Published
Thu, Jul 20 2017 9:07 PM
| Last Updated on Tue, Sep 5 2017 4:29 PM
సెంచరితో కదం తొక్కిన హర్మన్ ప్రీత్ ..
♦ కెరీర్‌లో మూడో సెంచరీ సాధించిన కౌర్
డెర్బీ: మహిళల ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో భారత బ్యాట్ ఉమెన్‌లో హర్మన్ ప్రీత్ అద్వితీయమై బ్యాటింగ్‌తో చెలరేగింది. హర్మన్ ప్రీత్ 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సులతో 171పరుగులు చేసి నౌటౌట్‌గా వన్డే కెరీర్‌లో అత్యుత్తమ స్కోరు నమోదు చేసింది. దీంతో కౌర్ మహిళల వన్డే క్రికెట్‌లో ఇన్నింగ్స్ అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాట్స్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది. తొలుత కెప్టెన్ మిథాలీతో ఆచితూచి ఆడిన కౌర్ తర్వాత చెలరేగి ఆడింది.
కేవలం 90 బంతుల్లో సెంచరీ పూర్తిచేసిన కౌర్ కెరీర్‌లో మూడో సెంచరీ సాధించింది. సెంచరీ అనంతరం ఆసీస్ బౌలర్లు కౌర్ ఓ ఆట ఆడుకుంది. బంతిని బౌండరీకి బాధడమే లక్ష్యంగా చెలరేగింది. ఆసీస్ బౌలర్ గార్డెనర్ వేసిన ఓ ఓవర్లలో కౌర్ రెండు సిక్సలు, రెండు ఫోర్లతో 23 పరుగులు రాబట్టింది. కౌర్ ఈ ఇన్నింగ్స్‌లో అలవోకగా 20 ఫోర్లు, 7 సిక్సులు కొట్టడం విశేషం. దీంతో భారత్ ఆసీస్‌కు 282 పరుగలు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.