
బెంగళూరు వేదికగా అఖరి టీ20లో తాడో పేడో తేల్చుకోవడానికి దక్షిణాప్రికా, భారత జట్లు సిద్దమయ్యాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. అయితే ఈ తుదిపోరుకు వరుణుడు ఆటంకి కలిగించే అవకాశం ఉంది. గత వారం రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ మధ్య జరిగిన పలు రంజీ మ్యాచ్‌లకు కూడా వర్షం ఆటంకి కలిగించింది. అక్యూవెదర్ ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరులో ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 84 శాతంగా రికార్డయింది. అదే విధంగా మ్యాచ్ సమయంలో తేమ 92 శాతం నుంచి 93 శాతం వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది.
చదవండి: Former Cricketer Salil Ankola: దిగ్గజ క్రికెటర్‌తో పాటే అరంగేట్రం.. క్రికెట్‌పై అసూయ పెంచుకొని
Comments
Please login to add a commentAdd a comment