కోహ్లిని అధిగమించిన రోహిత్‌ | Rohit Sharma notches up 14th ODI century | Sakshi
Sakshi News home page

కోహ్లిని అధిగమించిన రోహిత్‌

Published Sun, Oct 1 2017 8:20 PM | Last Updated on Sun, Oct 1 2017 11:40 PM

Rohit Sharma notches up 14th ODI century

సాక్షి, నాగ్‌పూర్‌: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. కమిన్స్‌ వేసిన 32 ఓవర్‌ ఐదో బంతిని సింగిల్‌ తీసి అంతార్జాతీయ వన్డేల్లో 6000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ క్లబ్‌లో చేరిన తొమ్మిదో భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్‌ గుర్తింపు పొందాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్‌ 125(109 బంతులు 11 ఫోర్లు, 5 సిక్సులు) సెంచరీతో విజృంభించడంతో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనతో రోహిత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ లభించింది. 

ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సాధించిన రికార్డులు..

⇒  వేగంగా ఆరువేల పరుగులు సాధించిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ నిలిచాడు. 162 ఇన్నింగ్స్‌లో రోహిత్‌ ఈ ఘనత సాధించగా  కోహ్లి (136),  సౌరవ్‌గంగూలీ (147)లు ముందు వరుసలో ఉన్నారు.

⇒  రోహిత్‌ శర్మ తాజాగా కెప్టెన్‌ కోహ్లి, మాజీ కెప్టెన్‌ గంగూలీ రికార్డులను అధిగమించాడు. కేవలం 42 ఇన్నింగ్స్‌లోనే రెండు వేల పరుగులు పూర్తిచేశాడు. గంగూలీ ఈ ఘనత 45 ఇన్నింగ్స్‌లో సాధిస్తే కోహ్లి 46 ఇన్నింగ్స్‌లో సాధించాడు.  

⇒ ఒక దేశంపై అత్యధిక సిక్సులు కొట్టిన రెండో ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. ఆస్ట్రేలియాపై రోహిత్‌(54 ) సిక్సులు కొట్టాడు. రోహిత్‌కు ముందు వరుసలో పాక్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది(64) ఉన్నాడు.

⇒  వేగంగా నాలుగువేల పరుగులు పూర్తి చేసిన రెండో ఓపెనర్‌గా రోహిత్‌ రికార్డు సాధించాడు. 83 ఇన్నింగ్స్‌లో రోహిత్‌ ఈ ఘనత సాధించగా హషీమ్‌ ఆమ్లా 79 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సొంతం చేసుకుంది.

⇒ ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. సచిన్‌ టెండూల్కర్‌ 9 సెంచరీలతో ముందున్నారు.

⇒ ఈ ఏడాది అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్‌గా రోహిత్‌ నిలిచాడు. 29 సిక్సులతో పాండ్యా(28)ని అధగమించాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement