
India Vs West Indies 2nd T20: ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా శ్రేయస్ అయ్యర్ స్ధానంలో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. కాగా శ్రేయస్‌కు తుది జట్టులో చోటు దక్కపోవడానికి గల కారణాన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. "శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాడిని బయట కూర్చోబెట్టడం చాలా కఠినమైన నిర్ణయం.
కానీ మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చేసే ఆటగాడిని తుది జట్టులోకి తీసుకోవాలని మేము భావించాం. ఈ క్రమంలోనే శ్రేయస్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. జట్టులో అయ్యర్ స్ధానానికి తీవ్రమైన పోటీ ఉంది. ఫామ్‌లో లేని ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం కంటే ఇలా పోటీ ఉండటం సంతోషించే విషయం. ఇక త్వరలో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ గురించి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం. మేము శ్రేయస్ అయ్యర్‌తో ప్రపంచకప్ ప్రణాళికల గురించి చర్చించాం. జట్టు అవసరనానికి తగ్గట్టు ఏ నిర్ణయం తీసుకున్న అందరు ఆటగాళ్లు దానికి కట్టుబడి ఉన్నారు" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
చదవండి: Surajit Sengupta: భారత ఫుట్ బాల్ దిగ్గజం సురజిత్ కన్నుమూత