న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న సిరిస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి మొదటి టెస్ట్‌కు మాత్రమే అందుబాటులో ఉండడంపై మాజీ కెప్టెన్ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. డిసెంబర్ 17న అడిలైడ్‌లో తొలి టెస్ట్ తరువాత కోహ్లి స్వదేశానికి రానున్న నేపథ్యంలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చేతేశ్వర్ పుజారా ,మరో సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే బ్యాటింగ్ భారాన్ని మోయాలని సూచించారు. తన భార్య అనుష్క శర్మ మొదటి బిడ్డకు జన్మనిస్తుండటంతో కోహ్లి భారత్‌కు తిరిగి రావడం తెలిసిందే. టెస్ట్ వైస్ కెప్టెన్ రహానె మిగిలిన మూడు మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. పూజారాతో పాటు అదనపు బాధ్యతలను భరించాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "కెప్టెన్ లేకపోవడంతో మిగిలిన ఆటగాళ్లు బాధ్యతను తీసుకుని,అతని గైర్హాజరు కనపడకుండా ఆడాలని సూచించారు. రహానే , చేతేశ్వర్ పుజారాకు ఇది కఠినమైన సవాల్. ఈ ఇద్దరు ఆటగాళ్ళు తమ చెమట చిందించాల్సి ఉంటుందని"అని గవాస్కర్ అన్నారు
పుజారానే ఉత్తమం.
గవాస్కర్ కూడా పూజారాను బ్యాటింగ్ చేయమని ప్రోత్సహించాడు, 2018-19లో భారతదేశం చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో పుజారా అత్యధిక పరుగులు చేసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరీస్ మొత్తం నిలకడగా ఆడుతూ 74.42 సగటుతో మూడు సెంచరీలు,ఒక హఫ్ సెంచరీ సహాయంతో 521 పరుగులు చేశాడు. భారతదేశపు చారిత్రాత్మక 2-1 విజయానికి సౌరాష్ట్ర బ్యాట్స్ మాన్ సహనం, శాస్త్రీయ శైలి ఒక ప్రధాన కారణం. అతను దాదాపు 30 గంటలు బ్యాటింగ్ చేశాడు 1258 బంతులను ఎదుర్కొన్నాడు, ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక బంతులను ఎదుర్కొన్న రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు. పరుగుల గురించి పెద్దగా చింతించకుండా ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం ద్వారా బౌలర్లను ఎదుర్కొవటం పుజారాకు ఇష్టం. మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్ మరియు నాథన్ లియోన్‌లాంటి ప్రఖ్యాత ఆసీస్ దాడి అతని ఏకాగ్రతను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పుజారా బ్యాటింగ్ శైలి గురించి చిన్న ఆధారం కూడా లభించకపోవటంతో అలసిపోయినట్లు అనిపించింది, అందుకే దాదాపు రెండు సంవత్సరాల క్రితం చేసినట్లుగానే పూజారాను తన సహజమైన ఆట ఆడటానికి మేనేజ్‌మెంట్ ప్రోత్సహించాలని గవాస్కర్ చెప్పాడు. సెంచరీలు వస్తున్నంత కాలం పరుగులు ఎలా పొందాలో ఎవరూ అతనికి చెప్పకూడదు అని అన్నారు. పుజారాని స్వేచ్ఛగా,ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడనివ్వాలి. అది టీమ్ కి అనుకూలంగా మారుతుంది. అతను స్థిరంగా ఉంటాడు.దానివల్ల తన చుట్టూ ఉన్న బ్యాట్స్‌మెన్ కూడా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తారని 10,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ అయిన లిటిల్ చాంప్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment