టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)ను ఉద్దేశించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఘాటు విమర్శలు చేశాడు. అతడిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేయాలని యాజమాన్యానికి సూచించాడు. విశ్రాంతి పేరిట పక్కన పెడుతున్నామని చెబితే సరిపోదని.. జట్టు నుంచి తప్పిస్తున్నామని స్పష్టంగా చెప్పాలంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు.
ఆసీస్‌తో 1-1తో సమంగా టీమిండియా
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border- Gavaskar Trophy) ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు.. పెర్త్‌లో గెలుపొంది శుభారంభం చేసింది. అయితే, అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులో ఓటమి చెందిన రోహిత్ సేన.. బ్రిస్బేన్‌లో మూడో టెస్టును డ్రా చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-1తో సమంగా ఉంది.
బుమ్రాపై అదనపు భారం మోపుతున్న సిరాజ్?
అయితే, ఈ సిరీస్‌లో భారత పేసర్ సిరాజ్ ఇప్పటి వరకు ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి పదమూడు వికెట్లు తీశాడు. కానీ కొత్త బంతితో మ్యాజిక్ చేయలేకపోతున్న ఈ హైదరాబాదీ బౌలర్.. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై అదనపు భారం మోపుతున్నాడనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కీలక సమయంలో సిరాజ్ వికెట్లు తీయకపోవడంతో బుమ్రాపై పనిభారం ఎక్కువవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వేటు వేస్తున్నామని స్పష్టంగా చెప్పండి
ఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్(Sunil Gavaskar Comments) మాట్లాడుతూ.. ‘‘సిరాజ్‌కు బ్రేక్ ఇవ్వాలి. నా ఉద్దేశం.. విశ్రాంతి పేరిట పక్కన పెట్టాలని కాదు. ‘నీ ఆట తీరు బాగాలేదు. కాబట్టి నిన్ను జట్టు నుంచి తప్పిస్తున్నాం’ అని స్పష్టంగా అతడికి చెప్పాలి.
కొన్నిసార్లు ఆటగాళ్ల పట్ల కాస్త పరుషంగా వ్యవహరించడంలో తప్పులేదు. ఎందుకంటే.. విశ్రాంతినిస్తున్నామని చెబితే.. వాళ్లు మరోలా ఊహించుకుంటారు. కాబట్టి వేటు వేస్తున్నామని వారికి తెలిసేలా చేయాలి.
సిరాజ్ స్థానంలో వారిని తీసుకోండి
అప్పుడే వారిలో కసి పెరుగుతుంది. కచ్చితంగా ఆట తీరును మెరుగుపరచుకుంటారు’’ అని పేర్కొన్నాడు. జట్టులో మార్పులు చేయాలనుకుంటే.. సిరాజ్‌ను తప్పించి ప్రసిద్ కృష్ణ లేదంటే హర్షిత్ రాణాను పిలిపించాలని గావస్కర్ ఈ సందర్భగా సూచించాడు. బుమ్రాకు వారు సపోర్టుగా ఉంటారని పేర్కొన్నాడు.
బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజూ ఆసీస్‌దే
కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య గురువారం బాక్సింగ్ డే టెస్టు మొదలైంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసే సరికి ఆసీస్ పటిష్ట స్థితిలోనే ఉంది.
తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగుల మేర భారీ స్కోరు సాధించిన కంగారూ జట్టు.. శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి సగం వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టింది.
ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మరో పేసర్ స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీయగా.. 46 ఓవర్లలో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(82) రనౌట్ కావడంతో భారత్‌కు గట్టి షాక్ తగిలింది.
చదవండి: కోహ్లికి అవమానం.. ఇంత నీచంగా ప్రవర్తిసారా?.. తగ్గేదేలే అంటూ దూసుకొచ్చిన కింగ్
Comments
Please login to add a commentAdd a comment