బెంగుళూరు : లాక్‌డౌన్ ముసుగులో కొందరు ఆన్‌లైన్ డెలివరీ పేరుతో తప్పుడు పనులు చేస్తున్నారు. తాజాగా ఆన్‌లైన్ డెలివరీ ఉద్యోగులమని చెప్పి సాండ్ బోవా అనే రెండు తలల పామును అమ్మేందుకు ప్రయత్నించిన ఇద్దరిని గురువారం బెంగుళూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగుళూరుకు చెందిన మహ్మద్ రిజ్వాన్, అజర్ ఖాన్‌లు జల్సాలకు అలవాటు పడ్డారు. ఈ క్రమంలో డంజో డెలివరీ సంస్థలో ఉద్యోగులుగా పని చేస్తున్నామని చెప్పి అంతరించిపోయే దశలో ఉన్న సాండ్ బోవా అనే రెండు తలల పామును విక్రయించేందుకు ప్రయత్నించారు.కొంతమందికి వీరు చేస్తున్న పనిపై అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. (లాక్‌డౌన్: యూపీలో తాత్కాలిక జైళ్లు)
బెంగుళూరు జాయింట్ కమిషనర్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ.. 'లాక్‌డౌన్ నేపథ్యంలో బెంగుళూరు నగరంలో డంజో డెలివరీ సంస్థ ఆన్‌లైన్ ద్వారా నిత్యావసరాలు సరఫరా చేస్తూ మంచి పేరు సంపాదించింది. అయితే వీరిద్దరు ఆ సంస్థ ఉద్యోగులమని చెప్పి రెండు తలల పామును అమ్మడానికి ప్రయత్నించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రిజ్వాన్, అజర్‌లపై కేసు నమోదు చేశామని' పాటిల్ తెలిపారు. కాగా అంతరించిపోయే దశలో ఉన్న సాండ్ బోవా( రెండు తలల పాము)ను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసొస్తుందట.
Comments
Please login to add a commentAdd a comment