
సురేశ్ రైనా
న్యూఢిల్లీ: బాగా ఆడినప్పటికీ జాతీయ జట్టులో చోటు కోల్పోవడం తనను బాధించిందని భారత క్రికెటర్ సురేశ్ రైనా గుర్తు చేసుకున్నాడు. యో–యో టెస్టులో అర్హత సాధించి ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరిగే టి20 సిరీస్‌కు ఎంపికవడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నాడు. జట్టుకు దూరమైన ఇన్నాళ్ల కాలంలో భారత్‌కు ఆడాలనే కోరిక మనసులో మరింత బలంగా నాటుకుందని వివరించాడు. ‘జట్టులో చోటు సాధించేందుకు చాలా కృషి చేశా.
సాధ్యమైనంత కాలం భారత్‌కు ఆడుతూనే ఉంటా. నాలో ఇంకా చాలా ఆట మిగిలి ఉంది. 2019 వన్డే ప్రపంచకప్ కూడా ఆడాలని కోరుకుంటున్నా. ఇంగ్లండ్‌లో నాకు మంచి రికార్డు ఉంది. దక్షిణాఫ్రికాతో టి20ల్లో బాగా ఆడతాననే నమ్మకముంది’ అని రైనా ఆశాభావం వ్యక్తం చేశాడు. 31 ఏళ్ల సురేశ్ రైనా గత ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో భారత్ తరఫున ఆడాడు.
Comments
Please login to add a commentAdd a comment