Ajinkiya Rahane
-
తదుపరి కెప్టెన్ రహానే..!
-
డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఎంపికైన రహానే...!
-
ధోని చెప్పినట్టు చేశాడు..ధోని 11 ఏళ్ళ రికార్డును చిత్తు చేశాడు
-
"అందుకే దక్షిణాఫ్రికా టూర్‌కు రహానేను ఎంపిక చేశారు"
Ajinkya Rahane: దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ టెస్ట్ జట్టును బీసీసీఐ బుధవారం( డిసెంబర్ 8) ప్రకటించిన సంగతి తెలిసిందే. గత కొద్దికాలంగా ఫామ్‌లో లేని అజింక్య రహానే పై వేటు తప్పదని అంతా భావించనప్పటికీ.. అనుహ్యంగా సెలెక్టర్లు అతడిని ఎంపిక చేశారు. అయితే రహానెను వైస్ కెప్టెన్ భాధ్యతల నుంచి తప్పించి రోహిత్‌కు అప్పజెప్పారు. ఈ క్రమంలో సెలక్టర్లు రహానెను ఎందుకు ఎంపిక చేశారో భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్‌స్కే ప్రసాద్ తెలిపాడు. విదేశీ పిచ్‌ల్లో రహానెకు వున్న రికార్డుల వల్ల అతడివైపు సెలక్టర్లు మొగ్గు చూపారని ఎమ్‌స్కే ప్రసాద్ చెప్పాడు. "జట్టు ఎప్పుడూ జూనియర్లు, సీనియర్లు కలయిక తో సమతూకంగా ఉండాలి. రహానే విషయానికి వస్తే..2013లో టెస్ట్ క్రికెట్లో అద్బుతంగా రాణించాడు. సాధరణంగా రహానే విదేశాల్లో బాగా రాణిస్తాడు. కానీ స్వదేశంలో అతడికి పెద్దగా రికార్డులు లేవు. గత కొద్దికాలంగా అతడు పెద్దగా ఫామ్‌లో లేడు. ఈ క్రమంలో సెలెక్టర్లకు అతడిని ఎంపిక చేసే ముందు కాస్త అయోమయంకు గురై ఉంటారు. అయితే విదేశాల్లో అతడికి ఉన్న ట్రాక్ రికార్డును చూసి సెలెక్టర్లు ఎంపిక చేసుండవచ్చు" అని ఎమ్‌స్కే ప్రసాద్ ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా విదేశాల్లో రహానే 40 సగటుతో 3000పైగా పరుగులు సాధించాడు. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్-26న భారత్- దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ స్టాండ్‌బై ప్లేయర్లు: నవ్‌దీప్ సైనీ, సౌరభ్ కుమార్, దీపక్ చాహర్, అర్జాన్ నగ్వాస్వాల్లా చదవండి: IND-A Vs SA-A: భారత్- దక్షిణాఫ్రికా సిరీస్ డ్రా.. -
కెప్టెన్ కోహ్లి వెంటే నేను: రహానే
చెన్నై: రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి రావడంతో జట్టులో తన పని, పాత్ర సులువైందని వైస్ కెప్టెన్ అజింక్య రహానే అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండోసారి టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియాకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన రహానే ఇప్పుడు తన రెగ్యులర్ కెప్టెన్‌కు చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పాడు. త్వరలో జరిగే టెస్టు సిరీస్‌పైనే దృష్టి పెట్టామని, ప్రత్యర్థి జట్టును గౌరవిస్తామని అన్నాడు. ‘శ్రీలంకలో నెగ్గొచ్చిన ఇంగ్లండ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోం. జో రూట్ బృందం బలమైన ప్రత్యర్థి. అలాంటి జట్టుపై ఆదమరిచే ప్రసక్తే లేదు’ అని రహానే తెలిపాడు. ‘ఇప్పుడు నేను వైస్కెప్టెన్ని. మా సారథి వెంట నడవాలి. జట్టుకు అవసరమైనపుడు సలహాలిస్తాను. కోహ్లి కోరితే సూచనలిస్తాను. వైస్ కెప్టెన్‌గా నా పరిధి ఏంటో నాకు తెలుసు. ఇక ఆసీస్ విజయం ఇప్పుడైతే అప్రస్తుతం. ఎందుకంటే అది గతం. ఇప్పుడున్న సిరీస్‌పైనే మా ఫోకస్ ఉంటుంది. అక్కడ గెలిచామ న్న ధీమాతో ఇక్కడ ప్రవర్తించం. పైగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం జరుగుతున్న పోరాటంలో ప్రత్యర్థి ఎవరైనా పట్టుదలతోనే ఆడతాం’ అని వివరించాడు. -
ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియాకు ఘన స్వాగతం
ముంబై: ఆస్ట్రేలియా టూర్‌ను విజయవంతంగా ముగించి.. ట్రోఫీతో భారత క్రికెట్ జట్టు సభ్యులు సగర్వంగా స్వదేశం చేరారు. విమానాశ్రయాల్లో వారికి ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా నుంచి జట్టు సభ్యులు గురువారం భారత్‌కు చేరుకున్నారు. ముంబైలో కెప్టెన్ అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి, ఓపెనర్ పృథ్వీ షా దిగగా.. బ్రిస్బెన్ టెస్ట్‌లో హీరోగా నిలిచిన రిషబ్ పంత్ ఢిల్లీలో అడుగుపెట్టాడు. ఇక టెస్ట్‌లో సత్తా చాటిన మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఆటగాళ్లకు విమానాశ్రయ సిబ్బందితో పాటు అభిమానులు, ప్రయాణికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఢిల్లీలో దిగిన అనంతరం రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. సిరీస్ మొత్తం ఆడిన తీరుపై జట్టు అంతా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. -
అతనికి అరుదైన గౌరవం.. రహానేకే సాధ్యం
మెల్బోర్న్ : బాక్సింగ్ డే టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్‌ను టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే వినూత్న రీతిలో గౌరవించాడు. టీమిండియా డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లే సందర్భంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టును లీడ్ చేశాడు. ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా టీ విరామం సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. టీ విరామం ఇవ్వడంతో టీమిండియా కెప్టెన్ రహానే సిరాజ్ వద్దకు వెళ్లి ..నువ్వు ముందు వెళ్లు.. నీ వెనకాల మేము వస్తాం అని చెప్పాడు. రహానే చెప్పినట్లుగా సిరాజ్ ముందు నడవగా.. టీమ్ మొత్తం అతని వెనకాల నడిచింది. టెస్టు క్రికెట్లో అడుగుపెట్టిన సిరాజ్‌కు మేము ఇచ్చే గౌరవం ఇదేనని రహానే తెలిపాడు.(చదవండి : మైండ్‌గేమ్ ఆడనివ్వండి.. మేం మాత్రం: రహానే) రహానే చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. కెప్టెన్కుండే అన్ని లక్షణాలు రహానేలో ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. ఒక డెబ్యూ ఆటగాడిని ఇలా గౌరవించడం రహానేకు మాత్రమే చెల్లింది.. రహానే చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక లబుషేన్‌ను అవుట్ చేయడం ద్వారా మహ్మద్ సిరాజ్ టెస్టు క్రికెట్లో మెయిడెన్ వికెట్ సొంతం చేసుకున్నాడు. టాస్ గెలిచిన ఆసీస్ నత్తనడకన ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. భారత బౌలర్లు విజృంభించడంతో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్ 68 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కమిన్స్ 2, లయన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. అశ్విన్, బుమ్రా చెరో 3, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. (చదవండి : క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు) -
పుజారా,రహానేలు కీలకం
న్యూఢిల్లీ:ఆస్ట్రేలియాతో త్వరలో ప్రారంభం కానున్న సిరిస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి మొదటి టెస్ట్‌కు మాత్రమే అందుబాటులో ఉండడంపై మాజీ కెప్టెన్ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. డిసెంబర్ 17న అడిలైడ్‌లో తొలి టెస్ట్ తరువాత కోహ్లి స్వదేశానికి రానున్న నేపథ్యంలో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చేతేశ్వర్ పుజారా ,మరో సీనియర్ బ్యాట్స్‌మెన్ అజింక్యా రహానే బ్యాటింగ్ భారాన్ని మోయాలని సూచించారు. తన భార్య అనుష్క శర్మ మొదటి బిడ్డకు జన్మనిస్తుండటంతో కోహ్లి భారత్‌కు తిరిగి రావడం తెలిసిందే. టెస్ట్ వైస్ కెప్టెన్ రహానె మిగిలిన మూడు మ్యాచ్‌లలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడు. పూజారాతో పాటు అదనపు బాధ్యతలను భరించాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. "కెప్టెన్ లేకపోవడంతో మిగిలిన ఆటగాళ్లు బాధ్యతను తీసుకుని,అతని గైర్హాజరు కనపడకుండా ఆడాలని సూచించారు. రహానే , చేతేశ్వర్ పుజారాకు ఇది కఠినమైన సవాల్. ఈ ఇద్దరు ఆటగాళ్ళు తమ చెమట చిందించాల్సి ఉంటుందని"అని గవాస్కర్ అన్నారు పుజారానే ఉత్తమం. గవాస్కర్ కూడా పూజారాను బ్యాటింగ్ చేయమని ప్రోత్సహించాడు, 2018-19లో భారతదేశం చివరిసారి ఆస్ట్రేలియాలో పర్యటించింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో పుజారా అత్యధిక పరుగులు చేసి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సిరీస్ మొత్తం నిలకడగా ఆడుతూ 74.42 సగటుతో మూడు సెంచరీలు,ఒక హఫ్ సెంచరీ సహాయంతో 521 పరుగులు చేశాడు. భారతదేశపు చారిత్రాత్మక 2-1 విజయానికి సౌరాష్ట్ర బ్యాట్స్ మాన్ సహనం, శాస్త్రీయ శైలి ఒక ప్రధాన కారణం. అతను దాదాపు 30 గంటలు బ్యాటింగ్ చేశాడు 1258 బంతులను ఎదుర్కొన్నాడు, ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అత్యధిక బంతులను ఎదుర్కొన్న రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు. పరుగుల గురించి పెద్దగా చింతించకుండా ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం ద్వారా బౌలర్లను ఎదుర్కొవటం పుజారాకు ఇష్టం. మిచెల్ స్టార్క్, పాట్ కమ్మిన్స్, జోష్ హాజిల్‌వుడ్ మరియు నాథన్ లియోన్లాంటి ప్రఖ్యాత ఆసీస్ దాడి అతని ఏకాగ్రతను దెబ్బతీయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పుజారా బ్యాటింగ్ శైలి గురించి చిన్న ఆధారం కూడా లభించకపోవటంతో అలసిపోయినట్లు అనిపించింది, అందుకే దాదాపు రెండు సంవత్సరాల క్రితం చేసినట్లుగానే పూజారాను తన సహజమైన ఆట ఆడటానికి మేనేజ్మెంట్ ప్రోత్సహించాలని గవాస్కర్ చెప్పాడు. సెంచరీలు వస్తున్నంత కాలం పరుగులు ఎలా పొందాలో ఎవరూ అతనికి చెప్పకూడదు అని అన్నారు. పుజారాని స్వేచ్ఛగా,ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడనివ్వాలి. అది టీమ్ కి అనుకూలంగా మారుతుంది. అతను స్థిరంగా ఉంటాడు.దానివల్ల తన చుట్టూ ఉన్న బ్యాట్స్‌మెన్ కూడా పరుగులు చేయడానికి ప్రయత్నిస్తారని 10,000 పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్ అయిన లిటిల్ చాంప్ వ్యాఖ్యానించాడు. -
కోహ్లి, రహానే చేతుల్లో...
మొత్తానికి ఆధిక్యమైతే దక్కింది! కానీ అది కొంతే! వెస్టిండీస్ మరీ ఏమీ వెనుకబడి లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థికి భారీ విజయ లక్ష్యాన్ని నిర్దేశించి తొలి టెస్టులో టీమిండియాను పైమెట్టులో నిలిపే బాధ్యత కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్య రహానేలపై పడింది. వీరికితోడు విహారి, పంత్ కొన్ని పరుగులు జోడిస్తే మిగిలిన పనిని బౌలర్లు చూసుకునే వీలుంటుంది. నార్త్ సౌండ్ (అంటిగ్వా): సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (5/43) ప్రతాపం చూపాడు. కీలక సమయంలో వికెట్లు తీసి తొలి టెస్టులో వెస్టిండీస్‌ను దెబ్బకొట్టాడు. దీంతో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో శనివారం విండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. ఆల్ రౌండర్ రోస్టన్ చేజ్ (74 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్) ఆ జట్టు టాప్ స్కోరర్. కెప్టెన్ హోల్డర్ (65 బంతుల్లో 39; 5 ఫోర్లు), హెట్‌మైర్ (47 బంతుల్లో 35; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. షమీ (2/48), జడేజా (2/64)లకు రెండేసి వికెట్లు దక్కాయి. 75 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్ టీ విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (16), కేఎల్ రాహుల్ (85 బంతుల్లో 38; 4 ఫోర్లు), వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా (25) ఔటయ్యారు. కోహ్లి (14 బ్యాటింగ్), రహానే (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి కోహ్లి సేన 173 పరుగుల ఆధిక్యంలో ఉంది. హోల్డర్, కమిన్స్ విసిగించారు... భారత లోయరార్డర్లో జడేజా–ఇషాంత్ తరహాలోనే విండీస్ లోయరార్డర్లో హోల్డర్, మిగుయెల్ కమిన్స్ (45 బంతుల్లో 0) బౌలర్లను విసిగించారు. ఓవర్‌నైట్ స్కోరు 189/8 శనివారం ఇన్నింగ్స్ కొనసాగించిన కరీబియన్లు ఆలౌట్ కావడానికి ఎంతోసేపు పట్టదనిపించింది. కానీ, హోల్డర్, కమిన్స్ పట్టుదల చూపారు. 17 ఓవర్లకు పైగా క్రీజులో నిలిచి జట్టు స్కోరును 200 దాటించారు. 9వ వికెట్‌కు 41 పరుగులు జత చేశారు. హోల్డర్‌ను ఔట్ చేసి షమీ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కమిన్స్‌ను జడేజా బౌల్డ్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. శుక్రవారం టీ సెషన్ అనంతరం భారత బౌలర్ల ధాటికి ప్రత్యర్థి తడబడింది. ప్రతి బ్యాట్స్‌మెన్ అన్నోఇన్నో పరుగులు చేయడంతో ఓ దశలో 130/4తో కాస్త మెరుగ్గానే కనిపించింది. అయితే, ఇషాంత్ విజృంభించి... కీలకమైన చేజ్, హోప్ (24), హెట్మైర్ను ఔట్ చేశాడు. ఇదే ఊపులో రోచ్ (0) పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. -
విహారి, రహానే అర్ధ సెంచరీలు
కూలిడ్జ్ (ఆంటిగ్వా): ప్రాక్టీస్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానే రెండో ఇన్నింగ్స్‌లో చక్కటి ఆటతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. విండీస్ ‘ఎ’తో ‘డ్రా’గా ముగిసిన ఈ మూడు రోజుల మ్యాచ్‌లో రహానే (162 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్)కు తోడు మరో టెస్టు స్పెషలిస్ట్ హనుమ విహారి (125 బంతుల్లో 64; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలు సాధించారు. ఫలితంగా భారత్ తమ ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 188 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (13)తో పాటు రహానే ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. మయాంక్ ఔటైన తర్వాత వచ్చిన విహారితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. అయితే ఆఫ్‌స్పిన్నర్ అకిమ్ ఫ్రేజర్ (2/43) బౌలింగ్‌కు భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ముందుగా విహారి ఔట్ కాగా... 15 పరుగుల వ్యవధిలో రిషభ్ పంత్ (19), రవీంద్ర జడేజా (9), రహానే ఔటయ్యారు. అనంతరం సాహా (14 నాటౌట్), అశ్విన్ (10) కొద్ది సేపు క్రీజ్‌లో నిలిచాక భారత్ తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి విండీస్ ‘ఎ’కు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ ‘ఎ’ 3 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసిన దశలో... ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించేందుకు అంగీకరించారు. -
రహానే ఇంకా సెంచరీ కాలేదబ్బా!
న్యూఢిల్లీ : దేశవాళీ వన్డే టోర్నీ దేవధర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. స్కోర్ బోర్డు తప్పిదంతో పప్పులో కాలేసిన రహానే 97 పరుగులకే సెంచరీ అయిందని సంబరాలు చేసుకున్నాడు. సహచర ఆటగాడు సురేశ్ రైనా ఇది గుర్తించడంతో అక్కడ నవ్వులు పూసాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇరు జట్ల కెప్టెన్లు అద్భుత శతకాలతో చెలరేగిన ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ‘సీ’ను విజయం వరించిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన మ్యాచ్‌లో రహానే సారథ్యంలోని భారత్ ‘సి’ జట్టు 29 పరుగుల తేడాతో భారత్ ‘బి’పై గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. ఏంజరిగిందంటే.. భారత బీ బౌలర్ నదీమ్ వేసిన 37ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ రాబట్టిన రహానే సెంచరీ పూర్తయిందని డ్రెస్సింగ్ రూమ్‌వైపు బ్యాట్ చూపిస్తూ సంబరాలు చేసుకున్నాడు. దీనికి డ్రెస్సింగ్ రూమ్‌లో సహచరులతో పాటు, గ్యాలరీలోని ప్రేక్షకులు కూడా రహానేను చప్పట్లతో అభినందించసాగారు. మరోవైపు స్కోరుబోర్డుపై కూడా అతను శతకం పూర్తి చేసుకున్నట్లు కనిపించింది. కానీ అప్పటికీ రహానే స్కోరు 97 పరుగులే అని.. ఇంకా శతకానికి మరో మూడు పరుగులు చేయాల్సి ఉందని సహచర ఆటగాడు సురేశ్ రైనా చెప్పడంతో అక్కడ నవ్వులు పూసాయి. What happened there? 😁 😆 @ajinkyarahane88 felt he got to a 100, @ImRaina was quick to rectify there were 3 more runs to go 😄 pic.twitter.com/qi5RaMF8t8 — BCCI Domestic (@BCCIdomestic) October 27, 2018 కెప్టెన్ అజింక్య రహానే (156 బంతుల్లో 144 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకానికి తోడు యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్ (87 బంతుల్లో 114; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు 353 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యఛేదనకు దిగిన భారత్-బి సైతం గట్టిగానే పోరాడింది. భారత్-బి జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (114 బంతుల్లో 148; 11 ఫోర్లు, 8 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ్ (60; 7 పోర్లు, 1 సిక్స్)తో కలిసి లక్ష్యాన్ని అందుకునేంత పనిచేశారు. కానీ భారత్-సీ బౌలర్లు చెలరేగడంతో భారత్-బి 46.1ఓవర్లలో 323పరుగులకు ఆలౌట్ అయింది. -
ధోనిని తలపించిన కార్తీక్
-
సెలక్ట్ చేయకున్నా గౌరవిస్తా: రహానే
సాక్షి, ముంబై: తనను జట్టులోకి ఎంపిక చేయకుండా సెలక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని టీమిండియా ఓపెనర్ అజింక్యా రహానే తెలిపారు. ఇక ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీలు చేసి మంచి ఫామ్‌లో ఉన్న రహానేకు టీ20 తుదిజట్టులో చోటు దక్కలేదు. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఐదో వన్డేలో 7 వికెట్లతో భారత్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విజయానంతరం ప్రకటించిన టీ20 జట్టు 15 మంది సభ్యుల్లో రహానే పేరు ప్రకటించలేదు. శిఖర్ ధావన్ జట్టులోకి రాగా రహానేకు ఉద్వాసన పలికారు. దీనిపై రహానే ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘ టీం మేనేజ్మెంట్, సెలక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తా. ఆటగాళ్ల మధ్య పోటీ మంచి ప్రదర్శనకు కారణమవుతోంది. ఈ పోటీని ప్రతిసారి ఆస్వాదిస్తాను. ఆస్ట్రేలియా సిరీస్‌లో ఓపెనర్‌గా రాణించడం చాల సంతోషాన్నిచ్చింది. వెస్టిండీస్ పర్యటన నుంచి నా ఫామ్‌ను కొనసాగించడం సంతృప్తినిచ్చింది. ఈ సిరీస్‌లో వరుసగా సాధించిన హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలిచాల్సింది. రోహిత్‌తో జట్టకు మంచి శుభారంభాన్ని అందించా. వచ్చే సిరీస్‌లలో నాకు అవకాశం లభిస్తే ఈ హాఫ్ సెంచరీలను శతకాలుగా మలుస్తా. ఇక జట్టు ప్రదర్శన గర్వించదగ్గ విషయం. మా లక్ష్యం ఒకటే 2019 వరల్డ్‌కప్. ఆ దిశగా ముందుకు సాగుతున్నామని’ రహానే పేర్కొన్నారు. టీ20 జట్టులో ధావన్‌తో పాటు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఆశిష్ నెహ్రా, దినేశ్ కార్తిక్‌లకు చోటు దక్కింది. -
రెండు వికెట్లు కోల్పోయిన భారత్
సాక్షి, ఇండోర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. తొలుత 139 పరుగుల వద్ద రోహిత్ శర్మ 71 (62బంతులు; 6 ఫోర్లు, నాలుగు సిక్సులు) కౌల్టర్ నీల్ బౌలింగ్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. మరి కొద్ది సేపటికే మరో ఓపెనర్ అజింక్యా రహానే 70 (76బంతులు; 9 ఫోర్లు) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంతకు ముందు 294 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి సేనకు ఈ ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. అర్ధ సెంచరీలతో మెరిసిన ఈ జంట తొలి వికెట్ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి(2), హార్దిక్ పాండ్యా(1)లు ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. 24 ఓవర్లకు భారత్ స్కోరు 148/2 -
టీమిండియా ప్రాక్టీస్