Ind Vs SL 2nd Test: Young Fans Holding Placard With Reinstake Kohli As Captain, Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Virat Kohli: ‘కోహ్లిని మళ్లీ టెస్టు కెప్టెన్‌గా నియమించండి’!

Published Mon, Mar 14 2022 2:07 PM | Last Updated on Mon, Mar 14 2022 4:56 PM

Ind Vs Sl 2nd Test: Young Fans Placard Reinstate Virat Kohli As Test Captain - Sakshi

Ind Vs Sl 2nd Test- Virat Kohli: టీమిండియా మాజీ సారథి, స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా.. చాలా మంది అతడి ఫ్యాన్స్‌ జాబితాలో ఉంటారు. ఇక టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన కోహ్లిని.. వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పించి షాకిచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఘోర పరాభవం నేపథ్యంలో కోహ్లి స్వయంగా టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. ఇక కోహ్లి స్థానంలో టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ అన్ని ఫార్మాట్లకు సారథి అయ్యాడు. స్వదేశంలో వరుస టీ20, వన్డే సిరీస్‌లు క్లీన్‌స్వీప్‌ చేసి రికార్డులు సృష్టిస్తున్నాడు.

అయితే, కోహ్లి సాధారణ ఆటగాడిగా జట్టులో ఉండటాన్ని కొంతమంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోహ్లికే టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారుల కూడా ఉన్నారు. శ్రీలంకతో బెంగళూరు వేదికగా పింక్‌బాల్‌ టెస్టు సందర్భంగా...ఓ పక్లార్డును ప్రదర్శించారు. ‘‘ఇందులో రోహిత్‌ నా కెప్టెన్‌ కాదు. గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌ కోహ్లిని తిరిగి కెప్టెన్‌గా నియమించండి’’ అని రాసి ఉది. చిన్నారుల తండ్రి వీరి ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా... కోహ్లి ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. మా మనసులోని మాట కూడా ఇదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: Kapil Dev: కొత్తతరం క్రికెటర్లలో అతడి ఆట అంటే నాకిష్టం.. ఎందుకంటే: కపిల్‌ దేవ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement