Ind vs WI 3rd ODI: India Beat West Indies Clinch Series 3-0- అహ్మదాబాద్: బౌలింగ్‌కు కలిసొచ్చిన పిచ్‌పై భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వెస్టిండీస్‌పై పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. ఆఖరి వన్డేలో 96 పరుగులతో జయభేరి మోగించి సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. పగ్గాలు చేపట్టగానే రోహిత్ శర్మ చరిత్రకెక్కే వైట్‌వాష్ సాధించాడు. 1983 నుంచి వెస్టిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతున్న భారత్ తొలిసారి ఆ జట్టుపై వన్డేల్లో క్లీన్‌స్వీప్ సాధించడం విశేషం. శుక్రవారం జరిగిన మూడో వన్డేలో మొదట భారత్ 50 ఓవర్లలో 265 పరుగుల వద్ద ఆలౌటైంది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (111 బంతుల్లో 80; 9 ఫోర్లు), రిషభ్ పంత్ (54 బంతుల్లో 56; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. హోల్డర్ 4 వికెట్లు తీశాడు. తర్వాత వెస్టిండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకే కుప్పకూలింది. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ ప్రసిధ్ కృష్ణ (3/27), సిరాజ్ (3/29) నిప్పులు చెరిగారు. ఈ రెండు జట్ల మధ్య ఈనెల 16 నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది.
అదరగొట్టిన అయ్యర్
కోవిడ్‌తో రెండు వన్డేలకూ దూరమైన శ్రేయస్ అయ్యర్ మూడో వన్డేలో తన జోరును ప్రదర్శించాడు. జోసెఫ్ ధాటికి రోహిత్ (13), కోహ్లి (0) నిష్క్రమించగా, ధావన్ (10)ను స్మిత్ వెనక్కి పంపడంతో 42/3 స్కోరు వద్డే టాపార్డర్ కూలింది. ఈ దశలో శ్రేయస్, పంత్ నాలుగో వికెట్‌కు 110 పరుగులు జోడించి భారత్‌ను నిలబెట్టారు. తర్వాత స్వల్ప వ్యవధిలో వీరిద్దరితో పాటు సూర్యకుమార్ (6) అవుటవడంతో ఈసారి వాషింగ్టన్ సుందర్ (34 బంతుల్లో 33; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చహర్ (38 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆదుకున్నారు.
జోసెఫ్, వాల్ష్ రెండేసి వికెట్లు తీశారు. తర్వాత ఆతిథ్య బౌలర్లు కూడా పిచ్ సహకారంతో రెచ్చిపోయారు. సిరాజ్, దీపక్ చహర్, ప్రసిధ్ తలా ఒక వికెట్ తీసి విండీస్ టాపార్డర్‌ను 25 పరుగులకే పడేశారు. హోప్ (5), కింగ్ (14), బ్రేవో (19) వెనుదిరిగాక తర్వాత వచి్చన వారిలో నికోలస్ పూరన్ (34; 2 ఫోర్లు, 1), ఒడెన్ స్మిత్ (36; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), జోసెఫ్ (29; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) జోసెఫ్ 13; ధావన్ (సి) హోల్డర్ (బి) స్మిత్ 10; కోహ్లి (సి) షై హోప్ (బి) జోసెఫ్ 0; అయ్యర్ (సి) బ్రేవో (బి) వాల్ష్ 80; పంత్ (సి) షై హోప్ (బి) వాల్ష్ 56; సూర్యకుమార్ (సి) బ్రూక్స్ (బి) అలెన్ 6; సుందర్ (సి) స్మిత్ (బి) హోల్డర్ 33; చహర్ (సి) షై హోప్ (బి) హోల్డర్ 38; కుల్దీప్ (సి) షై హోప్ (బి) హోల్డర్ 5; సిరాజ్ (బి) హోల్డర్ 4; ప్రసిధ్ కృష్ణ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో ఆలౌట్) 265.
వికెట్ల పతనం: 1–16, 2–16, 3–42, 4– 152, 5–164, 6–187, 7–240, 8–250, 9– 261, 10–265. బౌలింగ్: రోచ్ 7–0–39–0, జోసెఫ్ 10–1–54–2, స్మిత్ 7–0–36–1, హోల్డర్ 8–1– 34–4, అలెన్ 8–0–42–1, వాల్ష్ 10–0–59–2.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: షై హోప్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 5; బ్రాండన్ కింగ్ (సి) సూర్యకుమార్ (బి) చహర్ 14; బ్రేవో (సి) కోహ్లి (బి) ప్రసిధ్ కృష్ణ 19; బ్రూక్స్ (సి) అయ్యర్ (బి) చహర్ 0; పూరన్ (సి) రోహిత్ (బి) కుల్దీప్ 34; హోల్డర్ (సి) రోహిత్ (బి) ప్రసి«ద్‌కృష్ణ 6; అలెన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 0; జోసెఫ్ (సి) కోహ్లి (బి) ప్రసిధ్ కృష్ణ 29; స్మిత్ (సి) ధావన్ (బి) సిరాజ్ 36; వాల్ష్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 13; రోచ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (37.1 ఓవర్లలో ఆలౌట్) 169.
వికెట్ల పతనం: 1–19, 2–25, 3–25, 4–68, 5–76, 6–77, 7–82, 8–122, 9–169, 10–169. బౌలింగ్: చహర్ 8–1–41–2, సిరాజ్ 9–1–29–3, ప్రసిధ్ కృష్ణ 8.1–1–27–3, కుల్దీప్ 8–0–51–2, సుందర్ 4–0–17–0.
చదవండి: IND vs WI 3rd ODI: మొన్న ప్రపంచ రికార్డు.. ఈరోజేమో మరీ ఇలా.. నిరాశపరిచావు కదా!
𝗧𝗵𝗮𝘁 𝗪𝗶𝗻𝗻𝗶𝗻𝗴 𝗙𝗲𝗲𝗹𝗶𝗻𝗴 👏 😊
— BCCI (@BCCI) February 11, 2022
M. O. O. D as the @ImRo45-led #TeamIndia complete the ODI series sweep & lift the trophy. 🏆 🔝 #INDvWI @Paytm
Scorecard ▶️ https://t.co/9pGAfWtQZV pic.twitter.com/B12RdFxzNx
Comments
Please login to add a commentAdd a comment