Test matches
-
తగ్గేదే లే.. సౌతాఫ్రికాలోనూ టీమిండియా జోరు..!!
-
ఐదు పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు.. భారత్ ఘన విజయం
కేవలం 43 నిమిషాలు... 11.3 ఓవర్లు... ప్రపంచ టెస్టు చాంపియన్ న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చడానికి నాలుగో రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు తీసుకున్న సమయం. నాలుగేళ్ల తర్వాత మళ్లీ టెస్టు ఆడిన ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ నాలుగో రోజు మొదటి సెషన్లో నాలుగు వికెట్ల తీయగా... నికోల్స్‌ను అవుట్ చేసి అశ్విన్ భారత జట్టుకు తమ టెస్టు చరిత్రలోనే పరుగుల పరంగా అతి పెద్ద విజయాన్ని ఖరారు చేశాడు. ఈ సిరీస్ గెలుపుతో భారత్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ను రెండో స్థానానికి వెనక్కి నెట్టి నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకుంది. ముంబై: సొంతగడ్డపై మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ భారత క్రికెట్ జట్టు వరుసగా 14వ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్టులో భారత్ 372 పరుగుల తేడాతో బ్రహ్మాండమైన విజయం సాధించింది. 540 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 27 పరుగులు జతచేసి న్యూజిలాండ్ మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్లు అశ్విన్, జయంత్ యాదవ్ నాలుగు వికెట్ల చొప్పున తీయగా... మరో వికెట్ ఎడంచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ ఖాతాలోకి వెళ్లింది. ఈ గెలుపుతో భారత్ రెండు టెస్టుల సిరీస్‌ను 1–0తో కైవసం చేసుకుంది. కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ సెంచరీ చేసిన భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డుతోపాటు రూ. 1 లక్ష ప్రైజ్‌మనీ... రెండు టెస్టుల్లో పొదుపుగా బౌలింగ్ చేసి మొత్తం 14 వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారంతోపాటు రూ. 2 లక్షల 50 వేలు ప్రైజ్‌మనీ లభించాయి. కొత్త హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో భారత్ రెండో సిరీస్‌ను దక్కించుకుంది. టి20 సిరీస్‌ను టీమిండియా 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 5 పరుగులు... 5 వికెట్లు ఓవర్‌నైట్ స్కోరు 140/5తో ఆట నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ బ్యాటర్లు నికోల్స్ (44; 8 ఫోర్లు), రచిన్ రవీంద్ర (18; 4 ఫోర్లు) తొలి ఆరు ఓవర్లపాటు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 22 పరుగులు జోడించారు. అయితే ఇన్నింగ్స్ 52వ ఓవర్లో జయంత్ బౌలింగ్‌లో రచిన్ రెండో స్లిప్‌లో పుజారాకు క్యాచ్ ఇవ్వడంతో కివీస్ 162 పరుగులవద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జయంత్ ఐదు బంతుల వ్యవధిలో జేమీసన్ (0), సౌతీ (0), సోమర్విల్లే (1)లను అవుట్ చేశాడు. చివరగా అశ్విన్ బౌలింగ్‌లో నికోల్స్ స్టంపౌట్ కావడంతో న్యూజిలాండ్ ఓటమి ఖరారైంది. కివీస్ చివరి ఐదు వికెట్లను ఐదు పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 325; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 62; భారత్ రెండో ఇన్నింగ్స్: 276/7 డిక్లేర్డ్; న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 6; విల్ యంగ్ (సి) సూర్యకుమార్–సబ్ (బి) అశ్విన్ 20; డరైల్ మిచెల్ (సి) జయంత్ యాదవ్ (బి) అక్షర్ పటేల్ 60; రాస్ టేలర్ (సి) పుజారా (బి) అశ్విన్ 6; నికోల్స్ (స్టంప్డ్) సాహా (బి) అశ్విన్ 44; బ్లన్‌డెల్ (రనౌట్) 0; రచిన్ రవీంద్ర (సి) పుజారా (బి) జయంత్ యాదవ్ 18; జేమీసన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జయంత్ యాదవ్ 0; టిమ్ సౌతీ (బి) జయంత్ యాదవ్ 0; సోమర్విల్లే (సి) మయాంక్ అగర్వాల్ (బి) జయంత్ యాదవ్ 1; ఎజాజ్ పటేల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (56.3 ఓవర్లలో ఆలౌట్) 167. వికెట్ల పతనం: 1–13, 2–45, 3–55, 128, 5–129, 6–162, 7–165, 8–165, 9–167, 10–167. బౌలింగ్: సిరాజ్ 5–2–13–0, అశ్విన్ 22.3–9–34–4, అక్షర్ పటేల్ 10–2–42–1, జయంత్ యాదవ్ 14–4–49–4, ఉమేశ్ యాదవ్ 5–1–19–0. -
Ashes Series: ముందు 7 టెస్టులు గెలిస్తేనే.. : జో రూట్
న్యూజిలాండ్, భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌ల గెలుపు యాషెస్‌కు ఎంతో కీలకం కానుందని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తెలిపారు. లార్డ్స్ వేదికగా బుధవారం నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత భారత్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడాల్సి ఉంది. వరుస విజయాలు ఎంతో అవసరం న్యూజిల్యాండ్, భారత్‌తో జరగనున్న 7 టెస్ట్ మ్యాచ్‌లను గెలిచి యాషెస్ సిరీస్‌కి తమ జట్టు ఆస్ట్రేలియాలోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు రూట్ తెలిపారు. ఇందుకోసం ఇంగ్లండ్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోందని చెప్పారు. లార్డ్స్‌లో బుధవారం ప్రారంభమయ్యే 2 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్‌తో తలపడనుంది, ఆపై ఆగస్టు 4 నుంచి 5 టెస్టులు భారత్‌తో తలపడనుంది. లార్డ్స్ టెస్ట్ సందర్భంగా కేన్ విలియమ్సన్ జట్టుపై గెలుపుకోసం రూట్ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డాడు. యాషెస్ మాకెంతో ప్రత్యేకం ఈ విషయాల గురించి రూట్ మాట్లాడుతూ... ఈ వేసవి అంతా ఆస్ట్రేలియాతో తలపడనున్న యాషెస్ సిరీస్ గురించి నిరంతరం సంభాషణలు జరుగుతున్నాయని చెప్పారు. ఎందుకంటే మాకు ఆ సిరీస్ ఎంతో ప్రత్యేకమైనది. ఒక ఇంగ్లీష్ అభిమానిగా, ఇంగ్లీష్ ప్లేయర్‌గా యాషెస్ అనేది ఐకానిక్ సిరీస్ మాత్రమే కాదు ఎంతటి ప్రతిష్టాత్మకమో తెలుసు కాబట్టే మేము యాషెస్‌ను ప్రత్యేకంగా చూస్తామన్నారు. ఈ నేపథ్యంలో రానున్న వరుస టెస్ట్ మ్యాచ్ మ్యాచ్‌ల గెలుపు చాలా కీలకమని తెలిపారు. ప్రస్తుతం ఈ రెండు ఉత్తమ జట్టులతో ఆడటం మా ఆటగాళ్లకు గొప్ప అవకాశమని రూట్ తెలిపారు. ఇక, బెన్ స్టోక్స్ లేకపోవడంతో స్టువర్ట్ బ్రాడ్ న్యూజిలాండ్ తరపున ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా ఇప్పటికే ముంబయికి చేరుకుని క్వారంటైన్లో ఉన్న భారత క్రికెటర్లు.. బుధవారం స్పెషల్ ఛార్టెర్ ప్లైట్‌లో ఇంగ్లాండ్‌కి బయల్దేరి వెళ్లనున్నారు. చదవండి: తొలి టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి షాక్.. -
‘నా టైమ్ ఎప్పుడొస్తుంది’
సాక్షి క్రీడా విభాగం: సరిగ్గా రెండేళ్లయింది కుల్దీప్ యాదవ్ టెస్టు మ్యాచ్ ఆడి. నాడు సిడ్నీ టెస్టులో 5 వికెట్లు పడగొట్టిన తర్వాత ఏ ముహూర్తాన హెడ్ కోచ్ రవిశాస్త్రి ‘కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలర్, అత్యుత్తమ స్పిన్నర్’ అంటూ ప్రశంసించాడో ఆ రోజు నుంచి అదృష్టం అతని గడప తొక్కలేదు. ఇటీవల ముగిసిన సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క వన్డే మాత్రం ఆడిన కుల్దీప్ సొంత గడ్డపైనైనా తన సుడి మారుతుందని ఆశించాడు. ‘స్వదేశంలో జరిగే మ్యాచ్‌లలో కుల్దీప్ మా ప్రణాళికల్లో భాగంగా ఉన్నాడు’ అంటూ స్వయంగా కోహ్లి గురువారమే చెప్పినా... శుక్రవారానికి వచ్చేసరికి అతనికి మరోసారి మ్యాచ్ దక్కలేదు. వైవిధ్యమైన చైనామన్ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను కచ్చితంగా కుల్దీప్ ఇబ్బంది పెట్టగలడని అంతా భావించారు. అరుదుగా ఉండే ఎడంచేతి మణికట్టు స్పిన్నర్లు పిచ్‌తో సంబంధం లేకుండా ప్రభావం చూపించగలరు కాబట్టి తొలి టెస్టులో అతనికి చోటు ఖాయంగా కనిపించింది. అయితే టీమ్ మేనేజ్మెంట్ మాత్రం తుది జట్టులో ముగ్గురూ ‘ఫింగర్ స్పిన్నర్’లకే అవకాశమిచ్చింది. అశ్విన్‌లాంటి సీనియర్ ఉన్నప్పుడు అదే శైలి ఉన్న సుందర్‌కు చోటు కల్పించడం ఆశ్చర్యకర నిర్ణయం. జట్టు బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకే ఇలా చేశారు అంటూ ఒక వాదన వినిపించింది. దీని ప్రకారం కోహ్లి కచ్చితంగా జట్టులో ఒక లెఫ్టార్మ్ స్పిన్నర్ ఉండాల్సిందేనని పట్టు బట్టాడు. పిచ్‌లు భిన్నమైనా... ఇటీవల శ్రీలంక బౌలర్ ఎంబుల్డెనియా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించడం కూడా అందుకు ఒక కారణం. రవీంద్ర జడేజా లేకపోవడంతో అతడిని పోలిన బౌలింగ్ శైలి, బ్యాటింగ్ చేయగల సామర్థ్యంతో అక్షర్ పటేల్ ఆడటం ఖాయమైపోయింది కూడా. అయితే అక్షర్ అనూహ్యంగా తప్పుకోవడంతో లెక్క మారిపోయింది. చివరి నిమిషంలో ఎంపిక చేసిన నదీమ్‌కు మ్యాచ్ ఆడే అవకాశం లభించింది. కుల్దీప్ను కూడా ఎంపిక చేస్తే చివరి నలుగురు ఏమాత్రం బ్యాటింగ్ చేయలేనివారిగా మారిపోతారు కాబట్టి ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ ఉంటే బాగుంటుందని జట్టు భావించింది. ఇటీవలి బ్రిస్బేన్ టెస్టు ప్రదర్శన సుందర్‌కు అదనపు అర్హతగా మారిపోయింది. దాంతో కుల్దీప్కు అవకాశం దక్కలేదు. అయితే చివరకు అనుభవం లేని నదీమ్, సుందర్‌లనే లక్ష్యంగా చేసి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టారు. ఇద్దరూ కలిసి 3.87 ఎకానమీతో పరుగులు ఇవ్వగా, 19 ఫోర్లు వీరి బౌలింగ్‌లోనే వచ్చాయి. బౌలింగ్‌లో సుందర్‌ను జట్టు పెద్దగా వాడుకోనే లేదు. 41వ ఓవర్‌కు గానీ బౌలింగ్ ప్రారంభించని అతను 12 ఓవర్లు మాత్రమే వేసి ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రత్యేక పరిస్థితుల్లో బ్రిస్బేన్ టెస్టు అవకాశం దక్కించుకున్న సుందర్... మూడున్నరేళ్ల తర్వాత స్వదేశంలో ఆడుతున్న తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కోహ్లి, పుజారా, రోహిత్, రహానే, పంత్‌లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్న భారత జట్టు స్వదేశంలో భారీ స్కోరు కోసం ఏడో నంబర్ ఆటగాడి వరకు ఆధారపడుతుందా! టాప్–6 సరిగ్గా బ్యాటింగ్ చేస్తే అసలు లోయర్ ఆర్డర్ అవసరమేముంటుంది? వారు చేయలేని పనిని ఏడు, ఎనిమిదో నంబర్ ఆటగాళ్లు చేస్తారా! మూడేళ్ల తర్వాత... భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు స్వదేశంలో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. 2018 జనవరిలో కేప్‌టౌన్‌లో అరంగేట్రం చేసిన అతను ఇప్పటి వరకు 17 టెస్టులు ఆడగా, అన్నీ విదేశాల్లోనే జరిగాయి. -
ఆ అవకాశమిస్తే అదృష్టంగా భావిస్తా: వషీ
చెన్నై: డ్రెసింగ్ రూమ్‌లో టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇచ్చే విలువైన సలహాలు యువ ఆటగాళ్లలో ఎంతో స్పూర్తిని నింపుతాయని, మైదానంలో ఉత్తమ ప్రదర్శన చేసేందుకు అవి ఓ టానిక్‌లా ఉపయోగపడతాయని టీమిండియా యువ సంచలన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అన్నాడు. ఆటలో ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని, టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని అతను పేర్కొన్నాడు. తన ఆటతీరును కోచ్ రవిశాస్త్రి ఏ మేరకు ప్రభావితం చేసాడనే అంశంపై సుందర్ మాట్లాడుతూ.. నాలాంటి యువ ఆటగాళ్లకు రవిశాస్త్రి లాంటి అనుభవజ్ఞుడైన కోచ్ లభించటం ఎంతో అదృష్టమని, మరీ ముఖ్యంగా ఆల్‌రౌండర్‌గా రాణించాలకున్న నాకు రవిశాస్త్రి సలహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నాడు. రవిశాస్త్రి తన టెస్టు కెరీర్లో ఎడమచేతి స్పిన్ బౌలర్‌గా, కుడి చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించిన విషయాన్ని సుందర్ గుర్తుచేశాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్, కుడి చేతి ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సుందర్.. కోచ్ రవిశాస్త్రే తనకు, స్పూర్తి, ఆదర్శమని పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ అండర్-19 క్రికెట్లో స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. టీమిండియాలో స్థానం సంపాదించాలంటే కేవలం బ్యాటింగ్‌పైనే ఆధారపడితే సరిపోదని, తనలోని స్పిన్ బౌలింగ్‌కు సాన పట్టాడు. చాలామంది యువ ఆటగాళ్లలాగే సుందర్ కూడా ఐపీఎల్లో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని, టీమిండియా టీ20 జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అంతటితో ఆగకుండా తనలోని ప్రతిభను మరింత మెరుగుపర్చుకుంటూ తన చిరకాల స్వప్నం అయిన టీమిండియా టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు. తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలా మారాడు. బ్రిస్బేన్ టెస్టులో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు. మొత్తం 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. -
పుజారా,రహానేలు కీలకం
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న సిరిస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి మొదటి టెస్ట్‌కు మాత్రమే అందుబాటులో ఉండడంపై మాజీ కెప్టెన్ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. డిసెంబర్ 17న అడిలైడ్‌లో తొలి టెస్ట్ తరువాత కోహ్లి స్వదేశానికి రానున్న నేపథ్యంలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చేతేశ్వర్ పుజారా ,మరో సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే బ్యాటింగ్ భారాన్ని మోయాలని సూచించారు. తన భార్య అనుష్క శర్మ మొదటి బిడ్డకు జన్మనిస్తుండటంతో కోహ్లి భారత్‌కు తిరిగి రావడం తెలిసిందే. టెస్ట్ వైస్ కెప్టెన్ రహానె మిగిలిన మూడు మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. పూజారాతో పాటు అదనపు బాధ్యతలను భరించాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "కెప్టెన్ లేకపోవడంతో మిగిలిన ఆటగాళ్లు బాధ్యతను తీసుకుని,అతని గైర్హాజరు కనపడకుండా ఆడాలని సూచించారు. రహానే , చేతేశ్వర్ పుజారాకు ఇది కఠినమైన సవాల్. ఈ ఇద్దరు ఆటగాళ్ళు తమ చెమట చిందించాల్సి ఉంటుందని"అని గవాస్కర్ అన్నారు పుజారానే ఉత్తమం. గవాస్కర్ కూడా పూజారాను బ్యాటింగ్ చేయమని ప్రోత్సహించాడు, 2018-19లో భారతదేశం చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో పుజారా అత్యధిక పరుగులు చేసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరీస్ మొత్తం నిలకడగా ఆడుతూ 74.42 సగటుతో మూడు సెంచరీలు,ఒక హఫ్ సెంచరీ సహాయంతో 521 పరుగులు చేశాడు. భారతదేశపు చారిత్రాత్మక 2-1 విజయానికి సౌరాష్ట్ర బ్యాట్స్ మాన్ సహనం, శాస్త్రీయ శైలి ఒక ప్రధాన కారణం. అతను దాదాపు 30 గంటలు బ్యాటింగ్ చేశాడు 1258 బంతులను ఎదుర్కొన్నాడు, ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక బంతులను ఎదుర్కొన్న రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు. పరుగుల గురించి పెద్దగా చింతించకుండా ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం ద్వారా బౌలర్లను ఎదుర్కొవటం పుజారాకు ఇష్టం. మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్ మరియు నాథన్ లియోన్లాంటి ప్రఖ్యాత ఆసీస్ దాడి అతని ఏకాగ్రతను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పుజారా బ్యాటింగ్ శైలి గురించి చిన్న ఆధారం కూడా లభించకపోవటంతో అలసిపోయినట్లు అనిపించింది, అందుకే దాదాపు రెండు సంవత్సరాల క్రితం చేసినట్లుగానే పూజారాను తన సహజమైన ఆట ఆడటానికి మేనేజ్మెంట్ ప్రోత్సహించాలని గవాస్కర్ చెప్పాడు. సెంచరీలు వస్తున్నంత కాలం పరుగులు ఎలా పొందాలో ఎవరూ అతనికి చెప్పకూడదు అని అన్నారు. పుజారాని స్వేచ్ఛగా,ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడనివ్వాలి. అది టీమ్ కి అనుకూలంగా మారుతుంది. అతను స్థిరంగా ఉంటాడు.దానివల్ల తన చుట్టూ ఉన్న బ్యాట్స్‌మెన్ కూడా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తారని 10,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ అయిన లిటిల్ చాంప్ వ్యాఖ్యానించాడు. -
‘పుజారా.. ఈసారి అంత ఈజీ కాదు’
మెల్బోర్న్: ఈసారి ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా టెస్టు స్పెషలిస్టు చతేశ్వర్ పుజారాకు సవాల్ తప్పదని అంటున్నాడు ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్. గతంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత క్రికెట్ జట్టు టెస్టు సిరీస్‌నుకైవసం చేసుకుని చరిత్ర సృష్టంచగా అందులో పుజారా ప్రధాన భూమిక పోషించాడు. కాగా, ఇప్పుడు మాత్రం పుజారాకు తమ బౌలర్లు ఆ చాన్స్ ఇవ్వరని మెక్‌గ్రాత్ ధీమా వ్యక్తం చేశాడు. ఒక స్పోర్ట్స్ చానల్‌తో మాట్లాడిన మెక్‌గ్రాత్.. ‘పుజారా టీమిండియా బ్యాటింగ్‌లో కీలక ఆటగాడు. నిలకడైన బ్యాటింగ్‌తో క్రీజ్‌లో పాతుకుపోతాడు. పరుగులు చేయనప్పుడు ఒత్తిడిని అనుభవించడు. ఆధునిక యుగంలో ఇది ప్రత్యేకమైనది, ఇక్కడ ఒక తొలి ఓవర్ తర్వాత పరుగులు చేయాలనుకునే బ్యాట్స్ మెన్ ఉన్నారు. పుజారాకు ఆ మనస్తత్వం లేదు. (ఇక్కడ చదవండి: చరిత్రను రిపీట్ చేస్తాం: పుజారా) ఇది చివరిసారి అతనికి సహాయపడింది అని మెక్‌గ్రాత్ అన్నాడు. అతను ఈ మధ్య కాలంలో క్రికెట్ ప్రాక్టీస్ చేయలేదు, ఇది పెద్ద ప్రభావాన్ని చూపబోతుంది. అతను ఏ క్రికెట్ ఆడలేదు కాబట్టి అతను చివరి సిరీస్ కంటే కష్టపడాల్సి ఉంటుంది.ఈసారి పుజారాకు అతి పెద్ద చాలెంజ్ తప్పదు’ అని అన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా , 521 పరుగులతో మొత్తం 74.42 సగటుతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక తొలి టెస్టు తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్వదేశానికి తిరిగి రావడం కూడా ఆసీస్‌కు కలిసి వస్తుందని మెక్‌గ్రాత్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి జట్టులో లేకపోతే అది కచ్చితంగా సిరీస్‌పై ప్రభావం చూపిస్తుందన్నాడు. -
అజహర్... తీన్మార్
ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్లో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడుతూ సెంచరీ సాధించడం అంటే గొప్ప ప్రదర్శనగా గుర్తించవచ్చు. ఎందుకంటే 143 ఏళ్ల టెస్టు చరిత్రలో 2,384 మ్యాచ్‌లు జరిగితే 108 మందికే ఇది సాధ్యమైంది. అదే జోరు కొనసాగించి రెండో టెస్టులోనూ శతకం బాదితే అద్భుతమని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 9 మంది మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇక అంతటితో ఆగకుండా మూడో టెస్టు మ్యాచ్‌లోనూ వందతో చెలరేగిపోతే ఆ సంచలనాన్ని మొహమ్మద్ అజహరుద్దీన్ అనవచ్చు. ఎందుకంటే తన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించిన ఈ మాజీ కెప్టెన్ రికార్డును ఇప్పటికీ ఎవరూ సమం కూడా చేయలేకపోయారు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికీ అజహర్ కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 1984–85 సీజన్లో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. భారత జట్టుకు సునీల్ గావస్కర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌కు అజహర్ ఎంపికయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే మూడో టెస్టులో సందీప్ పాటిల్ స్థానంలో అజ్జూను తీసుకున్నారు. 1984 డిసెంబర్ 31న మొదలైన ఈ టెస్టుతో అజ్జూ చరిత్ర సృష్టించాడు. తొలి సెంచరీ (కోల్‌కతా) ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ టెస్టులో అజహర్ ఐదో స్థానంలో వచ్చాడు. 322 బంతుల్లో 10 ఫోర్లతో 110 పరుగులు చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. అద్భుతంగా కెరీర్‌ను ఆరంభించిన అజహర్‌పై అందరి దృష్టీ పడింది. అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 437 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 276 పరుగులకే ఆలౌటైంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌కు ఇబ్బంది కలగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అజహర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తుదకు ఈ టెస్టు ‘డ్రా’గా ముగిసింది. రెండో సెంచరీ (మద్రాస్) చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. అజహరుద్దీన్ 90 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. అనంతరం మైక్ గ్యాటింగ్ (207; 20 ఫోర్లు; 3 సిక్స్‌లు), గ్రేమ్ ఫ్లవర్ (201; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీలు సాధించారు. దాంతో ఇంగ్లండ్ 7 వికెట్లకు 652 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 380 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ చివరకు 412 పరుగులు చేసి ఆలౌటై ఇంగ్లండ్ ముందు 33 పరుగుల విజయలక్ష్యాన్ని పెట్టింది. తీవ్ర ఒత్తిడిలో పోరాడుతూ ఇక్కడ సాధించిన మరో శతకం అజహర్ అసలు సత్తాను చూపించింది. 218 బంతుల్లో అజహర్ 18 ఫోర్లతో 105 పరుగులు సాధించాడు. భారత్ 9 వికెట్లతో ఈ మ్యాచ్ ఓడినా... మన హైదరాబాదీ ప్రదర్శించిన బ్యాటింగ్ సొగసు, అతని మణికట్టు మాయాజాలం ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అభిమానులను తెచ్చిపెట్టింది. వరుసగా రెండో సెంచరీతో అజ్జూ తళుక్కుమన్నాడు. మూడో సెంచరీ ( కాన్పూర్) అజహర్‌కు ముందు ముగ్గురు బ్యాట్స్‌మెన్‌కు మాత్రమే తమ అరంగేట్రం తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించిన గుర్తింపు ఉంది. తాజా ప్రదర్శనతో భారత అభిమానుల దృష్టి అజహర్‌పై నిలిచింది. అతను మూడో మ్యాచ్‌లోనూ శతకాన్ని అందుకోగలడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అజహర్ అభిమానుల అంచనాలు వమ్ము చేయలేదు. చురుకైన బ్యాటింగ్‌తో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అజ్జూ 270 బంతుల్లో 16 ఫోర్లతో 122 పరుగులు చేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. భారత్ 8 వికెట్లకు 553 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 417 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఫలితం ‘డ్రా’గా ఖాయమైన నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన అజహర్ 43 బంతుల్లోనే 5 ఫోర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలా అతని వరుసగా మూడు సెంచరీల ప్రదర్శన క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. మొత్తంగా 3 టెస్టుల్లో కలిపి అజహర్ 439 పరుగులు సాధించాడు. మూడో టెస్టులో వేటుపడ్డాక సందీప్ పాటిల్ మళ్లీ టెస్టు జట్టులోకి రాలేకపోయాడు. తన స్థానంలో వచ్చిన అజహర్ పాతుకుపోవడంతో పాటిల్ కెరీర్ అక్కడే ముగిసిపోయింది. భారత్ తరఫున 15 మంది తమ తొలి టెస్టుల్లో సెంచరీలు చేయగా... అజహర్‌తో పాటు గంగూలీ, రోహిత్ శర్మ మాత్రమే తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు సాధించారు. అజహర్ అనూహ్యంగా ముగిసిన తన కెరీర్ చివరి టెస్టు (99వ)లోనూ సెంచరీ సాధించడం విశేషం. –సాక్షి క్రీడా విభాగం -
2023 నుంచి నాలుగు రోజుల టెస్టులు?
మెల్బోర్న్: మరో మూడేళ్ల తర్వాత నాలుగు రోజుల టెస్టులే కనిపించే అవకాశముంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సంప్రదాయ క్రికెట్‌ను తప్పనిసరిగా కుదించాలనే యోచనలో ఉంది. అంతా అనుకున్నట్లు జరిగితే 2023 నుంచి ఐదు రోజుల ఆట కాస్తా నాలుగు రోజులకే పరిమితం కానుంది. ఈ కుదింపు మరిన్ని ఈవెంట్లకు అవకాశమిస్తుందని ఐసీసీ భావిస్తోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ద్వైపాక్షిక సిరీస్‌లు పెరగాలని గతంలో డిమాండ్ చేసింది. అయితే వివిధ దేశాల్లో టి20 లీగ్‌లు జరుగుతుండటం వల్లే టెస్టులను కుదిస్తున్నారని తెలిసింది. ఇది కొత్తగా ఇప్పుడే వచ్చిన మార్పు కాదు... ఇదివరకే ఈ ఏడాది ఇంగ్లండ్, ఐర్లాండ్ల మధ్య నాలుగు రోజుల టెస్టు జరిగింది. 2017లోనూ దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నాలుగు రోజుల మ్యాచ్ ఆడాయి. ఇపుడే స్పందిస్తే తొందరపాటే: గంగూలీ నాలుగు రోజుల టెస్టుకు ఇంకా చాలారోజులు పడుతుందని దీనిపై ఇప్పుడే స్పందిస్తే తొందరపాటే అవుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. ‘ముందు ప్రతిపాదన రానివ్వండి. రాకముందే వ్యాఖ్యానించడం తగదు’ అని చెప్పాడు. -
రోహిత్ నాలా కాకూడదు: లక్ష్మణ్
హైదరాబాద్: తన క్రికెట్ కెరీర్లో చేసిన తప్పిదాలను రోహిత్ శర్మ చేయకూడదని దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ సూచించాడు. తనకు టెస్టుల్లో పెద్దగా ఓపెనింగ్ అనుభవం లేకపోయినా, ఓపెనింగ్‌కు వెళ్లి విఫలమైన సంగతిని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నాడు. కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన తర్వాత తనను ఓపెనర్‌గా ప్రయోగం చేశారన్నాడు. అది మంచి ఫలితాన్ని ఇవ్వలేదన్నాడు. ‘ఓపెనింగ్‌లో రోహిత్ శర్మ నేనే చేసినట్లుగా పొరపాట్లు చేయకూడదు. ఇప్పుడైతే అతడికి అనుభవమే అతిపెద్ద సానుకూలత. మంచి ఫామ్‌లో ఉన్నాడు. అప్పట్లో (1996–98 సీజన్) నాకు అనుభవమే లేదు. అంతకుముందు మిడిలార్డర్లో నాలుగు టెస్టులే ఆడా. అంతలోనే ఓపెనింగ్‌కు పంపారు. టెక్నిక్ మార్చి బ్యాటింగ్ చేసి విఫలమయ్యా. రోహిత్... ఆర్డర్ మారినా, బ్యాటింగ్ సూత్రాలు, క్రీజులో నిలిచే దిశను మార్చుకోవద్దు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్‌పై కచ్చితమైన మైండ్‌సెట్‌తో ఆడాలి’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు. -
పాండ్యాను ఆల్‌రౌండర్ అనలేం
లండన్: భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా టెస్టుల్లో ఆల్‌రౌండర్ కాదని వెస్టిండీస్ బౌలింగ్ దిగ్గజం మైకేల్ హోల్డింగ్ అభిప్రాయపడ్డారు. ఆల్‌రౌండర్ స్థానాన్ని భర్తీ చేసే నైపుణ్యం అతనిలో లేదన్నారు. ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుత భారత టెస్టు జట్టు సమతూకంగా లేదు. పాండ్యాను ఆల్‌రౌండర్ స్థానంతో భర్తీ చేస్తున్నారు. కానీ అతని బౌలింగ్‌లో పసలేదు. బ్యాటింగ్‌లో నిలకడ లేదు. మొత్తానికి టెస్టుల్లో అతను ప్రభావవంతమైన ఆటగాడేమీ కాదు. పాండ్యా ఆల్‌రౌండరే అయితే సెంచరీలు సాధించకపోయినా... కనీసం 60, 70 పరుగులైనా చేయాలి. బౌలింగ్‌లో వికెట్లు తీయాలి. అలా కాకుండా ఎపుడో ఒకసారి 2, 3 వికెట్లు తీస్తే సరిపోతుందా? ఇది ఆల్‌రౌండర్ ప్రదర్శన కానే కాదు’ అని తెలిపారు. -
అఫ్గాన్‌తో టెస్టు: భారత్ 474 ఆలౌట్
బెంగళూరు: అఫ్గానిస్తాన్‌తో ఇక్కడ జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. 347/6 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 127 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆటలో ఓవర్‌నైట్ ఆటగాడు అశ్విన్(7) ఆదిలోనే పెవిలియన్‌కు చేరగా, మరో ఓవర్‌నైట్ ఆటగాడు హార్దిక్ పాండ్యాతో కలిసి రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ సాధించాడు. 83 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. అటు తర్వాత కాసేపటికి రవీంద్ర జడేజా(20) ఔట్ కావడంతో 436 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్‌ను నష్టపోయింది. ఆపై నాలుగు పరుగుల వ్యవధిలో హార్దిక్(71;94 బంతుల్లో 10 ఫోర్లు) సైతం పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో ఉమేశ్ యాదవ్(26 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇషాంత్ శర్మ(8)తో కలసి ఆఖరి వికెట్‌కు ఉమేశ్ యాదవ్ 34 పరుగులు జత చేశాడు. అంతకుముందు తొలి రోజు ఆటలో శిఖర్ ధావన్(107), మురళీ విజయ్(105), కేఎల్ రాహుల్(54)లు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్ బౌలర్లలో యమీన్ అహ్మద్జాయ్ మూడు వికెట్లతో రాణించగా, వఫాదార్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు సాధించారు. మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లు తలో వికెట్ తీశారు. -
స్పిన్ అస్త్రాలతో అఫ్గాన్ సిద్ధం
న్యూఢిల్లీ: స్పిన్‌కు అనుకూలించే భారత్‌లో స్పిన్నర్లతోనే బరిలోకి దిగేందుకు అఫ్గానిస్తాన్ జట్టు సిద్ధమైంది. భారత్‌తో వచ్చే నెల 14 నుంచి బెంగళూరులో జరిగే ఏకైక చారిత్రక టెస్టు కోసం అఫ్గానిస్తాన్ జట్టును ఎంపిక చేశారు. ఇందులో ఏకంగా ఐదుగురు స్పిన్నర్లకు చోటు కల్పించారు. ఐపీఎల్ సంచలనం రషీద్ ఖాన్‌తో పాటు నబీ, ముజీబుర్, జహీర్ ఖాన్, ఆమిర్ హమ్జా ఇందులో ఉన్నారు. వీరిలో ముజీబ్ మినహా మిగతా వారికి కేవలం నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవముంది. ముజీబ్‌కు ఆ అనుభవం కూడా లేదు. అఫ్గాన్ జట్టుకు అస్గర్ స్తానిక్‌జై నాయకత్వం వహించనున్నాడు. జట్టు: స్తానిక్‌జై (కెప్టెన్), షహజాద్, జావెద్, రహ్మత్ షా, ఇహ్సానుల్లా జనత్, నాసిర్ జమాల్, హష్మతుల్లా, అఫ్సర్ జజయ్, నబీ, రషీద్ ఖాన్, జహీర్ ఖాన్, ఆమిర్ హమ్జా, ముజీబ్, అహ్మద్ షిర్జాద్, యామిన్ అహ్మద్‌జై, వఫాదార్. -
ట్రిపుల్ సెంచరీ నా లక్ష్యం కాదు: కోహ్లి
బెంగళూరు: బ్యాటింగ్‌తో పాటు ఫిట్‌నెస్‌లో కొత్త ప్రమాణాలు సృష్టించిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయడం తన లక్ష్యం కాదని దాని కంటే మ్యాచ్‌లు గెలవడమే తనకు ముఖ్యమని అంటున్నాడు. ‘నా దృష్టి ఎప్పుడూ మ్యాచ్‌లు గెలవడంపైనే ఉంటుంది. ట్రిపుల్ సెంచరీలాంటి లక్ష్యాలేమి నాకు లేవు. అవి ఇతరుల లక్ష్యాలు’ అని కోహ్లి అన్నాడు. ఒత్తిడిలో రాణించడాన్ని అమితంగా ఆస్వాదించే కోహ్లి పరీక్షల ముందు విద్యార్థులపై ఉండే ఒత్తిడి గురించి మాట్లాడుతూ... ‘బోర్డు పరీక్షలు రాసే సమయంలో నేను కూడా కొంత విరామం తీసుకొని ఆటలకు కేటాయించేవాడిని. ఒత్తిడిని తగ్గించడంలో అవి ఎంతో తోడ్పడేవి. మానసిక ఉల్లాసంతో పాటు సానుకూల దృక్పథం పెరగడంలో ఆటల పాత్ర చాలా ముఖ్యమైనది. దీంతో తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టగలిగేవాడిని. విజయాలు మనకు ఏమి నేర్పవు. పరాజయాలే పాఠాలు చెప్తాయి. కష్ట కాలంలోనే మనలోని నైపుణ్యాలకు పనిపెడతాం’ అని పేర్కొన్నాడు. తొలి సారి భారత జట్టులో చోటు దక్కిన రోజులను గుర్తు చేసుకుంటూ... ‘టీమిండియాకు ఎంపికైన సమయంలో అమ్మతో కలిసి టీవీ చూస్తున్నా. ఫ్లాష్ న్యూస్‌లో నా పేరు చూసి తప్పుడు ప్రచారమేమో అనుకున్నా. కానీ ఆ తర్వాత బోర్డు నుంచి ఫోన్ రావడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి’ అని అన్నాడు. -
ఈ నెల 8న భారత జట్ల ఎంపిక
న్యూఢిల్లీ: వచ్చే నెల అఫ్గానిస్తాన్‌తో జరుగనున్న ఏకైక టెస్టు కోసం ఈ నెల 8న భారత జట్టును ప్రకటించనున్నారు. జూన్ 14 నుంచి బెంగళూ రు వేదికగా ప్రారంభం కానున్న చారిత్రాత్మక టెస్టుతో పాటు ఐర్లాండ్‌తో రెండు వన్డేల సిరీస్‌కు అదే రోజు జట్టును ప్రకటించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కోహ్లి కౌంటీ క్రికెట్ ఆడటం ఖాయం కావడంతో అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు అతను దూరం కానున్నాడు. ‘మే 8న జరుగనున్న సెలెక్షన్స్‌లో మూడు జట్ల ఎంపిక జరుగుతుంది. అఫ్గాన్ టెస్టు కోసం బరిలో దిగే టెస్టు జట్టు, ఇంగ్లండ్ టూర్‌కు ముందు ఐర్లాండ్‌లో జరుగనున్న రెండు వన్డేల సిరీస్ కోసం వన్డే జట్టుతో పాటు ఇంగ్లండ్‌లో పర్యటించనున్న భారత ‘ఎ’ జట్టును కూడా ప్రకటిస్తాం’ అని బీసీసీఐ పేర్కొంది. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ టూర్ కు ముందు మన ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చేందుకు ‘ఎ’ జట్టులో రెగ్యులర్ ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు. రహానే, మురళీ విజయ్, రోహిత్, హార్దిక్ పాండ్యాలను ‘ఎ’ జట్టుతో పాటు అక్కడికి పంపితే స్థానిక పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని బీసీసీఐ భావిస్తోంది. -
‘అప్పుడే కోహ్లీ సత్తా ఏంటో తెలుస్తుంది’
సాక్షి, న్యూఢిల్లీ: వరుసగా అత్యధిక టెస్టు సిరీస్‌ల విజయాలు అందించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును తాజాగా భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ సమం చేసిన విషయం తెలిసిందే. కోహ్లీ వ్యక్తిగత రికార్డులతో పాటు కెప్టెన్‌గా సాధిస్తోన్న ఘనతలపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. కోహ్లీ వరుసగా తొమ్మిది టెస్ట్ సిరస్ విజయాలు అందించినా.. వాటిలో ఎక్కువ సిరీస్ విజయాలు భారత్‌లోనే వచ్చాయన్నాడు. విదేశీ గడ్డపై విజయాలు అందిస్తేనే కెప్టెన్‌గా కోహ్లీ సత్తా బయట పడుతుందని అభిప్రాయపడ్డాడు. ’లంకతో సిరస్ ముగిశాక దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ ఆడనుంది. అక్కడ కూడా ఇదే స్థాయిలో విజయాలు సాధిస్తే కోహ్లీ దిగ్గజ కెప్టెన్ అవుతాడనడంలో సందేహం అక్కర్లేదు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాల్లో ఆ దేశాలపై సిరీస్‌లు నెగ్గితే కోహ్లీ స్థాయి మరింత పెరుగుతుంది. 9 టెస్ట్ సిరీస్ విజయాల్లో శ్రీలంక, వెస్టిండీస్ దేశాల్లోనే భారత్ విజయాలు సాధించింది. 80 శాతానికి పైగా విజయాలు స్వదేశంలోనే వచ్చాయి. కనుక ఇక విదేశీగడ్డపై కూడా కోహ్లీ రాణించాలని ఆశిద్దాం. విదేశాల్లోనూ సిరీస్‌లు నెగ్గితే దిగ్గజ కెప్టెన్ల జాబితాలో కోహ్లీ చేరిపోతాడని’ సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 1 - 0 తేడాతో కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా కొహ్లీకి ఇది వరుసగా తొమ్మిదో టెస్టు సిరీస్ విజయం. 2005 నుంచి 2008 మధ్య కాలంలో పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వరుసగా తొమ్మిది సిరీస్‌లలో ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఇంగ్లండ్ జట్టు కూడా 1884 నుంచి 1892 మధ్యకాలంలో తొమ్మిది టెస్టు సిరీస్‌లలో విజయాలు సాధించింది. 2015లో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్ కొహ్లీ తొలి టెస్టు సిరీస్‌ను శ్రీలంకపైనే నెగ్గింది. -
కెప్టెన్‌గా కొహ్లీ మరో ఘనత
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కొహ్లీ మరో ఘనతను సాధించారు. వరుసగా అత్యధిక టెస్టు సిరీస్‌ల గెలుపు విషయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ రికార్డును కొహ్లీ సమం చేశారు. శ్రీలంకతో న్యూఢిల్లీలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 1 - 0 తేడాతో కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా కొహ్లీకి ఇది వరుసగా తొమ్మిదో టెస్టు సిరీస్ విజయం. 2005 నుంచి 2008 మధ్య కాలంలో పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు వరుసగా తొమ్మిది సిరీస్‌లలో ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఇంగ్లండ్ జట్టు కూడా 1884 నుంచి 1892 మధ్యకాలంలో తొమ్మిది టెస్టు సిరీస్‌లలో విజయాలు సాధించింది. 2015లో టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన విరాట్ కొహ్లీ తొలి టెస్టు సిరీస్‌ను శ్రీలంకపైనే గెలిచారు. -
ఇక నుంచి టెస్టు చాంపియన్ షిప్?
వెల్లింగ్టన్:దాదాపు ఏడాది కాలంగా టెస్టు ఫార్మాట్ కు కొత్త రూపు తేవాలని యోచిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఆ మేరకు కార్యాచరణ రూపొందించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దానిలో భాగంగా ఇప్పటివరకూ పరిమిత ఓవర్ల సిరీస్ లో మాత్రం చూసిన చాంపియన్ షిప్ టోర్నీలు ఇక నుంచి టెస్టుల్లో కూడా కనువిందు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే టెస్టు చాంపియన్ షిప్ నిర్వహించేందుకు ఐసీసీ ఆమోద వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఏడాది కాలంగా ఐదు రోజుల పాటు జరిగే టెస్టు మ్యాచ్ లకు ఊతమివ్వాలని స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ యోచన. అయితే దానికి ఎట్టకేలకు ముగింపు పడినట్లు తెలుస్తోంది. అందుకు సుముఖత వ్యక్తం చేసిన ఐసీసీ.. 'టెస్టు చాంపియన్' టోర్నీకి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో టెస్టు హోదా కల్గిన తొమ్మిది దేశాలు పాల్గొంటాయని పేర్కొంది. ఆక్లాండ్ లో శుక్రవారం జరిగిన సమావేశంలోనే టెస్టుల్లో కొత్త విధానానికి ఐసీసీ శ్రీకారం చుట్టినట్లు హెరాల్డ్ స్పష్టం చేసింది. కాగా, టెస్టు చాంపియన్ షిప్ నిర్వహణకు మరో రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉంది. 2019 లో తొలి ఎడిషన్ రూపొందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
టీఎన్‌సీఏ చేతులెత్తేసింది!
చెన్నై:వచ్చే నెల్లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నగరంలో జరగాల్సిన రెండు అండర్-19 టెస్టు మ్యాచ్‌ల నిర్వహణపై తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) చేతులెత్తేసింది. లోధా కమిటీ సిఫారుల అమల్లో భాగంగా ఆ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడు ఎన్ శ్రీనివాసన్, సెక్రటరీ విశ్వనాథన్‌లు తమ పదవుల్ని వదులుకోవాల్సి వస్తుంది. కూలింగ్ ఆఫ్ పిరియడ్ నిబంధన ప్రకారం శ్రీనివాసన్, విశ్వనాథన్‌లు తమ తమ హోదాలకు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఇదే సమయంలో భారత్-ఇంగ్లండ్‌ల మధ్య చెన్నైలో జరగాల్సిన ఉన్న రెండు అండర్-19 టెస్టులను నిర్వహించడడం టీఎన్‌సీఏకు తలనొప్పిగా మారింది. 'వర్దా తుపానుతో పలు తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లను కోల్పోవాల్సి వచ్చింది. దీన్ని నిర్వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. దాంతో పాటు టీఎన్‌సీఏ ఫస్ట్ డివిజన్ మ్యాచ్‌లను కూడా నిర్వహించాలి. లోయర్ డివిజన్ గేమ్స్ తో పాటు, ఇంటర్ యూనివర్శిటీ మ్యాచ్‌లను సైతం నిర్వహించాలి. మా సొంత మ్యాచ్‌లకు గ్రౌండ్ల అవసరం ఉంది. ఆ క్రమంలోనే భారత్-ఇంగ్లండ్ ల మధ్య చెన్నైలో జరగాల్సిన ఉన్న రెండు అండర్ 19 మ్యాచ్‌లను నిర్వహించడం కష్టం' అని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రికి టీఎన్‌సీఏ జాయింట్ సెక్రటరీ ఆర్ ఏ పలనా ఓ లేఖలో తెలిపారు. -
14 ఏళ్ల కెరీర్లో తొలి సిక్సర్
-
14 ఏళ్ల కెరీర్లో తొలి సిక్సర్
మొహాలి: పార్థీవ్ పటేల్..దాదాపు ఎనిమిదేళ్ల తరువాత టెస్టుల్లో పునరాగమనం చేసిన భారత వికెట్ కీపర్. భారత్ తరపున సుదీర్ఘ కాలం తరువాత జట్టులో స్థానం సంపాదించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తాజాగా ఇంగ్లండ్ తో మూడో టెస్టులో జట్టులోకి వచ్చి బ్యాట్ తో అలరించాడు. ఈ క్రమంలోనే పార్థీవ్ ఒక అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దాదాపు 12 ఏళ్ల తరువాత టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2004 అక్టోబర్‌లో చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో పార్థీవ్(54) చివరిసారి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తరువాత ఇంతకాలనికీ ఇంగ్లండ్ పై హాఫ్ సెంచరీ సాధించి తనలోని ప్రతిభ తగ్గలేదని నిరూపించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేసిన పార్థీవ్, రెండో ఇన్నింగ్స్ లో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. కాగా, పార్థీవ్ సిక్స్ సాధించడం ఇక్కడ విశేషం. దాదాపు అతని 14 ఏళ్ల టెస్టు కెరీర్లో తొలి సిక్సర్ కొట్టాడు. అదిల్ రషిద్ వేసిన 13ఓవర్ మూడో బంతికి పార్థీవ్ సిక్స్ సాధించాడు. ఇప్పటివరకూ టెస్టుల్లో 110 ఫోర్లు కొట్టిన పార్థీవ్.. సిక్స్ కొట్టడానికి సుదీర్ఘ కాలం నిరీక్షించకతప్పలేదు. 2002లో పార్థీవ్ టెస్టు కెరీర్‌ను ఆరంభించిన సంగతి తెలిసిందే. -
వందేళ్లలోనే అశ్విన్ అరుదైన అద్భుత రికార్డు!
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలికాలంలో బంతిని అద్భుతంగా గింగిరాలు తిప్పుతూ.. ప్రత్యర్థులను చిత్తుచేసిన ఈ మేటి బౌలర్ తాజాగా న్యూజిల్యాండ్ సిరీస్‌లోనూ సత్తా చాటాడు. ఇండోర్‌లో న్యూజిల్యాండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఏకంగా 13వికెట్లు పడగొట్టి.. కెరీర్లోనే ఉత్తమ గణాంకాలు (13/140) నమోదు చేశాడు. మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన ఈ స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో చివరి వికెట్ రూపంలో ట్రెంట్ బౌల్ట్‌ను ఔట్ చేయడం ద్వారా ఏడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక అశ్విన్ సాధించిన అరుదైన రికార్డు ఏమిటంటే.. గత వందేళ్లలో ఏ బౌలర్ సాధించిన స్ట్రైక్ రేట్‌ను అశ్విన్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 100 వికెట్లకుపైగా పడగొట్టిన బౌలర్లలో ఈ 30 ఏళ్ల ఇంజినీర్ ప్రథమ స్థానాన్ని ఆక్రమించాడు. టెస్టుల్లో అశ్విన్ స్ట్రైక్ రేట్ 49.4 కావడం గమనార్హం. ఒక వికెట్ పడగొట్టడానికి బౌలర్ వేసే బంతులను బట్టి అతని స్ట్రైక్ రేట్‌ను నిర్ధారిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే.. తాను వేసిన ప్రతి 50 (49.4) బంతులకు అశ్విన్ ఒక వికెట్ పడగొడుతూ వచ్చాడు. టెస్టుల్లో స్ట్రైక్ రేట్ పరంగా చూసుకుంటే గత వందేళ్లలో అశ్విన్ టాప్ స్థానంలో నిలువగా.. అతని తదుపరి స్థానంలో మెక్‌గిల్ (ఆస్ట్రేలియా) 54 స్ట్రైక్ రేటుతో, ఆ తర్వాతిస్థానంలో మురళీధరన్ 55 స్ట్రైక్‌రేటుతో ఉన్నారు. టాప్-10లో ఉన్న శ్రీలంక బౌలర్ రంగనా హెరాత్, ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియన్ మాత్రమే ప్రస్తుతం ఆడుతున్న అశ్విన్ సమీకాలికులు. ఈ జాబితాలో భారత బౌలర్ బీఎస్ చంద్రశేఖర్ 13వ స్థానంలో ఉండగా, ఆయన తర్వాతి స్థానంలో అనిల్ కుంబ్లే ఉన్నారు. ఇక ఆల్‌టైమ్ టెస్టు చరిత్ర ప్రకారం చూసుకుంటే 1910లో క్రికెట్ ఆడిన ఇంగ్లిష్ బౌలర్లు జానీ బ్రిగ్స్, కొలిన్ బ్లైత్ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మూడో స్థానంలో అశ్విన్ నిలిచాడు. ఇక టెస్టు క్రికెట్లో బౌలింగ్ దిగ్గజాలుగా భావించే మురళీధరన్, షేన్ వార్న్ ఈ జాబితాలో ఐదు, ఆరు స్థానాల్లో ఉండగం గమనార్హం. -
'టెస్టు చాంపియన్’ కోసం ప్లే ఆఫ్!
దుబాయ్: టెస్టుల్లోనూ ప్రపంచ చాంపియన్‌ను నిర్ణయించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కొత్త ఆలోచనలతో ముందుకు వస్తోంది. కానీ వరల్డ్ కప్ తరహాలో పూర్తి స్థాయిలో అన్ని జట్లనూ చాంపియన్‌షిప్‌లో భాగం చేయడం లేదు. ప్రస్తుతం ఉన్న భవిష్యత్ పర్యటన కార్యక్రమం (ఎఫ్టీపీ) ప్రకారం అన్ని జట్లూ టెస్టులు ఆడతాయి. ప్రస్తుతం ఇస్తున్న ప్రకారమే ర్యాంకింగ్‌లు కూడా కొనసాగుతాయి. అయితే రెండేళ్లకు ఒక సారి టెస్టు చాంపియన్‌ను తేల్చేందుకు రెండు జట్ల మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. ర్యాంకింగ్‌సలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఈ మ్యాచ్‌లో తలపడతాయి.తటస్థ వేదికపై ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఇటీవల ఇక్కడ ముగిసిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఐసీసీ సభ్యుల ముందు ఉంచింది. త్వరలోనే దీనికి ఆమోదముద్ర లభించవచ్చు. 2019 ఆరంభంలోనే తొలి ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. వన్డేల్లో కూడా లీగ్ తరహాలో మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తున్నారు. దీని ప్రకారం 13 జట్లు మూడేళ్ల వ్యవధిలో మిగిలిన జట్లతో కనీసం ఒక సిరీస్ అయినా ఆడతాయి. సాధించిన పాయింట్లను బట్టి 2023 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఆయా జట్లు అర్హత సాధిస్తాయి. టి20ల్లో కూడా ఇదే విధంగా లీగ్‌లు నిర్వహిస్తారు. ఈ రెండు ఫార్మాట్లలో ఒక్కో సిరీస్ కనీసం మూడు మ్యాచ్‌లకు తగ్గకుండా ఉంటుంది. మరో వైపు రెండు దేశాల మధ్య టెస్టు సిరీస్‌ల నిర్వహణపై ఆ రెండు బోర్డులే చర్చించుకోవాలని, తాము జోక్యం చేసుకోబోమని కూడా ఐసీసీ స్పష్టం చేసింది. -
వైజాగ్‌లో ఇంగ్లండ్ టెస్టు
► హైదరాబాద్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్ ► సిరీస్‌లకు వేదికలు ఖరారు ముంబై: ఈ సీజన్లో భారత్ జట్టు స్వదేశంలో ఆడబోయే సిరీస్‌లకు వేదికలు ఖరారయ్యాయి. గతేడాది నవంబరులో టెస్టు హోదా సంపాదించిన వైజాగ్ తొలిసారిగా ఇంగ్లండ్, భారత్‌ల టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రాజ్‌కోట్, పుణే, ధర్మశాల, రాంచీ, ఇండోర్‌లకు కూడా ఈ సీజన్లో తొలిసారి టెస్టు మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం లభించింది. అలాగే బంగ్లాదేశ్ జట్టు భారత్‌తో ఆడే ఏకైక టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ సీజన్లో భారత్ స్వదేశంలో 13 టెస్టులు, 8 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలుత న్యూజిలాండ్, ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటిస్తాయి. అలాగే దేశంలో తొలిసారి డేనైట్‌గా ఈడెన్‌గార్డెన్స్‌లో నిర్వహించాలని భావిస్తున్న టెస్టు న్యూజిలాండ్‌తో జరిగే అవకాశం ఉంది. -
భారత క్రికెట్ చూస్తే బాధేస్తోంది
ఆయన ప్రపంచంలోనే ఆల్‌టైమ్ అగ్రశ్రేణి క్రికెటర్లలో ఒకరు. అలాంటి పెద్దమనిషికి ప్రస్తుతం భారత క్రికెట్ తీరును చూస్తే చాలా బాధ, నిరాశగా ఉందట. ఆయనే ఇయాన్ బోథమ్. ఇంగ్లండ్ జట్టుకు ఒకప్పుడు తిరుగులేని కెప్టెన్. 1992లో పాకిస్థాన్ పర్యటనతో రిటైర్మెంట్ ప్రకటించిన బోథమ్.. ఇప్పుడు భారత జట్టు క్రికెట్‌ను ఆస్వాదిస్తున్న తీరును తప్పుబట్టారు. క్రికెట్ అంటే కేవలం 20 ఓవర్ల గేమ్ మాత్రమే కాదని, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. ఒకప్పుడు భారత్ - ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయంటే తనకు ఎంతో ఉద్వేగంగా అనిపించేదని, కానీ ఇప్పుడు మాత్రం అలా లేదని చెప్పారు. గడిచిన రెండు టెస్ట్ సిరీస్‌లలో ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు 0-4, 1-3 తేడాతో ఓడిపోయింది. 2012లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో కూడా టీమిండియా ఓటమి చవిచూసింది. భారత్‌లో టెస్ట్ క్రికెట్ ఏమైపోతోందని, అసలు ఈ జట్టుకు ఏమైందని బోథమ్ ప్రశ్నించారు. ఈ విషయంలో భారత్ ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. ఐసీసీ టెస్టు ర్యాంకింగులలో భారత్ మూడో ర్యాంకులో ఉన్నా, ప్రస్తుత పరిస్థితి మాత్రం దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. అసలు ఈ ర్యాంకులు ఎలా ఇస్తున్నారో అర్థం కావట్లేదని.. నిజానికి ఇప్పుడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మంచి క్రికెట్ ఆడుతున్నా అవి ఎందుకు ముందు లేవని అన్నారు. ఈ సంవత్సరం నవంబర్ - డిసెంబర్ నెలల్లో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటనలో ఐదు టెస్టులు ఆడతారు.