
India-West Indies T20 series: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న మాడు టీ20ల సిరీస్‌కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్- వెస్టిండీస్ మధ్య జరగబోయే మ్యాచ్‌లకు 75 శాతం ప్రేక్షకులను అనుమతించేందుకు బెంగాల్ ప్రభుత్వం అంగీకరించింది. అన్ని ఇండోర్, అవుట్‌డోర్ స్టేడియాల్లో జరిగే క్రీడలకు 75 శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మ్యాచ్‌లకు సుమారు 50,000 మంది ప్రేక్షకుల హాజరయ్యే అవకాశం ఉంది.
గత ఏడాది ఇంగ్లండ్‌తో సిరీస్‌తో తర్వాత ఈ వేదికలో తొలిసారి అభిమానుల మధ్య టీమిండియా ఆడనుంది. కరోనా వైరస్ కారణంగా ప్రేక్షకులు లేని ఖాళీ క్రికెట్ స్టేడియంలలోనే బీసీసీఐ మ్యాచ్‌లు నిర్వహించింది. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 16న జరగనుంది. ఇక భారత పర్యటనలో భాగంగా విండీస్ జట్టు మూడు వన్డేలు, టీ20లు ఆడనుంది. ఇక ఆహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న తొలి వన్డే జరగనుంది.
చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్