benguluru
-
Lok sabha elections 2024: బెంగళూరు సిటీ... రిజర్వుడ్!
నాలెడ్జ్ కేపిటల్. ఐటీ హబ్. దిగ్గజ శాస్త్ర సాంకేతిక సంస్థల నిలయం. కాస్మోపాలిటన్ సంస్కృతి. చెప్పుకుంటూ పోతే బెంగళూరు నగర ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. కానీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మాత్రం ఈ లెక్కలన్నింటినీ పక్కన పెట్టేస్తున్నారు నగర ఓటర్లు. అన్నిచోట్లా ఉన్నట్టే కులం, మతం, పార్టీ విధేయతలకే ఓటేస్తున్నారు!బెంగళూరు నగర పరిధిలో 4 లోక్‌సభ సీట్లకూ శుక్రవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. 2008లో లోక్‌సభ నియోజకవర్గాల పునరి్వభజన జరిగినప్పటి నుంచీ ఆ స్థానాల్లో ఓటర్లు ఎప్పుడూ ఒకే పారీ్టకో, అభ్యరి్ధకో పట్టం కడుతుండటం విశేషం... బెంగళూరు పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన అభ్యర్థే గెలవడం, ఒకే పార్టీకి ఓటర్లు జై కొట్టడానికి నియోజకవర్గాల పునరి్వభజన జరిగిన తీరే కారణమనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. నేతలు తమకు అనుకూలమైన కులాలు, మతాల ఓటర్లు ఒకే నియోజకవర్గంలోకి వచ్చేలా జాగ్రత్త పడటం వల్లే ఈ ట్రెండ్ కొనసాగుతోందనే వాదనలు బలంగా ఉన్నాయి. లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి ప్రతిఫలిస్తోంది. 2008 నుంచి బెంగళూరులోని మొత్తం 28 అసెంబ్లీ స్థానాల్లో 57 శాతం సీట్లను సిట్టింగ్ ఎమ్మెల్యేలే గెలుస్తూ వస్తున్నారు. మరో 18 శాతం సీట్లను ఒకే ఎమ్మెల్యే లేదా పార్టీ కనీసం రెండుసార్లు గెలవడం విశేషం. ఆ లెక్కన చూస్తే నగరంలోని 75 శాతం స్థానాలు ఒకే అభ్యరి్థకో, ఒకే పారీ్టకో ‘రిజర్వ్’ అయిపోయాయన్నమాట! రాజకీయాల్లో తరచూ వినిపించే ఓటర్ల వ్యతిరేకత, సిట్టింగ్ ప్రజాప్రతినిధిపై అసంతృప్తి వంటివి బెంగళూరుకు వర్తించవు!నగర పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సీట్లలో బీజేపీ నుంచి, ఏడు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థులే మళ్లీ గెలిచారు. శివాజీనగర్‌లో 2008 నుంచి వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై ఎమ్మెల్యే అయిన రోషన్ బేగ్ 2019లో బీజేపీలోకి దూకారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రిజ్వాన్ అర్షద్ చేతిలో ఆయన చిత్తుగా ఓడటం విశేషం! అర్షద్‌కు ఎమ్మెల్యేగా అది రెండో విజయం. చామరాజ్‌పేట్ నుంచి మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మాత్రం రెండుసార్లు జేడీ(ఎస్) టికెట్‌పైనా గెలిచారు.వొక్కళిగలే కీలకం...బెంగళూరులో ఇలా ఒకే పార్టీ, ఒకే అభ్యర్థి వరుసగా గెలుస్తున్న ట్రెండ్ వెనక పలు ఇతర కారణాలూ ఉన్నా కులమే కీలక ఫ్యాక్టర్‌గా నిలుస్తోంది. పార్టీ ఓటు బ్యాంకుతో పాటు పారీ్టలు, నేతల మధ్య లోపాయకారీ అవగాహన, తటస్థ ఓటర్ల మొగ్గు కూడా ప్రభావం చూపుతున్నాయి.► బెంగళూరులోని 28 అసెంబ్లీ స్థానాల్లో 4 ఎస్సీ రిజర్వుడు సీట్లు. వాటిని బీజేపీ, కాంగ్రెస్ చెరో రెండు చొప్పున తమ ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాయి.► బెంగళూరు పరిధిలోని 28 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది వొక్కళిగ కులానికి చెందినవారే. మిగతా సీట్లలో కూడా వారి ప్రభావం గట్టిగా కనబడుతుండటం నగరంలో కులాలవారీ ఓటింగ్ కీలకంగా నిలుస్తోందనేందుకు తిరుగులేని నిదర్శనం.► పునరి్వభజన తర్వాత పరిసర గ్రామీణ ప్రాంతాల నుంచి బెంగళూరు నగర పరిధిలోని నియోజకవర్గాలకు ఓటర్ల వలస కూడా ఈ ధోరణికి మరింత దోహదపడుతోంది.► వొక్కళిగ, ఎస్సీ రిజర్వుడ్‌తో పాటు ముగ్గురు ముస్లిం, ఒక క్రిస్టియన్ అభ్యర్థులు శివాజీనగర్ శాంతిగనర్, చామరాజ్‌పేట్, సర్వజ్ఞనగర్‌లో అసెంబ్లీ స్థానాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.► రాజాజీనగర్, గాం«దీగనర్, బసవనగుడి, చిక్పేట్ నియోజవర్గాల్లో ఎప్పుడూ బ్రాహ్మణ సామాజిక వర్గమే గెలుస్తోంది.► ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నగరంలో టికెట్ల కేటాయింపులోనూ వొక్కళిగల ఆధిపత్యం కొట్టొచి్చనట్టు కనిపిస్తోంది. నాలుగు సీట్లలో మూడింటిని కాంగ్రెస్ ఆ సామాజికవర్గానికే కట్టబెట్టింది. బెంగళూరు నార్త్ నుంచి రాజీవ్ గౌడ, సౌత్ నుంచి సౌమ్యా రెడ్డి, రూరల్‌లో డీకే సురేశ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి బెంగళూరు నార్త్ అభ్యర్థి శోభ కరంద్లాజె, రూరల్ నుంచి సీఎన్ మంజునాథ కూడా వొక్కళిగలే. ► బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో చాలావరకు మైనారిటీల ఆధిపత్యమే కావడంతో మన్సూర్ అలీకి కాంగ్రెస్ టికెటిచి్చంది.లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇదే ధోరణి► నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ బెంగళూరు పరిధిలోని స్థానాల్లో దాదాపు ఒకే పార్టీ, లేదా అభ్యర్థే గెలిచారు.► బెంగళూరు రూరల్ 2013 ఉపఎన్నిక నుంచీ కాంగ్రెస్ కంచుకోటగా మారింది. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. నాలుగో విజయం కోసం మళ్లీ బరిలో దిగారు. ఆయనదీ వొక్కళిగ కులమే. ఇక్కడ బీజేపీ కూడా అదేసామాజిక వర్గానికి చెందిన దేవెగౌడ అల్లుడు సి.ఎన్.మంజునాథను బరిలో దింపింది.► బెంగళూరు సెంట్రల్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ పీసీ మోహన్ కూడా హ్యాట్రిక్ వీరుడే. ఈసారి కూడా ఆయనే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మాత్రం అభ్యరి్థని మార్చి మన్సూర్ అలీతో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.► బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ తేజస్వీ సూర్య మళ్లీ పోటీలో ఉన్నారు. ఇక్కడ 1991 నుంచీ కాషాయ జెండానే ఎగురుతుండటం విశేషం! దాంతో ఈసారి రాష్ట్ర మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపింది.► బెంగళూరు నార్త్‌లో మాత్రం 2014 నుంచీ గెలుస్తున్న సదానంద గౌడను బీజేపీ ఈసారి పక్కనబెట్టింది. ఉడుపి–చిక్మగళూరుఎంపీ, కేంద్ర మంత్రి శోభ కరంద్లాజెను బరిలో దింపింది. ఆమె కోస్తా వొక్కళిగ కాగా కాంగ్రెస్ అభ్యర్థి రాజీవ్ గౌడ స్థానిక వొక్కలిగ కావడం విశేషం.బెంగళూరు నగర పరిధిలోని లోక్‌సభ స్థానాలుబెంగళూరు నార్త్, బెంగళూరు రూరల్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్ నోట్: ‘గతం’ శీర్షికన అందిస్తున్న లోక్‌సభ ఎన్నికల సిరీస్‌కు రెండో విడత పోలింగ్ కవరేజీ కారణంగా ఈ రోజు విరామం. ఆ సిరీస్ రేపటినుంచి యథావిధిగా కొనసాగుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏకంగా బస్‌షెల్టర్‌నే మాయం చేశారు
శివాజీనగర: ఇనుప వంతెనలు, భారీ వస్తు సామగ్రిని మాయం చేస్తున్న దొంగల కళ్లు..ఇప్పుడు బస్ షెల్టర్‌పై పడ్డాయి. బెంగళూరు నగరం నడిబొడ్డున నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి దగ్గర్లో ఉన్న సిటీ బస్ షెల్టర్‌ను దొంగలు ఎత్తుకుపోయారు. ఒక ప్రైవేటు సంస్థ విరాళంగా అందజేసిన రూ.10 లక్షలతో స్థానిక కన్నింగ్హం రోడ్డులో బెంగళూరు మెట్రో సిటీ బస్ సంస్థ (బీఎంటీసీ) ఏడాదిన్నర క్రితం స్టీల్, ఇనుప రాడ్లు, షీట్లతో బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేసింది. కొన్నిరోజులుగా అక్కడ బస్సు షెల్టర్ స్థానం ఖాళీగా కనిపిస్తుండటంతో అధికారులే తొలగించి ఉంటారని స్థానికులు భావించారు. సదరు ప్రైవేటు సంస్థకు విషయం తెలిసి కార్పొరేషన్ అధికారులను ఆరా తీశారు. ఈ విషయం బయటకు రావడంతో స్థానికులు వారం క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలు, ఇతర ఆధారాలతో పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. -
బెంగుళూరు ట్రాఫిక్ జామ్‌లో టైమ్‌కి పిజ్జా డెలివరీ..
బెంగళూరు: లాంగ్ వీకెండ్ కావడంతో బెంగళూరు టెకీలు ఒక్కసారిగా ఇంటిబాట పట్టారు. దీంతో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బెనాలూరు ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ఓ వ్యక్తి డామినోస్ పిజ్జా ఆర్డర్ చేయగా అంత ట్రాఫిక్ జామ్‌లో కూడా సమయానికి డెలివరీ చేశాడు డెలివరీ బాయ్. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సదరు వ్యక్తి. ఆన్‌టైమ్ డెలివరీ.. ఎలాగూ ట్రాఫిక్ జామ్ అయ్యింది కాబట్టి ఇప్పట్లో గమ్యానికి చేరుకోలేమని భావించి రిషివత్స అనే వ్యక్తి డామినోస్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేసి లైవ్ లొకేషన్ ఇచ్చాడు. కానీ అతడిని ఆశ్చర్యానికి గురిచేస్తూ డామినోస్ పిజ్జా డెలివరీ బాయ్ అంత ట్రాఫిక్ జామ్‌లో కూడా ప్రామిస్ చేసినట్టుగా ట్రాఫిక్ ఉండగానే అర్ధగంటలో డెలివరీ చేశాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు విశేష స్పందన రాగా కామెంట్లలో నెటిజన్లు డామినోస్పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. When we decided to order from @dominos during the Bangalore choke. They were kind enough to track our live location (a few metres away from our random location added in the traffic) and deliver to us in the traffic jam. #Bengaluru #bengalurutraffic #bangaloretraffic pic.twitter.com/stnFDh2cHz — Rishivaths (@rishivaths) September 27, 2023 బారులు తీరిన వాహనాలు.. ఈరోజు మిలాద్-ఉన్-నబీ, రేపు కావేరీ జల వివాదం కారణంగా కర్ణాటక బంద్, ఎల్లుండి శనివారం, తర్వా ఆదివారం, సోమవారం గాంధీ జయంతి ఇలా బెంగుళూరు వాసులకు వరుసగా ఐదు రోజులు సెలవులు దొరికాయి. దీంతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగస్తులు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయడానికి సొంతూళ్ళకు బయలుదేరారు. ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడంతో సాయంత్రం 5 నుంచే బెంగళూరు మహానగరంలో రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. కిలోమీటర్ల మేర బారులుతీరిన వాహనాలన్నీ గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో అయితే వాహనాలు చాలా వరకు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం వలన కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. This is every day before a long weekend in Bangalore, it's same 3-8pm today. Karnataka taking highest tax on liquor (83%) if can utilize even 10% of that can make proper roads and infra. #BangaloreTraffic #bangalore #longweekendhttps://t.co/XlOarOY6hj pic.twitter.com/goU6PIR9ae — nsrivastava.eth (@nitinkr1991) September 27, 2023 #bangaloretraffic Yesterday I saw most my friends in bangalore tweet about massive traffic jam. 2 hours for 8-10 kms and even more..when we are gonna diversify companies to other parts of KA? Bangalore has almost choked bec of political greed,ppl are suffering..feels sorry!! pic.twitter.com/caOvvfTRx7 — North karnataka Rises (@NorthKA_Rises) September 28, 2023 ఇది కూడా చదవండి: లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్ఫారం ఎక్కించేశాడు.. -
దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇలా..
హైదరాబాద్: రెండు రోజుల పాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి ప్రస్తావిస్తూ ఎటువంటి ఎజెండా లేకుండా పిలుపునివ్వడం చూస్తుంటే దేశంలో చట్టం పనితీరు ఎలా ఉందో అర్ధమవుతుందని అన్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు ముగిసిన తర్వాత కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో గెలవడమే మా ప్రధాన ఎజెండా అని తద్వారా ఇండియా కూటమిని గెలిపించుకోవడమే మా ముందున్న లక్ష్యమని అది తప్ప మాకు వేరే ఏ ఎజెండా లేదని అన్నారు. ఇక సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరగనున్న ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల గురించి స్పందించారు. ఎటువంటి ఎజెండా లేకుండా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం దేశ చరిత్రలోనే తొలిసారి జరుగుతోందని దీన్ని బట్టే దేశంలో చట్టాల పరిస్థితి ఏమిటనేది అర్ధం చేసుకోవచ్చని ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. రెండు రోజులపాటు జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో వచ్చే ఎన్నికలకు సంబంధించి కొన్ని తీర్మానాలు చేశారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉండటాన్ని స్వాగతిస్తూనే దీన్ని ప్రధాన మంత్రి తోపాటు బీజేపీ శ్రేణులు కూడా జీరించుకోలేకపోతున్నాయని రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దేశాన్ని విభజన రాజకీయాలు, విద్వేష పాలన నుండి విముక్తి కలిగించడానికి సైద్ధాంతిక సిద్ధపాటుతో ఇండియా కూటమి ముందుకొచ్చిందని చెబుతూ సామాజిక సమానత్వాన్ని సాధించి న్యాయాన్ని బలపరిచి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ప్రజా సమస్యలపై స్పందిస్తూ, సున్నితమైన, పారదర్శకమైన, జవాబుదారీగా ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని అందించాలని కమిటీ తీర్మానించింది. ఈ సందర్బంగా అటవీరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి కూడా కమిటీ చర్చించింది. ✅ Telangana implements... Nation follows 🇮🇳 🔹Karnataka Deputy CM DK Shiva Kumar all praise for the best practices adopted in #Telangana 🔹Dy. CM was in #Hyderabad as a part of the Solid Waste Management study tour 🔹 Shiva Kumar said generating energy out of waste at… pic.twitter.com/xNanN6gzU3 — Mission Telangana (@MissionTG) September 17, 2023 ఇది కూడా చదవండి: న్యాయ వ్యవస్థ ప్రగతికైనా, వినాశనానికైనా నిజాయతీయే కీలకం -
దళిత కుటుంబంపై కర్ణాటక మంత్రి దాడి
బెంగుళూరు: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మంత్రి డి. సుధాకర్‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు కర్ణాటక పోలీసులు. ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన కేసులో మంత్రి దళిత కుటుంబంపై దాడి చేశారంటూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. సుబ్బమ్మ, ఆశ అనే ఇద్దరు మహిళలు ఎఫ్ఐఆర్లో తెలిపిన వివరాల ప్రకారం మంత్రి సుధాకర్ కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి బెంగళూర్ యలహంక ప్రాంతానికి చేరుకుని మహిళలు నివాసముండే స్థలంలోని ఆస్తులను కూల్చే ప్రయత్నం చేశారు. జేసీబీ వాహనంతో సహా వచ్చిన ఆ గుంపులో సుమారు 40 మంది ఉండగా వారిలో 15 మంది మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. సంఘటనా స్థలంలో ఇళ్ల పైకప్పులు ప్రహారి గోడలను కూలుస్తుండగా దళితులైన తల్లీ కూతుళ్లు సుబ్బమ్మ, ఆశ వచ్చి వారిని నిలదీయగా ఆ గుంపు కులం పేరుతో దూషిస్తూ వీరిపై దాడికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. దీంతో మంత్రి సుధాకర్‌పైనా ఆయన అనుచరులు శ్రీనివాస్, భాగ్యమ్మల తో సహా మరో 35 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేసినట్టు తెలిపారు పోలీసులు. ఇది కూడా చదవండి: పాక్ ఆక్రమిత కశ్మీర్ దానంతటదే వచ్చి భారత భూభాగంలో కలుస్తుంది -
కొచ్చి–బెంగళూరు విమానానికి బాంబు బెదిరింపు
కొచ్చి: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన కొచ్చి–బెంగళూరు విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు కాల్‌తో అధికారులు హైరానా పడ్డారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టారు. ఎటువంటి బాంబు లేదని తేల్చారు. అనంతరం మధ్యాహ్నం 2.24 గంటలకు బెంగళూరుకు బయలుదేరింది. 6ఈ6482 విమానం మొత్తం 139 మంది ప్రయాణికులతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. అంతలోనే, ఆ విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా అధికారులకు ఫోన్ కాల్ చేశాడు. దీంతో, అధికారులు వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రయాణికులందరినీ కిందికి దించివేశారు. వారికి చెందిన లగేజీని కూడా క్షుణ్నంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువేదీ లేదని ధ్రువీకరించుకున్నారు. అనంతరం 2.24 గంటల సమయంలో ఆ విమానం తిరిగి బెంగళూరుకు టేకాఫ్ అయ్యింది. బాంబు బెదిరింపుపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
మలుపుతిప్పిన చంద్రయాన్-3.. ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం
వాషింగ్టన్: చంద్రయాన్-3 విజయం తర్వాత ప్రపంచ దేశాల చూపు భారత దేశం వైపు మళ్లింది. ప్రపంచ దేశాలు భారత్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో కలిసి సంయుక్తంగా డెవలప్ చేసిన నాసా-ఇస్రో SAR (NISAR) ఉపగ్రహాన్ని ప్రయోగించే బాధ్యతలను ఇస్రో చేతులకు అప్పజెప్పింది నాసా. భూమి యొక్క కక్ష్యను పరిశీలించే నిసార్ ఉపగ్రహం ప్రయోగానికి ముందు ఇస్రో దీనికి తుది మెరుగులు దిద్దుతోంది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం, NISAR 12 రోజుల్లో మొత్తం భూగోళాన్ని మ్యాప్ చేయగలదు. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, కొండచరియలు సహా భూమి యొక్క పర్యావరణ వ్యవస్థలు, మంచు ద్రవ్యరాశి, వృక్షసంపద, సముద్ర మట్టం పెరుగుదల, భూగర్భ జలాలు, సహజ ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి తాత్కాలికమైనా కూడా స్థిరమైన సమాచారాన్ని అందిస్తుంది. NISAR L, S డ్యూయల్ బ్యాండ్ సింథటిక్ ఆపర్చ్యుర్ రాడార్ (SAR)ని కలిగి ఉంటుంది. ఇందులో L బ్యాండ్ SARను కాలిఫోర్నియా జెట్ ప్రపల్షన్ లేబొరేటరీ డెవలప్ చేయగా S బ్యాండ్ SARను మాత్రం ISRO అభివృద్ధి చేసింది. ఇది స్వీప్ SAR టెక్నిక్‌తో పనిచేస్తూ హై రిజొల్యూషన్ డేటాను అందిస్తుంది. SAR పేలోడ్లు ఇంటిగ్రేటెడ్ రాడార్ ఇన్స్ట్రుమెంట్ స్ట్రక్చర్ (ఐరిస్)పై అమర్చబడ్డాయి. SUV-పరిమాణంలో ఉండే పేలోడ్‌ను ప్రత్యేక కార్గో కంటైనర్‌లో బెంగళూరుకు తరలించినట్లు యూఎస్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది. బెంగళూరులోని యూ.ఆర్.రావు శాటిలైట్ సెంటర్లో ఉపగ్రహం తుదిమెరుగులు దిద్దుకుని 2024లో ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ప్రణాళిక రూపొందించింది నాసా. Touchdown in Bengaluru! @ISRO receives NISAR (@NASA-ISRO Synthetic Aperture Radar) on a @USAirforce C-17 from @NASAJPL in California, setting the stage for final integration of the Earth observation satellite, a true symbol of #USIndia civil space collaboration. #USIndiaTogether pic.twitter.com/l0a5pa1uxV — U.S. Consulate General Chennai (@USAndChennai) March 8, 2023 ఇది కూడా చదవండి:ప్రిగోజిన్ మరణంపై అనేక అనుమానాలు! -
జీతం 17 లక్షలు..13 ఉద్యోగాల్ని రిజెక్ట్ చేసిన 21 ఏళ్ల యువతి!
కోవిడ్ -19, లేఆఫ్స్ వంటి కఠిన సమయాల్లో మీకొక జాబ్ ఆఫర్ వస్తే ? ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 కంపెనీలు మిమ్మల్ని ఆహ్వానిస్తే. అందులో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌లాంటి సంస్థలుంటే! ఏం చేస్తారు? ఏం కంపెనీలో చేరాలో నిర్ణయించుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతారు. కానీ బెంగళూరుకు చెందిన ఈ టెక్కీ వచ్చిన ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించింది. ఎందుకో తెలుసా? ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు చెందిన రితి కుమారి (21). ఇప్పటి వరకు 13 కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. జీతం కూడా ఏడాదికి రూ.17లక్షలు పైమాటే. ఇంత శాలరీ వస్తుంటే ఎవరు కాదంటారు? చెప్పండి. కానీ రితి మాత్రం వద్దనుకుంది. తన మనసుకు నచ్చిన జాబ్ చేయాలని భావించింది. బదులుగా వాల్‌మార్ట్‌లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు మొగ్గుచూపానంటూ జీవితంలో ఎల్లప్పుడూ కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ తనకు ఎదురైన అనుభవాల్ని నెటిజన్లతో పంచుకున్నారు. అన్నట్లు ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన ఆమె ఏడాదికి రూ. 20 లక్షల వేతనం తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు వచ్చిన జాబ్ ఆఫర్లు మంచివే. అందులో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకోవాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. కానీ సోదరి ప్రేరణతో అన్నీ ఉద్యోగాల్ని కాదనుకున్నాను. మనసు మాట విని చివరికి వాల్‌మార్ట్‌ని ఎంచుకున్నారు. 6 నెలల ఇంటర్న్‌షిప్‌లో నెలకు స్టైఫండ్ రూ.85,000 సంపాదించారు. ‘నేను వాల్‌మార్ట్ ఇంటర్న్‌షిప్ ఆఫర్‌ను స్వీకరించినందుకు సంతోషంగా ఉన్నాను. నాకొచ్చిన జాబ్ ఆఫర్స్‌లో పొందే నెలవారీ వేతనం కంటే వాల్ మార్ట్ ఇచ్చే జీతం చాలా తక్కువ .ఈ విషయంలో నా తల్లిదండ్రులు సంతోషంగా లేరు. కఠినమైన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం గాక ఆందోళన చెందా. ఎవరూ ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. అప్పుడే నా సోదరి ప్రీతి కుమారి ఓ మాట చెప్పింది. ముందు నువ్వు నీ మనసు మాట విను. అది ఏం చెబితే అదే చేయి అంటూ ప్రోత్సహించింది. ప్రస్తుతం, ధన్‌బాద్‌లోని ఐఐటీలో పీహెచ్డీ చదువుతున్న నా సోదరి ప్రీతి కుమారి తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)లో పాల్గొనేందుకు వచ్చిన జాబ్ ఆఫర్స్‌ను తిరస్కరించారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఐఐటీలో పీహెచ్డీ చేస్తూ ఆమె తీసుకున్న నిర్ణయం సరైందేనని నిరూపించారు. కాబట్టే, నేను వాల్‌మార్ట్‌లో ఇంటర్న్‌షిప్ ఆఫర్ తీసుకున్నాను.కష్టపడి నా ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఇంటర్వ్యూలు ఇచ్చాను. చివరికి వాల్‌మార్ట్ నుండి జాబ్ ఆఫర్ పొందాను అని కుమారి చెప్పారు. ఇప్పుడు తన కెరీర్ విషయంలో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయంపై స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న తన తండ్రిని సహచర ఉపాధ్యాయులు సైతం అభినందించడం సంతోషంగా ఉందని అన్నారు. రితి లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం.. జనవరి 2022 నుండి జూలై 2022 వరకు వాల్‌మార్ట్‌లో ట్రైనింగ్ తీసుకుంది. ఆపై వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్ ఇండియా (బెంగళూరు)లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ -2గా చేరింది. చదవండి👉 యాపిల్ కీలక నిర్ణయం.. చైనా గొంతులో పచ్చి వెలక్కాయ?! -
నల్లగా ఉంటే భర్త కాకుండా పోతాడా? కర్ణాటక హైకోర్టు
బెంగుళూరు: భర్త నల్లగా ఉన్నాడని భార్యా అదేపనిగా కించపరచడాన్ని కర్ణాటక హైకోర్టు తప్పు బట్టింది. అదొక క్రూరమైన చర్యగా పరిగణిస్తూ.. దీన్నే బలమైన కారణంగ చెబుతూ ఆ జంటకు విడాకులు మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు. తన భర్త నల్లగా ఉన్నాడంటూ ఓ భార్య అతడిని తరచుగా ఆవమానించడంతో ఆ భర్త విసుగు చెంది విడాకుల కోసం హైకోర్టును ఆశ్రయుయించాడు. కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత భర్త ఎంత నల్లగా ఉన్నా అతడు నల్లగా ఉన్నాడని ఎద్దేవా చేయడం క్రూరత్వమేనని తెలుపుతూ 44 ఏళ్ల భర్తకు తన 41 ఏళ్ల భార్య నుంచి విముక్తి కలిగిస్తూ విడాకులు మంజూరు చేసింది కర్ణాటక కోర్టు. బెంగుళూరుకు చెందిన ఓ జంటకు 2007లో పెళ్లయింది. కొన్నాళ్ళకి వారిద్దరికి ఒక అడ బిడ్డ కూడా జన్మించింది. కానీ తరచుగా వారు గొడవ పడుతుండడం.. మాటల మధ్యలో నువ్వు నల్లగా ఉన్నావంటూ ఆమె తిట్టడం.. ఇదొక దైనందిన ప్రక్రియలా కొనసాగేది. దీంతో విసుగు చెందిన ఆ భర్త ఆమె నుండి వేరుగా ఉంటూ 2012లో విడాకుల కోసం ఫ్యామిలి కోర్టును ఆశ్రయించాడు. తన బిడ్డ కోసమే ఆ అవమానాలన్నిటినీ భరించానని ఇక తన వల్ల కాదంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. భర్త విడాకుల కోసం కోర్టుకెక్కడంతో కోపోద్రిక్తురాలైన ఆ భార్య.. తన అత్తమామలు తనను బాగా చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, అదనపు కట్నం తీసుకు రావాలంటూ వేధిస్తున్నారని చెబుతూ భర్త సహా అందరిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేసింది. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం కూడా ఉందంటూ ఆరోపణలు చేసింది. అనంతరం తన బిడ్డను తన తల్లిదండ్రుల వద్దకు పంపించేసింది. అయితే ఐదేళ్లపాటు సాగిన వాదనలు, వాయిదాలు తర్వాత 2017లో ఫ్యామిలి కోర్టు భర్త విడాకుల పిటిషన్ ను తోసిపుచ్చింది. అయినా కూడా శాంతించని భర్త విడాకుల కోసం ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. చివరకు హైకోర్టు కేసు పూర్వాపరాలను పరిశీలించి ఆమె తన భర్తపై చేసిన అక్రమ సంబంధాల ఆరోపణలు నిరాధారమైనవి, నిర్లక్ష్యమైనవని తెలుపుతూ భర్త నల్లగా ఉన్నాడని అవమానించడం కౄరత్వంతో సమానమని చెబుతూ ఆ భర్త కోరినట్లుగా విడాకులు మంజూరు చేసింది. ఇది కూడా చదవండి: రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్ -
బాబోయ్ ఇదేం ప్రయాణం.. నావల్ల కాదు.. ఇలాగైతే కష్టమే!
బెంగుళూరు: వాహనాలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చిన తర్వాత లోకల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే అంతకంటే మరో సౌకర్యం లేదనే స్థితికి చేరుకున్నారు నగరాల్లో నివసించేవారు. కానీ ఆ సౌకర్యంలో అసౌకర్యం కలిగితే ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేశాడు ఓ బెంగుళూరు వాసి. కేవలం 45 నిముషాల ప్రయాణానికి అతను 225 నిముషాలు ఎదురుచూడాల్సి వచ్చింది. అర్జెంటు పని ఏదైనా ఉండి ఏమాత్రం ఆయాస పడకుండా బయటకు వెళ్లాలంటే ఇప్పుడు బోలెడన్నీ ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చేశాయి. ఆన్లైన్లో వాహనాన్ని బుక్ చేసుకుని శరీర అలసట లేకుండానే రివ్వున గమ్యస్థానం చేరుకోవచ్చు. వాహనాన్ని బుక్ చేసుకునే సమయంలో కూడా తొందరగా వచ్చే వాహనాలనే ఎంచుకుని మరీ బుక్ చేసుకుంటాము. కానీ బెంగుళూరులో ఓ వ్యక్తికి ఈ ఆన్లైన్ సేవలో చేదు అనుభవం ఎదురైంది. ర్యాపిడోలో వాహనాన్ని బుక్ చేసుకున్న అతడు కేవలం 45 నిముషాల ప్రయాణం కోసం 225 నిముషాలు వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. సాధారణంగా బెంగుళూరు ట్రాఫిక్ కథనాల గురించి మనం తరచూ వింటూనే ఉంటాము. అలాంటి బెంగుళూరు ట్రాఫిక్ లో ప్రయాణించాలంటే ఆమాత్రం సమయం వెయిటింగ్ చేయక తప్పదు మరి. దీంతో విసుగొచ్చిన ఆ యువకుడు ఈ చోద్యాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో వెయిటింగ్ సమయాన్ని చూపిస్తున్న మొబైల్ స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇంకేముంది కామెంట్ల రూపంలో ఈ పోస్ట్ కు విశేష స్పందన లభించింది. ఆ వెయిటింగ్ సమయంలో ఎంచక్కా ఎక్కువ నిడివి ఉన్న హాలీవుడ్ సినిమా చూసి రావచ్చంటూ కామెంట్లు చేస్తున్నారు. Rapido wait time getting out of hand. 😭 Gotta wait for more than 3.7 hours for 45 minutes travel. @peakbengaluru #rapido #Bengaluru #peakbengaluru pic.twitter.com/7xPO3cBkPz — deyalla (@deyalla_) August 1, 2023 ఇది కూడా చదవండి: అండమాన్ నికోబార్ ద్వీపంలో భూకంపం.. ఐదు రోజుల్లో రెండోసారి.. -
వీడియో వైరల్.. పాఠాలు చెబుతున్న రోబో టీచర్ .. ప్రపంచంలోనే తొలిసారి..
బెంగుళూరు: బెంగళూరులోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో కృత్రిమ మేధస్సుకు పట్టం కడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో టీచర్‌ను పరిచయం చేశారు. 5 అడుగుల 7 అంగుళాల ఎత్తున్న ఈ రోబో టీచర్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు బోధిస్తారు. రోబో పాఠాలు చెబుతున్న వీడియో సామజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ తరహా ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేయబడిన రోబోట్ టీచర్ ప్రపంచంలోనే మొట్టమొదటిది. రోబోట్ టీచర్ ఖచ్చితత్వం నూటికి నూరు శాతం ఉంటుందని తప్పులు చెప్పే ప్రసక్తే లేదని చెబుతున్నారు దీని రూపొందించిన కృత్రిమమేధస్సు నిపుణులు మిస్టర్ రావ్, మిస్టర్ రాహు. బెంగుళూరుకు చెందిన ఈ ఇద్దరు కృత్రిమమేధస్సు నిపుణులు మాట్లాడుతూ విద్యార్థులు కమాండ్ ద్వారా ఈ రోబోట్ ను ప్రశ్నలు అడిగి ఖచ్చితమైన సమాధానాలు పొందవచ్చని చెబుతున్నారు. ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ భవిష్యత్తులో రోబోట్ టీచర్లు ఉపాధ్యాయుల నియామకాన్ని భర్తీ చేసినా ఆశ్ఛరైపోనక్కరలేదంటున్నారు. దీనికి సాధారణ సెలవులు, ప్రత్యేక సెలవులు, వార్షిక సెలవులు, ప్రసూతి సెలవులు, పితృత్వ సెలవులు ఏమీ ఉండవని.. ఏడాది పొడవునా పాఠాలు చబుతూనే ఉంటుందని చెబుతున్నారు. బెంగుళూరు ఇండస్ పాఠశాలలో పాఠాలు చెబుతోన్న ఈ రోబోట్ పంతులమ్మ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రోబో టీచరమ్మ పాఠాలు చెప్పడమే కాదు పిల్లలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతోంది. World's first ROBOT teacher designed by Indian AI experts,started teaching at Bangalore in INDUS school.This 5 feet 7 inch ROBOT teaches Physics,Maths, Biology & Chemistry.This AI Robot teacher is First of it's kind in the world.The Precision is 100% & no margin for error. pic.twitter.com/WNPkTPb3m2 — SHAFAAT SHAH (@INFANTRY28) February 27, 2023 ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో ఘోరం.. కుప్పకూలిన గిర్డర్ లాంచర్.. 15 మంది మృతి -
ఎట్టకేలకు భారత్‌కు చేరుకోనున్న పాకిస్తాన్ జట్టు.. రేపే మ్యాచ్!
వన్డే ప్రపంచకప్-2023లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇండియాకు వస్తుందో రాదో సృష్టత లేదు గానీ ఆ దేశ ఫుట్‌బాల్ జట్టు మాత్రం భారత గడ్డపై అడుగుపెట్టనుంది. దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గోనేందుకు పాకిస్తాన్ ఫుట్‌బాల్ జట్టు బుధవారం(జూన్ 21) ఇండియాకు చేరుకోనుంది. ఈ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఛాంపియన్‌షిప్‌లో బెంగళూరు వేదికగా భారత్-పాకిస్తాన్ జట్ల మధ్యే జరగనుంది. వాస్తవానికి పాకిస్తాన్ జట్టు రెండు రోజుల ముందే భారత్ చేరుకోవాల్సిండగా.. వీసా సమస్య కారణంగా వారి ప్రయాణం ఆలస్యమైంది. కాగా పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం మారిషస్‌లో ఉంది. అయితే ఎట్టకేలకు వారికి వీసా క్లియరన్స్ రావడంతో మంగళవారం భారత్‌కు పయనం కానున్నారు. మంగళవారం సాయంత్రం 5: 30 గంటలకు మారిషస్‌లో బయలు దేరనున్న పాక్ జట్టు.. అదే రాత్రి(బుధవారం) ఒంటి గంటకు ముంబైకు చేరుకోనుంది. అక్కడ నుంచి నేరుగా మ్యాచ్ జరిగే బెంగళూరుకు వెళ్లనున్నారు. ఈ మ్యాచ్ బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జూన్ 21 సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభం కానుంది. ఇక దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్-2023లో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూపు-ఏలో భారత్, కువైట్, నేపాల్, పాకిస్థాన్ జట్లు ఉండగా.. గ్రూపు-బిలో లెబనాన్, మాల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. చదవండి: Shoaib Akhtar ‘Daughter’: 2014లో పెళ్లి.. ఇంత పెద్ద కూతురు ఎలా? హీరోయిన్లా మెరిసిపోతోంది! ఎంతైనా అక్తర్.. MS Dhoni: రోహిత్ వద్దే వద్దు!.. నాడు బీసీసీఐ ధోనిని ఎందుకు కెప్టెన్‌ను చేసిందంటే.. CONFIRMED: The Pakistan NT will leave Mauritius at 5:30pm & reach Mumbai at 1am IST tomorrow. The flight to BLR is around 6am & will land at 8. Then comes the trip from the airport to the hotel, amid the rains. Going to be tough, esp. since rescheduling looks unlikely. #SAFF2023 pic.twitter.com/hpBpFvvd2q — Shyam Vasudevan (@JesuisShyam) June 20, 2023 -
బెంగళూరులో పెరిగిన ఓటింగ్ శాతం
-
మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్ నిద్రిస్తుండటంతో..
బస్టాప్ వద్ద పార్క్ చేసి ఉన్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో బస్సులో కండక్టర్ నిద్రించగా, బస్టాప్‌లోని రెస్ట్‌రూంలో డ్రైవర్ నిద్రించడానికి వెళ్లాడు. దీంతో కండక్టర్ ఈ ప్రమాదం బారినపడి..తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బెంగుళూరులోని లింగధీరహల్లిలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(బీఎంటీసీ) బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. బీఎంటీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో..అదే సమయంలో ఆ బస్సులో కండక్టర్ నిద్రపోతున్నాడు. దీంతో అతను మంట్లో చిక్కుకుని..80 శాతం కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐతే బస్సు డ్రైవర్(39) ప్రకాశ్ ఆ సమయంలో బస్టాప్‌లోని రెస్ట్ రూంలో నిద్రపోవడంతో అతను సురక్షితంగా ఉన్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్టీసీ డీసీపీ పేర్కొన్నారు. ఐతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు అధికారులు. (చదవండి: భారతీయులు అలాంటివి అనుమతించరు! సమాచార మంత్రి ఫైర్) -
వార్నీ.. ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లారు!
యశవంతపుర(బెంగళూరు): బస్టాండ్‌లో బ్యాగ్, మొబైళ్లు చోరీ కావటం వినే ఉంటాం. అయితే ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన బస్సును దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాలు... కల్యాణ కర్ణాటక రవాణాసంస్థ (కెకె ఆర్టీసీ) బస్సు చోరీకి గురైంది. కలబురిగి జిల్లా చించోళి బస్టాండ్‌లో బీదర్ డిపో–2కు చెందిన బస్ (కెఎ–38, ఎఫ్–971)ను సోమవారం రాత్రి నిలిపారు. మంగళవారం తెల్లవారుజామున బస్సును దుండగులు అపహరించారు. ఈ బస్సును ముగ్గురు వ్యక్తులు మిరియాణ, తాండూరు మార్గంలో తెలంగాణ వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. చించోళి పోలీసులు ఆర్టీసీ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి బస్సు కోసం గాలింపు చేపట్టారు. చదవండి లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి -
మెరుగైన చికిత్స కోసం తారకరత్నను విదేశాలకు తరలిస్తారా?
గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గత వారం రోజులుగా ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు బులిటిన్ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కాస్త కోలుకున్నా ఇంకా మెరుగుపడలేదు. గుండెపోటుకు గురైన సమయంలో దాదాపు 45 నిమాషాల పాటు రక్త ప్రసరణ నిలిచిపోవడంతో మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో న్యూరో సర్జన్లతో పాటు 10మంది వైద్యుల బృందం.. ఆయన హెల్త్ కండీషన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తోంది. రీసెంట్గా మెదడు స్కానింగ్ తీసిన వైద్యులు రిపోర్డుల ఆధారంగా ట్రీట్మెంట్ అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మెదడులో స్వెల్లింగ్ క్రమంగా తగ్గుతోందని, వాపు తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజుల్లో తారకరత్న కోలుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లే యోచనలో కుటుంస సభ్యులు ఉన్నట్లు సమాచారం. -
చెప్పేది నాటువైద్యం, చేసేది దోపిడీలు
సాక్షి, బనశంకరి: ఆయుర్వేద మూలికలతో చికిత్స చేస్తామని చెప్పుకుంటూ ప్రజలవద్ద నుంచి డబ్బు దండుకుని వంచనకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను మంగళవారం బెంగళూరు విల్సన్ గార్డెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహమ్మద్ సమీన్ అలియాస్ డాక్టర్ మల్లిక్, సైఫ్ అలీ, మహ్మద్ రహీస్. ఇంటికెళ్లి రూ.8.8 లక్షలతో పరారు వివరాలు... నెలమంగల వద్ద టెంట్లు వేసుకుని నాటు మూలికలు ప్రదర్శిస్తూ మొండి రోగాలను నయం చేస్తామని ప్రజలను నమ్మించేవారు. శాంతినగర బసప్పరోడ్డు నివాసి పంకజ్‌ఠాకూర్ తన తల్లికి కాలి నొప్పికి చికిత్స చేయాలని వీరిని గత నెల 16 తేదీన ఇంటికి తీసుకెళ్లాడు. చికిత్స చేయడానికి ఖర్చవుతుందని వారిని మాటల్లో పెట్టి రూ.8.8 లక్షలు తీసుకుని ఉడాయించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో డీసీపీ శ్రీనివాసగౌడ, ఏసీపీ నారాయణస్వామి ఆధ్వర్యంలో ముఠాను గాలించి పట్టుకున్నారు. వారి నుంచి నాలుగుకార్లు, మూడు ద్విచక్రవాహనాలు రూ.3.50 లక్షలు నగదు, నాటు మూలికలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా వైద్యం పేరుతో ఎంతోమందిని మోసగించినట్లు అనుమానాలున్నాయి. (చదవండి: స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష) -
టైర్ పేలి దూసుకెళ్లిన ఇన్నోవా ..ఐదుగురు మృతి
సాక్షి, మండ్య: వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు టైర్ పేలడంతో డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారును గుద్దింది. ఈ ప్రమాదంలో ఇన్నోవాలోని ముగ్గురు, స్విఫ్ట్‌లోని ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఆదివారం రాత్రి మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని ఎ.నాగతిహళ్ళి వద్ద బెంగళూరు– మంగళూరు హైవే పై జరిగింది. బెంగళూరు నుంచి హాసన్‌వైపు వెళుతున్న ఇన్నోవా కారు టైర్ పేలి అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్ మీదకు దూసుకెళ్లింది. అదే సమయంలో హాసన్ నుంచి బెంగళూరు వైపు వస్తున్న స్విఫ్ట్ కారు మీద ఇన్నోవా పడడంతో రెండు వాహనాలూ తుక్కుతుక్కయ్యాయి. స్విఫ్ట్‌లో ప్రయాణిస్తున్న హాసన్‌కు చెందిన జయంతి (60), శ్రీనివాస్ మూర్తి (60), ఇన్నోవాలోని చెన్నైకి చెందిన కిశోర్ (25), ప్రభాకర్ (75), మరొక 40 సంవత్సరాల వ్యక్తి మృతి చెందారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆదిచుంచనగిరి ఆస్పత్రికి తరలించారు. బిండిగనవిలె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. (చదవండి: పండ్లరసంలో మద్యం కలిపి తాగించి.వృద్ధుడు అఘాయిత్యం) -
పండ్లరసంలో మద్యం కలిపి తాగించి..వృద్ధుడు అఘాయిత్యం
ఒంటరిగా చిన్నారులు కనిపిస్తే చిదిమేయాలనుకునే కామాంధులు సమాజంలో పెరిగిపోయారు. అదే కోవలో ఓ పసిమొగ్గకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి ఒడిగట్టిన వృద్ధుడు కడతేరిపోయాడు. బాధితురాలి కుటుంబీకులు దాడి చేసి కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ఐటీ సిటీలోని హెణ్ణూరు పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సాక్షి, బనశంకరి: మైనర్ బాలికకు పండ్లరసంలో మద్యం కలిపి తాగించి అత్యాచారానికి పాల్పడిన వృద్ధ కామాంధుడు బాలిక బంధువుల దాడిలో విగత జీవి అయ్యాడు. ఈ ఘటన బెంగళూరులో హెణ్ణూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన కుప్పణ్ణ (72) హతుడు. నమ్మించి ఇంట్లోకి పిలిపించి సోమవారం తూర్పు విభాగం డీసీపీ భీమాశంకర్ గుళేద్ కేసు వివరాలను వెల్లడించారు. కుప్పణ్ణ గత నాలుగేళ్లుగా హెణ్ణూరు పరిధిలోని బాబుసాపాళ్యలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇతడు తాపీ కూలీగా పనిచేసేవాడు. ఆదివారం మధ్యాహ్నం పక్కింట్లో ఉండే నాలుగేళ్ల బాలిక ఇంటిపైన ఆరేసిన దుస్తులను తీసుకురావడానికి వెళ్లింది. అక్కడే ఉన్న కుప్పణ్ణ బాలికకు జ్యూస్ ఇస్తానని చెప్పి ఇంట్లోకి పిలిపించుకున్నాడు. సరేనని వెళ్లిన బాలికకు జ్యూస్‌లో మద్యం కలిపి ఇవ్వగా తాగిన బాలిక మత్తులోకి జారుకుంది. వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చి దాడి సాయంత్రం వరకు బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. కుప్పణ్ణ ఉండే ఇంటి పై అంతస్తులో బాలిక స్పృహ తప్పి ఉన్నట్లు తెలిసి బాలికను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో బాలిక వివరంగా చెప్పడంతో బంధువులు అగ్రహోదగ్రులయ్యారు. వెంటనే వెళ్లి కుప్పణ్ణను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు వదిలాడు. మరోవైపు కుప్పణ్ణ తమ బాలిక మీద లైంగిక దాడి చేశాడని హెణ్ణూరుపోలీస్‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి గమనించగా కుప్పణ్ణ శవమై ఉన్నాడు. కుప్పణ్ణ పై పోక్సోయాక్టు కేసు, బాలిక కుటుంబసభ్యులపై హత్యకేసు నమోదైందని డీసీపీ తెలిపారు. హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు. -
అవ్వ... ఓటర్ల డేటా చోరీ
త్వరలో బెంగళూరు పాలికె ఎన్నికలు, ఆపై అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఓటర్ల సమాచారం చోరీ అనే అంశంపై వేడి పుట్టించింది. సీఎం బొమ్మై ఆధ్వర్యంలో ఓ స్వచ్ఛంద సంస్థ బెంగళూరులో ఇంటింటికీ తిరిగి ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని కాంగ్రెస్ ఘాటుగా ఆరోపించింది. ఇవి నిరాధార ఆరోపణలని సీఎం తిరస్కరించారు. శివాజీనగర: ఓటర్ల సమాచారాన్ని బీజేపీవారు ప్రైవేట్ సంస్థతో అక్రమంగా సేకరించారని, ఇందుకు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై బాధ్యుడని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్‌సింగ్ సుర్జేవాలా డిమాండ్ చేశారు. గురువారం కేపీసీసీ కార్యాలయంలో ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్‌లతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ డేటా చౌర్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ చేయాలన్నారు. చెలుమ అనే ప్రభుత్వేతర సంస్థ సిబ్బందికి నకిలీ ఐడీ కార్డులిచ్చి ప్రభుత్వ అధికారుల్లా ప్రవర్తించి ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించిందని ఆరోపించారు. ఇందుకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ సంస్థ అయిన చెలుమ ఓటర్ల సమాచారాన్ని సేకరించడం ఎందుకు?, బూత్ స్థాయిలో అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. దీని వెనకున్న వ్యక్తులు ఓ మంత్రికి సన్నిహితులని పరోక్షంగా మంత్రి అశ్వత్థ నారాయణపై ఆరోపించారు. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ చేయాలని కాంగ్రెస్ నాయకులు పోలీస్ కమిషనర్ ప్రతాపరెడ్డికి ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలు: సీఎం ఓటర్ల డేటా చోరీపై కాంగ్రెస్ ఆరోపణ నిరాధారమని, ఫిర్యాదుపై తక్షణమే విచారణ జరుగుతుందని సీఎం బొమై్మ తెలిపారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ కార్యాన్ని ఎన్నికల కమిషన్, బీబీఎంపీ, స్థానిక సంస్థలు ఎన్జీఓలకు ఇస్తారు. 2008లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు ఇలాగే ఇచ్చారని చెప్పారు. ఒక ఎన్జీఓకు ఎన్నికల కమిషన్, బీబీఎంపీ అనుమతినిచ్చింది. వారు దురి్వనియోగం చేశారనే ఆరోపణపై విచారణ చేయాలని సూచించానని తెలిపారు. కాంగ్రెస్‌వారు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సర్వేకు అనుమతి ఇవ్వలేదు: ఈసీ బీబీఎంపీ వ్యాప్తిలో ఓటర్ల సర్వే నిర్వహించేందుకు ఏ సంస్థకు అనుమతి ఇవ్వలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ మీనా చెప్పారు. కాంగ్రెస్ నాయకుల ఆరోపణల నేపథ్యంలో ఆయన ప్రకటన విడుదల చేశారు. ఏ సంస్థకు సమీక్ష కు అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వేతర సంస్థ చెలుమ కు ఓటర్ల జాగృతి అభియాన జరపడానికి అనుమతివ్వగా, ఆ సంస్థపై ఫిర్యాదు రావటంతో తక్షణమే బీబీఎంపీ ఎన్నికలాధికారి రద్దు చేశారని తెలిపారు. బూత్ స్థాయి అధికారి గుర్తింపు కార్డు దుర్వినియోగం ఘటనలో మహాదేవపుర ఓటర్ల నమోదు అధికారి వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. (చదవండి: మంటల్లో బ్యాంకు అధికారి...మొబైల్ ఫోన్ పేలడమా? ఆత్మహత్య?) -
నటుడు అర్జున్ ఇంట తీవ్ర విషాదం
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి లక్ష్మి దేవమ్మ(85) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. తల్లి మరణంతో హీరో అర్జున్ ఇంట ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపుడుతున్న ఆమె శనివారం(జూలై 23న) బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె పార్థివ దేహం ఆస్పత్రిలోనే ఉన్నట్లు సమాచారం. కాగా లక్ష్మి దేవమ్మ మృతి పట్ల కన్నడ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తూ అర్జున్ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. కాగా లక్ష్మి దేవమ్మ మైసూర్లో స్కూల్ టీచర్‌గా పనిచేశారు. చదవండి: నేనింకా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం వారే: హీరోయిన్ సూర్య సినిమాకు జాతీయ అవార్డుల పంట -
తుది సమరానికి వరుణుడి ఆటంకం..!
బెంగళూరు వేదికగా అఖరి టీ20లో తాడో పేడో తేల్చుకోవడానికి దక్షిణాప్రికా, భారత జట్లు సిద్దమయ్యాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. అయితే ఈ తుదిపోరుకు వరుణుడు ఆటంకి కలిగించే అవకాశం ఉంది. గత వారం రోజులుగా బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్య జరిగిన పలు రంజీ మ్యాచ్‌లకు కూడా వర్షం ఆటంకి కలిగించింది. అక్యూవెదర్ ప్రకారం.. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం బెంగళూరులో ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 84 శాతంగా రికార్డయింది. అదే విధంగా మ్యాచ్ సమయంలో తేమ 92 శాతం నుంచి 93 శాతం వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: Former Cricketer Salil Ankola: దిగ్గజ క్రికెటర్‌తో పాటే అరంగేట్రం.. క్రికెట్‌పై అసూయ పెంచుకొని -
ఐపీఎల్ మెగా వేలానికి డేట్స్ ఫిక్స్!
IPL 2022 Mega Auction Date: ఐపీఎల్ -2022 మెగా వేలానికి ముహర్తం ఫిక్స్ అయింది. కొత్త ఫ్రాంచైజీల రాక, పాత జట్లు విడుదల చేసిన ఆటగాళ్లతో ఈసారి మెగా వేలానికి ప్రాధాన్యత సంతరించుకుంది.. బెంగళూరులో వచ్చే ఫిబ్రవరి 12, 13 తేదీల్లో మెగా వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని బోర్డు అధికారికంగా ధ్రువీకరించక పోయినా... మెగా వేలం ఫిబ్రవరి 12, 13వ తేదీలోల ఉంటుందని ఐపీఎల్ స్టేక్ హోల్డర్లు, ఫ్రాంచైజీ యాజమాన్యాలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. చదవండి: ఆసియా కప్‌లో భారత్ శుభారంభం.. దుమ్మురేపిన హర్నర్, యశ్దల్ -
యువ క్రికెటర్లకు రోహిత్ పాఠాలు.. ఫోటోలు వైరల్!
Rohit Sharma: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ బెంగళూరులో ఉన్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకొనేందుకు నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ సెంటర్‌కువచ్చాడు. ఇక అక్కడ శిక్షణ పొందుతున్న భారత అండర్-19 జట్టుతో రోహిత్ శర్మ ముచ్చటించాడు. యూఏఈ వేదికగా డిసెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్ కోసం నేషనల్ క్రికెట్ అకాడమీలో అండర్-19 జట్టు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రోహిత్ అండర్ 19 జట్టుతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సమయంలో యువ ఆటగాళ్లకు రోహిత్ విలవైన సూచనలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎలా రాణించాలో, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అన్నది ఆటగాళ్లకు రోహిత్ తెలియజేశాడు. వైట్ బాల్ క్రికెట్లో తనదైన ముద్ర వేసుకున్న రోహిత్ శర్మ.. తన అనుభవాన్ని ఆటగాళ్లతో పంచకోవడం రానున్న ఆసియా కప్‌లో యువ క్రికెటర్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. "టీమిండియా వైట్ బాల్ కెప్టెన్ రోహిత్ శర్మ.. బెంగళూరులోని ఎన్సీఏలో ఉన్న భారత అండర్-19 జట్టుతో చాలా సమయాన్ని గడిపాడు. ఈ సమయంలో అతడు చాలా విలువైన సూచనలు చేశాడు" అని బీసీసీఐ రాసుకొచ్చింది. ఇక రిహాబిలిటేషన్ సెంటర్లో రోహిత్ శర్మతో పాటు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. చదవండి: IND Vs SA: అతడిని కచ్చితంగా భారత జట్టులోకి తీసుకోవాలి.. ఎందుకంటే! Priceless lessons 👍 👍 📸 📸 #TeamIndia white-ball captain @ImRo45 made most of his rehab time as he addressed India’s U19 team during their preparatory camp at the NCA in Bengaluru. pic.twitter.com/TGfVVPeOli — BCCI (@BCCI) December 17, 2021 -
కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు..
Kannada Super Star Puneeth Rajkumar Passed Away: ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇకలేరు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. (పునీత్ రాజ్‌కుమార్ పార్థీవ దేహం) పునీత్ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. కాగా 1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన పునీత్... 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు. భారతీయ సినిమాకు, మరీ ముఖ్యంగా కన్నడ సినిమాకు ముఖ్య అధ్యాయం రాజ్‌కుమార్. నట సార్వభౌముడు, బంగారు మనిషి, కన్నడ కంఠీరవ, కింగ్ ఆఫ్ రొమాన్స్.. ఇలా కన్నడ సినిమా ఆయన్ను ముద్దుగా పిలుచుకుంది. రాజ్‌కుమార్‌కు ఉన్న ఐదుగురు సంతానంలో ఆఖరివాడు లోహిత్. 1975 మార్చి 19న చెన్నైలో రాజ్‌కుమార్–పార్వతమ్మలకు జన్మించాడు లోహిత్. ఆరు నెలల పసికందుగా ఉన్నప్పుడే తండ్రి రాజ్‌కుమార్ నటించిన ‘ప్రేమద కానికే’ (1976) చిత్రంలో తొలిసారి తెరపై మెరిశాడు. లోహిత్ పేరుతోనే తెరకు పరిచయమయ్యాడు. అయితే అప్పటికే అలాంటి పేరుతో ఓ బాలనటుడు ఉండటంతో కన్ఫ్యూజ్ అవుతుందని పునీత్‌గా మార్చారు. రెండో సినిమా ‘సన్నాది అప్పన్నా’ (1997) నుంచి పునీత్ రాజ్‌కుమార్‌గా మారిపోయాడు లోహిత్. ఆ తర్వాత ‘తాయిగే తక్క మగ’ (1978), ‘వసంత గీత’ (1980), ‘భూమిగే బంద భగవంత’ (1981), ‘భాగ్యవంత’ (1982) సినిమాల్లో నటించాడు. ‘భాగ్యవంత’తోనే తొలిసారి గాయకుడిగానూ మారాడు. అదే ఏడాదిలో తన తండ్రితో కలసి చేసిన ‘చాలుసివ మొడగళ్లు’కి గానూ కర్నాటక ప్రభుత్వం ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందించింది. ఆ తర్వాత ‘భక్త ప్రహ్లాద’ చిత్రంలో ప్రహ్లాద పాత్ర చేశాడు. అలాగే సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘ఎరడు నక్షత్రగళు’ చిత్రంలో బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమాకు ఉత్తమ బాలనటుడిగా కర్నాటక ప్రభుత్వం నుంచి రెండో అవార్డు అందుకున్నాడు. ఇక ‘బెట్టద హూవు’ (1985) చిత్రానికి ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు. 1988లో తన పెద్దన్నయ్య శివ రాజ్‌కుమార్ చేసిన ‘శివ మెచ్చిడ కన్నప్ప’ చిత్రంలో బాల కన్నప్ప పాత్ర చేశాడు. బాలనటుడిగా పునీత్ చేసిన చివరి చిత్రం ‘పరశురామ’ (1989). బాలనటుడిగా పునీత్ కెరీర్ వైభవంగా సాగింది. వ్యాపారం టు వెండితెర హీరో కొడుకు హీరోనే అవ్వాలా.. వద్దు.. మనం రూటు మార్చుదాం అనుకున్నారు పునీత్. అందుకే వ్యాపారాలు చేశారు. అయినా సినిమా నేపథ్యం వదులుతుందా? తప్పక సినిమాల్లోకి రావాల్సి వచ్చింది. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ కొడుకు కదా.. అభిమానులు కోరితే రావాల్సిందే. తండ్రి కూడా ‘ఒకసారి ట్రై చెయ్’ అన్నారు. తండ్రి మాట కాదనని కొడుకు... అందుకే హీరో అవ్వాలని ఫిక్సయ్యాడు. తొలి సినిమా పేరే ముద్దు పేరుగా... హీరో అవ్వాలనుకున్న తర్వాత పునీత్ తన నటన, డ్యాన్సింగ్ స్కిల్స్ మీద దృష్టి పెట్టాలనుకోలేదు. ఫిట్నెస్ మీదే దృష్టి పెట్టారు. అప్పటికి కాస్త బొద్దుగా ఉన్న పునీత్ తగ్గాలనుకున్నారు. అప్పుడు ఆరంభించిన కఠినమైన ఫిట్నెస్ ట్రైనింగ్ చనిపోయే రోజు ఉదయం వరకూ కొనసాగింది. ఇక పునీత్‌ని హీరోగా పరిచయం చేసే ఛాన్స్ మన డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌కి దక్కింది. 2002లో పునీత్‌ని హీరోగా పరిచయం చేస్తూ ‘అప్పుు’ తెరకెక్కించారు పూరి. రవితేజ ‘ఇడియట్’ సినిమాకు ఇది ఒరిజినల్. పునీత్ కోసం çపూరి రాసిన కథ రాజ్‌కుమార్ కుటుంబానికి నచ్చింది. బాక్సాఫీస్ బంపర్ హిట్‌తో రాజ్‌కుమార్ కుటుంబానికి కావాల్సిన మ్యాజిక్‌ని పూరి చేశారు. అయితే సినిమా నేపథ్యం ఉండి, అది కూడా మాస్ హీరో ఇమేజ్ ఉన్న కుటుంబం నుంచి పరిచయమయ్యే హీరోలకు మొదటి సినిమా అంటే.. అప్పటివరకూ ఆ ఫ్యామిలీ సాధించిన ఇమేజ్‌ని, వాళ్లు చేసిన సినిమాలను ముందుకు తీసుకెళ్లడమే. ఆ వారసత్వానికి కొనసాగింపులాగా అన్నమాట. బోలెడంత ఫాలోయింగ్‌తో పాటు బండెడు ఒత్తిడి, అంతులేని అంచనాలు ఉంటాయి. వీటన్నింటినీ దాటడం సులువు కాదు. అభిమానులను, ప్రేక్షకులను సంతృప్తిపరచడం అంతకన్నా సులువు కాదు. కానీ వీటన్నింటినీ సునాయాసంగా దాటేశారు పునీత్. అభిమానులకు ‘అప్పు’... కన్నడ సినిమా బాక్సాఫీస్‌కి ‘పవర్‌స్టార్’ అయిపోయారు. తొలి సినిమా అప్పటినుంచి ప్రేక్షకులు ‘అప్పు’ అని పునీత్‌ని పిలవడం మొదలుపెట్టారు. రీమేక్ స్పెషలిస్ట్ పునీత్ కెరీర్ గ్రాఫ్‌ని గమనిస్తే ఎక్కువగా రీమేక్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రీమేక్స్. పునీత్‌ని హీరోగా లాంచ్ చేయడంతో పాటు సూపర్‌స్టార్ ఇమేజ్‌కి పునాదులు వేసింది పూరీ కథలే అని చెప్పొచ్చు. 2004లో పునీత్ చేసిన ‘వీర కన్నడిగ’ బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్. తెలుగులో ‘ఆంధ్రావాలా’గా ఎన్టీఆర్ హీరోగా పూరి, ఇదే చిత్రాన్ని కన్నడంలో ‘వీర కన్నడిగ’ పేరుతో మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘అమ్మా నాన్న ఓ తమ్మిళ అమ్మాయి’ చిత్రం ‘మౌర్య’ రీమేక్‌లో నటించారు పునీత్. ఈ చిత్రానికి ఎస్. నారాయణ్ దర్శకుడు. 2006లో ‘ఒక్కడు’ చిత్రాన్ని ‘అజయ్’ టైటిల్‌తో పునీత్‌తో తెరకెక్కించారు మెహర్ రమేష్. కన్నడ భాషలోనూ ఈ చిత్రం బ్లాక్‌బస్టర్. పునీత్ రాజ్‌కుమార్‌ని ‘పవర్‌స్టార్’ని చేసింది ఈ చిత్రం. ఆ తర్వాత ‘రెyీ , దూకుడు’ చిత్రాలను ‘రామ్’ (2009), ‘పవర్’ (2015) అనే టైటిల్స్‌తో రీమేక్ చేశారు పునీత్. అలాగే తమిళ సినిమాలు ‘నాడోడిగళ్’, ‘పోరాళి’, ‘పూజై’, చిత్రాలను ‘హుద్గరు’, ‘అన్నా బాండ్’, అంజనీపుత్ర’గా రీమేక్ చేశారు. హీరోగా దాదాపు 30 చిత్రాల్లో నటించారు. వసూల్ రాజ్ పునీత్ సినిమాలు టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్స్ కొల్లగొట్టేస్తుండేవి. ఇక మంచి టాక్ అంటే రికార్డులు సృష్టిస్తాయి. 2017లో రిలీజ్ అయిన ‘రాజకుమార’ కన్నడ బాక్సాఫీస్ హిస్టరీలోనే అత్యంత వసూళ్లు సాధించిన చిత్రంగా పేరు పొందింది. డ్యాన్సింగ్ డైనమైట్.. సూపర్ సింగర్ పునీత్ డ్యాన్స్‌కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన డ్యాన్సులు ప్రేక్షకులకు మజా ఇచ్చేవి. అలాగే ఆయన సినిమాల్లో స్టంట్స్ కూడా ప్రత్యేకంగా ఉండేవి. నటనతో పాటు తండ్రిలా అద్భుతంగా పాడటాన్ని కూడా పునీత్ పుణికి పుచ్చుకున్నారు. తొలి చిత్రం ‘అప్పు’లో ‘తాలిబన్ అల్లా అల్లా’ అనే పాటను పాడారు. ఆ తర్వాత ‘వంశీ, జాకీ’ వంటి సినిమాల్లో పాటలు పాడారు. తన సోదరుడు శివ రాజ్‌కుమార్ చేసిన ‘లవకుశ, మయిలారీ’ చిత్రాల్లోనూ పాడారు. తన సొంత బ్యానర్లో కాకుండా బయట ఎవరి సినిమాలో పాట పాడినా సరే ఆ పారితోషికం విరాళంగా ఇచ్చేసేవారు పునీత్. బుల్లితెర హోస్ట్‌గా.. కన్నడ సిల్వర్ స్క్రీన్‌ని షేక్ చేయడంతో పాటు బుల్లితెరపై కూడా హోస్ట్‌గా అలరించారు పునీత్. 2012లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కన్నడ వెర్షన్ ‘కన్నడ కోట్యాదిపతి’కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అలాగే ‘ఫ్యామిలీ పవర్’ అనే కన్నడ షోను కూడా హోస్ట్ చేశారు. నిర్మాతగా... మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలతో దూసుకెళ్తున్నప్పటికీ నిర్మాతగా తన టేస్ట్‌ని చూపించుకున్నారు పునీత్. 2019లో కన్నడ చిత్రం ‘కవలుదారి’తో నిర్మాతగా మారారు. ఆ ఏడాది కన్నడంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ఇదొకటి. ఈ సినిమాను ‘కపటధారి’గా రీమేక్ చేశారు సుమంత్. ఆ తర్వాత ‘మాయాబజార్ 2016, లా, ఫ్రెంచ్ బిర్యానీ’ చిత్రాలు నిర్మించారు. ‘లా, ఫ్రెంచ్ బిర్యానీ’ చిత్రాలను కోవిడ్ వల్ల నేరుగా అమెజాన్‌లో విడుదల చేశారు పునీత్. ప్రస్తుతం ‘ఫ్యామిలీ ప్యాక్, వన్ కట్ టూ కట్ యాన్ ఫ్లవర్ ఈజ్ కేమ్’ అనే సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. రెండు రోజుల్లో ప్రకటిస్తానని... 2021లో వచ్చిన ‘యువరత్న’ పునీత్ తెరపై కనిపించిన చివరి సినిమా. కరోనా లాక్డౌన్ వల్ల ఆయన నటించిన తాజా చిత్రం ‘జేమ్స్’ విడుదల ఆలస్యం అయింది. ఇటీవల ‘ద్విత్వా’ అనే సినిమాని ప్రకటించారు. అలాగే నవంబర్ 1న తన రెండు కొత్త చిత్రాలపై ప్రకటన చేస్తానని ఈ మధ్య పునీత్ ట్వీట్ కూడా చేశారు. ఈలోపు ఇలా జరిగిపోయింది. సేవా పునీత్ పెద్ద కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కించిత్ గర్వం లేకుండా పెద్దవారిని గౌరవిస్తూ అజాత శత్రువుగా, అందరికీ ప్రియమైనవాడిగా పునీత్ రాజ్‌కుమార్ కీర్తి పొందారు. మృదుస్వభావి, మితభాషి అనిపించుకున్నారు. పునీత్ మంచి నటుడు, డ్యాన్సర్, సింగర్... ఇలా వృత్తిపరంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. వ్యక్తిగతంగా ‘మంచి మనిషి’. సేవా కార్యక్రమాలు చాలా చేశారు. దాదాపు 26 అనాథాశ్రమాలు, 45 పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలకు పునీత్ సాయం అందిస్తూ వచ్చారు. ‘శక్తిధామ’ అనే సంస్థ ఆధ్వర్యంలో చదువుకుంటున్న దాదాపు 1800 మంది స్టూడెంట్స్‌కు పునీత్ సాయంగా ఉంటున్నారు. వరదలు వచ్చినప్పుడు 5 లక్షలు, కరోనా సమయంలో కర్నాటక ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల విరాళాన్ని పునీత్ ఇవ్వడం జరిగింది. ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా సహాయాలు చేయాలనే ప్లాన్స్ పునీత్‌కి ఉండేవి. అయితే విధి ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. ‘‘గతంలో ఏం జరిగిందో గుర్తుండదు.. ముందు ఏం జరుగుతుందో తెలియదు... ఏమి తిన్నామో.. ఎక్కడ పడుకున్నామో అన్నీ మరచిపోతాం.... అంతా విధి.. మనదేమీ లేదు...’’ ఒక సినిమాలో పునీత్ చెప్పిన డైలాగ్ ఇది. నిజమే... విధి మన చేతుల్లో ఉండదు. అయితే మరణించాక కూడా జీవించడం మన చేతుల్లో ఉంటుంది. పునీత్ రాజ్‌కుమార్ తాను చేసిన మంచి పనుల్లో జీవించే ఉంటారు. పునీత్ కళ్లు ప్రపంచాన్ని చూస్తాయి. నేత్రదానం చేయాలన్న ఆయన ఆకాంక్షను కుటుంబ సభ్యులు నెరవేర్చారు. పునీత్ మనసు ఉన్నతం... మనిషి పునీతం... ఆయనకు లేదు మరణం. -
డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు
Singham 2 Actor Arrested For Smuggling Drugs: డ్రగ్స్ వినియోగిస్తూ నటుడు మెల్విన్ పోలీసులకు పట్టుబడ్డాడు. వివరాల ప్రకారం..సూర్య హీరోగా నటించిన సింగం-2 సినిమాలో నటించిన నైజీరియన్దేశస్థుడు, నటుడు చాక్విమ్ మాల్విన్ గుర్తున్నాడు కదా.. ఆ సినిమాలో అక్రమంగా డ్రగ్స్ సప్లై చేసే ముఠాకు సంబంధించిన వాడిగా నటించాడు మాల్విన్. సీన్ కట్ చేస్తే నిజ జీవితంలో కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. చదవండి : అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే.. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 15లక్షల వరకు ఉంటుందని సమాచారం. 15 గ్రాముల MDMAతో పాటు 250 మిల్లీలీటర్ల హ్యాష్ ఆయిల్ సహా మొభైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనంలోకి తీసుకున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో మెల్విన్ డ్రగ్స్ వ్యాపారంలోకి దిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే మెల్విన్‌తో సినీ పరిశ్రమకు చెందిన ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయి?అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా కన్నడ, తమిళ, హిందీ భాషల్లో మెల్విన్ పలు చిత్రాల్లో నటించాడు. చదవండి: ‘డ్రైవింగ్ లైసెన్స్’ తీసుకోనున్న అక్షయ్‌కుమార్ -
డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు : నటి సోనియా
Bengaluru Drug Case : కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో హీరోయిన్స్ రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్ అయి ఇటీవలె బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా నటి, మోడల్ సోనియా అగర్వాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె ప్రస్తుతం కర్ణాటకలో కాస్మోటిక్ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. తాజాగా బెంగుళూరులో ఏకకాలంలో జరిపిన సోదాల్లో సోనియాతో పాటు మరో వ్యాపారవేత్త భరత్, డీజే వచన్ చిన్పప్ప ఇళ్లలో డ్రగ్స్ బయటపడ్డాయి. దీంతో వీరందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరికి వీరికి నైజీరియా డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా డ్రగ్స్ వ్యవహారంలో నటి సోనియా అగర్వాల్ అరెస్ట్ కాగా కొన్ని మీడియా సంస్థలు అత్యత్సాహంతో ఆమెకు బుదులుగా సినీ నటి సోనియా అగర్వాల్ ఫోటోను ప్రచురించాయి. పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో భయపడి ఆమె బాత్రూంలో దాక్కుందని, అయినా లాక్కొచ్చి పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో అంతా 7/జీ బృందావన కాలనీ ఫేమ్ సోనియానే అనుకున్నారు. కానీ సోనియా ఆ వార్తలను కొట్టిపారేశారు. ఈ కేసుతో తనకు ఏ సంబంధం లేదని, అసలు పోలీసులు రైడ్ చేసింది తన ఇంట్లో కాదని, ఆ సమయంలో తాను కేరళలో షూటింగ్లో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన గురించి తప్పుడు వార్తలు ప్రచురించిన మీడియా సంస్థలు, వెబ్సైట్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. చదవండి : Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన చార్మీ ‘ఇద్దరు పిల్లల తల్లిని.. విచారణకు హాజరుకాలేను’ -
వర్క్‌ఫ్రమ్ హోం: మరో ఏడాదిన్నర ఇచ్చేయండి
Work From Home Request To IT Firms: ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరుకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఇక్కడ కొలువైన ఐటీ కంపెనీలకు ప్రభుత్వం నుంచి కొత్త రకం విజ్ఞప్తి వచ్చింది. మరికొద్ది కాలం పాటు వర్క్‌ఫ్రం హోం కొనసాగించాలంటూ ఐటీ కంపెనీలను ప్రభుత్వం విశేషం. ఎప్పటి వరకు వర్క్‌ఫ్రం హోం దేశంలో ఐటీ పరిశ్రమలకు రాజధాని బెంగళూరు, వేల సంఖ్యలో ఇక్కడ ఐటీ కంపెనీలు నెలకొల్పారు. లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు ఈ నగరంలో నివసిస్తున్నారు. అయితే 2020లో వచ్చిన కరోనాతో అన్ని ఐటీ కంపెనీలు ఆఫీసులకు తాళాలు వేసి వర్క్‌ఫ్రం హోం విధానం అమలు చేస్తున్నాయి. ఇటీవల పరిస్థితులు కొంత మేరకు చక్కబడటంతో తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా ఐటీ ఉద్యోగులకు కంపెనీలు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయాన్ని మరో ఏడాదిన్నర పాటు వాయిదా వేసుకోవాలని కర్నాటక ప్రభుత్వం కోరింది. 2022 డిసెంబరు వరకు వర్క్‌ఫ్రం హోం అమలు చేయాలని సూచించింది. వర్క్‌ఫ్రం హోం కారణం ఏంటీ బెంగళూరు మెట్రో రైలు కార్పోరేషన్ లిమిటెడ్ ఇటీవల అవుటర్ రింగ్ రోడ్డులో ఉన్న సిల్క్ రోడ్డు నుంచి కేఆర్‌పురం వరకు మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టింది. దాదాపు రెండేళ్ల పాటు ఈ పనులు సాగుతాయని కంపెనీ చెబుతోంది. దీంతో అవుటర్ రింగురోడ్డులో మెట్రో పనుల కోసం రోడ్డులో కొంత భాగాన్ని ఉపయోగిస్తారు. ఫలితంగా ఈ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తుతాయని కర్నాటక ప్రభుత్వం చెబుతోంది. అందువల్ల మెట్రో పనులు పూర్తయ్యే వరకు ఐటీ కంపెనీలు వర్క్‌హోం అమలు చేయాలంటూ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్)కి కర్నాటక ప్రభుత్వం లేఖ రాసింది. ఎందుకీ పరిస్థితి ఎదురైంది బెంగళూరులో అవుటర్ రింగురోడ్డు పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువ ఐటీ కంపెనీలు ఉన్నాయి. ప్రతీ రోజు ఈ రోడ్డుపై ట్రాఫిక్ జాం నిత్యకృత్యంగా మారింది. ఈ సమస్య పరిష్కరించడం బెంగళూరు పోలీసులకు తలనొప్పిగా మారింది. కరోనా ఎఫెక్ట్‌తో గత ఏడాదిన్నరగా ఈ రోడ్డులో ట్రాఫిక్ సమస్యల బాధ తప్పింది. ఇప్పుడు ఓ వైపు మెట్రో పనులు, మరో వైపు ఐటీ ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు వస్తుండటంతో ట్రాఫిక్ సమస్య పెద్దదిగా మారుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. తద్వారా ఇండియా ఐటీ హబ్‌గా పేరున్న బెంగళూరు బ్రాండ్‌కి చేటు జరుగుతుందనే ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ప్రత్యామ్నాయం లేదా ? ఉద్యోగులను ఇప్పుడప్పుడే ఆఫీసులకు పిలవద్దొన్న ఐటీ కంపెనీలను కోరిన ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలు కూడా వారికి సూచించింది. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటే వారిని వ్యక్తిగత వాహనాల్లో కాకుండా బస్సులు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో వచ్చేలా చూడాలంటూ సలహా ఇచ్చింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు పట్ల ఉద్యోగులకు అభ్యంతరాలు ఉంటే సైకిళ్లు వినియోగించేలా వారిని ప్రోత్సహించాలని కంపెనీలకు కర్నాటక సర్కార్ సూచించింది. హైదరాబాద్ పరిస్థితి ఏంటీ పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది. బెంగళూరు తర్వాత ఐటీ రంగంలో ఆ స్థాయి ఉన్న నగరం హైదరాబాద్. ఇక్కడ సైతం ట్రాఫిక్ సమస్యలు తప్పలేదు. కరోనాకు ముందు ట్రాఫిక్ సమస్య కారణంగా షిఫ్ట్ టైమింగ్స్‌లో మార్పులు చేసుకోవాలని ఐటీ కంపెనీలను నగర పోలీసు విభాగం కోరింది. చదవండి : Flipkart: కిరాణా వర్తకులకు ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్ -
విషాదం : ప్రముఖ సినీ నటి జయంతి కన్నుమూత
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి జయంతి (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తెల్లవారుజామున బనశంకరిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1963లో కన్నడలో 'జెనుగూడు' చిత్రంతో సినీ ప్రవేశం చేసిన జయంతి..తెలుగు, తమిళ, మలయాళం, హిందీ చిత్రాల్లో వందకు పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటివరకు సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీ రామచంద్రన్ వంటి ప్రముఖులతో నటించారు. మోహన్ బాబు నటించిన పెదరాయుడు చిత్రంలో నటనకు గాను తెలుగులోనూ జయంతికి మంచి గుర్తింపు వచ్చింది. వీటితో పాటు జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, శాంతి నివాసం వంటి చిత్రాల్లోనూ విభిన్న పాత్రలతో మెప్పించారు. జయంతి హఠాన్మరణంతో కన్నడ నాట విషాద ఛాయలు అలుముకున్నాయి. జయంతి మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ಪ್ರಖ್ಯಾತ ಹಿರಿಯ ಕಲಾವಿದೆ, ಅಭಿನಯ ಶಾರದೆ ಜಯಂತಿ ಅವರ ನಿಧನದ ಸುದ್ದಿ ಅತೀವ ದುಃಖ ತಂದಿದೆ. ಚಿತ್ರರಂಗಕ್ಕೆ ಅವರ ಕೊಡುಗೆ ಅಪಾರವಾಗಿದ್ದು, ಕನ್ನಡ ಕಲಾಲೋಕಕ್ಕೆ ತುಂಬಲಾರದ ನಷ್ಟವುಂಟಾಗಿದೆ. ದೇವರು ಅವರ ಆತ್ಮಕ್ಕೆ ಸದ್ಗತಿ ಕರುಣಿಸಲಿ, ಅವರ ಕುಟುಂಬ, ಅಪಾರ ಅಭಿಮಾನಿ ಬಳಗಕ್ಕೆ ನೋವನ್ನು ಭರಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ನೀಡಲಿ ಎಂದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. pic.twitter.com/JuGWeyX4Ce — B.S. Yediyurappa (@BSYBJP) July 26, 2021 Senior actress Jayanthi (76 years) passed away @NewIndianXpress @santwana99 pic.twitter.com/ryhwPpJlSa — Ashwini M Sripad/ಅಶ್ವಿನಿ ಎಂ ಶ್ರೀಪಾದ್ (@AshwiniMS_TNIE) July 26, 2021 -
నకిలీ పత్రాలతో రుణం..బెంగుళూరుకు నటుడు దర్శన్
యశవంతపుర: తన ఆస్తుల నకిలీ పత్రాలతో రూ.కోట్లకు రుణ బాగోతం, హోటల్ సప్లయర్‌పై దాడి, పలువురు సినీ ప్రముఖులతో వాగ్వాదాలతో సతమతమవుతున్న నటుడు దర్శన్ మైసూరు వద్ద తన ఫాంహౌస్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు. మరోవైపు దర్శక నిర్మాత ఇంద్రజిత్ లంకేష్‌తో మాటల యుద్ధం సాగుతోంది. హోటల్లో దాడి ఘటనలో సత్తా ఉంటే ఆడియోను ఇంద్రజిత్ విడుదల చేయాలని దర్శన్ సవాల్ చేయగా, సత్తా నిరూపించుకునే అవసరం తనకు లేదని ఇంద్రజిత్ చెప్పారు. హోటల్లో దాడి చేయలేదని ధర్మస్థల మంజునాథస్వామిపై దర్శన్ ప్రమాణం చేయాలని ఇంద్రజిత్ సవాల్ చేశారు. దర్శన్‌పై ప్రేమ్ అసహనం దర్శన్ విషయంలో సినిమా పెద్దలు పెద్ద మనస్సుతో రాజీ చేసి వివాదాలకు చరమగీతం పాడాలని నటుడు జగ్గేశ్ పేర్కొన్నారు. ఇక అనవసరంగా దర్శన్ తన పేరును ప్రస్తావించడం సరికాదని దర్శకుడు ప్రేమ్ అసహనం వ్యక్తం చేశారు. దర్శన్ మా కుటుంబానికీ స్నేహితుడన్నారు. తమ గురించి ఎందుకు అలా మాట్లాడారో తెలియదన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని నలుగురు ఆత్మహత్య
మైసూరు: ఆర్థిక ఇబ్బందులతో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటకలోని చామరాజనగర తాలూకా హెచ్.మూకహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మహదేవస్వామి (45), భార్య మంగళమ్మ (40), పిల్లలు జ్యోతి (14), శృతి (12) ఉరి వేసుకుని మరణించారు. వీరికి ఒక ఎకరా పొలం ఉంది. తరచూ నష్టాలే వచ్చాయి. అలాగే అప్పులు పెరిగిపోయాయి. కరోనా సమయంలో కూలి పనులు కూడా దొరకక తీవ్ర అవస్థలు పడ్డారు. 20 రోజుల క్రితం నలుగురికీ కరోనా సోకి, ఇటీవలే కోలుకున్నారు. జీవితంలో కష్టాలు తీరే మార్గం లేదని ఆవేదన చెంది మంగళవారం రాత్రి భోజనం చేశాక అందరూ ఉరివేసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతసేపైనా అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూడగా మృతదేహాలు కనిపించాయి. మొదట పిల్లలకు ఉరివేసి, తరువాత పెద్దవారు ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ గ్యాంగ్‌రేప్ నిందితుడు) -
పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ గ్యాంగ్‌రేప్ నిందితుడు
కృష్ణరాజపురం: బంగ్లాదేశ్ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సోబజ్ పోలీసు కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులపై దాడికి పాల్పడగా... అత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో అతని కాలికి తూటా గాయమైంది. ఈ ఘటన బెంగళూరు రామ్మూర్తినగర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల బెంగళూరులో బంగ్లాదేశ్‌కు చెందిన వలస కూలీలు విందు చేసుకుని, అందులో ఒక యువతిపై దుండగులు లైంగిక దాడికి పాల్పడడం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళల్ని అరెస్టు చేశారు. 10వ నిందితుడు సోబజ్... రామ్మూర్తి నగర పోలీసుస్టేషన్ పరిధిలోని రాంపుర చెరువు సమీపంలోని ఒక గుడిసెలో ఉన్నాడని తెలిసి బుధవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి అతన్ని అరెస్టు చేశారు. నిందితుడిని పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో మూత్ర విసర్జన కోసం వాహనాన్ని నిలపాలని కోరాడు. వాహనం దిగి వెళ్తూ తన వెనుకే వస్తున్న హెడ్ కానిస్టేబుల్ దేవేంద్ర నాయక్‌పై చాకుతో దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డుకున్న ఎస్ఐ శివరాజ్పైనా దాడి చేశాడు. దీంతో ఎస్ఐ శివరాజ్ పిస్టల్‌తో కాల్చడంతో నిందితుని ఎడమ కాలికి గాయమైంది. నిందితునితో పాటు హెడ్‌కానిస్టేబుల్, ఎస్ఐకి గాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి: బంగ్లాదేశ్‌లో నిర్భయ తరహా ఘటన) -
డ్రంక్ అండ్ డ్రైవ్... పడవ పల్టీ
బనశంకరి: రోడ్లపై వాహనదారులు మద్యం తాగి నడపడం తెలిసిందే. సముద్రంలో కూడా జాలర్లు మందు కొట్టి నడపడంతో పడవ పల్టీ కొట్టింది. ఈ సంఘటన కర్ణాటకలో మంగళూరు ఉళ్లాల కూడీ తీరంలో చోటుచేసుకుంది. ఉల్లాల అష్రాఫ్ అనే వ్యక్తికి చెందిన పడవ ఆదివారం వేకువజామున చేపల రేవు నుంచి అరేబియా సముద్రంలోకి వేటకు బయల్దేరింది. ఈ బోట్లో 10 మంది తమిళనాడుకు చెందిన మత్య్సకారులు ఉన్నారు. డ్రైవరుతో పాటు ఐదుగురు మద్యం తాగారు. డ్రైవర్ మత్తులో మరో వ్యక్తికి డ్రైవింగ్ అప్పగించాడు. ఈ గందరగోళంలో బోటు సముద్రం ఒడ్డుకు దూసుకొచ్చి రాళ్ల మధ్యలో ఒరిగిపోయింది. జాలర్లకు బయటకు వచ్చే మార్గం లేకపోగా, స్థానికులు ఉదయం గమనించి కాపాడారు. ఉళ్లాల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. (చదవండి: 74 ఏళ్ల తర్వాత భారత్‌కి వస్తున్న చిరుత) -
కరోనా కాటుకు తల్లిదండ్రులు బలి..చిట్టితల్లికి ఎంత కష్టం..!
బెంగళూరు: కరోనా కరాళనృత్యానికి కుటుంబాలే తుడిచిపెట్టుకుపోతున్నాయి. అలాంటిదే ఇది. కరోనా కర్కశత్వానికి ఇదో మచ్చుతునక. కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన నంజుండే గౌడ, మమత దంపతులు. పిల్లలు కలగకపోవడంతో మొక్కని దేవుడు లేడు. చేయని పూజ లేదు. ఎట్టకేలకు తొమ్మిదేళ్ల తర్వాత మమత గర్భవతి అయ్యింది. వారి ఆనందానికి అవధుల్లేవు. నెలలు నిండాయి.. ఇంతలో ఊహించని ఉత్పాతం. దంపతులిద్దరికీ కరోనా సోకింది. పాప పుట్టడానికి ఐదురోజుల ముందు తండ్రి చనిపోయారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన మమత తమ గారాలపట్టిని తనివిదీరా చూసుకొనే భాగ్యానికి నోచుకోలేదు. బిడ్డపుట్టిన ఐదురోజులకు మమత ప్రాణాలు విడిచింది. పాపకూ కరోనా సోకినా ఇప్పుడా చిట్టితల్లి కోలుకుంటోంది. 12 రోజుల ఈ చిన్నారికి వచ్చిన కష్టం తెలిసి... ఎంతోమంది కంటతడి పెడుతున్నారు. ఈ పాపను పెంచుకునేందుకు మమత సోదరుడు ముందుకువచ్చాడు. తమకు ఇద్దరు పిల్లలున్నారని, మూడోబిడ్డగా ఈ చిన్నారిని పెంచుకుంటామని సోదరుడు, ఆమె భార్య తెలిపారు. (చదవండి: Uddhav Thackeray: గాలిలో చక్కర్లు కొట్టలేదు కదా!) -
డ్రగ్స్ కలకలం.. నాకేం సంబంధం లేదు : తనీష్
బెంగుళూరు : టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. కర్ణాటకలో ఇటీవలె సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో విచారణకు రావాలంటూ హీరో తనీష్‌కు బెంగుళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు జరిగే విచారణకు హాజరు కావాలంటూ తనిష్‌తో పాటు మరో ఐదుగురికి పోలీసులు సమన్లు జారీ చేశారు. వీరిలో ప్రముఖ నిర్మాత శంకర్ గౌడతో పాటు ఓ వ్యాపార వేత్త కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మాత శంకర్ గౌడ ఏర్పాటు చేసిన పార్టీలో పాల్గొన్న పలువురు సెలబట్రీలకు నోటీసులు పంపినట్లు బెంగుళూరు పోలీసులు ధృవీకరించారు. తాజగా ఈ విషయంపై హీరో తనీష్ స్పందిచారు. తనకు బెంగుళూరు పోలీసులు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనని, కానీ డ్రగ్స్ తీసుకున్నందుకు నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. 2017లో బెంగుళూరులో నిర్మాత శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీకి తాను వెళ్లింది నిజమేనని, కానీ అక్కడ ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని వివరించాడు. 67 ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద తనకు నోటీసులు వచ్చాయని, ఇది కేవలం ఆ కేసుకి సంబంధించి విట్నెస్గా మాత్రమే బెంగుళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారని తెలిపాడు. విచారణకు హాజరు కావల్సిందిగా సమన్లు జారీ అయిన నేపథ్యంలో ప్రస్తుతం తనీష్ న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. ఈ కేసులో మొదట ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసి విచారించగా మొత్తం వ్యవహారం బయటపడింది. ఇక గతంలోనూ టాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనీష్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. చదవండి : (శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కలకలం) (రాగిణి, సంజనల ఫోన్ల గుట్టు వీడింది) -
కొడుకును చంపించడానికి 3 లక్షల సుపారీ
సాక్షి, బెంగుళూరు : ఆస్తిలో వాటాకోసం హింసిస్తున్నాడన్న కోపంతో కొడుకును కిరాయి మనుషులను పెట్టి హత్యచేయించాడు ఓ వ్యాపారవేత్త. వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన బీవీ కేశవ అనే బిజినెస్ మ్యాన్ జనవరి 10 నుంచి తన పెద్ద కుమారుడు కౌశల్ కనిపించకుండా పోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల అనంతరం ఎలిమల్లప్ప అనే చెరువు వద్ద విపరీతమైన దుర్వాసన వస్తోందని అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులకు చెరువు సమీపంలో గోనె సంచిలో ముక్కలు ముక్కలుగా తెగిఉన్న శరీర భాగాలను చూసి షాకింగ్‌కు గురయ్యారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కౌశల్‌గా గుర్తించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కన్న తండ్రే సమీప బందువులకు సుపారి ఇచ్చి కొడుకుని హత్య చేయిండాని పోలీసులు నిర్ధారించారు.(విద్యార్థినులను వేధించిన టీచర్‌కు 49 ఏళ్ల జైలు) కాగా కేసు దర్యాప్తులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషించాయి. హత్య జరిగిన రోజు రాత్రి నిందితులు ఓ మారుతీ కారులో చెరువు వద్దకు వచ్చినట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి. అక్కడే మృతుడు కౌశల్‌కు మద్యం తాగించి అనంతరం హత్యచేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు వ్యాపారవేత్త కేశవ చిన్నకుమారుడి స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. ఇందుకు గాను 3 లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆస్తిలో వాటా కోసం తరుచూ హింసించడంతో కొడుకును చంపించాలని పథకం రచించినట్లు కేశవ అంగీకరించాడు. (రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి) -
5 నెలల గర్భవతి... 10 కి.మీ. పరుగు... 62 నిమిషాల్లో...
బెంగళూరు: మహిళా‘శక్తి’ అంటే ఇదేనేమో! పురుషులు ఏ కొంచెం ఎక్కువ శ్రమించినా బాగా అలసిపోయాం... ఇక విశ్రాంతి కావాల్సిందే అంటారు. కానీ మహిళ మాత్రం ఓ బిడ్డను మోస్తున్నా ఇంటి పని చేస్తుంది. ఆఫీస్‌కెళ్లి డ్యూటీ చేస్తుంది. అంతేగానీ... నెలతప్పిన నాటి నుంచి ప్రసవించే దాకా రెస్ట్ తీసుకుంటానని భీష్మించుకోదు కదా! ఇదే జరిగితే మన పొద్దు గడవడం కాదు... ప్రపంచమే నడవకుండా ‘లాక్డౌన్’ అయ్యేది. ఇక విషయానికొస్తే... ఓ మహిళ మరో అడుగు ముందుకేసింది. స్ఫూర్తిగొలిపే పరుగు పెట్టింది. ఐదు నెలల గర్భవతి అయిన ఆమె 10కే (10 కిలోమీటర్లు) పరుగును 62 నిమిషాల్లో పూర్తి చేసింది. ఆ ధీర వనిత బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల అంకిత గౌర్. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన అంకిత గత తొమ్మిదేళ్లుగా ఇలాంటి పరుగు పోటీల్లో పాల్గొంటూనే ఉంది. ఇక టీసీఎస్ 10కే రన్లో 2013 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా పోటీ పడుతూనే ఉంది. ఇందులో విశేషం లేదు. కానీ ఇప్పుడామె 5 నెలల గర్భవతి. మరో మూణ్నాలుగు నెలల్లో అంకిత తల్లి కానుంది. అయినా సరే తనకిష్టమైన పరుగు కోసం తన గైనకాలజిస్టును సంప్రదించి మరీ పోటీపడింది. దీనిపై అంకిత మాట్లాడుతూ ‘గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ ‘పరుగు’ పెడుతూనే ఉన్నాను. నిత్యం నేను తీసుకునే శ్వాసలాగే నా జీవితంలో నేను పెట్టే పరుగు ఓ భాగం’ అని వివరించింది. ప్రతిరోజూ తను రన్నింగ్ చేస్తూనే ఉంటానని చెప్పిన ఆమె ఐదు అంతర్జాతీయ మారథాన్లలోనూ పాల్గొన్నట్లు పేర్కొంది. బెర్లిన్‌లో మూడుసార్లు, బోస్టన్, న్యూయార్క్ మారథాన్లలో ఒక్కోసారి పోటీపడినట్లు తెలిపింది. గతంలో టీసీఎస్ 10కేలోనూ పతకాలు గెలిచానని వివరించింది. -
పోలీసులపై దౌర్జన్యం..ఎమ్మెల్సీ కుమారుడి అరెస్ట్
బెంగుళూరు : కర్ణాటక ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్ కుమారుడు ఫయాజ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఆదివారం అర్థరాత్రి వేళ బెంగళూరులోని హెబ్బాల్ ఫ్లైఓవర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఫయాజ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో ఫయాజ్, అతని స్నేహితులతో కలిసి హెడ్ కానిస్టేబుల్‌పై దాడిచేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడి చేసిన కారణంగా ఫయాజ్‌తో పాటు మరో ఇద్దరు కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. (ఏలూరుకు రానున్న కేంద్ర బృందం) -
అత్యాచారం చేసి హత్య చేశారా?
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలోని కుదూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెట్టహళ్లి గ్రామం వద్ద ఒక తోటలో 18 సంవత్సరాల యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. యువతిపై సామూహిక అత్యాచారం జరిపి హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లిన సదరు యువతి అప్పటి నుంచి కనిపించలేదు. తోటలో విగతజీవిగా కనిపించింది. శవాన్ని పూడ్చినప్పటికీ ఘటనాస్థలంలో రక్తపు మరకలు, గుంత తవ్విన గుర్తుల ఆధారంగా అనుమానంతో తవ్వి చూడగా మృతదేహం బయటపడింది. తలపై బలమైన గాయం, శరీరంపై రక్త గాయాలు ఉన్నాయి. అసిస్టెంట్ కలెక్టర్ దాక్షాయిణి సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలు మూడు సంవత్సరాలుగా ఒక యువకుడిని ప్రేమిస్తోంది. ఇందుకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో ఇరువైపుల పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. అయితే హత్యకు దారితీసిన కారణాలు తెలిసిరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (వారి నిర్లక్ష్యం.. చిన్నారులకు మరణ శాసనం) పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి దుర్మరణం హోసూరు: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై మృత్యువు పంజా విసిరి బలి తీసుకుంది. ఈ విషాద ఘటన హోసూరు హడ్కో పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. తిరుపత్తూరు జిల్లా పల్లిపట్టు ప్రాంతానికి చెందిన కణ్ణయ్య కుమార్తె జమున(24) తన తల్లి వనితతో కలిసి బెంగళూరులోని మాదేవపురం ప్రాంతంలో అద్దెగదిలో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. జమునకు పల్లిపట్టు ప్రాంతానికి చెందిన ఓ యువకునితో పెళ్లి నిశ్చయమైంది. ఆదివారం నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు. దీంతో శనివారం సాయంత్రం జమున తన తల్లితో కలిసి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తూ కుముదేపల్లి వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని ఢీకొన్నారు. జమున ఘటనా స్థలంలోనే మృతి చెందగా వనిత గాయపడింది. స్థానికులు ఆమెను క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హడ్కో పోలీసులు జమున మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హోసూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
సుధా మూర్తి కూరగాయలు అమ్మారా?
బెంగళూరు : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అర్థాంగి.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్ సుధా మూర్తి సమాజానికి మంచి చేస్తూ ఆదర్శప్రాయురాలుగా ఎంతో పేరు సంపాదించారు. ఎన్నో అనాథ ఆశ్రమాలు నెలకొల్పి ఎంతోమంది అనాథ విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తూ ఆదర్శంగా నిలిచారు. స్వతహాగా మంచి రచయిత అయిన సుధా మూర్తి ఎన్నో మంచి నవలల కూడా రచించారు. (చదవండి : పుట్టిన రోజున పిల్లలకు కానుక) అలాంటి సుధా మూర్తి బెంగళూరు జయానగర్‌లోని రాఘవేంద్ర స్వామి మఠం వద్ద కూరగాయలు అమ్మారంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. ' ఫోటోలో కనిపించేది ముమ్మాటికి సుధా మూర్తియే. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న నారాయణమూర్తి భార్య సుధా మూర్తి ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాల్లో గడుపుతారు. ప్రతి ఏడాదిలో ఒకరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీనివాసుడికి దండలు తయారు చేయడం.. మరో మూడు రోజులు రాఘవేంద్రస్వామి ఆలయం వద్ద కూరగాయలను అమ్మడంతో పాటు భక్తులకు అందించే ప్రసాదానికి తనవంతుగా కూరగాయలు కట్ చేస్తుంది. వ్యాపారంలో తమకు వస్తున్న సంపద కారణంగా అహంకారం అనేది రాకూడదనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆమెకు ఇవే మా వందనాలు' అంటూ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు చూసిన కొన్ని ప్రచురణ సంస్థలు సుధా మూర్తి గురించి తప్పుడు కథనాలు ప్రచురించాయి. (చదవండి : డబ్బుతో పాటు కాన్ఫిడెన్సూ ఇచ్చిన మినిస్టర్) కల్పితం : సుధా మూర్తి రాఘవేంద్ర స్వామి గుడి బయట కూరగాయలు అమ్ముతున్న ఫోటోలను చాలా సంస్థలు తమ కథనాల్లో తప్పుగా ప్రచురించాయి. సుధా మూర్తి కూరగాయలు అమ్మడం లేదని.. గుడి బయట సేవా కార్యక్రమాల పేరిట ఒక స్టోర్ నడుపుతున్నారని.. ఇలా తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ది చేసుకుంటున్నారని ఆరోపించాయి. కొన్ని సంవత్సరాలుగా స్టోర్ వద్దకు వచ్చి కూరగాయలతో పాటు ఇతర రకాల సేవలు కూడా అందిస్తున్నారు. వాస్తవం : వాస్తవానికి సుధా మూర్తి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. స్వచ్చంద సేవ పేరుతో కొన్ని సంవత్సరాల నుంచి రాఘవేంద్ర స్వామి గుడికి వస్తున్న ఆమె భక్తులకు భోజనం సిద్ధం చేయడం, పండ్లు కడగడం, ప్రసాదానికి కూరగాయలు కోయడం వంటి కార్యక్రమాలతో సుధా మూర్తి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ సందర్భంలోనే ఆమె కూరగాయల ముందు కూర్చొని ఫోటోకు ఫోజిచ్చారు. అయితే ఆమె రాఘవేంద్ర స్వామి మఠంలో మూడు రోజులు మాత్రం తమ అనుమతితో స్టోర్ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. కాగా అంతకుముందు బెంగళూరు మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సుధా మూర్తి తన అనుభవాన్ని పంచుకున్నప్పుడు తన సేవా కార్యక్రమాల్ని స్వయంగా వెల్లడించారు. 'ప్రతి ఏడాదిలో మూడు రోజులు దేవుడికి స్వచ్చంద సేవ చేయాలని అనుకున్నా. ఉదయం నాలుగు గంటలకే లేచి.. బెంగళూరులోని రాఘవేంద్ర స్వామి గుడికి వెళ్లి ఏ ప్రతిఫలం ఆశించకుండా స్వచ్చంద సేవ చేస్తుంటా. సెక్యూరిటీ గార్డు సాయంతో వంటగదితో పాటు అక్కడున్న పరిసరాలను శుభ్రం చేయడం జరుగుతుంది. అనంతరం భక్తులకు అందించే ప్రసాదాల కోసం నా వంతు సాయం అందిస్తా. తర్వాత కూరగాయల నుంచి వచ్చిన వ్యర్థాలను చెత్త డబ్బాలో వేసి స్వయంగా తీసుకెళ్లి పడేసి వస్తా. ఇదంతా స్వచ్చంద సేవ మాత్రమే.. ఏ ప్రతిఫలం ఆశించను. 'అంటూ ఆమె తెలిపారు. -
కారులో తరలిస్తున్న రూ. 65 లక్షలు స్వాధీనం
బెంగళూరు : కారులో అక్రమంగా తరలిస్తున్న రూ. 65 లక్షల నగదును బెంగళూరు పశ్చిమ విభాగం పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. కర్నూల్‌కు చెందిన దస్తగిరి (41), కిరణ్‌కుమార్ (30), మస్తాన్ (30)అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. బెంగళూరులోని ఆర్టీ స్ట్రీట్ రంగస్వామి ఆలయం వద్ద ఓ కారు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. దీంతో ఐదు వందల నోట్లతో కూడిన 18 బండిళ్లు, రెండు వేల నోట్లతో కూడిన రెండు బండిళ్లు బయటపడ్డాయి. ఈ డబ్బు ఎవరిది? ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై స్పష్టమైన సరైన సమాధానం ఇవ్వలేదు. (హలో.. మేము ఏసీబీ! ) -
వచ్చే ఏడాది చంద్రయాన్-3 ప్రయోగం : ఇస్రో
బెంగళూరు : చంద్రునిపై పరిశోధనలో భాగంగా చంద్రయాన్ ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2లను ప్రయోగించిన ఇస్రో తాజాగా చంద్రయాన్ 3 ప్రయోగానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది మొదట్లో చంద్రయాన్ 3 నిర్వహించనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా బెంగళూరుకు 215 కిమీ దూరంలో ఉన్న చల్లాకేరెలోని ఉల్లార్తి కావల్లో ఇస్రో ప్రయోగం చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్ పనులు పూర్తి చేసినట్లు పేర్కొంది. సెప్టెంబర్ చివరి కల్లా చంద్రయాన్ లో ఉపయోగించనున్న మూన్ క్రెటర్కు సంబంధించిన టెండరింగ్ పనులు పూర్తవుతాయని తెలిపింది. కాగా మూన్ క్రెటర్ వ్యయం రూ. 24.2 లక్షలు కానున్నట్లు పేర్కొంది. చంద్రయాన్ 3కి ఉపయోగించనున్న క్రెటర్ 10 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు ఉండనుంది. చంద్రయాన్ 3లో ఉయోగించనున్న సెన్సార్స్ చంద్రుని వైపు వేగంగా సాగేందుకు కక్క్ష్యలో ల్యాండర్ సెన్సార్ పరికరాలను అమర్చినట్లు తెలిపింది. దీనికి ఇప్పటికే ల్యాండర్ సెన్సార్ పర్ఫార్మెన్స్ టెస్ట్(ఎల్పీటీ) కూడా నిర్వహించారు. -
బెంగళూరు చేరుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, బెంగళూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరుకు చేరుకున్నారు. సీఎం పెద్ద కుమార్తె హర్షారెడ్డికి ప్రపంచ ప్రఖ్యాత ఇన్సీడ్ బిజినెస్ స్కూలులో సీటు దక్కించున్న విషయం తెలిసిందే. తన కుమార్తెను పారిస్‌కు పంపేందుకు వైఎస్ జగన్ బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు. సీఎం జగన్ రాకతో బెంగళూరు విమానశ్రయం వద్ద ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సందడి చేశారు. కాగా ప్రపంచంలోని టాప్ 5 బిజినెస్ స్కూల్స్‌లో ఇన్సీడ్ ఒకటి. అక్కడ హర్షారెడ్డి మాస్టర్స్ చేయనున్నారు. హర్షారెడ్డి చిన్నప్పటి నుంచి రాసిన ప్రతి పరీక్షలోనూ డిస్టింక్షన్ సాధించారు. ఇప్పటికే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన బహుళ జాతి సంస్థ(ఎంఎన్సీ)లో ఫైనాన్షియల్ కన్సల్టెంట్‌గా ఉద్యోగం వచ్చినా.. దానిని వదులుకుని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ చేయడానికి మొగ్గుచూపారు. -
అలా చేస్తే చర్యలు తప్పవు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాష్ట్ర పౌరులకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పడు పోస్టులు బెంగళూరులో ఎంత విద్వేషానికి దారి తీశాయో, ఎంత ప్రాణ, ఆస్తి నష్టానికి కారణమయ్యాయో తెలుసుకోవాలని కోరారు. శాంతి భద్రతలను దెబ్బతీసే అలాంటి పోస్టులు పెట్టొద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని తెలంగాణ పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటి వారిపై వారిపై వెంటనే కేసులు పెట్టి, తగిన కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని స్టేషన్లకూ, సీనియర్ అధికారులకూ ఆదేశాలిచ్చామని తెలిపారు. (చదవండి: బెంగుళూరు అల్లర్లపై సీఎం సీరియస్) ప్రజలు పోలీసులతో సహకరించి భద్రత, రక్షణలో తెలంగాణ అత్యున్నతంగా నిలిచేలా సహకరించాలని కోరారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. కాగా, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు నవీన్ సోషల్ మీడియాలో ఓ కమ్యూనల్ పోస్టు షేర్ చేయడంతో బెంగుళూరులో తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతి చెందారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు గాయాలయ్యాయి. (ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస) Public are requested not to post/circulate any inappropriate content in #SocialMedia. #TelanganaPolice is closely watching #SocialMedia for unsocial elements circulating malicious content. All the officers have been informed to initiate strict action against the miscreants. pic.twitter.com/wkLzOX7tmm — DGP TELANGANA POLICE (@TelanganaDGP) August 12, 2020 ఆలోచించి పోస్టు చేయండి: అంజనీకుమార్ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఒక పోస్ట్ ఫలితంగా బెంగళూరులో ఘర్షణలు జరిగాయని గుర్తు చేశారు. బాధ్యత లేని, అభ్యంతరకరమైన సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విటర్లో పేర్కొన్నారు. Be very cautious before posting anything on Social Media. Last night there was violence in Banglore because of such social media post. We will take very firm legal action for any irresponsible post. We can not allow under any circumstances our city to get bad name. — Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) August 12, 2020 -
బెంగుళూరు అల్లర్లపై సీఎం సీరియస్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి యడియూరప్ప సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. శాంతియుత వాతావరణం కల్పించడానికి అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా దాడులు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ప్రజలందరూ సంయనం పాటించాలని ఆయన కోరారు. ఇక ఫేస్బుక్లో షేర్ చేసిన ఓ పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు కావడంతో ఆయన అండతోనే ఇలా చేస్తున్నాడని భావించి మంగళవారం రాత్రి నిరసనకారులు ఎమ్మెల్యే నివాసంపై దాడి చేశారు. (బస్సులో మంటలు : ఐదుగురు సజీవ దహనం) అంతేగాక ఎమ్మెల్యే ఇంటి వద్ద పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది పట్ల కూడా నిరసనకారులు అనుచితంగా ప్రవర్తించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగగా రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు కూడా గాయాలు అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సిటీలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 110 మందిని అరెస్టు చేశామని బెంగళూరు జాయింట్ కమిషనర్(క్రైం) సందీప్ పాటిల్ తెలిపారు. (ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస) -
కర్ణాటక మంత్రికి కరోనా పాజిటివ్
బెంగళూరు: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు. ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్ణాటక పర్యటక శాఖ మంత్రి సీటీ రవి తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. కర్ణాటకలో కరోనా వైరస్ సోకిన మొదటి మంత్రి రవి కావటం గమనార్హం. ‘ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌గా తెలింది. అదృష్టవశాత్తు నా భార్య పల్లవి, సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించగా నెగటివ్ వచ్చింది’ అని మంత్రి రవి ట్విటర్లో పేర్కొన్నారు. (‘స్వాతి చినుకులు’ ఫేం భరద్వాజ్‌కు కరోనా) ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గా ఉందని, కరోనాకు చికిత్స తీసుకొని తిరిగి ప్రజల కోసం పని చేస్తానని తెలిపారు. అప్పటికి వరకు తాను ఇంటికే పరిమితమై పనులను కొనసాగిస్తాని తెలిపారు. ఇప్పటికే కర్ణాటకలో ముగ్గురు ఎమ్మెల్యేకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కార్యాలయంలోని ముగ్గురు సిబ్బందికి కరోనా సోకటంతో సీఎం బీఎస్ యడియూరప్ప కూడా హోం క్వారంటైన్‌ని పరిమితమయ్యారు. Yesterday, I along with my wife Pallavi & my staff members underwent COVID19 test. Fortunately, my wife Pallavi and all my staff members are tested Negative. Third umpire's result for me has confirmed that I'm Covid Positive. However, I'm feeling absolutely fine. — C T Ravi 🇮🇳 ಸಿ ಟಿ ರವಿ (@CTRavi_BJP) July 13, 2020 -
వివాదాస్పదంగా కర్ణాటక నిర్ణయం
బెంగళూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అంతేగాక విధి నిర్వాహణలో రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో వారికి ప్రత్యేకంగా బెంగళూరులోని కుమార కృపా 100 పడకల లగ్జరీ ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ను కోవిడ్-19 సంరక్షణ కేంద్రం కోసం కేటాయిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కావడం లేదు. చివరికి ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌ను విఐపీల కోసం చికిత్స కేంద్రంగా మార్చే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చింది’ అని మండిపడ్డారు. (‘జాగ్రత్తగా ఉంటారా.. మరోసారి లాక్డౌన్ విధించాలా’) బీజేపీ నేత ఉమెస్ జాదవ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో క్వారంటైన్ చాలా అవసరం. కరోనా బాధితుల కోసం రాష్ట్రంలో వసతి గృహాలు లేనందున ప్రభుత్వం ఏవీ అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలి’’ అని పిలుపునిచ్చారు. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న సమీక్షలు, సమావేశాలకు హాజరవుతున్న సీనియర్ అధికారులు, మంత్రులు, ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారని, అందువల్ల వారి కోసం ప్రత్యేకమైన కోవిడ్ సెంటర్లు అవసరమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఏడు అంతస్తుల కుమార కృపా గెస్ట్‌హౌజ్‌లో ప్రత్యేకంగా 3 అంతస్తులను సుప్రీంకోర్టు న్యామూర్తులు, మంత్రులు, వీవీఐపీల కోసం కేటాయించారు. (‘20 రోజులు లాక్డౌన్ విధించాలి’) కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,000లకు పైగా కేసులు నమోదు కాగా 164 మరణాలు చోటుచేసుకున్నాయి. వీటిలో అధిక కేసులు బెంగళూరులో నమోదు కాగా నగరంలోని రెండు అతిపెద్ద మార్కెట్లను ప్రభుత్వం మూసివేసింది. కేసులు అధికమవుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కోవిడ్-19 చికిత్స కోసం 50 శాతం గదులను కెటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి బుధవారం చేసిన వరుస ట్వీట్లలో.. ‘‘కోవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గదులు, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. కరోనా బారిన పడిన వారికి తగిన చికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని. నాలుగు వేలకుపైగా రోగులకు చికిత్స చేయడానికి పడకలు లేవని, వెంటిలేటర్లు లేవు. కావునా మరోసారి రాష్ట్రంలో 24 రోజుల పాటు లాక్డౌన్ విధించాల’’ని ఆయన డిమాండ్ చేశారు. -
పోంజి కుంభకోణం.. ఐఏఎస్ ఆత్మహత్య
బెంగళూరు : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎంఎ పోంజి కుంభకోణంలో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎం విజయ్ శంకర్ ఆత్మహత్య చేసుకున్నారు.బెంగళూరులోని జయానగర్‌లో ఉన్న తన నివాసంలో విజయ శంకర్ మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. రూ. 4 వేల కోట్ల ఐఎంఎ పోంజి కుంభకోణంలో విజయ్ శంకర్ భారీ మొత్తంలో లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయమై 2019లో కుమారస్వామి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన సిట్ విజయ్ శంకర్‌ను అరెస్టు చేసింది. అనంతరం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ కేసును సీబీఐకి అప్పగించింది. కాగా సీబీఐ ఈ కేసులో విజయ్ శంకర్‌తో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను విచారించేందుకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని కోరింది.(పొట్టిగా ఉందని..మట్టుబెట్టాడు!) 2013లో పెద్ద మొత్తంలో రిటర్న్స్‌ను ఇస్తామని పేర్కొంటూ మహ్మద్ మన్సూర్ ఖాన్ పోంజి స్కీమ్‌కు తెరలేపాడు. వేలాదిమంది అమాయకుల నుంచి రూ. 4 వేల కోట్లను సేకరించాడు. దీనిపై అప్పట్లో ఆదాయపుపన్ను శాఖ, ఆర్బీఐ దృష్టిసారించింది. ఐఎంఏపై విచారణ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్బీఐ కోరింది. అందుకు నివేదిక తయారు చేసి రిపోర్ట్ సమర్పించవలసిందిగా ప్రభుత్వం విజయ్ శంకర్‌ను కోరింది.బెంగళూరు అసిస్టెంట్ కమిషనర్ ఎల్సీ నాగరాజ్‌తో కలిసి విజయ్ శంకర్ నివేదికను తయారు చేశాడు. ఈ క్రమంలోనే కేసును పక్కదారి పట్టించేందుకు విజయశంకర్, నాగరాజ్ రూ.1.5 కోట్లను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలపై లంచం ఆరోపణలు చేసి మహ్మద్ మన్సూర్ ఖాన్ దుబాయ్‌కి పారిపోయాడు. గతేడాది జులై 19న మన్సూర్ ఢిల్లీకి తిరిగి రావడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కాగా ఖాన్‌తో పాటు ఐఎంఎలో ఉన్న ఏడుగురు డైరెక్టర్లను, ఓ కార్పొరేటర్‌తో పాటు పలువురిని అప్పట్లో సిట్ అధికారులు అరెస్టు చేశారు. (టెక్కీని మోసగించిన కి'లేడీ') -
భౌతిక దూరం గోవింద..! మంత్రిపై విమర్శలు
సాక్షి, బెంగళూరు: కరోనా నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని, ముఖానికి మాస్క్‌లు ధరించాలని చెబుతున్నాయి. అయినా కొంత మంది ఉన్నత స్థానంలో ఉన్నవారే ఈ నిబంధనలు పాటించకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి బి. శ్రీరాములు మరోసారి భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం చిత్రదుర్గానికి వెళ్లిన మంత్రి శ్రీరాములుకు స్వాగతం పలకడానికి బీజేపీ కర్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ఆయన భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా, కనీసం ముఖానికి మాస్క్ కూడా ధరించకుండా కార్యకర్తలతో కలిసిపోయారు. (మిస్సింగ్ పోస్టర్లు: 'స్మృతి ఇరానీ ఎక్కడ?') అదేవిధంగా మంత్రి శ్రీరాములు తన చుట్టూ చేరినవారికి భౌతిక దూరం పాటించాలని సూచించకపోవటం గమనార్హం. కంటైన్మెంట్ జోన్లలో మినహా మిలిగిన ప్రాంతాల్లో మతపరమైన కార్యక్రమాలను లాక్డౌన్ నిబంధనలకు లోబడి దశల వారిగా తెరుచుకోవచ్చని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అనుమతించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటివరకు కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3408 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంత్రి లాక్డౌన్ ఉల్లంఘన చర్యపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. మంత్రి శ్రీరాములు ఇలా భౌతిక దూరం నిబంధనలు ఉల్లంఘించటం ఇది రెండోసారి. -
వైద్యురాలికి ఘన స్వాగతం.. భావోద్వేగం
సాక్షి, హైదరాబాద్ : ప్రాణంతక కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. వైరస్ ఏ మూల నుంచి వస్తోందోనని ప్రజలు తీవ్ర భయాందోళకు గురవుతున్నారు. మరోవైపు కరోనా బాధితులకు వైద్యులు ప్రాణాలకు తెగించి చికిత్స అందిస్తున్నారు. రోజుల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వైరస్ బాధితులకు చికిత్సను అందిస్తున్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. పలు చోట్ల వారికి పూలు, హారతితో స్థానికులు స్వాగతం పలుకుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. (వైరల్ వీడియా ట్వీట్ చేసిన ప్రధాని మోదీ) గత రెండు వారాలుగా నగరంలోని ఇందిరా గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్యం అదిస్తున్న డాక్టర్ విజయశ్రీకి ఆమె నివాసం ఉంటున్న వీధి ప్రజలు అపార్టమెంట్లో నిలబడి ఘన స్వాగతం పలికారు. రెండు వారాల తరువాత ఆమె ఇంటికి చేరుకోగా.. హర్షధ్వానాలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దీంతో డాక్టర్ విజయశ్రీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. వైద్యురాలిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా ఇలాంటి వీడియోని ప్రధాని నరేంద్ర మోదీ సైతం సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు సమాజం అండగా నిలవాలని ప్రధాని పిలుపునిచ్చారు. (వలస కూలీల్లో కరోనా కలకలం) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1351281875.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆన్లైన్ డెలివరీ ఉద్యోగులమని చెప్పి..
బెంగుళూరు : లాక్డౌన్ ముసుగులో కొందరు ఆన్లైన్ డెలివరీ పేరుతో తప్పుడు పనులు చేస్తున్నారు. తాజాగా ఆన్లైన్ డెలివరీ ఉద్యోగులమని చెప్పి సాండ్ బోవా అనే రెండు తలల పామును అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరిని గురువారం బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరుకు చెందిన మహ్మద్ రిజ్వాన్, అజర్ ఖాన్లు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో డంజో డెలివరీ సంస్థలో ఉద్యోగులుగా పని చేస్తున్నామని చెప్పి అంతరించిపోయే దశలో ఉన్న సాండ్ బోవా అనే రెండు తలల పామును విక్రయించేందుకు ప్రయత్నించారు.కొంతమందికి వీరు చేస్తున్న పనిపై అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. (లాక్డౌన్: యూపీలో తాత్కాలిక జైళ్లు) బెంగుళూరు జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ.. 'లాక్డౌన్ నేపథ్యంలో బెంగుళూరు నగరంలో డంజో డెలివరీ సంస్థ ఆన్లైన్ ద్వారా నిత్యావసరాలు సరఫరా చేస్తూ మంచి పేరు సంపాదించింది. అయితే వీరిద్దరు ఆ సంస్థ ఉద్యోగులమని చెప్పి రెండు తలల పామును అమ్మడానికి ప్రయత్నించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రిజ్వాన్, అజర్‌లపై కేసు నమోదు చేశామని' పాటిల్ తెలిపారు. కాగా అంతరించిపోయే దశలో ఉన్న సాండ్ బోవా( రెండు తలల పాము)ను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుందట. -
ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా
న్యూఢిల్లీ/సాక్షి, బెంగళూరు: భారత్‌లో కరోనా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది. ఇద్దరు ఐటీ ఉద్యోగులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. డెల్, మైండ్ ట్రీ ఐటీ కంపెనీలకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు కరోనా సోకినట్టు బుధవారం ఆ కంపెనీలు వెల్లడించాయి. అమెరికా టెక్సాస్ నుంచి వచ్చిన ఒకరికి కరోనా వైరస్ సోకింది. మైండ్ ట్రీ కంపెనీకి చెందిన ఉద్యోగి ఆఫీసు పని మీద ఇతర దేశానికి వెళ్లి వచ్చారు. ఈ ఉద్యోగులిద్దరూ భారత్‌కు వచ్చాక వారు కలిసిన సంబంధీకులను నిర్బంధంలో ఉంచి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అది కరోనా మరణం కాదు: కర్ణాటక మంత్రి మన దేశంలో కరోనా వైరస్ సోకినట్టుగా అనుమానిస్తున్న ఒక వృద్ధుడు మరణించారు. ఇటీవల సౌదీ యాత్రకి వెళ్లొచ్చిన 76 ఏళ్ల కర్ణాటక వాసి మహమ్మద్ హుస్సేన్ సిద్ధిఖీ జ్వరం, దగ్గు, జలుబు ఉండటంతో ఐదోతేదీన కలబురిగి జిల్లా మెడికల్ కాలేజీకి, తర్వాత 9న హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. వైరస్ లక్షణాలు తగ్గకపోవడంతో అంబులెన్స్‌లో కలబురిగికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. అతనికి కోవిడ్ సోకిందన్న అనుమానంతో గతంలోనే రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం బెంగుళూరు ల్యాబ్‌కి పంపారు. హుస్సేన్‌కి కోవిడ్ సోకి ఉంటుందనే అనుమానాలున్నాయని కలబురిగి జిల్లా ఆరోగ్య శాఖ వెల్లడించింది. సిద్ధిఖీ వృద్ధాప్యంతోనే తుదిశ్వాస విడిచారని, వైరస్ సోకిందని ఆందోళన చెందవద్దని మంత్రి చెప్పారు. దౌత్య, అధికారిక, ఐరాస, ఉద్యోగ, ప్రాజెక్టు వీసాలు తప్ప మిగిలిన వీసాలన్నీ ఏప్రిల్ 15 వరకూ రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. -
రెప్పపాటులో తప్పించుకోవడం అంటే ఇదేనేమో
బెంగళూరు : రెప్పపాటులో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవడమంటే ఇదేనేమో అనిపిస్తుంది. ఈ వార్త చదివిన తర్వాత వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ఎంత అవసరం అనేది మీకే అర్థమవుతుంది. వివరాలు.. బెంగుళూరుకు చెందిన సురజిత్ బెనర్జీ వృత్తి రిత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫిబ్రవరి 7న ఆఫీసు పని ముగించుకొని బైక్‌పై ఇంటికి వస్తున్న తరుణంలో డిఎల్ఎఫ్ దగ్గరలో ఉన్న అక్షయ్‌నగర్ వద్దకు రాగానే ఒక దారం అతని తలకు అడ్డుగా వచ్చింది. రెప్పపాటు క్షణంలోనే బైక్‌పై ఉన్న సురజిత్ బెనర్జీ హెల్మట్ గ్లాస్ ఓపెన్ చేసి ఉండడంతో కంటి, ముక్క భాగాన్ని కోసుకుంటూ వెళ్లింది. దీంతో అప్రమత్తం అయిన బెనర్జీ సడన్‌బ్రేక్ వేసి కిందకు దిగి పరిశీలించగా ఒక పతంగికి కట్టిన మాంజా దారం కనిపించింది. కాగా ఆ సమయంలో సురజిత్ హెల్మట్ పెట్టుకోవడంతో పెద్ద ముప్పు తప్పింది. దీంతో బతుకుజీవుడా అనుకుంటూ ఆసుపత్రికి వెళ్లిన బెనర్జీ చికిత్స చేయించుకొని ఇంటికి వెళ్లాడు. ఇదే విషయమై అతని భార్య స్వాగత బెనర్జీ మాట్లాడుతూ..' మేము స్లమ్ ఏరియాకు దగ్గరలో ఉండడంతో మా ప్రాంతమంతా చీకటిగా ఉంటుంది. నా భర్త ఆరోజు ఆఫీసు నుంచి ఇంటికి వస్తుండగా రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పతంగికి కట్టిన మాంజా రోడ్డుకు ఇరువైపులా కట్టిఉంది. నా భర్తకు చీకట్లో అదేమి కనిపించకపోవడంతో అలాగే ముందుకు వచ్చేశాడు. దీంతో కంటి, ముక్కు భాగానికి మాంజా దారం కోసుకుంది. అదృష్టవశాత్తు నా భర్త హెల్మట్ ధరించడంతో గొంతు భాగానికి మాంజా తట్టకుండా అడ్డుగా నిలిచింది. ఇది నిజంగా మా అదృష్టమే.. లేకుంటే నా భర్త మెడ తెగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచేవాడు. దేవుడి దయ వల్ల అలాంటిదేమి జరగలేదు' అంటూ బెనర్జి భార్య భావోద్వేగానికి గురయ్యారు. -
ప్లూట్ వాయిద్యంతో అదరగొట్టిన ఇస్రో డైరెక్టర్
బెంగుళూరు : ఇస్రో అధికారులు ఎల్లప్పుడు అంతరిక్షంలోకి శాటిలైట్లను, రాకెట్లను పంపే పనిలో బిజీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశ ముగింపు కార్యక్రమాన్ని ఒక సీనియర్ అధికారి తన ప్లూట్ పరికరంతో సంగీతం వినిపించి ముగించారు. వివరాల్లోకి వెళితే.. ప్రతి ఏడాది చివరలో బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నిర్వహిస్తుంటారు. ఇస్రో చైర్మన్ కె. శివన్ ఆధ్వర్యంలో ఈసారి కూడా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కార్యక్రమం చివర్లో ఇస్రో డైరెక్టర్, సీనియర్ సైంటిస్ట్ పి. కున్హికృష్ణన్ తన వెంట తెచ్చుకున్న ప్లూట్ పరికరంతో 'వాతాపి గణపతిం భజే' పాటను అందరికి వినిపించారు. .అయితే ఈ వీడియోనూ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జైరాం రమేశ్ తన ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ' స్వతహాగా ప్రొఫెషనల్ ప్లూట్ వాయిద్యకారుడైన ఇస్రో డైరక్టర్ పి. కున్హికృష్ణన్ ఈరోజు తన ప్లూట్‌తో మ్యాజిక్ చేశారు. ఆయన 'వాతాపి గణపతిం భజే' పాటను వినిపించి ఇస్రో పార్లమెంటరీ సమావేశాన్ని ముగించడం నాకు ఆనందం కలిగించింది. ఆ సమయంలో పార్లమెంటరీ సమావేశం కాస్తా ఒక సంగీత విభావిరి కేంద్రంగా మారిందంటూ' ట్వీట్ చేశారు. The Parliamentary Standing Committee ended it's last meeting at ISRO with a flute performance by the Director of its Satellite Centre in Bengaluru, P. Kunhikrishnan, who is also a professional flute player! He played the evergreen Vatapi Ganapatim Bhaje. Sharing a snippet. pic.twitter.com/AkwwPh9oZY — Jairam Ramesh (@Jairam_Ramesh) December 29, 2019 -
క్రిస్మస్కు ముస్తాబైన సిలికాన్ సిటీ
సాక్షి, బెంగళూరు: భువిపై శాంతిదూత ఏసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజుకు రెండురోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో బెంగళూరు నగరంలో క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిల ముస్తాబు, షాప్‌లు, మాల్స్‌లో రంగురంగుల లైట్ల అలంకరణ మిరుమిట్లు గొలుపుతోంది. కేక్‌ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. బెంగళూరు శివాజీనగరలోని సెయింట్ మేరీ బెసెలికా చర్చి, ఫ్రేజర్టౌన్లోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ కెథడ్రెల్ చర్చ్, బ్రిగేడ్ రోడ్డులోని సెయింట్ ప్యాట్రిక్ చర్చ్, సెయింట్ మార్క్స్ కెథెడ్రల్, చామరాజపేటలోని సెయింట్ జోసెఫ్ చర్చ్, ఎంజీ రోడ్డులోని చర్చీలు, సెయింట్ జాన్స్ చర్చి తదితర నగరంలోని పలు రోమన్ క్యాథలిక్, ప్రొస్టెటెంట్ చర్చిలు పండుగ ఏర్పాట్లతో కోలాహలంగా ఉన్నాయి. స్టార్లు, బెలూన్లు, క్రిస్మస్ ట్రీలతో అందంగా తయారయ్యాయి. శాంటాక్లాజ్ బొమ్మలు పిల్లలూ పెద్దలను అలరిస్తున్నాయి. రాష్ట్రమంతటా క్రిస్మస్ గంటలను మోగిస్తున్నారు. క్రైస్తవులు బంధుమిత్రుల ఇంటింటికి వెళ్లి క్యారల్స్ పేరు మీద వెళ్లి పండుగ శుభాకాంక్షలు చెబుతున్నారు. వీటికితోడు క్రైస్తవ మత పెద్దలు పలు సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. పేదవారికి బట్టలు, పిల్లలకు పుస్తకాలను బహూకరిస్తున్నారు. బెంగళూరుతో పాటు మంగళూరు, మైసూరు, బెళగావి, హుబ్లీ– ధార్వాడ తదితర ప్రధాన నగరాల్లోని చర్చిలు ముస్తాబయ్యాయి. 24వ తేదీ నుంచే ప్రత్యేక ప్రార్థనలు ఆరంభం కాబోతున్నాయి. జోరుగా వ్యాపారాలు పండుగ నేపథ్యంలో జయనగర, బ్రిగేడ్ రోడ్డు, ఎంజీరోడ్డు, కమర్షియల్ స్ట్రీట్, గాంధీ బజార్ తదితర చోట్ల ఫ్యాన్సీ స్టోర్లలో ‘మేరీ క్రిస్మస్’ సందేశముండే కార్డులను, బహుమతులను, యేసుక్రీస్తు, మేరీమాతా ప్రతిమలను, విభిన్న డిజైన్లలోని క్యాండిళ్లు, శాంటాక్లాజ్ బొమ్మల విక్రయాలు ఊపందుకున్నాయి. కేక్‌లు, వంటకాలకు డిమాండ్ పెరిగింది. -
బిల్లు చూసిన టెకీకి ఊహించని షాక్
ముంబై : ఆటోలో ప్రయాణించే ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. బెంగుళూరుకు చెందిన ఓ టెకీ ఉద్యోగ రీత్యా పూణెలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తన నివాసం నుంచి ఆఫీస్‌కు వెళ్లడానికి బుధవారం ఉదయం కాట్రాజ్ ప్రాంతం వరకు బస్సులో వచ్చాడు. అక్కడి నుంచి తన కార్యాలయం ఉన్న ఎరవాడ ప్రాంతం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమయానికి బస్సులు రాకపోవడంతో క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకొని చూస్తే క్యాబ్‌లు కూడా అందుబాటులో లేకపోడంతో ఆటో మాట్లాడుకొని వెళ్లాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఆఫీస్ వద్ద ఆటో దిగగానే మీటర్‌పై ధర చూసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి షాక్‌కు గురయ్యాడు. తను ఆటోలో ప్రయాణించిన దూరం కేవలం 14.5 కిలోమీటర్లు మాత్రమే. అయితే నమ్మశక్యం కాని విధంగా మీటర్‌పై రూ. 4300 బిల్లు కనిపించింది. దీంతో కంగుతిన్న సదరు టెకీ ఇదేంటని.. డ్రైవర్‌ను ప్రశ్నించగా.. పూర్తి డబ్బులు చెల్లించాల్సిందేనని అతడు దబాయించాడు. అనంతరం డ్రైవర్‌ను నిలదీయగా తను(ఆటో) నగరంలోకి ప్రవేశించడానికి రూ. 600, తిరిగి వెళ్లడానికి రూ.600 కట్టవలసి ఉంటుందని, మిగతావి తన ప్రయాణానికి అయిన డబ్బులని అసలు విషయం బయటపెట్టాడు. దీంతో చేసేదేం లేక మొత్తం డబ్బులు కట్టేశాడు. అనంతరం ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
చంద్రయాన్-2పై మోదీ ఉద్వేగ ప్రసంగం
సాక్షి, బెంగళూరు: దేశం కలలను సాకారం చేసేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారని.. వారందరికీ యావత్ దేశం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్-2 విజయం కోసం శాస్త్రవేత్తలు చూపిన తెగువకు దేశమంతా గర్విస్తోందని ప్రశంసించారు. భారతమాత తలెత్తుకునే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారని ప్రధాని అభినందించారు. బెంగళూరు సమీపంలోని బయలాలులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో (ఇస్ట్రాక్)లో చంద్రయాన్-2 ప్రయోగంపై శనివారం ఉదయం జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్ మాతాకి జై అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తొలుత ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ల్యాండర్ నుంచి సిగ్నల్స్ తెగిపోవడంతో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..‘ఈ ప్రయోగం కోసం ఎంతో మంది శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారు. మీ ఆవేదన నేను అర్థం చేసుకోగలను. మీ కృషిని యావత్ దేశం అర్థం చేసుకోగలదు. మీ కష్టం దేశానికి తెలుసు. భారతమత తలెత్తుకునేలా ప్రయోగం కోసం జీవితాన్ని ధారపోశారు. దేశ ప్రజల కలలను సాకారం చేసేందుకు ఎంతో శ్రమించారు. శాస్త్రవేత్తల కృషి ఎప్పటికీ వృథా కాదు. మీస్ఫూర్తి భారతీయులకు నిదర్శనం. శాస్త్రవేత్తల కుటుంబ సభ్యులకు సెల్యూట్ చేస్తున్నా. దీనిలో వారి త్యాగం ఎంతో ఉంది. మన అడంకులే మన మనోబలాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మీరు చూపిన తెగువ మన దేశానికే కాదు యావత్ ప్రపంచానికి నిర్ధేశం చేసింది. మీ కృషికి ప్రతిఫలంగా దేశమంతా మీకు అండగా నిలబడుతోంది. ప్రపంచ దేశాల్లో భారత్ ఇప్పటికే అగ్రగామిగా ఉంది. మరిన్ని లక్ష్యాలను మనం సాధించాల్సి ఉంది. దానికోసం మరికొన్ని అంతరిక్ష ప్రయోగాలను మనం చేపట్టాలి. ఎన్నో ఆటంకాలను విజయవంతగా అధిరోహించిన చరిత్ర ఇస్రోకు ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తారనే నమ్మకం నాతోపాటు ఈ దేశ ప్రజలకూ ఉంది’ అంటూ శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని నింపే విధంగా మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు. కాగా ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావించిన చంద్రయాన్–2 సక్సెస్‌పై సందిగ్ధత కొనసాగుతోన్న విషయం తెలిసిందే. తొలి నుంచి అన్నీ అనుకున్నట్టే జరిగినా.. నిర్దేశిత ప్రాంతంలో విక్రమ్ ల్యాండర్ దిగే విషయంలో గందరగోళం చోటుచేసుకుంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్ పయనం.. అక్కడ కుదుపునకు లోనైనట్టు తెలుస్తోంది. 2.1 కిలోమీటర్ల ఎత్తులో ల్యాండర్ నుంచి ఇస్రో గ్రౌండ్ సెంటర్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో ఏమి జరిగిందో తెలియక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇస్రో చైర్మన్ కె.శివన్ ఈ అంశంపై ఓ ప్రకటన చేస్తూ.. 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు అంతా బాగానే సాగిందని, అక్కడే ల్యాండర్ నుంచి గ్రౌండ్ స్టేషన్‌కు సిగ్నల్స్ నిలిచిపోయాయని తెలిపారు. దీనిపై ల్యాండర్ పంపిన సందేశాలను ఇస్రో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. చదవండి: చంద్రయాన్ టెన్షన్.. అందినట్టే అంది.. -
ఆటోడ్రైవర్ ఇంట్లో ఐటీ సోదాలు
బనశంకరి (బెంగళూరు): పలువురు పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలతో సంబంధాలు కలిగిన ఆటోడ్రైవరు ఇంటిపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని ఒక విల్లాలో సుబ్రమణి అనే ఆటోడ్రైవరు నివాసముంటున్నాడు. ఇతడు పేరుకు మాత్రమే ఆటోడ్రైవరు కాగా పేరుపొందిన రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలతో సన్నిహిత సంబంధాలున్నాయి. రెండురోజుల క్రితం ఐటీ అధికారులు ఇతని విల్లాపై దాడిచేశారు. సోదాల్లో అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి ద్వారా పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతల బినామీ ఆస్తుల గుట్టు వెలుగుచూసినట్లు తెలిసింది. దీనిపై మహదేవపుర బీజేపీ ఎమ్మెల్యే అరవిందలింబావళి మాట్లాడుతూ సుబ్రమణి పేరుతో బినామీ ఆస్తులుంటే, అతడి ఇంట్లో నగదు లభిస్తే ఐటీ అధికారులు నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలన్నారు. సుబ్రమణితో తనకు ముఖ పరిచయం కూడా లేదని చెప్పారు. -
రాహుల్ ద్రవిడ్ ఓటు వేయలేడు!
రాహుల్ ద్రవిడ్ ఓటు వేయలేడు!ఓటర్ల జాబితాలో పేరు గల్లంతయిన ప్రముఖుల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా చేరారు. బెంగళూరులో ఉంటున్న ద్రవిడ్ ఈ నెల 18న జరిగే రెండో దశ పోలింగులో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు వేయాల్సి ఉంది. అయితే, ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో ఆయనకు ఓటు వేసే అవకాశం ఉండదు. కర్ణాటకలో ఎన్నికల సంఘం ప్రచారకర్త అయిన రాహుల్ ద్రవిడ్ పేరే ఓటర్ల లిస్టులో లేకపోవడం విచిత్రం. జరిగిందేమిటని ఆరా తీస్తే, ఇందిరానగర్‌లో ఉండే ద్రవిడ్ దంపతులు ఈ మధ్య అశ్వత్నగర్కు మారారు. దాంతో ఇందిరా నగర్ పరిధిలో వారి ఓట్లు తొలగించాలని కోరుతూ ద్రవిడ్ సోదరుడు విజయ్ స్వయంగా ఎన్నికల సంఘానికి ఫారం 7 ద్వారా దరఖాస్తు చేశారు. క్షేత్ర స్థాయి పరిశీలన జరిపిన ఎన్నికల అధికారులు అక్కడ పేరు తొలగించారు. అయితే, ఆయన అశ్వత్‌నగర్‌లో పేరు నమోదు చేసుకోలేదు. ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకోవడానికి మార్చి 16 వరకు గడువు ఉంది. ఆ సమయంలో రాహుల్ విదేశాల్లో ఉండటంతో పేరు నమోదు చేసుకోవడం కుదరలేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటరు పేరు తొలగించడానికి కుటుంబ సభ్యులు ఎవరైనా ఫారం 7 ద్వారా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయవచ్చు. అయితే, పేరు నమోదుకు మాత్రం ఓటరే స్వయంగా ఫారం 6ను సమర్పించాల్సి ఉంటుంది. గడువులోగా రాహుల్ ఫారం 6 సమర్పించకపోవడంతో అశ్వత్‌నగర్‌లో ఆయన పేరు ఓటరు జాబితాలో చేరలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటు విలువ గురించి, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ప్రచారం చేసిన రాహుల్ తాను మాత్రం ఓటు వేసే అవకాశం కోల్పోయారు. -
క్యాన్సర్‌తో చావడం కన్నా ఇదే నయం
బెంగళూరు : క్యాన్సర్ మహమ్మారికి భయపడి ఓ వ్యక్తి తనతో పాటు భార్య, పెంపుడు కుక్క ప్రాణాలను కూడా తీశాడు. అయితే భార్యాభర్తలిద్దరిలో క్యాన్సర్ ఎవరికి అనే విషయం స్పష్టంగా తెలీదు. బెంగుళూరుకు చెందిన అతుల్ ఉపాధ్యాయ అనే వ్యక్తి చివరి క్షణాలు.. ప్రవర్తించిన తీరు స్థానికులతో పాటు పోలీసులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. వివరాలు.. అతుల్ భార్య ప్రతిరోజు జిమ్‌కెళ్తుంది. ఈ క్రమంలో గత మంగళవారం అతుల్ తన భార్యను జిమ్‌లోనే డంబెల్‌తో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత పెంపుడు కుక్కను మేడ మీద నుంచి విసిరేశాడు. మరుసటి రోజు తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వారికి అతుల్ దగ్గర ఓ నోట్ దొరికింది. దాంట్లో ‘క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన రోగం. ఇలా చనిపోవడం క్యాన్సర్ కన్నా ఉత్తమం. నేను స్వార్థంతో ఈ పని చేయడం లేదు’ అని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం గురించి ఓ పోలీసాధికారి మాట్లాడుతూ.. ‘క్యాన్సర్ వ్యాధికి భయపడి అతుల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే భారాభర్తలిద్దరిలో క్యాన్సర్ ఎవరికి సోకిందనే విషయం స్పష్టంగా తెలీడం లేద’ని పేర్కొన్నారు. అంతేకాక ఈ మధ్య కర్ణాటకలో ఇలాంటి ఆత్మహత్యలు చాలా పెరిగాయని తెలిపారు. ఆత్యహత్యలకు పాల్పడుతున్న వారిలో కుటుంబ సమస్యలతో పాటు ఇలాంటి భయంకరమైన రోగాల బారిన పడినవారే ఎక్కువ మంది ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయన్నారు. -
అవాక్కవకుండా ఆన్సర్ చెప్పండి.!
సాక్షి, బెంగుళూరు: క్వశ్చన్ పేపర్ కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో టీచర్..! కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. దీంతో అయ్యగారి ఉద్యోగమే ఊడింది. రాజరాజేశ్వరి నగర్‌లోని మౌంట్ కార్మెల్ ఇంగ్లీష్ హైస్కూల్లో తయారు చేసిన 8వ తరగతి ప్రశ్నాపత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినటానికి తమాషాగా అనిపించినా, అసలే ఎన్నికల సమయం కావటంతో విమర్శలకు దారితీసింది. ఇంతలా తిప్పలు పెట్టిన ప్రశ్న ఏంటంటే... రైతు మిత్రులు ఎవరు? అన్న ప్రశ్నకు ...సమాధానంగా ఇచ్చిన ఆప్షన్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఎ. కుమారస్వామి బి. వానపాములు సి. యడ్యూర్పప్ప... ఆప్షన్లను చూసి ఒక్కసారిగా బిత్తరపోయిన విద్యార్థులు ఆ తర్వాత తేరుకొని తడుముకోకుండా సమాధానాన్ని ఎంచుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిని కాదని విద్యార్థులు... రైతు మిత్రులుగా వానపాములకే ఓటేశారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో స్కూల్ యాజమాన్యం సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యంగా ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన టీచర్‌ను విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని సంజాయిషీ ఇచ్చుకుంది. -
రాఫెల్ యుద్ధ విమానాలొచ్చేశాయ్ !
బెంగుళూరు: ఫ్రెంచ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం సాయంత్రం భారత్‌కు చేరుకున్నాయి. ఫిబ్రవరి 20న జరగబోయే ఏరో ఇండియా షోలో పాల్గొనేందుకు బెంగుళూరులో ల్యాండ్ అయ్యాయి. ఈ రెండు కాకుండా మరో రాఫెల్ యుద్ధ విమానం బైన్నియల్ ఎయిర్ షో, ఏవియేషన్ ఎగ్జిబిషన్లో పాల్గొనేందుకు వస్తోంది. ఈ యుద్ధ విమానాలను టాప్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్లు నడపనున్నారు. ఈ యుద్ధవిమానాలను నడిపేవారి జాబితాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) డిప్యూటీ చీఫ్, ఎయిర్ మార్షల్ వివేక్ చౌధరీ కూడా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో రాఫెల్ యుద్థ విమానాల అంశమే ప్రతిపక్షాలకు ప్రచార అస్త్రం కావడంతో ప్రస్తుతం అందరి కళ్లు వాటిపైనే ఉన్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉన్నప్పటికీ రాఫెల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరడం దేశ భద్రతకు మరింత అవసరం. ఫిబ్రవరి 20 నుంచి జరగబోయే ఏరో ఇండియా షోలో విమానాలను చూసేందుకు ఒక్కొక్క టిక్కెట్‌కు రూ.2750(బిజినెస్ డేస్‌లో) చెల్లించాలి. మిగతా రోజుల్లో సాధారణ సందర్శకులకు రూ.1800, ఎయిర్ డిస్ప్లే కోసం రూ.600 చార్జి చేస్తారు. ముందుగా కాకుండా అక్కడికక్కడే టిక్కెట్లు తీసుకుంటే రూ. 250 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. -
బెంగళూరులో అద్భుతం.. వైరల్ వీడియో
బెంగళూరు : ‘భూమి మీద నూకలు ఉంటే భూకంపం నుంచైనా బయటపడతాం’ అనే దానికి ఉదాహరణగా నిలిచాడు ఈ చిన్నారి. అనూహ్యరీతిలో మృత్యువును తప్పించుకున్న ఈ బెంగుళూరు చిన్నారి యాక్సిడెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వివరాల ప్రకారం బెంగళూరుకు చెందిన భార్య భర్తలు తమ కుమారుడితో కలిసి బైక్ మీద ప్రయాణిస్తున్నారు. వేగంగా ప్రయాణిస్తున్న ఈ బైక్, తమ ముందున్న మరో బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ చిన్నారి తల్లిదండ్రులు అక్కడే పడిపోయారు. కానీ బైక్ ముందు కూర్చున్న పసివాడు బైక్ మీద అలానే ఉన్నాడు. బైక్ అలానే వాహనాల మధ్యలోంచి దాదాపు 300 మీటర్లు దూరం దూసుకెళ్లింది. అంత దూరం ఆ బైక్ మీద కేవలం ఆ పసివాడు మాత్రమే ఉన్నాడు. అనంతరం ఆ బైక్ డివైడర్‌ను ఢీ కొట్టింది. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. బైక్ డివైడర్‌కు తగిలిన తర్వాత దాని మీద ఉన్న చిన్నారి ఎగిరి డివైడర్ మధ్యలో ఉన్న గడ్డిలో పడ్డాడు. ఈ ఘటనలో ఆ చిన్నారికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం. బైక్ మీద చిన్నారి ఒంటరిగా ప్రయాణించడం గమనించిన తోటి ప్రయాణికులు బాలుడు కింద పడ్డ చోటుకు వెళ్లి సాయం అందించారు. అయితే ఈ ఘటనలో కిందపడిన చిన్నారి తల్లిదండ్రులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. -
జనవరి 3న చంద్రయాన్– 2
సాక్షి బెంగళూరు: వచ్చే ఏడాది జనవరి 3న చంద్రయాన్–2 మిషన్ చేపడతామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ఈ ప్రయోగానికి రూ. 800 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ శత జయంతి ఉత్సవాలను ఆదివారం బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో మాజీ చైర్మన్లు కస్తూరి రంగన్, కిరణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. అనంతరం శివన్ మీడియాతో మాట్లాడుతూ 3,890 కేజీల బరువైన చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్ ద్వారా చంద్రుని మీదికి పంపిస్తామని తెలిపారు. ఈ మిషన్‌కు విక్రమ్ సారాభాయ్ మిషన్ అని నామకరణం చేస్తామని వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో 50 ఉపగ్రహాలు ప్రయోగించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఒక్క 2019లోనే 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు. ఇస్రో చరిత్రలో ఎక్కువ ప్రయోగాలు జరిపిన ఏడాది ఇదే కాబోతోందని అన్నారు. ఈ ఏడాది కూడా తమకు తీరికలేని షెడ్యూల్ ఉందని, ఇకపై నెలకు కనీసం రెండు ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో బ్రిటన్‌కు చెందిన రెండు వాణిజ్య ఉపగ్రహాల్ని నింగిలోకి పంపనున్నట్లు చెప్పారు. ఇస్రో చిన్నస్థాయి వాహకనౌకలను కూడా తయారుచేస్తోందని తెలిపారు. అవసరమైనప్పుడు ఇలాంటి వాటిని కేవలం ముగ్గురు నుంచి ఆరుగురు మనుషుల సాయంతో, మూడు రోజుల్లోనే రూపొందించొచ్చని వెల్లడించారు. మరో మూడు, నాలుగు నెలల్లో ఇస్రో టీవీ చానల్‌ను ప్రారంభిస్తున్నట్లు శివన్ చెప్పారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివరాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను సామాన్యులకు చేరవేసేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో తమ చానల్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. -
తప్పిన భారీ విమాన ప్రమాదం
సాక్షి బెంగళూరు: బెంగళూరు గగనతలంలో భారీ విమాన ప్రమాదం తప్పింది. బెంగళూరు గగనతలంలో రెండు ఇండిగో ఏ–320 విమానాలు ఒకదాన్నొకటి ఢీకొనబోయి తృటిలో తప్పించుకున్నాయి. ఈ ఘటన మంగళవారం జరిగినట్లు బెంగళూరు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో రెండు విమానాల్లో కలిపి 330 మంది ప్రయాణికులున్నారు. ఈ నెల 10న కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్లే 6ఈ–779 విమానం, బెంగళూరు నుంచి కొచ్చి వెళ్లే 6ఈ–6505 విమానం బెంగళూరు నగర గగనతలంలో ఒకదాని కొకటి దగ్గరగా రావడాన్ని గుర్తించిన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులోని ట్రాఫిక్ కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ అధికారులు రెండు విమానాల పైలట్లను అప్రమత్తం చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. -
‘రోటరీ’కి రూ.100 కోట్ల విరాళం
బెంగళూరు: స్వచ్ఛంద సంస్థ రోటరీ ఇంటర్నేషనల్‌కు బెంగళూరు స్థిరాస్తి వ్యాపారి రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు. స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడైన డి.రవిశంకర్ ఈ మొత్తాన్ని ఇచ్చినట్లు బెంగళూరు రోటరీ క్లబ్ ప్రతినిధి, బెంగళూరు క్రెడాయ్ ఉపాధ్యక్షుడు సురేశ్ హరి వెల్లడించారు. రవిశంకర్ ఇచ్చిన సొమ్మును చిన్నారుల ఆరోగ్యం సహా రోటరీ ఇంటర్నేషనల్ నిర్వహిస్తున్న చారిటీ కార్యక్రమాలకు వెచ్చిస్తామని హరి తెలిపారు. రవిశంకర్ తండ్రి కామేశ్.. వినోబాబావే భూదాన ఉద్యమంలో పాల్గొని తన భూమినంతా దానం చేశారు. -
స్పిన్ అస్త్రాలతో అఫ్గాన్ సిద్ధం
న్యూఢిల్లీ: స్పిన్‌కు అనుకూలించే భారత్‌లో స్పిన్నర్లతోనే బరిలోకి దిగేందుకు అఫ్గానిస్తాన్ జట్టు సిద్ధమైంది. భారత్‌తో వచ్చే నెల 14 నుంచి బెంగళూరులో జరిగే ఏకైక చారిత్రక టెస్టు కోసం అఫ్గానిస్తాన్ జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు కల్పించారు. ఐపీఎల్ సంచలనం రషీద్ ఖాన్‌తో పాటు నబీ, ముజీబుర్, జహీర్ ఖాన్, ఆమిర్ హమ్జా ఇందులో ఉన్నారు. వీరిలో ముజీబ్ మినహా మిగతా వారికి కేవలం నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవముంది. ముజీబ్‌కు ఆ అనుభవం కూడా లేదు. అఫ్గాన్ జట్టుకు అస్గర్ స్తానిక్‌జై నాయకత్వం వహించనున్నాడు. జట్టు: స్తానిక్‌జై (కెప్టెన్), షహజాద్, జావెద్, రహ్మత్ షా, ఇహ్సానుల్లా జనత్, నాసిర్ జమాల్, హష్మతుల్లా, అఫ్సర్ జజయ్, నబీ, రషీద్ ఖాన్, జహీర్ ఖాన్, ఆమిర్ హమ్జా, ముజీబ్, అహ్మద్ షిర్జాద్, యామిన్ అహ్మద్‌జై, వఫాదార్. -
ఆత్రేయీ మజుందార్ నీవెక్కడ..?
బెంగుళూరు : గత వారం అదృశ్యమైన బెంగుళూరుకు చెందిన ఆంత్రోపాలజిస్ట్ ఆత్రేయీ మజుందార్ (35) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆమె ఆచూకీ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలిస్తున్నారు. అందుకోసం వారు గూగుల్ స్ప్రెడ్ షీట్స్‌ను కూడా వాడుతున్నారు. కెనడాలో పీహెచ్డీ చేస్తున్న మజుందార్ ఏప్రిల్ 4న బెంగుళూరులోని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. ఇంటికి వచ్చిన అనంతరం తన గదిలోకి వెళ్లి రాత్రి తొమ్మిది గంటల వరకూ నిద్రపోయింది. తర్వాత తన గది నుంచి బయటకు వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. నాటి నుంచి ఈ రోజు వరకూ ఆమె ఆచూకీ తెలియలేదు. కాగా మజుందార్ కనిపించకుండా పోవడానికి ఒక్క రోజు ముందు తల్లిదండ్రులు ఆమెకు ఫోన్ చేశారు. కానీ ఆమె వారితో సరిగా మాట్లడలేదు. మరుసటి రోజు ఆమె తాను ఢిల్లీలో ఉన్నట్లు తండ్రితో చెప్పింది. ఆమెను బెంగుళూరు రమ్మని తండ్రి సూచించినా కుమార్తె ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్రేయీ మజుందార్ బెంగళూరులోని బెల్లందూర్‌లో బస చేసిన నోవాటెల్, మారియట్ హోటల్ నుంచి సీసీటీవీ ఫూటేజ్ తెప్పించి పరిశీలించారు. మజుందర్ హోటల్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు తనతో పాటు పాస్‌పోర్టు, డబ్బులను మాత్రమే తీసుకెళ్లింది. ఫోన్‌ను హోటల్లోనే వదిలేసి వెళ్లినట్లుగా తెలిసింది. మజుందార్ తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో ఆమె ఫోటోను షేర్ చేసి ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక బెంగళూరులోని నేషనల్ లా కాలేజీలో చదువుకున్న మజుందార్ ప్రస్తుతం పీహెచ్డీ చేయడానికి టోరంటో వెళ్లింది. ఆమె ఆచూకీ తెలిసిన వారు ఈ కింది నంబర్లను సంప్రదించవలసిందిగా కోరుతున్నారు. 9845261515, 9448290990 -
బార్లో అగ్ని ప్రమాదం; ఐదుగురి మృతి
సాక్షి, బెంగళూరు: ముంబైలో పబ్‌లో అగ్నిప్రమాదం జరిగి 14 మంది మృతి చెంది పదిరోజులైనా కాకముందే మరో మహానగరంలోనూ బార్ అండ్ రెస్టారెంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు కలాసిపాళ్యలోని కైలాస్ బార్ అండ్ రెస్టారెంట్లో సోమవారం తెల్లవారుజామున చెలరేగిన మంటల కారణంగా అందులో పనిచేసే ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మృతులను తుమకూరుకు చెందిన స్వామి, ప్రసాద్, మహేష్, హాసన్‌కు చెందిన మంజునాథ్, మండ్యకు చెందిన కీర్తిగా గుర్తించారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో, ఇరుకైన ద్వారంతో ఈ బార్ ఉంది. తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో మంటలు చెలరేగగా అక్కడే నిద్రిస్తున్న ఐదుగురు బయటకు వెళ్లలేక బాత్రూమ్లో దాక్కున్నారు. పొగకు ఊపిరాడక వారంతా ప్రాణాలు విడిచినట్లుగా భావిస్తున్నామనీ, పోస్ట్‌మార్టమ్ నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రమాదం జరిగిన వెంటనే బార్ యజమాని వీఆర్ దయాశంకర్‌ను అరెస్టు చేశారు. -
'చిన్నస్వామి'కి సౌరవెలుగులు
పగటిపూటేకాదు రాత్రివేళలోనూ సూర్యుడి ప్రభావంతో వెలిగిపోయే క్రికెట్ స్టేడియంగా మారిపోయింది బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం! ఫ్లడ్ లైట్లే కాకుండా ఇతర అవసరాలకు కూడా సరిపడ విద్యుత్ ఇకపై సౌరశక్తి ద్వారా ఉత్పత్తికానుంది. స్టేడియం పైకప్పుపై ఏర్పాటుచేసిన సౌరఫలకాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను బుధవారం కర్ణాటక ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ బుధవారం ప్రారంభించనున్నారు. దీంతో చిన్నస్వామి క్రికెట్ స్టేడియం పూర్తి పర్యవారణ హిత మైదానంగా మారిపోయింది. మొత్తం 400 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఈ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఐపీఎల్- 8లో భాగంగా ఏప్రిల్ 19 న జరిగే మ్యాచ్ లో ఆర్ సీబీ, ముంబై ఇండియన్స్ జట్టు తలపడబోయేది సౌర వెలుగు కిందే కానుండటం విశేషం. -
కాలేజీలో విద్యార్థిని కాల్చివేత
తనతో స్నేహానికి తిరస్కరించిందనే కోపంతో కాలేజీ అటెండర్ ఒకడు కాలేజీలోనే ఓ యువతిని కాల్చి చంపాడు. బెంగళూరులోని ప్రగతి కాలేజీలో 12వ తరగతి చదువుతున్న గౌతమిని(18) అటెండర్ మహేశ్ మంగళవారం రాత్రి ఆమె హాస్టల్ గదిలో నాటు తుపాకీతో కాల్చి చంపాడని పోలీసులు తెలిపారు. అతడు పక్క గదిలోకి వెళ్లి గౌతమి స్నేహితురాలైన శిరీషపైనా కాల్పులు జరిపాడని, ఆమె గాయపడిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందన్నారు. మహేశ్‌ను అరెస్ట్ చేసి, తుపాకీని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. గౌతమిది కర్ణాటకలోని తుముకూరు జిల్లా అని తెలిపారు. -
దక్షిణాన విస్తరణే బీజేపీ లక్ష్యం
- రేపటి నుంచి జాతీయ కార్యవర్గ సమావేశాలు - నేడు బెంగళూరుకు చేరుకోనున్న ప్రధాని మోదీ - ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సమావేశాలు సాక్షి, బెంగళూరు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శుక్రవారం నుంచి బెంగళూరులో ప్రారంభం కానున్నాయి. రెండురోజుల పాటు జరిగే భేటీల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని పటిష్టం చేయడమే ముఖ్య ఎజెండా కానుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి జాతీయ కార్యవర్గ సమావేశాలు కావడంతో వీటికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం బెంగళూరుకు రానున్నారు. ఆయన మూడు రోజులు బెంగళూరులోనే ఉంటారు. జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలను బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి బుధవారం వెల్లడించారు. గురువారం ఇటీవల పునర్వ్యవస్థీకరించిన నూతన జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశం జరుగుతుంది. మోదీ, పార్టీ చీఫ్ అమిత్‌షాలు ఈ సమావేశంలో పాల్గొంటారు. కార్యవర్గ సమావేశాల్లో సభ్యులతో పాటు జేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు శాసనసభా పక్ష నేతలతో కలిపి మొత్తం 330 మంది పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని నేషనల్ హైస్కూల్ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లో బీజేపీని పటిష్టం చేసేందుకు ఈ సమావేశాల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు పార్టీ నేత మురళీధర్ రావు తెలిపారు. -
సీఎం సభలో చరిత్రకారుడిపై దాడి
ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఓ సభలో 81 ఏళ్ల చరిత్రకారుడిపై దాడి జరిగింది. అర్హతలేని వ్యక్తిని వచనకారుడిగా పేర్కొంటూ జయంతి వేడుకల్ని నిర్వహించడంపై నిరసన తెలపడమే గలాటాకు కారణమైంది. వచనకారుడు, శివ భక్తుడిగా పేరొందిన దివంగత దేవర దశిమయ్య జయంతి వేడుకల్ని బుధవారం బెంగళూరులోని విధాన సౌధలో నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. అయితే దేవర దశిరామయ్య అసలు వచనాలే రాయలేదని, జేదార దశిరామయ్యే అసలు వచనకారుడని, పేర్లు గుర్తించడంలో ప్రభుత్వం పొరపాటుకు గురైందని చరిత్రకారుడు, రచయిత ఎం చిదానందమూర్తి ఆ సభలో కరపత్రాలు పంచేందుకు ప్రయత్నించారు. చిదానంద చర్యను వ్యతిరేకిస్తూ కొందరు వ్యక్తులు ఆయనపై దాడికి దిగారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వేదికపైనే ఉన్నారు. పోలీసులు కలుగజేసుకొని చరిత్రకారుడు, అతని అనునాయుల్ని బయటికి పంపడంతో గొడవ సర్దుమణిగింది.