womens team
-
సిరీస్ తేల్చే సమరం
అహ్మదాబాద్: ‘భారత జట్టు విజయం సాధించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది సిగ్గు పడాల్సిన విషయం’... ఆదివారం జరిగిన రెండో వన్డేపై న్యూజిలాండ్ మహిళల జట్టు కెపె్టన్ సోఫీ డివైన్ చేసిన వ్యాఖ్య ఇది. ప్రత్యర్థి సారథి కాస్త ఘాటుగానే చెప్పినా మన జట్టు బ్యాటింగ్ బలహీనతను అది చూపించింది. గత మ్యాచ్‌లో 260 పరుగుల లక్ష్య ఛేదనలో 18వ ఓవర్లోనే 77 పరుగులకు భారత టాప్–5 వెనుదిరగడంతోనే ఓటమి దాదాపుగా ఖాయమైంది. 9వ నంబర్ బ్యాటర్ రాధా యాదవ్ ఆదుకోకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. కీలకమైన చివరి పోరులోనైనా బ్యాటింగ్‌లో రాణిస్తే సొంతగడ్డపై సిరీస్ గెలుచుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత్, కివీస్ టీమ్‌లు తలపడనున్నాయి. తొలి వన్డేలో కూడా భారత్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతోనే నెగ్గింది. రెండు వన్డేల్లో కలిపి మన బ్యాటర్లు ఎవరూ కనీసం అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. చివరి మ్యాచ్‌లో నెగ్గాలంటే ముగ్గురు ప్రధాన బ్యాటర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగాల్సి ఉంది. ముఖ్యంగా స్మృతి సుదీర్ఘ కాలంగా వరుసగా విఫలమవుతూ తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ సిరీస్‌లో ఆమె 5, 0 స్కోర్లకే పరిమితమైంది. ఇదే సిరీస్‌తో అరంగేట్రం చేసిన తేజల్ను తప్పు పట్టలేం కానీ జెమీమా కూడా మిడిలార్డర్లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందరూ సమష్టిగా చెలరేగితేనే కివీస్‌పై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. మరోవైపు న్యూజిలాండ్ గత విజయం తర్వాత ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో బ్యాటర్లు మూడు అర్ధ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓపెనర్లు సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, హ్యాలిడే, మ్యాడీ గ్రీన్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక కెపె్టన్ సోఫీ డివైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు ఇటు సారథిగా కూడా ఆమె జట్టును సమర్థంగా నడిపిస్తోంది. సీనియర్ పేసర్ తహుహు ఆఫ్‌స్పిన్నర్ ఈడెన్ కార్సన్‌లు ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగల సమర్థులు. లాంటి స్థితిలో స్వదేశంలో సిరీస్ కోల్పోరాదంటే హర్మన్ బృందం రెట్టింపు శ్రమించాల్సి ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి, యస్తిక, జెమీమా, తేజల్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా/శ్రేయాంక పాటిల్. న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ప్లిమ్మర్, లారెన్ డౌన్, హ్యాలిడే, గ్రీన్, ఇసబెల్లా, జెస్ కెర్, తహుహు, కార్సన్, జొనాస్. -
హర్మన్‌ప్రీత్‌కు పరీక్ష!
అహ్మదాబాద్: ఇటీవల మహిళల టి20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టు మరో పరీక్షకు సిద్ధమైంది. తాజా టి20 ప్రపంచకప్‌లో విశ్వవిజేతగా నిలిచిన న్యూజిలాండ్ జట్టుతో నేటి నుంచి మూడు వన్డేల సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తలపడనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఐసీసీ ట్రోఫీ కోసం చకోర పక్షిలా చూస్తున్న భారత మహిళల జట్టుకు తాజా టి20 ప్రపంచకప్‌లో చుక్కెదురైంది. దీంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై వేటు పడటం ఖాయమే అని అంతా భావించినా... సెలక్షన్ కమిటీ మాత్రం హర్మన్‌పై నమ్మకముంచింది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు హర్మన్‌కే పగ్గాలు అప్పగించింది. మరి అందరికంటే అనుభవజు్ఞరాలైన హర్మన్‌ప్రీత్ జట్టును ఎలా నడిపిస్తుందో చూడాలి. 12వ తరగతి పరీక్షల కారణంగా రిచా ఘోష్‌ను ఈ సిరీస్‌కు ఎంపిక చేయకపోగా.. ఆశ శోభన గాయంతో జట్టుకు దూరమైంది. దీంతో నలుగురు యువ ఆటగాళ్లు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత ‘ఎ’ జట్టు ప్లేయర్లు తేజల్, సయాలీ, ప్రియా మిశ్రాతో పాటు డబ్ల్యూపీఎల్‌లో రాణించిన సైమా ఠాకూర్ మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. టి20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన 35 ఏళ్ల హర్మన్‌పై ఒత్తిడి అధికంగా ఉండగా... స్మృతి మంధాన, షఫాలీ వర్మ మెరుగైన ఆరంభాలు ఇవ్వాల్సిన అవసరముంది. మిడిలార్డర్లో హర్మన్‌తో పాటు జెమీమా, హేమలత, దీప్తి కీలకం కానున్నారు. మరోవైపు సోఫీ డివైన్ సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచి ఉత్సాహంగా ఉన్న న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. 20 భారత్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 20 వన్డేలు జరిగాయి. 10 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గగా... 9 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. 9 తొమ్మిది సంవత్సరాల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. చివరిసారి 2015లో జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు 3–2తో సొంతం చేసుకుంది.54 ఓవరాల్‌గా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 54 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. 20 మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా... 33 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. -
భారత చెస్ జట్లకు వరుసగా ఏడో విజయం
బుడాపెస్ట్: చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా ఏడో విజయం సాధించి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి. జార్జియా జట్టుతో బుధవారం జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 3–1తో గెలిచింది. వైశాలి 62 ఎత్తుల్లో లెలా జవాఖి‹Ùవిలిపై, వంతిక 46 ఎత్తుల్లో బెలా ఖొటె నాష్‌విలిపై నెగ్గారు. నానా జాగ్‌నిద్జెతో గేమ్‌ను హారిక 59 ఎత్తుల్లో; నినో బత్సియా‹Ùవిలితో గేమ్ ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. తానియా కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. భారత పురుషుల జట్టు 2.5–1.5తో చైనాపై గెలిచింది. గుకేశ్ 80 ఎత్తుల్లో యి వెను ఓడించగా... ఇరిగేశి అర్జున్–బు జియాంగ్జి గేమ్ 26 ఎత్తుల్లో, ప్రజ్ఞానంద–యు యాంగీ గేమ్ 17 ఎత్తుల్లో, హరికృష్ణ–యు వాంగ్ గేమ్ 56 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. విదిత్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. -
భారత్ ‘ఎ’ 184 ఆలౌట్
గోల్డ్‌కోస్ట్: మరోసారి బౌలర్లు రాణించడంతో... ఆ్రస్టేలియా ‘ఎ’ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక అనధికారిక టెస్టుపై భారత ‘ఎ’ మహిళల జట్టు పట్టు కోల్పోలేదు. 28 పరుగుల స్వల్ప ఆధిక్యం పొందిన ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 60 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ్రస్టేలియా ‘ఎ’ ఓవరాల్ ఆధిక్యం 192 పరుగులకు చేరుకుంది. మ్యాడీ డార్క్ (54 బ్యాటింగ్; 2 ఫోర్లు), లిల్లీ మిల్స్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన భారత ‘ఎ’ జట్టు కెప్టెన్, ఆఫ్ స్పిన్నర్ మిన్ను మణి రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆకట్టుకుంది. మిన్ను 20 ఓవర్లలో 6 మెయిడెన్లు వేసి 47 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ప్రియా మిశ్రా, సయాలీలకు ఒక్కో వికెట్ దక్కింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 100/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత ‘ఎ’ జట్టు మరో 84 పరుగులు జోడించి మిగతా 8 వికెట్లను కోల్పోయింది. శ్వేత సెహ్రావత్ (40; 3 ఫోర్లు), తేజల్ హసాబ్నిస్ (32; 2 ఫోర్లు), సయాలీ (21; 2 ఫోర్లు) రాణించారు. -
నలుగురికి తొలిసారి చోటు
ముంబై: ఈనెల 28 నుంచి ముంబైలో ఆ్రస్టేలియా మహిళల జట్టుతో జరిగే మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత జట్లను ప్రకటించారు. ఎడంచేతి వాటం స్పిన్నర్లు సైకా ఇషాక్ (బెంగాల్), మన్నత్ కశ్యప్ (పంజాబ్), ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ (కర్ణాటక), మీడియం పేస్ బౌలర్ టిటాస్ సాధు (బెంగాల్)లకు తొలిసారి భారత వన్డే జట్టులో చోటు లభించింది. ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన టి20 సిరీస్‌లో తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపికైన 21 ఏళ్ల శ్రేయాంక, 28 ఏళ్ల సైకా ఇషాక్ మూడు మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్ల చొప్పున పడగొట్టి ఆకట్టుకున్నారు. మన్నత్, టిటాస్ సాధు ఈ ఏడాది అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించిన భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఆ్రస్టేలియాతో మూడు వన్డేలు డిసెంబర్ 28, 30, జనవరి 2న వాంఖెడె స్టేడియంలో... మూడు టి20 మ్యాచ్‌లు జనవరి 5, 7, 9 తేదీల్లో నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతాయి. ఈ రెండు సిరీస్‌లలో భారత జట్లకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యవహరిస్తారు. వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన 16 మంది బృందంలో రెండు మార్పులతో టి20 జట్టును ఎంపిక చేశారు. వన్డే జట్టులో ఉన్న స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్ స్థానాల్లో టి20 జట్టులో కనిక అహూజా, మిన్ను మణి వచ్చారు. భారత మహిళల వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యస్తిక, రిచా ఘోష్, అమన్‌జోత్ కౌర్, శ్రేయాంక పాటిల్, మన్నత్ కశ్యప్, సైకా ఇషాక్, రేణుక సింగ్, టిటాస్ సాధు, పూజ వస్త్రకర్, స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్. -
భారత మహిళలకు చేజారిన విజయం
మిర్పూర్: బంగ్లాదేశ్ మహిళలతో చివరి వన్డేలో భారత మహిళల జట్టు విజయలక్ష్యం 226 పరుగులు...41.1 ఓవర్లలో స్కోరు 191/4...చేతిలో 6 వికెట్లతో మరో 53 బంతుల్లో 35 పరుగులే కావాలి. కానీ ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్లీన్ డియోల్ (108 బంతుల్లో 77; 9 ఫోర్లు), దీప్తి శర్మ (1) ఒకే ఓవర్లో రనౌటయ్యారు. 34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయిన భారత్ స్కోరును సమం మాత్రమే చేయగలిగింది. చివర్లో 19 బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన స్థితిలో కూడా లక్ష్యాన్ని అందుకోలేక మూడు బంతులు మిగిలి ఉండగానే ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 33 నాటౌట్) మరో ఎండ్‌లో ఉండగా...చివరి ఓవర్ మూడో బంతికి మేఘనా సింగ్‌ను మారుఫా అవుట్ చేసింది. దాంతో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. భారత్ 49.3 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌట్ కాగా... అంతకు ముందు బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులే చేసింది. అప్పటికే నిర్ణీత సమయం దాటిపోవడంతో నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్ నిర్వహించలేదు. తొలి రెండు వన్డేల్లో ఇరు జట్లు ఒక్కోటి గెలవడంతో సిరీస్ 1–1తో ‘డ్రా’ అయింది. భారత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ స్మృతి మంధాన (85 బంతుల్లో 59; 5 ఫోర్లు) రాణించింది. స్మృతి, హర్లీన్ మూడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (14; 2 ఫోర్లు) నిరాశపర్చడంతో పాటు స్వల్ప విరామంలో ఓవర్‌కు రెండు చొప్పున నాలుగు వికెట్లు కోల్పోవడం భారత్ గెలుపురాతను మార్చింది. అంతకు ముందు ఫర్జానా హక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు), షమీమా సుల్తానా (78 బంతుల్లో 52; 5 ఫోర్లు) బంగ్లా స్కోరులో కీలక పాత్ర పోషించారు. బంగ్లాదేశ్ తరఫున మహిళల వన్డేల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా ఫర్జానా నిలిచింది. చివరి వన్డేలో అంపైరింగ్ ప్రమాణాలపై భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇన్నింగ్స్ 34వ ఓవర్లో నాహిదా బౌలింగ్‌లో అవుటయ్యాక హర్మన్ తన బ్యాట్‌తో స్టంప్స్‌ను బలంగా కొట్టి అంపైర్‌తో వాగ్వాదానికి దిగింది. ‘ఈ మ్యాచ్‌తో మేం చాలా నేర్చుకున్నాం. అంపైరింగ్ ప్రమాణాలను కూడా చూశాం. చాలా ఘోరంగా ఉంది. మేం మళ్లీ బంగ్లాదేశ్‌కు వచ్చినప్పుడు దాని కోసం కూడా సిద్ధమై రావాలేమో’ అని హర్మన్ వ్యాఖ్యానించింది. -
Ind vs Eng 2nd ODI: హర్మన్ హరికేన్
కాంటర్బరీ: ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలిచేందుకు అవసరమైన భారీ స్కోరును ప్రత్యర్థి ముందుంచింది. బుధవారం జరిగిన ఈ డే–నైట్ మ్యాచ్‌లో మొదట భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (8) నిరాశపరచగా, స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (34 బంతుల్లో 26; 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద యస్తిక నిష్క్రమించడంతో క్రీజులోకి వచ్చిన హర్మన్ మొదట కుదురుగా ఆడింది. తర్వాత దూకుడు పెంచింది. ఇక ఆఖర్లో చుక్కలు చూపించింది. 64 బంతుల్లో ఫిఫ్టీ (4 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసుకున్న హర్మన్ వంద బంతుల్లో సెంచరీ (12 ఫోర్లు, 1 సిక్స్) సాధించింది.ఆమె వన్డే కెరీర్లో ఇది ఐదో శతకం. తర్వాత 11 బంతుల్లోనే 43 పరుగులు ధనాధన్‌గా చేసింది. 6 ఫోర్లు, 3 సిక్సర్ల రూపంలోనే 42 పరుగులు వచ్చాయి. హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచింది. పూజ వస్త్రకర్ (18) తక్కువ స్కోరే చేయగా, దీప్తి శర్మ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కెప్టెన్‌తో కలిసి అజేయంగా నిలిచింది. -
డబుల్ ధమాకా
సాక్షి, చెన్నై: భారత్‌లో తొలిసారి నిర్వహించిన ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. సోమవారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఓపెన్ విభాగంలో దొమ్మరాజు గుకేశ్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, ఆధిబన్, రౌనక్ సాధ్వానిలతో కూడిన భారత ‘బి’ జట్టు... మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణిలతో కూడిన భారత ‘ఎ’ జట్టు కాంస్య పతకాలు సాధించాయి. ► నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో ఓపెన్ విభాగంలో భారత ‘బి’ జట్టు 8 విజయాలు, 2 ‘డ్రా’లు, ఒక ఓటమితో మొత్తం 18 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్, అర్మేనియా 19 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఉజ్బెకిస్తాన్ చాంపియన్‌గా అవతరించింది. అర్మేనియా రన్నరప్‌గా నిలిచింది. ► పెంటేల హరికృష్ణ, ఇరిగేశి అర్జున్, విదిత్, నారాయణన్, కృష్ణన్ శశికిరణ్‌లతో కూడిన భారత ‘ఎ’ జట్టు 17 పాయింట్లతో నాలుగో స్థానంలో... సూర్యశేఖర గంగూలీ, సేతురామన్, అభిజిత్ గుప్తా, మురళీ కార్తికేయ, అభిమన్యులతో కూడిన భారత ‘సి’ జట్టు 14 పాయింట్లతో 31వ స్థానంలో నిలిచాయి. ► చివరిదైన 11వ రౌండ్లో భారత్ ‘బి’ 3–1తో జర్మనీని ఓడించింది. గుకేశ్, ప్రజ్ఞానంద తమ గే మ్‌లను ‘డ్రా’ చేసుకున్నారు. నిహాల్, రౌనక్ తమ ప్రత్యర్థులపై గెలిచారు. అమెరికాతో మ్యాచ్ ను భారత్ ‘ఎ’ 2–2తో... కజకిస్తాన్‌తో మ్యాచ్‌ను భారత్ ‘సి’ 2–2తో ‘డ్రా’ చేసుకున్నాయి. ఓపెన్ విభాగంలో భారత ‘బి’ జట్టు సభ్యులు ప్రజ్ఞానంద, ఆధిబన్, రౌనక్, నిహాల్ సరీన్, గుకేశ్ అమెరికా చేతిలో ఓడి... మహిళల విభాగంలో భారత ‘ఎ’ జట్టు చాంపియన్‌గా నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. సోమ వారం జరిగిన చివరిదైన 11వ రౌండ్లో భారత ‘ఎ’ జట్టు 1–3తో అమెరికా చేతిలో ఓడిపోయింది. ఒకవేళ భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ఉంటే చాంపియన్ అయ్యేది. భారత్, అమెరికా, కజకిస్తాన్ 17 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా భారత్‌కు కాంస్య పతకం ఖరారైంది. అమెరికా నాలుగో స్థానంతో, కజకిస్తాన్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాయి. 18 పాయింట్లతో ఉక్రెయిన్, జార్జియా సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువగా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ఉక్రెయిన్‌కు టైటిల్ ఖాయమైంది. జార్జియా రన్నరప్‌గా నిలిచింది. వంతిక అగర్వాల్, పద్మిని రౌత్, సౌమ్య స్వామినాథన్, మేరీఆన్ గోమ్స్, దివ్య దేశ్‌ముఖ్‌లతో కూడిన భారత ‘బి’ జట్టు 16 పాయింట్లతో 8వ స్థానంలో... ఇషా కరవాడే, నందిద, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారి ణులు సాహితి వర్షిణి, ప్రత్యూష, విశ్వ వాస్నావాలాలతో కూడిన భారత ‘సి’ జట్టు 15 పాయింట్లతో 17వ ర్యాంక్‌లో నిలిచాయి. ► క్లాసికల్ విభాగంలో ముఖాముఖిగా జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో ఒకేసారి భారత జట్టు ఓపెన్, మహిళల విభాగంలో పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. ఓపెన్ విభాగంలో భారత్‌కిది రెండో పతకం. 2014లో నార్వేలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో పరిమార్జన్ నేగి, సేతురామన్, కృష్ణన్ శశికిరణ్, ఆధిబన్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ లలిత్ బాబులతో కూడిన భారత జట్టు ఓపెన్ విభాగంలో కాంస్య పతకం గెలిచింది. చెస్ ఒలింపియాడ్‌లో రెండు పతకాలు నెగ్గిన తొలి భార తీయ ప్లేయర్‌గా ఆధిబన్ నిలిచాడు. కరోనా కారణంగా 2020లో ఆన్లైన్ లో నిర్వహించిన ఒలింపియాడ్‌లో భారత్, రష్యా సంయుక్త విజేతలుగా నిలువగా... 2021లో ఆన్లైన్లోనే జరిగిన ఒలింపియాడ్‌లో భారత్ కాంస్యం సాధించింది. మనోళ్లకు ఏడు పతకాలు టీమ్ విభాగంలో కనబరిచిన ప్రదర్శన ఆధారంగా వ్యక్తిగత విభాగం పతకాలను (కనీసం 8 గేమ్‌లు ఆడాలి) ఖరారు చేయగా... భారత ప్లేయర్లకు ఏడు పతకాలు లభించాయి. బోర్డు–1పై 11 గేమ్‌లు ఆడిన తమిళనాడు కుర్రాడు గుకేశ్ 9 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని... బోర్డు–2పై 10 గేమ్‌లు ఆడిన నిహాల్ సరీన్ 7.5 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నారు. బోర్డు–3పై 11 గేమ్‌లు ఆడిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ 8.5 పాయింట్లతో రజతం... బోర్డు–3పైనే 9 గేమ్‌లు ఆడిన తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 6.5 పాయింట్లతో కాంస్యం గెల్చుకున్నారు. మహిళల విభాగంలో బోర్డు–3పై 11 గేమ్‌లు ఆడిన వైశాలి 7.5 పాయింట్లతో కాంస్యం, బోర్డు–4పై 11 గేమ్‌లు ఆడిన తానియా 8 పాయింట్లతో కాంస్యం... బోర్డు–5పై 9 గేమ్‌లు ఆడిన దివ్య 7 పాయింట్లతో కాంస్యం సొంతం చేసుకున్నారు. -
Assam Floods 2022: స్త్రీ శక్తి: సలాం... రైఫిల్ ఉమెన్
అస్సాంలోని కొన్ని జిల్లాలు వరదల బారిన పడి చిగురుటాకులా వణికిపోయాయి. ‘ఎప్పుడైనా, ఎక్కడైనా’ అన్నట్లుగా ఉంది మృత్యువు రాకడ. అలాంటి సమయంలో ‘రైఫిల్ ఉమెన్’ రంగంలోకి దిగింది. ఎంతోమందిని రక్షించింది... చిరునవ్వుతో పలకరించిన నేస్తంలా మురిపించిన చినుకులు, సమయం గడిచేకొద్దీ మృత్యుపాశాలుగా మారుతున్నాయి. కుండపోత వర్షం. కపిలి, బేకి, బరక్, ఖుషి నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. అస్సాంలో ఎన్నో జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యంగా కచర్ జిల్లా వరదల దెబ్బతో అల్లకల్లోలమైంది. ఆ కల్లోలంలో ‘బతికి ఉంటే బలుసాకు తిని బతకవచ్చు’ అనే బతుకు ఆశ తప్ప‘మన గురించి కాదు ఇతరుల గురించి ఆలోచించాలి’ అనే ఆలోచన రాని సమయం అది. అలాంటి కఠిన సమయంలో ‘మేము ఉన్నాం’ అంటూ ముందుకు వచ్చారు వారు. వాగు దాటి అవతలి ప్రాంతానికి వెళదామని ప్రయత్నించి ఒకాయన వరదల్లో పడి కొట్టుకుపోతున్నాడు. ఎక్కడో ఒకచోట విరిగిపడిన కొమ్మలు, చెట్ల మధ్య ఇరుక్కుపోయాడు. వరద ఎక్కువైతే, ఆలస్యం అయితే అతని చిరునామా కూడా తెలిసేది కాదు. విషయం తెలిసిన మహిళల బృందం రంగంలోకి దిగింది. అతడిని రక్షించింది. ఒక వృద్ధురాలిని వరద చుట్టుముట్టింది. దాని నుంచి బయటపడే శక్తి ఆమెకు లేదు. ఆ వృద్ధురాలిని పట్టించుకోకుండా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈలోపు అక్కడికి పరుగెత్తుకు వచ్చిన ఒక యువతి ఆ వృద్ధురాలిని రెండు చేతులతో ఎత్తుకొని సురక్షిత ప్రాంతానికి చేర్చింది. కొన్ని ఇండ్లను పూర్తిగా వరద నీళ్లు చుట్టుముట్టాయి. బయటికి రాలేని పరిస్థితి. అలా అని ఇంట్లో ఉండలేని పరిస్థితి. అవి పాత ఇండ్లు. వర్షంతో గోడలు నానిపోయి ఉన్నాయి. ఏ నిమిషంలో ఇండ్లు కూలిపోతాయో తెలియదు. అలాంటి ఇండ్లలో నుంచి వృద్ధులు మొదలు పసిపిల్లల వరకు బయటికి తీసుకువచ్చి వారి ప్రాణాలు రక్షించారు వారు. ‘రెండు చేతులెత్తి మొక్కడం తప్ప వారి రుణం ఎలా తీర్చుకోగలం’ అని కళ్లనీళ్లపర్యంతం అయింది ఒక గృహిణి. ఇంతకీ వారు ఎవరు? ‘రైఫిల్ ఉమెన్’ బృందాలు. ‘రైఫిల్ ఉమెన్’ బృందాలకు అస్సాంలో మంచిపేరు ఉంది. అస్సాం రైఫిల్స్‌లో భాగమైన రైఫిల్ ఉమెన్ బృందాలు ప్రాణాలను పణంగా పెట్టి సాహసాలు, సహాయ కార్యక్రమాలు చేయడంలో పేరు తెచ్చుకున్నాయి. ‘ఆ వృద్ధురాలిని రక్షించిన తరువాత ఆమె కళ్లలో కనిపించిన కృతజ్ఞతాభావాన్ని ఎప్పుడూ మరచిపోలేను. నిండు మనసుతో నన్ను ఆశీర్వదించింది. రైఫిల్ ఉమెన్ బృందంలో పనిచేస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాను’ అంటుంది 22 సంవత్సరాల మంతిదాస్. అస్సాంలోని దుర్బీ ప్రాంతానికి చెందిన మంతిదాస్ సైన్యంలో చేరడం వారి ఇంట్లో వాళ్లకు బొత్తిగా ఇష్టం లేదు. ‘శిక్షణ సమయంలో చాలా కష్టంగా అనిపించింది. రోజూ ఉదయం 22 కేజీల బరువు పట్టుకుని 25 కిలోమీటర్ల దూరం పరుగెత్తాల్సి వచ్చేది. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉండేవి. ఒకానొక సమయంలో అయితే ఇక నావల్ల కాదేమో అనుకున్నాను. కాని ఇప్పుడు ఆలోచిస్తే ఆ శిక్షణలోని గొప్పదనం ఏమిటో తెలుస్తుంది. ఆ శిక్షణ వల్లే సహాయకార్యక్రమాల్లో చురుగ్గా, ధైర్యంగా పాల్గోగలిగాను’ అంటుంది మంతిదాస్. ‘తమ పిల్లలను సైన్యంలోకి పంపడానికి తల్లిదండ్రులు భయపడుతుంటారు. మా తల్లిదండ్రులు మాత్రం నన్ను బాగా ప్రోత్సహించారు. ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని. సహాయకార్యక్రమాల్లో మేము పాల్గొన్న ఫోటోలను పేపర్లో చూసి మా తల్లిదండ్రులు ఎంతో గర్వపడ్డారు’ అంటుంది యతిర్. మంతిదాస్, యతిర్‌లు మాత్రమే కాదు ‘రైఫిల్ వుమెన్’ బృందాలలోని ఎంతోమంది మహిళా సైనికులు అసాధారణమైన సాహసాలు ప్రదర్శించారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నారు. జనం చేత నీరాజనాలు అందుకున్నారు. -
విజేత రైల్వేస్
సూరత్: దేశవాళీ మహిళల జాతీయ సీనియర్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఇండియన్ రైల్వేస్ జట్టు మరోసారి సత్తా చాటుకుంది. భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన సారథ్యంలోని మహారాష్ట్ర జట్టుతో బుధవారం జరిగిన ఫైనల్లో స్నేహ్ రాణా కెప్టెన్సీలోని ఇండియన్ రైల్వేస్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రైల్వేస్ జట్టు ఈ టైటిల్‌ను సాధించడం ఇది పదోసారి కావడం విశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మహారాష్ట్ర నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 56 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 84 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచింది. రైల్వేస్ బౌలర్ స్వాగతిక 33 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది. అనంతరం రైల్వేస్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయం సాధించింది. రైల్వేస్‌కు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సబ్బినేని మేఘన మరోసారి అదరగొట్టింది. ఓపెనర్ మేఘన 32 బంతుల్లో 9 ఫోర్లతో 52 పరుగులు... మరో బ్యాటర్ హేమలత 41 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 పరుగులు సాధించి రైల్వేస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. రైల్వేస్‌కు ఆడుతున్న ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అంజలి శర్వాణి 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. -
భారత్‌కు మూడో స్థానం
అంటాల్యా (టర్కీ): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ మూడు జట్లపై (ఇండోనేసియా, న్యూజిలాండ్, కొరియా) గెలిచి, రెండు జట్ల (చైనా, జపాన్) చేతిలో ఓడిపోయింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన చైనా, జపాన్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత పొం దాయి. కొరియాతో జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్ తొలి రెండు సింగిల్స్‌లో నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. తొలి సింగిల్స్‌లో రియా భాటియా 6–3, 2–6, 6–3తో నా రి కిమ్‌పై నెగ్గగా... రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 6–2, 6–3తో దాబిన్ కిమ్ ను ఓడించి టీమిండియాకు విజయాన్ని అందించింది. -
కాంస్య పతక పోరులో భారత్‌కు నిరాశ
పోష్‌స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో రెండోసారి కాంస్య పతకం సాధించాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. ఇంగ్లండ్‌తో మంగళవారం జరిగిన కాంస్య పతక పోరులో భారత్ ‘షూటౌట్’లో 0–3తో ఓడిపోయింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున వరుసగా షర్మిలా దేవి, కెప్టెన్ సలీమా తెతె, సంగీత కుమారి విఫలమవ్వగా... ఇంగ్లండ్ తరఫున కేటీ కర్టిస్, స్వయిన్, మ్యాడీ ఆక్స్ఫర్డ్ సఫలమయ్యారు. ఫలితం తేలిపోవడంతో మరో రెండు షాట్లను తీసుకోలేదు. అంతకుముందు భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ (21వ, 47వ ని.లో) రెండు గోల్స్ చేయగా... ఇంగ్లండ్ జట్టుకు మిలీ గిజిలో (18వ ని.లో), క్లాడియా స్వయిన్ (58వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ ముగియడానికి రెండు నిమిషాల వరకు భారత్ 2–1తో ఆధిక్యంలో ఉన్నా చివర్లో తడబడి ఇంగ్లండ్‌కు స్కోరును సమం చేసే అవకాశమిచ్చింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 2013లో భారత్ చేతిలో కాంస్య పతక పోరులో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకున్నట్లయింది. 2013లో భారత్ ‘షూటౌట్’లో ఇంగ్లండ్‌ను ఓడించి కాంస్య పతకం గెలిచింది. ఈసారి మాత్రం భారత్ ఆ ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. జర్మనీతో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్ 3–1తో గెలిచి నాలుగో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. -
29 ఏళ్ల తర్వాత జిమ్నాస్టిక్స్‌లో స్వర్ణం సాధించారు
టోక్యో: ఒలింపిక్స్‌లో పోటీల నాలుగో రోజు రష్యన్ల పాలిట మరుపురాని రోజుగా మిగిలిపోయింది. విశ్వక్రీడల స్విమ్మింగ్‌లో ఎదురులేని అమెరికా స్విమ్మర్లకు చెక్ పెట్టిన రష్యన్లు... జిమ్నాస్టిక్స్‌లో అమెరికాకు షాక్ ఇచ్చారు. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో మంగళవారం మహిళల టీమ్ విభాగం పతకాల పోటీ జరిగింది. ఇందులో రష్యా మెరుపు విన్యాసాలతో బంగారు పతకం కొల్లగొట్టింది. 1992లో సోవి యట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్‌లో రష్యా పసిడి నెగ్గడం ఇదే తొలిసారి. అమెరికా గ్రేటెస్ట్ జిమ్నాస్ట్, ఒలింపిక్ చాంపియన్ సిమోన్ బైల్స్ పోటీల మధ్యలోనే తప్పుకోవడం జట్టుకు ప్రతికూలించింది. తద్వారా టీమ్ విభాగంలో వరుసగా మూడో ఒలింపిక్ స్వర్ణం సాధించాలనుకున్న అమెరికా ఆశలు ఆవిరయ్యాయి. బైల్స్ ఒక్క వాల్ట్‌లోనే పోటీ పడింది. తదుపరి అన్ఈవెన్ బార్స్, బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఈవెంట్లలో పోటీ పడకుండా తప్పుకుంది. మరోవైపు అకయిమోవా, లిస్టునోవా, మెలి్నకొవా, వురజొవాతో కూడిన రష్యా బృందం 169 స్కోరుతో స్వర్ణం గెలిచింది. సిమోన్, చిలెస్, సునిసా లీ, గ్రేస్‌లతో కూడిన అమెరికా 166 స్కోరుతో రజతం దక్కించుకుంది. 164 పాయింట్లు సాధిం చిన బ్రిటన్ కాంస్యం నెగ్గింది. 1928 తర్వాత టీమ్ విభాగంలో బ్రిటన్‌కు పతకం రావడం విశేషం. -
ఎదురులేని ఆసీస్ మహిళల స్విమ్మింగ్ జట్టు
టోక్యో: ఈత కొలనులో ఆస్ట్రేలియా మహిళల జట్టు అదరగొట్టింది. ఆదివారం జరిగిన మహిళల 4x100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే రేసులో బ్రోంటి క్యాంప్‌బెల్, మెగ్ హ్యారిస్, ఎమ్మా మెకియోన్, కేట్ క్యాంప్బెల్లతో కూడిన ఆస్ట్రేలియా జట్టు కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో వరుసగా మూడో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఆసీస్ జట్టు 3 నిమిషాల 29.69 సెకన్లలో రేసును ముగించి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో 3ని:30.05 సెకన్లలో ఆస్ట్రేలియా జట్టే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. -
హాకీలో ఘోరంగా...
ఓ రోజు ముందు మహిళల జట్టు కనబరిచిన పేలవమైన ప్రదర్శనను మరుసటి రోజు పురుషుల జట్టూ మన కళ్లముందుంచింది. పూల్ ‘ఎ’లో ఆదివారం జరిగిన రెండో లీగ్‌లో భారత జట్టు 1–7తో ప్రపంచ నంబర్‌వన్ ఆస్ట్రేలియా చేతిలో పరాభవం చవిచూసింది. మన్‌ప్రీత్ బృందం అన్ని రంగాల్లో విఫలమైంది. డిఫెండర్లు ప్రత్యర్థి జోరును అడ్డుకోలేకపోయారు. మన మిడ్‌ఫీల్డర్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌ను ఛేదించలేకపోయారు. భారత్ తరఫున ఏకైక గోల్‌ను దిల్‌ప్రీత్ సింగ్ (34వ ని.లో) చేశాడు. ఆసీస్ శిబిరంలో బ్లేక్ గోవర్స్ (40వ, 42వ ని.) రెండు గోల్స్ చేయగా, డానియెల్ (10వ ని.), హేవర్డ్ (21వ ని.), అండ్రూ ఫ్లిన్ (23వ ని.), బెల్జ్ (26వ ని.), టిమ్ బ్రాండ్ (51వ ని.) తలా ఒక గోల్ చేశారు. -
పురుషుల హాకీ జట్టు శుభారంభం
టోక్యో: ఒలింపిక్స్ హాకీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల జట్టు శుభారంభం చేయగా... మహిళల జట్టు చిత్తుగా ఓడింది. పూల్ ‘ఎ’లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 3–2తో గెలుపొందింది. హర్మన్‌ప్రీత్ (26వ, 33వ ని.లో) రెండు గోల్స్ సాధించగా, రూపిందర్ పాల్ సింగ్ (10వ ని.లో) ఒక గోల్ చేశాడు. సీనియర్ గోల్‌కీపర్ శ్రీజేశ్ గోల్‌పోస్ట్ వద్ద ప్రత్యర్థి గోల్స్‌ను చాకచక్యంగా ఆడ్డుకోవడంతో ప్రపంచ నాలుగో ర్యాంకర్ భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టులో కేన్ రసెల్(6వ ని.), జెనెస్(43వ ని.) చెరో గోల్ చేశారు. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. మరోవైపు మహిళల గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ప్రపంచ నంబర్‌వన్ నెదర్లాండ్స్ చేతిలో 1–5 గోల్స్ తేడాతో ఓడింది. అమ్మాయిల జట్టు అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచారు. డిఫెండర్లు చేతులెత్తేయగా... అలసత్వం జట్టును నిండా ముంచేసింది. నెదర్లాండ్స్ జట్టులో ఫెలిస్ అల్బర్స్ (6వ, 43వ ని.) రెండు గోల్స్ చేయగా, గెఫిన్ (33వ ని.), ఫ్రెడెరిక్ మట్ల (45వ ని.), జాక్వెలిన్ వాన్ (52వ ని.) తలా ఒక గోల్ సాధించారు. భారత్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను కెప్టెన్ రాణి రాంపాల్ పదో నిమిషంలో సాధించింది. 26న జరిగే తదుపరి మ్యాచ్‌లో అమ్మాయిల జట్టు జర్మనీతో ఆడుతుంది. -
మహిళలే అధిగమించారు
మౌంట్ మాంగనుయ్: మహిళలు ఆకాశంలో సగమే కాదు... రికార్డుల్లోనూ ఘనమని చేతల్లో చాటారు. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పేరిట ఉన్న వరుస వన్డే విజయాల రికార్డును ఆ దేశ మహిళల క్రికెట్ జట్టు అధిగమించింది. న్యూజి లాండ్ పర్యటనలో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో మెగ్ లానింగ్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా మహిళల జట్టు 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా వరుసగా 22 వన్డేల్లో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. దీంతో 2003లో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు నెలకొల్పిన 21 వరుస విజయాల రికార్డు తెరమరుగైంది. ఆస్ట్రేలియా మహిళల జట్టు జైత్రయాత్ర 2018 మార్చి 12న మొదలైంది. ఈ క్రమంలో ఆసీస్ 3–0తో భారత్‌పై... 3–0తో పాకిస్తాన్‌పై... 3–0తో న్యూజిలాండ్‌పై... 3–0తో ఇంగ్లండ్‌పై... 3–0తో వెస్టిండీస్‌పై... 3–0తో శ్రీలంకపై... 3–0తో న్యూజిలాండ్‌పై గెలిచి 2020 అక్టోబర్ 7న ఆస్ట్రేలియా పురుషుల జట్టు పేరిట ఉన్న 21 వరుస విజయాల రికార్డును సమం చేసింది. ఆదివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా మహిళల జట్టు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో మొదట న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 212 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ లారెన్ డాన్ (90; 8 ఫోర్లు) సెంచరీ చేజార్చుకుంది. కెప్టెన్ అమీ సాటెర్వైట్ (32; 3 ఫోర్లు), అమెలియా కెర్ (33; 4 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో మెగాన్ షుట్ 4, నికోలా క్యారీ 3 వికెట్లు తీశారు. తర్వాత ఆస్ట్రేలియా మహిళల జట్టు 38.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అలీసా హీలీ (65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), అష్లే గార్డ్నెర్ (53 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎలీస్ పెర్రీ (56 నాటౌట్; 6 ఫోర్లు) ధాటిగా ఆడారు. కివీస్ బౌలర్లలో జెస్ కెర్, హన్నా రోవ్, అమెలియా కెర్ తలా ఒక వికెట్ పడగొట్టారు. -
భారత్‌పై చివరి బంతికి గెలిచిన దక్షిణాఫ్రికా
లక్నో: ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేగిన రెండో టి20 మ్యాచ్‌లోనూ భారత అమ్మాయిల జట్టుకు ఓటమి తప్పలేదు. దీంతో వన్డే సిరీస్‌లాగే దక్షిణాఫ్రికా జట్టు ఇంకో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో టి20 సిరీస్‌నూ కైవసం చేసుకుంది. ఓపెనర్ లిజెల్ లీ (45 బంతుల్లో 70; 11 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ లౌరా వోల్వార్ట్ (39 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు) చెలరేగారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఓపెనర్ షఫాలీ వర్మ (31 బంతుల్లో 47; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రిచా ఘోష్ (26 బంతుల్లో 44; 8 ఫోర్లు) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 20 ఓవర్లలో 4 వికెట్లకు 159 పరుగులు చేసి గెలిచింది. దక్షిణాఫ్రికా గెలిచేందుకు ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి మొదటి నాలుగు బంతుల్లో మూడే పరుగులిచ్చింది. కానీ ఐదో బంతిని అరుంధతి నోబాల్‌గా వేయడం... దక్షిణాఫ్రికాకు 3 పరుగులు రావడంతో ఆ జట్టు విజయసమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారింది. ఐదో బంతికి 2 పరుగులు చేసిన వోల్వార్ట్ ఆఖరి బంతికి మిగిలున్న ఒక్క పరుగును కూడా సాధించి జట్టును గెలిపించింది. గాయం నుంచి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌లోనూ స్మృతి మంధాన సారథ్యం వహించింది. రేపు ఆఖరి టి20 మ్యాచ్ జరుగుతుంది. నిరాశ పరిచిన స్మృతి తప్పక గెలిచి నిలవాల్సిన ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన (7) మళ్లీ నిరాశపరిచింది. తొలి ఓవర్లో బౌండరీ బాదిన ఆమె ఎంతోసేపు నిలువలేదు. దీంతో 8 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన హర్లీన్ డియోల్‌తో కలిసి షఫాలీ ఇన్నింగ్స్‌ను నడిపించింది. నాలుగో ఓవర్లో షఫాలీ మూడు ఫోర్లు కొట్టింది. ఆరో ఓవర్లో బౌండరీతో పాటు లాంగాఫ్‌లో భారీ సిక్సర్ బాదింది. మరోవైపు డియోల్ కూడా అడపాదడపా ఫోర్లు కొట్టడంతో ఓవర్‌కు 7 పరుగుల చొప్పున రన్‌రేట్ నమోదైంది. పది ఓవర్లు ముగిసే సరికి భారత్ 79/1 స్కోరు చేసింది. మరుసటి ఓవర్లో డీప్ మిడ్‌వికెట్ మీదుగా మరో సిక్సర్ కొట్టిన షఫాలీ అదే ఓవర్లో పెవిలియన్ చేరింది. తర్వాత జోరు తగ్గిన భారత్‌కు హర్లీన్ (31; 4 ఫోర్లు) రూపంలో మరో దెబ్బ తగిలింది. రిచా ధనాధన్ ఈ దశలో క్రీజులోకి దిగిన రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిసింది. 14వ ఓవర్లో తన ఆటను బౌండరీలతో ప్రారంభించింది. ఆమె 3 ఫోర్లు, జెమిమా మరో బౌండరీ బాదడంతో లూస్ వేసిన ఆ ఓవర్లో ఏకంగా 18 పరుగులొచ్చాయి. ఇదే జోరును కొనసాగించడంతో స్కోరుబోర్డు జోరందుకుంది. ఓవర్‌కు ఒకటి, రెండు బౌండరీల చొప్పున ఆమె ధాటిగా ఆడింది. దీంతో భారత్ స్కోరు 150 పరుగులను అధిగమించింది. లిజెల్ మెరుపులు ఛేజింగ్‌లో రెండో ఓవర్లోనే ఓపెనర్ బాస్చ్ (2) వికెట్లు కోల్పోయిన సఫారీ జట్టును లిజెల్ లీ మెరుపు ఇన్నింగ్స్ తో నిలబెట్టింది. కెప్టెన్ సునే లూస్ (21 బంతుల్లో 20; 3 ఫోర్లు)తో రెండో వికెట్‌కు 58 పరుగులు జోడించింది. తర్వాత వోల్వార్ట్తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఈ క్రమంలోనే లిజెల్ 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కూడా ధాటిగా ఆడిన లిజెల్ చేయాల్సిన రన్‌రేట్‌ను దించేసింది. ఎట్టకేలకు ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రాధా యాదవ్ ఆమె సుదీర్ఘ ఇన్నింగ్స్‌కు తెరదించింది. లిజెల్ అవుటైనా చివరి వరకు వోల్వార్ట్ క్రీజులో నిలిచి దక్షిణాఫ్రికాను గెలిపించింది. -
గెలిస్తేనే... సిరీస్‌లో నిలుస్తాం
లక్నో: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లో వెనుకబడిన భారత మహిళల జట్టు కఠిన సవాల్ ముందు నిలబడింది. ఆదివారం జరిగే నాలుగో వన్డేలో తప్పక గెలవాల్సిన పరిస్థితిలో మిథాలీ సేన నిలిచింది. లేదంటే ఈ మ్యాచ్ ఓడితే ఐదు వన్డేల సిరీస్‌ను ఆఖరి వన్డేకు ముందే ప్రత్యర్థి జట్టుకు సమర్పించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 2–1తో ముందంజలో ఉన్న దక్షిణాఫ్రికా మహిళలు... సిరీసే లక్ష్యంగా నాలుగో వన్డే బరిలోకి దిగుతున్నారు. మరోవైపు తీవ్ర ఒత్తిడిలో ఉన్న మిథాలీ జట్టు సర్వశక్తులు ఒడ్డి అయినా సిరీస్‌లో సజీవంగా నిలవాలని ఆశిస్తోంది. గడిచిన మూడు మ్యాచ్‌ల్లో నిలకడలేని టాపార్డర్ ప్రదర్శన జట్టుకు సమస్యగా మారింది. యువ ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ వరుసగా 1, 9, 0లతో తీవ్రంగా నిరాశ పరిచింది. తొలి వన్డేలో విఫలమైన స్మృతి మంధాన రెండో వన్డేలో అదరగొట్టింది. కానీ గత మ్యాచ్‌లో దాన్ని పునరావృతం చేయలేకపోయింది. పూనమ్ రౌత్ మాత్రం గత రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధసెంచరీలతో ఫామ్‌లోకి వచ్చింది. ఈ టాప్–3 బ్యాటర్స్ పటిష్టమైన పునాది వేస్తే కెప్టెన్ మిథాలీ రాజ్, ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్ కౌర్ మిగతా ఇన్నింగ్స్‌ను నిలబెడతారు. ఇక దక్షిణాఫ్రికా మహిళల జట్టులో ఓపెనర్ లిజెల్ లీ టాప్ ఫామ్‌లో ఉంది. సఫారీ గెలిచిన తొలి, మూడో వన్డేల్లో ఆమె అర్ధసెంచరీ, అజేయ సెంచరీలతో కీలక భూమిక పోషించింది. ఈ నేపథ్యంలో మిథాలీ సేన లిజెల్ లీని తక్కువ స్కోరుకే కట్టడి చేస్తే మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ పట్టుబిగించేందుకు ఆస్కారముంటుంది. అనుభవజ్ఞురాలైన వెటరన్ సీమర్ జులన్ గోస్వామి నిప్పులు చెరిగితే భారత మహిళల జట్టు 2–2తో సమం చేసే అవకాశాలు మెరుగవుతాయి. -
దక్షిణాఫ్రికాను గెలిపించిన లిజెల్ లీ
లక్నో: ఓపెనర్ లిజెల్ లీ (131 బంతుల్లో 132 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేయడంతో... భారత మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 249 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 46.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 223 పరుగులు చేసిన దశలో వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం దక్షిణాఫ్రికా విజయం ఖాయం కావాలంటే అప్పటికి ఆ జట్టు స్కోరు 217 పరుగులుగా ఉండాలి. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి అంచనా స్కోరుకంటే దక్షిణాఫ్రికా ఎక్కువే చేయడంతో ఆ జట్టును విజేతగా ప్రకటించారు. లిజెల్ లీ మూడో వికెట్‌కు మెగ్నాన్ డు ప్రీజ్ (37; 2 ఫోర్లు, సిక్స్)తో కలిసి 97 పరుగులు... ఐదో వికెట్‌కు ఆనీ బాష్ (16 నాటౌట్)తో కలిసి అజేయంగా 45 పరుగులు జోడించింది. అంతకుముందు భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 248 పరుగులు సాధించింది. పూనమ్ రౌత్ (77; 11 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిథాలీ రాజ్ (36; 5 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (36; 4 ఫోర్లు, సిక్స్), దీప్తి శర్మ (36 నాటౌట్; 2 ఫోర్లు) రాణించారు. మిథాలీ @ 10,000 భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ మ్యాచ్ ఇన్నింగ్స్‌తో అంతర్జాతీయ మహిళల క్రికెట్లో (మూడు ఫార్మాట్లు కలిపి) 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో క్రికెటర్‌గా, భారత్ నుంచి తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందింది. ఆనీ బాష్ బౌలింగ్‌లో బౌండరీ సాధించడంతో మిథాలీ రాజ్ ఈ మైలురాయిని చేరుకుంది. తర్వాతి బంతికే మిథాలీ అవు టైంది. 22 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో మిథాలీ 10 టెస్టుల్లో 663 పరుగులు... 212 వన్డేల్లో 6,974 పరుగులు... 89 టి20ల్లో 2,364 పరుగులు సాధించింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ రిటైర్డ్ క్రికెటర్ చార్లోటి ఎడ్వర్డ్స్ (10,273 పరుగులు) టాప్ ర్యాంక్‌లో ఉంది. -
ఆసియా ఆన్లైన్ చెస్: సెమీస్‌లో భారత జట్లు
చెన్నై: ఆసియా నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు 4–0తో; 3.5–0.5తో కిర్గిస్తాన్‌పై... భారత పురుషుల జట్టు 2.5–1.5తో; 2.5–1.5తో మంగోలియాపై గెలిచాయి. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో మంగోలియాతో భారత మహిళల జట్టు; ఇరాన్‌తో భారత పురుషుల జట్టు తలపడతాయి. టీమ్ విభాగంలో ఫలితాలను లెక్కలోనికి తీసుకొని వ్యక్తిగత విభాగంలో పతకాలను అందజేయగా... మహిళల టాప్ బోర్డుపై ఆడిన ఆర్.వైశాలి (6.5 పాయింట్లు), ఐదో బోర్డుపై ఆడిన మేరీఆన్ గోమ్స్ (5 పాయింట్లు) స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. మూడో బోర్డుపై ఆడిన పద్మిని రౌత్ (7.5 పాయింట్లు) ఖాతాలో రజతం చేరింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో రెండో బోర్డుపై ఆడిన శశికిరణ్ (8 పాయింట్లు) రజతం గెల్చుకున్నాడు. -
సునామీ శోకం మరిచేలా... జపాన్ విజయ గీతిక
జపాన్ దేశాన్ని సునామీ విషాదం ముంచెత్తి అప్పటికి నాలుగు నెలలైంది. ఎంతటి విపత్తు నుంచైనా కోలుకునే సామర్థ్యం ఉన్న ఆ దేశం అదే ప్రయత్నంలో ఉంది. కానీ జపాన్ ప్రజలకు మాత్రం ఇంకా ఏదో కావాలి. దేశం మొత్తానికి బాధను మరచిపోయేలా చేసే, కాస్త ఆనందం పంచే ఒక మందు కావాలి. ఇలాంటి సమయంలో క్రీడా ప్రపంచంలో జరిగిన ఒక అద్భుతం ఆ దేశం మొత్తం గర్వపడేలా చేసింది. అంతటి విషాదాన్ని కూడా పక్కన పెట్టి జపాన్ జాతి యావత్తూ సంబరాల్లో మునిగిపోయింది. అలాంటి అపూర్వ విజయాన్ని జపాన్ మహిళల ఫుట్‌బాల్ జట్టు అందించింది. 2011 ‘ఫిఫా’ ప్రపంచ కప్ విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. మార్చి 11, 2011... జపాన్ దేశం అతి పెద్ద సునామీతో అతలాకుతలమైంది. సుమారు 16 వేల మంది చనిపోవడంతో పాటు తీవ్ర విధ్వంసం జరిగింది. ఆ వెంటనే ఫకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌లో పేలుడు కారణంగా తీవ్ర స్థాయిలో విష వాయువులు వ్యాపించాయి. దాదాపు లక్షన్నర మందిని వేరే చోటికి తరలించాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో ఒక మెగా క్రీడా ఈవెంట్లో తమ జట్టు ప్రదర్శన జపాన్ ప్రజలకు ఊరట కలిగించింది. ఆ దేశంలో అత్యంత ఆదరణ ఉన్న క్రీడ అయిన ఫుట్‌బాల్‌లో మహిళలు సాధించిన అతి పెద్ద విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అదే స్ఫూర్తితో... ఏడాది క్రితం దక్షిణాఫ్రికాలో జరిగిన పురుషుల 2010 ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో జపాన్ జట్టు సెమీఫైనల్ వరకు చేరింది. అదే ఆ దేశపు పెద్ద ఘనత కావడంతో అభిమానులంతా సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు సంవత్సరం తర్వాత మహిళల టీమ్ ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు జర్మనీ పయనమైంది. అంతకుముందు జరిగిన ఐదు ప్రపంచకప్‌లలో నాలుగుసార్లు గ్రూప్ దశకే పరిమితమైన టీమ్ ఒక్కసారి మాత్రం క్వార్టర్ ఫైనల్ వరకు చేరగలిగింది. దాంతో పెద్దగా అంచనాలు కూడా లేవు. అయితే టీమ్ వెళ్లే ముందు ఆ దేశ ప్రజలు, అభిమానులు మాత్రం ఒకటే కోరిక కోరారు. పురుషుల టీమ్ తరహాలో కనీసం సెమీఫైనల్ వరకైనా వెళితే తాము సంతోషిస్తామని చెబుతూ సాగనంపారు. సునామీ వీడియోతో... లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్‌పై 2–1తో, మెక్సికోపై 4–0తో జపాన్ నెగ్గింది. ఆ తర్వాత మూడో మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో 0–2తో పరాజయం ఎదురైంది. అయితే తొలి రెండు ఫలితాలతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. నాకౌట్ పోరులో జర్మనీ రూపంలో పటిష్ట ప్రత్యర్థి ఎదురైంది. దేహదారుఢ్యంలో జపాన్‌కంటే ఎంతో బలమైన జట్టు (ఆటగాళ్ల సగటు ఎత్తు 6.2 అడుగులు), పైగా ఆతిథ్య టీమ్, డిఫెండింగ్ చాంపియన్ కూడా. దాంతో జపాన్ శిబిరంలో ఆందోళనే ఉంది. ఈ సమయంలో కోచ్ నోరియో ససాకీ ఒక పని చేశాడు. మీలో స్ఫూర్తి నింపేందుకు ఇంతకంటే ఏమీ చేయలేను అంటూ కొద్ది రోజుల క్రితం జపాన్‌లో వచ్చిన సునామీ వీడియోను చూపిం చాడు. అది తారకమంత్రంలా పని చేసింది. అద నపు సమయంలో గోల్ చేసి 1–0తో జర్మనీని బోల్తా కొట్టించింది. మ్యాచ్‌లో నాలుగు ఎల్లో కార్డులు ఎదురైనా జపాన్ పట్టుదలతో పోరాడటం విశేషం. ఈ గెలుపుతో జపాన్ జనం మొత్తం తమ జట్టును అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ వారిలో ఉత్తేజం నింపారు. అదే జోరులో సెమీస్‌లో స్వీడన్‌ను 3–1తో ఓడించి ఫైనల్ చేరింది. ఆఖరి పోరులో అద్భుతం... మహిళల ఫుట్‌బాల్‌లో తిరుగులేని జట్టయిన అమెరికాతో తుది పోరుకు జపాన్ సిద్ధమైంది. అప్పటికే అమెరికా రెండుసార్లు వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది. పైగా ఇరు జట్ల మధ్య జరిగిన గత 25 మ్యాచ్‌లలో 22 సార్లు ఓడిపోయిన జపాన్... 3 సార్లు మాత్రం ‘డ్రా’తో గట్టెక్కగలిగింది. ఇలాంటి నేపథ్యంలో ఫుట్‌బాల్ ప్రపంచం ఏకపక్ష ఫలితం గురించే తప్ప ఊహామాత్రంగా కూడా సంచలనం గురించి ఆలోచించలేదు. గంటసేపు హోరాహోరీగా సమరం సాగిన తర్వాత 69వ నిమిషంలో అమెరికా గోల్‌తో శుభారంభం చేసింది. అయితే 81వ నిమిషంలో గోల్‌తో జపాన్ దానిని సమం చేయగలిగింది. కానీ అదనపు సమయంలోని 104వ నిమిషంలో అమెరికా 2–1తో మళ్లీ ఆధిక్యంలోకి దూసుకుపోయింది. కానీ జపాన్ మహిళలు పట్టుదలగా పోరాడారు. అయితే కెప్టెన్ హŸమారే సవా 117వ నిమిషంలో చేసిన అద్భుత గోల్‌తో స్కోరు మళ్లీ 2–2తో సమమైంది. దాంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు వెళ్లింది. జపాన్ గోల్ కీపర్ అయుమి కై హోరి అమెరికాకు అడ్డు గోడగా నిలవగా... చివరకు 3–1తో గెలుపు జపాన్ సొంతమైంది. ‘ఫిఫా’ టోర్నీని గెలుచుకున్న తొలి ఆసియా జట్టుగా ఈ జపాన్ చరిత్ర సృష్టించింది. ఆనందభాష్పాలతో అమ్మాయిలు మైదానంలో చిందులేయగా... జపాన్ దేశం మొత్తం ఈ విజయంతో పులకించిపోయింది. నాలుగు నెలలుగా ఒక్క శుభవార్త కూడా వినని మా దేశంలో ఇదో పండగ రోజు అంటూ అక్కడి అభిమానులు వేడుకలు జరుపుకున్నారు. ప్రతీ క్రీడా విజయం ఆయా జట్టుకు ప్రత్యేకమైనదే కావచ్చు కానీ దేశంలో జోష్ పెంచిన జపాన్ మహిళల విజయం ఎప్పటికీ చిరస్మరణీయం. -
శిఖర పుత్రిక సాగరయాత్ర
మనిషికి.. సింహానికి ఉన్నంత బలం లేకపోవచ్చు. ఏనుగుకు ఉన్నంత భారీ కాయం ఉండకపోవచ్చు. కానీ.. వాటికంటే పదునైన ఆలోచన ఉంది. మనిషిగా పుట్టినందుకు ఏదో ఒకటి సాధించి తీరాలి. ఇదీ.. షైలీ బెస్నెత్ ఫిలాసఫీ. ఇరవై నాలుగేళ్ల వయసులో ఆమె ఎవరెస్టును అధిరోహించింది. ముప్పై ఆరేళ్ల వయసుకు ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తైన శిఖరాలనూ తాకింది! ఆ ఏడు శిఖరాలను అధిరోహించిన తొలి మహిళల బృందానికి నాయకత్వం వహించింది. అయితే షైలీ అంతకన్నా ఎతైన బాధ్యతలనే సమాజంలో మార్పు కోసం భుజానికెత్తుకున్నారు. ‘‘తమ జీవితాల గురించి తాము కలలు కనే అవకాశమైనా ఆడపిల్లలకు ఇవ్వండి. కలలు కనేందుకు అవసరమైన కనీస చదువునైనా వాళ్లను చదువుకోనివ్వండి.. ’’ షైలీ బాస్నెత్ విజ్ఞప్తి ఇది. ఆమె ఈ విజ్ఞప్తి చేస్తున్నది నేపాల్ సమాజానికే అయినప్పటికీ, అంతర్లీనంగా ఇండియానే విజ్ఞప్తి చేసినట్లే. ‘‘ఆడవాళ్లు.. డబ్బు సంపాదన సాధనాలు కాదని, నేపాల్ నుంచి యువతులను అక్రమంగా రవాణా చేస్తున్నవారికి ఇండియా కూడా అడ్డుకట్ట వేయాలని ఆమె కోరుతున్నారు. నేపాల్‌లో సెక్స్‌రాకెట్, ఉమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులకు పెద్ద మార్కెట్ ఇండియా అని కూడా గుర్తు చేశారు షైలీ బెస్నెత్. నేపాల్‌కు చెందిన పర్వతారోహకురాలు షైలీ బెస్నెత్ శనివారం ఫిక్కీ– వైఎఫ్‌ఎల్‌వో (ఎంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) సమావేశంలో ప్రసంగించడానికి హైదరాబాద్ వచ్చారు. ఎఫ్ఎల్వో (ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) అధ్యక్షురాలు శిల్ప దాట్ల ఆధ్వర్యంలో జరిగిన ఆ సమావేశానికి 150 మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. వారిని ఉద్దేశించిన ప్రసంగంలో షైలీ.. ‘సెవెన్ సమ్మిట్స్ ఉమెన్ టీమ్’కి తను నేతృత్వం వహించిన విషయంతోపాటు.. నేపాల్ మహిళల స్థితిగతులను గురించీ మాట్లాడారు. పైకి కనిపించని ఆంక్షలు ‘‘మాది ఖాట్మండూ. మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్న విద్యావంతులు. మా దేశంలో ఇప్పటికీ మగపిల్లవాడి కోసం ఆడపిల్లలను కంటూ పోవడమనే దురాచారం ఉంది. అమ్మాయిలకు పదహారేళ్లకే పెళ్లిళ్లయిపోతుంటాయి. చదువు ఎలాగూ గగన కుసుమమే. ఇక ఆటల గురించయితే మాట్లాడనే కూడదు. నిజానికి బాలికలకు ఆటలు నిషిద్ధం అనే నిబంధన ఏ సమాజంలోనూ పైకి కనిపించదు, కానీ అమలులో ఉంటుంది. ఆడపిల్లలు ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్లు చేస్తే విచిత్రంగా చూస్తారు. అమెరికన్‌తో నా వివాహాన్ని అంగీకరించడం మా సమాజానికి చాలా కష్టమైంది. మా దగ్గర పదేళ్ల కిందట మాత్రమే కరెంటు దీపాలను చూసిన గ్రామాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశంలో.. విద్యావంతుల కుటుంబాల ఆలోచనలు కూడా ఆడపిల్ల జీవితంలో స్థిరపడడం అంటే.. చదువుకుని ఉద్యోగం సంపాదించుకోవడం అన్నంత వరకే. అందుకు మా అమ్మానాన్నలే పెద్ద ఉదాహరణ. బాధితులే బృంద సభ్యులు నేపాల్‌లో ఆడపిల్లలు ఇన్ని నిబంధనల మధ్య పెరుగుతుంటే.. అమెరికా వాళ్లు మాత్రం నేపాల్ వాళ్లు అందరూ ఎవరెస్టును అధిరోహించి ఉంటారని నమ్ముతారు. నేపాలీగా పరిచయం చేసుకోగానే ‘‘మీరు ఎవరెస్టును అధిరోహించారా’’ అని అడుగుతారు. నిజానికి నేపాల్‌లో మహిళలకు పర్వతారోహణం వంటి కలలు కనే అవకాశం కూడా తక్కువే. అలాంటి సమయంలో మేము చేసిన సాహసమే.. ‘సాగర్మాత ఎక్స్‌పెడిషన్’. ఎవరెస్టు ఆరోహణ అనేది మా దేశంలో సాహసం కాదు, ప్రకృతిమాతకు శిరసు వంచి అభివందన చేయడం. అందుకే ఎవరెస్టు అధిరోహించిన వాళ్లను దేవతలుగా గౌరవిస్తారు. నేను చేసిన సాహసం ఏమిటంటే.. సమాజంలో రకరకాలుగా వేధింపులకు గురైన మహిళలను సాగర్మాత బృందంలో సభ్యులుగా చేయడమే. ఆషా అనే ఆమెది నేపాల్‌లో ఉన్న వందకు పైగా తెగల్లో అత్యంత వెనుకబడి తెగ. మాయా అనే అమ్మాయి జీవితం మరో విచిత్రం. పద్నాలుగేళ్ల వయసులో ఆమెకు పెళ్లి నిశ్చయం చేసి వేడుకలు మొదలు పెట్టేశారు. ఇంట్లో వాళ్లు ఆమెను.. ‘ఈ పెళ్లి ఇష్టమేనా?’ అని అడగడం అటుంచండి.. కనీసం.. ‘నీకు పెళ్లి’ అని ఒక్కమాట కూడా చెప్పలేదు! బంధువుల రాక కూడా మొదలైంది. అప్పుడు ఆమె ఇంటి నుంచి పారిపోయింది. అయితే ఎవరెస్టు అధిరోహణ తరవాత వాళ్లకు గౌరవాలు దక్కుతున్నాయి. మహిళల సాధికారత గురించి, బాలికలకు చదువు గురించి వాళ్లు తమ ఊళ్లలో ఏం చెబితే దానిని అనుసరిస్తున్నారు. మహిళలు సంపూర్ణమైన, సమగ్రమైన సాధికారత సాధించినప్పుడే ఆ సమాజం అభివృద్ధి చెందుతుంది. మా వరకు మేమంతా కలిసి ట్రాఫికింగ్ కోరల్లో చిక్కి ప్రాణాలతో బయటపడిన మహిళలకు సొంతంగా జీవించడానికి ఆసరా అవుతున్నాం. ఉపాధి వృత్తుల్లో శిక్షణనిస్తూ వారికి ఆర్థికంగా స్వయంశక్తి సాధించడంలో సహాయం చేస్తున్నాం . ‘ఎవరెస్ట్ టు ఎంపవర్మెంట్’ అనే కాన్సెప్టుతో నా వంతుగా నేను సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నాను’’ అన్నారు షైలీ బెస్నెత్. చెన్నైలో ‘ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం’లో షైలీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. – ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి శిఖరాలైనా తలవంచుతాయి మహిళల్లో పోటీతత్వం ఎక్కువ. పోరాట పటిమ కూడా ఎక్కువే. అందుకే శిఖరాలు కూడా తలవంచుతాయి. నా ఈ నమ్మకమే మొత్తం మహిళలతో ఏడు ఖండాల్లో ఏడు శిఖరాలను అధిరోహించాలనే ఆలోచనకు కారణమైంది. అనుకున్నట్లే మా ఏడుగురు మహిళల బృందం ఆసియా– ఎవరెస్ట్ శిఖరం, ఆస్ట్రేలియా– కిస్కియుజ్కో, యూరప్– ఎల్బ్రస్, ఆఫ్రికా– కిలిమంజరో, సౌత్ అమెరికా– అకాంగువా, నార్త్ అమెరికా– దేనాలి పర్వతం, అంటార్కిటికా– విన్సాన్ మాసిఫ్ శిఖరాలను అధిరోహించింది. ఈ అనుభవాలను క్రోడీకరిస్తూ ‘సెవెన్ సమ్మిట్స్– సెవెన్ చాలెంజెస్ అండ్ సెవెన్ లెసన్స్’ పుస్తకాన్ని ఈ ఏడాది తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. – షైలీ బెస్నెత్, మౌంటెనీర్, సోషల్ వర్కర్, మోటివేషనల్ స్పీకర్, స్టాండప్ కమెడియన్, జర్నలిస్ట్ -
ఇంగ్లండ్ మహిళల జట్టుకు తొలి మహిళా హెడ్ కోచ్
లండన్: ఇంగ్లండ్ మహిళల జట్టుకు తొలిసారి మహిళా క్రికెటర్‌నే హెడ్ కోచ్‌గా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నియమించింది. ఆ్రస్టేలియా మాజీ క్రికెటర్ లీసా కెయిట్లీకి ఈ అవకాశం దక్కింది. 48 ఏళ్ల లీసా 9 టెస్టుల్లో, 48 వన్డేల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఇప్పటి వరకు మార్క్ రాబిన్సన్ ఇంగ్లండ్ మహిళల జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. అయితే యాషెస్ సిరీస్‌లో ఓటమి తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. వచ్చే జనవరిలో లీసా తన బాధ్యతలు స్వీకరిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ మహిళల వన్డే జట్టు వరల్డ్ చాంపియన్‌గా ఉండగా... టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం లీసా బిగ్ బాష్ టి20 లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తోంది. -
భారత మహిళలదే వన్డే సిరీస్
వడోదర: ఇప్పటికే టి20 సిరీస్‌ను గెల్చుకున్న భారత మహిళల జట్టు అదే దూకుడుతో వన్డే సిరీస్‌ను వశం చేసుకుంది. దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో శుక్రవారం జరిగిన రెండో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పూనమ్ రౌత్ (92 బంతుల్లో 65; 7 ఫోర్లు), కెపె్టన్ మిథాలీ రాజ్ (82 బంతుల్లో 66; 8 ఫోర్లు) అర్ధ సెంచరీల కారణంగా భారత్ మరో రెండు ఓవర్లు ఉండగానే విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో దక్కించుకుంది. తొలుత దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఆరంభంలో ఓపెనర్లు లిజెల్లే లీ (40; 3 ఫోర్లు, సిక్స్), లారా వోల్వార్డ్ (69; 7 ఫోర్లు) తొలి వికెట్‌కు 76 పరుగులు జోడించి శుభారంభం చేశారు. అనంతరం ప్రీజ్ (44; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో ఒక దశలో దక్షిణాఫ్రికా 142/3తో పటిష్టంగా కనిపించింది. అయితే చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడంతో పర్యాటక జట్టు అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితమైంది. శిఖా పాండే, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. అనంతరం భారత్ 48 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. మిథాలీ రాజ్, పూనమ్ రౌత్ అర్ధ సెంచరీలకు తోడు చివర్లో హర్మన్‌ప్రీత్ కౌర్ (27 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. సిరీస్‌లో చివరి వన్డే ఈనెల 14న ఇక్కడే జరుగుతుంది.