riya
-
మత్తువదలరా 2 : ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న.. రియా ఎక్కడ? (ఫొటోలు)
-
వినబడదు.. మాటలు రావు.. అయినా అన్నింటిలోనూ ఫస్టే
బంజారాహిల్స్: దేశం కాని దేశం.. ఊరు కాని ఊరు.. మన భాష అసలే తెలియదు.. మాట్లాడడానికి నోరు పెగలదు.. చెవులు వినబడవు.. అమెకున్న గ్రహణ శక్తి సంజ్ఞలు మాత్రమే. మూగ, చెవుడు అయినా కేవలం ఉపాధ్యాయులు చెప్పేది లిప్‌మూమెంట్ ద్వారా గ్రహిస్తూ చదువులో దూసుకుపోతోంది. క్లాస్‌లో ఎప్పుడూ మొదటి స్థానమే. నేపాల్‌కు చెందిన రియా (17) తల్లిదండ్రులు జయన్బహదూర్, తల్లి జోగుమాయలు పొట్ట చేతబట్టుకుని ఉపాధి నిమిత్తం 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. జయన్ బహదూర్ కుక్‌గా పనిచేస్తుండగా, భార్య మాయ గృహిణి. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. చిన్న కూతురు రియా పుట్టుకతో మూగ, చెవుడు. తన భావాలను పంచుకోవాలంటే మాటలు రావు, ఇతరులు చెప్పేది వినబడదు. అయితేనేం ఆమెకున్న గ్రహణ శక్తికి తనలోని లోపాలు కూడా చిన్నబోతాయి. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–10లోని గాయత్రీహిల్స్‌లోని లిటిల్‌స్టార్ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది రియా.ఎప్పుడూ ఫస్టే.. తరగతి గదిలో టీచర్లు చెప్పేది వినబడకపోయినా.. వారి లిప్‌మూమెంట్ ద్వారా ఆ పాఠాలు గ్రహిస్తోంది. ఏమైనా అర్థం కాకపోతే నోట్‌బుక్‌లో రాసి టీచర్లను అడుగుతుంది. నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఇక్కడే చదువుతున్న రియా ఎప్పుడూ క్లాస్ ఫస్టే వస్తుందని తెలుగు టీచర్ అనూష తెలిపారు. బ్లాక్‌బోర్డుపై తాము రాసే పాఠాల విషయాలు బాగా అబ్జర్వ్ చేస్తుందని హిందీ టీచర్ అర్షియా పరీ్వన్ తెలిపారు. ఈ బాలిక అంటే మొత్తం స్కూల్ విద్యార్థులకే కాకుండా టీచర్లకు కూడా ప్రత్యేక గౌరవం ఇస్తుంటారని ఆమె వెల్లడించారు. నూరు శాతం హాజరు.. వినబడదు..మాట్లాడలేదు..అయినా సరే ఏ ఒక్కరూ ఆమెను హేళనగా చూడరని, క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ వస్తుంటుందని స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ అస్మతున్నీసా తెలిపారు. ఈ బాలిక అక్క, అన్న కూడా ఇదే పాఠశాలలో చదివారని తెలిపారు. రియాలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆమె వద్ద ఎలాంటి ఫీజూ తీసుకోకుండానే నర్సరీ నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఉచితంగా చదువును అందిస్తున్నట్లు అస్మతున్నీసా పేర్కొన్నారు. కేవలం చదువులోనే కాకుండా పాఠశాలల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొని అబ్బురపరిచే నృత్యాలు కూడా చేసి ఆకట్టుకుంటుంది. క్రాఫ్ట్‌వర్క్, డ్రాయింగ్, పోస్టర్ మేకింగ్, చార్ట్ తయారీలో కూడా రియా పాల్గొంటూ బహుమతులు సాధిస్తోంది. ఒక్కరోజు కూడా గైర్హాజరు కాకుండా స్కూల్ అటెండెన్స్‌లో 100 శాతంతో అందరి కంటే ముందుంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అంతేకాదు తమ కంటే బాగా చదవడం, మార్కులు కూడా బాగా రావడం మమ్ముల్ని ఎంతగానో ఆశ్చర్యపరుస్తుందని సహచర విద్యారి్థని సౌమ్య చెబుతోంది. -
వైరల్ 'రియా'.. అసలు ఈ అమ్మాయి ఎవరంటే? (ఫొటోలు)
-
సోషల్ మీడియా ట్రెండింగ్‌లో 'రియా'.. అసలు ఈమె ఎవరంటే?
రియా ఎక్కడ? ఆమె ఎవరు? దామిని డాటర్? దామిని ఎవరు? రియా మదర్.. అసలు వీళ్లిద్దరూ ఎవరు? మదర్ అండ్ డాటర్.. గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే ట్రెండ్ అవుతోంది. 'మత్తు వదలరా 2' సినిమాలోని సత్య-అజయ్ మధ్య జరిగే సీన్ ఇది. ఊహించని విధంగా ఓటీటీలోకి వచ్చిన తర్వాత తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ రియా అసలు పేరు ఏంటి? ఆమె ఎవరో తెలుసా?(ఇదీ చదవండి: బిచ్చగాడిలా మారిపోయిన స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?)సోషల్ మీడియాలో ఎప్పుడు.. ఏది.. ఎందుకు వైరల్ అవుతుందో అస్సలు అర్ధం కాదు. అలా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చిన తర్వాత 'మత్తు వదలరా 2' సినిమా సీన్లని తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈ మూవీలో సత్య తనదైన కామెడీతో అదరగొట్టేశాడు. అలా రియా అనే అమ్మాయి గురించి అడిగే సీన్ ఒకటి వైరల్ అవుతుంది. ఆ రియా పాత్రధారి అసలు పేరు ఐషూ యాదవ్. ఈమె స్వతహాగా నార్త్ అమ్మాయి.తెలుగులో 'సిద్ధు బీకాం' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఐషూ యాదవ్‌కి ఇన్ స్టాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. 8 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. డిజిటల్ క్రియేటర్‌గా వీడియోలతో ఎంటర్టైన్ చేసే ఈమె.. అసిస్టెంట్ డైరెక్టర్ వల్ల 'మత్తు వదలరా 2'లో ఛాన్స్ దక్కించుకుంది. ఈమెకు ఇదే తొలి మూవీ. అయితేనేం రియా అనే పేరు దెబ్బకు తెగ పాపులర్ అయిపోయింది.మరి ఈ ట్రెండింగ్ వల్ల రియా అలియాస్ ఐషూ యాదవ్‌కి తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి?(ఇదీ చదవండి: మణికంఠ చిన్న పొరపాటు.. కొత్త మెగా చీఫ్‌గా గౌతమ్)one of the best scenes from #MathuVadalara2 @RiteshRana 🤣🤣🤣 #Satya pic.twitter.com/cAlPSjQsA6— KSNSK (@SmoothingWoods) October 15, 2024 View this post on Instagram A post shared by Isha Yadav (@ishayadav__) -
ఆడియెన్స్‌ను ఉర్రూతలూగించే రియా పాటలు
పాట లక్ష్యం హుషారుగా స్టెప్పులు వేయించడం మాత్రమే కాదు. పరుగును ఆపి మనలోకి మనం వెళ్లడం. మంచి ఊహలకు స్వాగతం పలకడం అంటోంది రియ సంగీతం. సాంగ్ రైటర్, సింగర్ రియ పాటలు హుషారెత్తిస్తూనే స్వీయ క్రమశిక్షణ నుంచి ఆత్మబలం వరకు ఎన్నో మంచి విషయాలను చెబుతాయి... దిల్లీలో పుట్టిన రియ రెండు సంవత్సరాల వయసులో తల్లిదండ్రులతో యూకే వెళ్లింది. పాప్–బాలీవుడ్ మ్యూజిక్‌ను వింటూ పెరిగింది. చిన్న వయసులోనే స్టేజీపై ప్రదర్శనలు ఇచ్చింది. రియ ‘పర్మిషన్’ ట్రాక్ శ్రోతలను అలరించింది. ‘పర్మిషన్’ కోసం కలం కూడా పట్టింది రియ. ఇద్దరు ప్రేమికుల గురించి కావచ్చు, స్నేహం, కుటుంబ బంధాల గురించి కావచ్చు స్టోరీ–డ్రైవెన్ లిరిక్స్ రాయడం అంటే రియకు ఇష్టం. క్లాసికల్ సింగింగ్‌లో డిప్లొమా చేసిన రియకు థియేటర్ మ్యూజిక్ అంటే ఇష్టం. ‘పర్మిషన్’ తరువాత వచ్చిన ‘డోన్ట్ హ్యావ్ ది టైమ్’కు మంచి పేరు వచ్చింది. ఇన్స్పిరేషన్ అనేది ఎప్పుడైనా, ఎక్కడైనా రావచ్చు అనే దానికి ఉదాహరణ...డోన్ట్ హ్యావ్ ది టైమ్. ఒక ఫెస్టివల్లో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు ఈ పాటకు ఆలోచన తట్టింది. ఆడియెన్స్ కూడా లీనమై తనతో పాటు డ్యాన్స్ చేసే పాట సృష్టించాలనుకుంది రియ. అలా పుట్టిందే... డోంట్ హ్యావ్ ది టైమ్. అయస్కాంతంలా ఆకట్టుకునే పాట ఒకటి సృష్టించాలనుకుంది. అలా అని ఆ పాట అల్లాటప్పాగా ఉండకూడదని దానిలో సందేశం ఉండాలనుకుంది. మనలో ఎంత టాలెంట్ ఉంటే మాత్రం? టైమ్ లేకపోతే అంతే! అందుకే టైమ్ విలువను క్షణ, క్షణం గుర్తు చేసుకునేలా ‘డోన్ట్ హ్యావ్ ది టైమ్’ను తీర్చిదిద్దింది. ప్రతి ఒక్కరూ రిలేట్ అయ్యేలా ఉండడమే ఈ పాట సక్సెస్ సాధించడానికి కారణం అయింది. ‘ప్రతి నిమిషం అపూర్వమైనది. వెల కట్టలేనిది’ అని గుర్తు చేసే ‘డోంట్ హ్యావ్ ది టైమ్’పై పాప్ బీట్ మాత్రమే కాదు బాలీవుడ్ మ్యూజిక్ ప్రభావం కూడా కనిపిస్తుంది. ట్రాక్ వీడియోల షూట్ కోసం ఎన్నో సార్లు దిల్లీకి వచ్చిన రియ ప్రతిసారి ఒక కొత్త అనుభవాన్ని సొంతం చేసుకుంది. ‘సాంస్కృతిక వైవిధ్యంతో వెలిగిపోయే దిల్లీలో అడుగు తీసి అడుగు వేస్తే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి’ అని దిల్లీ గురించి మురిపెంగా చెబుతుంది రియ. ‘ప్రతి నెల ఒక సింగిల్ విడుదల చేయాలనుకుంటున్నాను’ అంటున్న రియ తన రచనలు, సంగీతంతో ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుంది. ఇండియాలోని ప్రొడ్యూసర్లు, మ్యూజిషియన్లతో పనిచేయాలని, లైవ్ షోలలో పాల్గొనాలనేది రియ కల. మరి నెక్స్›్ట ఏమిటి? ‘చెప్పుకోతగ్గ అద్భుతమైన ఆనందకరమైన విషయాలు మున్ముందు ఉన్నాయి. మాంచెస్టర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, బీబీసీ ది హండ్రెడ్ ప్రోగ్రామ్‌లో ప్రదర్శన ఇవ్వబోతున్నాను’ అంటుంది రియ. -
Hoovu Fresh: పువ్వుల వ్యాపారం.. 10 లక్షల పెట్టుబడితో ఆరంభం.. కోట్లలో లాభాలు!
మన అవసరమే మనకో దారి చూపుతుంది. ఎరుకతో ముందడుగు వేస్తే విజయం సుగమమం అవుతుంది. అందుకు ఉదాహరణే ఈ బెంగళూరు సిస్టర్స్. అమ్మకు పూజ చేసుకోవడానికి సరైన పూలు దొరకడం లేదని గ్రహించిన ఈ తోబుట్టువులు ఇదే సమస్య అన్ని చోట్లా ఉందని తెలుసుకున్నారు. పది లక్షల రూపాయలతో పూల వ్యాపారాన్ని ప్రారంభించారు. కోట్లలో లాభాలను ఆర్జిస్తున్నారు. యశోద కరుటూరి, రియా కరుటూరి ఈ ఇద్దరు తోబుట్టువులు పువ్వుల లోకంలో విహరిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం ప్రారంభించిన మూడేళ్లలోనే పూల పరిశ్రమలో పెద్ద బ్రాండ్‌గా తమ కంపెనీని నిలబెట్టారు. యశోద, రియా 14 ఫిబ్రవరి 2019న బెంగళూరులో ‘హువు’ ఫ్రెష్ని ప్రారంభించారు. 28 ఏళ్ల రియా మాట్లాడుతూ ‘హువు’ అంటే కన్నడ భాషలో పువ్వు అని చెప్పింది. కంపెనీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే కోవిడ్ కారణంగా వ్యాపారం నిలిచిపోయిందంటూ తాము ఎదుర్కొన్న సమస్యనూ వివరించింది. తల్లి ప్రేరణ కంపెనీ తొలినాళ్ల గురించి ఈ తోబుట్టువులు ప్రస్తావిస్తూ –‘దేశ పుష్పాల రాజధాని బెంగళూరు లో నివాసముంటున్నా సరైన పూలు దొరకడం లేదని, ఆ పువ్వులు కూడా తాజాగా లేవని మా అమ్మ ఆవేదన చెందేది. అప్పుడే పువ్వుల వ్యాపారం ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది..’ అంటూండగానే రియా అక్క యశోద అందుకుని మాట్లాడుతూ ‘మా చిన్నతనంలో మా నాన్న ఇథియోపియా, కెన్యాలో గులాబీ తోట సాగు చేసేవారు. విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. కొన్ని కారణాల వల్ల ఆ వ్యాపారం తగ్గిపోయింది. మేం స్వదేశానికి వచ్చేశాం. మహిళలకు ఉపాధి ‘భారతదేశంలో సాధారణంగా పూజా పుష్పాలను దేవాలయాల చుట్టూ మాత్రమే విక్రయిస్తుంటారు. అలాగే, బండిపైనో, రోడ్డు పక్కనో కూర్చొని మహిళలు పూజాపుష్పాలను అమ్ముతుంటారు. ఈ విధానం అస్తవ్యస్తంగా ఉందని గ్రహించాం. మేము ఈ పూలవ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు, పరిశ్రమలో చేరడానికి మహిళలు చాలా ఆసక్తి చూపారు. కంపెనీ మొదలైనప్పుడు పాతిక మంది మహిళలు ఉండగా నేడు వారి సంఖ్య వందల్లో పెరిగింది. ఉపాధి వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వారి పిల్లలు మంచి పాఠశాలల్లో చదువుతున్నారు. నెలకు లక్షన్నర ఆర్డర్లు ప్రతి నెలా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, మైసూర్, పూణె, ముంబై, గురుగ్రామ్, నోయిడా తదితర ప్రాంతాల నుంచి... ఒకటిన్నర లక్ష ఆర్డర్లు అందుతున్నాయి. వీరిలో ఎక్కువ మంది నెలవారీ సబ్స్క్రిప్షన్ ఉన్న కస్టమర్లే కావడం విశేషం. ఇది కనిష్టంగా రూపాయి నుండి ప్రారంభమవుతుంది. 25 రూపాయల పూల ప్యాక్‌లో వివిధ రకాల పూలు ఉంటాయి. పువ్వులు రెండు వారాల పాటు తాజాగా ఉండే విధంగా ప్యాక్ చేస్తాం. దీన్ని తాజాగా ఉంచడానికి ఇథిలీన్ బ్లాకర్స్, ఇతర టెక్నాలజీని ఉపయోగిస్తాం. ప్యాకేజింగ్‌లో జీరో టచ్ ఫ్లవర్ టెక్నిక్ కూడా ఉంది. ఈ ప్యాకెట్లు పర్యావరణ అనుకూలమైనవి, ఇవి సులభంగా మట్టిలో కలిసిపోతాయి. మా కంపెనీ వాడినపూలతో అగరుబత్తులను కూడా తయారు చేస్తుంది. ఇవి పూర్తిగా సేంద్రీయమైనవి. బొగ్గు, రసాయనాలు ఏ మాత్రమూ ఉండవు. రైతులతో అనుసంధానం గతంలో రైతులు మండీలో పూలు విక్రయించేవారు, అక్కడ తరచుగా నష్టపోయేవారు. అక్కడ పూలకు సరైన ధర లభించేది కాదు. సకాలంలో పూలు అమ్మకపోతే సగానికిపైగా వృథా అయ్యేవి. పూలకు సరైన ధర రైతులకు అందేలా వందలాది మంది రైతులను కంపెనీతో అనుసంధానం చేశాం. ఈ విధానంలో పూలు కూడా వృథా కావు. మా కంపెనీకి వివిధ రాష్ట్రాల్లోని వందలాది మంది రైతులతో టై అప్లు ఉన్నాయి. దీనితోపాటు, డెలివరీ చైన్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేశాం. ఆర్డర్లు వచ్చిన కస్టమర్లకు సకాలంలో డెలివరీ ఇస్తున్నాం. కొన్ని ఇ–కామర్స్ కంపెనీల ప్లాట్‌ఫారమ్‌లోనూ మా ఉత్పత్తులు లభిస్తున్నాయి’ అని వివరించారు ఈ తోబుట్టువులు. -
భారత్‌కు మూడో స్థానం
అంటాల్యా (టర్కీ): బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మహిళల టీమ్ టెన్నిస్ టోర్నీలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ మూడు జట్లపై (ఇండోనేసియా, న్యూజిలాండ్, కొరియా) గెలిచి, రెండు జట్ల (చైనా, జపాన్) చేతిలో ఓడిపోయింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన చైనా, జపాన్ ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు అర్హత పొం దాయి. కొరియాతో జరిగిన చివరిదైన ఐదో లీగ్ మ్యాచ్‌లో భారత్ తొలి రెండు సింగిల్స్‌లో నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. తొలి సింగిల్స్‌లో రియా భాటియా 6–3, 2–6, 6–3తో నా రి కిమ్‌పై నెగ్గగా... రెండో సింగిల్స్‌లో అంకిత రైనా 6–2, 6–3తో దాబిన్ కిమ్ ను ఓడించి టీమిండియాకు విజయాన్ని అందించింది. -
కొత్త కథలైతే విజయం ఖాయం
‘‘తాగితే తందానా’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఈ చిత్రనిర్మాతలు చాలా కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నారు. కొత్త కాన్సెప్టులతో వస్తే కచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదిత్, మధు, సప్తగిరి లుక్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఆదిత్, సప్తగిరి, మధునందన్, సిమ్రాన్ గుప్తా, రియా ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘తాగితే తందానా’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. రైట్ టర్న్ ఫిలిమ్స్ పతాకంపై వి.మహేష్, వినోద్ జంగపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి లుక్‌ని మారుతి, బ్యానర్ లోగోని నిర్మాత దామోదరప్రసాద్ విడుదల చేశారు. దామోదరప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కొత్తవాళ్లు సరైన ప్లానింగ్‌తో వస్తే కచ్చితంగా సక్సెస్ అవుతారు. ఈ నిర్మాతలు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో అనుకున్న టైమ్‌లో సినిమా పూర్తి చేయడంలో సక్సెస్ అయినట్టు తెలుస్తోంది’’ అన్నారు. ‘‘ఇప్పటివరకు నేను 16 చిత్రాలు చేశాను. వాటిలో 13 చిత్రాలు కొత్త దర్శకులతోనే చేశాను’’ అన్నారు ఆదిత్. ‘‘కమెడియన్‌గా మంచి చిత్రాలు వస్తే చేద్దామనుకుంటున్న తరుణంలో శ్రీనాథ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశా’’ అన్నారు సప్తగిరి. ‘‘ముగ్గురు కుర్రాళ్లు తాగిన మత్తులో ఒక సమస్యలో ఇరుక్కుంటారు.. దాని నుంచి వారు ఎలా బయటపడ్డారనేది చిత్రకథ’’ అన్నారు శ్రీనాథ్ బాదినేని. ‘‘అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు వినోద్ జంగపల్లి. చిత్రనిర్మాత వి.మహేష్, లైన్ ప్రొడ్యూసర్ అనిల్, మధునందన్, సిమ్రాన్ గుప్తా, రియా, సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్ బి.నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాల్ రెడ్డి. -
సౌదీ నుంచి శవాన్ని తెప్పించాలని విజ్ఞప్తి
-
పేపర్ బాయ్ లవ్ స్టోరీ
‘‘ఒక అమ్మాయి, ఓ పేపర్ బాయ్ మధ్య జరిగే ప్రేమ కథే ‘పేపర్ బాయ్’. ఈ చిత్రంలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా. అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. కెమెరామెన్ సౌందర్య రాజన్ మంచి విజువల్స్ అందించారు. భీమ్స్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆగస్టులో సినిమా విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాత సంపత్ నంది అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రియా, తాన్య హోప్ హీరోయిన్లుగా జయశంకర్ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పేపర్ బాయ్’. సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లో ప్రచిత్ర క్రియేషన్స్, బిఎల్ఎన్ సినిమాపై సంపత్ నంది నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను రియల్ పేపర్ బాయ్ అఖిల్ చేత విడుదల చేయించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ– ‘‘నేను చేసిన షార్ట్ ఫిల్మ్ చూసి సంపత్‌గారు డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. అందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. సింపుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘గోల్కొండ హైస్కూల్’తో బాల్య నటుడిగా నన్ను ఆదరించారు. ఇప్పుడు ‘పేపర్ బాయ్’గా మీ ముందుకు వస్తున్నా, ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అందరూ కొత్తవారే’’ అన్నారు సంతోష్ శోభన్. నిర్మాత నరసింహ, కథానాయిక రియా పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల. -
మార్కెట్లోకి హాఫ్ గర్ల్‌ఫ్రెండ్
సాక్షి, బెంగళూరు : బెంగళూరు పుస్తక ప్రియుల్ని అలరించేందుకు ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ శుక్రవారం రాత్రి నగర ప్రవేశం చేసింది. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ రచించిన ఈ పుస్తకం కోసం పాఠకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే..! వారి నిరీక్షణకు తెరదించుతూ పుస్తక రచయిత చేతన్ భగత్ చేతుల మీదుగా నగరంలోని కోరమంగళలోని ఫోరం మాల్లో ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పుస్తక సారాంశాన్ని క్లుప్తంగా ఆయన వివరించారు. బీహారీ బాలుడు మాధవ్, ఢిల్లీలోని ధనిక కుటుంబానికి చెందిన బాలిక రియా ప్రేమలో పడటం, ఆ ప్రేమ బంధాన్ని కొనసాగించలేని రియా చివరకు మాధవ్ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండేందుకు రాజీపడుతుంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో వ్యక్తుల మధ్య నెలకున్న సంబంధాల్లో స్వల్ప వ్యత్యాసాన్ని హృద్యంగా పుస్తకీకరించారు. అందుకే ఈ పుస్తకానికి హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌గా టైటిల్ పెట్టినట్టు ఆయన వెల్లడించారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భాగంగా చేతన్ భగత్ పుస్తకాలు, అందులోని అంశాలపై పోటీలు నిర్వహించారు. అక్కడే సుమారు 200 మంది కొనుగోలుదారులకు చేతన్ భగత్ స్వయంగా సంతకం చేసిన పుస్తకాల్ని అందించారు. -
నా ప్రతిభ చూపిస్తా...
‘‘నాలుగో తరగతి చదువుతున్నప్పటి నుంచీ క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నా. ఇప్పటివరకూ చాలా సినిమాల్లో చేశాను. కానీ, నా ప్రతిభను చూపించే సరైన అవకాశం రాలేదు. ఈ సినిమాతో నా ప్రతిభ చూపిస్తా’’ అని సందీప్తి చెప్పారు. రియా, సందీప్తి జంటగా అప్పాజీ కొండ దర్శకత్వంలో సూర్యనాథ్ నటిస్తూ, నిర్మించిన ‘రాజమహల్’ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో కావాలన్న ఆశ ఈ సినిమాతో నెరవేరిందని, కథ నచ్చి తానే నిర్మాతగా వ్యవహరించానని సూర్యనాథ్ తెలిపారు. -
ఫుట్‌బాల్ ప్రపంచకప్ నిర్వహణపై ఆందోళన
రియో: ఫుట్‌బాల్ ప్రపంచ కప్.. ఎప్పుడెప్పుడా అని విశ్వవ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఆతృతగా ఈ మెగా టోర్నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక టోర్నీ జరిగే బ్రెజిల్లోనైతే ఈ జోరు మరింతగా ఉంది. అయితే ఇదంతా ఒకవైపే.. మరోవైపున ఈ వర్ధమాన దేశంలో ఇంత భారీ ఖర్చుతో టోర్నమెంట్ నిర్వహించడం అవసరమా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అంతేగాకుండా ఈ నిరసనలు తీవ్రరూపం దాల్చి శాంతి భద్రతల సమస్యగా మారింది. శుక్రవారం ఇదే కారణంగా వేలాది మంది నిరసనకారులు మ్యాచ్‌లు జరిగే సావో పాలో, రియో నగరాల్లోని రోడ్ల పైకి వచ్చారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాల్సి వచ్చింది. దీనికి ప్రతిగా యువకులు పోలీసులపైకి రాళ్లు విసరడంతోపాటు టైర్లను కాల్చుతూ రోడ్లను మూసివేశారు. బ్రెజిల్ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమని, ఇక్కడ పేదరికం కూడా ఎక్కువగానే ఉందని, ఇలాంటి స్థితిలో 15 బిలియన్ల డాలర్ల (రూ.8 లక్షల 78 వేల కోట్లు) ఖర్చుతో ప్రపంచకప్ ఫుట్‌బాల్‌ను నిర్వహించడం దేనికని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యయాన్ని ఇతర అవసరాలకు, గృహ నిర్మాణాలకు ఖర్చు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.