టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 549 పరుగులు! వీడియో | Most runs in IPL match ever as Hyderabad beat Bengaluru | Sakshi
Sakshi News home page

SRH vs RCB: టీ20 మ్యాచ్‌లో విధ్వంసం.. ఏకంగా 549 పరుగులు! వీడియో

Published Tue, Apr 16 2024 7:00 AM | Last Updated on Tue, Apr 16 2024 9:06 AM

Most runs in IPl match ever as Hyderabad beat Bengaluru - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ అభిమానులకు అసలు సిసలైన టీ20 క్రికెట్‌ మజాను అందించింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారింది. ఇరు జట్లు కలపి ఏకంగా 549 పరుగులు సాధించాయి. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఇది నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 7 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌(102) సెంచరీతో చెలరేగగా.. హెన్రిచ్‌ క్లాసెన్‌(67), మార్‌క్రమ్‌(35), సమద్‌(37) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. అనంతరం లక్ష్య చేధనలో ఆర్సీబీ కూడా ధీటుగా బదులిచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. అయితే దురదృష్టవశాత్తూ ఆర్సీబీ తమ విజయానికి 25 పరుగుల దూరంలో నిలిచింది.

అత్యధిక సిక్స్‌లు..
అదే విధంగా ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు కలిపి ఏకంగా 38 సిక్స్‌లు బాదేశారు. దీంతో టీ20 క్రికెట్‌ చరిత్రలో అత్యధిక సిక్స్‌లు నమోదైన రెండు మ్యాచ్‌గా ఆర్సీబీ-ఎస్‌ఆర్‌హెచ్‌ పోరు నిలిచింది. అంతకముందు ఈ ఏడాది సీజన్‌లో సన్‌రైజర్స్‌-ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కూడా 38 సిక్స్‌లే నమోదయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement