మెల్‌బోర్న్ : బాక్సింగ్ డే టెస్టు ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన మహ్మద్ సిరాజ్‌ను టీమిండియా కెప్టెన్ అజింక్యా రహానే వినూత్న రీతిలో గౌరవించాడు. టీమిండియా డ్రెసింగ్ రూమ్‌కు వెళ్లే సందర్భంలో మహ్మద్ సిరాజ్‌ను జట్టును లీడ్ చేశాడు. ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా టీ విరామం సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. టీ విరామం ఇవ్వడంతో టీమిండియా కెప్టెన్ రహానే సిరాజ్ వద్దకు వెళ్లి ..నువ్వు ముందు వెళ్లు.. నీ వెనకాల మేము వస్తాం అని చెప్పాడు. రహానే చెప్పినట్లుగా సిరాజ్ ముందు నడవగా.. టీమ్ మొత్తం అతని వెనకాల నడిచింది. టెస్టు క్రికెట్‌లో అడుగుపెట్టిన సిరాజ్‌కు మేము ఇచ్చే గౌరవం ఇదేనని రహానే తెలిపాడు.(చదవండి : మైండ్‌గేమ్ ఆడనివ్వండి.. మేం మాత్రం: రహానే)
రహానే చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. కెప్టెన్‌కుండే అన్ని లక్షణాలు రహానేలో ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. ఒక డెబ్యూ ఆటగాడిని ఇలా గౌరవించడం రహానేకు మాత్రమే చెల్లింది.. రహానే చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక లబుషేన్‌ను అవుట్ చేయడం ద్వారా మహ్మద్ సిరాజ్ టెస్టు క్రికెట్‌లో మెయిడెన్ వికెట్ సొంతం చేసుకున్నాడు. టాస్ గెలిచిన ఆసీస్ నత్తనడకన ఇన్నింగ్స్ కొనసాగిస్తుంది. భారత బౌలర్లు విజృంభించడంతో కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్ 68 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కమిన్స్ 2, లయన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. అశ్విన్, బుమ్రా చెరో 3, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. (చదవండి : క్యాచ్ మిస్ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు)
Comments
Please login to add a commentAdd a comment