శుబ్‌మన్ గిల్- రిషభ్ పంత్
Who Can Replace Rohit Sharma As Test Captain: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టడం పక్కా! మరి టెస్టు సారథ్య బాధ్యతలను బీసీసీఐ ఎవరికి అప్పగించనుంది?.. గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ వర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మపై విమర్శలు ఎక్కువయ్యాయి.
ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో ఘోర ఓటమి నేపథ్యంలో అతడిని కెప్టెన్‌గా తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి. 36 ఏళ్ల రోహిత్ ఇక సారథిగా తప్పుకొంటేనే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రోహిత్ వారసుడు ఎవరు?
ఈ నేపథ్యంలో టెస్టుల్లో రోహిత్ వారసుడు ఎవరన్న అంశంపై చర్చలు సాగుతున్నాయి. నిజానికి.. యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు టీమిండియా భవిష్యత్ టెస్టు కెప్టెన్ అయ్యే అర్హతలు ఉన్నప్పటికీ యాక్సిడెంట్ కారణంగా అతడు సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరమయ్యే పరిస్థితి.
ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తుండగా.. మరోవైపు.. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సెలక్టర్ భూపీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి.
బ్యాటింగ్ లెజెండ్‌గా ఎదుగుతాడు.. కానీ
హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడిన భూపీందర్.. గిల్ కెప్టెన్సీ అవకాశాలపై స్పందిస్తూ.. ‘‘నేనైతే ఇప్పుడే శుబ్‌మన్ గిల్‌పై భారం మోపాలని అనుకోవడం లేదు. అతడు టీమిండియా బ్యాటింగ్ లెజెండ్‌గా ఎదుగుతాడనడంలో సందేహం లేదు.
సంచలన బ్యాటర్‌గా పేరొందే అవకాశాలూ ఉన్నాయి. తన ఆటలో ఆ సత్తా ఉంది. కాలక్రమంలో అతడు కెప్టెన్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడిప్పుడే బ్యాటర్‌గా తనను తాను నిరూపించుకుంటున్న గిల్‌పై కెప్టెన్సీ భారం మోపితే ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నాడు.
23 ఏళ్ల గిల్ కెప్టెన్ అవడానికి ఇంకా సమయం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా స్టార్ బ్యాటర్‌గా ఎదిగిన తర్వాత 25 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. అయితే, అప్పటికే కోహ్లి వరల్డ్‌కప్ విన్నర్, చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు, టీ20 ప్రపంచకప్ ఫైనలిస్ట్. బ్యాటర్‌గా మూడు ఫార్మాట్లలో ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే కోహ్లి టీమిండియా పగ్గాలు చేపట్టాడు.
చదవండి: 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే!
శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా!
16 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా, పాక్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్
Comments
Please login to add a commentAdd a comment