
టీమిండియా నూతన టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు దాదాపుగా ఖరారైంది. ఈ విషయాన్ని బీసీసీఐ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సొంతగడ్డపై త్వరలో శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ ఫుల్‌టైమ్ సారధిగా వ్యవహరించనున్నాడని బీసీసీఐ వర్గాల సమాచారం. కాగా, దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ.. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.
అనంతర పరిణామాల్లో టెస్ట్ కెప్టెన్సీ రేసులో రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, బుమ్రాల పేర్లు వినిపించినప్పటికీ.. అన్ని ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్ ఉండాలనే ఉద్దేశంతో బీసీసీఐ హిట్ మ్యాన్ వైపే మొగ్గి చూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ నేతృత్వంలో టీమిండియా స్వదేశంలో విండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడుతుంది. ఇందులో భాగంగా నిన్న జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో రోహిత్(60) అర్ధసెంచరీతో రాణించి టీమిండియా గెలుపుకు బాటలు వేశాడు.
చదవండి: IPL 2022: హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ జట్టుకు సంబంధించి కీలక అప్‌డేట్
Comments
Please login to add a commentAdd a comment