గౌహతి వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత మునపటి టచ్‌లో కనబడిన హిట్ మ్యాన్.. 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా 67 బంతులు ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్.. 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ధాటిగా ఆడిన రోహిత్ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మధుశంక బౌలింగ్‌లో బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకోవడంతో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
కాగా, ఈ మ్యాచ్‌లో రోహిత్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాక ఆకాశం వైపు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎందుకంటే.. నిన్న (జనవరి 9) రోహిత్ అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క మ్యాజిక్ చనిపోయింది. ఈ విషయాన్ని రోహిత్ భార్య రితిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. మ్యాజిక్ లేదన్న బాధలోనే ఈ మ్యాచ్ బరిలోకి దిగిన రోహిత్.. ఫిఫ్టి పూర్తి కాగానే ఆకాశం వైపు చూస్తూ మ్యాజిక్ పేరును స్మరిస్తూ, చాలాకాలం తర్వాత చేసిన కీలక హాఫ్ సెంచరీని మ్యాజిక్‌కు అంకితమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
Dedicating this 50 for his pet dog who passed away this week.
— sportsbuzz (@cricket_katta11) January 10, 2023
Rohit is an emotion for cricketing fans!!
Love this celebration from skipper.#RohitSharma #INDvSL #RohitSharma𓃵 pic.twitter.com/c7EHEmsFjc
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో రోహిత్, శుభ్‌మన్ గిల్ (70)లు హాఫ్ సెంచరీలతో రాణించగా, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, సిక్స్) శతకంతో విరుచుకుపడ్డాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. లంక బౌలర్లలో కసున్ రజిత 3 వికెట్లు పడగొట్టగా.. మధుశంక, కరుణరత్నే, షనక, ధనంజయ డిసిల్వ తలో వికెట్ దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment