
సౌదీ : వేటితోనైనా ఆటలాడొచ్చు కానీ ఈ క్రూర మృగాలతో ఆటలాడకూడదు. వాటి సంగతి తెలిసి కూడా వాటితో ఆటలు ఆడుకోవాలని చూస్తే ఇలాగే ఉంటది మరీ. వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాలోని జెడ్డాలో స్ప్రింగ్ ఫెస్టివల్ జరుగుతోంది. అక్కడ ఫెస్టివల్‌లోనే సింహాలు, పులులను కూడా ప్రదర్శనకు పెట్టారు. కాకపోతే అవి ఎన్‌క్లోజర్ ఉండి అందరినీ అలరిస్తున్నాయి. ఆ ఫెస్టివల్‌లో కొంతమంది పిల్లలు సింహాలతో ఓ ఆట ఆడుకోవానుకున్నారు. అందుకే సింహం ట్రైనర్‌ను పట్టుకొని ఎలాగోలా ఓ సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూరారు.
అప్పుడు మొదలైంది అసలు సినిమా.. ట్రైనర్ అక్కడే ఉన్నాడని అది ఏం చేస్తుందిలే అన్న ధీమాతో సింహాన్ని ఆటపట్టిస్తున్నారు. ఇంతలోనే సింహానికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఓ అమ్మాయిని పట్టుకుంది. ఆ అమ్మాయిపై దాడి చేయబోయింది. దీంతో మిగితా పిల్లలు అరవడం మొదలు పెట్టారు. వెంటనే ట్రైనర్ ఆ సింహాన్ని పక్కకు లాగి ఆ అమ్మాయిని రక్షించాడు. ఈ విషయం ఫెస్టివల్ నిర్వాహకులకు తెలిసి పిల్లలను ఎన్‌క్లోజర్‌లోకి పంపించిన ట్రైనర్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment