సౌదీ అరేబియాలోని రియాద్‌లో నెలరోజుల క్రితం మరణించిన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మారంపల్లి గ్రామానికి చెందిన చౌక రమేశ్(42) అనే కారు డ్రైవర్ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కోరుతూ అతని కుటుంబ సభ్యులు గురువారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగాలను ప్రతివాదులుగా చేరుస్తూ మృతుని భార్య లావణ్య తల్లి రుక్కుంబాయి, తమ్ముడు రాజేశ్వర్ మానవహక్కుల కమిషన్‌లో ఫిటిషన్ దాఖలుచేశారు. అనంతరం హెచ్చార్సీ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి 67 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 21న మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య లావణ్య ఇద్దరు కుమార్తెలు శివాణి (11), పావని (9) ఉన్నారు.
సౌదీ నుంచి శవాన్ని తెప్పించాలని విజ్ఞప్తి
Published Fri, May 24 2019 6:15 PM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM