బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఓ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన ఓ సిక్సర్.. స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుడి ముక్కుకు బలంగా తాకింది. దీంతో అతడికి తీవ్ర గాయమైంది. భారత ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో విశ్వ ఫెర్నాండో వేసిన షార్ట్ పిచ్ బాల్‌కు రోహిత్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో మ్యాచ్ వీక్షిస్తున్న అభిమాని ముక్కుకు బంతి బలంగా తగిలింది.
దీంతో అతడికి ముక్కు నుంచి రక్తం కారింది. అయితే వెంటనే అతడిని దగ్గరలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా.. నాసికా ఎముక ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే చికిత్స అనంతరం అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 15 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేయగలిగింది. కాగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (92) పోరాటంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది.
చదవండి: Ind Vs SL 2nd Test: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డు.. సచిన్, సెహ్వాగ్ సరసన!
Comments
Please login to add a commentAdd a comment