India-Australia
-
హాట్‌కేకుల్లా అమ్ముడైన టీ–20 టికెట్లు
విశాఖ స్పోర్ట్స్: విశాఖలో వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఈనెల 23న జరగనున్న భారత్–ఆస్ట్రేలియా టీ20 తొలి మ్యాచ్ టికెట్లు హాట్‌కేక్‌లా అమ్ముడయ్యాయి. ఇప్పటికే ఏసీఏ ఆధ్వర్యంలో పేటీఎం ద్వారా ఆన్లైన్ టికెట్ల విక్రయాన్ని ముగించగా శుక్రవారం ఐదు వేల టికెట్లను ఆరు డినామినేషన్లలో కౌంటర్ల ద్వారా విక్రయించారు. వైఎస్సార్ స్టేడియంతో పాటు టౌన్ కొత్తరోడ్, గాజువాకల్లోని మున్సిపల్ స్టేడియాల్లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి టికెట్లను విక్రయించారు. కనీస ధర రూ.600 నుంచి గరిష్ట ధర రూ.6000లో పాటు రూ.1500, రూ.2000,రూ.3000,రూ.3500లు టికెట్లను మూడు ప్రాంతాల్లో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా కౌంటర్లను ఏర్పాటు చేసి విక్రయించారు. శుక్రవారం ఉదయం నుంచే ఆయా సెంటర్ల వద్ద అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన టికెట్ల విక్రయాన్ని ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్‌రెడ్డి పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన కలెక్టర్ ఎ.మల్లికార్జున, సీపీ రవిశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్లను స్టేడియంలో ప్రవేశానికి ఫిజికల్ టికెట్లుగా మార్చుకునేందుకు ఆయా సెంటర్లలోనే 22వ తేదీవరకు అవకాశం కల్పించగా మ్యాచ్ జరిగే రోజు ఈనెల23న స్టేడియంలోనూ టికెట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించామని గోపినాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆఫ్‌లైన్‌లో శనివారం సైతం ఆరు డినామినేషన్లలో టికెట్లను ఆయా కౌంటర్ల ద్వారా విక్రయించనున్నామని తెలిపారు. -
India-Australia: రక్షణ బంధం బలోపేతం
ముంబై/న్యూఢిల్లీ: భారత్‌తో సంయుక్త నావికా విన్యాసాలకు ఆస్ట్రేలియా త్వరలో ఆతిథ్యమివ్వనుందని ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ ప్రకటించారు. ‘ఎక్సర్సైజ్ మలబార్’ పేరిట జరిపే ఈ విన్యాసాల్లో వీటిలో అమెరికా, జపాన్ కూడా పాల్గొంటాయన్నారు. ఆయన పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన విమాన వాహక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను గురువారం ముంబైలో సందర్శించారు. నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ ఆయనకు స్వాగతం పలికారు. నౌకలో కలియదిరిగి విశేషాలు తిలకించిన అనంతరం ఆల్బనీస్ పలు అంశాలపై మాట్లాడారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య రక్షణ రంగంలో సాన్నిహిత్యం నానాటికీ పెరుగుతోందని, బంధం మరింత బలపడుతోందని అభిప్రాయపడ్డారు. ‘గతేడాది రికార్డు స్థాయిలో సంయుక్త విన్యాసాలు, చర్చలు జరిగాయి. త్వరలో ఆస్ట్రేలియాలో ఎక్సర్సైజ్ మలబార్ నిర్వహించనున్నాం. వాటిలో భారత్ తొలిసారిగా పాల్గొంటోంది’ అని అన్నారు. మోదీపై ప్రశంసల జల్లు ఏ అంశాన్నైనా భవిష్యత్తును అంచనా వేసి మరీ ఆలోచించడం ప్రధాని నరేంద్ర మోదీలో ఉన్న గొప్పదనమని ఆల్బనీస్ ప్రశంసించారు. ‘‘రక్షణ సంబంధాలను సుదృఢం చేసేది ఇలాంటి దూరదృష్టే. బంధాలను ఇప్పుడెలా ఉన్నాయని కాకుండా మున్ముందు ఎదుగుదలకు ఉన్న అవకాశాల పరంగా మదింపు వేయగలగాలి. ఆ సామర్థ్యమున్న నేత మోదీ’’ అని అభిప్రాయపడ్డారు. వర్తక, ఆర్థిక కార్యకలాపాల కోసం ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత సముద్ర మార్గాలు ఇరు దేశాలకూ ఆవశ్యకమేనన్నారు. మోదీ ప్రతిపాదించిన జనరల్ రావత్ డిఫెన్స్ ఆఫీసర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ఇరు దేశాల సైనిక సిబ్బంది మధ్య అవగాహన, సాన్నిహిత్యం పెంపొందేందుకు దోహదపడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. రక్షణ మంత్రుల చర్చలు రక్షణ రంగంలో ఆస్ట్రేలియాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోనున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. ఆ దేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్‌తో గురువారం ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంలో ఇరు దేశాలకు ఉన్న చిత్తశుద్ధిని ప్రతిబింబించేలా తమ సంభాషణ సాగిందన్నారు.వర్తకం, రక్షణ, కీలక ఖనిజాలు మోదీతో చర్చల్లో ఇవే ప్రధానం ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపే తం చేసుకోవడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌తో మోదీ శుక్రవారం విస్తృతంగా చర్చలు జరపనున్నారు. కీలక ఖనిజాలు, ద్వైపాక్షిక వర్తకం, రక్షణ ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక దూకుడు, అందుకు అడ్డుకట్ట వేసే మార్గాలు తదితరాలపైనా నేతలు చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య 2021లో 27.5 బిలియన్ డాలర్ల విలువైన వర్తకం జరిగింది. 2022లో అమల్లోకి వచ్చిన ఆర్థిక సహకార వర్తక ఒప్పందం (ఈసీటీఏ)తో వచ్చే ఐదేళ్లలో ఇది 50 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ చూశారు గురువారం ఉదయం మోదీ, ఆ ల్బనీస్ కలిసి అహ్మదాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ తొలి రోజు ఆట ప్రారంభ కార్యక్రమంలో పాల్గొ న్నారు. టాస్ అనంతరం ఇద్దరూ కలిసి కాసేపు మ్యాచ్‌ను ఆస్వాదించారు. అనంతరం ముంబైలో ఇండియా–ఆస్ట్రేలియా సీఈఓల ఫోరం సమావేశంలో ఆల్బనీస్ పాల్గొన్నారు. -
మెరుగైన స్నేహబంధం కోసం ఎదురుచూస్తున్నాం
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: భారత్– ఆస్ట్రేలియా బలీయ స్నేహబంధం కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా బుధవారం అహ్మదాబాద్ చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్నుద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం అహ్మదాబాద్ చేరుకున్న అల్బనీస్ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి మహాత్మునికి నివాళులర్పించారు. ‘వాణిజ్యం, భద్రత వంటి అంశాల్లో క్రియాశీలకంగా ఉన్న భారత్‌తో బహుముఖ బంధాలను బలపరుచుకునేందుకు ఆస్ట్రేలియాకు లభించిన అద్భుత అవకాశం ఇది. నూతన సాంకేతికత, ఆవిష్కరణలకు చోదక శక్తి భారత్. మా దేశంలో పెద్దసంఖ్యలో వైవిధ్య భారత్, ఆస్ట్రేలియా ప్రజల వల్లే మా దేశం ఇంతగా అభివృద్ధి చెందింది ’ అని భారత్‌కు విచ్చేసిన సందర్భంగా అల్బనీస్ వ్యాఖ్యానించారు. భారతీయ డిగ్రీలకు ఆస్ట్రేలియాలో గుర్తింపు ‘ఆస్ట్రేలియా–భారత్ విద్యార్హత గుర్తింపు వ్యవస్థ’ను అందుబాటులోకి తెస్తున్నట్లు అల్బనీస్ ప్రకటించారు. అంటే ఆస్ట్రేలియా చదువుకుంటున్న, చదివిన భారతీయ విద్యార్థుల డిగ్రీలను ఇండియాలో అనుమతిస్తారు. అలాగే భారత్‌లో చదివిన డిగ్రీనీ ఆస్ట్రేలియాలో గుర్తింపునకు అనుమతిస్తారు. మరోవైపు గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో ఆస్ట్రేలియాకు చెందిన డీకెన్ యూనివర్సిటీ తన అంతర్జాతీయ బ్రాంచ్ క్యాంపస్‌ను నెలకొల్పనుంది. ఆస్ట్రేలియా నాలుగేళ్లపాటు చదవనున్న భారతీయ వి ద్యార్థులకు ‘మైత్రి’ పేరిట ఉపకారవేతనం సైతం అందిస్తామని అల్బనీస్ చెప్పారు. నేడు మోదీతో కలిసి టెస్ట్ మ్యాచ్ వీక్షణ బుధవారం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గురువారం అహ్మదాబాద్‌లోని మోతెరా నిర్మించిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటను ప్రధాని మోదీతో కలిసి వీక్షిస్తారు. అల్బనీస్‌తో కలిసి మ్యాచ్ చూసేందుకు మోదీ సైతం బుధవారమే అహ్మదాబాద్ చేరుకున్నారు. తర్వాత అల్బనీస్ ముంబై చేరుకుంటారు. శుక్రవారం ఢిల్లీలో రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారు. తర్వాత మోదీతోపాటు ఇరుదేశాల వార్షిక సదస్సులో పాల్గొంటారు. సమగ్ర వ్యూహాత్మక ఒప్పందం తదితరాలపై చర్చించనున్నారు. ప్రధానిగా అల్బనీస్‌కు ఇదే తొలి భారత పర్యటన. -
ముగిసిన భారత్–ఆస్ట్రేలియా యుద్ధ విన్యాసాలు
సాక్షి, విశాఖపట్నం: భారత్–ఆస్ట్రేలియా రక్షణ దళాల మధ్య నిర్వహించిన మారీటైమ్ విన్యాసాలు శనివారం ముగిశాయి. విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం సమీపంలోని బంగాళాఖాతం తీరం ఈ విన్యాసాలకు వేదికైంది. ఇండో పసిఫిక్ ఎండీవర్(ఐపీఈ)–2022లో భాగంగా గత నెల 30న రాయల్ ఆస్ట్రేలియా రక్షణ దళాలు విశాఖ చేరుకున్నాయి. శనివారం నిర్వహించిన విన్యాసాల ముగింపు నేపథ్యంలో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన హెచ్ఎంఏఎస్ అడిలైడ్, హెచ్ఎంఏఎస్ అంజాక్ యుద్ధ నౌకలు, తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ కవరత్తి యుద్ధ నౌకలతో పాటు హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొని సత్తా చాటాయి. చివరి రోజు విన్యాసాల్లో ఆస్ట్రేలియా, భారత్‌కు చెందిన త్రివిధదళాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన యుద్ధ నౌకల్ని ఆస్ట్రేలియా రక్షణ బృందం సందర్శించాయి. హార్బర్ ఫేజ్‌లో ఉమ్మడి రక్షణ ప్రణాళికలు, పరస్పర అవగాహన ఒప్పందాలు, రక్షణ వ్యవస్థలో సహకార చర్యలు మొదలైన అంశాలపై చర్చించినట్లు తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. -
గాయంతోనే ఆడాను!
న్యూఢిల్లీ: ధోని నాయకత్వంలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి 2015 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్ చేరగలిగింది. సెమీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 95 పరుగులతో ఓడి నిష్క్రమించింది. ఈ కీలక మ్యాచ్‌లో ప్రధాన పేసర్ మొహమ్మద్ షమీ తప్పనిసరి పరిస్థితుల్లో బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ టోర్నీ ఆరంభంనుంచే మోకాలి గాయంతో బాధపడుతూ మ్యాచ్‌లు ఆడుతూ వచ్చిన షమీ సెమీస్‌లో ఆడటం తన వల్ల కాదన్నా... ధోని భరోసా ఇవ్వడంతో ఆడాల్సి వచ్చింది. మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌తో జరిగిన ఇన్‌స్టగ్రామ్ సంభాషణలో అతను ఈ విషయం చెప్పాడు. ‘సెమీస్‌కు ముందు ఇక నా వల్ల కాదంటూ జట్టు సహచరులతో చెప్పేశాను. నొప్పి చాలా ఉందని చెప్పాను కానీ టీమ్ మేనేజ్మెంట్ గాయం తగ్గుతుందని నమ్మింది. మహి భాయ్ నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఇది సెమీస్ కాబట్టి మరో బౌలర్‌ను ఆడించలేమని చెప్పారు. తొలి ఐదు ఓవర్లలో 16 పరుగులే ఇచ్చాను. ఫించ్, వార్నర్‌లను ఇబ్బంది పెట్టగలిగినా వికెట్ మాత్రం దక్కలేదు. ఇంజక్షన్ తీసుకున్నా పరిస్థితి మెరుగు కాలేదు. ఇక బౌలింగ్ చేయలేనని ధోనికి చెప్పేశాను. అయితే అతను మాత్రం నీపై నమ్మకముంది. పార్ట్‌టైమర్ అయినా ఎలాగూ పరుగులిస్తాడని అన్నాడు. అలాంటి స్థితిలో నేను ఎప్పుడూ ఆడలేదు. ఆ మ్యాచ్ తర్వాత నా కెరీర్ ముగిసిపోతుందని చాలా మంది చెప్పారు. కానీ అదృష్టవశాత్తూ అలా జరగలేదు’ అని షమీ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 60కు మించకుండా పరుగులు ఇస్తే చాలని షమీకి ధోని లక్ష్యం విధించగా...షమీ 68 పరుగులు ఇచ్చాడు. మిగిలిన ఇద్దరు పేసర్లు మోహిత్ (75), ఉమేశ్ (72)లతో పోలిస్తే మెరుగ్గానే బౌలింగ్ చేశాడు. అయితే ఈ గాయం షమీ కెరీర్‌కు నిజంగానే బ్రేకులు వేసింది. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. -
బీసీసీఐని బుజ్జగిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా
సిడ్నీ : ఈ ఏడాది భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌లో డే నైట్ టెస్ట్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒప్పించే ప్రయత్నం చేస్తోంది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ మ్యాచ్ వేదికల తేదీలను సీఏ విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్, బోర్డు అధికారులు అడిలైడ్ వేదికగా జరిగే భారత్-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ను డేనైట్ నిర్వహించే దిశగా బీసీసీఐతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ‘ భారత్ తో అడిలైడ్ వేదికగా జరిగే టెస్టును డే నైట్ నిర్వహించాలని మేం భావిస్తున్నాం. ఆ దిశగా మా ప్రయత్నాలు చేపట్టాం. మరి కొద్ది రోజుల్లో ఈ విషయం స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం.’ అని జేమ్స్ సదర్లాండ్ తెలిపారు. ఇక భారత్‌తో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో అడిలైడ్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి 10 మధ్య జరగనుంది. ఇప్పటికే అడిలైడ్ మైదానం గత మూడేళ్లుగా నాలుగు డే నైట్ టెస్టు మ్యాచ్(న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్)లకు ఆతిథ్యం ఇచ్చింది. అదే విధంగా కొత్త క్యాలెండర్లో లైట్స్ కింద భారత్‌తో మరో మ్యాచ్‌కు వేదిక కావాలని సీఏ భావిస్తోంది. భవిష్యత్తు డే నైట్ టెస్ట్ క్రికెట్దేనని క్రికెట్ఆస్ట్రేలియా గట్టిగా నమ్ముతోంది. దీంతోనే ఈ ఫార్మట్‌ను రక్షించవచ్చని, టెలివిజన్ రేటింగ్స్, ప్రేక్షక ఆదరణను పొందవచ్చిన భావిస్తోంది. 2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్-ఆసీస్ మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నట్లు పేర్కొంది. ఈ పర్యటనలో భారత్ ఆతిథ్య ఆసీస్‌తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. పర్యటనలో టీ20 సిరీస్‌తో భారత్ తన పర్యటనను ప్రారంభించనుంది. భారత్‌తో జరిగే మూడు సిరీస్‌లకు బాల్ ట్యాంపరింగ్‌తో నిషేదం ఎదుర్కొంటున్న ఆసీస్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్ క్రాప్ట్ అందుబాటులో ఉండటం లేదు. భారత్ ఆస్ట్రేలియా షెడ్యూల్: తొలి టీ20: నవంబరు 21- గబ్బా రెండో టీ20: నవంబరు 23- మెల్బోర్న్ మూడో టీ20: నవంబరు 25- సిడ్నీ తొలి టెస్టు: డిసెంబరు 6-10 - ఆడిలైట్ రెండో టెస్టు: డిసెంబరు 14-18 - పెర్త్ మూడో టెస్టు: డిసెంబరు 26-30 - మెల్బోర్న్(బాక్సింగ్ డే టెస్టు) నాలుగో టెస్టు: జనవరి 3- సిడ్నీ మొదటి వన్డే: జనవరి 12- సిడ్నీ రెండో వన్డే: జనవరి 15- ఆడిలైట్ మూడో వన్డే: జనవరి 18- మెల్బోర్న్ -
ఆసీస్ టీం బస్సుపై దాడి.. నిందితుల అరెస్టు
సాక్షి, గువాహటి: భారత్‌తో రెండో టీ 20 విజయానంతరం ఆస్ట్రేలియా క్రికెటర్లు హోటల్ కు వెళ్లే సమయంలో వారి బస్సుపై రాయితో దాడి చేసిన నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఓటమిని జీర్ణించుకోలేని నలుగురు యువకులు తాగిన మైకంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అస్సాం డీజీపీ ముఖేష్ సాహయ్ మీడియాకు తెలిపారు. వీరి పూర్తి వివరాలను బయటపెట్టిన పోలీసులు వీరిలో ఇద్దరు మాత్రం 12వతరగతి చదువుతన్నట్లు, మరో ఇద్దరు షాప్‌లలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. స్టేడియం సమీప ప్రాంతంలో నివసించే ఈ నలుగురు మైనర్లేనని, ఆరోజు మ్యాచ్‌ను మొబైల్ ఫోన్లో చూశారన్నారు. ఓటమిని తట్టుకోలేక అటువైపు వస్తున్న ఆసీస్ టీం బస్సుపై నలుగురు రాయి విసిరారని, ఒక రాయి మాత్రం బస్సుకు తగిలినట్లు తమ విచారణలో వెల్లడైందని డీజీపీ తెలిపారు. ఇక ఈ ఘటనతో దేశవ్యాప్తంగా చర్చజరగడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అస్సాం పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. అయితే ఈ విషయాన్ని తొలుత ఆసీస్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యావత్ క్రీడా అభిమానులు షాక్ గురయ్యారు. ఇలాంటి ఘటనలతో దేశ పరువు తీయవద్దని సోషల్ మీడియావేదికగా ఘాటుగానే స్పందించారు. అయితే ఈ ఘటనను ఆసరా చేసుకున్న పాక్ అభిమానులు భారత్‌పై తమ అక్కసును వెల్లగక్కారు. ఏకంగా భారత్‌లో క్రికెట్ మ్యాచ్‌లు నిషేదించాలని ఐసీసీకి సూచించారు. -
అమీర్‌ఖాన్‌కు ఆమె తెలియదా.?
సాక్షి, హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు అని టీవీ వ్యాఖ్యాత అడిగిన ప్రశ్న బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఆమె పేరు నాకు తెలుసు కాకపోతే ఇప్పుడు గుర్తుకు రావడంలేదు’ అని అమీర్ బుకాయించాల్సిన పరిస్థితి హైదరాబాద్‌లోని ఉప్పల్ క్రికెట్ మైదానంలో చోటు చేసుకుంది. భారత్-ఆసీస్ మధ్య చివరి టీ20కి హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం ఆతిథ్యమిచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లి ఆహ్వానం మేరకు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఉప్పల్‌కి వచ్చిన అమీర్‌ఖాన్.. జైరా వశీంతో కలిసి మైదానంలో సందడి చేశారు. ఈ సందర్భంగా టీవీ వ్యాఖ్యాత జతిన్ సప్రూ, వీరేంద్ర సెహ్వాగ్‌లు వీరిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ట్రై బ్రేకర్ ప్రశ్న అంటూ ‘భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు’ అని ప్రశ్నించారు. దీనికి అమీర్, జైరా సమాధానం చెప్పలేకపోయారు. నాకు తెలుసు కానీ ఇప్పుడు గుర్తుకురావడంలేదు’ అని ఆమీర్ అన్నాడు. భారత మహిళా క్రికెట్ జట్టును రెండు సార్లు ప్రపంచ కప్ ఫైనల్‌కు చేర్చిన కెప్టెన్ మిథాలీ రాజ్, అమీర్‌కు తెలియకపోవడం ఏమిటని నెటిజన్లు విస్మయం చెందుతున్నారు. అప్పటికీ సప్రూ వారికి కొన్ని సూచనలు ఇస్తున్నా ఫలితం లేకపోయింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు ఈ మ్యాచ్ రద్దు చేసిన విషయం తెలిసిందే. -
ఖాన్ బాయ్.. హైదరాబాద్ మ్యాచ్‌కు రా..
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను నేడు (శుక్రవారం) హైదరాబాద్ వేదికగా జరిగే భారత్-ఆస్ట్రేలియా అమీతుమీ టీ20 మ్యాచ్‌కు హాజరవ్వాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కోరారు. మూడు టీ20 సిరీస్‌లో భాగంగా ఇరుజట్లు చెరొక మ్యాచ్ గెలిచి తుది సమరానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఓ జాతీయ చానెల్ దీపావళి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన చిట్‌చాట్ ప్రోగ్రామ్ షూటింగ్లో పాల్గొన్న కోహ్లి, అమీర్ ఖాన్‌ను హైదరాబాద్ మ్యాచ్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అంతేగాకండా చీర్స్ గర్ల్స్ మధ్య ఖాన్ గ్యాలరీలో నిలబడాలని కోహ్లి కోరుకున్నట్లు సమాచారం. ఇటీవల అమీర్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ టీవీషో షూట్‌కు కోహ్లి హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కోహ్లి తన జెర్సీని ఖాన్ బాయ్‌కు గిఫ్ట్‌గా అందజేశాడు. కోహ్లి కోరిక మేరకు అమీర్‌ఖాన్ హైదరాబాద్ వచ్చారని, క్రికెటర్లు బస చేసిన హోటల్లోనే బస చేశారని, టీమిండియా క్రికెటర్లను కలిసనట్లు తెలుస్తోంది. కోహ్లి ఇచ్చిన జెర్సీ ధరించి మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఆఖరి సమరానికి ఖాన్ బాయ్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
విరగబడి నవ్విన..ఆసీస్ యువ బౌలర్
సాక్షి, న్యూఢిల్లీ: కొత్తగా వచ్చి టీమిండియా టాపార్డర్‌ను కుప్పుకూల్చిన రాత్రికి రాత్రే హీరో అయిన ఆసీస్ యువ బౌలర్ బెహ్రన్ డార్ఫ్ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు విరగబడి నవ్వారు. గువాహటి వేదికగా జరిగిన రెండో టీ20లో భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ(2), కోహ్లి(0), మనీష్ పాండే (6), శిఖర్ ధావన్(2)లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చిన బెహ్రన్కు మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ వరించిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఓ రిపోర్టర్ బెహ్రాన్‌ను ‘సోషల్ మీడియాలో అభిమానులు మిమ్మల్ని డబ్ల్యూ డబ్ల్యూఈ రెజ్లర్ జాన్సీనాతో పోల్చుతున్నారు. మీరేమైనా ఇది విన్నారా..? అని అడిగాడు.’ దీనికి బెహ్రాన్ విరగబడి నవ్వుతూ.. లేదు అతను నాకంటే పెద్దవాడు.. అంతటి వాడయ్యేందుకు కష్టపడుతా అని సమాధానం ఇచ్చారు. Fair to say @JDorff5 didn't expect this question after his four-wicket haul against India! pic.twitter.com/cwTbkx0Kfj — cricket.com.au (@CricketAus) 10 October 2017 -
‘మేం మా బ్రాండ్ క్రికెట్ ఆడాలి’..
సాక్షి, గువాహటి: వరుస ఓటముల నుంచి గట్టెక్కాలంటే ఆస్ట్రేలియన్ బ్రాండ్ క్రికెట్ ఆడాలని ఆసీస్ తాత్కాలిక కెప్టెన్ డేవిడ్‌వార్నర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే 4-1తో వన్డే సిరీస్ కోల్పోగా తాజా టీ-20 సిరీస్‌లో 1-0 భారత్ ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. నేడు(మంగళవారం) జరిగే రెండో టీ20కి గువాహటి చేరిన ఆసీస్ జట్టు గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేసింది. ప్రాక్టీస్ అనంతరం వార్నర్ మీడియాతో మాట్లాడారు. ‘మేం వరుస ఓటములకు చింతించడం లేదు. మేం కోల్పోయిన మా ఆసీస్ బ్రాండ్ క్రికెట్‌ను 100 శాతం తిరిగి సాధిస్తాం. మిడిలార్డర్ విఫలం, మంచి భాగస్వామ్యాలు నమోదుచేయకపోవడంతో ప్రతి ఒక్కరు విసుగు చెందారు. అందులోంచి తేరుకోలేకపోతున్నారు. ఒత్తిడి గురించే మాట్లాడుతున్నారు. ఇద్దరు బ్యాట్స్మెన్ల గురించే చర్చిస్తున్నారు. ప్రతి ఒక మ్యాచ్‌ను గెలవాడానికే ప్రయత్నిస్తున్నాం. ఒక విజయం సాధిస్తే ఇక్కడ మనం చాలెంజింగ్ చేయవచ్చు. కొంచెం కష్టమైన అందరి శక్షి సామర్థ్యాల మేరకు రాణిస్తే అది చాల సులువ’ని వార్నర్ సహచరులను ఉద్దేశించి పేర్కొన్నాడు. యాషెస్ సిరస్పై స్పందిస్తూ.. ‘దాని గురించి ఇప్పుడు ఆలోచించడం లేదు. ఇప్పుడు మా దృష్టంతా ఈ టీ20 మీదనే ఉంది. ఇది మేం ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్. ఆటగాళ్లకు బిజీ షెడ్యూల్ ఉండటం సహజమేన’ని వార్నర్ చెప్పుకొచ్చాడు. -
అందుకే ఓడిపోయాం..
సాక్షి, రాంచీ: మిడిలార్డర్ విఫలమవ్వడం, ఓపెనింగ్ శుభారంభం అందకపోవడంతోనే ఓటమిని ఎదుర్కోవల్సి వచ్చిందని ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ డెవిడ్ వార్నర్ అభిప్రాయపడ్డారు. భుజ గాయంతో టీ20 సిరీస్‌కు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ దూరమైన విషయం తెలిసిందే. భారత్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లి సేన 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ ఓటమిపై వార్నర్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి చాలా నిరుత్సాపరిచింది. తరువాతి మ్యాచ్‌కు మంచి ప్రణాళికలతో సిద్దమవుతాం. ఆ అవకాశాన్ని ఎట్టిపరిస్థితుల్లో వదులుకోము. మ్యాచ్ మెత్తం జరిగితే విజయానికి దగ్గరగా వచ్చేవాళ్లము. మా బౌలర్లు వారి కర్తవ్యాన్ని నిర్వర్తించారు. కానీ మిడిలార్డర్ మరోసారి విఫలం అయింది. గత మ్యాచుల్లో నేను ఫించ్‌తో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పా. కానీ ఈ మ్యాచ్‌లో విఫలమయ్యా ..ఇవే మా ఓటమికి కారణమయ్యాయి. మా తప్పులను సవరించుకుంటామని’ వార్నర్ పేర్కొన్నాడు. -
ఆ పద్ధతి ఏంటో అర్థం కావట్లేదు..
సాక్షి, రాంచీ: డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ఏమిటో ఇప్పటికి అర్థం కావట్లేదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 9 వికెట్ల తేడాతో అలవోక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం కలిసొచ్చింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతి ఏంటో ఇప్పటికి అర్థం కావడం లేదు. ఆసీస్‌ను 118కే కట్టడి చేశాం. మా టార్గెట్ 40కి అటు ఇటుగా ఉంటుందనుకున్నాము. కానీ గమ్మత్తుగా 48 అయింది. ఈ గెలుపు ఆటగాళ్ల సమిష్టి కృషి. మేనేజ్మెంట్ సాయం మరవలేనిది. ఫార్మట్‌కు దగ్గట్టు ఆటగాళ్లను ఎంపిక చేయడం. ముఖ్యంగా యువ స్పిన్నర్ల ఎంపిక ధైర్యాన్నిచ్చింది. ఒక మ్యాచ్‌లో పరుగులిచ్చినా, వారు తిరిగి విజృంభించారు. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్లో భువనేశ్వర్, బుమ్రాలు బ్రిలియంట్ బౌలర్లు. యార్కర్లు, స్లో బంతుల వేసినపుడే బౌలర్ల నైపుణ్యం తెలుస్తోంది. ఈ విషయంలో ఈ పేస్ బౌలర్లు విజయవంతమయ్యారు.’ అని కోహ్లి తెలిపారు. ఇక శిఖర్ ధావన్ పునరాగమనంపై హర్షం వ్యక్తం చేసిన కోహ్లి.. దురదృష్టవశాత్తు కొన్ని మ్యాచ్‌లకు ధావన్ దూరమయ్యాడు. జట్టులోకి రావడం.. ఈ ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేయండం ధైర్యాన్నిచ్చిందని కోహ్లి పేర్కొన్నారు. ఆసీస్18.4 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 118 పరుగుల వద్ద వర్షంతో ఇన్నింగ్స్ ముగించాల్సి వచ్చింది. దాదాపు రెండు గంటల అంతరాయం తర్వాత భారత్‌కు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని విధించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడిన భారత్ 5.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 49 పరుగులు చేసి నెగ్గింది. కోహ్లి (14 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూడా డక్‌వర్త్ లూయిస్ మాకే కాదు.. ఐసీసీకి కూడా అర్థం కాదని గతంలో వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. -
ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ..!
సాక్షి, హైదరాబాద్: మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉంది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పరిస్థితి. ఇప్పటికే ఘోర పరాజయంతో 4-1తో వన్డే సిరీస్‌కు కోల్పోయిన ఆసీస్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో నేటి నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ పూర్తిగా దూరం కానున్నాడు. చివరి వన్డేలో గాయపడ్డ స్మిత్, రాంచీ ప్రాక్టీస్ సెషన్లో తిరగబెట్టడంతో తొలి మ్యాచ్‌కు దూరమైతాడని అందరూ భావించారు. కానీ సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గురువారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం స్మిత్‌ను లోకల్ ఆసుపత్రికి తీసుకెళ్లి ఎంఆర్ఐ స్కాన్ తీశారు. అయితే చిన్న భుజగాయమేనని వైద్యులు పేర్కొన్నారు. కానీ క్రికెట్ ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ మాత్రం భవిష్యత్తు సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని స్మిత్‌కు విశ్రాంతి ఇవ్వాలని యోచిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక సిరీస్ నవంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు స్మిత్‌ను సంసిద్దం చేయాలని ఆసీస్ మేనేజ్మెంట్ భావిస్తోంది. ‘స్మిత్‌కు ఎంఆర్ఐ స్కాన్ చేయించాం.తీవ్రమైన గాయమే. ఆటను కొనసాగిస్తే తిరగబెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. స్మిత్‌కు విశ్రాంతి ఇచ్చే యోచనలో ఉన్నాం’ అని టీం డాక్టర్ రిచర్డ్ సా ఆస్ట్రేలియన్ క్రికెట్ డాట్ కామ్ వెబ్‌సైట్‌కు వెల్లడించారు. ఇక స్మిత్ తప్పుకుంటే వార్నర్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అతని స్థానంలో జట్టులోకి మార్కస్ స్టోయినీస్ రానున్నాడు. స్మిత్ దూరమయ్యేది కానిది నేటి మ్యాచ్‌తో తేలనుంది. ఇక శుక్రవారం స్మిత్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ప్రాక్టీస్ చేశాడు. -
ఆసీస్‌పై హిట్టింగ్‌కు ధావన్ రెడీ..
సాక్షి, రాంచీ: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ టీ20ల్లో స్మిత్సేనపై హిట్టింగ్ చేసేందుకు సిద్దమయ్యాడు. భార్య ఆరోగ్య పరిస్థితి బాలేదని ధావన్ తనంతట తానే వన్డే సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఇతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రహానే వరుసగా నాలుగు హాఫ్‌సెంచరీలతో అదరగొట్టాడు. ఈ తరుణంలో ఆసీస్‌తో జరిగే మూడు టీ20లకు జట్టులోకి తిరిగి వచ్చిన ధావన్ ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమించాడు. రాంచీ స్టేడియం పరిసరాల్లో వర్షం పడుతుండటంతో మైదానాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. దీంతో జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ భారత ఆటగాళ్లకి ప్రాక్టీస్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సౌకర్యంతో నెట్స్‌లో ధావన్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని బీసీసీఐ ట్విట్ చేసింది. ఇందులో ధావన్ స్వీప్ షాట్‌తో పాటు బౌన్సర్లని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసేలా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. శ్రీలంకతో ముగిసిన టెస్టు, వన్డే సిరీస్‌లో ధావన్ మెరుగ్గా రాణించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అంతకు ముందు చాంపియన్స్ ట్రోఫిలో అద్భుత ప్రదర్శనతో గోల్డెన్ బ్యాట్ అందుకున్న విషయం తెలిసిందే. Welcome back @SDhawan25 #TeamIndia #INDvAUS pic.twitter.com/0qaqRNeHVH — BCCI (@BCCI) 6 October 2017 -
చివరి వన్డే..నెం.1 ర్యాంకు.. భారత్‌దే
-
చివరి వన్డే..నెం.1 ర్యాంకు.. భారత్‌దే
సాక్షి, నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో రోహిత్ సెంచరీ, రహానే హాఫ్ సెంచరీతో చెలరేగడంతో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ 4-1తో సిరీస్‌తో పాటు వన్డేల్లో నెం.1 ర్యాంకును సుస్థిరం చేసుకుంది. 243 పరుగుల సునాయస లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు అర్ధసెంచరీలతో మంచి శుభారంబాన్ని అందించారు. దూకుడుగా ఉన్న ఈ జంటను కౌల్టర్ నీల్ రహానే 61 (74 బంతులు; 7 ఫోర్లు)ను అవుట్ చేసి విడగొట్టాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 129 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లితో రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కమిన్స్ వేసిన 32 ఓవర్ ఐదో బంతిని సింగిల్ తీసిన రోహిత్ అంతార్జాతీయ వన్డేల్లో 6000 పరుగుల మైలురాయి అందుకున్న తొమ్మిదో భారత బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఈ దశలో 94 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సులతో కెరీర్లో 14వ సెంచరీ నమోదు చేసిన రోహిత్ 125(109 బంతులు 11 ఫోర్లు, 5 సిక్సులు) జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కౌల్టర్ నీల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో రెండో వికెట్‌కు 99 పరుగుల జమయ్యాయి. మరో నాలుగు పరుగుల వ్యవధిలోనే కెప్టెన్ కోహ్లి కూడా జంపా బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జాదవ్(5), పాండె(11)లతో 42.5 ఓవర్లలోనే భారత్ విజయాన్నందుకుంది. ఆసీస్ బౌలర్లలో జంపాకు రెండు, కౌల్టర్ నీల్‌కు ఒక వికెట్ దక్కింది. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ వార్నర్ (53), స్టోయినీస్(46), ట్రావిస్ హెడ్(42), ఫించ్(32), లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవ్వడంతో నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ఇక సెంచరీతో విజృంభించిన రోహిత్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ రాగా.. సిరీస్ ఆసాంతం ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది. -
కోహ్లిని అధిగమించిన రోహిత్
సాక్షి, నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. కమిన్స్ వేసిన 32 ఓవర్ ఐదో బంతిని సింగిల్ తీసి అంతార్జాతీయ వన్డేల్లో 6000 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ క్లబ్లో చేరిన తొమ్మిదో భారత బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ గుర్తింపు పొందాడు. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ 125(109 బంతులు 11 ఫోర్లు, 5 సిక్సులు) సెంచరీతో విజృంభించడంతో భారత్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ అద్భుత ప్రదర్శనతో రోహిత్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ లభించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సాధించిన రికార్డులు.. ⇒ వేగంగా ఆరువేల పరుగులు సాధించిన మూడో భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ నిలిచాడు. 162 ఇన్నింగ్స్‌లో రోహిత్ ఈ ఘనత సాధించగా కోహ్లి (136), సౌరవ్గంగూలీ (147)లు ముందు వరుసలో ఉన్నారు. ⇒ రోహిత్ శర్మ తాజాగా కెప్టెన్ కోహ్లి, మాజీ కెప్టెన్ గంగూలీ రికార్డులను అధిగమించాడు. కేవలం 42 ఇన్నింగ్స్‌లోనే రెండు వేల పరుగులు పూర్తిచేశాడు. గంగూలీ ఈ ఘనత 45 ఇన్నింగ్స్‌లో సాధిస్తే కోహ్లి 46 ఇన్నింగ్స్‌లో సాధించాడు. ⇒ ఒక దేశంపై అత్యధిక సిక్సులు కొట్టిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఆస్ట్రేలియాపై రోహిత్(54 ) సిక్సులు కొట్టాడు. రోహిత్‌కు ముందు వరుసలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది(64) ఉన్నాడు. ⇒ వేగంగా నాలుగువేల పరుగులు పూర్తి చేసిన రెండో ఓపెనర్‌గా రోహిత్ రికార్డు సాధించాడు. 83 ఇన్నింగ్స్‌లో రోహిత్ ఈ ఘనత సాధించగా హషీమ్ ఆమ్లా 79 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సొంతం చేసుకుంది. ⇒ ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 9 సెంచరీలతో ముందున్నారు. ⇒ ఈ ఏడాది అత్యధిక సిక్సులు బాదిన క్రికెటర్‌గా రోహిత్ నిలిచాడు. 29 సిక్సులతో పాండ్యా(28)ని అధగమించాడు. -
కిందపడ్డ ధోని.. నవ్విన కోహ్లి
సాక్షి, నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో జరగుతున్న చివరి వన్డేలో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని తన కీపింగ్‌తో నవ్వులు పూయించాడు. కుల్దీప్యాదవ్ వేసిన 35 ఓవర్ రెండో బంతిని క్రీజులో ఉన్న ట్రావిస్ హెడ్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బ్యాట్‌కు తగలకుండా టర్నై ఒక్కసారిగా ధోనివైపు దూసుకెళ్లింది. అంతే రియాక్షన్లో ధోని కూడా బంతిని అందుకొని మైదానంలో కూలబడ్డాడు. దీన్ని చూసిన కోహ్లి ముఖంలో నవ్వులు పూశాయి. -
చివరి వన్డే: రోహిత్, రహానే@ 50
సాక్షి, నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు ఆర్ధసెంచరీలతో దుమ్ములేపారు. తొలుత రోహిత్ 52 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో కెరీర్లో 35వ సెంచరీ సాధించాడు. మరికొద్ది సేపటికి రహానే 64 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.ఈ సిరీస్‌లో రహానేకు వరుసగా నాలుగో అర్ధసెంచరీ కాగా రోహిత్ మూడో అర్ధసెంచరీ. వీరిద్దరూ ఆచితూచి ఆడుతుండటంతో భారత్ 20 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 111 పరుగులు చేసింది. -
ఆసీస్‌తో చివరి వన్డే: భారత్ కు సునాయస లక్ష్యం!!
సాక్షి, నాగ్‌పూర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి వన్డేలో భారత బౌలర్లు రాణించారు. యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ (3-38) చెలరేగగా.. పేసర్లు బుమ్రా, భువనేశ్వర్‌లు పరుగుల రాకుండా కట్టడిచేయడంతో ఆసీస్ భారత్‌కు 243 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు డెవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్‌లు మంచి శుభారంభాన్ని అందించారు. దూకుడు మీద ఉన్న ఈ జంటను హార్దిక్ పాండ్యా అడ్డుకున్నాడు. భారీ షాట్ కు యత్నించిన ఫించ్(32).. బూమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 66 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో వార్నర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ దశలో వార్నర్ 56 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. వార్నర్ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మరుసటి బంతికే కెప్టెన్ స్టీవ్ స్మిత్(16) జాదవ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో 12 బంతుల వ్యవధిలోనే అక్సర్ బౌలింగ్‌లో వార్నర్ (53) కూడా పెవిలియన్ చేరడంతో ఆసీస్ పరుగుల వేగం మందగించింది. అనంతరం క్రీజులోకి వచ్చిన హ్యాండ్స్ స్కోంబ్(13) కూడా విఫలమయ్యాడు. దీంతో ఆసీస్ 118 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్, స్టోయినీస్‌లు నిలకడగా ఆడుతూ ఐదో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. దీంతో ఆసీస్ 200 పరుగుల మార్కును దాటగలిగింది. ట్రావిస్ హెడ్(42)ను అక్షర్ అవుట్ చేయగా స్టోయినీస్(46)ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. డెత్ ఓవర్లో బుమ్రా- భువనేశ్వర్‌లు పరుగులు రాకుండా కట్టడి చేశారు. దీంతో వేడ్(20) భారీ షాట్‌కు ప్రయత్నించి బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. చివర్లో ఫాల్కనర్(12) రనౌట్ అవ్వగా కౌల్టర్ నీల్ భువీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్‌కు మూడు, బుమ్రాకు రెండు, జాదవ్, పాండ్యా, భువనేశ్వర్‌లకు తలో వికెట్ దక్కింది. -
నాలుగో వన్డేలో భారత్ ఓటమి
సాక్షి, బెంగళూరు: భారత్‌తో జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో కోహ్లిసేన వరుస విజయాలకు బ్రేక్ పడింది. 335 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. చివర్లో భారీ లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. 335 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, రహానేలు మంచి శుభారంభాన్ని అందించారు. అనంతరం రహానే 53 (66 బంతులు,6 ఫోర్లు, 1 సిక్సు), రోహిత్ శర్మ65(55 బంతులు 1 ఫోర్, 5 సిక్సులు), కెప్టెన్ విరాట్ కోహ్లి(21) స్వల్ప వ్యవధిలోనే అవుటయ్యారు. దీంతో భారత్147 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన పాండ్యా- జాదవ్‌లు జట్టును ఆదుకున్నారు. పాండ్యా తన సహజ శైలి ఆటతో సిక్సులతో విరుచుకుపడ్డారు. హాఫ్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్న పాండ్యా41(40 బంతులు,1 ఫోర్, 3 సిక్సులు)ను జంపా బోల్తా కొట్టించాడు. దీంతో నాలుగో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండేతో జాదవ్ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఈ దశలో 6 ఫోర్లు ఒక సిక్సుతో 54 బంతుల్లో జాదవ్ హాఫ్ సెంచరీ సాధించాడు. జట్టు స్కోరు 286 వద్ద జాదవ్67 (69 బంతులు 7 ఫోర్లు, 1 సిక్సు) రిచర్డ్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యాడు. ఆ వెంటనే పాండే (33) కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నంలో ధోని(13), అక్సర్(5) లు విఫలమయ్యారు. దీంతో ఆసీస్ విజయం సుగుమమైంది. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్సన్ 3, కౌల్టర్ నీల్ 2, జంపా, కమిన్స్‌లకు ఒక వికెట్ దక్కింది. వార్నర్.. ఫించ్ విజృంభణ.. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్(124;119 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) , ఫించ్(94; 96 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) లు మంచి శుభారభాన్ని అందించారు. ఈ జంట తొలి వికెట్‌కు 231 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించింది. ఈ భారీ ఇన్నింగ్స్‌కు ట్రావిస్ హెడ్(29), హ్యాండ్స్కోంబ్(43)లు రాణించడంతో ఆసీస్ 331 పరుగులు చేయగలిగింది. శతక వీరుడు వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. -
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ తిరిగి ప్రారంభం
సాక్షి, బెంగళూరు: భారత్- ఆస్ట్రేలియా నాలుగో వన్డే మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.అంతకు ముందు వర్షంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. భారత విజయానికి 48 బంతుల్లో 76 పరుగులు అవసరం. ఇక టీమిడింయా బ్యాట్స్‌మన్ కేదార్‌జాదవ్ అర్ధ సెంచరీ నమోదు చేశాడు. 6 ఫోర్లు ఒక సిక్సుతో 54 బంతుల్లో జాదవ్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక అంతకు ముందు భారత్ (పాండ్యా) నాలుగో వికెట్ కోల్పోయింది. 147 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి క్లిష్ట స్థితిలో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చిన జాదవ్‌తో పాండ్యా ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరూ వీలిచిక్కినప్పుడుల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోరు బోర్డు పరుగెత్తించారు. అయితే ఇద్దరు హాఫ్‌సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సందర్భంలో పాండ్యా 41(1 ఫోర్, 3 సిక్సులు) ఆడమ్ జంపా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(18 నాటౌట్)తో జాదవ్(55 నాటౌట్) పోరాడుతున్నాడు. -
‘బీసీసీఐ.. ఇది వన్డే.. టీ20 కాదు’
సాక్షి, హైదరాబాద్: బెంగళూరు వేదికగా జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా నాలుగో వన్డే మ్యాచ్‌పై బీసీసీఐ అధికారిక ట్విట్టర్లో ఓ పోస్టు చేసింది. మ్యాచ్‌కు సంబంధించిన ఈ పోస్టుపై నెటిజన్లు బీసీసీఐ తప్పిదాన్ని గుర్తించారు. మ్యాచ్ విషయాలను అప్డేట్ ఇచ్చే ఆతృతలో బీసీసీఐ పప్పులో కాలేసింది. నాలుగో వన్డేకు బదులు టీ20 అని ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ టాస్ గెలిచాడనే విషయాన్ని పేర్కొంది. తప్పును గుర్తించిన నెటిజన్లు ‘బీసీసీఐ ఇది వన్డే.. టీ20 కాదు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. పొరపాటు గుర్తించిన బీసీసీఐ ఆ ట్వీట్‌ను తొలిగించింది. కానీ నెటిజన్లు మాత్రం స్క్రీన్ షాట్లు తీసీ మరి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బీసీసీఐ అధికారిక ట్విట్టర్ 53 లక్షల ఫాలోవర్లున్నారు. -
నాలుగో వన్డే: మూడు వికెట్లు కోల్పోయిన భారత్
సాక్షి, బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా 147 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 335 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు అర్ధ సెంచరీల మంచి శుభారంభాన్ని అందించారు. తొలుత రహానే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 బంతుల్లో అర్ధసెంచరీ నమోదు చేశాడు. అనంతరం రోహిత్ శర్మ నాలుగు సిక్సులు, ఒక ఫోర్‌తో 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. పటిష్టంగా మారిన ఈ జంటను రిచర్డ్సన్ రహానే 53 (66 బంతులు,6 ఫోర్లు, 1 సిక్సు) అవుట్ చేసి భారత వికెట్ల పతనానికి నాందీ పలికాడు. దీంతో తొలి వికెట్‌కు నమోదైన 106 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం స్వల్ప వ్వవధిలోనే మరో ఓపెనర్ రోహిత్ 65(55 బంతులు 1 ఫోర్, 5 సిక్సులు) అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. మరో 12 పరుగుల వ్యవధిలో కెప్టెన్ విరాట్ కోహ్లి(21) కౌల్టర్ నీల్ బౌలింగ్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ 147 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో పాండ్యా, జాదవ్‌లు పోరాడుతున్నారు. -
నాలుగో వన్డే: భారత్‌కు ఆసీస్ భారీ లక్ష్యం
సాక్షి, బెంగళూరు: టీమిండియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్లు డెవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్‌లు విజృంభించారు. దీంతో ఆసీస్ భారత్‌కు 335 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు వార్నర్, ఫించ్‌లు మంచి శుభారంభాన్ని అందించారు. తొలుత శతకం సాధించిన డేవిడ్ వార్నర్(124;119 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కేదర్ జాదవ్ బౌలింగ్ లో షాట్ కు యత్నించి అక్షర్ పటేల్ చిక్కాడు. దీంతో 231 పరుగుల వద్ద ఆసీస్ మొదటి వికెట్ ను నష్టపోయింది. అనంతరం అదే స్కోరు వద్ద అరోన్ ఫించ్ ను ఉమేశ్ యాదవ్ అవుట్ చేశాడు. ఉమేశ్ బౌలింగ్ లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చిన ఫించ్ (94; 96 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేజార్చుకున్నాడు. ఆపై కాసేపటికి కెప్టెన్ స్టీవ్ స్మిత్(3) మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఉమేశ్ యాదవ్ వేసిన 38 ఓవర్ తొలి బంతిని మిడ్ వికెట్ గా మీదుగా ఆడిన స్మిత్.. విరాట్ కోహ్లికి దొరికిపోయాడు. మెరుపు వేగంతో కదిలిని విరాట్ కోహ్లి అద్భుతంగా క్యాచ్ అందుకుని స్మిత్ ను పెవిలియన్ బాట పట్టించాడు. కాగా, ఇది ఉమేశ్ యాదవ్ కు వన్డేల్లో 100 వ వికెట్. దీంతో వన్డేల్లో ఉమేశ్ అరుదైన 'సెంచరీ' వికెట్ల క్లబ్లో చేరిపోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్(29), హ్యాండ్స్కోంబ్(43)లు దాటిగా ఆడారు. వీరని ఉమేశ్ పెవిలియన్‌కు పంపించగా.. స్టోయినీస్(19), వేడ్(3)తో భారీషాట్లు ఆడాడు. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఉమేశ్‌కు నాలుగు వికెట్లు, జాదవ్‌కు ఒక వికెట్ దక్కింది. -
మూడు డాట్ బాల్స్ వేస్తే మాక్స్వెల్ అంతే..
బెంగళూరు: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ మాక్స్‌వెల్‌ను అవుట్ చేయాలంటే మూడు డాట్ బంతులు చాలని టీమిండియా యువ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అభిప్రాయపడ్డాడు. మాక్స్‌వెల్‌ను వరుస మూడు వన్డేల్లో పెవిలియన్‌కు పంపించిన ఈ హరియాణ బౌలర్ వీటిలో రెండు స్టంప్ అవుట్లు చేయడం విశేషం. దీనిపై స్పందించిన చాహల్ ‘మాక్స్‌వెల్‌కు బౌలింగ్ చేసేటప్పుడు బంతిని స్టంప్స్ వైపు వేయకుండా అవుట్ సైడ్ స్టంప్స్‌కు వేస్తాను. నేను వేసే ఓవర్లో ఖచ్చితంగా రెండు నుంచి మూడు బంతులు డాట్ అవుతాయి. దీంతో మాక్స్వెల్ ఒత్తిడికి లోనై క్రీజు వదలి భారీ షాట్‌కు ప్రయత్నిస్తాడు. ఇదే స్టంప్ అవుట్ల వెనుక ఉన్న రహస్యమని’ ఈ యువ బౌలర్ చెప్పుకొచ్చాడు. ఆసీస్ కీలక ఆటగాడైన వార్నర్ క్రీజులో కుదురుకుంటే విధ్వంసం సృష్టిస్తాడని ఈ యువ స్పిన్నర్ పేర్కొన్నాడు. దీంతో వార్నర్ ఎంత త్వరగా అవుట్ చేస్తే మాకు మిడిల్ ఓవర్లలో అంత ఒత్తిడి తగ్గుందోని చాహాల్ పేర్కొన్నాడు. ఇక్కడి పరిస్థితులను ఆసీస్ స్పిన్నర్ల కన్నా భారత స్పిన్నర్లే ఎక్కవ సద్వినియోగం చేసుకున్నారని, భారత స్పిన్నర్లు మొత్తం 13 వికెట్లు పడగొట్టారని చాహల్ పేర్కొన్నాడు. ఇక బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేస్తే బౌలర్లు ఎలాంటి ఒత్తిడిలేకుండా బౌలింగ్ చేయగలరని చాహల్ వ్యాఖ్యానించాడు. -
భారత్‌ను ఓడించాలంటే 100 శాతం ఆడాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ఉపఖండ పిచ్‌లపై టీమిండియాను ఓడించాలంటే 100 శాతం ఆడాల్సిందేనని ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డారు. కాలి పిక్క గాయంతో తొలి రెండు వన్డేలకు దూరమైన ఫించ్ మూడో వన్డేలో శతకంతో రాణించిన విషయం తెలిసిందే. వరుస మూడు వన్డేల్లో గెలిచి కోహ్లి సేన సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో ఫించ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ వెబ్‌సైట్‌తో ముచ్చటించారు. ‘ విదేశీ గడ్డపై ఓటములు ఎదురైతే ఆటగాళ్లు కొంచెం దైర్యం కోల్పోతారు. దక్షిణాఫ్రికా, భారత్ సిరీస్‌ల ఓటమికి కారణం ఆ జట్లు మా కన్నా కొంత నాణ్యమైన ప్రదర్శన చేశాయి. మా జట్టు మంచి ప్రదర్శన చేసినా చివరి నిమిషంలో ఓడిపోయాం. ఇలా గత10 మ్యాచుల్లో 9 ఓడిపోయాం. ఇదే పరిస్థితి భారత్‌లో కూడా ఎదురైంది. ఉపఖండ పిచ్‌లపై భారత్‌ను ఢీకొట్టాలంటే 100 శాతం ఆడాల్సిందే. ఒక వేళ 90 శాతం ఆడుతానంటే ఇక్కడి పరిస్థితులకు సరిపోదు. గత ఐదేళ్లలో మాజట్టును ఢీకొన్న ఇతర జట్లు అద్భుతంగా రాణించాయి. ఇప్పుడు భారత్ సిరీస్ గెలిచి నెం.1 గా ఉంది. మేము మా ఆటగాళ్లతో ప్రణాళికలు రచించి ముందుకెళ్తాం. విజయానికి ఉన్న ఆ కొద్ది దూరాన్ని అధిగమిస్తాం’. అని ఫించ్ పేర్కొన్నారు. ఆసీస్‌కు గడ్డు పరిస్థితులు ఇక ఆస్ట్రేలియా పరిస్థితి దారుణంగా మారింది. ఆ జట్టు గత ఏడాది కాలముగా ఆడిన 13 వన్డేల్లో 11 ఓడగా రెండు మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. దక్షిణాఫ్రికాతో 5-0తో సిరీస్ కోల్పోగా, న్యూజిలాండ్ 2-0, చాంపియన్స్ ట్రోఫిలో లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ఇప్పుడు భారత్‌తో సిరీస్ కోల్పోయింది. -
ఆస్ట్రేలియాకు గట్టి ఎదురు దెబ్బ
సాక్షి, ఇండోర్: మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా ఉంది ఆస్ట్రేలియా పరిస్థితి. ఇప్పటికే వరుస ఓటములతో సీరీస్ కోల్పోయిన స్మిత్ సేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం జరిగిన ఇండోర్ వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి రెండు వన్డేలు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కనీసం మిగిలిన రెండు వన్డేల్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్న తరుణంలో స్మిత సేనకు ఊహించని షాక్ తగిలింది. స్పిన్నర్ ఆస్టన్ అగర్ చిటికెను వేలి గాయంతో మిగిలిన రెండు వన్డేలకు దూరం అయ్యాడు. ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో అగర్ బౌండరీని అడ్డుకునే క్రమంలో అతని కుడి చేతి చిటికెను వేలుకు గాయమైంది. మ్యాచ్ అనంతరం ఎక్స్‌రేలో వేలు విరిగినట్లు తేలడంతో శస్త్రచికిత్స చేయించుకోవాలనే జట్టు డాక్టర్ సా సూచనల మేరకు అగర్ తిరుగు పయనమయ్యాడు. ఇప్పటికే స్పిన్‌కు అనుకూలించే ఉపఖండ పిచ్‌లపై సతమతమవుతున్న ఆసీస్ బౌలింగ్ విభాగానికి తాజా ఘటనతో మరింత ఆందోళన నెలకొంది. -
ఇండోర్ వన్డేలో భారత్ ఘనవిజయం
సాక్షి, ఇండోర్: టీమిండియా జైతయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో 5 వన్డేల సిరీస్‌లో రెండు వన్డేలు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 294 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి సేన ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు వేసిన గట్టి పునాదికి పాండ్యా అర్ధ సెంచరీ తోడవ్వడంతో అలవోక విజయం సాధించింది. శుభారంభం అందించిన ఓపెనర్లు.. రోహిత్, రహానేలు అర్ధసెంచరీలతో చెలరేగడంతో భారత్ తొలి వికెట్ 139 పరుగులు జమయ్యాయి. రోహిత్ శర్మ 71 (62బంతులు 6 ఫోర్లు నాలుగు సిక్సులు), కౌల్టర్ నీల్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటవ్వగా.. ఆవెంటనే రహానే 70 (76బంతులు 9 ఫోర్లు) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి, పాండ్యాలు ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించారు. పాండ్యా మెరుపులు.. పాండ్యా మాత్రం తనదైన శైలిలో వచ్చిరాగానే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. జట్టు స్కోరు 203 పరుగుల వద్ద కోహ్లి(28) అగర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేదార్ జాదవ్(2) మరోసారి నిరాశపర్చాడు. క్రీజులోకి వచ్చిన మనీష్ పాండేతో చెలరేగిన పాండ్యా 45 బంతుల్లో కెరీర్లో నాలుగో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. విజయానికి 10 పరుగుల దూరంలో ఉండగా పాండ్యా 78(72 బంతులు; 5 ఫోర్లు, 4 సిక్సులు) కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోని(2), మనీష్ పాండే(36)లు భారత్‌కు 14 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందించారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్‌కు రెండు వికెట్లు, రిచర్డ్సన్, అగర్, కౌల్టర్ నీల్లకు తలో వికెట్ దక్కింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హర్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ వరించింది. ఈ విజయంతో వరుస తొమ్మిది వన్డేల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా ధోని పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేశాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ 124(125 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకం, కెప్టెన్ స్మిత్(63) అర్ధసెంచరీలతో రాణించడంతో 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, బుమ్రాలకు రెండు వికెట్లు దక్కగా, చాహల్, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. -
రెండు వికెట్లు కోల్పోయిన భారత్
సాక్షి, ఇండోర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. తొలుత 139 పరుగుల వద్ద రోహిత్ శర్మ 71 (62బంతులు; 6 ఫోర్లు, నాలుగు సిక్సులు) కౌల్టర్ నీల్ బౌలింగ్ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. మరి కొద్ది సేపటికే మరో ఓపెనర్ అజింక్యా రహానే 70 (76బంతులు; 9 ఫోర్లు) ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. అంతకు ముందు 294 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి సేనకు ఈ ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. అర్ధ సెంచరీలతో మెరిసిన ఈ జంట తొలి వికెట్ 139 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి(2), హార్దిక్ పాండ్యా(1)లు ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నారు. 24 ఓవర్లకు భారత్ స్కోరు 148/2 -
అర్ధ సెంచరీలు సాధించిన భారత ఓపెనర్లు
సాక్షి, ఇండోర్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానేలు అర్ధ సెంచరీలు సాధించారు. తొలుత రోహిత్ శర్మ 42 బంతుల్లో 4 సిక్సులు, 3 ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించగా అనంతరం రహానే కూడా 50 బంతుల్లో 7 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్‌కు కెరీర్లో ఇది 33వ అర్ధ సెంచరీ కాగా రహానేకు 21వ అర్ధ సెంచరీ. అయితే 19 ఓవర్లకు భారత్ స్కోరు 126/0 FIFTY! @ImRo45 brings up his 33rd ODI 50 Paytm #INDvAUS pic.twitter.com/8dAGd96PJz — BCCI (@BCCI) 24 September 2017 .@ajinkyarahane88 celebrates as he brings up his Fifty. This is his 21st in ODIs #INDvAUS pic.twitter.com/8GuTuRLVQn — BCCI (@BCCI) 24 September 2017 -
భారత్ లక్ష్యం.. 294
సాక్షి, ఇండోర్ : భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో అరోన్ ఫించ్ సెంచరీతో చెలరేగడంతో ఆసీస్ 294 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ లు శుభారంభాన్ని అందించారు. ఈ జోడి కుదురుగా ఆడుతూ ఆసీస్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే యత్నం చేసింది. అయితే వార్నర్(42;44 బంతుల్లో 4 ఫోర్లు 1సిక్స్) పాండ్యా బౌలింగ్‌లో తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఫించ్‌కు జత కలిశాడు. వీరిద్దరూ కలిసి ఎటువంటి తడబాటు లేకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే ఫించ్ 60 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆపై జోరు పెంచిన ఫించ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అరోన్ ఫించ్ 125 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 124 పరుగులు చేసిన అనంతరం రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో 154 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరొకవైపు స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం కొద్దిసేపటికే స్మిత్(63) కూడా అవుటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్(5), ట్రావిస్ హెడ్లు(4) విఫలమయ్యారు. చివర్లో స్టోయినిస్(27) రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. ఒక దశలో 300 పైచిలుకు పరుగులు చేస్తుందనుకున్న సమయంలో భారత బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆసీస్ మిడిలార్డర్ మరోసారి చేతులెత్తేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, బుమ్రాలకు రెండు, చాహల్, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది. -
కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్
-
దంచికొట్టిన మిథాలీ సేన..
♦ ఆసీస్‌కు భారీ లక్ష్యం ♦ సెంచరితో కదం తొక్కిన హర్మన్ ప్రీత్ .. డెర్బీ: మహిళల ప్రపంచకప్ లో మిథాలీ సేన ఆస్ట్రేలియాకు 282 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్థేశించింది. భారత బ్యాట్ ఉమెన్‌లో హర్మన్ ప్రీత్ అద్వితీయమై బ్యాటింగ్‌తో భారత్ నిర్ణీత 42 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ (115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సులతో 171 నాటౌట్) కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో కౌర్ మహిళల వన్డే క్రికెట్లో ఇన్నింగ్స్ అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాట్స్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీసేనకు ఓపెనర్లు స్మృతి మంధన(6), పూనమ్ రౌత్(14)లు శుభారంబాన్ని అందించలేకపోయారు. దీంతో 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిథాలీ, కౌర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. జట్టు స్కోరు 101 వద్ద మిథాలీ(36) బీమ్ప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అవడంతో మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం హర్మన్ ప్రీత్ దీప్తిశర్మతో రెచ్చిపోయి ఆడటంతో 90 బంతుల్లోనే కెరీర్లో మూడో సెంచరీ సాధించింది. దూకుడుగా ఆడుతూ క్రీజులో హర్మన్‌ప్రీత్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. కౌర్ ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఏడు సిక్స్‌లు కొట్టడం విశేషం. ఆసీస్ బౌలర్ గార్డెనర్ బౌలింగ్‌లో కౌర్ రెండు సిక్సలు, రెండు ఫోర్లతో 23 పరుగులు రాబట్టింది. చివర్లో దీప్తీ శర్మ(25), వేదకృష్ణమూర్తి(16 నాటౌట్)లు దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇక ఆసీస్ బౌలర్లలో విలాని, గార్డనర్, బీమ్స్, స్కట్లకు చెరో వికెట్ దక్కింది. -
ఆదిలోనే ఆసీస్‌కు కష్టాలు
డెర్బీ: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా బ్యాటింగ్ విభాగం అదరగొట్టగా.. మేం ఏమాత్రం తక్కువ కాదంటూ బౌలర్లు చెలరేగుతున్నారు. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 21 పరుగలకే మూడు వికెట్లు కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడింది. పాండే తన తొలి ఓవర్ రెండో బంతికే ఆసీస్ జట్టు ఓపెనర్ మూనీ(1)ని క్లీన్‌బౌల్డ్ చేసింది. అనంతరం గోస్వామి కెప్టెన్ లాన్నింగ్(0)ను ఔట్ చేసింది. బోల్టన్ (14)ను దీప్తీ శర్మ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చింది. 12 ఓవర్లకు ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. క్రీజులో విలాని(20), పెర్రీ(17)లు పోరాడుతున్నారు. -
సెంచరితో కదం తొక్కిన హర్మన్ ప్రీత్ ..
♦ కెరీర్లో మూడో సెంచరీ సాధించిన కౌర్ డెర్బీ: మహిళల ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్ ఉమెన్‌లో హర్మన్ ప్రీత్ అద్వితీయమై బ్యాటింగ్‌తో చెలరేగింది. హర్మన్ ప్రీత్ 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సులతో 171పరుగులు చేసి నౌటౌట్‌గా వన్డే కెరీర్లో అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది. దీంతో కౌర్ మహిళల వన్డే క్రికెట్లో ఇన్నింగ్స్ అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాట్స్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది. తొలుత కెప్టెన్ మిథాలీతో ఆచితూచి ఆడిన కౌర్ తర్వాత చెలరేగి ఆడింది. కేవలం 90 బంతుల్లో సెంచరీ పూర్తిచేసిన కౌర్ కెరీర్లో మూడో సెంచరీ సాధించింది. సెంచరీ అనంతరం ఆసీస్ బౌలర్లు కౌర్ ఓ ఆట ఆడుకుంది. బంతిని బౌండరీకి బాధడమే లక్ష్యంగా చెలరేగింది. ఆసీస్ బౌలర్ గార్డెనర్ వేసిన ఓ ఓవర్లలో కౌర్ రెండు సిక్సలు, రెండు ఫోర్లతో 23 పరుగులు రాబట్టింది. కౌర్ ఈ ఇన్నింగ్స్‌లో అలవోకగా 20 ఫోర్లు, 7 సిక్సులు కొట్టడం విశేషం. దీంతో భారత్ ఆసీస్‌కు 282 పరుగలు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. -
టాస్ నెగ్గిన మిథాలీ సేన..
డెర్బీ: మహిళల ప్రపంచకప్ భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో సెమీస్ లో మిథాలీ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను అంపైర్లు 42 ఓవర్లకు కుదించారు. ఓవర్ల కుదింపుతో ఇద్దరి బౌలర్లకు 9 ఓవర్లు, మిగిలిన ముగ్గురికి 8 ఓవర్లు వేసే అవకాశం ఇచ్చారు. ఇక ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి. మిథాలీ రాజ్ నేతృత్వంలోనే భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక సమరానికి సన్నద్ధమైంది. ఆస్ట్రేలియాతో టోర్నీ లీగ్ దశలోని పరాజయం భారత్‌కు ప్రతికూలంగా కనిపిస్తున్నా... అచ్చొచ్చిన మైదానంలో అనూహ్య ఫలితం సాధించగలమనే విశ్వాసంతో మిథాలీ సేన ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ 2005 తర్వాత ప్రపంచకప్‌లో మరోసారి ఫైనల్ చేరినట్లవుతుంది. లీగ్ దశలో భారత్ 5 విజయాలు సాధించగా, ఆస్ట్రేలియా 6 గెలిచింది. ఇరు జట్ల మధ్య పోరులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తుది జట్ల వివరాలు భారత్: మిథాలీ రాజ్ (కెప్టెన్), స్మృతి మంధన, పూనమ్ రౌత్, హర్మన్‌ప్రీత్, వేద కృష్ణమూర్తి, దీప్తి శర్మ, శిఖా పాండే, సుష్మ వర్మ, జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్. ఆస్ట్రేలియా: మెగ్ లానింగ్ (కెప్టెన్), మూనీ, బోల్టన్, ఎలీస్ పెర్రీ, విలాని, బ్లాక్వెల్, హీలీ, ఆష్లీ గార్డ్నర్, జొనాసెన్, మెగాన్ షుట్, క్రిస్టన్ బీమ్స్ -
భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం
అణు ఒప్పందంపై ఇరు దేశాల సంతకాలు అణు విద్యుత్ రంగంలో యురేనియం కొరత తగ్గినట్లే రెండేళ్లలో ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు అందనున్న యురేనియం ప్యాకేజీ న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియాలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ శుక్రవారం కీలక పౌర అణు ఒప్పందా న్ని కుదుర్చుకున్నాయి. దీనిద్వారా విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న భారత్‌కు అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యురేనియంను ఆస్ట్రేలియా సరఫరా చేయనుంది. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ శుక్రవారం ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అణు ఒప్పందం సహా నాలుగు ఒప్పందాలపై ఇరుదేశాలూ సంతకాలు చేశాయి. రెండు దేశాల మధ్యా రక్షణ, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరువురు ప్రధానులూ నిర్ణయించారు. మూడో వంతు యురేనియం అక్కడే... ప్రపంచ వ్యాప్తంగా వెలికితీయగల యురేనియం వనరుల్లో మూడో వంతు ఒక్క ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఆ దేశం ఏటా 7,000 టన్నుల యురేనియంను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. అయితే భారత్‌పై యురేనియం ఎగుమతులు చేయటంపై ఆస్ట్రేలియా గతంలో నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని 2012లో తొలగించటంతో తాజాగా అణు ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులూ సంతకాలు చేశారు. అణు శక్తిని శాంతియుత రంగ అవసరాలకు వినియోగించటం లక్ష్యంగా ఈ ఒప్పందం ఖరారైంది. దీని ప్రకారం భారత్‌కు ఆస్ట్రేలియా సుదీర్ఘ కాలం పాటు యురేనియం సరఫరాతోపాటు, రేడియో ఐసోటోప్ల ఉత్పత్తి, అణు భద్రత, ఇతర రంగాల్లో సహకారం కూడా అందించనుంది. రెండేళ్లలో యురేనియం రాక... దేశంలోని అణు విత్యుత్ ప్లాంట్లలో సుమారు 4,680 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులో 2,840 మెగావాట్ల విద్యుత్ దేశీయంగా లభ్యమయే యురేనియంతో ఉత్పత్తి అవుతుండగా.. మిగతా 1,840 మెగావాట్ల విద్యుత్‌ను దిగుమతి చేసుకున్న యురేనియంతో ఉత్పత్తి చేస్తున్నారు. అయితే.. డిమాండ్‌కు తగ్గట్లు యురేనియం సరఫరా లేకపోవటంతో ఈ అణు రియాక్టర్ల నుంచి పూర్తి సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోతున్నారు. మరికొన్ని కొత్త అణు విద్యుత్ ప్లాంట్లు నిర్మాణ దిశలో ఉన్నాయి. ఆస్ట్రేలియాతో ఒప్పందం ఫలితంగా యురేనియం కొరత తగ్గిపోనుందని అణు రంగ నిపుణులు చెప్తున్నారు. ఒప్పందం ప్రకారం రెండేళ్లలో ఆస్ట్రేలియా నుంచి తొలి విడత యురేనియం భారత్‌కు అందుతుందని అధికార వర్గాలు తెలిపాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంలో భారత్‌కు తిరుగులేని చరిత్ర ఉందని, భారత్ ఆదర్శవంతమైన అంతర్జాతీయ దేశంగా కొనసాగుతోందని అబ్బాట్ ప్రశంసించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం రెండు రోజుల భారత పర్యటన నిమిత్తం గురువారం ముంబై చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్.. అక్కడ వ్యాపారవేత్తలు, భారత సీఈఓలతో సమావేశమై వాణిజ్య రంగంలో పరస్పర సహకారంపై చర్చించారు. రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలిశారు. ఈ సందర్భంగా.. రెండు దేశాల మధ్యా అణు ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కొత్త అధ్యాయానికి దారితీస్తాయని ప్రణబ్ హర్షం వ్యక్తంచేశారు. అనంతరం రాజ్‌ఘాట్, ఇండియాగేట్లను సందర్శించి మహాత్మాగాంధీ, అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత సాయంత్రం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీతో టోనీ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా.. అణు ఒప్పందంతో పాటు, సాంకేతిక వృత్తి విద్యా శిక్షణ (టీవీఈటీ), జలవనరుల నిర్వహణ, క్రీడా రంగాల్లోనూ మరో మూడు ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి. ఈ సమావేశానంతరం ఇరువురు ప్రధానులూ ఒక సంయుక్త ప్రకటన చేశారు. రక్షణ, భద్రత సహకారం బలోపేతం భారత్, ఆస్ట్రేలియా ఇరు దేశాల ప్రజలూ ఉగ్రవాద బాధితులేనని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన జాయింట్ వర్కింగ్ గ్రూప్ పనితీరును ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య రక్షణ, సముద్ర భద్రత తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని ఇరువురూ బలమైన ఆకాంక్ష వెలిబుచ్చారు. 2015లో ద్వైపాక్షిక నౌకాదళ విన్యాసాల ప్రారంభానికి జరుగుతున్న ఏర్పాట్లను ఇరువురూ ఆహ్వానించారు. గాలిపోలి వార్షికోత్సవానికి ఆహ్వానం వచ్చే ఏడాది జరగనున్న గాలపోలి శతవార్షికోత్సవానికి హాజరు కావాల్సిందిగా నరేంద్రమోడీని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల ప్రధానమంత్రుల తరఫున టోనీ ఆహ్వానించారు. ఆ అల్లర్లకు మోడీని తప్పుపట్టరాదు: టోనీ గుజరాత్లో 2002 నాటి అల్లర్లకు నాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోడీని తప్పుపట్టరాదని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ వ్యాఖ్యానించారు. ఆయనపై అనంతమైన దర్యాప్తులు జరిగాయని, అవన్నీ ఆయనను నిర్దోషిగా చెప్పాయని టోనీ పేర్కొన్నారు. హెడ్‌లైన్స్ టుడే వార్తా చానల్లో కరణ్‌థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకున్న మోడీ, అబాట్ ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్‌లు శుక్రవారం తమ భేటీ సందర్భంగా బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆస్ట్రేలియా ఉన్నితో చేసిన ‘నెహ్రూ జాకెట్’ను మోడీకి అబాట్ బహూకరించగా ప్రతిగా మోడీ... యోగాపై పుస్తకాన్ని అబాట్‌కు బహూకరించారు. కాగా, తమిళనాడులోని ఆలయాల నుంచి గతంలో చోరీకి గురైన విషయం తెలియక తమ దేశ కళా మందిరాలు కొనుగోలు చేసిన రెండు ప్రాచీన దేవతా విగ్రహాలను మోడీకి అబాట్ అప్పగించారు. ఇందుకుగానూ దేశ ప్రజల తరఫున మోడీ అబాట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 11-12వ శతాబ్దం నాటి నటరాజ కాంస్య విగ్రహంతోపాటు అలాగే 10వ శతాబ్దానికి చెందిన అర్ధనారీశ్వర విగ్రహాన్ని అబ్బాట్ మోడీకి అప్పగించారు.