ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన నిర్ణయం
క్రికెటర్ అలిస్టర్ కుక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టుగానే ఇంగ్లండ్ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి ఆయన బుధవారం వైదొలిగాడు. టెస్టు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం నేపథ్యంలో కెప్టెన్సీ పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు కుక్ భారత్ పర్యటనలో ఉండగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కుక్ 59 టెస్టులకు నాయకత్వం వహించాడు. 2012లో ఇంగ్లండ్ కెప్టెన్‌గా నియామకమైన కుక్.. ఆ జట్టుకు అత్యధిక టెస్టుల్లో నాయకత్వం వహించిన సారథిగా రికార్డు నెలకొల్పాడు. తన సారథ్యంలో 2013లో, 2015లో ఆస్ట్రేలియాపై ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను గెలుపొందాడు. ఇండియా, దక్షిణాఫ్రికాలోనూ ఇంగ్లండ్‌కు సిరీస్ విజయాలు అందించాడు. 2010-2014 మధ్యకాలంలో 69 వన్డేలకు కూడా కుక్ సారథిగా వ్యవహరించాడు. (చదవండి: ఇంగ్లండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు)
ఇటీవలి టెస్టు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని కుక్ చెన్నైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే కెప్టెన్‌గా కుక్‌కు భారత్ సిరీసే చివరిదిగి నిలిచిపోయింది.