
అంటాల్యా (టర్కీ): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ మూడు జట్లపై (ఇండోనేసియా, న్యూజిలాండ్, కొరియా) గెలిచి, రెండు జట్ల (చైనా, జపాన్) చేతిలో ఓడిపోయింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన చైనా, జపాన్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత పొం దాయి. కొరియాతో జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్ తొలి రెండు సింగిల్స్‌లో నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. తొలి సింగిల్స్‌లో రియా భాటియా 6–3, 2–6, 6–3తో నా రి కిమ్‌పై నెగ్గగా... రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 6–2, 6–3తో దాబిన్ కిమ్ ను ఓడించి టీమిండియాకు విజయాన్ని అందించింది.
Comments
Please login to add a commentAdd a comment