దంచికొట్టిన మిథాలీ సేన..
దంచికొట్టిన మిథాలీ సేన..
Published Thu, Jul 20 2017 10:43 PM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM
♦ ఆసీస్‌కు భారీ లక్ష్యం
♦ సెంచరితో కదం తొక్కిన హర్మన్ ప్రీత్ ..
డెర్బీ: మహిళల ప్రపంచకప్ లో మిథాలీ సేన ఆస్ట్రేలియాకు 282 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్థేశించింది. భారత బ్యాట్ ఉమెన్‌లో హర్మన్ ప్రీత్ అద్వితీయమై బ్యాటింగ్‌తో భారత్ నిర్ణీత 42 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ (115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సులతో 171 నాటౌట్) కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో కౌర్ మహిళల వన్డే క్రికెట్‌లో ఇన్నింగ్స్ అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాట్స్ ఉమెన్‌గా గుర్తింపు పొందింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన మిథాలీసేనకు ఓపెనర్లు స్మృతి మంధన(6), పూనమ్ రౌత్(14)లు శుభారంబాన్ని అందించలేకపోయారు. దీంతో 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మిథాలీ, కౌర్ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. జట్టు స్కోరు 101 వద్ద మిథాలీ(36) బీమ్ప్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అవడంతో మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం హర్మన్ ప్రీత్ దీప్తిశర్మతో రెచ్చిపోయి ఆడటంతో 90 బంతుల్లోనే కెరీర్‌లో మూడో సెంచరీ సాధించింది. దూకుడుగా ఆడుతూ క్రీజులో హర్మన్‌ప్రీత్ ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. కౌర్ ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, ఏడు సిక్స్‌లు కొట్టడం విశేషం. ఆసీస్ బౌలర్ గార్డెనర్ బౌలింగ్‌లో కౌర్ రెండు సిక్సలు, రెండు ఫోర్లతో 23 పరుగులు రాబట్టింది. చివర్లో దీప్తీ శర్మ(25), వేదకృష్ణమూర్తి(16 నాటౌట్)లు దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. ఇక ఆసీస్ బౌలర్లలో విలాని, గార్డనర్, బీమ్స్, స్కట్‌లకు చెరో వికెట్ దక్కింది.
Advertisement
Advertisement