Test captain
-
రోహిత్ కంటే విరాట్ ఎంతో బెటర్.. ఎందుకు మరోసారి కెప్టెన్సీ చేయకూడదు..?
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ భారత జట్టు దారుణంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై ప్రశ్నల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లి మరోసారి టెస్టుల్లో భారత జట్టును నడిపించాలని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. "విరాట్ కోహ్లికి టెస్టు కెప్టెన్‌గా అద్బుతమైన రికార్డు ఉంది. సారథిగా అతడు జట్టు ఎన్నో చారిత్రత్మక విజయాలను అందించాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా 52 పైగా సగటుతో 5000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అతడు 68 టెస్టుల్లో భారత జట్టుకు నాయకత్వం వహిస్తే.. 40 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. కేవలం 17 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓటమి పాలైంది. గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్ వా తర్వాత టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించాడు. అద్భుతమైన రికార్డు ఉన్న విరాట్ మరోసారి టెస్టుల్లో జట్టు పగ్గాలను ఎందుకు చేపట్టకూడదు? ఈ ప్రశ్నకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను. టెస్టుల్లో విరాట్‌ను రోహిత్‌తో పోల్చడం సరికాదు. టెస్టు క్రికెట్లో రోహిత్ కంటే కోహ్లి అద్బుతమైన ఆటగాడు. అతడు విదేశాల్లో కూడా భారీగా పరుగులు సాధించాడు. రోహిత్‌కు విదేశాల్లో మంచి రికార్డు లేదు. విదేశాల్లో ఓపెనర్‌గా రోహిత్ ఇప్పటి వరకు తనకు తాను నిరూపించుకోలేకపోయాడు. అటువంటిది ఏకంగా జట్టు సారథ్య బాధ్యతలను అప్పగించారు. నా వరకు అయితే ఇది సరైన నిర్ణయం కాదని" తన యూట్యూబ్ ఛానల్లో బద్రీనాథ్ పేర్కొన్నాడు. కాగా 2022లో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం టీమిండియా టెస్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్నాడు. అనంతరం రోహిత్ శర్మ భారత టెస్టు కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ సారథ్యంలో భారత్ ఇప్పటివరకు 10 టెస్టులు ఆడగా.. ఐదింట విజయం సాధించింది. 2 మ్యాచ్‌లు డ్రా కాగా.. మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. చదవండి: IND vs SA 2nd Test: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ -
Test Captain: టీమిండియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి విరాట్ కోహ్లి!?
Team India Test Captain: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో ఓటమి తర్వాత టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ ఎవరన్న అంశంపై క్రీడా వర్గాల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇంగ్లండ్ వేదికగా ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో ఘోర పరాజయం నేపథ్యంలో రోహిత్ శర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లవెత్తాయి. 36 ఏళ్ల రోహిత్‌ను తప్పించి.. శుభ్‌మన్ గిల్ లేదంటే శ్రేయస్ అయ్యర్ వంటి యువ ఆటగాళ్లకు పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు వచ్చాయి. మరోవైపు.. ఇప్పుడిపుడే అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్న గిల్ వంటి ఆటగాళ్లపై భారం మోపే బదులు.. మాజీ సారథి విరాట్ కోహ్లినే మరోసారి కెప్టెన్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రాకు ప్రశ్న ఎదురైంది. కోహ్లి అంతటి సమర్థుడే.. యూబ్యూబ్ చానెల్ వేదికగా.. అభిమానులతో ముచ్చటిస్తున్న సందర్భంగా.. కోహ్లి తిరిగి టెస్టు కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అని ఓ నెటిజన్ అడిగాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. కోహ్లి మరోసారి సారథిగా బాధ్యతలు చేపట్టగల సమర్థుడే.. కానీ.. అతడు ఆ పని చేయడు. ఎందుకంటే.. టెస్టు కెప్టెన్సీ వదులుకోమని ఎవరూ అతడిని ఒత్తిడి చేయలేదు. తనకు తానే ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మళ్లీ తను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకపోవచ్చు. కోహ్లి ప్రకటన తర్వాతే బీసీసీఐ కొత్త కెప్టెన్‌ను నియమించింది. కాబట్టి మళ్లీ విరాట్ కోహ్లి.. నాయకుడిగా తిరిగి రావడం సాధ్యం కాకపోవచ్చు’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తనకు తానుగా తప్పుకొన్నాడు! కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న కోహ్లిని.. అనూహ్య రీతిలో వన్డే కెప్టెన్‌గా తప్పించారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాలో టీమిండియా 2021-22 పర్యటన సమయంలో టెస్టులో ఓటమి తర్వాత కోహ్లి తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో అప్పటికే టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ టెస్టు జట్టు నాయకుడయ్యాడు. ఇదిలా ఉంటే.. కోహ్లి, రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండుసార్లు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరినప్పటికీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. తొట్టతొలి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో. 2021-23 ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓడి.. రెండు సందర్భాల్లోనూ రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. రోహిత్ సేన ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. జూలై 12- ఆగష్టు 13 వరకు కరేబియన్ పర్యటనలో బిజీ బిజీగా గడుపనుంది. చదవండి: జాక్‌పాట్ కొట్టిన అనంతపురం క్రికెటర్.. టీమిండియాకు ఎంపిక స్టార్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. బోర్డుపై అవినీతి ఆరోపణలు -
టీమిండియా కొత్త కెప్టెన్‌గా అతడే! మాజీ సెలక్టర్ సర్ప్రైజింగ్ ఆన్సర్
Who Can Replace Rohit Sharma As Test Captain: పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ శర్మ స్థానంలో టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టడం పక్కా! మరి టెస్టు సారథ్య బాధ్యతలను బీసీసీఐ ఎవరికి అప్పగించనుంది?.. గత కొన్ని రోజులుగా భారత క్రికెట్ వర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మపై విమర్శలు ఎక్కువయ్యాయి. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియా చేతిలో 209 పరుగుల తేడాతో ఘోర ఓటమి నేపథ్యంలో అతడిని కెప్టెన్‌గా తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి. 36 ఏళ్ల రోహిత్ ఇక సారథిగా తప్పుకొంటేనే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ వారసుడు ఎవరు? ఈ నేపథ్యంలో టెస్టుల్లో రోహిత్ వారసుడు ఎవరన్న అంశంపై చర్చలు సాగుతున్నాయి. నిజానికి.. యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు టీమిండియా భవిష్యత్ టెస్టు కెప్టెన్ అయ్యే అర్హతలు ఉన్నప్పటికీ యాక్సిడెంట్ కారణంగా అతడు సుదీర్ఘకాలం పాటు జట్టుకు దూరమయ్యే పరిస్థితి. ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తుండగా.. మరోవైపు.. యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌కు పగ్గాలు అప్పగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సెలక్టర్ భూపీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. బ్యాటింగ్ లెజెండ్‌గా ఎదుగుతాడు.. కానీ హిందుస్థాన్ టైమ్స్‌తో మాట్లాడిన భూపీందర్.. గిల్ కెప్టెన్సీ అవకాశాలపై స్పందిస్తూ.. ‘‘నేనైతే ఇప్పుడే శుబ్‌మన్ గిల్‌పై భారం మోపాలని అనుకోవడం లేదు. అతడు టీమిండియా బ్యాటింగ్ లెజెండ్‌గా ఎదుగుతాడనడంలో సందేహం లేదు. సంచలన బ్యాటర్‌గా పేరొందే అవకాశాలూ ఉన్నాయి. తన ఆటలో ఆ సత్తా ఉంది. కాలక్రమంలో అతడు కెప్టెన్ అయితే ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడిప్పుడే బ్యాటర్‌గా తనను తాను నిరూపించుకుంటున్న గిల్‌పై కెప్టెన్సీ భారం మోపితే ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. 23 ఏళ్ల గిల్ కెప్టెన్ అవడానికి ఇంకా సమయం ఉందని అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా స్టార్ బ్యాటర్‌గా ఎదిగిన తర్వాత 25 ఏళ్ల వయసులో విరాట్ కోహ్లి టెస్టు కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. అయితే, అప్పటికే కోహ్లి వరల్డ్‌కప్ విన్నర్, చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడు, టీ20 ప్రపంచకప్ ఫైనలిస్ట్. బ్యాటర్‌గా మూడు ఫార్మాట్లలో ఎస్టాబ్లిష్ అయిన తర్వాతే కోహ్లి టీమిండియా పగ్గాలు చేపట్టాడు. చదవండి: 20 లక్షలు అనుకుంటే ఏకంగా కోటీశ్వరుడయ్యాడు! జూబ్లీహిల్స్‌లో బంగ్లా, కార్లు.. తగ్గేదేలే! శుబ్‌మన్ గిల్ సంచలన నిర్ణయం! వచ్చే సీజన్లో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా! 16 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా, పాక్‌ను మట్టికరిపించిన బంగ్లాదేశ్ -
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై!
ఆస్ట్రేలియా టెస్టు జట్టు మాజీ కెప్టెన్ టిమ్ పైన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో టాస్మానియాకు ప్రాతినిథ్యం వహించిన పైన్.. తన 18 ఏళ్ల బంధానికి ముగింపు పలికాడు. శుక్రవారం షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా క్వీన్స్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం పైన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం అతడికి సహాచర ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. ఈ సందర్భంగా టిమ్ పైన్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇక పైన్ తన చివరి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 3 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో అతడు 95 మ్యాచ్‌లు ఆడాడు. అతడు 2005లో సౌత్ ఆస్ట్రేలియాపై ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అత్యధిక ఔట్లు చేసిన టాస్మానియన్ వికెట్ కీపర్‌గా పైన్(295) రికార్డు కలిగి ఉన్నాడు. ఫస్ట్-క్లాస్ క్రికెట్లో దాదాపు 30 సగటుతో అతడు 4000కు పైగా పరుగులు చేశాడు. కాగా పైన్ కెరీర్లో ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. ముఖ్యంగా ఓ మహిళకు అభ్యంతరకర మెసేజీలు చేసిన ('సెక్స్టింగ్') స్కాంలో పైన్ ఇరుక్కున్నాడు. దీంతో అతడు 2021లో కీలకమైన యాషెస్ ఆసీస్ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. ఈ వివాదం అతడి కెరీర్‌నే మలుపు తిప్పేసింది. Massive congratulations to @tdpaine36 on an exceptional career with the @TasmanianTigers and @CricketAus 💪 pic.twitter.com/0oDPUVhqRp — Brent Costelloe (@brentcostelloe) March 17, 2023 చదవండి: బంగ్లాదేశ్ కెప్టెన్‌కు చేదు అనుభవం.. కాలర్ పట్టి లాగి! వీడియో వైరల్ -
కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం.. ఇకపై
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్లో కివీస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విలియమ్సన్ తప్పుకున్నాడు. వర్క్‌లోడ్ కారణంగానే టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పినట్లు సమాచారం. ఇకపై కేన్ మామ టీ20లు, వన్డేల్లో మాత్రమే సారథ్యం వహించనున్నాడు. 6 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు సారథ్య బాధ్యతలు నిర్వహించిన కేన్.. తన జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. కాగా 2016లో బ్రెండెన్ మెకల్లమ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్సీ బాధ్యతలు విలియమ్సన్ స్వీకరించాడు. ఇక విలియమన్స్ స్థానంలో టెస్టుల్లో టిమ్ సౌథీ నాయకత్వం వహించనున్నాడు. వైస్ కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ లాథమ్ ఎంపికయ్యాడు. కేన్ సారథ్యంలో 38 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బ్లాక్‌క్యాప్స్.. 22 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 8 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ముఖ్యంగా అతడి నాయకత్వలోనే గతేడాది జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను కివీస్ సొంతం చేసుకుంది. చదవండి: FIFA WC:సెమీస్‌లో అదరగొట్టిన ఫ్రాన్స్.. రికార్డులు బ్రేక్ చేస్తూ విజయం -
రోహిత్ పై వేటు తప్పదా ..?
-
Ind Vs Eng: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడం పెద్ద సాహసమే! అందుకేనేమో!
India Vs England 5th Test: టీమిండియా టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాను నియమించడాన్ని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ సాహసోపేతమైన నిర్ణయంగా అభివర్ణించాడు. బహుశా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్టు జట్ల కెప్టెన్ల నియామకాల్ని చూసి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్(ఐదో) టెస్టుకు ముందు రోహిత్ శర్మ కోవిడ్ బారిన పడిన నేపథ్యంలో బుమ్రాకు బీసీసీఐ సారథ్య బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 16 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే విధంగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా అద్భుతంగా రాణించాడు. అయితే, నాలుగో రోజు ఆటలో ఇంగ్లండ్ పైచేయి సాధించడంతో అంతా తలకిందులైంది. నిజంగా పెద్ద సాహసమే! ఇదిలా ఉంటే.. బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడంపై స్పందించిన ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కాలమ్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘టెస్టు జట్టు కెప్టెన్లుగా ప్యాట్ కమిన్స్, బెన్‌స్టోక్స్ సక్సెస్ చూసిన ఇండియా.. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఇంగ్లండ్‌తో టెస్టుకు సారథిగా నియమించినట్లుంది. నిజానికి ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. బుమ్రా సమర్థత ఏమిటో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు’’ అని ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా టెసుట క్రికెట్లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్, ఆసీస్ సారథిగా ప్యాట్ కమిన్స్ సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపిస్తున్నారని, వాళ్ల సక్సెస్ తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించడం లేదంటూ ప్రశంసించాడు. చదవండి: Ind Vs Eng: జాతి వివక్ష.. టీమిండియా ఫ్యాన్స్‌కు చేదు అనుభవం.. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. -
మొమినల్ గుడ్ బై.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా వెటరన్ ఆల్‌రౌండర్!
Bangladesh New Test Captain: వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతడికి డిప్యూటీగా లిటన్ దాస్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఓటమికి బాధ్యత వహిస్తూ మొమినల్ హక్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షకీబ్ మరోసారి బంగ్లాదేశ్ టెస్టు పగ్గాలు చేపట్టాడు. కాగా 2019లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఆల్‌రౌండర్‌పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఓ ఇంటర్నేషనల్ మ్యాచ్‌కు ముందు బుకీలు అతడిని సంప్రదించినా ఆ విషయాన్ని అతడు దాచిపెట్టాడు. అవినీతి నిరోధక భద్రత విభాగానికి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లలేదు. దీంతో అతడిపై రెండేళ్ల పాటు వేటు పడింది. కాగా గతంలో షకీబ్ రెండుసార్లు బంగ్లా టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2009లొ వెస్టిండీస్ పర్యటనలో మొర్తజా గాయపడగా.. షకీబ్ అల్ హసన్ కెప్టెన్సీ చేశాడు. ఆ తర్వాత 2017లో సారథిగా ముష్ఫికర్ రహీమ్ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇక మొమినల్ సారథ్యంలో బంగ్లాదేశ్ మూడు టెస్టుల్లో మూడు విజయాలు సాధించగా.. రెండింటిని డ్రా చేసుకుంది. ఏకంగా 12 మ్యాచ్‌లలో పరాజయం చవిచూసింది. కాగా కెప్టెన్సీ భారాన్ని దించుకున్న మొమినల్ ఇకపై బ్యాటింగ్‌పై దృష్టి సారిస్తానని పేర్కొన్నాడు. చదవండి 👇 Eng Vs NZ 1st Test: మాథ్యూ పాట్స్ అరంగేట్రం.. ఇంగ్లండ్ తరఫున 704వ ఆటగాడిగా! IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు! -
బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ మోమినుల్ హక్ సంచలన నిర్ణయం
బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్ మోమినుల్ హక్ టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇటీవలే స్వదేశంలో లంకతో జరిగిన టెస్టు సిరీస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు మంగళవారం జరిగిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) సమావేశంలో అధ్యక్షుడు నిజాముల్ హసన్‌కు తన నిర్ణయాన్ని వెల్లడించి కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. కాగా మోమినుల్ నాయకత్వంలో బంగ్లాదేశ్ జట్టు 17 టెస్టుల్లో కేవలం మూడు మాత్రమే గెలిచి.. 12 ఓడిపోయి.. మరో రెండు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ''ఒక ఫెయిల్యుర్ ఆటగాడిగా జట్టును ముందుకు నడిపించలేను. నా స్థానంలో మరొకరిని కెప్టెన్‌గా నియమించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో బ్యాటింగ్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టేందుకు దృష్టి సారిస్తా'' అని చెప్పుకొచ్చాడు. కాగా లంకతో సిరీస్‌లో బ్యాటింగ్‌లోనూ ఘోరంగా విఫలమైన మోమినుల్ హక్ 2022లో ఆడిన ఆరు టెస్టులు కలిపి 162 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. కాగా మోమినుల్ స్థానంలో షకీబ్ అల్ హసన్ టెస్టు కెప్టెన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక మోమినుల్ హక్ బంగ్లాదేశ్ తరపున 53 టెస్టుల్లో 11 సెంచరీల సాయంతో 3525 పరుగులు చేశాడు. చదవండి: Ms Dhoni: ప్రేమించే వారికోసం ఎంతదూరమైనా.. అదీ ధోని అంటే! -
ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్‌గా అతడే.. హెడ్‌కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్!
Ben Stokes: వరుస పరాజయాల నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తిన తరుణంలో ఇంగ్లండ్ కెప్టెన్సీకి జో రూట్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మొదలు వెస్టిండీస్ పర్యటనలో ఓటమి అనంతరం అతడిపై వేటు వేయాలని డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో అతడు స్వయంగా తానే కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో స్టార్ ఆల్‌రౌండర్, వైస్ కెప్టెన్ బెన్‌స్టోక్స్ ఈ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నూతన మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీతో సమావేశం అనంతరం టెస్టు కెప్టెన్సీ తీసుకునేందుకు స్టోక్స్ అంగీకరించినట్లు సమాచారం. ఇక ఈ నియామకానికి సంబంధించి పేపర్ వర్క్ పూర్తైన అనంతరం అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. రాబ్ కీ గురువారం మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించనున్నాడు. ఇదిలా ఉండగా.. దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్‌ను లేదంటే ఆస్ట్రేలియా మాజీ కోచ్ సైమన్ కటిచ్‌ను ఇంగ్లండ్ హెడ్‌కోచ్‌గా నియమించే యోచనలో రాబ్ కీ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మానసిక ఆందోళనల కారణంగా కొన్నాళ్లపాటు జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. యాషెస్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన అతడు.. వెస్టిండీస్‌తో సిరీస్‌లో అదరగొట్టాడు. విండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా.. టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటుగా 150కి పైగా వికెట్లు పడగొట్టిన ఐదో ఆల్‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. చదవండి👉🏾Sanju Samson: సంజూ బాగానే ఆడుతున్నాడు.. కానీ టీమిండియాలో చోటు దక్కడం కష్టమే! -
అత్యధిక టెస్టు వికెట్లతో విండీస్ కెప్టెన్ కొత్త రికార్డు?!
క్రికెట్లో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన బౌలర్‌గా వెస్టిండీస్ క్రికెటర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ కొత్త రికార్డు సృష్టించాడు. అదేంటి టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ తొలి స్థానంలో ఉన్నాడు.. మరి క్రెయిగ్ బ్రాత్‌వైట్ ఎక్కడినుంచి వచ్చాడు అని కంగారు పడకండి. టెస్టుల్లో ఒక బ్యాట్స్‌మన్‌ను రిపీట్‌గా ఔట్ చేయకుండా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రాత్‌వైట్ నిలిచాడు. విషయంలోకి వెళితే.. బ్యాట్స్‌మన్‌గా ఎక్కువ పేరు సంపాదించిన బ్రాత్‌వైట్ ఇప్పటివరకు 77 టెస్టుల్లో 25 వికెట్లు తీశాడు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఈ 25 వికెట్లు 25 బ్యాట్స్మెన్లవి. దీనర్థం ఏంటంటే.. బ్రాత్‌వైట్ తాను సాధించిన 25 వికెట్లలో ఒక్కaటి కూడా రిపీట్ కాలేదని. సాధారణంగా ఒక బౌలర్ ఒక బ్యాట్స్‌మన్‌ను రిపీట్‌గా ఔట్ చేస్తుంటాడు. చాలా సందర్బాల్లో బౌలర్లకు తొలి 25 వికెట్లలోనే ఆ రిపీట్ బ్యాట్స్‌మన్ కనబడ్డారు. కానీ బ్రాత్‌వైట్ మాత్రం తాను తీసిన 25 వికెట్లు కొత్తవే కావడం విశేషం. ఇలా చూసుకుంటే ఇది రికార్డు కిందకే వస్తుంది. ఇంతకముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ బౌలర్ మహ్మద్ అష్రాఫుల్ పేరిట ఉండేది. అష్రాఫుల్ తాను ఒక బ్యాట్స్‌మన్‌ను రిపీట్‌గా ఔట్ చేయకముందు 21 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా బ్రాత్‌వైట్ అష్రాఫుల్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇక శ్రీలంక బౌలర్ సజీవ డిసిల్వా కూడా తాను తీసిన 16 వికెట్లతో ఒక్క రిపీట్ బ్యాట్స్‌మన్ కూడా లేకపోవడం విశేషం. ఇక టెస్టు చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్( 133 టెస్టుల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్(145 టెస్టుల్లో 708 వికెట్లు) రెండో స్థానంలో.. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్(169 టెస్టుల్లో 640 వికెట్లు) మూడో స్థానంలో ఉండగా.. టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే(132 టెస్టుల్లో 619 వికెట్లు) నాలుగో స్థానంలో ఉన్నాడు. చదవండి: Virat Kohli: వరుసగా ఐదో ఏడాది ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ సెలెబ్రిటీగా విరాట్ కోహ్లి IPL 2022: 'అతడు ఫుల్ ఫిట్‌గా ఉన్నాడు.. ప్రపంచకప్ భారత జట్టులో చోటు ఖాయం' -
ఫైనల్ చేరాలంటే టీమిండియా లెక్కలేంటి..?
-
Virat Kohli: ‘కోహ్లిని మళ్లీ టెస్టు కెప్టెన్ చేయండి...’!
Ind Vs Sl 2nd Test- Virat Kohli: టీమిండియా మాజీ సారథి, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా.. చాలా మంది అతడి ఫ్యాన్స్ జాబితాలో ఉంటారు. ఇక టీ20 ప్రపంచకప్-2021 తర్వాత పొట్టి ఫార్మాట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లిని.. వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఘోర పరాభవం నేపథ్యంలో కోహ్లి స్వయంగా టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఇక కోహ్లి స్థానంలో టీమిండియా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లకు సారథి అయ్యాడు. స్వదేశంలో వరుస టీ20, వన్డే సిరీస్‌లు క్లీన్‌స్వీప్ చేసి రికార్డులు సృష్టిస్తున్నాడు. అయితే, కోహ్లి సాధారణ ఆటగాడిగా జట్టులో ఉండటాన్ని కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లికే టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారుల కూడా ఉన్నారు. శ్రీలంకతో బెంగళూరు వేదికగా పింక్‌బాల్ టెస్టు సందర్భంగా...ఓ పక్లార్డును ప్రదర్శించారు. ‘‘ఇందులో రోహిత్ నా కెప్టెన్ కాదు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ కోహ్లిని తిరిగి కెప్టెన్‌గా నియమించండి’’ అని రాసి ఉది. చిన్నారుల తండ్రి వీరి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా... కోహ్లి ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. మా మనసులోని మాట కూడా ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Kapil Dev: కొత్తతరం క్రికెటర్లలో అతడి ఆట అంటే నాకిష్టం.. ఎందుకంటే: కపిల్ దేవ్ -
Rohit Sharma: కలలో కూడా ఊహించలేదు: రోహిత్ శర్మ భావోద్వేగం
రోహిత్ శర్మ.. ఒకప్పుడు జట్టులో చోటు దక్కడమే కష్టం. అరంగేట్రం చేసిన ఆరేళ్ల వరకు పెద్దగా తన మార్కు చూపించలేకపోయాడు. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రోహిత్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేయడంతో అతడి దశ తిరిగింది. చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం.. టీమిండియా సారథి అయ్యాడు రోహిత్ శర్మ. తొలుత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ చేపట్టిన రోహిత్ సారథ్యంలో స్వదేశంలో జరిగిన నాలుగు సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసింది భారత జట్టు. ఇక శ్రీలంకతో సిరీస్‌తో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ...తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయంతో రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్ మీద భారీ తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించిన రెండో భారత కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. క్రికెటర్ నుంచి కెప్టెన్‌గా రోహిత్ ఎదిగిన విధానం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన హిట్‌మ్యాన్ గతాన్ని గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. ‘‘నిజాయితీగా చెప్పాలంటే టీమిండియా కెప్టెన్ అవుతానని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు ఇలా భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడం నాకెంతో గర్వకారణం. నాకు దక్కిన గొప్ప గౌరవం ఇది. చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి చెబుతూ.. ‘‘కొంత మందికి మాత్రమే వంద టెస్టులు ఆడే అవకాశం వస్తుంది. ఈ ఛాన్స్ విరాట్‌కు దక్కింది. అతడి కెరీర్లో ఈ మ్యాచ్ మైలురాయిగా నిలిచిపోయింది’’ అంటూ సహచర ఆటగాడిపై ప్రశంసలు కురిపించాడు. కాగా టీమిండియా రోహిత్ శర్మ టీమిండియాకు 35వ టెస్టు కెప్టెన్. చదవండి: PAK vs AUS: దంపతులిద్దరు ఒకేసారి గ్రౌండ్లో.. అరుదైన దృశ్యం A perfect beginning to his Test captaincy 👌👌 We take a look at the series of events when @ImRo45 led #TeamIndia in whites at Mohali for the first time. 👏 👏 #INDvSL | @Paytm Watch this special feature 📽️ 🔽https://t.co/C3A0kZExWC pic.twitter.com/XxF19t6GsI — BCCI (@BCCI) March 8, 2022 -
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు ఖరారు..!
టీమిండియా నూతన టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు దాదాపుగా ఖరారైంది. ఈ విషయాన్ని బీసీసీఐ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సొంతగడ్డపై త్వరలో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ ఫుల్‌టైమ్ సారధిగా వ్యవహరించనున్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ.. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో టెస్ట్ కెప్టెన్సీ రేసులో రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బుమ్రాల పేర్లు వినిపించినప్పటికీ.. అన్ని ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో బీసీసీఐ హిట్ మ్యాన్ వైపే మొగ్గి చూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ నేతృత్వంలో టీమిండియా స్వదేశంలో విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా నిన్న జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో రోహిత్(60) అర్ధసెంచరీతో రాణించి టీమిండియా గెలుపుకు బాటలు వేశాడు. చదవండి: IPL 2022: హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ జట్టుకు సంబంధించి కీలక అప్డేట్ -
కోహ్లి అరుదైన ఫీట్.. తొలి ఆసియా కెప్టెన్‌గా
''మెగాటోర్నీలు గెలవలేడు'' అనే అపవాదు కోహ్లిపై ఉన్నప్పటికి.. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో మాత్రం కెప్టెన్‌గా కోహ్లి అదుర్స్ అనిపించాడు. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న ఆటగాడిగా కోహ్లి మంచి రికార్డు ఉంది. ఇక సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించడం ద్వారా కెప్టెన్‌గా కోహ్లి అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. 2018 నుంచి చూసుకుంటే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై కనీసం రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచిన తొలి కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ►2018లో సౌతాఫ్రికా పర్యటనలో జోహెన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లి ఆ గడ్డపై తొలి విజయాన్ని అందుకున్నాడు. తాజాగా సెంచూరియన్ వేదికగా ప్రొటీస్‌పై రెండో విజయాన్ని అందుకునాడు. ►2018 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్, మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్టుల్లో కోహ్లి కెప్టెన్‌గా విజయాలు అందుకున్నాడు. ఇక 2020-21 ఆసీస్ పర్యటనలో కోహ్లి నాయకత్వంలోని టీమిండియా తొలి టెస్టులో ఓటమి పాలైంది. అయితే వ్యక్తిగత కారణాల రిత్యా మిగతా టెస్టులకు కోహ్లి దూరమవ్వడం.. రహానే నాయకత్వ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత జరిగిన చరిత్ర మనకందరికి తెలిసిన విషయమే. ►ఇక 2018 ఇంగ్లండ్ పర్యటనలో ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా విజయం అందుకున్న కోహ్లి.. 2021 పర్యటనలో ఏకంగా రెండు విజయాలు అందుకున్నాడు. లార్డ్స్, ఓవల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ల్లో టీమిండియా విజయాలు సాధించింది. ►ఇక విదేశాల్లో టీమిండియా ఆడిన బాక్సింగ్ డే టెస్టులు కూడా కోహ్లికి బాగా కలిసి వచ్చాయి. 2018లో ఆస్ట్రేలియా పర్యటనలో మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టును టీమిండియా గెలుచుకుంది. ఇక తాజగా 2021లో సౌతాఫ్రికా గడ్డపై సెంచూరియన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో 113 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. తద్వారా విదేశాల్లో రెండు బాక్సింగ్ డే టెస్టులు గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. -
Ashes Series: డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్ అదుర్స్.. 127 ఏళ్ల తర్వాత
Pat Cummins First Captian Take 5 Wickets Haul In Ashes Test Since 1982.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ డెబ్యూ కెప్టెన్సీలోనే అదరగొట్టాడు. టిమ్ పైన్ స్థానంలో కొత్త కెప్టెన్‌గా ఎంపికైన కమిన్స్ యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. మొత్తంగా 13.1 ఓవర్లలో 38 పరుగులు.. మూడు మెయిడెన్లతో ఐదు వికెట్లు తీశాడు. ఈ ఐదు వికెట్లలో హసీబ్ హమీద్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్లు ఉన్నారు. తాజా ప్రదర్శనతో కమిన్స్ డెబ్యూ టెస్టు కెప్టెన్‌గా రెండు రికార్డులను బద్దలుకొట్టాడు. ►డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్ తన తొలి టెస్టులో ఐదు వికెట్ల ఘనత సాధించడం ఆసీస్ క్రికెట్ చరిత్రలో రెండోసారి. ఇంతకముందు జార్జ్ గిఫిన్ 1894లో యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్ డెబ్యూ కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే ఐదు వికెట్లు తీశాడు.మెల్బోర్న్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 155 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. మళ్లీ 127 ఏళ్ల తర్వాత పాట్ కమిన్స్ ఆ ఫీట్‌ను రిపీట్ చేయడం విశేషం. ►ఇక యాషెస్ సిరీస్ పరంగా చూసుకుంటే డెబ్యూ కెప్టెన్‌గా కమిన్స్ ఐదు వికెట్ల ఘనత అందుకోవడం 1982 తర్వాత మళ్లీ ఇప్పుడే. 1982 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ డెబ్యూ కెప్టెన్‌గా బాబ్ విల్లీస్ ఒక టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు ఘనత సాధించాడు. చదవండి: Mitchell Starc: 85 ఏళ్ల రికార్డును తిరగరాసిన మిచెల్ స్టార్క్ Aye aye, skipper! Pat Cummins' first Test wicket as captain is the dangerous Ben Stokes! #OhWhatAFeeling@Toyota_Aus | #Ashes pic.twitter.com/AKjsV0qK5c — cricket.com.au (@cricketcomau) December 8, 2021 -
రోహిత్, రహానే.. మనకు తెలియకుండా ఇన్ని పోలికలా!
Similarities Between Rohit Sharma And Ajinkya Rahane.. రోహిత్ శర్మ, అజింక్యా రహానే.. ఈ ఇద్దరు టీమిండియా సమకాలీన క్రికెట్లో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. రోహిత్ మూడు ఫార్మాట్లలో ముఖ్యపాత్ర పోషిస్తుంటే.. మరొకరు టెస్టుల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. కోహ్లి అందుబాటులో లేని సమయాల్లో ఈ ఇద్దరు తాత్కాలిక కెప్టెన్లుగా వ్యవహరించారు. గతేడాది ఆసీస్ పర్యటనలో విరాట్ కోహ్లి తొలి టెస్టు అనంతరం స్వదేశానికి వచ్చేయడంతో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రహానే జట్టును విజయవంతంగా నడిపించాడు. 2-1 తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించి టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. చదవండి: Ravi Shastri: గంగూలీతో విభేదాలు నిజమే.. ఇక తాజాగా టి20 ప్రపంచకప్ 2021 అనంతరం విరాట్ కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో రోహిత్ శర్మకు టి20 కెప్టెన్‌గా బాధ్యతలు అప్పజెప్పిన బీసీసీఐ.. కోహ్లి గైర్హాజరీలో కివీస్‌తో తొలి టెస్టుకు రహానేను టెస్టు కెప్టెన్‌గా నియమించింది. నవంబర్ 17 నుంచి మొదలవనున్న సిరీస్‌లో మొదటగా మూడు టి20లు.. ఆ తర్వాత రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, రహానే శైలిలో మనకు తెలియని పోలికలు చాలానే ఉన్నాయి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ►రోహిత్, రహానే... ఇద్దరు ముంబై నుంచి వచ్చినవారే ►రోహిత్ వన్డేల్లో, టి20ల్లో వైస్ కెప్టెన్‌గా ఉంటే... రహానే టెస్టుల్లో వైస్‌కెప్టెన్‌గా ఉన్నాడు. ►ముంబైలో ఫేమస్ అయిన వడాపావ్ అంటే ఈ ఇద్దరికి చాలా ఇష్టమంట ►కోహ్లి గైర్హాజరీలో రోహిత్, రహానే ప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు( టి20 కెప్టెన్సీ నుంచి కోహ్లి తప్పుకోవడంతో రోహిత్‌కు పూర్తి స్థాయి బాధ్యతలు) ►రోహిత్, రహానే ఇద్దరు సియెట్ కంపెనీ బ్యాట్‌నే వాడడం విశేషం. ►రోహిత్ చాలా సందర్భాల్లో కూల్‌గానే ఉంటాడు.. రహానే స్వభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. మ్యాచ్‌లో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టుతో వివాదాలకు పోకుండా కూల్‌గా ఉండడం ఇతని నైజం చదవండి: Jaydev Unadkat: బ్యాటింగ్ వీడియో షేర్ చేశాడు.. 'నన్ను ఆల్‌రౌండర్‌గా పరిగణించండి' -
పాక్ కెప్టెన్ జెర్సీ... పుణే మ్యూజియానికి
కరాచీ: కరోనా బాధితులను ఆదుకునేందుకు మరో క్రికెటర్ ముందుకొచ్చాడు. ఈసారి పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ అజహర్ అలీ తనకు చిరస్మరణీయమైన బ్యాట్, జెర్సీలను వేలానికి ఉంచాడు. 2016లో వెస్టిండీస్‌పై ట్రిపుల్ సెంచరీ (302) చేసిన బ్యాట్‌తో పాటు, భారత్‌తో జరిగిన 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ధరించిన జెర్సీని అజహర్ పాకిస్తాన్ కరెన్సీలో పది లక్షల రూపాయల (భారత కరెన్సీలో రూ. 4 లక్షల 73 వేలు) చొప్పున కనీస ధరకు అమ్మకానికి పెట్టాడు. దీంతో భారత్‌కు చెందిన ‘బ్లేడ్స్ ఆఫ్ గ్లోరీ’ క్రికెట్ మ్యూజియం (పుణే) బ్యాట్‌ను కనీస ధరకే దక్కించుకోగా... కాలిఫోర్నియాలో స్థిరపడ్డ పాకిస్తానీ కాశ్ విలానీ జెర్సీని పాకిస్తాన్ కరెన్సీలో 11 లక్షల రూపాయలకు (భారత కరెన్సీలో రూ. 5 లక్షల 20 వేలు) చేజిక్కించుకున్నాడు. న్యూజెర్సీలో స్థిరపడిన జమాల్ ఖాన్ లక్ష రూపాయల (భారత కరెన్సీలో రూ. 43 వేలు) విరాళం ఇచ్చాడు. దీంతో వేలం ద్వారా లభించిన మొత్తాన్ని కరోనా బాధితుల కోసం ఇవ్వనున్నట్లు అజహర్ తెలిపాడు. -
అజిత్ వాడేకర్ కన్నుమూత
-
అజిత్ వాడేకర్ కన్నుమూత
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కోచ్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ అజిత్ లక్ష్మణ్ వాడేకర్ (77) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్లోక్ ఆస్పత్రిలో బుధవారం తుది శ్వాస విడిచారు. వాడేకర్... 1941 ఏప్రిల్ 1న నాటి బొంబాయిలో జన్మించారు. 1958లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశారు. 1966లో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తొలి టెస్టు ఆడారు. 8 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 37 టెస్టులాడి 2,113 పరుగులు, రెండు వన్డేలు ఆడి 73 పరుగులు చేశారు. 1974లో రిటైరయ్యారు. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్ అయిన వాడేకర్ మూడో స్థానంలో దిగేవారు. స్లిప్‌లో చురుకైన ఫీల్డర్. భారత్ తొలి వన్డే జట్టులోనూ వాడేకర్ సభ్యుడు కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో 67 పరుగులతో రాణించారు. మొత్తం ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 237 మ్యాచ్‌ల్లో 47.03 సగటుతో 15,380 పరుగులు చేసిన వాడేకర్‌కు దూకుడైన ఆటగాడిగా పేరుంది. విదేశీ విజయ సారథి... : గావస్కర్, విశ్వనాథ్ వంటి గొప్ప బ్యాట్స్‌మెన్, బేడి, ప్రసన్న, వెంకట్రాఘన్, చంద్రశేఖర్ వంటి దిగ్గజ స్పిన్నర్లున్న జట్టుకు వాడేకర్ సారథ్యం వహించారు. భారత్ ఆయన కెప్టెన్సీలోనే 1971లో వెస్టిండీస్, ఇంగ్లండ్‌లలో తొలిసారిగా టెస్టు సిరీస్‌లను గెలిచింది. 1972–73లో స్వదేశంలో ఇంగ్లండ్‌ను మరోసారి ఓడించింది. వరుసగా మూడు సిరీస్‌లు నెగ్గడంతో సారథిగా వాడేకర్ పేరు మార్మోగిపోయింది. అయితే, 1974లో ఇంగ్లండ్‌లో పర్యటించిన జట్టుకూ కెప్టెన్సీ వహించిన ఆయన ఆ సిరీస్‌లో జట్టు మూడు టెస్టుల్లోనూ ఓడటంతో రిటైర్మెంట్ ప్రకటించారు. అనంతరం 1990ల్లో అజహరుద్దీన్ సారథ్యంలోని భారత జట్టుకు మేనేజర్ కమ్ కోచ్‌గా వ్యవహరించారు. 1998–99 మధ్యకాలంలో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. లాలా అమర్నాథ్, చందూ బోర్డె తర్వాత ఆటగాడిగా, సారథిగా, కోచ్‌గా, సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా చేసిన మూడో వ్యక్తిగా రికార్డుల కెక్కారు. 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీ పుర స్కారం పొందారు. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గాను సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. వాడేకర్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. -
సర్ఫరాజ్ అహ్మద్‌కు మరో ప్రమోషన్!
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని దేశానికి అందించిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రమోషన్ దక్కింది. పాక్ జట్టు టెస్టు సారథ్య బాధ్యతలు కూడా అతనికి అప్పగిస్తున్నట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇటీవల సీనియర్ క్రికెటర్ మిస్బావుల్ హక్ రిటైరవ్వడం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని అనూహ్యరీతిలో పాక్ గెలుపొందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. చాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో చిత్తయిన పాకిస్థాన్ అనూహ్యంగా పుంజుకొని ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో బలమైన భారత జట్టును 124 పరుగుల భారీ తేడాతో ఓడించింది. ఈ విజయాల క్రెడిట్ సర్ఫరాజ్ సారథ్యానికే దక్కింది. అతని నాయకత్వంలో పాక్ జట్టు సమష్టిగా ఆడుతూ వరుసగా విజయాల బాట పట్టింది. సర్ఫరాజ్ ఇంతవరకు టెస్టులకు నాయకత్వం వహించలేదు. అయినా, అతని నాయకత్వంలో వన్డేలు, టీ-20లలో పాక్ వరుసగా విజయాలు సాధించడంతో అతనికే టెస్టు పగ్గాలు దక్కాయి. సర్ఫరాజ్ సారథ్యంలో పాక్ జట్టు ఏడు వన్డేల్లో విజయం సాధించింది. టీ-20లలో అతని కెప్టెన్సీలో ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో ఏడింటిలో గెలుపొందింది. -
ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం
క్రికెటర్ అలిస్టర్ కుక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టుగానే ఇంగ్లండ్ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి ఆయన బుధవారం వైదొలిగాడు. టెస్టు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం నేపథ్యంలో కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు కుక్ భారత్ పర్యటనలో ఉండగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కుక్ 59 టెస్టులకు నాయకత్వం వహించాడు. 2012లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా నియామకమైన కుక్.. ఆ జట్టుకు అత్యధిక టెస్టుల్లో నాయకత్వం వహించిన సారథిగా రికార్డు నెలకొల్పాడు. తన సారథ్యంలో 2013లో, 2015లో ఆస్ట్రేలియాపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను గెలుపొందాడు. ఇండియా, దక్షిణాఫ్రికాలోనూ ఇంగ్లండ్‌కు సిరీస్ విజయాలు అందించాడు. 2010-2014 మధ్యకాలంలో 69 వన్డేలకు కూడా కుక్ సారథిగా వ్యవహరించాడు. (చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు) ఇటీవలి టెస్టు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని కుక్ చెన్నైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే కెప్టెన్‌గా కుక్కు భారత్ సిరీసే చివరిదిగి నిలిచిపోయింది. -
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఏబీ
కేప్ టౌన్: దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ గా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ నియమించబడ్డాడు. ఈ మేరకు ఏబీని టెస్టు కెప్టెన్ గా నియమిస్తున్నట్టు క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) తాజాగా స్పష్టం చేసింది. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన చివరి రెండు టెస్టులకు హషీమ్ ఆమ్లా కెప్టెన్సీ నుంచి వైదొలగడం తో ఆ బాధ్యతను తాత్కాలికంగా డివిలియర్స్ కు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా, జాతీయ సెలక్టర్లు అభిప్రాయంతో ఏబీని టెస్టు కెప్టెన్ గా నియమిస్తూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వన్డే సారథిగా ఉన్నా ఏబీని టెస్టు కెప్టెన్ గా నియమించడం పట్ల సీఎస్ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హారూన్ లోర్గాట్ హర్షం వ్యక్తం చేశారు. ఏబీ మంచి క్రికెటరే కాకుండా, విభిన్నమైన ఆటగాడు. సఫారీ జట్టును సరైన దిశలో నడిపించే నాయకుడు. ఏబీ నాయకత్వంలో దక్షిణాఫ్రికా మరింత ఎత్తుకు ఎదుగుతుంది' లోర్గాట్ తెలిపారు. ఈ సందర్భంగా హషీమ్ ఆమ్లా నాయకుడిగా చేసిన సేవలను లోర్గాట్ కొనియాడారు. దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్సీ పగ్గాలను ఆమ్లా చేపట్టే నాటికి జట్టు కష్టకాలంలో ఉన్నా అతడు ముందుండి నడిపించడంలో సఫలమయ్యాడన్నారు. -
దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఆమ్లా
జొహన్నెస్‌బర్గ్: సీనియర్ బ్యాట్స్‌మన్ హషీమ్ ఆమ్లా దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గ్రేమ్ స్మిత్ గత మార్చిలో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో దక్షిణాఫ్రికా సెలెక్టర్లు అతని స్థానంలో ఆమ్లాను నియమించారు. భారత సంతతికి చెందిన ఆటగాడు దక్షిణాఫ్రికా జట్టు పగ్గాలు చేపట్టడం ఇదే మొదటిసారి. ఆమ్లా సారథ్యంలోని దక్షిణాఫ్రికా జట్టు వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనుంది. దక్షిణాఫ్రికాకు ఓ బీర్ బ్రాండ్ స్పాన్సర్‌గా ఉండటంతో.. ఆ లోగో ఉన్న డ్రెస్సును, కిట్‌ను వాడేందుకు ఇష్టపడటం లేదని, అందుకే కెప్టెన్సీ వద్దంటున్నాడని అయితే ఆమ్లా తన డ్రెస్సుతో పాటు కిట్పైనా బీర్ బ్రాండ్ లోగో ఉపయోగించకుండా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నుంచి అనుమతి తీసుకున్నాడు.