'చిన్నస్వామి'కి సౌరవెలుగులు
పగటిపూటేకాదు రాత్రివేళలోనూ సూర్యుడి ప్రభావంతో వెలిగిపోయే క్రికెట్ స్టేడియంగా మారిపోయింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం! ఫ్లడ్ లైట్లే కాకుండా ఇతర అవసరాలకు కూడా సరిపడ విద్యుత్ ఇకపై సౌరశక్తి ద్వారా ఉత్పత్తికానుంది.
స్టేడియం పైకప్పుపై ఏర్పాటుచేసిన సౌరఫలకాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను బుధవారం కర్ణాటక ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ బుధవారం ప్రారంభించనున్నారు. దీంతో చిన్నస్వామి క్రికెట్ స్టేడియం పూర్తి పర్యవారణ హిత మైదానంగా మారిపోయింది. మొత్తం 400 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఐపీఎల్- 8లో భాగంగా ఏప్రిల్ 19 న జరిగే మ్యాచ్ లో ఆర్ సీబీ, ముంబై ఇండియన్స్ జట్టు తలపడబోయేది సౌర వెలుగు కిందే కానుండటం విశేషం.