ఆదిలోనే ఆసీస్‌కు కష్టాలు
డెర్బీ: మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళా బ్యాటింగ్ విభాగం అదరగొట్టగా.. మేం ఏమాత్రం తక్కువ కాదంటూ బౌలర్లు చెలరేగుతున్నారు. 282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 21 పరుగలకే మూడు వికెట్లు కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడింది. పాండే తన తొలి ఓవర్ రెండో బంతికే ఆసీస్ జట్టు ఓపెనర్ మూనీ(1)ని క్లీన్‌బౌల్డ్ చేసింది.
అనంతరం గోస్వామి కెప్టెన్ లాన్నింగ్(0)ను ఔట్ చేసింది. బోల్టన్ (14)ను దీప్తీ శర్మ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చింది. 12 ఓవర్లకు ఆసీస్ 3 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. క్రీజులో విలాని(20), పెర్రీ(17)లు పోరాడుతున్నారు.