రోహిత్ శర్మ.. ఒకప్పుడు జట్టులో చోటు దక్కడమే కష్టం. అరంగేట్రం చేసిన ఆరేళ్ల వరకు పెద్దగా తన మార్కు చూపించలేకపోయాడు. అయితే, టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రోహిత్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేయడంతో అతడి దశ తిరిగింది. చాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్ ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది.
అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం.. టీమిండియా సారథి అయ్యాడు రోహిత్ శర్మ. తొలుత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ చేపట్టిన రోహిత్ సారథ్యంలో స్వదేశంలో జరిగిన నాలుగు సిరీస్‌లను క్లీన్‌స్వీప్ చేసింది భారత జట్టు. ఇక శ్రీలంకతో సిరీస్‌తో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ...తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయంతో రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్ మీద భారీ తేడాతో ప్రత్యర్థిపై విజయం సాధించిన రెండో భారత కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.
క్రికెటర్ నుంచి కెప్టెన్‌గా రోహిత్ ఎదిగిన విధానం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చవిచూసిన హిట్‌మ్యాన్ గతాన్ని గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ.. ‘‘నిజాయితీగా చెప్పాలంటే టీమిండియా కెప్టెన్ అవుతానని కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు ఇలా భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడం నాకెంతో గర్వకారణం. నాకు దక్కిన గొప్ప గౌరవం ఇది. చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు.
ఇక మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి చెబుతూ.. ‘‘కొంత మందికి మాత్రమే వంద టెస్టులు ఆడే అవకాశం వస్తుంది. ఈ ఛాన్స్ విరాట్‌కు దక్కింది. అతడి కెరీర్‌లో ఈ మ్యాచ్ మైలురాయిగా నిలిచిపోయింది’’ అంటూ సహచర ఆటగాడిపై ప్రశంసలు కురిపించాడు. కాగా టీమిండియా రోహిత్ శర్మ టీమిండియాకు 35వ టెస్టు కెప్టెన్.
చదవండి: PAK vs AUS: దంపతులిద్దరు ఒకేసారి గ్రౌండ్‌లో.. అరుదైన దృశ్యం
A perfect beginning to his Test captaincy 👌👌
— BCCI (@BCCI) March 8, 2022
We take a look at the series of events when @ImRo45 led #TeamIndia in whites at Mohali for the first time. 👏 👏 #INDvSL | @Paytm
Watch this special feature 📽️ 🔽https://t.co/C3A0kZExWC pic.twitter.com/XxF19t6GsI
Comments
Please login to add a commentAdd a comment