chinna swami stadium
-
భారత్-కివీస్ తొలి టెస్టు: అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. భారత్, న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచి (అక్టోబర్ 16) ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగులుతాడని వాతావరణ శాఖ హెచ్చరించింది. మ్యాచ్‌కు వేదిక అయిన బెంగళూరులో ఇవాల్టి నుంచే వర్షం ప్రారంభమైంది. వర్షం కారణంగా ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ పూర్తిగా రద్దైపోయింది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ ఫోర్‌కాస్ట్‌లో తెలిసింది.ITS RAINING IN CHINNASWAMY STADIUM 👀- Bad news for IND vs NZ Test...!!!pic.twitter.com/y3G0poVr8U— Johns. (@CricCrazyJohns) October 15, 2024కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో.. మూడో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనున్నాయి.Rain predicted for all 5 days at the Chinnaswamy Stadium for the 1st Test between India and New Zealand. 🌧️ pic.twitter.com/D8Af2HARvR— Mufaddal Vohra (@mufaddal_vohra) October 15, 2024న్యూజిలాండ్‌తో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.రిజర్వ్ ఆటగాళ్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.భారత్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ టీమ్డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.చదవండి: Ind vs NZ 2024: షెడ్యూల్, జట్లు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు -
టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 549 పరుగులు! వీడియో
ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన టీ20 క్రికెట్ మజాను అందించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. ఇరు జట్లు కలపి ఏకంగా 549 పరుగులు సాధించాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఇది నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 7 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ కూడా ధీటుగా బదులిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆర్సీబీ తమ విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచింది. SRH might’ve won the match but Dinesh Karthik definitely deserved that standing ovation ❤️#RCBvSRH pic.twitter.com/sMWNSC2ptj — UrMiL07™ (@urmilpatel30) April 15, 2024 అత్యధిక సిక్స్‌లు.. అదే విధంగా ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు కలిపి ఏకంగా 38 సిక్స్‌లు బాదేశారు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు నమోదైన రెండు మ్యాచ్‌గా ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ పోరు నిలిచింది. అంతకముందు ఈ ఏడాది సీజన్లో సన్‌రైజర్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా 38 సిక్స్‌లే నమోదయ్యాయి. That's a Book 🔥 Innings from Travis head! pic.twitter.com/lsiLinLU1M — SunRisers OrangeArmy Official (@srhfansofficial) April 15, 2024 -
IPL 2024: సన్‌రైజర్స్ విధ్వంసం.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్
ఐపీఎల్-2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో సంచలనం సృష్టించింది. ఐపీఎల్లో చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను ఎస్ఆర్హెచ్ నమోదు చేసింది. ఈ మెగా ఈవెంట్లో బాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఆర్సీబీ బౌలింగ్‌ను తుత్తునియలు చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి ఏకంగా 287 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఓపెనర్ ట్రావిస్ హెడ్(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్ క్లాసెన్(67), మార్క్రమ్(35), సమద్(37) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ఐపీఎల్లో తాను సృష్టించిన అత్యధిక పరుగుల రికార్డును.. 20 రోజుల్లో తానే తిరగరాసింది. ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. -
RCB Vs PBKS: గ్రౌండ్లోకి దూసుకొచ్చి కోహ్లి కాళ్లు మొక్కిన ఫ్యాన్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ బ్యాటింగ్ సందర్భంగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బంది, పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. అతడు నేరుగా బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి వద్దకు వెళ్లి కాళ్లకు మొక్కి తన అభిమానాన్ని ప్రదర్శించాడు. ఈ సమయంలో కోహ్లి తన మంచి మనసును చాటుకున్నాడు. సదరు అభిమానిని పైకి లేపి బయటకు వెళ్లాలని సూచించాడు.ఆ తర్వాత కోహ్లిని హగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు ఆ అభిమాని అంతలోనే సెక్యూరిటి సిబ్బంది కూడా అక్కడికి వచ్చి అతడిని బయటకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మైదానంలోకి వచ్చిన అభిమాని పట్ల విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరును అభిమానులు కొనియాడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 49 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 పరుగులు చేశాడు. A fan breached the field and touched Virat Kohli's feet. - King Kohli, an icon! ❤️pic.twitter.com/s82xq8sKhW — Mufaddal Vohra (@mufaddal_vohra) March 25, 2024 -
శ్రీలంకతో మ్యాచ్.. కివీస్‌ను కలవరపెడుతున్న గతం.. మరోవైపు..
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 9) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ శ్రీలంకకు నామమాత్రమే కాగా.. సెమీస్ రేసులో ఉన్న న్యూజిలాండ్‌కు అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. ఇందులో న్యూజిలాండ్ భారీ తేడాతో గెలిస్తే పాక్, ఆఫ్ఘనిస్తాన్లతో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరుకుంటుంది. బలాబలాలు, ప్రస్తుత ఫామ్ ప్రకారం కివీస్‌తో పోలిస్తే శ్రీలంక బలహీనమైన ప్రత్యర్దిగా ఉంది కాబట్టి, ఈ మ్యాచ్‌లో కివీస్ గెలుపు నల్లేరుపై నడకే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కివీస్‌ను రెండు అంశాలు కలవరపెడుతున్నాయి. అందులో ఒకటి వరుణ గండం కాగా.. రెండోది శ్రీలంక చేతిలో ఎదురైన చేదు అనుభవాల సెంటిమెంట్. వరుణ గండం విషయానికొస్తే.. లంకతో మ్యాచ్‌కు వేదిక అయిన బెంగళూరులో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. వర్షం ఒకటి, రెండుసార్లు మ్యాచ్‌కు అంతరాయం కలిగించవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అ యితే మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించడం కివీస్‌కు అంత మంచిది కాదు. పూర్తి మ్యాచ్ జరిగితేనే ఆ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉంటాయి. కివీస్ ఎంత బాగా ఆడినా వరుణుడు అడ్డుతగిలితే ఏమవుతుందో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో మనం చూశాం. అందుకే ఈ మ్యాచ్ పూర్తిగా సాగాలని కివీస్ కోరుకుంటుంది. మరోవైపు వరల్డ్‌కప్ టోర్నీల్లో శ్రీలంక చేతిలో ఎదురైన చేదు అనుభవాల సెంటిమెంట్ కివీస్‌ను భయపెడుతుంది. 2007, 2011 వరల్డ్‌కప్ టోర్నీల్లో శ్రీలంక.. కివీస్ పాలిట కొరకరాని కొయ్యలా ఉండింది. ఈ రెండు వరల్డ్‌కప్ ఎడిషన్ల సెమీస్‌లో శ్రీలంక కివీస్‌ను మట్టికరిపించింది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమోనని కివీస్ అభిమానులు కలవరపడుతున్నారు. దీనికి తోడు మెగా టోర్నీల్లో దురదృష్టం, కీలక ఆటగాళ్ల గాయాలు కివీస్‌కు ప్రతికూలంగా మారాయి. వరుణ గండాన్ని, సెంటిమెంట్‌ను అధిగమించి లంకపై భారీ తేడాతో గెలవాలని కివీస్ ఆటగాళ్లు అనుకుంటున్నారు. -
మూడు వికెట్లతో చేలరేగిన ముకేశ్ కుమార్.. న్యూజిలాండ్ స్కోర్: 156/5
బెంగళూరు: భారత్ ‘ఎ’తో గురువారం ప్రారంభమైన తొలి అనధికారిక టెస్టులో న్యూజిలాండ్ ‘ఎ’ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జో కార్టర్ (73 బ్యాటింగ్) అర్ధ సెంచరీ సాధించాడు. భారత్ ‘ఎ’ బౌలర్లలో పేసర్ ముకేశ్ కుమార్ 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా...యశ్ దయాళ్, అర్జాన్ చెరో వికెట్ తీశారు. ప్రతికూల వాతావరణం కారణంగా మొదటి రోజు 61 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చదవండి: శ్రీలంక సంచలన విజయం -
తుది సమరానికి వరుణుడి ఆటంకం..!
బెంగళూరు వేదికగా అఖరి టీ20లో తాడో పేడో తేల్చుకోవడానికి దక్షిణాప్రికా, భారత జట్లు సిద్దమయ్యాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. అయితే ఈ తుదిపోరుకు వరుణుడు ఆటంకి కలిగించే అవకాశం ఉంది. గత వారం రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్య జరిగిన పలు రంజీ మ్యాచ్‌లకు కూడా వర్షం ఆటంకి కలిగించింది. అక్యూవెదర్ ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరులో ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 84 శాతంగా రికార్డయింది. అదే విధంగా మ్యాచ్ సమయంలో తేమ 92 శాతం నుంచి 93 శాతం వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: Former Cricketer Salil Ankola: దిగ్గజ క్రికెటర్‌తో పాటే అరంగేట్రం.. క్రికెట్‌పై అసూయ పెంచుకొని -
ప్రేక్షకుడి ముక్కు పగలగొట్టిన రోహిత్ శర్మ.. ఆస్పత్రిలో చేరిక!
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఓ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన ఓ సిక్సర్.. స్టాండ్స్‌లో కూర్చోని మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుడి ముక్కుకు బలంగా తాకింది. దీంతో అతడికి తీవ్ర గాయమైంది. భారత ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో విశ్వ ఫెర్నాండో వేసిన షార్ట్ పిచ్ బాల్‌కు రోహిత్ మిడ్ వికెట్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. ఈ క్రమంలో మ్యాచ్ వీక్షిస్తున్న అభిమాని ముక్కుకు బంతి బలంగా తగిలింది. దీంతో అతడికి ముక్కు నుంచి రక్తం కారింది. అయితే వెంటనే అతడిని దగ్గరలో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయగా.. నాసికా ఎముక ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే చికిత్స అనంతరం అతడిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 15 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి 30 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులే చేయగలిగింది. కాగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (92) పోరాటంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు చేయగలిగింది. చదవండి: Ind Vs SL 2nd Test: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డు.. సచిన్, సెహ్వాగ్ సరసన! -
'చిన్నస్వామి'కి సౌరవెలుగులు
పగటిపూటేకాదు రాత్రివేళలోనూ సూర్యుడి ప్రభావంతో వెలిగిపోయే క్రికెట్ స్టేడియంగా మారిపోయింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం! ఫ్లడ్ లైట్లే కాకుండా ఇతర అవసరాలకు కూడా సరిపడ విద్యుత్ ఇకపై సౌరశక్తి ద్వారా ఉత్పత్తికానుంది. స్టేడియం పైకప్పుపై ఏర్పాటుచేసిన సౌరఫలకాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను బుధవారం కర్ణాటక ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ బుధవారం ప్రారంభించనున్నారు. దీంతో చిన్నస్వామి క్రికెట్ స్టేడియం పూర్తి పర్యవారణ హిత మైదానంగా మారిపోయింది. మొత్తం 400 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఐపీఎల్- 8లో భాగంగా ఏప్రిల్ 19 న జరిగే మ్యాచ్ లో ఆర్ సీబీ, ముంబై ఇండియన్స్ జట్టు తలపడబోయేది సౌర వెలుగు కిందే కానుండటం విశేషం.