టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో.. పరిస్థితిని బట్టి అంతే సీరియస్ అవుతాడు కూడా!.. ఒక్కోసారి సహనం కోల్పోయి భావోద్వేగాలను నియంత్రించుకోలేక ట్రోల్స్‌కు గురైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఆటలో భాగంగానే రోహిత్ ఇలా చేస్తాడని.. కెప్టెన్‌గా అతడు రచించిన వ్యూహాలు అమలు చేయడంలో తాము విఫలమైతే మాత్రం ఆగ్రహానికి గురికాకతప్పదంటున్నాడు టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ.
ఇటీవల జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో రోహిత్ శర్మకు మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2023-24 పురస్కారం లభించింది. ఈ వేడుకలో రోహిత్‌తో పాటు పేసర్ షమీ, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తదితర టీమిండియా క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెప్టెన్‌గా మైదానంలో రోహిత్ శర్మ ఎలా ఉంటాడన్న ప్రశ్న ఎదురుకాగా షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అప్పుడు అతడి రియాక్షన్ చూశామంటే
‘‘జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి రోహిత్ స్వేచ్ఛనిస్తాడు. తనలోని ఉత్తమ గుణం అది. అయితే, ఎప్పుడైతే మేము అతడి అంచనాలు అందుకోలేకపోతామో.. అప్పుడు అతడు భావోద్వేగాలను ప్రదర్శించడం మొదలుపెడతాడు. నువ్విలా చేయాలి లేదంటే చేసి ఉండాల్సిందని ఆటగాళ్లకు చెబుతాడు.
అయినప్పటికీ మన ఆట తీరులో మార్పు లేదంటే.. ఇక అతడి రియాక్షన్స్ స్క్రీన్ మీద చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే.. తను కోపంగా ఉన్నాడని మాకు అర్థమైపోతుంది. ఇక ఆపై తను ఒక్క మాట చెప్పకుండానే మాకు ఏం చేయాలో తెలిసిపోతుంది’’ అని షమీ చెప్పుకొచ్చాడు.
అవును.. నా పని నేను చేస్తా!
ఇక ఇందుకు బదులిస్తూ.. ‘‘మైదానంలో ఎవరి పనులు వారు సరిగ్గా చేయాలని వాళ్లకు చెప్తాను. మరి నేను కూడా నా పని చేయాలి కదా. అందుకే నేను ఫీల్డ్‌లో ఒక్కోసారి అలా ప్రవర్తిస్తా’’ అంటూ రోహిత్ శర్మ కెప్టెన్‌గా తన పనిని తాను చేస్తానంటూ చమత్కరించాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీ గెలిచిన అనంతరం సెలవులు తీసుకున్న రోహిత్ శర్మ శ్రీలంక పర్యటన సందర్భంగా మళ్లీ జట్టుతో కలిశాడు.
అయితే, అతడి సార థ్యంలోని భారత జట్టు 27 ఏ ళ్ల తర్వాత తొలిసారి న్డే సిరీస్‌ను లంకకు కోల్పోయింది. మరోవైపు.. వన్డే వరల్డ్‌కప్ తర్వాత చీలమండ గాయానికి సర్జరీ చేయించుకున్న షమీ ఇంకా పునరాగమనం చేయలేదు.
Shreyas Iyer and Mohammed Shami talking about their captain Rohit Sharma.🥹
The Captain, the leader, the legend @ImRo45 🐐 pic.twitter.com/DmXJ7YaegC— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 21, 2024
Comments
Please login to add a commentAdd a comment