్ ఇవ్వాలని అతడు పేర్కొన్నాడు. అతన్ని ఔట్ చేయడానికి మేము కొత్తం మార్గాలను కనుగొన్నమాని అతడు వివరించాడు. రాబోయే మ్యాచులో కోహ్లీ సేనపై మరింత ఒత్తిడిని పెంచేందుకు ప్రయత్నిస్తామని రూట్ చెప్పాడు. గత మ్యాచ్‌లో గెలిచామని తమ జట్టు ధీమాగా లేదని జోరూట్ తెలిపాడు. దెబ్బతిన్న భారత్ ప్రతి స్పందన ఎలా ఉంటోందో తనకు తెలుసని, దానికి తగ్గట్లు సిద్దం అవుతున్నామన్నాడు. కాగా సెప్టెంబర్ 2 నుంచి ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుంది. చదవండి: IPL 2021: విండీస్ విధ్వంసకర ఆటగాడిని దక్కించుకున్న రాజస్తాన్ రాయల్స్ -
ఇంకా రెండు మ్యాచ్‌లున్నాయ్! దిగులెందుకు..
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత జట్టు ఘోర వైఫల్యం పై టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ స్పందించాడు. రెండో రోజు ఆట ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో షమీ మాట్లాడూతూ.. తమ జట్టు పేలవ ప్రదర్శన పై మాకు ఎలాంటి దిగులు లేదని అన్నాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని, ఈ ఒక్క మ్యాచ్‌లో జట్టు పేలవ ప్రదర్శన ఆటగాళ్ల మనోబలాన్ని దెబ్బ తీయదని స్పష్టం చేశాడు. కొన్ని టెస్ట్ మ్యాచ్‌లును మేము రెండు, మూడు రోజుల్లో పూర్తి చేసామాని షమీ తెలిపాడు. కొన్నిసార్లు చెడ్డ రోజులు ఎదురవుతాయి. టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా ఆలౌటై ఎక్కువసేపు ఫీల్డింగ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.. అంత మాత్రానికే ఆత్మస్థైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదని మహమ్మద్ షమీ చెప్పాడు. మేం సిరీసులో 1-0తో ఆధిక్యంలో ఉన్నాం. అందుకే మేము దిగులు చెందాల్సిన అవసరం లేదు. మా నైపుణ్యాలను విశ్వసించి, మాకు మేం అండగా ఉండాలి. ప్రత్యర్థి జట్టులో భారీ భాగస్వామ్యాలు నమోదవుతుంటే వాటిని విడదీయాల్సిన బాధ్యత బౌలర్ల మీదే ఉంటుంది. వికెట్లు తీసేందుకు, బ్యాట్స్‌మెన్‌ను ఏ విధంగా ఔట్ చేయాలో మనసులోనే వ్యూహాలు రచించాల్సి ఉంటుందని షమీ చెప్పుకొచ్చాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో చెత్త బ్యాటింగ్‌తో టీమిండియా 78 పరుగులకే కుప్పకూలగా, ఆతిధ్య ఇంగ్లండ్ 354 పరుగుల ఆధిక్యత సాధించింది. చదవండి: IND Vs ENG 3rd Test Day 3: ఇంగ్లండ్ 432 ఆలౌట్.. 354 పరుగుల ఆధిక్యంలో ఆతిధ్య జట్టు -
సిరాజ్.. తలకు తగిలేలా బౌన్సర్లు వెయ్, వీడియో వైరల్
లండన్: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం ముగిసిన ఈ టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం జరిగింది. ఆట చివరి రోజు జస్ప్రీత్ బుమ్రాపై బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులు సంధించిన ఇంగ్లాండ్ బౌలర్లు.. మాటలతోనూ అతనిపై దాడికి దిగారు. అయినా బుమ్రా- షమీ జోడీ పట్టుదలతో బ్యాటింగ్ చేసి 9వ వికెట్‌కి అజేయంగా 89 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా 271 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చదవండి:Suryakumar Yadav: 65 రోజుల తర్వాత భార్యని కలిసిన సూర్య.. ఏం చేశాడంటే? అనంతరం 272 పరుగుల ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ టీమ్‌ని విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్‌తో ఆడుకున్నాడు. మరీ ముఖ్యంగా.. బుమ్రాపై మాటల యుద్ధానికి దిగిన ఆటగాళ్లని టార్గెట్‌గా చేసుకున్న కోహ్లీ.. మైదానంలో కవ్వింపులతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ స్కోరు 120 పరుగుల వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చివరి వికెట్‌గా జేమ్స్ అండర్సన్ క్రీజులోకి వచ్చిన సమయంలో కూడా విరాట్ కోహ్లీ, హెల్మెన్‌ను టార్గెట్ చేస్తూ బౌన్సర్లు వేయాలని సూచించడం... దానికి సిరాజ్ కూడా తలకు వేస్తానంటూ సైగలు చేయడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియో లో వైరల్ అవుతోంది. Siraj and Kohli 🤪 pic.twitter.com/BmRUcw95aV — Simran (@CowCorner9) August 20, 2021 -
కృనాల్‌కు కరోనా
కొలంబో: శ్రీలంక పర్యటనలోని భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం చోటు చేసుకుంది. టీమ్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా మంగళవారం కరోనా వైరస్ బారిన పడ్డాడు. రెండో టి20 మరికొన్ని గంటల్లో ఆరంభమవుతుందనగా కృనాల్‌కు కోవిడ్–19 అని తేలడంతో మ్యాచ్ వాయిదా పడింది. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జైషా ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కృనాల్ ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నాడు. దాంతో అతడు సిరీస్‌లో మిగిలిన రెండు టి20లకు దూరమయ్యాడు. అంతేకాకుండా అతడు సిరీస్ పూర్తయ్యాక మిగిలిన భారత క్రికెటర్లతో కలిసి స్వదేశానికి రావడం లేదు. ఏడు రోజుల క్వారంటైన్ పూర్తయ్యాక నిర్వహించే ఆర్టీ–పీసీఆర్ టెస్టులో నెగెటివ్‌గా రిపోర్టు వస్తేనే కృనాల్ భారత్‌కు వచ్చేందుకు వీలవుతుంది. అసలేం జరిగింది... తనకు కాస్త గొంతు నొప్పిగా ఉందంటూ మంగళవారం ఉదయం కృనాల్ భారత మెడికల్ టీమ్‌కు తెలియజేశాడు. వెంటనే అప్రమత్తమైన మెడికల్ సిబ్బంది అతడికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టును నిర్వహించింది. అందులో కృనాల్ పాజిటివ్‌గా తేలాడు. కృనాల్‌తో ఎనిమిది మంది క్రికెటర్లు సన్నిహితంగా మెలిగినట్లు భారత మెడికల్ టీమ్ గుర్తించింది. వీరికి ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా అంద రికీ నెగెటివ్‌గా రిపోర్టు వచ్చింది. అయితే వీరు కూడా మిగిలిన రెండు మ్యాచులకు దూరం కానున్నట్లు సమాచారం. వీరి పేర్లను మాత్రం గోప్యంగా ఉంచారు. నేడు రెండో టి20 జరగనుంది. ఎలా సోకింది... కృనాల్‌కు కరోనా ఎలా సోకిందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. సిరీస్ బయో బబుల్‌లో జరుగుతుండటంతో బయటి వ్యక్తులు లోపలికి వచ్చే అవకాశం లేదు. అయితే భారత క్రికెటర్లు ఉంటున్న తాజ్ సముద్ర హోటల్లో కృనాల్ కరోనా బారిన పడే అవకాశం ఉంది. లేకపోతే జట్టును గ్రౌండ్‌కు తీసుకొచ్చే బస్ డ్రైవర్ ద్వారా లేదా మైదానంలో టీమ్‌కు భోజన వసతిని ఏర్పాటు చేసే క్యాటరింగ్ సిబ్బంది ద్వారా సోకినట్లు భావిస్తున్నారు. సూర్య, పృథ్వీ షాలకు క్వారంటైన్ తప్పదా? ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఎంపికై... ఆ తర్వాత గాయాలతో దూరమైన భారత క్రికెటర్లు శుబ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షాలకు పిలుపొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరు శ్రీలంక పర్యటనలో ఉండగా... టి20 సిరీస్ ముగిసిన వెంటనే అక్కడి నుంచే నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లాల్సి ఉంది. వీరిద్దరు కూడా సిరీస్ కోసం ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో ఉండటంతో ఇంగ్లండ్‌కు వెళ్లాక మళ్లీ క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని... డర్హమ్‌లో ఉన్న జట్టుతో కలవొచ్చని బీసీసీఐ ఇది వరకే స్పష్టం చేసింది. అయితే కృనాల్ పాజిటివ్‌తో ఈ పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈ సిరీస్ ముగిశాక సూర్యకుమార్, పృథ్వీ షా ఇంగ్లండ్‌కు వెళ్లినా... అక్కడ 10 రోజుల క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
వరుస ఓటములు.. శ్రీలంకకు మరో భారీ షాక్!
కొలంబో: టీమిండియా చేతిలో వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పొంది.. సిరీస్‌ని చేజార్చుకున్న శ్రీలంకకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొలంబో వేదికగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా శ్రీలంక జట్టుకు జరిమానా విధించారు. ఈ మేరకు మ్యాచ్ రిఫరీ రంజన్.. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టీమ్ నిర్దిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసింది. అయితే శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తప్పిదాన్ని అంగీకరించడంతో ఎలాంటి తదుపరి విచారణ లేకుండా మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నాడు. ఇక ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ నిబంధనల ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఒక్కో పాయింట్ కోత విధిస్తారు. ఈ నేపథ్యంలో.. ఒక్క ఓవర్ తక్కువగా వేసిన శ్రీలంక ఓ పాయింట్‌ను కోల్పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిచేలా కనిపించిన శ్రీలంక టీమ్.. టీమిండియా ఆటగాడు దీపక్ చహర్ (69) దెబ్బకి అనూహ్యరీతిలో 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా భారత్, శ్రీలంక మధ్య కొలంబో వేదికగానే శుక్రవారం మూడో వన్డే జరగనుంది. -
WTC Final: వేలు విరిగింది..అయినా క్యాచ్‌లు పట్టాడు
సౌథాంప్టన్: భారత్‌తో సౌథాంప్టన్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తన అఖరి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బీజే వాట్లింగ్ గొప్ప పోరాట పటిమని కనబర్చాడు. కుడిచేతి వేలు విరిగినప్పటికీ కీపింగ్ చేసిన వాట్లింగ్.. విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, రవీంద్ర జడేజా క్యాచ్‌లను అందుకున్నాడు.వాట్లింగ్ పోరాట పటిమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్ మధ్యలోనే అభినందిచాడు. వాస్తవానికి బుధవారం తొలి సెషన్లోనే వాట్లింగ్ కుడిచేతి ఉంగరం వేలు విరిగింది.న్యూజిలాండ్ కెప్టన్ కేన్ విలియమ్సన్ విసిరిన త్రోని వికెట్ల వెనుక నుంచి వాటింగ్ అందుకునే ప్రయత్నం చేయగా వేగంగా వచ్చిన బంతి అతని చేతి వేలిని బలంగా తాకింది.దాంతో వేలు విరగగా వెంటనే ఫిజియో సాయం తీసుకుని వికెట్ కీపింగ్ కొనసాగించాడు. లంచ్ విరామంలో వైద్యం చేయించుకున్నాడు.ఆ తరువాత మళ్లీ మైదానంలో అడుగు పెట్టాడు.టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు మే నెలలోనే వాట్లింగ్ ప్రకటించేశాడు. చదవండి:అశ్విన్ టాప్, రహానే కంటే రోహిత్.. వార్నర్ బాదుడు కూడా! -
WTC ఫైనల్: విరాట్ కోహ్లి డ్యాన్స్ అదిరిందిగా!
సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో టీమిండియా 217 పరుగులకు ఆలౌట్ అయ్యి అభిమానులను నిరాశ పరిచింది. కానీ ఆదివారం మూడో రోజు ఆటలో భాగంగా మ్యాచ్ మధ్యలో కెప్టెన్ విరాట్ కోహ్లి భాంగ్రా డ్యాన్స్ చేస్తూ ఆభిమానులను కాసేపు అలరించాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలో సౌథాంప్టన్ స్టేడియంలోకి ప్రేక్షకుల్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అనుమతించింది. ఈ క్రమంలో స్టేడియానికి వచ్చిన 'భారత అభిమానులు.. డ్రమ్స్ వాయిస్తూ టీమిండియాని ఉత్సాహపరిచారు. మూడో రోజు రెండో సెషన్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తుండగా, 9వ ఓవర్లో భారత అభిమానులు భాంగ్రా మ్యూజిక్ వాయించగానే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ తదనుగుణంగా స్టెప్లు వేస్తూ కనిపించాడు. అతని పక్కనే రిషబ్ పంత్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ, టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారా ఉన్నారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 2 వికెట్లకు 102 పరుగులు చేసింది.ఛాంపియన్షిప్ ఫైనల్‌కు వర్షం ముప్పు తప్పేలా కనిపించడం లేదు. నాలుగో రోజు, సోమవారం సౌథాంప్టన్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజు పూర్తిగా ఆట కొనసాగే పరిస్థితి ఉండదని సమాచారం. 90 శాతానికి పైగా వర్షం కురుస్తుందని అక్కడి వాతావరణశాఖ తెలిపింది. Kohli can't dance saala pic.twitter.com/HLQ1Vy6CmV — bhargavprdip (@bhargavprdip) June 20, 2021 చదవండి:WTC ఫైనల్: భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌పై సందేహాలు -
250కి పైగా పరుగులు చేస్తే టీమిండియాదే పై చేయి..
సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 250 పైగా పరుగులు చేస్తే మ్యాచ్‌పై పట్టు బిగించవచ్చని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో 250 మెరుగైన స్కోరేనని అభిప్రాయపడ్డాడు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ చక్కని భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారని ఆదివారం ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ అన్నాడు. టీమిండియా ఇంకా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని చెప్పుకొచ్చారు. కొత్త బంతిని ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ చక్కగా ఎదుర్కొన్నారని రాథోడ్ పేర్కొన్నాడు. అయితే, ఓపెనర్లు క్రీజు బయట స్టాన్స్ తీసుకుంది స్వింగ్‌ను ఎదుర్కోవడానికా? దూకుడుగా ఆడటానికా? అని ప్రశ్నించగా.. 'బ్యాటింగ్ అంటేనే పరుగులు చేయడం. రోహిత్, గిల్ పట్టుదలగా ఆడారు. వీలైనప్పుడల్లా పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. వారిని కచ్చితంగా అభినందించాల్సిందే. విరాట్, రహానె బ్యాటింగ్ చేసిన తీరుకు హ్యాట్సాఫ్' అని రాథోడ్ అన్నాడు. చదవండి:WTC Final Day 3: మరో బిగ్ వికెట్.. కెప్టెన్ కోహ్లి ఔట్ -
ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా: రోహిత్ శర్మ
ముంబై:టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తుంది. రోహిత్ శర్మ తన కూతురు సమైరా తో కలిసి వున్న ఓ ఫోటో ను పోస్ట్ చేశాడు.ఇక రోహిత్‌కు తన కూతురు సమైరా అంటే ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే.తన కూతురు కు సంబంధించి వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాడు.కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవాధికంగా వాయిదాపడటంతో ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ ప్రస్తుతం ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం తన గారాలపట్టి సమైరాను భుజాలపై ఎత్తుకుని ఉన్న ఓ ఫొటోను రోహిత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.దానికి 'ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా' అనే క్యాప్షన్ ఇచ్చాడు.ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే వైరల్ అయింది.అటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో రోహిత్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. (చదవండి:Eng Vs Ind: షెడ్యూల్ ముందుకు జరపండి! ) -
కేకేఆర్ జట్టులో మరో ఆటగాడికి కరోనా
న్యూఢిల్లీ: గత సంవత్సరం యూఏఈలో మ్యాచ్‌లు జరిపిన మాదిరిగానే భారత్‌లోనూ ఈ సారి ఐపీఎల్‌ను విజయవంతంగా నిర్వహించాలనుకున్న బీసీసీఐ ప్రయత్నాలు విఫలమయ్యాయి. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, బయోబబుల్‌లో ఉంచినప్పటికీ ఈ మహమ్మారి వైరస్ ఆటగాళ్లకి సోకింది. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో ప్లేయర్ కరోనా బారినపడ్డాడు. కేకేఆర్, భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణకు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఈ క్రమంలో కేకేఆర్ జట్టులో వైరస్ సోకిన ఆటగాళ్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్, న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్ కరోనా బారినపడ్డారు. కాగా, ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్, ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ప్రసిద్ద్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికే ఐపీఎల్ వాయిదాకి వరుణ్ చక్రవర్తి కారణమంటూ సోషల్ మీడియాలో అతనిపై మీమ్స్ చేస్తూ అభిమానులు వాళ్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ( చదవండి : IPL 2021: నీ వల్లే ఐపీఎల్ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్! ) -
ఇక... అమెజాన్ ప్రైమ్ క్రికెట్
ముంబై: భారత్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో మరో దశకు చేరనుంది. ఇన్నాళ్లు తమ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై బహుభాష వెబ్ సిరీస్‌లు, సీరియళ్లు, సినిమాలతో అలరించిన ‘ప్రైమ్ వీడియో’ ఇకపై ప్రత్యక్ష క్రికెట్ ప్రసారాలకు సిద్ధమైంది. భారత్‌లో క్రికెట్ క్రేజీని కూడా సొంతం చేసుకునేందుకు న్యూజిలాండ్ క్రికెట్ హక్కుల్ని చేజిక్కించుకుంది. కివీస్ గడ్డపై జరిగే క్రికెట్ మ్యాచ్‌లను ప్రైమ్ వీడియో ప్రసారం చేయనుంది. ఈ నెలలో మొదలయ్యే 2020-21 సీజన్ నుంచి 2025-26 సీజన్ వరకు ఆరేళ్ల పాటు జరిగే క్రికెట్ సిరీస్‌లను భారత్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో... న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆరేళ్ల ఒప్పందంలో రెండు భారత్ పర్యటనలు కూడా ఉన్నాయి. 2022లో ఒకసారి, తదనంతరం మరోసారి టీమిండియా... న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. ఈ ఒప్పందంపై ప్రైమ్ వీడియో డైరెక్టర్, జనరల్ మేనేజర్ (ఇండియా) గౌరవ్ గాంధీ మాట్లాడుతూ ‘భారత్‌లో గత కొన్నేళ్లుగా ప్రపంచ శ్రేణి వినోదానికి ప్రైమ్ వీడియో ఒక కేంద్రమైంది. భారతీయ భాషల్లో అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలతో కోట్ల మంది ఆదరణ చూరగొంది. ఇప్పుడు క్రికెట్ కూడా ప్రసారం చేయనుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు. న్యూజిలాండ్ బోర్డుతో కుదిరిన ఈ ఒప్పందంతో ఇకపై భారత్‌లో క్రికెట్ అభిమానులకు కూడా ప్రైమ్ వీడియో దగ్గరవుతుందని చెప్పారు. ఎన్‌జెడ్‌సీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ వైట్ మాట్లాడుతూ ‘బోర్డు లక్ష్యాల్లో న్యూజిలాండ్ క్రికెట్ ఆదరణ విశ్వవ్యాప్తం చేయాలనేది కీలకమైంది. ఆ దిశగా సంబంధాలు పెంచుకునేందుకు అనుబంధమైన భాగస్వామ్యాలతో జతకడుతోంది. భారత్‌లో క్రికెట్‌కున్న ఆదరణ అందరికి తెలుసు. ఇప్పుడు దీన్ని పొందేందుకే అమెజాన్ ప్రైమ్ వీడియోతో ఒప్పందం కుదుర్చుకున్నాం’ అని తెలిపారు. -
కష్టంగా.. దూరంగా.. 150 రోజులు
కరోనావైరస్ వల్ల నాలుగు నెలలకు పైగా పని లేకుండా ఖాళీగా ఉన్న భారత క్రికెటర్లు ఇకపై బీజీ కానున్నారు. వారి పునరాగమనం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2020) రూపంలో జరగనుంది. యూఏఈ సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. అలాగే టి20 టోర్నమెంట్ , ఆస్ట్రేలియా టూర్‌తో పాటు మిగిలిన సంవత్సరానికి గాను క్రికెట్ క్యాలెండర్ సిద్దం చేశారు. కఠినమైన కోవిడ్ నిబంధనలు, ప్రోటోకాల్స్‌తో భారత క్రికెటర్లు ఇకపై ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉండాల్సి వస్తోంది. దాదాపు 150 రోజులకు పైగా ఇండియన్ క్రికెటర్లు తమ కుటుంబాలకు దూరంగా ఉండనున్నారు. (చదవండి : 'కోచ్ లేని లోటు ధోని తీర్చేవాడు') ఐపీఎల్ ప్రణాళికలో భాగంగా క్రికెటర్లు ఆగష్టు ఆరంభంలోనే అహ్మదాబాద్‌లోని మోటెరా స్టేడియంలో జరిగే జాతీయ శిబిరంలో చేరాలని భావిస్తున్నారు. ఆ తర్వాత వారు తమ ఫ్రాంచైజీలతో ఐపీఎల్ క్యాంప్ కోసం యుఎఈకి వెళతారు. దాదాపు నెల రోజుల ముందే అంటే.. ఆగస్టు 20 నాటికి క్రికెటర్లు యూఏఈకి చేరుకోవాల్సి ఉంటుంది. క్వారంటైన్లో ఉంచి ఆటగాళ్లను మ్యాచ్‌లకు సిద్ధం చేస్తారు. ఇక కొన్ని ఫ్రాంచైజీలు ఆగష్టు మొదటి, రెండో వారంలోనే దుబాయ్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ విషయానికొస్తే, ఇది 51 రోజులకు బదులుగా 53 రోజులు బీసీసీఐ భావిస్తోంది. మెుదట్లో టోర్నమెంట్ వ్యవధి 51 రోజులు నిర్ణయించారు. కానీ దాన్ని రెండు రోజులు పాటు పొడగించి 53 రోజుల పాటు టోర్నీని నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 2న ఐపీఎల్ పాలకమండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తేదీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముందుగా నవంబర్ 8న ఫైనల్ మ్యాచ్ అనుకున్నప్పటీకి దాన్ని నవంబర్ 10కి మార్చేందుకు బోర్డు సన్నహాలు చేస్తోంది. నవంబర 10న చివరి మ్యాచ్ జరిపితే.. అక్కడ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్లొచ్చని బీసీసీఐ భావిస్తోంది. అందువల్ల, ఐపిఎల్ సీజన్ 13 ఫైనల్ నవంబర్ 08 కి బదులుగా నవంబర్ 10 న ఆడే అవకాశం ఉంది. (చదవండి : ఏమిటి.. ఎలా.. ఎందుకు?) ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లనున్న భారత్ జట్టు అక్కడ తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వస్తోంది. డిసెంబర్ 3 నుంచి 7 వరకు టెస్ట్ సిరీస్, జనవరి 17 వరకు వన్డే సిరీస్ నిర్వహించాలని భావిస్తున్నారు. మొత్తంగా దాదాపు 68 రోజులు భారత క్రికెటర్లు ఆస్ట్రేలియాలోనే గడపనున్నారు. ఇటు ఐపీఎల్, అటు ఆస్ట్రేలియా టూర్‌తో భారత క్రికెటర్లు దాదాపు 5 నెలలు ఫ్యామిలీలకు దూరంగా ఉండనున్నారు. -
ఆరు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు
ముంబై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరితే, ఫస్ట్ డౌన్లో వచ్చిన కేఎల్ రాహుల్ కూడా సునాయాసమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రాహుల్ హాఫ్ సెంచరీకి చేరువ అవుతున్న సమయంలో ఆగర్ వేసిన బంతికి సింపుల్ క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఆగర్ వేసిన 28 ఓవర్ తొలి బంతిని కవర్స్ మీదుగా తేలికపాటి షాట్ కొట్టాడు. కాగా, అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న స్టీవ్ స్మిత్ దాన్ని క్యాచ్‌గా అందుకోవడంతో రాహుల్ హాఫ్ సెంచరీని తృటిలో మిస్సయ్యాడు. అంతకుముందు రోహిత్ శర్మ సైతం ఇదే తరహాలో ఔటయ్యాడు. స్టార్ట్ వేసిన ఐదో ఓవర్ మూడో బంతిని మిడాఫ్ మీదుగా ఆడటానికి రోహిత్ యత్నించాడు. కాగా, అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ చివరి నిమిషంలో క్యాచ్ అందుకోవడంతో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తరుణంలో ధావన్‌కు జత కలిసిన రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడ్డాడు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ భారత్ స్కోరును ముందుకు నడిపించారు. ఈ జోడి 121 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత రాహుల్(47; 61 బంతుల్లో 4 ఫోర్లు) రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. అయితే ఓపెనర్ ధావన్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ధావన్ 66 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. కాగా, ధావన్ 74 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా మూడో వికెట్‌గా ఔటయ్యాడు. దాంతో ఆరు పరుగుల వ్యవధిలో భారత్ రెండు కీలక వికెట్లను కోల్పోయింది. భారత్ 29 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.(ఇక్కడ చదవండి: ఈసారి ‘సెంచరీ’ లేదు!) -
విరాట్ కోహ్లి మరో రికార్డు
కోల్‌కతా: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. నిన్నటి ఆటలో కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఐదు వేల పరుగుల్ని సాధించి రికార్డు నమోదు చేసిన కోహ్లి.. ఈరోజు ఆటలో సెంచరీ సాధించాడు. శుక్రవారం సాధించిన హాఫ్ సెంచరీని సెంచరీగా మలచుకున్న కోహ్లి.. భారత్‌లో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టులోనే శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఓవర్‌నైట్ ఆటగాడిగా దిగిన కోహ్లి 159 బంతుల్లో 12 ఫోర్లుతో సెంచరీ నమోదు చేశాడు. ఈ రోజు భారత్ ఇన్నింగ్స్‌ను రహానే-కోహ్లిలు ఓవర్‌నైట్ ఆటగాళ్లుగా కొనసాగించారు. కాగా, రహానే(51) హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత పెవిలియన్ చేరగా, కోహ్లి నిలకడగా ఆడాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలోనే కోహ్లి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తైజుల్ ఇస్లామ్ వేసిన 68 ఓవర్ మూడో బంతికి రెండు పరుగులు తీయడం ద్వారా కోహ్లి మరో వ్యక్తిగత సెంచరీని నమోదు చేశాడు. ఇది కోహ్లికి టెస్టుల్లో 27వ సెంచరీ కాగా, ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో 70వ శతకం. వన్డేల్లో ఇప్పటివరకూ కోహ్లి 43 శతకాలు సాధించిన సంగతి తెలిసిందే. భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(14), రోహిత్ శర్మ(21), చతేశ్వర్ పుజారా(55), రహానేలు పెవిలియన్ చేరారు. -
గిల్‌క్రిస్ట్‌నే కలవరపెట్టిన భారత బౌలర్..!!
మెల్బోర్న్ : తన కెరీర్లో ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్లలో భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఒకరని ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ తెలిపారు. అదేవిధంగా శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్‌లో కూడా ఇబ్బంది పడినట్లు వెల్లడించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌లో 2001లో జరిగిన బోర్డర్- గవాస్కర్ సిరీస్‌లో 32వికెట్లు పడగొట్టిన భజ్జీ ఆసీస్‌కు కొరకరాని కొయ్యలా మారాడని ఈ సందర్భంగా గిల్‌క్రిస్ట్ గుర్తు చేసుకున్నాడు. 2001లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ముంబైలో జరిగిన తొలి టెస్టులో గిల్‌క్రిస్ట్ సెంచరీతో చెలరేగడంతో స్టీవ్ వా నాయకత్వంలోని ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లలో హర్భజన్ చెలరేగడంతో భారత్ తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో గంగూలీ సారథ్యంలోని టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ.. 'ముంబైలో జరిగిన మొదటి మ్యాచ్‌లో మేము 99/5 స్థితిలో ఉన్న సమయంలో నేను క్రీజులోకి వెళ్లాను. 80 బంతుల్లో 100 పరుగులు చేశాను. అయితే ఆ టెస్టును మూడు రోజుల్లోనే గెలిచాం. ఇంత సులభంగా మ్యాచ్ గెలవగానే.. గత 30 సంవత్సరాలుగా మా జట్టు భారత్‌లో ఎందుకు సిరీస్ గెలవలేదు అని ప్రశ్నించుకునేవాడిని. కానీ.. తర్వాత భారత్‌లో టెస్టు సిరీస్ ఎంత కఠినమో త్వరగానే అర్థమైపోయింది. తర్వాతి టెస్టు మ్యాచ్ కోసం కోల్‌కతాకు వెళ్లాం. అక్కడ మమ్మల్ని భజ్జీ తన బౌలింగ్‌తో కలవర పెట్టాడు నా కెరీర్లో నేను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన బౌలర్ భజ్జీనే. ఆ తర్వాత శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. వీళ్లిద్దరూ నేను ఎదుర్కొన్న కష్టతరమైన బౌలర్లు. ఈ సిరీస్ ఓటమి తర్వాత టెస్ట్ క్రికెట్ విషయంలో మేము అనేక విషయాలను తెలుసుకున్నాం. ప్రతిసారి దాడి చేయడమే కాకుండా తమ వ్యూహాలను మార్చుకొని ఆడాల్సిన అవసరం ఉందని తెలుసుకున్నాం. 2001లో సిరీస్ చేజారి పోయాక మా వ్యూహాలను మార్చాం. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు దాడి చేయడం ఒకటే సరైన మార్గం కాదని తెలుసుకున్నాం. తర్వాత 2004లో భారత పర్యటనలో భాగంగా 35 సంవత్సరాల తర్వాత సిరీస్‌ను గెలవడం చాలాగొప్ప విషయం’అని గిల్‌క్రిస్ట్ పేర్కొన్నాడు. కాగా, ఈ సిరీస్‌లో చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో క్లిష్ట సమయంలో 49 పరుగులు చేసిన ఆడమ్, అవి తనకెంతో ప్రత్యేకమన్నారు. ఈ పర్యటనలో ఆసీస్ 2-1 తేడాతో టీమిండియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే. -
భారత్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం
బెంగుళూరు: మూడో టీ20లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోసుకోవాలనుకున్న టీమిండియాకు సఫారీలు షాకిచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లకు 134 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్ ధావన్ 36, రిషభ్ పంత్ 19, రవీంద్ర జడేజా 19 టాప్ స్కోరర్లు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా కేవలం వికెట్ (రీజా హెన్రిక్స్ 28) మాత్రమే నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ క్వింటన్ డీకాక్ 79 (6 బౌండరీలు, 5 సిక్సర్లు) తో విరుచుకుపడ్డాడు. అతనికి తోడు వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ బావుమా (27) చెలరేగడంతో పర్యాటక జట్టు మరో 3.1 ఓవర్లు మిగిలి ఉండగానే విజయతీరాలకు చేరింది. 14 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు (రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా) తీసిన బ్యూరెన్ హెన్రిక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. క్వింటన్ డీకాక్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా ఎంపికయ్యాడు. -
భారత్... వన్డే టాప్ ర్యాంకర్
మాంచెస్టర్ : ప్రపంచ కప్ ఆతిథ్య దేశం ఇంగ్లండ్‌ను తోసిరాజంటూ వన్డేల్లో టీమిండియా టాప్ ర్యాంక్‌కు చేరింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం 123 పాయింట్లతో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్ 122 పాయింట్లతో రెండో స్థానానికి పడి పోయింది. న్యూజిలాండ్ (114), ఆస్ట్రేలియా (112) వరుసగా తర్వాతి ర్యాంకుల్లో ఉన్నాయి. గురువారం వెస్టిండీస్‌పై నెగ్గిన భారత్ ఈ నెల 30న ఇంగ్లండ్‌పైనా గెలిస్తే 124 పాయింట్లతో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. అప్పుడు ఇంగ్లండ్ 121 పాయింట్లకు పరిమితం అవుతుంది. ఆ జట్టు నెగ్గితే 123 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకును తిరిగి కైవసం చేసుకుంటుంది. ఒకవేళ విండీస్‌పై ఓడి, ఇంగ్లండ్‌పై గెలిచినా 122 పాయింట్లతో భారత్ అగ్రస్థానానికి ఢోకా ఉండకపోయేది. రెండింటిలోనూ ఓడితే మాత్రం పాయింట్లు 120కి పడిపోడిపోయేవి. -
రోహిత్ శర్మ అవుట్, ధావన్ ఇన్
బెంగళూరు: భారత్‌తో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది. తమ జట్టులో ఎటువంటి మార్పులు లేవని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తెలిపాడు. టీమిండియాలో మూడు మార్పులు చోటు చేసుకున్నాయి. రోహిత్ శర్మ, మార్కండే, ఉమేశ్ యాదవ్‌లకు జట్టులో చోటు దక్కలేదు. శిఖర్ ధావన్, విజయ శంకర్, సిద్ధార్థ కౌల్ తుది జట్టులో స్థానం సంపాదించారు. విశాఖపట్నంలో జరిగిన తొలి టి20ని త్రుటిలో చేజార్చుకున్న కోహ్లి సేన ఈరోజు మ్యాచ్‌లో గెలిసి సిరీస్‌ను సమం చేయాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఆసీస్ భావిస్తోంది. (విజయమే సమంజసం) -
సన్నాహం సంతోషం
బౌలింగ్ మాటెలా ఉన్నా... టీమిండియాకు ఆస్ట్రేలియా గడ్డపై నిండైన బ్యాటింగ్ ప్రాక్టీస్ దొరికింది. సీఏ ఎలెవెన్‌తో సరైన సన్నాహం లభించింది. మురళీ విజయ శతకం, కేఎల్ రాహుల్ అర్ధ శతకాలతో... పనిలో పనిగా ఓపెనింగ్ జోడీ ఎవరనే సందిగ్ధమూ వీడింది. ఇక మిగిలింది... కంగారూలను ఎలాంటి బెరుకు లేకుండా ఎదుర్కొనడమే! పూర్తి ఆత్మవిశ్వాసంతో టెస్టు సిరీస్ బరిలో దిగడమే..! సిడ్నీ: అనుభవం లేని ప్రత్యర్థిని మన బౌలర్లు నిలువరించలేకపోయినప్పటికీ, బ్యాట్స్‌మెన్ అందరికీ బాగా ఉపయోగపడిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఎలెవెన్‌తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. తుది జట్టులో చోటు దక్కించుకోవడంతో పాటు తమ ఫామ్ చాటుకోవాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో... వచ్చిన అవకాశాన్ని ఓపెనర్లు మురళీ విజయ్ (132 బంతుల్లో 129; 16 ఫోర్లు, 5 సిక్స్‌లు), లోకేశ్ రాహుల్ (98 బంతుల్లో 62; 8 ఫోర్లు, సిక్స్) సద్వినియోగం చేసుకున్నారు. వందకుపైగా పరుగుల భాగస్వామ్యంతో... తొలి టెస్టుకు ముందు టీమిండియాకు ఇన్నింగ్స్‌ను ప్రారంభించేదెవరనే పెద్ద బెంగ తీర్చారు. భారత రెండో ఇన్నింగ్స్‌లో విజయ్ ఔటయ్యాక స్కోరు 211/2 వద్ద ఉండగా మ్యాచ్‌ను ముగించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 356/6తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సీఏ ఎలెవెన్ 544 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హ్యారీ నీల్సన్ (170 బంతుల్లో 100; 9 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరోన్ హార్డీ (141 బంతుల్లో 86; 10 ఫోర్లు, సిక్స్)తో అతడు ఏడో వికెట్‌కు 179 పరుగులు జోడించాడు. ఆ తర్వాత టెయిలెండర్లు ఫాలిన్స్ (43; 7 ఫోర్లు), రాబిన్స్ (38 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్), కోల్మన్ (36; 2 ఫోర్లు) భారత బౌలర్లను విసిగించారు. చివరి మూడు వికెట్లకు వీరు 90 పరుగులు జత చేయడం గమనార్హం.దీంతో ఆ జట్టుకు 186 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. శనివారం పేసర్ బుమ్రా, చైనామన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌కు దిగారు. భువనేశ్వర్ బౌలింగ్ చేయలేదు. విజయ్ ఐదు ఓవర్లు వేశాడు.మొత్తమ్మీద టీమిండియా తరఫున 10 మంది బౌలింగ్ చేయగా, శతక వీరుడు నీల్సన్‌ను కోహ్లి ఔట్ చేయడం విశేషం. విజయ్ ధనాధన్... భారత రెండో ఇన్నింగ్స్‌లో విజయ్ సంయమనం చూపగా... రాహుల్ దూకుడుగా ఆడాడు. అయితే, అర్ధ శతకం అనంతరం రాహుల్ ఔటయ్యాడు. తొలి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నమోదు కాగా ఇందులో రాహుల్‌వే 62 పరుగులు ఉండటం గమనార్హం. ఇక్కడి నుంచి విజయ్ విజృంభణ ప్రారంభమైంది. రాహుల్ వెనుదిరిగేటప్పటికి 86 బంతుల్లో 46 పరుగులతో ఉన్న అతడు... తర్వాత విరుచుకుపడ్డాడు.కార్డర్ వేసిన ఓవర్లో రెండు సిక్స్‌లు, మూడు ఫోర్లు సహా 26 పరుగులు రాబట్టాడు. 118 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో యాభైని అతడు 27 బంతుల్లోనే చేరుకున్నా డు.వన్‌డౌన్‌లో వచ్చిన హనుమ విహారి (15 నాటౌట్) పూర్తి సహకారం అందించాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ 102 పరుగులు జోడించారు. విహారి ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ, సిక్స్ కూ డా లేకపోగా... అదే సమయంలో మరో ఎండ్‌లో ఉన్న విజయ్ 10 ఫోర్లు, 5 సిక్స్‌లు కొట్టడం విశేషం. నాలుగో రోజు రెండు జట్లు కలిపి 399 పరుగులు చేశాయి. వీరే(నా) ఓపెనర్లు! రెండో ఇన్నింగ్స్‌లో ఆటతో... విజయ్, రాహుల్‌లకు ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో ఈ నెల 6న ప్రారంభం కానున్న తొలి టెస్టులో భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలు మెరుగయ్యాయి. వాస్తవానికి శుక్రవారం వరకు వీరిద్దరిలో పృథ్వీ షాకు తోడెవరనే ప్రశ్నలు వచ్చాయి. ఫామ్‌లో లేకున్నా ఎక్కువ మొగ్గు రాహుల్ వైపే ఉంది. గతంలో ఇక్కడ పర్యటించిన అనుభవం ఉన్నా విజయ్ను మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.\ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో అతడిని బ్యాటింగ్‌కు పంపకపోవడమే దీనికి నిదర్శనం. అయితే, ఈలోగా పృథ్వీ గాయపడటంతో రకరకాల ప్రత్యామ్నాయాలు ఆలోచనలోకి వచ్చాయి. వీటన్నిటికీ అడ్డుకట్ట వేస్తూ... శతకం బాదిన విజయ్ తన పునరాగమనానికి మార్గం సుగమం చేసుకున్నాడు. మేనేజ్మెంట్ ఇంకేమైనా ప్రయోగాలు చేయాలని భావిస్తే తప్ప అడిలైడ్‌లో విజయ్ బరిలో దిగడం ఖాయం. సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 358; సీఏ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 544 ఆలౌట్ (151.1 ఓవర్లలో) (డార్సీ షార్ట్ 74, బ్రయాంట్ 62, నీల్సన్ 100, హార్డీ 86, అశ్విన్ 2/122); భారత్ రెండో ఇన్నింగ్స్: 211/2 (43.4 ఓవర్లలో) (మురళీ విజయ్ 129, రాహుల్ 62, విహారి 15 నాటౌట్). -
కోహ్లితో సెల్ఫీ.. ఛలో ఢిల్లీ
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో సెల్ఫీకి అభిమానులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తారు. తనదైన బ్యాటింగ్ శైలితో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోహ్లి అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తనతో సెల్ఫీ దిగాలనుకునేవారిని ఢిల్లీకి రమ్ముంటున్నాడు కోహ్లి. విషయం ఏమిటంటే.. కొద్ది రోజుల క్రితం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు విరాట్ కోహ్లి మైనపు విగ్రహాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని మ్యూజియంలో పెట్టేందుకు కొలతలు తీసుకున్న విషయం తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మ్యూజియంలో పెట్టేందుకు కోహ్లి విగ్రహం సిద్ధమైందట. రేపు (బుధవారం) ఆ మ్యూజియంలో కోహ్లి మైనపు బొమ్మను ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కోహ్లినే స్వయంగా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నాతో సెల్ఫీలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? అయితే, ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నేను ఎక్కడ ఉన్నానో కనిపెట్టండి. జూన్ 6 నుంచి నేను మీకు అక్కడ అందుబాటులో ఉంటాను. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఓ వీడియోను పోస్టు చేశాడు. అయితే అభిమానులు మాత్రం తమకు కోహ్లితోనే సెల్ఫీలు కావాలని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మ్యూజియంలో టీమిండియా దిగ్గజాలు కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్‌లతో ఫుట్ బాల్ దిగ్గజాలు మెస్సీ, డెవిడ్ బెక్కమ్ల మైనపు విగ్రహాలు కొలువుదీరాయి. Come 6th of June, let’s play statue! 😉 Excited to be at #MadameTussauds 😃#TussaudsDelhi@MadameTussauds@tussaudsdelhi pic.twitter.com/074c3lQF0o — Virat Kohli (@imVkohli) 5 June 2018 -
షమీ వివాదానికి కారణమిదే..
కోల్‌కతా : టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే భార్య హసీన్ ఆరోపణలతో షమీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో అతని కెరీర్ సందిగ్దంలో పడింది. షమీ దంపతులు మధ్య వివాదం చెలరేగడానికి ‘ఫామ్ హౌజ్ కారణమ’ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో షమీ దంపతులకు ‘హసీన్ ఫామ్ హౌజ్’ ఉంది. దాని విలువ సుమారు రూ. 12 కోట్ల నుంచి 15 కోట్లు ఉంటుందని అంచనా. హసీన్ పేరుతో ఉన్నా ఈ ఫామ్ హౌజ్‌కు సంబంధించిన పత్రాలలో ఆమె పేరు ఎక్కడా లేదని, భవిష్యత్తులో ఇక్కడే షమీ క్రికెట్ అకాడమీ నిర్మించాలనుకున్నాడని తెలుస్తోంది. ఈ విషయమై దంపతుల మధ్య గొడవలు మొదలైనట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది. షమీ మంచివాడే: హసీన్ తండ్రి వివాదంపై స్పందించాలని హసీన్ తండ్రిని మీడియా ప్రతినిధులు కోరగా.. ఈ విషయం గురించి తనకు ఏమాత్రం తెలియదన్నారు. షమీ, హసీన్లకే అసలు నిజం తెలుసన్నారు. మహ్మద్ షమీ ఎలాంటివాడని ప్రశ్నించగా అతడు ఒకప్పుడు మంచివాడేనని సమాధానమిచ్చారు. ఇక తన కూతురు చిన్ననాటి నుంచే ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఉండేదని, స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించేదన్నారు. -
బాగా ఆడినా తప్పించారు
న్యూఢిల్లీ: బాగా ఆడినప్పటికీ జాతీయ జట్టులో చోటు కోల్పోవడం తనను బాధించిందని భారత క్రికెటర్ సురేశ్ రైనా గుర్తు చేసుకున్నాడు. యో–యో టెస్టులో అర్హత సాధించి ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్‌కు ఎంపికవడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు. జట్టుకు దూరమైన ఇన్నాళ్ల కాలంలో భారత్‌కు ఆడాలనే కోరిక మనసులో మరింత బలంగా నాటుకుందని వివరించాడు. ‘జట్టులో చోటు సాధించేందుకు చాలా కృషి చేశా. సాధ్యమైనంత కాలం భారత్‌కు ఆడుతూనే ఉంటా. నాలో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. 2019 వన్డే ప్రపంచకప్ కూడా ఆడాలని కోరుకుంటున్నా. ఇంగ్లండ్‌లో నాకు మంచి రికార్డు ఉంది. దక్షిణాఫ్రికాతో టి20ల్లో బాగా ఆడతాననే నమ్మకముంది’ అని రైనా ఆశాభావం వ్యక్తం చేశాడు. 31 ఏళ్ల సురేశ్ రైనా గత ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో భారత్ తరఫున ఆడాడు. -
ధోనికి అండగా రోహిత్, రవిశాస్త్రి.. ఘాటుగా ఆన్సర్
సాక్షి, న్యూఢిల్లీ : కెరీర్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి అండగా నిలిచారు. ధోనిని విమర్శిస్తున్న మాజీ క్రికెటర్లకు కనువిప్పు కలిగేలా సమాధానం చెప్పారు. తొలుత రోహిత్ శర్మ స్పందిస్తూ.. ‘ధోనిపై వస్తున్న విమర్శలు మేం పట్టించుకోం. ఆయన 2019 ప్రపంచ కప్ ధోని ఆడతాడా? అంటూ కొంతమందికి వస్తున్న సందేహాలు మమ్మల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. ధోని మంచి ఫామ్‌లోనే ఉన్నారు. ఆ విషయంలో ఎవరికీ సంకోచం అక్కర్లేదు. 4, 6 స్థానాల్లో ధోనికి అసలు వచ్చే బంతులే తక్కువ. దాంతో ఆయనకు పెద్దగా ఆడే అవకాశమే ఉండదు’ అని అన్నారు. మరోపక్క, రవిశాస్త్రి కూడా ధోనిని సమర్థిస్తూ .. ‘ధోనిపై విమర్శలు చేస్తున్నవారు.. తామూ ఆటగాళ్ళమే అని మరిచిపోవద్దు. 36 ఏళ్ల వయసులో వారైతే ఏం చేసేవారో ఆలోచించుకోవాలి’ అని ఆయన ఘాటుగా స్పందించాడు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన టి-20లో 49 బంతుల్లో 37 పరుగులే చేసి టీమిండియా ఓటమికి కారణమయ్యాడంటూ ధోని పై తీవ్ర విమర్శలు రాగా ఆ సమయంలో విరాట్ కోహ్లి మాజీ కెప్టెన్‌కు పూర్తి మద్దతిచ్చిన విషయం తెలిసిందే. -
దటీజ్ కోహ్లీ: పది రోజుల్లోనే మళ్లీ సాధించాడు!
దుబాయ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ గా నిలిచాడు. తాను కోల్పోయిన అగ్రస్థానాన్ని కేవలం పదిరోజుల్లోనే కోహ్లీ తిరిగి సొంతం చేసుకోవడం విశేషం. న్యూజిలాండ్ పై సొంతగడ్డపై ఇటీవల జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 2-1తో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ఛేజింగ్ స్టార్ కోహ్లీ రెండు సెంచరీలతో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సిరీస్ లో పరుగుల వరద పారించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న కోహ్లీ.. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా విధ్వంసక క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ను వెనక్కి నెట్టి కోహ్లీ ఈ టాప్ ర్యాంకుకు ఎగబాకాడు. దీంతోపాటు కెరీర్ లోనే ఏ భారత బ్యాట్స్ మెన్ కు సాధ్యం కాని వన్డే రేటింగ్ పాయింట్లు కోహ్లీ సాధించాడు. 889 అత్యుత్తమ రేటింగ్ పాయింట్లతో భారత్ తరఫున అత్యధిక రేటింగ్ పాయింట్లు సొంతం చేసుకున్న క్రికెటర్ గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు సచిన్ (887 రేటింగ్ పాయింట్లు) పేరిట ఉండేది. ఇటీవల 887 పాయింట్లు సాధించి సచిన్ సరసన నిలిచిన కోహ్లీ తాజా సిరీస్ లో వీర విహారంతో 889 పాయింట్లకు చేరాడు. సఫారీ క్రికెటర్ డివిలియర్స్(872 పాయింట్లు), ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(865 పాయింట్లు) కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. జట్టు ర్యాకింగ్స్ లో దక్షిణాఫ్రికా, టీమిండియాలు 120 పాయింట్లతో ఉన్నప్పటికీ రేటింగ్ పాయింట్లలో స్వల్ప ఆధిక్యంలో ఉన్న సఫారీలు పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకోగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఐసీసీ తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో రోహిత్ శర్మ(7), ఎంఎస్ ధోనీ (11), శిఖర్ ధావన్(15)లు మాత్రమే టాప్-20లో చోటు దక్కించుకున్నారు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ పట్టికలో బూమ్రా మూడో ర్యాంకు సాధించి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ ను నమోదు చేశాడు. బూమ్రా(3), అక్షర్ పటేల్(8), భువనేశ్వర్ కుమార్(15)లు మాత్రమే టాప్ 20లో చోటు దక్కించుకున్నారు. -
అందువల్లే ఓడిపోయాం: కోహ్లి
బెంగళూరు:ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో వన్డేలో భారత స్సిన్నర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి తనదైన శైలిలో స్పందించాడు. భారత్ సాధించే ప్రతీ విజయంలో స్పిన్నర్లు రాణించాలనుకోవడం సరైనది కాదన్నాడు. అన్ని రోజులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయనుకోవడం పొరపాటు అవుతుందన్నాడు. అయితే పేసర్లు ఉమేశ్ యాదవ్, మొహ్మద్ షమీల బౌలింగ్ ను కోహ్లి ప్రత్యేకంగా కొనియాడాడు. వారిద్దరూ బౌలింగ్ బాగా చేశారంటూ కితాబిచ్చాడు. 'ఉమేశ్, షమీల బౌలింగ్ ఆకట్టుకుంది. ఆ ఇద్దరూ తమవంతు న్యాయం చేశారు. కాకపోతే ఎల్లప్పుడూ స్పిన్నర్లు రాణించాలనుకోవడం కరెక్ట్ కాదు. అన్ని రోజులు స్పిన్నర్లదే కాదు.ఇక్కడ ఆసీస్ బ్యాటింగ్ చాలా బాగుంది. బ్యాట్ తో వారు ప్రణాళిక అమలు చేసిన విధానం చాలా చక్కగా ఉంది. మా వ్యూహాల్ని వారు వెనక్కినెట్టి పైచేయి సాధించారు. నిన్నటి మ్యాచ్ లో మేము మరీ చెత్తగా అయితే ఆడలేదు. కానీ ఆసీస్ మా కంటే మంచిగా ఆడింది' అని మ్యాచ్ అనంతరం కోహ్లి పేర్కొన్నాడు. అయితే విజయానికి చేరువగా వచ్చి ఓడి పోవడంపై కూడా కోహ్లి స్పందించాడు. తమకు చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యం లభించినప్పటికీ ఆపై సరైన భాగస్వామ్యం నమోదు చేయడంలో విఫలమైనట్లు పేర్కొన్నాడు. తమకు ఓటమికి ప్రధాన కారణం ఓపెనింగ్ తరహా భాగస్వామ్యం మరొకటి రాకపోవడమేనని కోహ్లి అన్నాడు. అందువల్లే ఓటమిని చూడాల్సి వచ్చిందన్నాడు. తమ జట్టు ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయకపోవడం వల్లే పరాజయం చవిచూశామన్నాడు. ఓవరాల్ గా చూస్తే పేసర్ల ప్రదర్శన తమకు ఊరటనిచ్చే అంశమని ఒక ప్రశ్నకు సమాధానంగా కోహ్లి పేర్కొన్నాడు. ఇక పిచ్ విషయంలో తొలుత భయపడ్డప్పటికీ, ఆపై ఆడేటప్పుడు మాత్రం ఎటువంటి ఇబ్బంది అనిపించలేదన్నాడు. ఇది తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. -
కాసేపట్లో సమవుజ్జీల సమరం
ధర్మశాల: మూడు ట్వంటీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య జరిగే తొలి ట్వంటీ 20 మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. సమవుజ్జీలైన ఇరు జట్లు గెలుపుతో సిరీస్ ను శుభారంభం చేయాలని భావిస్తున్నాయి. మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని టీమిండియా, డు ప్లెసిస్ సారథ్యంలోని దక్షిణాఫ్రికాలు గెలుపుపై పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. ధర్మశాల వేదికగా జరిగే డే అండ్ నైట్ ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా కనబడుతోంది. శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, ధోని, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, సురేష్ రైనాలతో టీమిండియా బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, అశ్విన్ లు టీమిండియా కీలక బౌలర్లు. దక్షిణాఫ్రికా విషయానికొస్తే ఏబీ డివిలియర్స్, డు ప్లెసిస్, జేపీ డుమినీ, డి కాక్ లు బ్యాటింగ్ కు ప్రధాన బలం. కాగా, బౌలింగ్ లో అబాట్, ఇమ్రాన్ తాహీర్ లే జట్టులో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో తొలి ట్వంటీ 20 మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.