soudi arebia
-
ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం. సౌదీ అరేబియాలోని దమ్మమ్ నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం విస్తీర్ణం 483 చదరపు కిలోమీటర్లు. అంటే ప్యారిస్ నగరం విస్తీర్ణానికి ఎనిమిది రెట్లు ఉంటుంది. ఇక్కడి నుంచి 37 విమానయాన సంస్థలు తమ విమానాలను నడుపుతున్నాయి. ఇవి తమ ప్రయాణికులను ఇక్కడి నుంచి 43 గమ్యాలకు చేరవేస్తున్నాయి. విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం అతిపెద్దదే అయినా, ఇక్కడి నుంచి ఏటా రాకపోకలు జరిపే ప్రయాణికులు మాత్రం దాదాపు కోటి మంది మాత్రమే! దీనికంటే చిన్నదైన లండన్ హిత్రూ విమానాశ్రయం నుంచి ఏటా దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతుంటారు. సౌదీ అరేబియా ఇదివరకటి రాజు ఫాహద్ తన పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం 1999 నవంబర్ 28 నుంచి ప్రయాణికులకు సేవలందిస్తోంది. గల్ఫ్‌యుద్ధం జరిగినప్పుడు ఇది అమెరికన్ వైమానిక దళాలకు విమాన స్థావరంగా కూడా ఉపయోగపడింది. కళ్లు చెదిరే ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం విలాసవంతమైన వసతులు ఉన్నాయి. ఇందులోని పార్కింగ్ స్పేస్‌లో ఏకకాలంలో ఐదువేల కార్లు నిలిపి ఉంచడానికి తగిన సౌకర్యం ఉంది. విస్తీర్ణంలో అతిపెద్దదే అయినా, ప్రయాణికుల రద్దీలో మాత్రం ఈ విమానాశ్రయం వెనుకబడే ఉండటం గమనార్హం. -
సౌదీ నోటుపై భారత్ సరిహద్దు వివాదం పరిష్కారం
సాక్షి, న్యూఢిల్లీ : జీ 20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఈ సారి సౌదీ అరేబియా వేదిక కానుంది. సౌది యువరాజు మహ్మద్ బీన్ సల్మాన్ అధ్యక్షతన ఈ సమావేశం డిసెంబర్ 21,22 తేదీల్లో జరుగనుంది. అయితే దీని కోసం సౌదీ అరేబియా ప్రత్యేకంగా రూపొందించిన 20 రియాల్ నోట్‌పై భారత ప్రాదేశిక సరిహద్దులను తప్పుగా చిత్రీకరించడం వివాదానికి దారీ తీసింది. సౌదీ తీరుపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాలను భారత్‌లో అంతర్భాగంగా చూపించకపోవడం భారత ఆగ్రహానికి కారణమైంది. ఈ విషయంపై సౌదీ రాయబారి అషఫ్ సయీద్‌కు తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అక్టోబర్ 28న కోరగా.. సమస్య పరిష్కారానికి సౌదీ చొరవ చూపింది. దీనిపై స్పందించిన సౌదీ.. ఈ చిహ్నం కేవలం నమూనా మాత్రమే దీన్ని దేశంలో చేలామనిలో ఉండదని వివరించింది. ఈ మ్యాప్‌లో గిల్గిత్-బల్టిస్తాన్ పీఓకేను పూర్తిగా ప్రత్యేక భూభాగంగా చూపించడం గమనార్హం. వీడియా కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంపై ప్రధాని మోదీతో సౌదీ రోజు ఇదివరకే మాట్లాడారు. కోవిడ్ 19 మహమ్మారిని ప్రపంచ వ్యాప్తంగా కలిసి కట్టుగా ఎదుర్కోవడానికి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇరువురూ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ప్రదాని నరేంద్ర మోదీ ప్రధానంగా కోవిడ్19 గురించి ప్రస్తావించనున్నారు. కరోనా మహమ్మారిని అన్నిదేశాలు కలిసికట్టుగా, సుస్థిరంగా దీన్ని ఎదుర్కోవాలనే అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు, అందరు నాయకులు కరోనా నివారణా చర్యలు గురించి, ఉద్యోగుల పునరుద్ధరణ గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. -
ఆ మార్పు ప్రేమికులకు వరమైంది
సౌదీ అరేబియాలో రూల్స్‌ను అతిక్రమించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఓ జంట పెళ్లికి ముందు ఎలాంటి సంబంధం కొనసాగించినా వారికి దారుణమైన శిక్షలు తప్పవు. బాహాటంగా ప్రేమ పేరెత్తితే చాలు నాలుక తెగ్గోస్తారు. ఇలాంటి నేపథ్యంలో యువత ప్రాణాలకు తెగించి ముందడుగు వేయలేక.. ప్రేమ అనే మధురానుభవాన్ని రుచిచూడలేక అల్లాడిపోయింది. అందుకే ఆన్లైన్ ప్రేమ బాట పట్టించింది. ట్వీటర్, స్నాప్ చాట్, డేటింగ్ యాప్‌ల ద్వారా తమ ప్రేమకు తలుపులు తెరిచారు యువతీ,యువకులు. ప్రేమించుకోవటానికో వేదిక దొరికినందుకు తెగ సంతోష పడిపోయారు. సంబంధాలు వెతికి తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసే ఓపిక లేక కొందరు తల్లిదండ్రులు కూడా వీటిని ప్రోత్సహించారు. అయితే ప్రేమించిన వారిని నేరుగా కలుసుకోలేకపోతున్నామన్న బాధ వారిని వేధిస్తుండేది. అది కూడా నిన్నమొన్నటి వరకు. ప్రస్తుతం సౌదీ ప్రభుత్వం చట్టాల్లో తీసుకొస్తున్న మార్పు ప్రేమికులకు వరంగా మారింది. ఆ మార్పుల్లో భాగంగానే యువజంటలు కేఫ్‌లలో, రెస్టారెంట్లలో కలిసి కూర్చునే అవకాశం కలిగింది. దీనిపై అక్కడి యువత మాట్లాడుతూ... ‘సౌదీ అరేబియాలో ఎర్ర గులాబీలు అమ్మటం డ్రగ్స్ అమ్మినంత నేరం.. సంబంధంలేని ఓ యువకుడి పక్కన ఓ యువతి కూర్చుని మాట్లాడం అన్నది ఒకప్పుడు ఊహించుకోవటానికే సాధ్యం కాని విషయం.’’ అని అన్నారు. -
ఈ ఫోటోలో ఉన్న సూపర్స్టార్ల పేర్లు తెలుసా: షారూఖ్
ముంబై : బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సౌదీ అరేబియా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ‘జాయ్ ఫోరయ్ 2019’ కార్యక్రమంలో షారుఖ్ పాల్గొన్నారు. సౌదీలోని రియాద్‌లో జరుగుతున్న ఈ వేడుకల్లో ఆదివారం హాలీవుడ్ స్టార్ జాసన్ మొమోవా, హాంకాంగ్ యాక్షన్ హీరో జాకీచాన్, బెల్జీయం నటుడుజీన్-క్లాడ్ వాన్ డామ్మేలను కలుసుకున్నారు. వారితో కలిసి దిగిన ఫోటోలను తాజాగా షారూఖ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. View this post on Instagram Breaking the internet z pic of the day can you name all superstar in this picture? #ShahRukhKhan #TeamShahRukhKhan 😍 A post shared by Team Shah Rukh Khan (@teamshahrukhkhan) on Oct 13, 2019 at 7:40am PDT ‘ఆనందాలు అన్ని నావే.. నా హీరోలను కలిశాను’ , ‘ఈ ఫోటోలో ఉన్న సూపర్‌స్టార్ పేర్లు తెలుసా’.. అనే ట్యాగ్‌లతో షారూఖ్ షేర్ చేసిన ఈ ఫోటోలు తన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు అభిమానులు షేర్ చేసిన ఓ వీడియోలో షారుఖ్ తన హీరోలను కలిసే అవకాశాన్ని కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాల తెలిపారు. అలాగే తన ఆరేళ్ల కుమారుడైన అబ్రామ్.. జాసన్ అభిమానని షారుఖ్ తెలిపారు. ఏప్రిల్‌లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ మాట్లాడుతూ.. జీరో వైఫల్యం నన్ను కాస్తా నిరాశ పరిచింది. దీని నుంచి బయట పడటానికి నాకు కొంచెం సమయం కావాలి. ఈ మధ్యలో సినిమాలు చూడటానికి, పుస్తకాలు చదవడానికి, అలాగే నా కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నాను. అని తెలిపారు. View this post on Instagram Khan, Damme, Chan at the #JoyForum19. The joys all mine as I got to meet my heroes. @jcvd @jackiechan @joyforumksa A post shared by Shah Rukh Khan (@iamsrk) on Oct 13, 2019 at 8:17am PDT సొంత నిర్మాణ సంస్థలో వచ్చిన ‘జీరో’ సినిమా అనంతరం బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఇంతవరకు ఏ సినిమాను ఓకే చేయలేదు. అనుష్కశర్మ, కత్రినాకైఫ్ హిరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫిస్ వద్ద చతికిలపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 కోట్లతో నిర్మించిన ఈ సినిమాకు రూ.100 కోట్ల కనెక్షన్లు కూడా రాలేదు. అయితే సినిమాల విషయం పక్కకు పెడితే షారుఖ్ బిజీ బిజీగానే గడుపుతున్నారు. -
సౌదీ నుంచి శవాన్ని తెప్పించాలని విజ్ఞప్తి
-
సౌదీ నుంచి మృతదేహాన్ని తెప్పించండి
రియాద్ : సౌదీ అరేబియాలోని రియాద్‌లో నెలరోజుల క్రితం మరణించిన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం మారంపల్లి గ్రామానికి చెందిన చౌక రమేశ్(42) అనే కారు డ్రైవర్ మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కోరుతూ అతని కుటుంబ సభ్యులు గురువారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగాలను ప్రతివాదులుగా చేరుస్తూ మృతుని భార్య లావణ్య తల్లి రుక్కుంబాయి, తమ్ముడు రాజేశ్వర్ మానవహక్కుల కమిషన్‌లో ఫిటిషన్ దాఖలుచేశారు. అనంతరం హెచ్చార్సీ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి 67 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 21న మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య లావణ్య ఇద్దరు కుమార్తెలు శివాణి (11), పావని (9) ఉన్నారు. హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడానికి సహకరించిన ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి సురేందర్సింగ్ ఠాకూర్, వలసకార్మికుల హక్కుల కార్యకర్త, న్యాయవాది అబ్దుల్ ఖాదర్‌లు ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాలలో మరణించినవారి శవాలను తెప్పించడానికి భారత ప్రభుత్వం ఆయా దేశాలలోని ఇండియన్ ఎంబసీలలో ప్రత్యేక విభాగాలను, తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. గల్ఫ్ దేశాలలో మృతి చెందిన వలసకార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలరూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. గల్ఫ్‌లో గత ఐదేళ్లలో తెలంగాణ ప్రవాసులు వెయ్యిమందికిపైగా చనిపోయారని వారు తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న గల్ఫ్ కార్మికులు ఫోరం హెల్ప్ లైన్ నెం. +91 93912 03187ను సంప్రదించాలని కోరారు. -
సింహంతో ఆటలా.. జాగ్రత్త..
సౌదీ : వేటితోనైనా ఆటలాడొచ్చు కానీ ఈ క్రూర మృగాలతో ఆటలాడకూడదు. వాటి సంగతి తెలిసి కూడా వాటితో ఆటలు ఆడుకోవాలని చూస్తే ఇలాగే ఉంటది మరీ. వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాలోని జెడ్డాలో స్ప్రింగ్ ఫెస్టివల్ జరుగుతోంది. అక్కడ ఫెస్టివల్‌లోనే సింహాలు, పులులను కూడా ప్రదర్శనకు పెట్టారు. కాకపోతే అవి ఎన్‌క్లోజర్ ఉండి అందరినీ అలరిస్తున్నాయి. ఆ ఫెస్టివల్లో కొంతమంది పిల్లలు సింహాలతో ఓ ఆట ఆడుకోవానుకున్నారు. అందుకే సింహం ట్రైనర్‌ను పట్టుకొని ఎలాగోలా ఓ సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూరారు. అప్పుడు మొదలైంది అసలు సినిమా.. ట్రైనర్ అక్కడే ఉన్నాడని అది ఏం చేస్తుందిలే అన్న ధీమాతో సింహాన్ని ఆటపట్టిస్తున్నారు. ఇంతలోనే సింహానికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఓ అమ్మాయిని పట్టుకుంది. ఆ అమ్మాయిపై దాడి చేయబోయింది. దీంతో మిగితా పిల్లలు అరవడం మొదలు పెట్టారు. వెంటనే ట్రైనర్ ఆ సింహాన్ని పక్కకు లాగి ఆ అమ్మాయిని రక్షించాడు. ఈ విషయం ఫెస్టివల్ నిర్వాహకులకు తెలిసి పిల్లలను ఎన్‌క్లోజర్‌లోకి పంపించిన ట్రైనర్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
పారిపోయిన ప్రవాసీలపై కక్షసాధిస్తున్న 'కఫీల్లు'
హైదరాబాద్: నాలుగు నెలల క్రితం సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించిన క్షమాబిక్ష (ఆమ్నెస్టీ) పథకం జులై 25తో ముగియనుంది. నివాస, కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడి సౌదీలో అక్రమమంగా నివసిస్తున్న విదేశీయులు ఎలాంటి జరిమానాలు, జైలుశిక్షలు లేకుండా తమతమ దేశాలకు తిరిగి వెళ్లడానికి ఈ పథకం వెసులుబాటు కల్పించింది. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన సుమారు వెయ్యిమంది వలసకార్మికులపై 'మత్లూబ్' (పోలీసు కేసు) ఉన్నందున ‘అమ్నెస్టీ’ని వినియోగించుకోలేక పోతున్నారు. వీరిలో చాలామంది ఎడారిలో ఒంటెలు, గొర్రెల కాపరులుగా, ఇంటి డ్రైవర్లుగా, భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. సరైన భోజనం, వసతి లేకపోవడం, వేతనాలు చెల్లించకపోవడం, యజమానుల అమానవీయ ప్రవర్తన తట్టుకోలేక వీరు యజమానుల నుండి పారిపోయారు. సౌదీలో చిక్కుకుపోయిన తమను రక్షించి స్వదేశానికి తీసుకురావాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, తెలంగాణ మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవితలను కోరుతూ 35 మంది తెలంగాణకు చెందిన వలసకార్మికులు ఆదివారం ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన చల్ల సుదర్శన్ మాట్లాడుతూ తమకు పనిలేదని, ఉండటానికి, తినడానికి డబ్బులు లేవని తమను ఎలాగైనా రక్షించి ఇండియాకు పంపాలని వేడుకున్నారు. 'హురూబ్'.. 'మత్లూబ్' సౌదీ అరేబియాలో 'కఫీల్' (స్పాన్సర్ / యజమాని) కి తెలుపకుండా ప్రవాసి ఉద్యోగి పనికి గైరుహాజరు కావడం, పారిపోవడాన్ని అరబ్బీలో 'హురూబ్' (పారిపోయిన ప్రవాసి ఉద్యోగి) అంటారు. సౌదీ చట్టాల ప్రకారం ఉద్యోగి పారిపోయిన సందర్భాలలో యజమాని 'జవజత్' (పాస్ పోర్ట్, ఇమ్మిగ్రేషన్ శాఖ) అధికారులకు ఫిర్యాదు చేస్తే ప్రవాసి ఉద్యోగిని 'హురూబ్' గా ప్రకటిస్తారు. కొందరు యజమానులు పారిపోయిన ఉద్యోగులపై దొంగతనం, ఆస్తి నష్టం లాంటి 'మత్లూబ్' (పోలీసు కేసు) నమోదు చేస్తుంటారు. దురుద్దేశం కలిగిన కొందరు 'కఫీల్లు' పారిపోయిన ఉద్యోగులను పీడించడానికి 'మత్లూబ్' వ్యవస్థను ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. Dear @balkasumantrs sir @SushmaSwaraj mam we r stuck in saudi, bcoz of sponsors kepts us false cases.pls save us n bring back to india. pic.twitter.com/jh0PZnyyog — Madhusudhan dasari (@Madhusudhanda13) 23 July 2017 -
రంజాన్ మాసం.. రక్తసిక్తం
ముస్లింలు నిష్టగా దీక్షలు, భక్తితో ప్రార్థనలు, హృదయంతో దానాలు చేసే పవిత్ర రంజాన్ మాసం రక్తసిక్తంగా మారింది. ఖలీఫా(మతరాజ్యం) స్థాపన పేరుతో హింసోన్మాదాన్ని నానాటికీ విస్తరింపజేస్తోన్న ఉగ్రవాద సంస్థ ఐసిస్.. ఈ ఏడాది రంజాన్ మాసంలో ప్రపంచ వ్యాప్తంగా 800 మందిని అతి దారుణంగా చంపేసింది. భూగోళంలోని దాదాపు అన్ని దేశాల్లో ఐసిస్ నరమేధం కొనసాగుతోంది. ఐసిస్ మూలాలున్న ఆసియా నుంచి ఐరోపా వరకు.. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసుకునే రంజాన్ మాసంలో బీభత్సం సృష్టించడం ఐసిస్ లాంటి ఉగ్ర సంస్థలకు కొత్తకాకపోయినా ఈ ఏడాది మారణహోమంలో బలైన అమాయకుల సంఖ్య భారీగా ఉండటం విషాదం. ముస్లింలోనే సున్నీ వర్గానికి చెందిన సాయుధులు ఏర్పాటుచేసిన ఐసిస్.. తమ మత భావనలను వ్యతిరేకించే షియాలపై ఎడతెగని దాడులు చేస్తోంది. ఒక్క షియాలేకాక ముస్లింలలోని ఇతర వర్గాలు, ఇతర మతస్తులను సైతం కర్కషంగా చంపేస్తోంది. దాడులకు మిగతా సమయంలో కంటే రంజాన్ మాసమే అనువైనదని ఐసిస్ భావిస్తోంది. ఎందుకంటే సాధారణ దినాల్లోకంటే పవిత్రమాసంలో ప్రతి ముస్లిం విధిగా మసీదుకు వెళతాడు. అలా గుంపుగా చేసిన జనాన్ని చంపడం ద్వారా ఐసిస్ తన లక్ష్యాన్ని సులువుగా నెరవేర్చుకుంటుంది. రంజాన్ మాసంలోని నాలుగు వారాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టిన ఐఎస్.. అమెరికా, ఫిలిప్పీన్స్, యెమెన్, జోర్డాన్, ఇరాక్, లెబనాన్, బంగ్లాదేశ, టర్కీలతో పాటు ఇన్నాళ్లూ మిత్రదేశంగా ఉన్న సౌదీ అరేబియాపై సైతం దాడులు చేసి మొత్తం 800 మందిని అమాయకులను పొట్టనపెట్టుకుంది. రంజాన్ పండుగకు మరో 48 గంటలు సమయం ఉండటంతో ఈ లోపు ఐసిస్ మరింత బీభత్సం సృష్టించే అవకాశం లేకపోలేదు. హైదరాబాద్ లో ఐసిస్ మాడ్యూల్ ను గుర్తించి, భారీ కుట్రను ముందుగానే భగ్నం చేసిన పోలీసులు.. రంజాన్ పర్వదిన వేడుకలు ముగిసేంతవరకు అప్రమత్తతను ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు మిగతా దేశాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొత్త తరహా దాడులతో ఐసిస్ రెచ్చిపోతూనేఉంది. ఈ ఏడాది రంజాన్ మాసం జూన్ 7న ప్రారంభమైంది. అదేరోజు ఇరాక్ లోని మౌసూల్ పట్టణంలోగల ఓ మసీదుపై ఐసిస్ ఉగ్రవాదులు దాడిచేసి 65 మంది షియాలను పొట్టనపెట్టుకున్నారు. వారం తర్వాత, అంటే జూన్ 14న అమెరికాలోని ఓర్లాండో నైట్ క్లబ్ లో ఐసిస్ ఉగ్రవాది మతీన్ 50 మందిని దారుణంగా కాల్చిచంపాడు. జులై 1న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులు ఒక భారతీయురాలు సహా 20 మందిని చంపేశారు. ఇది జరిగిన కొద్ది గంటలకే బాగ్ధాద్ నగరంలోని షాపింగ్ సెంటర్ లో చోటుచేసుకున్న పేలుళ్లలో 200 మంది మృత్యువాతపడ్డారు. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవానికి వ్యతిరేకంగా జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తిరిగి జులై 4న ముస్లింల రెండో అతిపెద్ద పవిత్ర క్షేత్రం మదీనాలో ఉగ్రదాడి జరిగింది. ఆత్మాహుతి దాడి కారు పార్కింగ్ ప్రదేశంలో జరిగిందికాబట్టి ప్రాణనష్టం తక్కువైంది. అదే జనసమ్మర్థ ప్రదేశంలో జరిగి ఉండేదుంటే ఘోరం ఊహించని విధంగా ఉండేది. ఇవి కాక ఇరాక్, సిరియాల్లో ఐసిస్ దాదాపు 400 మందిని పొట్టనపెట్టుకున్నట్లు పలు వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రపంచమంతా ఒక్కటై ఐసిస్ ను నిరోధించకుంటే భవిష్యత్ లో 'రంజాన్ మాసపు సామూహిక ప్రార్థనలు' అని చదువుకోవాల్సి వస్తుందేమో! -
9/11 రహస్య నివేదిక: స్నేహితుల మధ్య చిచ్చు
వాషింగ్టన్: అమెరికా చరిత్రలో అత్యంత పాశవిక చర్యగా భావించే 9/11 దాడులపై ఆ దేశ నిఘా సంస్థ సీఐఏ తయారుచేసిన 'రహస్య' రిపోర్టుపై మళ్లీ వివాదం మొదలైంది. విమానాలను హైజాక్ చేసి,న్యూయార్క్ ట్విన్ టవర్లను పూర్తిగా, రక్షణ కేంద్రం పెంటగాన్ ను పాక్షికంగా ధ్వంసం చేసిన హైజాకర్లు 19 మందిలో 15 మంది సౌదీ అరేబియా జాతీయులే కావడం ఈ వివాదానికి కేంద్రబిందువు. హైజాకర్లకు సౌదీ ప్రభుత్వం సహకరించిందని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వినవచ్చాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన సీఐఏ రిపోర్టు.. 9/11 దాడుల్లో సౌదీ పాత్ర ఏమిటనేది బయటపెట్టకపోగా, దానికి సంబంధించిన 28 పేజీలను రహస్యంగా ఉంచింది. ఆ రహస్య పత్రాల వెల్లడితోపాటు, అంతర్జాతీయ న్యాయస్థానంలో సౌదీ అరేబియాపై కేసులు వేసేందుకు ఉపకరించే కీలక బిల్లు నేడో, రేపో ఆమోదం పొందనుంది. ఇప్పటికే అమెరికన్ సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు.. ప్రస్తుతం హౌస్ ఆఫ్ రిప్రెసెంటేటివ్స్ కు చేరింది. అక్కడ ఆమోదం లభిస్తే.. 9/11 బాధిత కుటుంబాల్లో ఎవరైనాసరే, సౌదీని కోర్టుకు ఈడ్చే అవకాశం ఉంటుంది. అమెరికా చర్యలపై దాని మిత్రదేశమైన సౌదీ భగ్గుమంటోంది. తమ ప్రభుత్వంపై కేసులు పెట్టే వీలు కల్పించే బిల్లును నూటికినూరుపాళ్లు వ్యతిరేకిస్తున్నామని, ఇలాంటి చర్యలు ఇరుదేశాల సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని సౌదీ విదేశాంగ శాఖ మంత్రి అమెరికాను హెచ్చరించారు. కాగా, నివేదికలోని 28 పేజీల రహస్య భాగంలో సౌదీని దోషిగా నిలిపే ఆధారాలేవీ లేవని సీఐఏ చీఫ్ జాన్ బ్రెన్నాన్ అంటున్నారు. సమగ్ర దర్యాప్తులో హైజాకర్లకు సౌదీ ప్రభుత్వం సహకరించినట్లు వెల్లడికాలేదని తెలిపారు. -
సౌదీలో కార్మికులకు ప్రభుత్వం సువర్ణావకాశం
మోర్తాడ్ (నిజామాబాద్ జిల్లా): సౌది అరేబియాలో వీసా గడువు ముగిసి నిబంధనలకు విరుద్థంగా ఉంటున్న కార్మికులు ఎలాంటి శిక్ష అనుభవించకుండా ఇళ్లకు వెళ్లిపోయే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం మరోసారి కల్పించింది. రెండేళ్ల విరామం తరువాత మరోసారి సౌదిలో క్షమాభిక్షను అక్కడి ప్రభుత్వం అమలులోకి తీసుకవచ్చింది. విజిట్ వీసాలపై సౌది అరేబియాకు వెళ్లి వీసా గడువు ముగిసినా అక్కడే ఉంటు పనులు చేస్తున్న తెలుగు కార్మికులు ఎందరో ఉన్నారు. కంపెనీ వీసాలపై వెళ్లి కంపెనీలో పని బాగాలేక బయటకు వచ్చిన కార్మికులు సౌదిలో వేలాది సంఖ్యలో ఉంటారు. నిబంధనలకు విరుద్దంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్మికులు సౌదిలో దాదాపు 30వేల మందికి పైగా ఉంటారని స్వచ్చంద సంస్థల అంచనాలు చెబుతున్నాయి. సౌదిలో నిబంధనలకు విరుద్దంగా ఉంటు పనులు చేస్తున్న కార్మికుల సంఖ్య భారీగా పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం గతంలో నతాఖా చట్టాన్ని అమలులోకి తీసుకవచ్చింది. నతాఖా చట్టం ప్రకారం వర్క్ పర్మిట్ లేకుండా చట్టవిరుద్దంగా ఉంటున్న కార్మికులు రాయబార కార్యాలయం, సౌది పోలీసులకు స్వచ్చందంగా లొంగిపోయి ఇళ్లకు వెళ్లిపోవాలి. నతాఖా చట్టం అమలు అయిన మొదట్లో వేలాది మంది కార్మికులు ఇళ్లకు చేరుకున్నారు. సౌదిలో పని చేస్తున్న కార్మికుల్లో ఎక్కువ మందికి వర్క్ పర్మిట్లు లేక పోవడంతో పోలీసుల కంటపడకుండా అక్కడ తలదాచుకుంటున్నారు. ఈనెల 3 నుంచి క్షమాభిక్షను అమలు చేసిన సౌది ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఉన్న కార్మికులు స్వదేశాలకు వెళ్లిపోవడానికి వచ్చె నెల 30(సెప్టెంబర్ 30, 2015) వరకు గడువు విధించింది. ఈ సారి మాత్రం నిబంధనలకు విరుద్దంగా ఉన్న కార్మికులు స్వదేశాలకు వెళ్లిపోకుంటే మాత్రం కఠిన శిక్షలను అమలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. క్షమాభిక్ష సమయంలో ఇళ్లకు వెళ్లిపోకుండా ఉండి గడువు ముగిసిన తరువాత పట్టుబడితే కఠిన జైలు శిక్ష అమలుతో పాటు పాస్‌పోర్టును రద్దు చేసి మరే గల్ఫ్ దేశానికి వెళ్లకుండా చేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. విదేశాంగ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లో తాత్కలిక పాస్‌పోర్టును జారీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. సౌది ప్రభుత్వం అమలు చేస్తున్న క్షమాభిక్ష వల్ల తెలంగాణ జిల్లాలకు చెందిన వేలాది మంది కార్మికులకు సొంత గ్రామాలకు చేరుకునే అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే శిక్షల నుంచి తప్పించుకోవాలని గల్ఫ్ బాధితుల సంఘాలు కార్మికులకు సూచిస్తున్నాయి. -
బతుకుదెరువు కోసం వెళ్లి సౌదీలో మృతి
మెదక్(దుబ్బాక): చేసిన అప్పులు తీర్చేందుకు సౌదీ వెళ్లిన ఓ వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో ప్రాణాలొదిలాడు. మెదక్ జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన చుక్క రాములు(55) తనకున్న నాలుగున్నర ఎకరాల్లో బోరు కోసం రూ.లక్ష అప్పు చేశాడు. బోర్లు వేసినా వాటిలో చుక్క నీరు పడలేదు. ఇక వ్యవసాయంతో లాభం లేదని భావించిన రాములు... ఉన్న ఊరు, కుటుంబాన్ని వదిలేసి మూడు రోజుల కిందట సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఆ ఖర్చుల కోసం మరో రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. సౌదీలో పనిచేసి ఈ అప్పులన్నింటినీ తీర్చేద్దామనుకున్న రాములు... అక్కడే గుండెపోటుతో మృతిచెందాడు. మంగళవారం రాత్రి గుండె నొప్పితో బాధపడుతున్న రాములుని అతని మిత్రులు ఆసుపత్రికి తరలించేలోపు ప్రాణాలు వదిలాడు. కుటుంబసభ్యుల రోదనలతో ఆకారం గ్రామంలో విషాదం నిండుకుంది. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని వెంటనే తమకు అందించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
యెమెన్ రెబెల్స్‌పై దాడులు తీవ్రం
సనా: యెమెన్‌లోని షియా తిరుగుబాటుదారులపై సౌదీ అరేబియా నేతృత్వంలోని అరబ్ దేశాల కూటమికి చెందిన యుద్ధవిమానాలు మంగళవారం వరుసగా ఆరో రోజూ దాడులను ఉధృతం చేశాయి. యెమెన్ రాజధాని సనా చుట్టుపక్కల ఉన్న రెబెల్స్ స్థావరాలు, క్షిపణులు, ఆయుధాగారాలను బాంబుదాడులతో ధ్వంసం చేశాయి. కూటమి యుద్ధనౌకలు కూడా తొలిసారిగా రంగంలోకి దిగి ఆడెన్లోని రెబెల్స్ అధీనంలో ఉన్న విమానాశ్రయంపై దాడి చేశాయి. -
సౌదీలో వలసజీవి ఆత్మహత్య
చందుర్తి : బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన వలసకార్మికుడు విగతజీవిగా మారాడు. కంపెనీ సరిగా జీతం ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన పొక్కిలి శంకర్ (32) రూ.1.20 లక్షల వరకు అప్పు చేసి ఐదేళ్ల క్రితం సౌదీ వెళ్లాడు.అప్పటి నుంచి కంపెనీ సరిగా జీతం ఇవ్వడం లేదు. బలవంతంగా పని చేరుుంచుకుంటోంది. దీంతో మనస్తాపం చెందిన శంకర్ గురువారం తా ను పనిచేస్తున్న చోటే బంగ్లాపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయూన్ని తోటి కార్మికులు ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు తెలిపారు. -
ఇంటికి చేరిన శ్రీనివాస్ మృతదేహం
ఆదిలాబాద్ : సౌదీఅరేబియాలో గతనెల 21న గుండెపోటుతో మృతి చెందిన బెడ్యారపు శ్రీనివాస్ మృతదేహం శనివారం స్వగ్రామం ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్‌కు చేరింది. రెండు సంవత్సరాల క్రితం కూలీ పనుల కోసం శ్రీనివాస్ సౌదీ అరేబియా వెళ్లాడు. కాగా అక్కడ అతని యజమాని సరిగా జీతం చెల్లించకపోవడం, ఇంటి దగ్గర అప్పులు పెరిగిపోయాయి.దీంతో శ్రీనివాస్ తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలోనే అతను గుండెపోటుతో జనవరి 21న మరణించాడు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. (ఖానాపూర్)