కాంటర్‌బరీ: ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలిచేందుకు అవసరమైన భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. బుధవారం జరిగిన ఈ డే–నైట్ మ్యాచ్‌లో మొదట భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది.
ఓపెనర్ షఫాలీ వర్మ (8) నిరాశపరచగా, స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (34 బంతుల్లో 26; 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద యస్తిక నిష్క్రమించడంతో క్రీజులోకి వచ్చిన హర్మన్ మొదట కుదురుగా ఆడింది. తర్వాత దూకుడు పెంచింది. ఇక ఆఖర్లో చుక్కలు చూపించింది. 64 బంతుల్లో ఫిఫ్టీ (4 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసుకున్న హర్మన్ వంద బంతుల్లో సెంచరీ (12 ఫోర్లు, 1 సిక్స్) సాధించింది.ఆమె వన్డే కెరీర్‌లో ఇది ఐదో శతకం. తర్వాత 11 బంతుల్లోనే 43 పరుగులు ధనాధన్‌గా చేసింది. 6 ఫోర్లు, 3 సిక్సర్ల రూపంలోనే 42 పరుగులు వచ్చాయి. హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచింది. పూజ వస్త్రకర్ (18) తక్కువ స్కోరే చేయగా, దీప్తి శర్మ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కెప్టెన్‌తో కలిసి అజేయంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment