
న్యూఢిల్లీ: స్పిన్‌కు అనుకూలించే భారత్‌లో స్పిన్నర్లతోనే బరిలోకి దిగేందుకు అఫ్గానిస్తాన్ జట్టు సిద్ధమైంది. భారత్‌తో వచ్చే నెల 14 నుంచి బెంగళూరులో జరిగే ఏకైక చారిత్రక టెస్టు కోసం అఫ్గానిస్తాన్ జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు కల్పించారు. ఐపీఎల్ సంచలనం రషీద్ ఖాన్‌తో పాటు నబీ, ముజీబుర్, జహీర్ ఖాన్, ఆమిర్ హమ్జా ఇందులో ఉన్నారు. వీరిలో ముజీబ్ మినహా మిగతా వారికి కేవలం నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవముంది. ముజీబ్‌కు ఆ అనుభవం కూడా లేదు. అఫ్గాన్ జట్టుకు అస్గర్ స్తానిక్‌జై నాయకత్వం వహించనున్నాడు.
జట్టు: స్తానిక్‌జై (కెప్టెన్), షహజాద్, జావెద్, రహ్మత్ షా, ఇహ్‌సానుల్లా జనత్, నాసిర్ జమాల్, హష్మతుల్లా, అఫ్సర్ జజయ్, నబీ, రషీద్ ఖాన్, జహీర్ ఖాన్, ఆమిర్ హమ్జా, ముజీబ్, అహ్మద్ షిర్జాద్, యామిన్ అహ్మద్‌జై, వఫాదార్.