సాక్షి, ఇండోర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. తొలుత 139 పరుగుల వద్ద రోహిత్ శర్మ 71 (62బంతులు; 6 ఫోర్లు, నాలుగు సిక్సులు) కౌల్టర్ నీల్ బౌలింగ్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. మరి కొద్ది సేపటికే మరో ఓపెనర్ అజింక్యా రహానే 70 (76బంతులు; 9 ఫోర్లు) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంతకు ముందు 294 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి సేనకు ఈ ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. అర్ధ సెంచరీలతో మెరిసిన ఈ జంట తొలి వికెట్ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి(2), హార్దిక్ పాండ్యా(1)లు ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. 24 ఓవర్లకు భారత్ స్కోరు 148/2
రెండు వికెట్లు కోల్పోయిన భారత్
Published Sun, Sep 24 2017 7:37 PM | Last Updated on Sun, Sep 24 2017 7:40 PM
Advertisement
Advertisement