lion
-
వైరల్.. మృగరాజుకి ఆకలేసి కిచెన్‌లో దూరింది!
గాంధీనగర్ : అడవికి రాజు అయిన సింహం జనావాసాల్లోకి వస్తే ఏమవుతుంది. అమ్మో.. ఊహించుకోవడానికే భయంగా ఉందంటారా? అలాంటిది. ఇంట్లో అందరూ గాఢనిద్రలో ఉండగా.. ఆ సింహం ఇంటి పై కప్పు నుంచి సైలెంట్‌గా కిచెన్‌లో అడుగుపెడితే . సుమారు రెండు గంటల పాటు అక్కడే తిష్ట వేస్తే.. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో ఒక కుటుంబానికి ఓ చిరుత షాకిచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో బుధవారం రాత్రి ములుభాయ్ రాంభాయ్ లఖన్నోత్రా కుటుంబం బుధవారం రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఓ సింహం వారి కిచెన్‌లోని గోడపై కూర్చొంది. సుమారు రెండుగంటల పాటు తిష్టేసింది.#Amreli: #Gujarat Family Finds Lion Sitting In Their Kitchen pic.twitter.com/dMkfqcILI0— Timeline. (@timelinelatest) April 4, 2025అయితే అర్ధరాత్రి తర్వాత ఇంట్లో చప్పుడు కావడంతో ములుభాయ్ కుటుంబసభ్యులు ఉలిక్కపడి లేచారు. కళ్లార్పకుండా వంటగది గోడమీద ఉన్న సింహం వారినే చూస్తుండడంతో ఒక్కసారిగా హతాశులయ్యారు. బతుకు జీవుడా అనుకుంటూ బిగ్గరగా కేకలు వేస్తూ భయటకు పరుగులు తీశారు. కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ములుభాయ్ కుటుంబసభ్యులకు ఏమైందోనని వచ్చి చూడగా.. వంటగదిలో ఉన్న సింహాన్నిచూసి జడుసుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం, వైరల్ అవుతున్న ఓ వీడియోలో సింహం వంటగది గోడపై కూర్చొని ఉండడాన్ని గమనించొచ్చు. చికట్లో కూడా మిరుమిట్లు గొలిపేలా కాంతిని వెదజల్లుతున్న సింహం కళ్లను గ్రామస్తులు తమ సెల్ఫోన్లలో బంధించడం మనం చూడొచ్చు. సుమారు రెండు గంటల తర్వాత గ్రామస్తుల సహాయంతో సింహాన్ని తరిమికొట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఇంట్లో సింహం చొరబడిందనే సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సింహం ఎక్కడ నుంచి వచ్చిందో ఆరా తీశారు. -
‘స్టార్’ లయన్
‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవికి రాజు సింహం’.. ఎన్నో తరాలుగా పిల్లలకు చెప్పే కథే ఇది! ఇక్కడ కూడా అడవిలో రారాజుగా వెలుగొందిన ఓ మృగరాజు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎన్నో యుద్ధాలు చేసి రాజ్యాన్ని, బలగాన్ని విస్తరించి, తన రాజ్యాన్ని 14 ఏళ్ల పాటు ఆఫ్రికా ఖండంలోనే ఓ పెద్ద అడవిని ఏక ఛత్రాధిపత్యంతో ఏలింది ఈ సింహం. కుడి కంటిపై గాటుతో భయంకరంగా కనిపించే ఈ సింహం 2021 జూన్ 11న వృద్ధాప్యంతో ప్రాణాలు విడిచింది. ఈ గాటు వల్లనే దానికి ‘స్కార్ ఫేస్ లయన్’గా పేరుపొందింది. ఐదేళ్ల క్రితం ఓ సింహం గడ్డిలో పొర్లాడుతూ భయంకరమైన గర్జన చేస్తూ చనిపోయిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. అది ఎక్కడ జరిగిందో అని చాలా మంది ఆరా తీయగా.. కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్కులోదిగా తేల్చారు. అప్పుడే ఈ లయన్ కింగ్ ప్రత్యేకత తెలిసింది. అడవుల్లో సింహాలు గరిష్టంగా 12 ఏళ్లు బతికితే.. ఇది మాత్రం 14 సంవత్సరాలు జీవించింది. ఇదేం పెద్ద గొప్పకాకున్నా..బతికినంత కాలం రారాజుగానే ఉండి, సహజ మరణం పొందడమే విశేషం. ఈ లయన్ కింగ్ జీవితం, పోరాటాలు, సాహసాలపై కెన్యా ప్రభుత్వం పలు సందర్భాల్లో వీడియోలు తీసి, ఓ డాక్యుమెంటరీగా రూపొందించింది. అందులోని కొన్ని భాగాలు ఇప్పుడు మనదాకా వచ్చాయి. ఈ ‘స్టార్ లయన్ కింగ్’ ప్రత్యేకత ఏంటంటే.. – సాక్షి, అమరావతిపుట్టింది - 2007మరణం - 2021 జూన్ 11 వేట - 130 మగ సింహాల మరణం 400 హైనాలు ఒక హిప్పోపోటమస్లెక్కలేనన్ని అలిగేటర్స్ (మొసళ్లు)సొంత కుటుంబం - 120 సింహాలుజీవించిన కాలం - 14 సంవత్సరాలుఆఫ్రికాలోనే అత్యంత సెలబ్రిటీ లయన్గాగుర్తింపుమరో సింహానికి అవకాశం ఇవ్వకుండా..ఆఫ్రికా ఖండంలో అతి పెద్ద నేషనల్ పార్కుల్లో ఒకటి కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్కు. 400 చదరపు కిలోమీటర్లు విస్తరించిన ఈ అరణ్యంలో 2007లో పుట్టిందీ సింహం. మూడేళ్లకే అరివీర భయంకరిగా మారింది. అడవుల్లో సహజంగా మగ సింహాల మధ్య ఆధిపత్య పోరు ఉంటుంది. ఈ పోరులో గెలిచిన సింహం శత్రు గుంపులోని ఆడ సింహాలను, ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంటుంది. ఇంత పెద్ద అడవిలో ఈ లయన్ మరో మగ సింహానికి అలాంటి అవకాశమే ఇవ్వలేదు. ప్రతి యుద్ధంలో గెలిచింది. ఆడ సింహాలన్నింటినీ సొంతం చేసుకుంది. 14 ఏళ్ల జీవిత కాలంలో 130 మగ సింహాలను హతమార్చింది. 400కు పైగా హైనాలను హతమార్చింది. ఖడ్గమృగాలు, బలీయమైన మొసళ్లను చంపేసింది. సాధారణంగా సింహాలు హిప్పో (నీటి ఏనుగు)ల జోలికి పోవు. కానీ ఈ స్కార్ ఫేస్ లయన్ ఓ మగ హిప్పోతో ఒంటరిగా పోరాడి గెలిచింది. ఇవి అధికారికంగా అటవీ సంరక్షకులు గుర్తించిన సంఖ్య మాత్రమే.120 సింహాల గుంపునకు నాయకత్వంకంటిపై గాటుతో కనిపించే ఈ మృగరాజు జీవితాంతం సవాళ్లతో పోరాడింది. స్థానిక సింహాలనే కాదు.. వేటగాళ్ల దాడులను సైతం దీటుగా ఎదుర్కొంది.ఎదురే లేని రారాజుగా నిలిచిందని అటవీ పరిరక్షకులు చెబుతుంటారు. పోరాటాల్లో తగిలిన తీవ్రమైన గాయాల నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు ప్రతికూల పరిస్థితుల్లోనూ గర్వంగా నిలబడింది. అడవిలో ఓర్పుకు చిహ్నంగా మారింది. సాధారణంగా సింహాల గుంపులో 5 నుంచి 20 వరకు ఉంటాయి. కానీ ఈ మృగరాజు మాత్రం 120 సింహాలతో కూడిన పెద్ద గుంపుతో తిరిగేది. అందుకే మసాయి మారాలోని ఇతర జీవులకు ఈ కింగ్ అంటే హడల్. ‘స్కార్ ఫేస్ లయన్’గా మారింది ఇలా..2012లో ఓ గుంపులోని ఆల్ఫా లయన్‌తో జరిగిన పోరాటంలో కుడి కంటికి, దాని పైభాగంలో లోతైన గాయమైంది. అదే పెద్ద గాటుగా మారిపోయింది. దాంతో దానికి‘స్కార్ ఫేస్ లయన్’గా సందర్శకులు పేరు పెట్టారు. ఈ సింహం 2021 జూన్ 11న వృద్ధాప్యంతో మరణించింది. మసాయి మారా రిజర్వ్ ఫారెస్ట్ సందర్శనకు వచ్చే వారికి ఈ స్కార్ ఫేస్ లయన్ డాక్యుమెంటరీని చూపిస్తారంటే దాని ప్రత్యేకతను అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మృగరాజు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది
కొందరు వెర్రితో చేసే పిచ్చి స్టంట్లు భయానకంగానూ, ప్రాణాంతకంగానూ ఉంటాయి. కనీసం ఇలాంటివి చేసే ముందు వికటిస్తే ఏమవుతుందో అనే ధ్యాస లేకుండా అనాలోచితంగా చేసేస్తారు. ఆ తర్వాత అందరూ చూస్తుండగానే వాళ్ల కథ విషాదాంతంగా ముగిసిపోతుంటుంది. అలాంటి ఘటనే ఇది.ఓ జూ సంరక్షకుడు గర్ల్‌ఫ్రెండ్(Girlfriend)ని ఇంప్రెస్ చేద్దాం అనుకుని చేసిన పనికి ప్రాణాలే పోగొట్టుకున్నాడు. ఈ ఘటన ఉజ్బెకిస్తాన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..44 ఏళ్ల జూకీపర్(zookeeper) తన గర్ల్‌ఫ్రెండ్‌ని ఇంప్రెస్ చేద్దామన్న ఉద్దేశ్యంతో ఓ స్టంట్ చేయాలనుకున్నాడు. అందుకోసం తెల్లవారుజామున 5 గంటలకు సింహాల గుహ(Lion Den)కు చేరుకుని సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకుంటున్నాడు. ముందుగా మూడు పెద్ద సింహాలు ఉన్న బోనులోకి వెళ్లాడు. వాటిని నిశబ్దంగా ఉండండి అని సైగ చేస్తూ సెల్ఫీ వీడియో చిత్రీకరిస్తున్నాడు..ఇంతలో ఓ సింహం అనుహ్యంగా అతడి చేతిపై దాడిచేయడంతో.. జరగకూడని ఘోరం జరిగిపోయింది. చివరికీ ఆ సింహాల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించాడు. అతడు సరదాగా చేసిన స్టంట్ కాస్తా తన చివరి క్షణాలను బంధించిన వీడియోగా మిగిలిందని పోలీసులు వెల్లడించారు. ఏదీ ఏమైనా క్రూర జంతువులతో చేసే స్టంట్ల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాల్సిందే.(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!) -
జూ కీపర్‌ను కొరికి చంపిన సింహం
అబూజా: నైజీరియాలోని ఓ జూలో ఆదమరిచి ఉన్న ఉద్యోగిని సింహం కొరికి చంపింది. ఒగున్ రాష్ట్రం అబియోకుటలో ఉన్న మాజీ అధ్యక్షుడు ఒబసాంజోకు చెందిన పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. బబజీ దౌలే(35) అనే సుశిక్షు తుడైన జూ కీపర్ అందులోని సంహానికి ఆహారం వేయడం వంటి పనులు చూస్తుంటారు. శనివారం సాయంత్రం కొందరు సందర్శకులు రావడంతో వారికి దౌలే సింహానికి ఆహారం వేసే విధానం చూపించాలనుకున్నారు. సింహం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించడంతో సాధారణంగా మూసి ఉంచాల్సిన గేటును తెరిచే ఆహారం వేయడం ప్రారంభించారు. ఆ సింహం అనుకోకుండా ఆయనపై దాడి చేసి, మెడను నోట కరుచుకుంది. దీంతో, సెక్యూరిటీ గార్డులు సింహాన్ని కాల్చి చంపారు. -
చిన్నప్పటినుంచీ తిండిపెట్టిన వాడినే చంపేసింది!
క్రూర జంతువులు ఎపుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు అనడానికి తాజా ఘటన ఒక ఉదాహరణ. చిన్నప్పటి నుంచి తిండి పెట్టి, తనకు సంరక్షుడిగా ఉన్న వ్యక్తినే దారుణంగా చంపేసింది మగ సింహం. అది ఏ మూడ్‌లో ఉందో తెలియదు గానీ తనకు తిండిపెడుతున్న జూకీపర్‌పై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నైజీరియా, ఒసున్ రాష్ట్రంలోని ఒబాఫెమి అవోలోవో యూనివర్శిటీ జంతుప్రదర్శనశాలలో చోటు చేసుకుంది. ఈ సంఘటనతో యూనివర్సిటీ వర్గాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఒలియావుకి అందరూ నివాళులర్పించారు. బీబీసీ కథనం దాదాపు దశాబ్ద కాలంగా సింహాలకు సంరక్షుడిగా ఉన్నాడు ఒలాబోడే ఒలావుయి (Olabode Olawuyi), విధుల్లో భాగంగా సోమవారం సింహాలకు ఆహారం ఇస్తుండగా జూకీపర్‌పై దాడి చేసి చంపేసింది సింహం. అతడిని రక్షించడానికి అతని సహచరులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. (Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్) ఒలావుయి వెటర్నరీ టెక్నాలజిస్ట్. తొమ్మిదేళ్ల క్రితంక్యాంపస్లో పుట్టిన సింహం సంరక్షణ బాధ్యతల్లో ఉన్నాడు. మరో దురదృష్టకర ఘటన ఏంటంటే, జూకీపర్‌ని చంపిన సింహాన్ని కూడా జూ సిబ్బంది కాల్చి చంపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించినట్లు యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ అడెబాయో సిమియోన్ బమిరే వెల్లడించారు. (COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!) తాళం వేయకపోవడంతోనే ఘోరం జూకీపర్ సింహాలకు ఆహారం ఇచ్చిన తర్వాత తలుపు తాళం వేయడం మరచిపోవడంతోనే ఈ ఘోరం జరిగిందని స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు అబ్బాస్ అకిన్రేమి ,ఈ సంఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఉత్తర నైజీరియాలోని కానోలోని జూలో 50 ఏళ్లకు పైగా సింహాలకు ఆహారం అందిస్తున్న అబ్బా గండు స్పందిస్తూ, ఇది దురదృష్టకరమని, మరిన్ని భద్రతా చర్యలు అవసరమని పేర్కొన్నాడు. అంతేకాదు ఈ దుర్ఘటన ప్రభావం తనమీద ఉండదనితాను చనిపోయే వరకు సింహాలకు ఆహారం అందిస్తూనే ఉంటానని తెలిపాడు. ( వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..!) -
తిరుపతి జూపార్క్‌లో దారుణం.. వ్యక్తిని చంపేసిన సింహం
సాక్షి, తిరుపతి: తిరుపతి ఎస్వీ జూపార్క్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని సింహం చంపేసింది. గుర్తు తెలియని వ్యక్తి జూపార్క్‌లోని సింహం ఎన్ క్లోజర్లోకి దూకాడు. దీంతో సందర్శకుడిని సింహం నోట కరచుకొని ఎత్తుకెళ్లి దాడి చేసి చంపేసింది. మృతుడిని రాజస్థాన్‌కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్‌గా గుర్తించారు. సింహాన్ని ఎన్‌క్లోజర్ కేజ్‌లో అధికారులు బంధించారు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ శరత్‌రాజ్ జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే సెల్ఫీ దిగడానికి సింహాల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన సందర్శకుడు.. భయంతో చెట్టు ఎక్కి కింద పడినట్లు తెలుస్తోంది. సింహం నోటికి చిక్కడంతో బాధితుడి తల భాగాన్ని సింహం పూర్తిగా తినేసినట్లు సమాచారం. ఎస్వీ జూపార్క్‌లో సింహం దాడి ఘటనపై స్పందించిన జూ అధికారులు.. ఎస్వీ జూ పార్క్ క్యురేటర్ మీడియాతో మట్లాడారు. ‘మధ్యాహ్నం 2.30 గంటలు సమయంలో సింహం ఎంక్లోజర్లోకి ఓ వ్యక్తి దూకి వెళ్ళాడు. జూ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసే లోపే ఎన్‌క్లోజర్‌లోకి వెళ్ళాడు. సింహం మెడ ప్రాంతంలో నోట కరుచుకుని ఎత్తుకు వెళ్ళడంతో మృతి చెందాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రహ్లాద్ గుల్జార్గా గుర్తించాం. అతను ఒక్కడే వచ్చాడు. పోలీసులుకు, 108 సిబ్బందికి సమాచారం ఇచ్చాం. పోస్ట్‌మార్టం నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలింపు’ అని తెలిపారు. -
Lion Kiran: ఇంద్రలోక్ థీమ్‌తో బర్త్‌డే సెలబ్రేషన్స్.. సినీతారల హడావుడి (ఫోటోలు)
-
సింహం వద్ద సలహదారు ఉద్యోగం!
ఉదయగిరి దగ్గర వున్న అడవికి భైరవ అనే సింహం రాజుగా ఉండేది. సుబుద్ధి అనే నక్క దానికి సలహాదారుగా ఉండేది. ఒక రోజు సాయంత్రం సుబుద్ధి.. దిగాలుగా ఇల్లు చేరింది. ‘అలా ఉన్నావేం? ఒంట్లో బాగా లేదా?’ అంటూ ఆతృతగా అడిగింది సుబుద్ధి భార్య. పెద్దగా నిట్టూర్చి సుబుద్ధి ‘రాజుగారు రేపటి నుంచి రావద్దని చెప్పారు. నా పదవి ఊడింది’ అంది. ‘అయ్యో, ఇప్పుడెలా? ఇంతకీ ఉద్యోగం ఎందుకు పోయినట్లు?’ అడిగింది సుబుద్ధి భార్య. ‘నాకు వయసు మీద పడిందట. ఇదివరకటిలా చురుగ్గా లేనట. ఇక ఇంటి దగ్గర ఉండి విశ్రాంతి తీసుకోమన్నారు రాజుగారు’ విచారంగా చెప్పింది సుబుద్ధి. ‘అలా ఎలా? పోనీ మన అబ్బాయిని సలహాదారుగా పెట్టుకోమని అడగండి’ అన్నది సుబుద్ధి భార్య. ఆ సలహా నచ్చి మర్నాడే తన కొడుకు వీరబుద్ధితో సింహం గుహకి వెళ్ళింది సుబుద్ధి. ‘మహారాజా.. వీడు నా కొడుకు వీరబుద్ధి. వీడిని మీ సలహాదారుగా పెట్టుకోండి. ఎన్నో ఏళ్ళుగా మీ దగ్గర నమ్మకంగా పని చేశాను. అన్యాయం చేయకండి’ అని వేడుకుంది సుబుద్ధి. సింహం నవ్వి ‘అలాగే.. చూస్తాను. వీడిని నా దగ్గర వదిలి వెళ్ళు’ అంది. వీరబుద్ధి రోజంతా గుహ బయటే కూర్చుంది. దానికి ఏ పనీ లేదు. తిండికీ లోటు లేదు. రాత్రి ఇంటికి వస్తూనే వీరబుద్ధి..‘అమ్మా.. ఇన్నాళ్లూ నాన్న చేసిన ఉద్యోగం.. రోజంతా గుహ బయట కూర్చుని, మూడు పూటలా భోంచేసి రావడం.. అంతే!’ అన్నది పెద్దగా నవ్వుతూ. మర్నాడు సింహం గుహ బయట పచార్లు చేస్తూండగా గూఢచారిగా పనిచేసే గద్ద ఒక దుర్వార్త మోసుకుని వచ్చింది. భైరవకోనలో ఉండే సింహం.. అక్కడ కరువు నెలకొనడంతో పొరుగున సుభిక్షంగా ఉన్న ఉదయగిరి అడవి మీదకు దండయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.. మహారాజా!’ అంటూ. ‘సమాచారం చేరవేసినందుకు ధన్యవాదాలు. ఏం చేయాలో మేం ఆలోచిస్తాం. ఇక నువ్వు వెళ్లొచ్చు’ అంది సింహం గంభీరంగా. ‘చిత్తం’ అంటూ రివ్వున ఎగిరిపోయింది గద్ద. దీర్ఘంగా నిట్టూరుస్తూ ‘నీ సలహా ఏమిటి? ఇప్పుడు మనం ఎలా ముందుకు వెళ్లాలి?’ అంటూ అక్కడే ఉన్న వీరబుద్ధిని అడిగింది. వీరబుద్ధి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. ఏం చెప్పాలో తోచక బుర్ర గోక్కుంటూ ఉండిపోయింది. ‘మన అడవిని కాపాడుకోడానికి మనం యుద్ధానికి సిద్ధం అయితే ఎలా ఉంటుంది ?’ అని అడిగింది సింహం. ‘భేషుగ్గా ఉంటుంది మహారాజా.. యుద్ధంలో చచ్చిన వాళ్ళు స్వర్గానికి వెళతారు అని చెప్పేవాడు మా తాత’ అన్నది వీరబుద్ధి. సింహం కాసేపు అటూ ఇటూ తిరిగి ‘కానీ యుద్ధం అంటే ప్రాణ నష్టం తప్పదు. పోనీ మనం వాళ్ళతో సంధి కుదుర్చుకొతువులుని ఆ అడవిలోని జనం కూడా స్వేచ్ఛగా మన అడవిలో తిరుగుతూ, చెలమల్లో నీళ్ళు తాగడానికి అనుమతిస్తే ఎలా ఉంటుంది?’ అని అడిగింది సింహం. ‘ఈ ఆలోచన బాగుంది. అవి మన అడవిలో తిరిగితే మనకు నష్టం ఏమీ ఉండదు’ అన్నది వీరబుద్ధి. ‘అప్పుడు మనం స్వతంత్రం కోల్పోయినట్లే! అలాకాదు.. ఇంకా వాళ్ళు దండయాత్ర చేసే ఆలోచనలోనే ఉన్నారు కాబట్టి ముందు మనమే వాళ్ళ మీదకు దండయాత్ర చేస్తే? ఇంకా పూర్తిగా సిద్ధంగా లేని వాళ్ళను ఒడించవచ్చు కదా?’ అంది సింహం. ‘అవునవును.. మనం అలాగే చేయాలి. అప్పుడే వాళ్లకు బుద్ధి వస్తుంది’ అన్నది వీరబుద్ధి. ‘సరే.. నువ్వు ఇంటికి వెళ్ళి మీ నాన్నను తీసుకుని రా’ అని పురమాయించింది సింహం. వీరబుద్ధి పరుగు పరుగున ఇంటికి వెళ్ళి తండ్రి సుబుద్ధితో తిరిగి వచ్చింది. అప్పటికి సింహం ఇంకా గుహ బయటే పచార్లు చేస్తోంది. అది పాత సలహాదారును చూస్తూనే.. ‘చూడు సుబుద్ధీ.. వంశపారంపర్యంగా చేసుకునేందుకు సలహాదారు ఉద్యోగమేమీ వ్యవసాయం కాదు. ఆలోచనా శక్తి, సమయస్ఫూర్తి.. సమస్యను సరిగ్గా అర్థం చేసుకునే తెలివి వంటి లక్షణాలు అన్నీ ఉండాలి. నీ కొడుకుకి సమస్య మనమే వివరించి.. దానికి పరిష్కారమూ మనమే అందించాలి. మనమేం చెబితే దానికి తలాడించే వాడు సలహాదారుడు కాలేడు. వాడు చురుగ్గా తిరగ్గలడు. అందుకు తగిన ఉద్యోగం చూస్తానులే’ అన్నది సింహం. ‘అలాగే మహారాజా, నాది కూడా ఒక విన్నపం. నాకు వయసు మీద పడి చురుకు తగ్గినా.. ఆలోచన శక్తి మాత్రం తగ్గలేదు. సలహాదారు ఉద్యోగానికి బుద్ధితో తప్ప వయసుతో సంబంధం లేదు. ఆ మాటకు వస్తే వయసుతో తెలివి, అనుభవం పెరుగుతాయి. మరోసారి నా విషయం ఆలోచించండి’ అన్నది సుబుద్ధి వినయంగా. సింహం తల పంకించి కొత్తగా వచ్చిన సమస్యను వివరించి ‘ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు’ అని అడిగింది. సుబుద్ధి కాసేపు ఆలోచించి ‘నా సలహా మీకు కోపం తెప్పించే విధంగానే ఉంటుంది. మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భైరవకోన యువరాణికి ఒక కన్ను లేదు. ఆమె పెళ్ళి చేయలేకపోతున్నానన్న దిగులు ఆ రాజుగారిని పట్టి పీడిస్తోంది. మీరు పెద్ద మనసు చేసుకుని మన యువరాజుకు భైరవకోన యువరాణితో పెళ్ళి జరిపిస్తానని కబురు పంపితే రాబోయే ఈ కయ్యం కాస్తా వియ్యంగా మారుతుంది. ఈ అడివి కోసం మీ రాజ కుటుంబం త్యాగం చేయకతప్పదు. అలా జరిగిననాడు మన యువరాజు ఈ రెండు అడవులకు చక్రవర్తి అవుతాడు’ అన్నది.‘భేష్.. సుబుద్ధి తెలివితేటలకు, ఆలోచన శక్తికి వయసుతో పనిలేదని నిరూపించావు. నీ సలహా ప్రకారమే చేస్తాను. రేపటి నుంచి కొలువులోకి వచ్చేయ్’ అంది సింహం సంతోషంగా! (చదవండి: వంద గుడిసెలకు ఇదే పెద్ద చదువా!) -
ఇందిర సభలోకి సింహం ఎందుకు వదిలారు? తరువాత ఏం జరిగింది?
అది 1974వ సంవత్సరం. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రచారం జోరుగా సాగుతోంది. ఢిల్లీకి సమీపంలోని దాద్రీ, గౌతమ్ బుద్ధ నగర్లో ఇందిరా గాంధీ ప్రచార సభ జరగాల్సి ఉంది. గుర్జర్ నేత రామచంద్ర వికల్‌కు ఓటు వేయాలని ఇందిర అభ్యర్థించాల్సివుంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో చౌదరి చరణ్ సింగ్‌కు పెరుగుతున్న ఆదరణ కారణంగా ఇందిరా గాంధీతోపాటు పార్టీ కాంగ్రెస్ చిక్కుల్లో పడింది. ఈ నేపధ్యంలో గుర్జర్ నేత వికల్ రూపంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయాన్ని చూసుకుంది. ఆ సమయంలో రామచంద్ర వికల్ బాగ్పత్ ఎంపీగా ఉన్నారు. దాద్రీ ప్రాంతం.. తిరుగుబాటు రైతు నేత బీహారీ సింగ్‌కు బలమైన కంచుకోట. అతను ఈ ప్రాంత నివాసి. ఇందిరా గాంధీకి సన్నిహితునిగా పేరుగాంచారు. అయినా వీటిని గుర్తించకుండా ఇందిర.. గుర్జర్ నేత వికల్‌ను రంగంలోకి దించారు. టిక్కెట్ రాకపోవడంతో ఆగ్రహించిన బీహారీ సింగ్ తిరుగుబాటు చేసి, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బీహారీ సింగ్‌కు ఎన్నికల చిహ్నంగా ‘సింహం’ గుర్తు కేటాయించారు. ఈ నేపధ్యంలో బీహారీ సింగ్.. తనకు టిక్కెట్ ఇవ్వకున్నా ఫర్వాలేదని, అయితే వికల్‌కు అనుకూలంగా బహిరంగ సభ పెట్టవద్దని ఇందిరాగాంధీకి సందేశం పంపినా, ఆమె పట్టించుకోలేదు. బిహారీ సింగ్ బాగీ ఆ రోజు జరగాల్సిన ఇందిరాగాంధీ బహిరంగ సభను ఆపేందుకు ప్లాన్ వేశారు. ఆ సమయంలో దాద్రీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లో ఓ సర్కస్ నడుస్తోంది. బిహారీ సింగ్ ఆ సర్కస్ నుండి 500 రూపాయలకు ఒక సింహాన్ని అద్దెకు తీసుకున్నారు. దానిని బోనులో ఉంచారు. ఇందిరా గాంధీ సభ ప్రారంభం కాగానే బిహారీ సింగ్ సింహం ఉన్న బోనుతో సహా సమావేశానికి చేరుకుని, ఒక్కసారిగా బోను తెరిచారు. సింహం బయటకు రాగానే ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. జనం చెల్లాచెదురయ్యారు. ఫలితంగా ఇందిర తన సభను 5 నిమిషాల్లో ముగించాల్సి వచ్చింది. బీహారీ సింగ్ బాగీ ఆ ఎన్నికల్లో గెలవలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్ర వికల్ కూడా ఓటమిపాలయ్యారు. బిహారీ సింగ్ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా సన్నిహితుడు. 1992లో బీహారీ సింగ్ ఒక రైతు ర్యాలీలో పాల్గొనడానికి వెళుతున్నప్పుడు అతనిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో బిహారీ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. 2020 నవంబరు 29న బిహారీ సింగ్ బాగీ మరణించారు. త్వరలో బిహారీ సింగ్ విగ్రహాన్ని అతని స్వగ్రామమైన రుబ్బాస్లో ఆవిష్కరించనున్నారు. ఇది కూడా చదవండి: పేదరికంలో పుట్టిన పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు? -
జాబిల్లిపై మూడు సింహాల అడుగులు
చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతంగా ముగిసింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. భారత్ తన విజయసూచకంగా అశోక ముద్రలు(మూడు సింహాల గుర్తు) జాబిల్లి నేలపై ముద్రించనుంది. చంద్రునిపై దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ అనే రోవర్ బయటకు వస్తుంది. ఈ రోవర్ చంద్రునిపై పరిశోధనలు చేస్తుంది. రోవర్ చక్రాలు జాబిల్లిపై తిరుగుతూ చంద్రునిపై నీటి జాడ, మట్టి, ఖనిజాలు సహా అనేక వివరాలను సేకరిస్తుంది. ఈ క్రమంలో రోవర్ చక్రాలు అశోక చిహ్నాన్ని చంద్రునిపై ముద్రించనున్నాయి. భారత తన విజయసూచకంగా రోవర్ చక్రాలకు అశోక చిహ్నాలను ముద్రించింది. దీంతో రోవర్ తిరిగిన ప్రతిచోట అశోక ముద్రలతో కూడిన అడుగులు ఏర్పడతాయి. సారనాథ్ స్థూపం నుంచి సేకరించిన అశోక ముద్రలను భారత్ తన వారసత్వ గుర్తుగా చంద్రుని మట్టిపై నిలుపుతోంది. Big Breaking News - After landing, Chandrayaan-3 rover will etch an impression of the national emblem depicting the Lion Capital of Ashoka at Sarnath and ISRO on the lunar terrain. It will signify India's presence and legacy on the Moon♥️🔥. India set to create history today… pic.twitter.com/BnGBHrqxls — Times Algebra (@TimesAlgebraIND) August 23, 2023 చంద్రయాన్-3 తొలి చిత్రాన్ని ఇప్పటికే విడుదల చేసింది. ల్యాండ్ అయిన తర్వాత విక్రమ్ తీసిన ఫొటోలు ఇవి. ల్యాండర్ పంపిన నాలుగు ఫొటోలను ఇస్రో పంచుకుంది. తద్వారా బెంగళూరు రీసెర్చ్ సెంటర్‌తో ల్యాండర్ కమ్యూనికేషన్ ఫిక్స్ అయినట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: 'సరికొత్త చరిత్రను లిఖించాం..' చంద్రయాన్ 3 సక్సెస్‌పై పీఎం మోదీ.. -
ఓరి దేవుడా! నిజంగా సింహమేనా?.. ఇంతలానా!
సింహం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. సాధారణంగా అది ఏ జంతువైనా వేటాడిందంటే ఇక అంతే. సింగిల్‌గా ఉన్నా దాని రాజసం, ఠీవినే వేరు. దాని గాండ్రింపుకే హడలిపోవాల్సిందే. అలాంటి సింహం సాధువుగా మారిపోవడం అంటే అస్సలు నమ్మం. ఏదో కథల్లో ఉండొచ్చేమో గానీ రియల్‌గా జరిగే అవకాశమే ఉండదు. నెట్టింట సందడి చేస్తున్న ఈ వీడియో చూస్తే మాత్రం ఇది సింహమేనా అని నోరెళ్లబెడతారు. పైగా అదే ఏం తింటుందో చూస్తే ఓరి దేవుడా! అని ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..సింహం సాధువు జంతు మాదిరి ఆకులు తింటోంది. ఏంటి అది సింహమేనా? అని ఒక్కసారిగా డౌటు వస్తుంది. చూస్తే పెద్ద పులిలానే ఉంది. కానీ ఏదో సాధువు జంతువు మాదిరిగా ఆకులు అలమలు తింటోంది. దీంతో నెటిజన్లు సడెన్‌గా సింహం శాఖహారిగా ఎలా మారిపోయిందిని ఒకరు, బహుశా శ్రావణ మాసం కదా అందుకే ఆ సింహం ఆకులు తింటుందని మరోకరు కామెంట్లు చేస్తూ ట్వీట్లు చేశారు. View this post on Instagram A post shared by @vedhamalhotra (చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..) -
పెంచుకున్న సింహం పిల్ల.. ఇల్లు వదిలి పారిపోతే ఎలా?
-
వరదలతో రారాజు అగచాట్లు.. అడవిని విడిచి రోడ్డుపై..
అహ్మదాబాద్: గుజరాత్ సహా ఉత్తర భారతదేశాన్ని వర్షాలు కొద్ది రోజులుగా అతలాకుతలం చేస్తున్నాయి. వరద నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. కాలనీలు జలమయమయ్యాయి. జనజీవనం స్థంభించింది. నగరాలకు సైతం వరద తాకిడి ఎదురవుతుంటే ఇక అడవుల్లో వరదల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకేనేమో అడవికి రారాజు సైతం వరదలతో ఇబ్బంది పడి.. అడవిని విడిచి రహదారిపైకి వచ్చేశాడు. గుజరాత్‌లోని జునాగఢ్‌ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కుంభవృష్టి సంభవిస్తోంది. దీంతో జునాగఢ్ సహా పరిసర నగరాల్లోని ప్రజలతో సహా అడవుల్లోని జంతువులు సైతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అడవికి రారాజుగా ఉండే సింహాలు సైతం అడవుల్లో ఉండలేక రోడ్లపైకి వస్తున్నాయి. ఓవైపు వర్షం వస్తున్నా.. ఎక్కడ ఉండాలో తెలియక రోడ్డుపైకి వచ్చి వరదల తాకిడిని తప్పించుకుంటున్నాయి. వర్షంలో రోడ్డుపై సంచరిస్తున్న ఓ సింహం వీడియోను స్థానికులు షేర్ చేశారు. Gujarat is battered with incessant rains with flood like situation in many cities. Even, King of the Jungle is forced to relocate from it's habitat. Pray to God 🙏 for a speedy recovery and normalisation of the cities affected#GujaratRain #GujaratRains pic.twitter.com/5YORSAJnEN — Syed Saba Karim (@SyedSabaKarim5) July 23, 2023 ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కేవలం కొద్ది నిమిషాల్లోనే 3000 వ్యూస్ వచ్చాయి. రాజుకు రాజ్యంలో స్థానం లేకుండా పోయిందని కొందరు కామెంట్ చేశారు. రాజ్యంలో బాధలను పర్యవేక్షించడానికి రాజు బయటకు వచ్చాడు అంటూ మరొకరు ఫన్నీగా స్పందించారు. గుజరాత్లో మరో 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్‌ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు నగరాలను సైతం నీట ముంచుతున్నాయి. వరద నీటితో నదులు ఉవ్వెత్తున ప్రవహిస్తున్నాయి. నవసారి, జునాగఢ్, ద్వారక, భావనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. కాలనీలు నదులను తలపిస్తున్నాయి. जूनागढ़ : मेघ तांडव… खिलौने की तरफ़ पानी में डूबती तैरती कारें, मुख्य सड़क पर पानी का ज़बरदस्त बहाव,#JunagadhRain pic.twitter.com/T7lesOoh86 — Janak Dave (@dave_janak) July 22, 2023 ఇదీ చదవండి: బైక్ నడుపుతూ ఇంటి చిరునామా మరిచిన వృద్ధుడు -
అమ్మా! తల్లి.. ఏం డేరింగ్?..ఏకంగా సింహంతో ఒకే ప్లేట్లో..
సింహం అంటేనే హడలిపోతాం. ఏదో దూరంగా చూసి ఆనందిస్తాం. కనీసం బోనులో ఉన్నా కూడా దగ్గరకు వెళ్లాలంటే భయపడిపోతాం. పైగా అది పెట్టే గాండ్రింపుకే హడలి చస్తాం. అలాంటిది దానితో కలిసి భోజనం షేర్ చేసుకోవడమా! అమ్మ బాబోయ అనేస్తాం. కానీ ఇక్కడొక అమ్మాయి అంత ధైర్యం చేయడమే కాదు, దాంతో కలిసి భోజనం చేసింది కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ మహిళ పెద్ద సింహంతో కలిసి భోజనం చేసింది. అదీకూడా అది తినే ప్టేటులోనే ఫుడ్ షేర్ చేసుకుంది. ఏ మాత్రం జంకకుండా దాంతో ఓ ఫ్రెండ్ మాదిరి కూర్చొని దర్జాగా తింటోంది. ఈ ఘటన యూఏఈలోని వైల్డ్‌లైఫ్ పార్క్ రాస్ ఏఐ ఖియామ్‌లో చోటు చేసుకుంది. ఇక నెట్టింట వైరల్ అవతున్న.. అందుకు సంబంధించిన వీడియోకి మిలియన్స్‌లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by حديقة حيوانات رأس الخيمة (@rak_zoo) (చదవండి: 68 ఏళ్ల వయసులో ఓ మహిళ చేసిన సాహసం! గాల్లో ఉండగా పైలట్ అస్వస్థతకు గురవ్వడంతో...) -
సింహం వచ్చి పలకరిస్తే ఎలా ఉంటుంది? ప్రాణాలు గాల్లో
సాక్షి, భువనేశ్వర్ : ప్రాణం విలువ చివరి క్షణంలో తెలుస్తుందంటారు అనుభవించిన వాళ్లు. సరదాగా జూలోకి వెళ్లి చూద్దామనుకున్న వాళ్లకు ఆ అనుభవం కళ్లారా కట్టినట్టు కనిపించింది. షాక్ కు గురి చేసింది. ఒడిషాలో అసలేం జరిగిందంటే.. విచిత్రమైన అనుభవం వినోదం, ఆహ్లాదం కోసం బారంగ్ నందనకానన్ జూ సందర్శించిన పర్యాటకులకు విచిత్రమైన అనుభవం ఎదురైంది. సందర్శనలో భాగంగా యంత్రాంగం ఏర్పాటు చేసిన వాహనంలో జంగిల్ సఫారీకి సుమారు 30 మంది బృందంగా బయల్దేరారు. అయితే సింహాలు, పులులు, ఎలుగు బంటి వంటి వన్య మృగాలు విచ్చలవిడిగా సంచరించే ప్రాంతంలో సందర్శకుల వాహనం మొరాయించడంతో ప్రాణాలు పోయినంత పనయ్యింది. ఎటూ కదలలేని పరిస్థితుల్లో ఇరుక్కుంది. వచ్చేశాయి సింహాలు ఇంతలో అక్కడే సంచరిస్తున్న మృగరాజులు ఈ వాహనాన్ని చుట్టుముట్టాయి. దీంతో ఒక గంట పైబడి సందర్శకులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బయటపడ్డారు. నందన కానన్ అధికార వర్గాలు మరో వాహనం ఏర్పాటు చేసి ఘటనా స్థలానికి చేరారు. సందర్శకులను చుట్టు ముట్టిన సింహాలను ఆహారం మిషతో పక్కదారి పట్టించి, ప్రమాదం నుంచి బయటపడేలా చేసి సందర్శకులను సురక్షితంగా తీసుకుని రాగలిగారు. ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు ఏఎఫ్వోకు ఆదేశించినట్లు నందన కానన్ డైరెక్టరు తెలిపారు. #ସିଂହ_ସଫାରୀରେ_ଫସିଲା_ବସ୍ ନନ୍ଦନକାନନ ସିଂହ ସଫାରୀରେ ଫସିଗଲା ବସ୍ । ଭୟଭୀତ ହୋଇପଡ଼ିଲେ ପର୍ଯ୍ୟଟକ । ସିଂହଗୁଡିକୁ କାବୁ କରି ଫିଡିଂ ଚାମ୍ବରରେ ରଖିଲେ କର୍ମଚାରୀ । #Nandankanan #Zoo #KanakNews pic.twitter.com/NwCoXWD1nt — Kanak News (@kanak_news) July 9, 2023 -
నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా పోస్ట్ - వీడియో వైరల్
భారతీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు ట్విటర్ వేదికగా ఆసక్తికరమైన వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు అప్పుడప్పుడు సమాధానాలిస్తూ ఉంటాడు. ఇటీవల ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో చాలా మందిని భయకంపితులను చేస్తోంది. ఇంతకీ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో ఏంటి? అంతగా భయపడటానికి అందులో ఏముందనేది ఇక్కడ తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి అడవిలో జీప్ ముందు భాగంలో కూర్చుని ఫోటోలు తీసుకుంటున్నాడు. ఆ సమయంలో అతని పక్క నుంచి ఒక సింహం నెమ్మదిగా ముందుకు వచ్చింది. సింహాన్ని చూసిన ఆ వ్యక్తికి ఎం చేయాలో తోచకుండా భయంతో చూడటం చూడవచ్చు. ఈ వీడియోని ఇప్పటికి లక్షల మంది చూసారు, వేలలో లైక్స్ కూడా వచ్చాయి. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా రెండు ప్రశ్నలను అడిగాడు. ఒకటి ఆ స్థానంలో మీరు ఉంటే 'వెంటనే ఆమె ఆలోచిస్తారు', రెండు 'మొదట మీరు ఏం చేస్తారు'. ఈ ప్రశ్నలను నెటిజన్లు తమదైన రీతిలో జవాబులిస్తున్నారు. కొంత మంది నేను అతడి స్థానంలో ఉంటే అమ్మా అని అరుస్తా.. అని, వెంటనే దేవుణ్ణి ప్రార్దిస్తా అని సమాధానాలిస్తున్నారు. ఆ స్థానములో మీరే ఉంటే ఏం చేసేవారో మీ స్టైల్లో చెప్పండి. (ఇదీ చదవండి: వేలంలో కోట్లు పలికిన చెక్కతో తయారైన కారు - దీని ప్రత్యేకత ఏమిటంటే?) If you were that man: 1) What would your first thought be? 2) What would your first action be? pic.twitter.com/UGLw4m2yBf — anand mahindra (@anandmahindra) June 10, 2023 -
ఒక్క క్షణం గుండె ఆగిపోయినట్లనిపించేది ఇలాంటి సందర్భాల్లోనే కావొచ్చు..!
ఒక్క క్షణం గుండె ఆగిపోయినంతపని ఎప్పుడు అనిపిస్తుంది మనకు? అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అని సింపుల్‌గా చెప్పేయకండి. అడవిలో సంచరిస్తున్నప్పుడు ఒక్కసారిగా క్రూర మృగం మీకు ఎదురైతే ఏం చేస్తారు? కాళ్లు చేతులు ఏం ఆడవు. చెమటలు పట్టేస్తాయి. ఇలాంటి సందర్భాల్లో గుండె చప్పుడే అతిపెద్ద శబ్దంలా వినిపిస్తది కదా..! ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర ఎప్పుడూ ఏదో ఒకటి షేర్ చేస్తుంటారు. ట్విట్టర్ వేదికగా వినూత్న ఆలోచనలను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇలానే ఈసారి కూడా ఓ వీడియో షేర్ చేశారు. కాకపోతే ఇది కొంచెం విభిన్నమైనది. ఈ వీడియోలో ఓ వ్యక్తి అడవిలో ఫొటోలు తీయడానికి వెళతారు. కారు ముందు భాగంలో కూర్చుని ఓ వైపు చూస్తుంటారు. తలతిప్పేసరికి ఆ వ్యక్తి ఎదుట సింహం ప్రత్యక్షమవుతుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలాంటి స్థితిలో మీకు వచ్చే మొదటి ఆలోచన ఏంటి? మీరు చేసే మొదటి పని ఏంటీ? అని ఆనంద్ మహేంద్ర తన ఫాలోవర్స్‌ను అడిగారు. ఇంతకూ మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేసేయండి మరి..! If you were that man: 1) What would your first thought be? 2) What would your first action be? pic.twitter.com/UGLw4m2yBf — anand mahindra (@anandmahindra) June 10, 2023 ఇదీ చదవండి:విహారంలో అపశృతి..టూరిస్టు స్విమ్మింగ్ చేస్తుండగా.. సొర ఎంట్రీ..క్షణాల్లోనే.. -
ఆ కుక్క ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే! భలేగా పులిని, సింహాన్ని..
ఇంతవరకు జంతువులకు సంబంధించిన ఎన్నో వీడియోలు చూశాం. వన్యమృగాలు సాధారణంగా ట్రైయినర్ కంట్రోల్లో ఉంటాయి. ఐతే ఒక్కోసారి అవి వారి మాట కూడా వినవు. అంతేందుకు వారిపైనే దారుణంగా దాడి చేసి హతమార్చిన పలు ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటిది ఓ కుక్క రెండు వన్యమృగాలను కంట్రోల్ చేస్తోందంటే..నమ్మబుద్ది కాదు కదా! కానీ ఇక్కడ అలానే జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. ఓ పులి, సింహం జూలో దారుణంగా ఫైట్ చేసుకుంటున్నాయి. దీంతో అక్కడే ఉన్న కుక్క ఒక్కసారిగా ఆ రెండింటిని దెబ్బలాడుకోకుండా చేసింది. పైగా పులి చెవిని కరుస్తూ సింహంతో ఫైట్ చేయకుండా నిలవరించింది. ఆ కుక్క అవి ఫైట్ చేసుకోకుండా ఆపడంలో విజయం సాధించింది కూడా. కానీ ఏ మాత్రం తేడా వచ్చి.. పులి దాడి చేస్తే గనుక ఆ కుక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ ఆ కుక్క మాత్రం కుంచెం కూడా బెరుకు లేకుండా వాటి రగడను ఆపింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకి మిలియన్స్‌లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్కేయండి. Dog stops tiger and lion from fighting pic.twitter.com/O2qfgk9q4v — B&S (@_B___S) May 20, 2023 (చదవండి: ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..) -
నిదుర ఉండదు.. కుదురుగుండదు.. విడతల వారీగా రోజుకు రెండు గంటలే!
ఇప్పటివరకు ఆఫ్రికన్ బుష్ ఏనుగులు మాత్రమే అతి తక్కువ సమయం నిద్రించే జంతువులుగా గుర్తించబడ్డాయి. తాజాగా.. ఆ జాబితాలో సముద్ర జీవి ‘ఎలిఫెంట్ సీల్’ కూడా చేరిపోయింది. ఆఫ్రికన్ ఏనుగుల మాదిరిగానే ఎలిఫెంట్ సీల్స్ కూడా రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే నిద్రిస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. – సాక్షి, అమరావతి ఏడాదిలో కనీసం ఏడు నెలల పాటు పసిఫిక్ సముద్ర జలాల్లో ప్రయాణించే భారీ క్షీరదాలైన ఎలిఫెంట్ సీల్స్ రోజంతా వేటలోనే నిమగ్నమై ఉంటాయట. గొరిల్లాలు రోజుకు 12 గంటలు, కుక్కలు 10 గంటలు, సింహాలు 20 గంటల వరకు నిద్రిస్తుంటే.. సీల్స్ నిద్ర సమయంలో చాలా వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఆడ సీల్స్ తలపై సెన్సార్లు అమర్చి.. ఎలిఫెంట్ సీల్స్ మెదడు, హృదయ స్పందన, కదలికలు, ప్రయాణించే లోతు, నిద్రించే సంకేతాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా సెన్సార్లతో కూడిన వాటర్‌ఫ్రూఫ్ సింథటిక్ రబ్బరు టోపీలను ఉత్తర ప్రాంతంలోని ఆడ సీల్స్ తలలపై అమర్చి.. వాటి జీవన స్థితిని శాస్త్రవేత్తలు క్రోడీకరించారు. ఎందుకంటే ఆడ సీల్స్ మాత్రమే ఎక్కువ కాలం సముద్రంలో ప్రయాణిస్తాయి. మగ సీల్స్ ఒడ్డునే ఉంటూ ఆహారాన్ని తింటాయి. ఇవి 4,500 పౌండ్ల వరకు పెద్ద శరీర బరువును కలిగి ఉండటం.. సముద్రంలో ఎక్కువ కాలం మేత వెతకాల్సిన కారణంగా ఈ నిద్ర ప్రవర్తన అభివృద్ధి చేసుకున్నట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మగ ఎలిఫెంట్ సీల్స్కు ఏనుగు మాదిరిగా చిన్న తొండం ఉంటుంది. అందుకే.. వీటిని ఎలిఫెంట్ సీల్స్‌గా పిలుస్తారు. అది కూడా విడతల వారీగానే.. ఇన్ట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ జర్నల్ సైన్స్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఎలిఫెంట్ సీల్స్ సముద్ర ఉపరితలం నుంచి సుమారు 377 మీటర్ల లోతు (1,237 అడుగులు)కు వెళ్లి నిద్రిస్తున్నట్టు కనుగొన్నారు. ఇవి ఏకబిగిన కాకుండా 20 నిమిషాల కంటే తక్కువ సేపు ‘క్యాట్నాప్’ (స్వల్పకాలిక) శ్రేణిలో మొత్తంగా 2 గంటలపాటు నిద్రిస్తున్నట్టు అంచనా వేశారు. ఎలిఫెంట్ సీల్స్ పెద్ద మొత్తంలో చేపల్ని వేటాడి తింటాయి. అయితే, ఇవి శత్రు జీవులైన సొర చేపలు, కిల్లర్ వేల్స్ దాడిలో మరణిస్తుంటాయి. ఇవి ఇతర మాంసాహార జీవుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు లోతైన జలాల్లోకి వెళ్లి కొద్ది నిమిషాలపాటు (ర్యాపిడ్ ఐ మూవ్మెంట్) నిద్ర అనుభవిస్తున్నట్టు నిర్ధారించారు. ఎక్కువసేపు నీటిలోనే.. వాస్తవానికి 10 నుంచి 30 నిమిషాల డైవ్‌లో కొద్దిసేపు మాత్రమే సముద్ర ఉపరితలంలో ఏనుగు సీల్స్ కనిపిస్తాయి. మిగిలిన సమయమంతా జలాల్లోనే ఈదుతూ ఆహార వేటను కొనసాగిస్తాయి. విచిత్రంగా ఈ క్షీరదాలు సంతానోత్పత్తి సమయంలో తీరంలో రోజుకు 10 గంటల సమయం నిద్రపోతాయి. ప్రతి 30 నిమిషాల పాటు సాగే డైవ్‌లో సీల్స్ తలకిందులుగా స్లో–వేవ్ స్లీప్ అని పిలిచే లోతైన నిద్ర దశలోకి వెళ్తున్నాయి. వివిధ జంతువులు నిద్ర సమయం ఇలా.. (రోజుకు గంటల్లో సుమారుగా) గుర్రం 2.9 గాడిద 3.1 ఏనుగు 3.9 జిరాఫీ 4.5 మేక 5.3 కుందేలు 11.4 చింపాంజీ 9.7 కుక్క 10.0 పులి 15.8 ఎలుక, పిల్లి 12.5 ఉడుత 14.9 చిరుత 18.0 సింహం 20 -
ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో..
కొన్ని జంతువులను పెంచినంత మాత్రాన దాడి చేయవని అనుకులేం. అందుకు ఉదాహరణగా పలు ఉదంతాలను కూడా చూశాం కూడా. ఒక్కోసారి చాలా విచిత్రంగా ప్రవర్తించి దాడి చేసేందుకు రెడి అయిపోతాయి. అందులోకి క్రూరమృగాలైతే ఇక చెప్పనవసరం లేదు. అచ్చం అలానే ఇక్కడో సింహం రోజు తన సంరక్షణ చూసే కీపర్‌పైనే దాడి చేసింది. ఈ ఘటన బ్రిటీష్ పార్క్‌లో చోటు చేసుకుంది. రోజు తనను చూస్తుంది కదా అని అతను రోజులానే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను సింహం దాడి చేస్తుందని కూడా అనుకోలేదు. సడెన్‌గా సింహం అతన్ని పరిగెట్టించి దాడి చేసి, బొమ్మ మాదిరిగి ఈడ్చుకెళ్లిపోయింది. చూస్తుండగానే క్షణాల్లో ఆ వృద్ధ కీపర్ ఆ సింహానికి ఆహరమైపోయాడు. దీన్నంతా గమినిస్తున్న ఓ మహిళ భయంతో వెర్రిగా కేకులు వేసింది. అందుకు సంబంధించిన వీడియోని బ్రిటీష్ పార్క్ ఓనర్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో కోస ఇక్కడ క్లిక చేయండి: (చదవండి: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పాము కలకలం..ఏకంగా 22 పాములు..) -
ఆవు కడుపున సింహం పిల్ల! చూసేందుకు క్యూ కడుతున్న జనాలు
ఆవు సింహం పిల్లకు జన్మనిచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ వింత ఘటనను చూసేందు జనం ఎగబడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో రైసెన్ జిల్లాలోని గూర్ఖా గ్రామంలో చోటు చేసుకుంది. నత్తులాల్ శిల్పాకర్ అనే రైతు ఆవు సింహం పిల్లను పోలిన దూడకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆ గ్రామంలో దావానంలా వ్యాపించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ రైతు ఇంటికి క్యూకట్టారు. ఈ నమ్మశక్యం కానీ ఘటనతో వైద్యుల సైతం కంగుతిన్నారు. ఆవు గర్భాశయంలో లోపం కారణంగానే ఈ వింత సంభవించిందని పశుసంవర్ధక శాఖ పేర్కొంది. ఈ మేరకు పశువైద్యాధికారి ఎన్కే తివారీ మాట్లాడుతూ.. ఇది ప్రకృతి అద్భుతం కాదన్నారు. పిండం సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఇలాంటి సమస్య ఎదురైందన్నారు. ఆవు గర్భంలో ఉన్న లోపం కారణంగానే ఇలాంటి దూడకు జన్మనిచ్చిందన్నారు. అయితే ఆ దూడ జన్మించిన వెంటనే పూర్తి ఆరోగ్యంగా ఉందని, కానీ పుట్టిన ముప్పై నిమిషాల్లోనే మృత్యువాత పడిందని చెప్పారు. చనిపోయిన సింహం ఆకారం పోలిన దూడను చూసేందుకు గూర్ఖా గ్రామానికి సుదూరు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. (చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్..144 సెక్షన్ విధింపు) -
షాకింగ్ వీడియో.. సింహాన్ని చేతుల్తో మోసుకెళ్లిన మహిళ..
అడవి జంతువులను చూస్తే సాధారణంగా ఎవరికైనా భయం వేస్తోంది.దాని కంటపడితే ప్రాణాలతో బయటపడటం దాదాపు అసాధ్యం.అడవికే రాజు అయిన సింహాన్ని చూసి ఏ జంతువైనా భయంతో వణికిపోతుంది. సింహాలు ప్రమాదకరమైనది. చాలా శక్తివంతమైనవి. నచ్చిన జంతువును వెంటాడి ఆహారం చేసుకోవడంలో అవి దిట్ట. అంతటి క్రూరమైన సింహాన్ని ఓ మహిళ ఎలాంటి బెరుకు లేకుండా చేతుల్తో మోసుకొని వెళ్లింది. వినడానికి నమ్మశక్యంగా అనిపించకపోయినా దీనికి సంబంధించిన వీడియోను యానిమల్స్ పవర్స్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 10 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మహిళ తన రెండు చేతులతో బలవంతంగా సింహాన్ని ఎత్తుకొని వీధిలో నడుస్తూ కనిపించింది. ఆమె చేతిలో నుంచి సింహం తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా మహిళ ఇంకాస్తా గట్టిగా దాన్ని పట్టుకొని తీసుకెళ్లింది. అయితే ఇది పాత వీడియో కాగా ప్రస్తుతం మరోసారి నెట్టింట్టా చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. మహిళ తెగవను ప్రశంసిస్తూ వండర్ వుమెన్ అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు.. ‘అది పిల్లి, కుక్క కాదు సింహం.. దానితో కాస్తా జాగ్రత్తగా వ్యహరించండి’ అంటూ సలహా ఇస్తున్నారు. కాగా ఈ సంఘటన కువైట్ వీధుల్లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సింహాం మహిళ పెంపుడు జంతువని.. కువైట్ సిటీలో తప్పించుకుని నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించి ప్రజల్లో భయాందోళనలు సృష్టించినట్లు అక్కడి మీడియా పేర్కొంది. View this post on Instagram A post shared by Animal Power (@animals_powers) -
Viral Video : సింహంతో వ్యక్తి పరాచకాలు..
-
బోనులోని సింహంతో వ్యక్తి పరాచకాలు.. తర్వాత ఏం జరిగిందో చూడండి..
ప్రమాదం అని తెలిసినా కావాలనే కొంతమంది తమ పిచ్చి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన ఓ డైలాగ్ ఇందుకు సరిగ్గా సరిపోతుంది. ‘పులిని చూడలంటే చూస్కో.. దానితో ఫొటో దిగాలనిపించిందనుకో కొంచె రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు..సరే చనివిచ్చిందకదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది’ ఈ డైలాగ్‌లో పులి ప్లేస్‌లో సింహాన్ని రీప్లేస్ చేస్తే అచ్చం ఇలాగే ఉంటుందేమో.. అసలేం జరిగిందంటే.. ఓ జూలో రెండు సింహాలను బంధించి ఉండగా.. వాటిని చూసేందుకు సందర్శకులు చుట్టుముడతారు. వారిలో ఓ వ్యక్తి బోనులోకి చేయి పెట్టి సింహాన్ని మచ్చిక చేస్తున్నట్లు ప్రయత్నించాడు. కానీ ఆ సింహం స్పందించకుండా అలాగే ప్రశాంతంగా ఉంటుంది. అతనిని గమనించిన పక్కనున్న వ్యక్తి బోనులోని మరో సింహం తలపై చేయి పెట్టాయి. దీంతో ఆగ్రహం చెందిన సింహం హఠాత్తుగా అతని చేతిని నోటిలోకి లాక్కుటుంది.. సింహం ఊహించని చర్యతో అక్కడున్న వారంతా షాక్‌కు గరయ్యారు. సింహం చేతిని కరవడంతో నొప్పితో విలవిల్లాడిపోయాడు. సింహం బారి నుంచి చేతిని విడిపించుకోవడానికి ముప్పు తిప్పలు పడ్డాడు. సింహానికి భయపడి అక్కడున్న వారు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. అయితే భయం, బాధతో గట్టిగా అరవడంతో కాసేపటికి సింహం అతని చేతిని వదిలేసింది. దీంతో భయంతో అక్కడున్న వారంతా దాని నుంచి దూరంగా పారిపోయారు. Fook around............. pic.twitter.com/N8ETVsXQJr — Vicious Videos (@ViciousVideos) December 26, 2022 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ట్విటర్‌లోషేర్ చేయడంతో నెట్టింట్లో వైరల్‌గా మారింది. బోనులో ఉన్నా సింహం సింహమే.. ఇలాంటి తుంటరి పనులు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. అంటూ కామెట్లు చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ, ఎప్పుడూ జరిగిందో తెలియరాలేదు. -
వైరల్ వీడియో: పిల్ల సింహం గర్జన ఎలా ఉంటుందో తెలుసా ..!
-
టూరిస్ట్‌లపైకి అమాంతం జంప్ చేసిన పులి...నెటిజన్లు షాక్
ఇంతవరకు ఎన్నో వైరల్ వీడియోలు చూసి ఉంటాం. సింహాలు మనుషులపై అకస్మాత్తుగా దాడిచేసిన పలు ఘటనలు గురించి విన్నాం. ఎన్నో సార్లు టూరిస్టుల వాహనాలకు అడ్డంగా నుల్చుని ఉండటం లేదా కారుపైకి ఎక్కేందుకు చేయడం చూసి ఉంటాం. కానీ ఇక్కడొక పులి టూరిస్టుల వెహికల్ని చూసి ఒకేసారి చంపి తినేద్ధాం అన్నంత వేగంగా టూరిస్టులపైకి దూకేస్తుంది. ఈ ఘటన చూస్తే ఎవరికైనా ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనవుతుంది. కానీ అది టూరిస్టులపై ప్రేమతోనే అలా దూకింది. వాహనంలో ఉన్న వారందర్నీ ప్రేమగా ఆలింగనం చేసుకుంటూ అందులో ఉన్న టూరిస్టులందర్నీ చుట్టేసింది. అది చేసిన పని వింతగానూ కాస్త ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. సింహం వాహనంలో ఉన్న వారితో ఎంత ప్రేమగా మమేకమవుతుందో చూస్తే కచ్చితంగా షాక్‌గా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఆ వీడియోను చూసేయండి. New wildlife experience 😬 pic.twitter.com/1J74oTKgWW — OddIy Terrifying (@OTerrifying) November 8, 2022 (చదవండి: షాకింగ్ వీడియో: పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా కదిలిన ట్రైన్.. తర్వాత ఏం జరిగిందంటే..) -
చిన్నదైనా సింహం సింహమే.. ఒక్క గాండ్రింపుతో హడలెత్తించింది..!
పులి, సింహం వంటి క్రూర జంతువులను జూలో దూరం నుండి చూస్తేనే అందంగా ఉంటుంది. వాటిని పట్టుకుని ఫోటో దిగాలంటే అది ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరికి తెలుసు. అవి చిన్న కూనలైనా, పెద్దవైనా ప్రమాదకరమే. కానీ, కొందరు వాటిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. రెండు చిన్న సింహాలను పెంచుకుంటున్నాడు. అయితే, వాటిని దగ్గరి నుంచి తాకేందుకు ప్రయత్నించగా అందులో ఒకటి ముట్టుకోనివ్వలేదు. ఒక్కసారిగా గాండ్రించటంతో ఉలిక్కపడ్డాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కారుపై కూర్చున్న రెండు సింహం కూనలను తాకుతూ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాడు. క్షణాల్లోనే అందులో ఓ కూన కోపంతో ఊగిపోయింది. అతడిపై ఆ సింహం కూన దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఒక్క గాండ్రింపుతో ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆ తర్వాత కారుపైకి వెళ్తున్న సింహాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. నెల రోజుల క్రితం ఈ వీడియో షేర్ చేయగా ఇప్పటి వరకు 2,74,000 లైకులు, మూడు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post shared by Md Gulzar (@basit_ayan_3748) ఇదీ చదవండి: ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి! -
విజయనగరం జిల్లా వాసుల్ని వెంటాడుతున్న పులి భయం
-
పిల్లల కథ: మంచి పని.. ఈ కిరీటం నీకే!
విజయపురి రాజు వద్ద రకరకాల కిరీటాలు ఉండేవి. ఒకసారి అడవిలో గుర్రం మీద లేడిని వెంబడిస్తూ వేటాడసాగాడు. ఆ సమయంలో కిరీటం జారి కిందపడింది. రాజు ఆ విషయాన్ని పట్టించుకోకుండా లేడిని తరుముతూ ముందుకెళ్ళిపోయాడు. నక్క, తోడేలు కలసి వస్తూ కిరీటాన్ని చూశాయి. ‘నేను ముందు చూశాను. ఇది నాకు చెందాలి’ అంది నక్క. ‘కాదు.. నేను ముందు చూశాను. నాకే చెందాలి‘ అంది తోడేలు. అలా వాదులాడుకుంటూ న్యాయం కోసం సింహం దగ్గరకు వెళ్లాయి. వాటి సమస్య విన్న సింహం.. జంతువులన్నింటిని సమావేశపరచింది. విషయాన్ని వివరించింది. ‘కిరీటం అడవిలో దొరికింది కాబట్టి.. ఈ అడవికి రాజునైన నాకే చెందుతుంది. ఈ అడవిలోని జంతువులన్నిటికీ ఏడాది సమయం ఇస్తున్నాను. ఈ ఏడాదిలో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారికి ఈ కిరీటాన్నిచ్చి గౌరవిస్తాను. అంతవరకూ ఇది నాదగ్గరే ఉంటుంది’ అని చెప్పింది సింహం. సమావేశం ముగిశాక జంతువులన్నీ వెళ్లిపోయాయి. వేట ముగించుకుని రాజు తిరిగి వస్తూ కిరీటం కోసం చూశాడు. ఎక్కడా కనిపించక పోవడంతో నిరాశతోనే రాజ్యానికి వెళ్లిపోయాడు. సంవత్సర కాలం పూర్తయింది. సింహం జంతువులన్నీటినీ సమావేశపరచింది. ‘మహారాజా! నేను కోతిచేష్టలు, ఆకతాయి పనులు మానుకున్నాను. మంచిగా ఉంటున్నాను’ అంది కోతి. ‘మాంసాహారం మానుకుని చిన్నజంతువులను దయతో చూస్తున్నాను’ అంది తోడేలు. నక్క మరికొన్ని జంతువులు కూడా తోడేలు చెప్పిన మాటనే చెప్పాయి. ‘బురదగుంటలో చిక్కుకున్న గాడిదను కాపాడాను’ అంది ఏనుగు. ‘నేను నాట్యంతో ఆనందాన్ని పంచాను’ అంది గుర్రం. ‘నేను కొన్నింటికి చెట్లెక్కడం నేర్పాను’ అంది చిరుత. ‘పిల్లజంతువులను నా వీపు మీద ఎక్కించుకుని అడవంతా తిప్పుతూ ఆనందాన్ని పంచాను’ అంది పెద్దపులి. ఉలుకు.. పలుకూ లేకుండా ఉన్న ఎలుగుబంటిని చూసి సింహం ‘నువ్వేం చేశావో చెప్పు?’ అని అడిగింది. ‘మన అడవి గుండా విజయపురి వైపు వెళ్తున్న ఒక మునితో విజయపురి రాజు వేటకు వచ్చి మమ్మల్ని చంపుతున్నాడు. ఆ క్రమంలోనే ఆయన కిరీటం జారి ఈ అడవిలో పడిపోయింది. కాబట్టి ఇక్కడకు వేటకు రావడం ఆ రాజుకు అరిష్టమని చెప్పి భయపెట్టి.. మా వైపు రానివ్వకుండా చేయండి అని కోరాను. దానికి ఆ ముని.. ఈ అడవికే కాదు ఏ అడవికీ వేటకు వెళ్లకుండా చేస్తానని మాటిచ్చాడు. ఆ ముని వెళ్లి రాజుకు ఏంచెప్పాడో కానీ ఆరోజు నుంచి విజయపురి రాజు వేట మానుకున్నాడు. మన అడవిలో చెట్లు తక్కువగా ఉన్నాయి. నిండుగా చెట్లుంటే అనేక లాభాలు. అందుకే వందలసంఖ్యలో పండ్లమొక్కలను నాటి పెంచుతున్నాను’ అని చెప్పింది ఎలుగుబంటి. ‘ఇతరుల మేలు కోరడం, మొక్కలను పెంచడాన్ని మించిన మంచి పనులేమున్నాయి! ఈ కిరీటం నీకే’ అని ప్రశంసించింది సింహం. ‘మృగరాజా.. బహుమతి కోసం నేను ఈ పనులు మొదలుపెట్టలేదు. చాలా కాలం నుంచే చేస్తున్నాను. మీ ప్రశంసలు అందుకున్నాను. అది చాలు నాకు’ అంటూ వినయంగా కిరీటాన్ని తిరస్కరించింది ఎలుగుబంటి. ఆ రోజు నుంచి ఆ అడవిలోని జంతువులన్నీ ఎలుగుబంటిలా పదిమందికి ఉపయోగపడే పనులు చేయసాగాయి. (క్లిక్: పిల్లల కథ.. ఆనందమాత) -
జూపార్క్ లోకి భారీ వరద నీరు (ఫొటోలు)
-
అదిగో పులి... ఇదిగో తోక
కోటవురట్ల: పులి భయంతో అటవీ పరిధి గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు అటవీ పరిధిలో సంచరించిన పులి తాజాగా నర్సీపట్నం–రేవుపోలవరం రోడ్డుపై కూడా సంచరిస్తోందన్న ప్రచారం సాగుతోంది. గురువారం రాత్రి ఇందేశమ్మవాక ఘాట్‌రోడ్డులో పలువురికి పులి కనిపించినట్టు చెబుతున్నారు. ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వెళుతుండగా ఘాట్‌రోడ్డులో పులి కనిపించడంతో బైకును అక్కడే వదిలేసి వెనక్కి పరుగులు తీసినట్టు చెబుతున్నారు. పందూరు గ్రామానికి చెందిన కిర్రా నాగేశ్వరరావు ఇందేశమ్మతల్లి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తుంటారు. ఎప్పటిలానే గురువారం రాత్రి 9 గంటల సమయంలో అమ్మవారికి దీపం పెట్టి తిరిగి పందూరులోని ఇంటికి వెళ్లేందుకు బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేసేసరికి లైట్ వెలుతురులో సుమారు 200 అడుగుల దూరంలో పులి కొండపైకి ఎక్కుతూ కనిపించినట్టు నాగేశ్వరరావు చెబుతున్నారు. తాను స్పష్టంగా చూశానని, పులి తోక, కాళ్లు కనిపించాయని రోడ్డు నుంచి కొండపైకి ఎక్కుతుండడంతో భయపడి వెంటనే గుడిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నట్టు తెలిపాడు. మరికొద్ది సమయానికి అటుగా రెండు లారీలతో పాటు కొందరు యువకులు బైకులపై రావడంతో వారితో పాటు హారన్లు కొట్టుకుంటూ ఆ ప్రాంతం నుంచి తప్పించుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఇదంతా కేవలం వదంతులేనని ఫారెస్టు రేంజరు రాజుబాబు కొట్టిపారేస్తున్నారు. పులి కొండల్లో సంచరిస్తున్న మాట వాస్తవమేనని, ఘాట్‌రోడ్డుపైకి రావడం కేవలం వదంతులే అన్నారు. శ్రీరాంపురంలో దున్నపై దాడి జరిగిన ప్రాంతంలో ట్రాక్ కమెరాలు ఏర్పాటు చేశామని, ఆ పులి మళ్లీ అటువైపు రాలేదని తెలిపారు. ప్రస్తుతం దాని దిశ మార్చుకుని నక్కపల్లి, పాయకరావుపేట మండలాల వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. దున్నను వేటాడి ఆహారం తీసుకుని సుమారు 30 గంటలు దాటుతోందని, మళ్లీ అటాక్ చేసే అవకాశం ఉందన్నారు. దానిని బట్టి పులి ఆచూకీ తెలుసుకుని ఆ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తమ సిబ్బంది, రెస్క్యూ టీమ్ అనుమానం వచ్చిన ప్రాంతాలలో తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో పులి పాదముద్రలు లభ్యం కావడం లేదన్నారు. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం.. ఇందేశమ్మ వాక ఘాట్‌రోడ్డులో పులి తిరుగుతోందని అడ్డురోడ్డు నుంచి కోటవురట్ల వైపు ఎవరూ వెళ్లొద్దని గురువారం రాత్రి వాట్సప్ గూపుల్లో ప్రచారం జరిగింది. వేర్వేరు ప్రాంతాలల్లో పులి సంచరిస్తున్న వీడియోలను గ్రూపుల్లో అప్లోడ్ చేసి హడలెత్తిస్తున్నారు. దాంతో ఘాట్‌రోడ్డులో రాకపోకలు బాగా తగ్గిపోయాయి. అణుకు, అల్లుమియ్యపాలెం, రామచంద్రపురం, గూడెపులోవ, పందూరు, బంద, శ్రీరాపురం, తడపర్తి, బోనుకొత్తూరు గ్రామాలను పులిభయం వెంటాడుతోంది. ఒంటరిగా బైకులపై వెళ్లేందుకు భయపడుతున్నారు. అడవి వైపు వెళ్లొద్దు... యలమంచిలి రూరల్ : రిజర్వ్ ఫారెస్ట్‌ను అనుకొని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆటవీశాఖ అధికారి రామ్ నరేష్ అన్నారు. శుక్రవారం పెదపల్లి అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వ్ ఫారెస్ట్‌లోకి పులి ప్రవేశించడంతో ప్రజలు ఒంటరిగా అడవిలోకి వెళ్లరాదన్నారు. అడవిని ఆనుకొని ఉన్న రైతులు పశువులను ఇంటికి తరలించడంతో పాటు అటు వైపు వెళ్లరాదని హెచ్చరించారు. పెదపల్లి రిజర్వాయర్, కొక్కిరాపల్లి రిజర్వాయర్ సమీపంలో ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండడంతో పాటు పశువులను గ్రామానికి తరలించాలని సూచించారు. పులికి ఆహారం లభించు స్థలం, నీరు అందుబాటులో ఉన్న ప్రదేశాలను పరిశీలించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పెదపల్లి ఆటవీ శాఖ ప్రాంతంలోకి బెంగాల్ టైగర్ ప్రవేశించడంతో అటవీ శాఖ అధికారులు వెంకటపురం, పెదగొల్లలపాలెం, చిన గొల్లలపాలెంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఆటవీ శాఖ అధికారులు రవి కుమార్, గోవిందు, ప్రభాకర్, మూర్తి పాల్గొన్నారు. (చదవండి: రైతులకు సిరులు కురిపిస్తోన్న పత్తి..) -
ఏం టైమింగ్.. వెంటాడిన మృత్యువు నుంచి తప్పించుకుంది
వైరల్: ఆయుష్షు గట్టిదైతే.. ఎంతటి ప్రమాదం నుంచి అయినా బయటపడొచ్చు. అయితే దానికి అదృష్టం కూడా తోడవ్వాలి. మృత్యువు వెంటాడినా.. సమయస్ఫూర్తితో వ్యవహరించి మృత్యువు ముఖం నుంచి తప్పించుకుంది ఓ సింహం ఇక్కడ. కెన్యా మసాయ్ మరా నేషనల్ రిజర్వ్ పార్క్‌లో మే 23వ తేదీన ఆంటోనీ పెసీ ఈ వీడియోను చిత్రీకరించాడు. నది మధ్యలో ఓ భారీ హిప్పో మృతదేహం కొట్టుకువచ్చింది. అయితే దాని మీద ఓ సింహం కూడా కనిపించింది. దీంతో పెసీ తన కెమెరాతో షూట్ చేయడం ప్రారంభించాడు. సుమారు నలభైకి పైగా మొసళ్లు.. హిప్పో మృతదేహం చుట్టూ చేరాయి. కాస్త ఉంటే.. పైన ఉన్న సింహం కూడా వాటికి బలి అవుతుందేమో అనుకున్నాడు పెసీ. అయితే ప్రాణ భయంతో హిప్పో మీదే ఉండిపోయిన ఆ సింహం.. సమయస్ఫూర్తితో వ్యవహరించింది. అదను చూసి నీళ్లలోకి ఒడ్డుకి చేరింది. బతుకు జీవుడా అనుకుంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
సింహం స్టైలిష్ లుక్ సూపరో సూపర్!.. కటింగ్ చేశారా?
ఫొటోలో కనిపిస్తున్న సింహాన్ని చూడండి. అరె.. సింహానికేంటీ ఈ బేబీ కటింగ్? ఎవరు చేశారబ్బా అనుకుంటున్నారు కదా? జూకు వచ్చిన ఓ వ్యక్తి కూడా ఈ వెరైటీ సింహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘నవ్వలేక చచ్చిపోతున్నాను.. ఈయనగారికి కటింగ్ ఎవరు చేశారో’ అని క్యాప్షన్ పెట్టాడు. ఇంకేముంది ఫొటోలు విపరీతంగా వైరలయ్యాయి. దీంతో జూ అధికారులు స్పందించారు. సింహానికి తామేం కటింగ్ చేయలేదని, వాతావరణంలో తేమ ఎక్కువుండటం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని చెప్పారు. ఇంతకీ ఈ సింహం ఎక్కడుందో తెలుసా.. చైనాలోని గ్వాంగ్జౌ జూలో. చదవండి: పుతిన్‌కు ఊహించని షాక్.. అధికారానికి బీటలు! -
బోనులో ఉన్న సింహంతో పరాచకాలు ...ముచ్చెమటలు పట్టించేసిందిగా...
చాలామంది వేటితో పడితే వాటితో పరాచకాలు ఆడతుంటారు. ఎంతవరకు ఆటపట్టించాలో, వేటితో ఆడుకోవాలో కూడా కొంతమందికి తెలీదు. క్రూరమృగాలతోటి, విష జంతువులతోనూ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. బంధించే ఉన్నాయి కదా అని వాటితో కూడా ఆడుకోవాలని చూస్తే అంతే సంగతులు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ముందు వెనుక చూడకుండా క్రూరమృగాన్ని ఆటపట్టింటి ఎలా సమస్యను కొని తెచ్చుకున్నాడో చూడండి. వివరాల్లోకెళ్తే...చాలా మంది జూ చూసేందుకు వెళ్లి అక్కడ బోనుల్లో బంధించి ఉండే జంతువులను టచ్ చేయాలనుకుంటారు. ఓపక్క జూ అధికారులు వాటిని ముట్టుకోవద్దు అని చెప్పిన వినరు. ఎవరలేరు కదా వాటిని ముట్టుకునేందుకు ప్రయత్నించి నానా అవస్థలు పడుతుంటారు. జమైక జూలో కూడా ఒక సందర్శకుడు ఇలానే జంతువులను ముట్టుకునేందుకు ప్రయత్నించి ఇబ్బందులను కొనితెచ్చుకున్నాడు. ఆ సందర్శకుడు బోనులోనే బంధించి ఉంది కదా అని సంహాన్ని టచ్ చేసి ఆట పట్టించేందుకు ప్రయత్నిచాడు. అంతటితో ఊరుకోకుండా దాని నోటిలో వేలు పెట్టేందుకు ట్రై చేశాడు కూడా. సింహం ఊరుకుంటుందా..'నాతోనే మజాక్ చేస్తావ్ రా'.. అంటూ కోపంతో వాడి వేలును గట్టిగా కోరికి పట్టుకుంది. ఇక ఆ సందర్శకుడు పాట్లు మాములుగా లేవు. తన వేలుని వెనక్కి తీసుకునేందుకు శతవిధాల ప్రయత్నించాడు. చివరికి వేలు పైన ఉన్న కండంతా పోయి ఎముకతో మిగిలింది. అందుకే పెద్దలు అంటారు వేటిలో పడితే వాటిలో వేళ్లు పెట్టకూడదని. ఇది అన్ని విషయాలకి వర్తిస్తుంది గానీ మనమే గుర్తించం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. Show off bring disgrace The lion at Jamaica Zoo ripped his finger off. pic.twitter.com/Ae2FRQHunk — Ms blunt from shi born 🇯🇲 “PRJEFE” (@OneciaG) May 21, 2022 (చదవండి: పెళ్లి మండపంలోనే పెళ్లి వద్దని తెగేసి చెప్పిన వధువు... స్పృహ తప్పి పడిపోయిన వరుడు) -
వైరల్ వీడియో: భయమే లేని శునకం! సింహాన్ని ఎలా తరిమిందో చూడండి
సింహం అడవికి రాజు. దాన్ని చూస్తే ఏ జంతువైనా భయంతో వణికిపోతుంది. సింహాలు చాలా ప్రమాదకరమైనవి, శక్తివంతమైనవి. ఇక శత్రువును వెంటాడి ఆహారం చేసుకోవడంలో దిట్ట. అడవిలోనూ జంతువులను సింహాం గజగజ వణికిస్తే.. తాజాగా ఓ శునకం సింహాన్ని వెంటాడి ఏకంగా తరిమికొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని లోధికా తాలూకాలోని మాగాణి గ్రామంలో సింహం తిరుగుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. రైతుల పంట పొలాల వద్ద ఉండగా సింహాం కనిపించింది. కాగా అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడేందుకు రైతులు పొలాల వద్ద ఓ కుక్కను కాపలాగా ఉంచారు. అయితే అటుగా వచ్చిన సింహాన్ని చూసి శునకం ఏమాత్రం భయపడలేదు. పంట పొలాల నుంచి గ్రామం వైపు వస్తున్న సింహాన్ని ఆ శనకం వెంటాడి గ్రామ సరిహద్దుల వరకు తరిమికొట్టింది. శనకం సింహాన్ని తరిమికొట్టడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. దీనిని చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. అనంతరం సింహం గురించి గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే సింహాన్ని తిరిగి గిర్ అభయారణ్యంలోకి పంపినట్లు అధికారుల తెలిపారు. చదవండి: క్రేజీ లవ్: గర్ల్ ఫ్రెండ్ కోసం మొత్తం గ్రామానికే కరెంట్ లేకుండా చేశాడు -
Joginapally Santosh Kumar: ఎంపీ కెమెరాలో సింహం బందీ
సాక్షి, హైదరాబాద్: అడవికి రారాజుగా దర్పంతో విశ్రమిస్తున్న సింహాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ తన కెమెరాలో బంధించారు. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులపై ఎంపీ జైరామ్ రమేశ్ నేతృత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ గురువారం గుజరాత్‌లోని గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యాన్ని సందర్శించింది. కమిటీ సభ్యుడిగా జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఈ పర్యటన వివరాలను ట్విట్టర్‌తో పాటు మీడియాతో పంచుకున్నారు. గిర్ సింహాలను దగ్గరిగా చూడటం తనను మంత్రముగ్ధుడిని చేసిందని, రోమాలు నిక్కబొడ్చుకున్నాయని ఆయన తెలిపారు. Could capture few once in a lifetime, photos of this lazy, relaxing #Lion, probably after a scrumptious meal 😊. Countless mesmerising moments, that gave all of us goosebumps in the wild, would definitely last long. Ufff.. this is like a trans and perplexing for me.#Photography pic.twitter.com/edek5EQHLN — Santosh Kumar J (@MPsantoshtrs) May 5, 2022 -
పిల్లల కథ: గర్వభంగం
దండకారణ్యపు లోతట్టు ప్రాంతంలో ఒక మంచినీటి కోనేరు ఉండేది. ఆ పరిసర ప్రాంతాల్లోని జీవులకు అదే నీటి వనరు. రాజైన సింహం కూడా అక్కడే దాహం తీర్చుకునేది. మడుగు సమీపంలోనే ఒక పుట్టలో ముసలి ఆడ తాచు, తన బిడ్డతో జీవిస్తుండేది. యువ పాము దుందుడుకు స్వభావం కలది. క్రమశిక్షణ లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ అందరినీ ఆట పట్టించేది. ఎవరైనా మందలిస్తే కాటు వేస్తానని బెదిరించేది. ఒకసారి మృగరాజు దప్పిక తీర్చుకోవటానికి కోనేటికి వచ్చింది. అయితే చుట్ట చుట్టుకుని దారికి అడ్డంగా పడుకుని గురకలు పెట్టసాగింది యువ పాము. ‘పక్కకి తొలుగు!’ అని సింహం ఆజ్ఞాపించింది. నిద్రమత్తులో ఉన్న ఆ పాముకి వినబడలేదు. ‘రాత్రి తిన్న ఎలుకో, కప్పో అరగలేదనుకుంటా. నిద్రకు ఆటంకం కలిగించటమెందుకు? పోన్లే పాపమ’ని సింహం పెద్ద మనసు చేసుకుని పక్కనుండి పోయి, నీళ్ళు తాగి తిరిగి ఎడంగా వెళ్ళిపోయింది. కాసేపటికి నిద్ర లేచిన యువ పాముని బాట పక్కనున్న చెట్టు మీది తీతువు పిట్ట పలకరించి జరిగిన సంఘటనని చోద్యంగా చెప్పింది. అది విన్న పాము సంతోషంతో పడగ విప్పి, అంతెత్తున ఉప్పొంగింది. రాజైన సింహమే తనను గౌరవించిందనే అహంకారం దాని తలకెక్కింది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు తీతువు మాటలు దాన్ని తారస్థాయికి తీసుకువెళ్ళాయి. ‘మీది సామాన్యమైన జాతి కాదు మిత్రమా! పురాణ పురుషుడైన కాళీయుడి వారసులు మీరు. అందుకే మీ తలలపై శ్రీకృష్ణుడి పాద ముద్రలు ఉంటాయి. కాబట్టే మృగరాజు నీ పట్ల సహనం చూపించాడు. మీ సర్పాల్లో ఎన్నో శాఖలున్నా పడగ విప్పగల సామర్థ్యం కేవలం మీ తాచు పాములకే ఉంది’ అంటూ ఆకాశానికెత్తేసింది. ఆ మాటలకు యువనాగు మరింత పెడసరంగా ప్రవర్తించసాగింది. తల్లి ఎన్నిమార్లు హితబోధ చేసినా దాని వైఖరి మారలేదు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని తల్లి పాము ఆందోళన చెందేది. (చదవండి👉 ఎవరు ఎక్కువ ప్రమాదం?) ఒకనాడు దాని ఆగడాలకు చరమగీతం పాడే పరిస్థితి వచ్చింది, ఆ దారిన ఒక ముంగిస రావటం తటస్థించింది. మార్గమధ్యంలో తిష్టవేసిన పాముని చూడగానే దానికి కోపం వచ్చింది. ‘దారిలోంచి తప్పుకో. నేను మంచినీరు తాగటానికి పోవాలి’ అంది అసహనంగా. యువసర్పం ఓసారి కళ్ళు విప్పి ముంగిసని చూసి, నాలుకలు చప్పరించి మళ్ళీ పడుకుంది. ఆ నిర్లక్ష్యానికి ముంగిస కోపం నెత్తికెక్కింది. ‘చెపితే వినపడటం లేదా? మర్యాదగా మార్గంలోంచి లే!’ అంటూ హుంకరించింది. యువపాము దానినసలు పట్టించుకోలేదు. అయితే ప్రమాదాన్ని గ్రహించిన తీతువు పిట్ట పాము దగ్గరకి వచ్చి, ‘పక్కకి జరుగు. లేకపోతే కొంపలంటుకుంటాయి’ అంది. యువపాము గీరగా చూస్తూ ‘చుంచెలుకకి నేను భయపడాలా? నా సంగతి దానికి తెలీదనుకుంటా. కాస్త మన ఘనతని వర్ణించి చెప్పు’ అంది తీతువుతో. ‘ఏంటీ? నేను ఎలుకనా? అసలు నేనెవరో తెలిస్తే పై ప్రాణాలు పైనే పోతాయి నీకు’ అంది ముంగిస ఆగ్రహంగా. ‘మరీ అంతగా గప్పాలు కొట్టుకోకు. నువ్వు ఎలుకవే కదా? మామూలు ఎలుకలైతే మూడు తింటాను. నువ్వు కాస్త పెద్దగా ఉన్నావు కాబట్టి నిన్నొక్కదాన్ని తింటే చాలు. మళ్ళీ వారం వరకూ వేట ప్రయాస ఉండదు’ అంటూ ఆవులించి మళ్ళీ పడుకోబోయింది. ముంగిసకి అహం దెబ్బతింది. ఈ పొగరుబోతు పాము పిల్లకి తగిన గుణపాఠం చెప్పాలనుకుంది. (చదవండి👉 జానకమ్మ తెలివి) ‘ఇదిగో ఆఖరుసారిగా హెచ్చరిస్తున్నాను. పక్కకి తప్పుకుని, దారి ఇస్తావా? లేక నా తడాఖా చూపించమంటావా?’ అంది. దాంతో యువనాగుకీ తిక్కరేగింది. సర్రున పైకి లేచి పడగ విప్పి, బుస కొట్టి ‘నాకు భుక్తాయాసంగా ఉండటం వల్ల ఇంతసేపు మాట్లాడనిచ్చాను. ఆకలితో ఉంటే ఈపాటికి నిన్ను గుటుక్కున మింగేసేదాన్ని’ అంటూ బలంగా కాటు వేసింది. ముంగిస లాఘవంగా తప్పించుకుని ‘ఓహో నీకు ఎలుకలా కనిపిస్తున్నానా? అయితే నేనెవరో నీకు తప్పక తెలియాల్సిందే, తగిన బుద్ధి చెప్పాల్సిందే’ అంటూ పోరాటానికి దిగింది. ముంగిసకీ, మూషికానికీ తేడా తెలియక యువపాము పీకలమీదకి తెచ్చుకుంటున్నదని తీతువు పిట్ట ఆవేదన చెందింది. దుడుకుతనంతో పాము పిల్ల వేస్తున్న కాట్ల నుండి తప్పించుకుంటూ, దాని చుట్టూ గుండ్రంగా తిరుగుతూ బాగా కవ్వించింది ముంగిస. దాని వ్యూహంలో చిక్కుకున్న యువపాము పదే పదే కాటు వేయటంతో దాని దగ్గరున్న విషం నిల్వ అయిపోయింది. తిరిగి ఉత్పత్తి కావటానికి కొంత సమయం పడుతుంది. అత్యుత్సాహంతో పోరాడటం వల్ల తొందరగా అలసి పోయింది. దాడి చేస్తే లొంగిపోయి, ప్రాణ రక్షణకై ఆర్తనాదం చేసే ఎలుకకీ, కాటు వేస్తున్నా తప్పించుకుని, ఎదురు దాడి చేస్తున్న ముంగిసకీ మధ్య భేదం మొదటిసారిగా అవగతమై యువపాము కళ్ళు తెరుచుకున్నాయి. కానీ అప్పటికే ఆలస్యమై పోయింది. ఒళ్లంతా గాయలతో నెత్తురోడుతోంది. బలహీన పడిన యువపాముపై ముంగిస అమాంతం దూకి మెడ పట్టుకుని కొరకబోయింది. ఈలోపు తీతువు పిట్ట హుటాహుటిన పోయి, దాని తల్లిని తీసుకు వచ్చింది. బిడ్డ చావబోతుండటం చూసి, తల్లడిల్లిన తల్లిపాము ముంగిసని శరణు కోరింది. ముసలి పాముని చూసి జాలి పడిన ముంగిస యువ పాముని వదిలేసి మరెప్పుడూ పొగరుగా ప్రవర్తించ వద్దని హెచ్చరించింది. ఆ పాఠం తర్వాత యువపాము బుద్ధిగా మసలుకోసాగింది. -
పిల్లల కథ: ఎవరు ఎక్కువ ప్రమాదం?
ఒక అడవిలో జింకపిల్ల ఒకటి వుండేది. చాలా తెలివైనది. దాని తెలివికి ముచ్చటపడిన ఆ అడవి జంతువులన్నీ ‘నీలాంటి తెలివిగలవారు రాజుగారి కొలువులో వుంటే మన జంతువులకు మేలు జరగొచ్చు. అదీగాక నీ తెలివికి గుర్తింపూ దొరుకుతుంది’ అని సలహానిచ్చాయి. దాంతో ఆ జింకపిల్ల.. సింహరాజు దగ్గర కొలువు కోసం బయలుదేరింది. అది వెళ్లేముందు జింకపిల్ల తల్లి దాన్ని హెచ్చరించింది ‘మంత్రి నక్కతో మాత్రం జాగ్రత్త’ అంటూ. సింహరాజుని కలిసి కొలువు అడిగింది జింకపిల్ల సింహం కొన్ని ప్రశ్నలు అడిగింది. జింకపిల్ల సమాధానాలు ఇచ్చింది. దాని తెలివి తేటలకు అబ్బరపడ్డ సింహం దానికి తన కొలువులో ప్రధాన సలహా దారుగా ఉద్యోగమిచ్చింది. మంత్రి నక్క.. జింకకు అభినందనలు తెలిపింది ‘నీలాంటి తెలివైనవారు వుండటం వల్ల నాకూ పని భారం తగ్గుతుంది’ అంటూ. ‘ ఇంత మంచి నక్క గురించి అమ్మ ఏంటీ అలా హెచ్చరింది?’ అనుకుంది జింక. నిజానికి జింకపిల్ల కొలువులోకి రావడం నక్కకి యిష్టంలేదు తన ప్రాబల్యం తగ్గితుందని. అయితే బయటపడకుండా సమయం కోసం ఎదురు చూడసాగింది. (పిల్లల కథ: జానకమ్మ తెలివి) ఒకరోజు సింహం.. జింకపిల్ల తెలివితేటల్ని నక్క ముందు ప్రశంసించింది. ‘ఏంటో నాకైతే ఆ జింకపిల్ల అది పక్క రాజ్యం వారు పంపిన గూఢచారేమోనని అనుమానం. త్వరలో సాక్ష్యాలతో రుజువు చేస్తా’ అన్నది. ఒకరోజు ఎలుగు, తోడేలుకు ఏదో ఆశ చూపి సాక్షులుగా తీసుకొచ్చి జింకపిల్ల గూఢచారి అని రుజువు చేయబోయింది. అప్పుడు ఆ కొలువులోనే ఉన్న ఏనుగు ‘ప్రభూ! జింకపిల్ల తెలివైనదని, అది కొలువులో వుంటే బావుంటుందని మేమే దాన్ని మీ దగ్గరకు పంపాం. అది గూఢచారి కాదు’ అని వాదించింది. ఆ వాదనకు భయపడ్డ ఎలుగుబంటి, తోడేలు నిజం చేప్పేశాయి. సింహం కోపంతో నక్కకు చురకలు అంటించింది. తల్లిని కలవడానికి జింకపిల్ల ఇల్లు చేరింది. జరిగింది చెప్పి ‘అమ్మా.. క్రూరజంతువైన సింహం కొలువులో చేరతానంటే ఒప్పుకున్నావు కానీ నక్క లాంటి జంతువుతో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించావు ఎందుకు?’ అని అడిగింది. ‘చెడ్డవారని ముందుగానే తెలిస్తే జాగ్రత్తగా వుంటాం కానీ మంచివారుగా కనిపిస్తూ గోతులు తవ్వేవారినే కనిపెట్టలేం. వారే చాలా ప్రమాదం. సింహం క్రూరజంతువు అని తెలుసు గనక జాగ్రత్తగా వుంటాం. కానీ నక్కలాంటివారు మంచిగా నటిస్తూ కీడు చేయ చూస్తారు. అందుకే అలాంటివారితో జాగ్రత్తా అని చెప్పాను. నీకూ అదే ఎదురైంది గనక ముందు ముందు అలాంటివారితో మరింత జాగ్రత్తగా వుండు’ అంది తల్లి. జింకపిల్ల తన తల్లి సలహా పాటిస్తూ జీవితాన్ని హాయిగా గడిపింది. -
Viral Video: ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా!
దాహమేసి దప్పిక తీర్చుకోవడానికి ఓ కొలను దగ్గరికి వెళ్లింది ఓ సింహం. అయితే.. అప్పటికే నీళ్లలో ఉన్న తాబేలు.. దానిని తాగనీయకుండా పదే పదే అడ్డుకుంది. ఒక దగ్గరి నుంచి మరో చోటికి వెళ్లిన కూడా సింహాన్ని సతాయిస్తూ ఇబ్బంది పెట్టింది. ఎవడైతే నాకేంటి అనుకుందో ఏమో.. తన అడ్డాకి వచ్చిన సింహాన్ని అలా ఇబ్బంది పెట్టింది ఆ తాబేలు. సింహం కూడా ఆ చిట్టితాబేలును ఏం చేయకుండానే పక్కకు వెళ్లి నీళ్లు తాగే ప్రయత్నం చేసింది. ఈ వీడియో కొత్తదా? పాతదా?.. ఎక్కడ, ఎప్పుడు, ఎవరు తీశారో తెలియదుగానీ.. మిగతా జంతువుల్ని భయపెట్టే సింహానికి చుక్కలు చూపించిందంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు. View this post on Instagram A post shared by Finest of World (@finestofworld) ఇదిలా ఉండగా.. కొంత కాలం కిందట వైకల్యం ఉన్న ఓ శునకం.. సుఖంగా నిద్రిస్తున్న రెండు సింహాలపైకి మొరుగుతున్న ఎగబడ్డ వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం పైన తాబేలు వీడియో ట్రెండ్ అవుతున్న క్రమంలో.. ఈ పాత వీడియో సైతం మళ్లీ ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. -
సింహాలతో సెల్ఫీ.. అట్లుంటది మనతోని!
సాధారణంగా సాధుజంతువులతో మనకి నచ్చినట్లు ప్రవర్తిస్తుంటాం. కానీ పులి, సింహం, ఏనుగులాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకుంటే వాటికి తిక్కరేగితే అంతే సంగతులు. ఇక ప్రత్యేకంగా సింహం గాండ్రింపు వింటేనే హడలిపోయేవాళ్లు చాలా మందే ఉన్నారు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా సింహాలతోనే సెల్ఫీ దిగడమే కాకుండా వాటితో వీడియోలు కూడా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. అతని పేరు హుమైద్ అబ్దుల్లా అల్బుకైష్. యూఏఈకి చెందిన పెద్ద వ్యాపారవేత్త. దుబాయ్‌లోని అత్యంత ధనవంతులలో హుమైద్ ఒకరు. అతను ఎమిరేట్స్ నేషనల్ ఆయిల్ కంపెనీ (ఈఎన్ఓసీ) సీఈఓ. అతను తన లగ్జరీ లైఫ్‌స్టైల్, సింహాల పెంపకం, వాటితో వీడియోల ద్వారా సోషల్ మీడియాలో స్టార్‌గా కూడా మారాడు. అంతేకాకుండా అతనికి జంతువుల మీద ఉన్న ప్రేమ కారణంగా అల్బుకైష్ జంగిల్ అనే ఒక ప్రైవేట్ జూని నడుపుతున్నాడు. ఎడారి మధ్యలో ఉండే ఈ జూలో సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఇతర జంతువులున్నాయి. వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఒక సింహం చెట్టుపైకి ఎక్కగా, మరో రెండు కింద ఉన్నాయి. హుమైద్ వాటికి కొంతదూరంలోనే సెల్ఫీ తీసుకుని సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Humaid Abdulla Albuqaish (@humaidalbuqaish) -
Viral Video: భయంతో చెట్టెక్కిన సింహం... ఏ మాత్రం పట్టు తప్పినా అంతే!
Lion Hangs From A Tree: జంతువులకు సంబంధించిన రకరకాల వీడియోలను చూశాం. క్రూరమృగాలైన సైలెంట్‌గా ఉన్నాయని వేలాకోళం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే ఒక్కోసారి ఆ క్రూరమృగాలు కూడా టైం బాగోకపోతే చిన్న జంతువులకు భయపడాల్సిందే. చలి చీమల చేత చచ్చిన పాము మాదిరిగా ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే ఒక అడవిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...సింహాలను అడవికి రాజు అంటారు . అలాంటి సింహాన్ని చూసి ఏ జంతువైన భయంతో పరిగెడుతుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా సింహమే భయంతో చెట్టెక్కింది. అసలేం జరిగిందంటే.. అడవి గేదేల మందను చూసి సంహం ఒక్కసారిగి బిత్తరపోయి భయంతో పారిపోయేందుకు ప్రయత్నించింది. పైగా అక్కడకు దగ్గరలో ఉన్న చెట్టెక్కి బిక్కుబిక్కు మంటూ వేలాడుతూ ఉంది. కానీ అక్కడ ఉన్న గేదెల మంద ఆ సింహ ఎప్పుడూ కిందకు దిగుతుందా అన్నట్లుగా ఆ చెట్టు చుట్టూ చేరి చూస్తున్నాయి. ఈ ఘటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by wild animal shorts (@wild_animal_shorts_) (చదవండి: ఉక్రెయిన్ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్ బాటిల్‌తో బాంబులు నిర్వీర్యం) -
వామ్మో ! కుక్కపిల్ల మాదిరి సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చేసింది!!
Viral Video: Woman Spotted Carrying Lion In Her Arms: ఇంతవరకు మనం జంతువులకు సంబంధించిన వీడియోలను చాలనే చూశాం. పైగా అవి సాహాసోపేతంగా తోటి జంతువులను లేదా మనుషులను రక్షించిన వీడియోలను చూశాం. అచ్చం అలానే కాకపోతే ఒక అల్లరి పెంపుడు సింహాన్ని యజమాని చేతులతో ఎత్తుకుని మోసుకుంటూ తీసుకువచ్చిన వీడియో ఒకటి సామాజికి మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. (చదవండి: దాల్సరస్సులో అగ్నిప్రమాదం... రెండు బోట్లు దగ్ధం) అసలు విషయంలోకెళ్లితే...ఆ వీడియోలో కువైట్‌లోని ఒక మహిళ ఒక సింహాన్ని చేతులతో మోసుకొస్తున్నట్లు ఉంటుంది. పైగా ఆ సింహం నన్ను వదిలేయమంటూ తెగ మెలికలు తిరిగిపోతున్నట్లు కనిపించింది. అసలు విషయం ఏమిటంటే ఒక మహిళ సింహాన్ని పెంచుకుంటుంది. అయితే ఇది బయటకు వచ్చి పక్కంటి వాళ్ల తోటను నాశనం చేసి అక్కడున్న వాళ్లను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో సదరు మహిళ ఆ సింహాన్ని చేతులతో మోసుకుంటూ తీసుకువచ్చింది. (చదవండి: తెలివైన కుక్క.. ప్రమాదంలో యాజమాని.. ప్లీజ్ ఫాలో మీ అంటూ..) My neighbor and her dog seemed to not be getting along last night pic.twitter.com/fUGcpuTkMY — Arlong (@ramseyboltin) January 3, 2022 -
దేనికైనా రెడీ అంటూ!... సింహానికి సవాలు విసురుతూ... ఠీవిగా నుంచుంది కుక్క!!
Viral Video Fearless Dog Stares Down Mountain Lion: ఒక్కోసారి జంతువులు చేసే పనులు చూస్తే మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. పైగా వాటికంటే బలమైన జంతువులు ముందు ఏ మాత్రం భయంలేకుండా సంచరించి మనకే భయం కలిగించేలా ప్రవర్తిస్తాయి. అచ్చం అలాంటి ఘటనే జర్మనీలోని కాన్యన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. (చదవండి: ఆ షార్క్ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!!) అసలు విషయంలోకెళ్లితే... జర్మనీలోని కాన్యన్ రాష్ట్రంలో సారా అనే ఆమె ఇంటి వద్ద ఉన తన పెంపుడు కుక్క అద్దాల గదిలో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో ఎటు నుంచి వచ్చిందో గానీ ఒక అడవి సింహం వస్తుంది. అది నేరుగా ఆ కుక్క ఉన్న అద్దాల గది వద్దకు వస్తుంది. అయితే ఈ కుక్క ఆ సింహాన్ని చూసి ఏ మాత్రం భయపడకుండా డేర్‌గా నిలబడుతుంది. ఆ రెండిటికి మధ్య ఆ అద్దాల తలుపు మాత్రమే అడ్డం. పైగా ఆ కుక్కని యజమాని సారా వెనక్కి రమ్మని ఎంతగా పిలిచిన వినకుండా అక్కడ నుంచుని ఆ సింహాన్ని చూస్తోంది. అయితే ఆ సింహం కూడా ఆ కుక్క దగ్గరకు వచ్చి నిలబడటమే కాక ఆ తలుపుని తీయడానికి తెగ ప్రయత్నిస్తుంది. అయితే అవి రెండు ఒకరినొకరు చాలా సేపటి వరకు చూసుకుంటారు. ఈ మేరకు కుక్క దాన్ని భయపెట్టేలా అరుస్తుండటం విశేషం. ఆ తర్వాత ఆ సింహం అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సారా "చిల్లింగ్ ఎన్కౌంటర్" అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీరు ఓ లుక్ వేయండి. (చదవండి: అఫ్ఘాన్ బాలికలు విద్యనభ్యసించేలా బలమైన యూఎస్ మద్దతు కావాలి!) -
టూరిస్టు కారు గుంటలో పడితే.. దాని కట్టిన తాడు సింహం నోటిలో.!
కొన్ని భయంకర ఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగానూ, భయాన్ని కలిగిస్తాయి. ఒక్కొసారి జరిగే భయంకర ఘటనలను చూస్తే ఇక మన పని అయిపోయిందేమో అని అనిపించేలా ఉంటాయి. అచ్చం అలాంటి ఘటనే దక్షిణాఫ్రికా అడవుల్లో చోటు చేసుకుంది. (చదవండి: బిడ్డ పుట్టాలని సైకిల్ తొక్కింది!... అంతే చివరికి!!) అసలు విషయంలోకెళ్లితే... పర్యాటక దేశమైన దక్షిణాఫ్రికాలోని ప్రసిద్ధిగాంచిన ఆఫ్రికన్ అడవుల గుండా ఒక పర్యాటక బృందం ఎస్యూవీ సఫారీ కారులో పర్యటిస్తోంది. అయితే అనుకోకుండా ఒక గుంటలో కారు ఇరుక్కుపోతుంది. దీంతో ఆ కారు డ్రైవర్ అయిన టూరిస్ట్ గైడ్ గైడ్ జబులానీ సలిండా కెన్నెడీ ఒక తాడు సాయంతో ఏదోలా బయటికి తీస్తాడు. అనుకోకుండా ఇంతలో ఒక మగ సింహ అక్కడికి వస్తుంది. అంతే ఒక్కసారిగా ఆ పర్యాటకులంతా భయంతో కేకలు వేస్తారు. దీంతో గైడ్ కెన్నెడీ కంగారపడవద్దని చెప్పి వాళ్లను లోపలే కూర్చోమని ధైర్యం చెబుతాడు. అయితే ఈ హడవిడిలో వాళ్లు ఆ కారుకి కట్టిన తాడుని వెనక్కి తీయలేకపోతారు. అంతే ఆ తాడు పై ఆ సింహం దృష్టి పడుతుంది. ఇంకేముంది ఆ సింహం ఆ తాడుని నోటితో పట్టుకుని ఎలాగైన కారుని వెళ్లనీయకుండా చేయాలని చూస్తుంది. పాపం చాలా ప్రయాస పడుతుంది. ఒకనోక దశలో అయితే అది కింద పడిపోయి ఈడ్చుకుంటూ పోతుంది. అయినప్పటికి ఆ తాడుని మాత్రం వదలదు. ఈ మేరకు చివరికి సింహానికే చికాకు పుట్టి ఆ తాడుని వదిలేస్తుది. దీంతో ఆ పర్యాటకులు బతుకు! దేవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. (చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు) -
నెహ్రూ జూలాజికల్ పార్కు: సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని...
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. నేరుగా సింహం ఎన్‌క్లోజర్‌లోకి దిగే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన సందర్శకుడు అరవడంతో అప్రమత్తమైన జూ సిబ్బంది చాకచాక్యంగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని బహదూర్‌పురా పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 3.30గంటలకు జరిగింది. జూ అధికారులు, బహదూర్‌పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాయి కుమార్ (31) జూపార్కును సందర్శించడానికి టికెట్టు తీసుకొని జూలోకి వెళ్లాడు. తోటి సందర్శకులు, జూ సిబ్బంది కళ్లు కప్పి సింహం ఎన్‌క్లోజర్ కొండచరియల గోడపైకి ఎక్కాడు. దీంతో అప్రమత్తమైన జూ యానిమల్ కీపర్, సిబ్బంది అతడిని పట్టుకున్నారు. సాయి కుమార్ తిరుమలగిరి ప్రాంతంలో గత కొన్నేళ్లుగా రోడ్లపై నివాసముంటున్నట్లు బహదూర్‌పురా ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. సింహాల వద్ద వజ్రాలు, బంగారం ఉంటాయని... వాటి కోసమే సింహం దగ్గరకు వెళ్లానని చెప్పాడని, అతని మానసిక స్థితి సరిగ్గా లేదని పోలీసులు పేర్కొన్నారు. సాయి కుమార్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సన్నద్ధమైన సింహం... ఆసియా సింహాల ఎన్‌క్లోజర్ గోడ మీదికి ఎక్కిన యువకున్ని ఎన్‌క్లోజర్‌లో ఉన్న సింహం (మనోహర్–7) చూసింది. యువకుడు ఏ మాత్రం కిందికి దిగినా... అదును చూసుకుని దాడి చేసేందుకు సింహం సన్నద్ధమైంది. యువకుడినే గమనిస్తూ తన డెన్ ముందు అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. జూ సిబ్బంది చాకచాక్యంగా వ్యవహరించకపోతే ఆ సింహం చేతిలో యువకుడు సాయి కుమార్ మృత్యువాత పడాల్సి వచ్చేది. యువకుడు సురక్షితంగా బయటపడటంతో జూ సిబ్బంది, అధికారులు, సందర్శకులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ... నగరంలోని మెట్రో రైలు పనుల్లో కార్మికుడిగా పని చేస్తున్న ఓ యువకుడు 2016లో తాగిన మత్తులో సింహం ఎన్‌క్లోజర్‌లోకి దిగాడు. ఎన్‌క్లోజర్ చుట్టు ఉండే నీటిలో ఈత కొట్టుకుంటూ సింహం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన జూ సిబ్బంది, అధికారులు గంట పాటు శ్రమించి అతన్ని బయటికి తీసుకొచ్చారు. రాజస్తాన్‌కు చెందిన అతనిపై బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆ యువకుడు నాలుగు నెలల వరకు జైలు పాలయ్యాడు. -
Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!!
సింహాన్ని చూస్తే ఎవరికైనా హడల్ పుట్టాల్సిందే! కానీ దీని దెబ్బకి సింహమే బెదిరి సైడిచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోవైపు మీరు కూడా ఓ లుక్కెయ్యండి. ఈ వీడియోలో ఓ కుక్క అరుస్తూ సింహం వెంట పడటం కనిపిస్తుంది. అంతేకాకుండా సింహంపై దాడి చేస్తుంది కూడా. ఐతే కారణం ఏమిటో తెలియదు కానీ.. సింహం మాత్రం సదరు కుక్క నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు మాత్రం ఆశ్యర్యంతో తలమునకలైపోతున్నారు. ఇది నిజమేనా.. అసలేం జరుగుతుందని సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ ఫన్నీ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ అధికారి అడవి జంతువులకు సంబంధించిన వీడియోలను తరచూ పోస్ట్ చేస్తుంటాడు. అతని ఫాలోవర్లు ఈ వీడియోలను అమితంగా ఇష్టపడటమేకాకుండా ఇతర సోషల్ మీడియాల్లో షేర్ కూడా చేస్తారట. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! What’s happening?? pic.twitter.com/QMESBRVZ6f — Susanta Nanda IFS (@susantananda3) October 28, 2021 -
వండలూరు జంతు ప్రదర్శనశాలలో ‘వైరస్’ కలకలం..
సాక్షి, చెన్నై(తమిళనాడు): వండలూరు జంతు ప్రదర్శనశాలలో వైరస్ కలకలం రేపుతోంది. రెండురోజుల వ్యవధిలో తొమ్మిది నిప్పు కోళ్లు, ఒక ఆడ సింహం మరణించినట్టు గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యబృందాలు పరిశీలన ప్రారంభించాయి. కరోనా లాక్డౌన్ సమయంలో వండలూరులోని అన్నా జంతు ప్రదర్శనశాలలో వన్యప్రాణులపై కరోనా ప్రభావం పడిన విషయం తెలిసిందే. రెండు సింహాలు మరణించడం, మరికొన్ని కరోనా బారిన పడడం వెలుగు చూశాయి. దీంతో ఆ ప్రదర్శనశాల కొంతకాలం మూత పడింది. మళ్లీ ప్రస్తుతం సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం హఠాత్తుగా రెండు నిప్పు కోళ్ల మరణించాయి. వీటికి పోస్టుమార్టం నిర్వహించి..సేకరించిన నమూనాల్ని పరిశోధనకు పంపించారు. నివేదిక వచ్చేలోపు బుధవారం సాయంత్రం మరో ఏడు నిప్పు కోళ్లు మరణించడంతో వైరస్ కలవరం ఏర్పడింది. అలాగే, గతంలో కరోనా బారిన పడికోలుకున్న కవిత(22) అనే ఆడ సింహం అనారోగ్యంతో మరణించడంతో ఈ భయం మరింత పెరిగింది. అధికారులు ఇతర వన్య ప్రాణులు అనారోగ్యం బారిన పడకుండాముందు జాగ్రత్తలు చేపట్టారు. పరిశీలనలో టీకా ఉత్పత్తి కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని రాష్ట్రంలోని చెంగల్పట్టు, కున్నూరు కేంద్రాల్లో చేపట్టేందుకు కేంద్ర చర్యలు చేపడుతోందని ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 18 ఏళ్లు లోపువారికి టీకా డ్రైవ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసిందన్నారు. కాగా చెన్నైలో మాస్క్‌లు ధరించని 47 వేల మందిని గుర్తించి, వారి నుంచి రూ. 94 లక్షల మేరకు జరిమానాను రెండు రోజుల్లో వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు. చదవండి: చిన్నారిని కిడ్నాప్ చేయించిన మేనమామ -
సింహాన్ని పరుగులు పెట్టించిన చీతా..
నైరోబి: అడవికి రారాజు సింహం. అలాంటి సింహాన్ని సైతం పరుగులు పెట్టించిందో చీతా. విషయమేమిటంటే.. ఈ సింహానికి కొంతదూరంలో చీతా, దాని పిల్లలు కనిపించాయి. ఈ మధ్యాహ్నం భోజనం దొరికినట్లేననుకున్న సింహం... పిల్లల నుంచి తల్లిని వేరు చేసేందుకు ప్రయత్నించింది. తనకంటే మూడు రెట్లు పెద్దదైన సింహాన్ని చూసి భయపడి మొదట పారిపోయే ప్రయత్నం చేసిందీ చీతా. ఎప్పుడైతే సింహం... తన పిల్లలను తినడానికి ప్రయత్నించిందో.. ఆ అమ్మ ఆదిశక్తిగా మారింది.. తిరగబడింది.. ఊహించని పరిణామంతో సింహం వెనక్కి తగ్గింది. కాళ్లకు పనిచెప్పింది. కెన్యాలోని మాసై మారా నేషనల్ రిజర్వ్ ఫారెస్టులోని ఈ దృశ్యాలను తన కెమెరాతో బంధించాడో ఫొటోగ్రాఫర్. చదవండి: ఆ ఇంట పాములు బాబోయ్ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే! -
గేదెలే గుంపులుగా వస్తాయ్.. సింహం సింగిల్‌గానే అనుకుంది.. ఫైనల్‌గా..
ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో అది సోషల్‌మీడియాలో ప్రత్యక్షమవుతోంది. అందులో కొన్ని వైరల్‌గా మారి దూసుకుపోతుంటాయి కూడా. ఇటీవల పెళ్లి, బరాత్, పిల్లలు, జంతువుల వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే కంటెంట్ ఉన్న వీడియోలు సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు. సాధు జంతువులపై క్రూర జంతువులు దాడి చేయడం ప్రకృతి సహజమే. కానీ అలా ప్రతీ సారి కుదరదని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో ఓ గేదెపై సింహం దాడి చేసింది. ఇంకేముంది ఆ గేదె పని అయిపోయింది అనుకున్నారా! ఇక్కడ సీన్ మారింది లెండి. దాహం వేసి నీరుతాగడానికి వెళ్లిన ఓ గేదెను.. ఓ సింహం అదును చూసి ఒక్కసారిగా దానిపై దూకింది. ఊహించని ఘటనతో బెదిరిపోయిన గేదె.. కొద్ది సేపు తడబడ్డా, తర్వాత తిరగబడింది. ప్రాణాలు కాపాడుకునేందుకు శక్తివంచన లేకుండా ఆ సింహంతో పోటా పోటీగా పోరాడుతోంది. ప్రమాదంలో ఉన్న ఆ గేదెను చూసిన మిగతా గేదెలు ఒక్కసారిగా సింహంపై ఎదురుదాడి చేస్తూ రంగంలోకి దిగాయి. ఇంకేముంది గేదెలు ఒకటో రెండో ఉంటే మన మృగరాజు మేనేజ్ చేసేదేమో గానీ గుంపులు గుంపులుగా ఉండేసరికి దడుసుకంది. కానీ అప్పటికే పద్మవ్యూహంలో చిక్కినట్లు ఆ గేదెల గుంపుకు సింహం చిక్కేసింది. అన్ని గేదెలూ కలిసి ఆ సింహాన్ని చెడుగుడు ఆడుకున్నాయి. గాల్లోకి బంతిలా ఎగరేస్తూ.. కొమ్ములతో కుమ్ముతూ, కాళ్లతో తొక్కి చంపేశాయి. కాగా ఆ పార్కులోకి వచ్చిన కొందరు సందర్శకులు ఈ దృ శ్యాన్ని రికార్డు చేసి సోషల్‌మీడియాలో షేర్ చేశారు. చదవండి: లక్ష రూపాయల్ని టవల్లో చుట్టుకుంటే.. కోతి ఎత్తుకెళ్లిపాయె! -
Viral Video: అబ్బే ఏం లేదు.. నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే!!
అడవిలో పక్షులు, జంతువులకు వేటి సహజ అలవాట్లు వాటికుంటాయి. అందుకు ప్రత్యేకంగా ఏదైనా చేస్తేనే అది వండర్ అవుతుంది. కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులైతే మామూలే అనుకోవచ్చు. కానీ అడవికే రారాజు అయిన సింహం తన అలవాట్లు మార్చుకుందేమోననే సందేహం కలిగేలా ఉన్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలేంచేసిందంటే.. ఒక కదులుతున్న కారులో నుంచి ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో కారు పబ్లిక్ టాయిలెట్ దగ్గర ఆగగానే లోపల్నుంచి బయటకు వస్తున్న సింహం కనిపిస్తుంది. వాళ్లను చూసిన సింహం ‘ఇది నాకు చాలా మామూలు విషయం’ అన్నట్టుగా నింపాదిగా బయటికి వచ్చి అడవిలోకి వెళ్లిపోతుంది. ఐతే ఈ సంఘటన ఎక్కడజరిగిందో తెలియదు కానీ దీనిని చూసిన నెటిజన్లు మాత్రం భిన్న కామెంట్లు చేస్తున్నారు. ‘మగ సింహం జంట్స్ టాయిలెట్స్ నుంచి బయటికి రావడం నిజంగా అభినందించదగిన విషయమే.. చదువుకున్న సింహం’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘చాలా సేపటినుంచి ఓపిక పట్టాను.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని’ మరొకరు కామెంట్ చేశారు. పబ్టిక్ టాయిలెట్స్‌లో జంతువులు కనిపించడం ఇది మొదటిసారేమీ కానప్పటికీ జంగిల్ సఫారీ టైంలో టాయిలెట్లకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించి వెళ్లడం బెటర్ అనిపిస్తుంది ఈ వీడియోను చూస్తే! దీంతో ఈ వీడియోను వేలకొద్దీ నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: చరిత్రలో పెద్ద మిస్టరీగా మిగిలిన మృత్యులోయ..! -
పడిపోయాననుకున్నావా? ఈత కొట్టాలనిపించింది.. దూకేశా..
ఎటో చూస్తూ నడిస్తే ఎంతటి వారైనా బొక్కబోర్లా పడాల్సిందే! అందుకు ఎవరూ అతీతులు కాదని.. సాక్షాత్తు మృగరాజే నిరూపించింది. అసలేం జరిగిందంటే.. జర్మన్ జూ పార్క్‌లో రెండు సింహాలు ఒక నీటిగుంట గట్టు మీద క్యాజువల్‌గా నడుస్తున్నాయి. ఇంతలో ఒక సింహం ఎటో చూస్తూ, నిర్లక్ష్యంగా నడుస్తూ, స్లిప్ అయ్యి నీటి గుంటలో పడిపోయింది. ముందు షాకయినప్పటికీ తర్వాత తేరుకుని నింపాదిగా ఈదుకుంటూ పైకి వచ్చింది. అయితే దానితో పాటే ఉన్న మరో సింహం మాత్రం కంగారు పడిపోయింది. నీళ్లలోనుంచి బయటికి వచ్చేంతవరకూ హడావిడిగా తిరగసాగింది. 2018 నాటి ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఐతే నెటిజన్లు మాత్రం ఈ వీడియోకు సరదాగా తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు. ‘గర్వం పతనానికి దారితీస్తుంది’అని ఒకరు కామెంట్ చేస్తే, ‘బుద్ధిలేని సింహం’ అని మరొకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనప్పటికీ నవ్వు వచ్చేలా ఉన్న ఈ వీడియో సన్నివేశాన్ని మాత్రం వేల సంఖ్యలో నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: ఈ రైళ్ల కూత కుక్కల అరుపులా ఉంటుంది.. ఐడియా అదుర్స్ కదూ.. -
రివర్స్ జూ: బోనులో మనం.. స్వేచ్ఛగా సింహాలు
సింహాన్ని చూడ్డానికి మనం జూకు వెళ్తాం.. సింహానికే మనల్ని చూడాలనిపించింది అనుకోండి.. ఇదిగో ఈ రివర్స్ జూకు వస్తుంది.. అంటే.. జంతువులు బయట తిరుగుతూ ఉంటే.. మనం బోనులో ఉండటమన్నమాట. దక్షిణాఫ్రికాలోని హారిస్మిత్లో ఉన్న జీజీ సింహాల అభయారణ్యంలో ఈ వినూత్న బోనును ఏర్పాటు చేశారు. దీని వల్ల సందర్శకులకు కూడా వాటిని దగ్గర నుండి చూసే అనుభూతి కలుగుతుందని అభయారణ్యం నిర్వాహకులు చెబుతున్నారు. భద్రత విషయంలో ఎలాంటి భయాలూ అక్కర్లేదని.. దీన్ని తరచూ ఇంజనీర్లతో తనిఖీలు చేయిస్తామని పేర్కొంటున్నారు. -
అడవిలో బతకకున్నా అడవికి రారాజే.. ఎందుకో తెలుసా?
World Lion Day 2021: ఎంత మాంసాన్ని ఇష్టంగా లాగించే వాళ్లైనా.. సింగిల్ మీల్లో అదీ 40 కేజీల మాంసం తినగలరా? అనే అనుమానం రావొచ్చు. మనుషులకైతే అది అసాధ్యం కాకపోవచ్చు. కానీ, మృగాలకు రారాజుగా పేరున్న సింహానికి అది ఎంతో అలవోకైన పని.. సాక్షి, వెబ్‌డెస్క్: ఎంత ఆకలేసినా.. సింహం గడ్డి తినదనేది సామెత. కానీ, సింహాలు మొక్కల నుంచి తమ దాహం తీర్చుకుంటాయని తెలుసా?. అందుకే కలహారి లాంటి ఎడారుల్లో సైతం సింహాలు మనుగడ కొనసాగించగలవు. టీసమ్మ మెలన్ లాంటి మొక్కల నుంచి నీటిని సేకరించుకోగలవు సింహాలు. World Lion Day సందర్భంగా మృగరాజుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. ►సింహం అనేది బలానికి, క్రూరత్వానికి ప్రతీక. ఆఫ్రికా ఖండపు ఔనత్యానికి అదోక గుర్తు. అలాంటి జీవులు అంతరించిపోయే స్థితికి చేరాయని తెలుసా? ఒకప్పుడు ఆఫ్రికా, ఆసియా, యూరప్ వ్యాప్తంగా సింహాలు ఉండేవి. ఇప్పుడు కేవలం ఆఫ్రికాలోనే సింహాలు ఉన్నాయి. అయితే.. గుజరాత్ ససన్-గిర్ నేషనల్ పార్క్‌లో ఏషియటిక్ సింహాల రక్షణ కోసం కృషి నడుస్తోంది. ఈ పార్క్‌లో సుమారు 350-400 మధ్య సింహాలు ఉన్నాయి. సరిహద్దులోని గ్రామీణ ప్రాంతాల్లో వీటి సంచారం షరా మాములుగా మారిపోయింది. కూనలతో గిర్ సింహం ►సింహం సింగిల్‌గా వస్తుందనేది ఫేమస్ డైలాగ్. కానీ, సింహాలు సంఘ జీవులు. ఇవి బతికేది.. వేటాడేదీ(ఒకటి తరిమితే మిగతావి మిగతా వైపుల నుంచి చుట్టుముట్టడం-అంబూష్ ఎటాక్) గుంపులుగానే. ఒక్కో గుంపులో పదిహేను దాకా సింహాలు ఉంటాయి. గరిష్టంగా 40 దాకా ఉండొచ్చు. మగ సింహాం ఆ గుంపునకు నాయకత్వం వహిస్తుంది. ఆధిప్యత పోరు తర్వాత నాయకత్వ బాధ్యతను స్వీకరించి సరిహద్దుల్ని కాపాడుతుంది. ఆడ సింహాలు వేటాడతాయి. వేటాడిన మాంసాన్ని ముందుగా ముట్టేవి మగ సింహాలే!. ఆఫ్రికన్ సింహాలు ►సింహాలు సిసలైన ఫ్యామిలీమెన్లు. గుంపులోని ఒకదానితో ఒకటి తలలు రుద్దుకోవడం, కూనలతో ఆడడం, సింహాలన్నీ ఐక్యంగా ఉండడం లాంటి ఆప్యాయతలు మాత్రం తారాస్థాయిలో ఉంటాయి. ఆడ సింహాలు కూనల్ని కలిసే పెంచుతాయి. సింహం కూనలు ఏ తల్లి(ఆడ సింహం) నుంచైనా పాలు తాగుతాయి. ‘ఫ్యామిలీ సెంట్’తో తమ హద్దులోని సింహాలు కలిసి కట్టుగా బతుకుతుంటాయి కూడా. ►గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందనేది కేవలం డైలాగ్ మాత్రమే. కానీ, ఒరిజినల్‌గా సింహం నుంచి వచ్చే గర్జన.. సుమారు ఐదు మైళ్ల దూరం దాకా వినబడుతుంది. బిగ్ క్యాట్ జాతుల్లో గుంపుగా గర్జించేవి సింహాలు మాత్రమే. ఇక రకరకాల సమయాల్లో వాటి కమ్యూనికేషన్ రకరకాల శబ్దాలతో ఉంటుంది. ►అడవికి రాజనే బిరుదు ఉన్నప్పటికీ.. సింహం బతికేది పచ్చిక బయళ్లు, మైదానాల్లోనే. అడవుల్లో బతకడానికి సింహం అస్సలు ఇష్టపడదు. సింహాల గురించి చెప్పే క్రమంలో.. ఏదో అతిశయోక్తితో ఆఫ్రికన్లు ఈ పదం పుట్టించారు. సో.. కింగ్ ఆఫ్ జంగిల్ అనేది సహేతుకం కాదేమో!. ఇక సింహం గంటకు యాభై మైళ్ల వేగంతో పరిగెత్తగలదు. నడిచేటప్పుడు దాని కాలి మడమ నేలను తాకదు. ►చీకట్లో సైతం వేటాడగలిగే సత్తా సింహాల సొంతం. తుపానుల సమయంలో ఉరుముల శబ్దాలకు జంతువులు హడలిపోతుంటే.. ఆ భయాన్ని ఆసరాగా తీసుకుని వేటాడడం సింహాలకు మాత్రమే ఉన్న నైజం. ►ఈ భూమ్మీద సైబీరియన్ పెద్దపులి తర్వాత సైజులో పెద్దది సింహమే. మగ సింహం బరువు సగటున 190 కేజీలు, ఆడ సింహం బరువు 126 కేజీల దాకా ఉంటుంది. నాలుగు రోజులకొకసారి నీటిని తాగగలిగే ఓపిక ఉన్న సింహాలు.. దొరికితే రోజూ నీరు తాగుతాయి. కానీ, తిండి లేకుండా మాత్రం ఉండలేవు. తమ శరీరంలో పాతిక శాతం అంటే.. సుమారు 40 కేజీల మాంసాన్ని ఒక్కసారిగా తినేయగలవు ఇవి. ►సింహం పళ్లు మాత్రమే కాదు.. నాలుక మీద ఉండే ‘పాపిలే’ అనే పదునైన మచ్చలు ఎముకల నుంచి మాంసాన్ని లాగేయడానికి సాయపడ్తాయి. అలాగే రోజూ ఆకలి తీర్చుకునేందుకు సగటున ఒక మగ సింహానికి 8 కేజీలు, ఆడ సింహానికి ఐదున్నర కేజీల మాంసం అవసరం పడుతుంది. ఏనుగులు, జీబ్రాలు, అడవి దున్నలు మాత్రమే కాదు.. ఎలుకలు, పక్షులు, కుందేళ్లు, తాబేళ్లలాంటి చిన్న జీవులను సైతం వీటి వేటకు బలవుతుంటాయి. ►ఈ భూమ్మీద మిగిలిన సింహాల సంఖ్య 23,000 మాత్రమే(లెక్కల ప్రకారం). ఏనుగులతో పోలిస్తే(4,15,000లకు పైనే) మృగరాజుల సంఖ్య చాలా తక్కువ. చరిత్రలో సింహాల గురించి ఎంతో ప్రశస్తి ఉండేది. మూడు తరాలుగా వీటి సంఖ్య 40 శాతం తగ్గిపోయింది. వాతావరణ మార్పులు, వేట, పశు సంపదను రక్షించుకునే క్రమంలో సింహాలను ఎక్కువగా చంపేస్తున్నారు. ►ఇవాళ వరల్డ్ లేజీ డే. ఈ సందర్భంగా సింహం రోజులో 20 గంటల దాకా పడుకునేందనే విషయం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి కదా. -
కొన్ని క్షణాలపాటే నిల్చుంది.. క్లిక్‌మనిపించాడు!
వెనుక సూర్యుడు ఉదయిస్తుండగా.. ఎముకల కొండపై ఠీవిగా నిల్చుని.. ఏదో తన సామ్రాజ్యాన్నిపర్యవేక్షిస్తున్నట్లుగా.. కొన్ని ఫొటోలు అంతే.. అలా కుదిరిపోతాయంతే.. చూడగానే.. ఫేమస్ హాలీవుడ్ మూవీ లయన్ కింగ్ నుంచి దిగొచ్చినట్లు లేదూ.. ఈ చిత్రాన్ని దక్షిణాఫ్రికాలోని జీజీ కన్జర్వేషన్ వైల్డ్ లైఫ్ రిజర్వులో సిమోన్‌నీహాం అనే ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించారు. ఆ సింహం అక్కడ కేవలం కొన్ని క్షణాలపాటే నిల్చుందట.. అంతలో మనోడు క్లిక్‌మనిపించాడు. ‘సింహాన్ని అడవికి రాజు అని ఎందుకంటారో ఈ చిత్రాన్ని చూస్తే తెలుస్తుంది’ అని సిమోన్ అన్నారు. కేవలం 30 అడుగుల దూరం నుంచే సింహాన్ని తన కేనన్ 1 డీఎక్స్ మార్క్ 2 కెమెరాతో ఫొటో తీసినట్టు వెల్లడించారు. ‘ఈ ఫొటోను చూసినవాళ్లు తమకు తోచిన వ్యాఖ్యానాలు చేశారు. కానీ నాకు మాత్రం.. తన రాజ్యాన్ని స్వయంగా పర్యవేక్షించేందుకు వచ్చిన మృగరాజులా కనిపించింద’ని 52 ఏళ్ల సిమోన్ పేర్కొన్నారు. -
వైరల్: డైలాగులకే దడ పుట్టించే ఫోజు..
సింహంతో పోల్చుకుని తమను బిల్డప్ చేసుకోవటం సినిమాల్లోని హీరోలకే కాదు.. సామాన్య జనాలకూ చాయ్ బిస్కట్ తిన్నంత ఈజీ. జబ్బలు చరుస్తూ.. తొడలు కొడుతూ సింహం డైలాగులు చెప్పేస్తుంటారు. ఎవరినైనా ఎలివేట్ చేయాల్సి వస్తే.. సింహంతో పోలిక చూపటం కూడా పరిపాటి. అడవికి రాజైనా.. వైల్డ్ డైలాగులకైనా సింహం ఓ కేరాఫ్ అడ్రస్. ఫేమస్ అవ్వటానికి సింహం ఓ షార్ట్ కట్... సింహం డైలాగుతోనే కాదు.. ఫొటో తీసి కూడా సూపర్ ఫేమస్ అయిపోవచ్చని నిరూపించాడు ఇంగ్లాండ్‌కు చెందిన సిమోన్ నీదామ్(52). దక్షిణాఫ్రికా, దక్షిణ జోహాన్నాస్బర్గ్లోని జీజీ కంజర్వేషన్ వైల్డ్ లైఫ్ రిజర్వ్ అండ్ లయన్ శాంక్షరీలో సింహానికి సంబంధించిన ఓ అద్భుతమైన ఫొటో తీశాడు. ఓ చిన్న మట్టి దిబ్బ.. దాని నిండా జంతువుల ఎముకలు.. ఆ మట్టి దిబ్బ మీద సింహంలా నిల్చున్న సింహం. బ్యాక్ గ్రౌండ్లో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు. ఆ ఫొటో అటుఇటుగా లయన్ కింగ్ సినిమాలోని ఓ సన్ని వేశాన్ని తలపించేదిలా ఉంది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
పోర్ట్‌లో సింహాలా గుంపు.. వైరల్ వీడియో
గాంధీనగర్: క్రూర మృగాలు చాలా వరకు అడవులలో ఎక్కువగా ఉంటాయి. ఒక్కొసారి ఆహారం కోసం, నీటి జాడను వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చిన సంఘటనలు కోకొల్లలు. సాధారణంగా సింహాన్ని జూపార్కు బోనులో ఉన్నప్పుడు చూడటానికే చాలా మంది భయపడిపోతుంటారు. దాని గాండ్రింపు, ఆకారం, పెద్దదైనా జూలు చూస్తేనే వెన్నులో వణుకుపుడుతుంది. అయితే, అలాంటి సింహాలు జనావాసాల్లోకి వస్తే.. ఇంకేమైనా ఉందా!.. అయితే, తాజాగా ఇలాంటి సంఘటన గుజరాత్లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. వివరాలు.. సింహాలా గుంపు తన పిల్లలతో కలిసి అడవికి దగ్గరగా ఉన్న పిపావవ్ ఓడరేవులోకి ప్రవేశించాయి. అంతటితో ఆగకుండా సింహాలు, వాటి పిల్లలు గాండ్రిస్తు పోర్ట్‌లో అటూ ఇటూ తిరిగాయి. ఈగుంపును చూసిన అక్కడి కార్మికులు, సెక్యురిటీ సిబ్బంది భయంతో వణికిపోయారు. వెంటనే స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘నగర పర్యటనకు వచ్చిన సివంగి గ్యాంగ్..’, ‘వామ్మో.. వాటిని చూస్తేనే భయం వేస్తుంది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో సింహాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ వాటికి అనుకూలంగా సహజ ఆవాసాలు ఏర్పాటు చేశారు. గుజరాత్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2020లో సింహాల జనాభా 29 శాతం పెరిగింది. అదే విధంగా, గిర్ అడవిలో 674 సింహాలు ఉన్నట్లు తెలిపారు. అయితే, ప్రతి ఐదేండ్లకు ఒకసారి సింహాల సంఖ్యను లెక్కిస్తారు. -
ఒక ఎండ్రికాయ.. ఐదు సింహాలు రౌండప్.. ఆ తర్వాత
ఒక్క సింహం ఎదురుపడితేనే మనం గజగజ వణికిపోతుంటాం. అలాంటిది ఐదు సింహాలు ఒకేసారి దాడిచేస్తే.. అది ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఎండ్రికాయ మాత్రం తనను ఐదు సింహాలు చుట్టుముట్టినా అది ఇంచు కూడా భయపడలేదు. అసలు ఆ సింహాలు దానిని ఏం చేద్దామనుకున్నాయో అర్థం చేసుకునేలోపే వీడియో పూర్తవుతుంది. ఈ అద్బుత దృశ్యాన్ని మాలా ప్రైవేట్గేమ్ రిజర్వ్‌కు చెందిన రేంజర్స్ రగ్గిరో బారెటో, రాబిన్ సెవెల్ తమ కెమెరాలో బంధించారు. 2.36 నిమిషాల నడివి గల వీడియో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. వీడియో ప్రారంభంలో ఒక ఎండ్రికాయ ఇసుకలో నుంచి పైకి లేవగానే అక్కడే ఉన్న సింహం దానిని పరిశీలిస్తూ ఫాలో అవుతుంది. కొద్దిసేపటికి మరో నాలుగు సింహాలు వచ్చి దానిని వెంబడిస్తుంటాయి. కానీ ఆ ఎండ్రికాయ మాత్రం తనకేం పట్టనట్టుగా వ్యవహరిస్తూ తన దారిన తాను పోతునే ఉంది. చివరగా ఐదు సింహాలు దానిని చుట్టుముట్టడంతో వీడియో ముగుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ట్రెండింగ్‌గా మారింది. ఇప్పటివరకు 84, 136 మంది ఈ వీడియోను వీక్షించారు. వీలైతే మీరు ఒక లుక్కేయండి. చదవండి: వధువును భుజాలపై ఎత్తుకొని నదిని దాటిన వరుడు; వీడియో -
వైరల్ వీడియో: బర్త్ డే పార్టీ లో సింహాం చీఫ్ గెస్ట్
ఇస్లామాబాద్: ఎక్కడైనా బర్త్ డే పార్టీ అంటే సాధారణంగా మన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను ను ఆహ్వనిస్తాము. కానీ పాకిస్థాన్ చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా సింహాన్ని ముఖ్య అతిధి గా తీసుకు వచ్చింది. ఈ మృగరాజుని కుర్చీలో కూర్చోబెట్టి చైన్లతో కట్టేసింది. సుసాన్ ఖాన్ అనే మహిళ లాహోర్ లోని ఓ హోటల్ లో జన్మదిన వేడుక జరుపుకుంది. అయితే బర్త్ డే పార్టీ కు సంభందిచిన ఓ వీడియో ను సుసాన్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఓ సింహాన్ని గొలుసులతో కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టారు. కొందరు ఆటలు ఆడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె చిక్కుల్లో పడింది. సుసాన్ ఖాన్ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేసిన వీడియో ప్రొటెక్ట్ సేవ్ యానిమల్స్ ప్రతినిధుల కంటపడింది. దీంతో వారు ఈ వీడియోను తమ ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసి సుసాన్ ఖాన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము బర్త్ డే పార్టీలకు వ్యతిరేకం కాదు..కానీ ఇలా మీరు మూగజీవాలను పార్టీలకు తీసుకొచ్చి కట్టేసి ఇలా ఆనందం పొందడం తప్పు. మిమ్మల్ని కూడా పార్టీకి తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి ఇలానే ఓ కూర్చీ కి కట్టిపడేస్తే మీకు కూడా తెలుస్తుందని వీడియోకు కామెంట్ ట్యాగ్ చేశారు. అయితే ఈ వేడుకలో సింహానికి మత్తుమందు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక వీడియోపై విమర్శలు రావడంతో పోస్ట్ చేసిన 24 గంటల్లో దానిని సుసాన్ ఖాన్ డిలీట్ చేసింది. అయితే ఆ మహిళతోపాటు ఆ పార్టీలో ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చాలామంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.క ఇదే విషయంపై వన్యప్రాణుల సంరక్షణ సంఘం ప్రతినిధులు ఓ ఆన్లైన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. వేడుకల్లో వన్యప్రాణులను ఉపయోగించకూడదని ఆన్లైన్ వేదికగా 1500 సంతకాలు సేకరించారు. View this post on Instagram A post shared by Project Save Animals (@projectsaveanimals) చదవండి: సరిహద్దులు దాటిన ప్రేమ..చివరికి ఏమైందంటే? -
వైరల్: సింహాల బారి నుంచి తన బిడ్డను ఎలా కాపాడుకుందో చూడండి
ప్రపంచంలో ప్రేమకు వెలకట్టలేం. అందుకే ప్రేమకు చిహ్నంగా ఏర్పడ్డ తాజ్‌మహల్ చరిత్రలో చిరస్థాయిగా తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తల్లి ప్రేమ విషయానికొస్తే వర్ణించడానికి మాటలు రావు, అంతెందుకు కవులకు సైతం వారి కలంలో సిరా సరిపోదు. ఎందుకంటే తన బిడ్డ కోసం ఆ తల్లి పడే తపన, తాను చేసే త్యాగాలు అలాంటివి మరి. ప్రస్తుతం ఈ వీడియో చూస్తే ఈ మాటలకు సరిగ్గా సరిపోతాయని అనిపిస్తోంది. మనుషుల్లోనైనా, జంతువులైనా తల్లి చూపించే ప్రేమ మారదని ఈ వీడియో నిరూపిస్తుంది. సుశాంత నందా అనే ఐపీఎస్ అధికారి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారి హల్ చేస్తోంది. ఆ వీడియాలో.. అడవిలో ఓ గేదే తన బిడ్డతో కలసి వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ సింహాల గుంపు వాటి పై దాడి చేసింది. ఆ దాడిలో ఓ సింహం గేదే పిల్లను నోటితో పట్టుకుని పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లింది. సాధారణంగా సింహాలతో గేదేలు పోరాడిన ప్రాణాలతో బయట పడలేవు. కానీ ఇక్కడ అన్ని సింహాలున్న గేదే బెదరక తన బిడ్డ కోసం వాటితో పోరాడింది. చివరకు వాటి నోటి నుంచి తన బిడ్డ ప్రాణాన్ని కాపాడుకుంది. ఈ వీడియా చూసిన నెటిజన్లు తల్లి ప్రేమంటే ఇదే కదా అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. Mother’s courage👌 Shared by NIFL pic.twitter.com/V7kjvOLv5f — Susanta Nanda IFS (@susantananda3) June 8, 2021 చదవండి: పాముకు ఊపిరి ఊది ప్రాణం నిలిపిన యువకుడు, వీడియో వైరల్ -
‘వరల్డ్‌ఫేమస్’ మృగరాజు, చైనా వరాహం.. ఇక లేవు
ముఖంపై గాటు, క్రూరమైన చూపులు, హుందాగా వ్యవహరించే తీరు.. వెరసి విలక్షణమైన లక్షణాలతో గుర్తింపు పొందిన ఆఫ్రికన్ సింహం ‘స్కార్ఫేస్’ ఇక లేదు. 14 ఏళ్ల మగ సింహం.. అనారోగ్యంతో చనిపోయినట్లు సఫారీ నిర్వాహకులు ధృవీకరించారు. కెన్యాలోని మసాయి మారా గేమ్ రిజర్వ్‌లో ఇది ఇంతకాలం బతికింది. కాగా, కుడికన్ను పక్కన గాటుతో ఉండే ఈ సింహాన్ని.. లయన్‌కింగ్ దుష్ట సింహం ‘స్కార్’ క్యారెక్టర్‌తో పోలుస్తుంటారు చాలా మంది. ఇదే టూరిస్టుల్లో ఈ సింహానికి గుర్తింపు తెచ్చిపెట్టింది. చనిపోయే ముందు అది తాను పుట్టిన ప్రాంతంవైపు నడిచిందని, దురదృష్టవశాత్తూ గమ్యానికి 15 కిలోమీటర్ల అది చనిపోయిందని సఫారీ నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో స్కార్ఫేస్ మీద బీబీసీ, నేషనల్ జియోగ్రఫిక్, హిస్టరీ లాంటి చానెల్స్ ఎన్నో డాక్యుమెంటరీలను తీశాయి కూడా. సెన్సేషన్ పిగ్ కూడా.. చైనా హీరో పిగ్ ఇక లేదు. జూన్ 14న అది చనిపోయినట్లు దాని సంరక్షకులు వైబో ద్వారా ప్రకటించారు. 2008లో చైనా భారీ భూకంపం తర్వాత ఓ భారీ పంది ఫేమస్ అయ్యింది. సిచువాన్ ప్రావిన్స్‌లో దాదాపు 36 రోజుల తర్వాత శకలాల నుంచి అది ప్రాణాలతో బయటపడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జు జియాంగియాంగ్ అనే పేరుతో జనాలు ముద్దుగా పిల్చుకునే ఆ పంది.. అన్నిరోజులపాటు వర్షం నీళ్లు, కాల్చిన బొగ్గు తిని అంతకాలం ప్రాణాల్ని నిలబెట్టుకోగలిగింది. విపత్కరకాలంలో ఎలా బతకాలో జియాంగియాంగ్‌ను చూసి నేర్చుకోవాలని పేర్కొంటూ చైనావాళ్లు దానిని ‘హీరోయిక్ పిగ్’గా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత ఓ మ్యూజియం నిర్వాహకులు ఇంతకాలం దాని సంరక్షణ చూస్తూ వచ్చారు. చదవండి: గుంపుగా అడవి దున్నలు-సింగిల్‌గా సింహం, ఆ తర్వాత.. -
షాకింగ్: కరోనాతో మరో సింహం మృతి
చెన్నై: కరోనా మహమ్మారి మనుషులనే కాదు జంతువులను సైతం వీడటం లేదు. కోవిడ్‌తో ఇటీవల(జూన్3) తమిళనాడులోని అరిగ్నర్ అన్నా జూపార్క్‌లో ఓ మగ సింహం(నీలా) చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా చెన్నైలోని అదే జూలో బుధవారం ఉదయం 10.15 నిమిషాల సమయంలో మరో సింహం మరణించిందని జూ అధికారులు తెలిపారు. పద్మనాథన్ అని పిలవబడే ఈ సింహం వయస్సు 12 ఏళ్లు. జూన్ 3న ఈ సింహం శాంపిల్స్‌ను భోపాల్‌లోని వైరాలజీ ఇన్స్ టిట్యూట్ కి పంపగా అప్పుడే దీనికి పాజిటివ్ అని నిర్ధారించారని చెప్పారు. కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో సింహానికి ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అందించామని జూ అధికారులు పేర్కొన్నారు. దీనిని రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం లేకపోయిందని వారు తెలిపారు. కాగా ఇక్కడి సఫారీ పార్కులో ఉన్న మిగతా 5 సింహాలు తరచూ దగ్గుతున్నాయి. గత మే 26 నుంచి అనారోగ్యానంతో ఉన్న వీటి పట్ల కూడా వెటర్నరీ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత ఆదివారం సీఎం ఎం.కె. స్టాలిన్ ఈ జూను సందర్శించి ఇక్కడి జంతువుల పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా సింహాల ట్రీట్ మెంట్ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని,వాటి వైద్య చికిత్సలో ఎలాంటి లోపం కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. కానీ తాము ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇవి అనారోగ్యం బారిన పడుతున్నాయని అధికారులు వాపోతున్నారు. చదవండి: అలాంటి సొమ్ము నాకొద్దు; ఏకంగా 14 కోట్లు తిరస్కరించిన యువతి కరోనా వైరస్‌తో సివంగి మృతి -
అమ్మ బాబోయ్.. కాపాడండయ్యా నన్ను!
అడవికి రారాజు సింహమే. కానీ, అవతలి నుంచి గుంపుగా వస్తే ఆ సింహాం కూడా తోక ముడవాల్సిందే. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కెన్యా మసాయి మారా సఫారీలో జరిగింది. నాలుగు సింహాలు.. పక్కనే ఉన్న జింకలను వదిలి.. మందగా ఉన్న అడవి దున్నల మీద కన్నేశాయి. అయితే అది గమనించిన అడవి దున్నలు ఒక్కసారిగా వాటి మీదకు ఉరుకులు తీశాయి. మూడు సింహాలు పారిపోగా.. ఒకటి మాత్రం ఆ దున్నల మధ్య ఇరుక్కుపోయింది ప్రాణ భయంతో పరుగులు తీసిన ఆ మృగరాజు.. అక్కడే ఉన్న ఓ చెట్టు మీదకు ఎక్కేందుకు ప్రయత్నించింది చాలా సేపు ఇబ్బంది పడ్డాక ఎట్లాగోలా పైకి చేరుకుంది కానీ, 500 దాకా ఉన్న అడవి దున్నలు మాత్రం ఆ సింహం చుట్టూ రౌండప్ చేశాయి కొన్ని గంటలపాటు చెట్టుమీదే ఉన్న సింహం.. చీకటి పడ్డాక దున్నలు వెళ్లిపోవడంతో దిగింది నార్వేకు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఓల్వ్ థోక్లే(54) ఈ రసవత్తరమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధించారు. -
మేకను తప్పించి సింహానికి బలైన యువకుడు
అహ్మదాబాద్: మామిడి తోట కాడ కాపు కాస్తుండగా హఠాత్తుగా సింహం వచ్చింది. ఆ సింహ మేకను తినేద్దామని ప్రయత్నించగా ఆ మేకను కాపు కాస్తున్న వ్యక్తి తప్పించాడు. అయితే సింహం మేకను కాదని ఆ వ్యక్తిని తన ఆహారంగా చేసుకుని తినేసింది. సింహం చేతిలో మనిషి బలైన సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది జూనాగఢ్ జిల్లా గిర్ అటవీ డివిజన్లోని తలాలా రేంజ్ పరిధిలో ఉన్న మధుపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. మధుపూర్ గ్రామంలో మామిడి తోటకు బహదూర్భాయ్ జీవాభాయ్ (35) కావలి ఉంటున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి గ్రామ సమీపంలోని మామిడి తోటకు కాపలా ఉంటూ నిద్రించాడు. అయితే శనివారం తెల్లవారుజామున అడవిలో నుంచి సింహం బయటకు వచ్చింది. తోట సమీపంలోకి రాగా మేక కనిపించింది. మంచానికి కట్టేసిన మేకను తినేయాలని చూడగా మేక అరుపులకు బహదూర్భాయ్ జీవాభాయ్ మేల్కొన్నాడు. సింహం నుంచి మేకను తప్పించాడు. మేక తప్పించుకోగా జీవాభాయ్ సింహానికి చిక్కాడు. సింహం పంజా విసిరి జీవాభాయ్‌పైకి దాడి చేసి తినేసింది. అతడి అరుపులు విన్న గ్రామస్తులు వెంటనే తోట కాడికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సింహాన్ని బంధించారు. చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ చదవండి: వ్యాక్సిన్ కొరత తీవ్రం.. పిల్లలకు కూడా వేయించాలి -
సింహమే కావచ్చు.. తన కెపాసిటీ ఏంటో చూసుకోవాలి కదా
డొక్క చించి డోలు కట్టడం అంటారు కదా.. ఇక్కడ ఈ సింహానికి జరిగింది అచ్చంగా అదే.. అసలే ఆఫ్రికా అడవి గేదె. చాలా డేంజరస్ అని పేరు.. సర్సరే.. మనం సింహమే కావచ్చు.. కానీ ప్రజెంట్ మన కెపాసిటీ ఏంటి అన్నది చూసుకోవాలి కదా. అసలే వీక్‌గా ఉన్నాం.. పైగా ఇలా దిట్టంగా ఉన్న అడవి గేదెను వేసేయాలంటే.. సాయంగా మరో ఇద్దరిని తీసుకుపోవాలి. అంతే తప్ప.. అదేదో సినిమాలో సింహం సింగిల్‌గా వస్తాది అని చెప్పారు కదా అని.. ముందూవెనకా ఆలోచించకుండా వెళ్తే.. ఏమవుతుంది? రెస్ట్ ఇన్ పీస్ అవుతుంది.. చూశారుగా.. కొమ్ములు ఎలా దిగాయో.. జాంబియాలోని దక్షిణ లాంగ్వా జాతీయ పార్కులో ఆర్మ్‌స్ట్రాంగ్ అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాలను క్లిక్‌మనిపించారు. చదవండి: నవ్వులు పూయిస్తున్న డాక్టర్ ‘రౌడీ బేబీ’ పేరడీ సాంగ్ -
సింహం పిల్లలతో ఆడుకుంటున్న మెగా హీరో.. ఫోటో వైరల్
ఒకప్పుడు వరుస ప్లాపులను మూటగట్టుకున్న సుప్రీం హీరో సాయితేజ్.. ఇటీవల హిట్ ట్రాక్ ఎక్కాడు. 2019లో ‘చిత్రలహరి’లో విజయం అందుకున్న సాయితేజ్.. ఆ తర్వాత ‘ప్రతి రోజు పండుకే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’తో ఆ హిట్స్ పరంపర కొనసాగించాడు. ప్రస్తుతం సాయితేజ్ క్రియేటివ్ డైరెక్టర్ దేవాకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ అనే సినిమా చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. ఇటీవలే రిలీజ్ చేసిన రిపబ్లిక్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో సాయితేజ్ షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ అయింది. సోషల్ మీడియాలో చాలా అరుదుగా కనిపించే ఈ యంగ్ హీరో.. గురువారం ఓ అరుదైన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫోటోలో సాయితేజ్ రెండు సింహం పిల్లలతో ఆడుకుంటున్నారు. ఈరోజు ఎర్త్ డే సందర్బంగా ప్రకృతితో మనం కలిసి జీవించాలంటూ సాయితేజ్ ఆ ఫోటోలను షేర్ చేశాడు. This #EarthDay let’s take a simple oath of “LIVE AND LET LIVE” ...let’s be a little more compassionate towards our nature. pic.twitter.com/wpA5daMNwd — Sai Dharam Tej (@IamSaiDharamTej) April 22, 2021 చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్’పై చిరంజీవి సంచలన ట్వీట్ కరోనాతో డ్రైవర్ మృతి.. టెన్షన్లో మెగా ఫ్యామిలీ! -
పాపం సింహన్ని ఇలా ఎత్తేసి.. అలా పడేసింది!
సాధారణంగా సింహం అడవికి రాజు. దాన్ని చూసిన ఏ జంతువైనా సరే భయంతో వణికి పోవాల్సిందే. దాని కంట్లో పడితే ఎక్కడ బలైపోతామోనని జంతువులు దాని దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా సాహసించవు. అయితే.. ఇక్కడ ఆపదలో ఉన్న దున్నపోతుని కాపాడటానికి, మరో దున్నపోతు సింహంపైనే దాడికి తెగపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ సింహనికి చాలా ఆకలివేసినట్టుంది. దాని ఒక దున్నపోతు కనిపించటంతో వేటాడి కిందపడేసింది. దాన్ని ఎటు కదలకుండా పదునైన దాని పళ్లతో గట్టిగా అదిమి పట్టుకుంది. దీంతో పాపం.. ఆ దున్నపోతు ఎటు కదల్లేక దీనంగా అరుస్తొంది. అయితే.. ఈ అరుపులు దూరంగా ఉన్న వేరే దున్నపోతుల చెవినపడ్డాయి. తన మిత్రుడు ఆపదలో ఉన్నాయనుకున్నాయో ఏమో గానీ.. వెంటనే అక్కడికి చేరుకున్నాయి. అవి రెండు కూడా కోపంతో ఆ సింహం పైకి ఒక్కసారిగా దాడిచేశాయి. అందులో ఒక దున్నపోతు తన పదునైన కొమ్ములతో సింహన్ని పొడిచి గాల్లో బంతిలాగా ఎగిరేసింది. అంతటితో దాని కోపం తీరలేదేమో మరోసారి దాన్ని పొడిచి గాల్లో ఇలా ఎగిరేసి.. అలాపడేసింది. ఈ అనుకోని దాడితో సింహనికి పాపం ఏం జరుగుతోందో అర్థంకానట్టుంది. వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. అయితే, సింహం బారినపడి నాపని ఇక అయిపోయిందనుకున్న దున్నపోతు ప్రాణాలతో బయటపడింది... ఈరోజు కడుపునిండా మాంసం తిందామనుకున్న ఆ సింహం బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి జారుకుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు వీటి ఐక్యమత్యానికి తెగ సంబర పడిపోతున్నారు. మనుషుల కన్నా నోరులేని జీవాలే నయం అని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: బాల్కనీలో బాలుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా! -
సింహం దండయాత్ర: దాక్కున్నా వదల్లేదు!
అటవీ ప్రాంతంలో జరుగుతున్న విన్యాసాలు, అద్భుతాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. ఆహారం కోసం జంతువులు చేసే పోరాటం అబ్బురపరుస్తుంటాయి. తాజాగా ఓ సింహం జూలు విదిల్చి ఏడు గంటల పాటు శ్రమించి చివరకు అడవి పందిని చేజిక్కించుకుని తన బొజ్జ నింపేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. భూమిలో దాగి ఉన్న ఆఫ్రికన్ పందిని వెలికితీసి మరి సింహం చంపి తిన్నది. ఈ వీడియో చూస్తే నిజంగా సింహం సింహామే అని అంటారు. కెన్యా దేశ రాజధాని నైరూబీలోని మసాయి మరా జాతీయ పార్కులో సింహం ఆహారం కోసం వేట సాగిస్తోంది. సాధారణంగా ఆఫ్రికన్ పందులు భూమిలో దాగి ఉంటాయి. బురద ప్రాంతంలో దాగి ఉన్న వాటిని సింహం గుర్తించింది. దీంతో తీవ్ర ఆకలి మీద ఉన్న సింహం గుంత తవ్వడం మొదలుపెట్టింది. మనిషి మాదిరి తవ్వుతూ.. తవ్వుతూ దాదాపు ఏడు గంటలపాటు నిర్విరామంగా తవ్వేసింది. అనంతరం ఆ గుంతలో ఉన్న ఆఫ్రికన్ జాతి పందిని పట్టేసింది. సింహం బారి నుంచి కాపాడేందుకు ఆ పంది ఎంత ప్రయత్నం చేసినా సింహం పట్టు వదలలే. చివరకు పంది ఓడింది.. సింహం గెలిచింది. అడవి రాజు సింహం ఆకలి తీరింది. దీనికి సంబంధించిన వీడియోను సేల్స్ ఇంజనీర్ సుహేబ్ అల్వీ తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. -
భయానకం: గోడ దూకి హోటల్లోకి వచ్చిన సింహం..
అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఓ హోటల్‌కు అనుకోని అతిథి వచ్చి వెళ్లిన దృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. సింహం అక్కడి ఓ హోటల్లో ప్రవేశించిన దృశ్యం అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ వీడియోను ఉదయ్ కచ్చి అనే ట్వీటర్ యూజర్ ఈ వీడియోను బుధవారం ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. జూనాఘడ్‌లోని రైల్యే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న సరోవర్ పోర్టికో హోటల్లోకి సింహం గోడ దూకి వచ్చిన ఈ సంఘటన ఈరోజు ఉదయం 3 గంటల ఈ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతానికి సింహం ఉదయం పూట రావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే ‘ఈ మధ్య కాలంలో సింహాలు జునాఘడ్‌కు వచ్చిపోవడం సాధారణం అయిపోయింది’ అంటూ అతడు షేర్ చేసిన ఈ వీడియోలో సింహం హెటల్‌కు గోడపై నుంచి దూకి లోపలికి వెళ్లి మళ్లీ అదే గొడపై నుంచి తిరిగి వెళుతున్నట్లు కనిపించింది. అలాగే ఆటవీ శాఖ అధికారి సుశాంత్ నందా కూడా ‘ఇది పెద్ద సమస్య కాదు.. లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ గేట్ తెరవాల్సిన అవసరం లేదు’ అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ఇక ఇది చూసిన నెటజన్లంతా షాక్ అవుతున్నారు. ‘ఈ ప్రాంతం గిర్నార్ కొండలకు సమీపంలో ఉన్నందున సింహాలు తరచూ జనవాసంలోకి వస్తున్నాయి. ఇది అక్కడి ప్రజలకు, సింహాలు మంచి కాదు’, ‘ఇక్కడి వారంతా వేరే ప్రాంతానికి వెళ్లడం మంచిది’, ‘బాబోయ్.. ఆ సమయంలో హోటల్లో ఎవరూ లేరు అదృష్టం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా జునాఘడ్ సింహల అభయారణ్యమైన గిర్ కొండలకు బార్డర్లో ఉంటుంది. ఇదివరకు కూడా ఇలా సింహాలు రాత్రి సమయంలో జూనాఘడ్ రోడ్లపై తరచూ తిరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. Lions in the city of Junagadh is a regular affair nowadays. @ParveenKaswan @susantananda3 @CentralIfs pic.twitter.com/o2PtLiXmui — Udayan Kachchhi (@Udayan_UK) February 10, 2021 -
నెవెర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ ఫైట్ సీన్!
బలవంతుడ్ని చూసి భయపడాల్సిన బలహీనుడు తిరగబడితే ఎలా ఉంటుంది?... గెలుపు ఎవరిదన్న సంగతి పక్కన పెడితే.. ఓ చిన్న ప్రయత్నం.. పోయేదేముంది. చరిత్రలో మిగిలిపోతాము లేదా మనమేం పిరికివాళ్లం కాదని లోకానికి చాటి చెబుతాం. ఉద్దేశ్యం వేరైనా ఓ కుక్క ఏకంగా సివంగితోనే కయ్యానికి కాలు దువ్వింది. దాని దెబ్బలకు ఎదురొడ్డి కొద్దిసేపు తలపడింది. కానీ, సివంగి బలం ముందు తన బలం ఎందుకూ కొరగాదన్న సత్యం తెలుసుకుని కాళ్లకు బుద్ధి చెప్పింది. అలా కాకుండా మొండి ధైర్యంతో ముందుకు పోయింటే మాత్రం కుక్క తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉండేది. ( చిరుతకు ఝలక్: ఈ జింక చర్య ఊహాతీతం ) ఈ సంఘటనకు సంబంధించిన 1:34 సెకన్ల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 1.6 లక్షల వ్యూస్ సంపాదించుకుంది. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ ఈ వీడియో తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ‘‘ జీవితంలో ఈ మాత్రం నమ్మకం ఉంటే చాలు. సివంగితో కుక్క పోరాటం. వీధి కుక్కలు, క్రూర మృగాల పోరాటాలలో ఇదే హైలెట్ సంఘటన’’ అని పేర్కొన్నారు. Need this much confidence in life. Dog vs Lion. It also highlights issue of stray dogs & wildlife interaction. @zubinashara pic.twitter.com/lNu7X4ALm5 — Parveen Kaswan, IFS (@ParveenKaswan) January 10, 2021 -
వైరల్: సింహానికే వణుకు పుట్టించాడు
బోట్స్వానా: అడవికి రారాజైన సింహాన్ని చూస్తేనే సగం చస్తాం. అలాంటిది అది నేరుగా మన మీదకు పంజా విసిరితే ఇంకేమైనా ఉందా? ఊహించడానికి కూడా కష్టంగా ఉంది కదూ..! కానీ ఇక్కడ చెప్పుకునే వ్యక్తి దగ్గర మాత్రం సింహం ఆటలు సాగలేవు. ఆకలితో అతడిని చంపుకుని తినాలనుకున్న దాని తల మీద పిడిగుద్దులు కురిపించి సింహానికే వణుకు పుట్టించాడు. అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్న ఈ సంఘటన ఆఫ్రికా ఖండంలోని బోట్స్వానా దేశంలో జరిగింది. వన్యజాతుల అధ్యయనకారుడు గోట్స్ నీఫ్.. ఒకవాంగో డెల్టాలో టెంట్ వేసుకుని నిద్రిస్తున్నాడు. ఇంతలో ఏదో పెద్ద శబ్ధం అతడికి చేరువ అవుతూ వచ్చింది. అదేంటని లేచి చూసేలోపే సింహం తన ఆకలిని తీర్చుకునేందుకు అతడి మీదకు పంజా విసిరింది. (చదవండి: మీ వెంట లక్షల మందిమి ఉన్నాం: వైరల్) అతడి కేకలు విన్న నీఫ్ స్నేహితులు రైనర్ వాన్ బ్రాండీస్, టొమాలెట్స్ సెటబోష వారి ప్రాణాలను పణంగా పెట్టి సింహంతో పోరాడారు. చెట్టు కొమ్మలను విసురుతూ, చేతికందిన వస్తువులను విసురుతూ దాన్ని బెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా సరే అది నీఫ్‌ను వదిలేయకపోవడంతో అతడు దాని ముఖం మీద పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆగ్రహించిన సింహం అతడి తలను నోట కరుచుకునేందుకు ప్రయత్నించగా చాకచక్యంగా తప్పించుకున్నాడు. కానీ అతడి మోచేతిని మాత్రం తన కోర పళ్లతో కొరకడంతో తీవ్ర గాయమైంది. అయినా సరే నీఫ్, అతడి స్నేహితులు ధైర్యంగా సింహంతో పోరాడి దాన్ని అక్కడ నుంచి పారిపోయేలా చేశారు. తీవ్ర గాయాలతో ప్రాణాలతో బతికి బయటపడ్డ నీఫ్ ఆస్పత్రిలో చేరగా అతడి మోచేతి ఎముకలు విరిగినట్లు తెలిపారు. డిసెంబర్ 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంలోకి వెలుగులోకి వచ్చింది. సింహాంతో పోరాడిన నీఫ్‌ను జనాలు ధైర్యశాలి అని మెచ్చుకుంటున్నారు. (చదవండి: ఎలుగుబంటితో యుద్ధం.. చివరికి) -
దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే!
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ వెండి రథానికి ఉండాల్సిన మూడు సింహం ప్రతిమలు మాయం కావడంపై భక్తుల నుంచి విస్మయం వ్యక్తమవుతోంది. సింహం ప్రతిమలు మాయమైనట్లు ఇప్పుడు బయటపడినప్పటికీ, అవి ఎప్పుడు మాయం అయ్యాయనే అంశంపై విచారణ జరగనుంది. రథంపై అమ్మవారు ఉగాది రోజున, చైత్ర మాసోత్సవాల్లోనూ భక్తులకు దర్శనం ఇస్తారు. 2019 ఏప్రిల్ 6న నిర్వహించిన ఉగాది ఉత్సవాలు తర్వాత ఈ రథాన్ని దేవస్థానం ఉపయోగించలేదు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించలేదు. గతంలో పాలక మండలి హయాంలోనే.. దుర్గగుడికి గత ఏడాది ఉగాది ఉత్సవాల నాటికి చంద్రబాబు ప్రభుత్వం నియమించిన పాలకమండలి ఉంది. ఆ రోజున అమ్మవారి పూజా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఆ తర్వాత మల్లికార్జున మహామండపం కింద దాన్ని ఉంచి మొత్తం ప్లాస్టిక్ కవర్‌తో కప్పేశారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పైలా సోమినాయుడు సారథ్యంలో పాలకమండలి ఏర్పటైంది. రథం యథావిధిగా ఉందని భావించారే తప్ప రథం మీద ఉన్న సింహం బొమ్మలు మాయం అవుతాయని అనుమానించలేదు. రథాన్ని పరిశీలించలేదు. గతంలో పాలకమండలి సభ్యులకు, దేవాలయ ఈఓలకు మధ్య సఖ్యత ఉండేది కాదు. దీంతో వారే ప్రతిదాన్ని వివాదస్పదం చేసుకునేవారు. వారిపై అనుమానాలు.. ఇక దుర్గగుడి పరిసరాల్లో టీడీపీ నేతలు కొంతమంది కొన్నేళ్లుగా పాగా వేశారు. వారు ఇంద్రకీలాద్రిపైనే చిరు వ్యాపారం చేసి తర్వాత రూ.కోట్లకు పడగలెత్తి, రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అధికార పార్టీని ముఖ్యంగా దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఇరకాటంలో పెట్టాలని రథంపై సింహాల ప్రతిమలను మాయం చేసి పాపానికి ఒడికట్టారా.. అనే అనుమానాలు దేవస్థానం సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక సంస్థకు గతంలో సెక్యురిటీ బాధ్యతలను అప్పగించారు. ఈ ఏడాది వారి కాంట్రాక్టు పూర్తి కావడంతో తిరిగి వేలం నిర్వహించడంతో మాక్స్ సంస్థ టెండర్ దక్కించుకుంది. అయితే గత సంస్థలో పనిచేసిన అనేక మంది సిబ్బంది మాక్స్ సంస్థలో చేరి ఇక్కడే దుర్గగుడిలో పనిచేస్తున్నారు. తమ ప్రతిష్ట దెబ్బతీయడానికి గత సంస్థలో పనిచేసిన వారు ఎవరైనా ఈ తప్పుడు పని చేశారా? అనే అనుమానం మాక్స్ సెక్యురిటీ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాలు కూల్చిన ఘనత చంద్రబాబుదే! టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రార్థనా స్థలాలపై ఏ విధమైన భక్తి భావం లేదు. తన హయాంలో దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించారు. 2016లో పుష్కరాల సమయంలో కృష్ణానది ఒడ్డున ఉన్న 40 దేవాలయాలను కూల్చి వేయించారు. అప్పట్లో ఈ కూల్చివేతల్లో ఎంపీ కేశినేని నాని, నాటి కలెక్టర్ అహ్మద్ బాబు కీలకపాత్ర పోషించారు. రామవరప్పాడులో ఉన్న మసీదును కూల్చివేయడంతో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. ఆయన్ను సంతోష పరచడానికే స్థానిక టీడీపీ నాయకులు ఇటువంటి దుశ్చర్యలకు పాలుపడుతున్నారని హిందూ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. రథాన్ని పరిశీలించిన మంత్రి వెలంపల్లి ఇంద్రకీలాద్రికి ఉన్న వెండి రథాన్ని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. పెనుగంచిప్రోలు ఈఓ ఎన్వీఎస్ఎస్ మూర్తిని విచారణాధికారిగా నియమించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
లయన్ 'క్వీన్'
పెద్దపులులు, సింహాల మధ్యనే రసీలా వధేర్ జీవనం. వన్యప్రాణుల సంతతిని రక్షిస్తూ, చంటిబిడ్డల్లా వాటిని సాకుతున్న 36 ఏళ్ల వధేర్ పులులు, సింహాలు, మొసళ్లు, పాములు.. హానికర జంతువులైనా థైర్యంగా వాటిని కాపాడుతుంటుంది. భారతీయ అటవీ సేవల అధికారి పర్వీన్ కస్వాన్ ఇటీవల రసీలా వధేర్ గురించి ట్వీట్ చేస్తూ – ‘వన్యప్రాణులను బావుల నుండి, ప్రమాదాల నుండి రక్షించడానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఇప్పటి వరకు 300 సింహాలు, 500 చిరుతపులులు, మొసళ్లు, కింగ్ కోబ్రాలు.. ఇలా 1,100కు పైగా జంతువులను రకరకాల ప్రమాదాల నుండి రక్షించింది. మీరు గిర్కు వెళ్లినప్పుడు తప్పక వధేరాను కలవంyì . అడవికి రారాజైన సింహం కన్నా నమ్మకంగా అడుగులు వేస్తూ ధైర్యానికి మారుపేరుగా నిలుస్తుంది’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు, వధేర్కు సంబంధించిన నాలుగు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్. దీంతో మరోసారి వెలుగులోకి వచ్చింది ఈ లయన్ క్వీన్ అని పేరు తెచ్చుకున్న రసీలా వధేర్.2008లో గుజరాత్ గిర్ నేషనల్ పార్క్‌లో మొదటి మహిళా ఫారెస్ట్ గార్డ్ నియామకంతో రసీలా వధేర్పేరు నాడు వెలుగులోకి వచ్చింది. అప్పటి నుండి వధేర్ వన్యప్రాణుల పట్ల ప్రేమను, ధైర్యాన్ని చూపుతూనే ఉంది. పనిలో చూపించే శ్రద్ధ, నమ్మకం, ధైర్యం ఇప్పుడు ఆమెను గిర్ రెస్క్యూ డిపార్ట్మెంట్ అధిపతిగా పదోన్నతినిచ్చింది. మహిళా గార్డుగా గాయపడిన పెద్ద పులుల పిల్లలను రక్షించడమే కాకుండా, తల్లి లేని జంతు పిల్లలను కూడా రక్షించి సాకుతుంది. వేటగాళ్ల నుంచి జంతువులను కంటికి రెప్పలా కాపాడుతుంది రసీలా వధేర్. -
వైరల్ వీడియో: సింహాల కొట్లాట చూశారా
-
క్రూర జంతువులతో జాగ్రత్త!
-
క్షణం ఆలస్యం అయ్యుంటే పరిస్థితి ఏంటి?
సింహాలు ఉన్న చోట సఫారీకి వెళితే ఎంత జాగ్రత్త వహించాలనేది ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన అది మన ప్రాణాల మీదకు వస్తుందనేది నిజం. తాజాగా సింహాలు ఉన్న చోటుకు సఫారీకని వచ్చిన టూరిస్టులు ప్రకృతిని ఆస్వాదించేందుకని కారును ఆపారు. కారు ఆపిన పక్కనే ఒక సింహాల గుంపు ఉంది. ఇదే సమయంలో కారు డోరుకు లాక్ సరిగా లేకపోవడం కారులోని వాళ్లు గమనించలేదు. సాధారణంగానే వాహనాలను చూస్తే మీదకు వచ్చే సింహాలు కారులోని మనుషులను చూస్తే ఊరుకుంటాయా.. ఇంతలో ఆ గుంపులో నుంచి ఒక సింహం కారు దగ్గరికి వచ్చి కారు డోర్ తీయడానికి ప్రయత్నించింది. అయితే ఇంతలో వెనుక డోర్ దగ్గరకు వచ్చిన సింహం తన పంటితో డోర్ లాగే ప్రయత్నంలో అది తెరుచుకుంది. దీంతో లోపల ఉన్న వారు బయపడి టక్కున కారు డోర్‌ను మూయడంతో సింహం అక్కడి నుంచి పక్కకు జరిగింది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద నష్టమే జరిగుండేది. (అబ్బురుపరిచే వర్చువల్ నీటి అలలు) దాదాపు 40 సెకెన్ల నిడివి ఉన్న వీడియోనూ ఐఎఫ్ఎస్ అధికారి సుషాంత నంద ట్విటర్లో షేర్ చేశారు. ' కారులో ఉన్న వారితో సింహం కూడా సఫారి రైడ్‌కు వెళ్లాలనుకుందేమో.. అందుకే లిఫ్ట్ అడగానికి ప్రయత్నించింది. దయచేసి సఫారి రైడ్‌కు వెళ్లినప్పుడు క్రూర జంతువులతో జాగ్రత్తగా ఉండండి' అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన వారంతా 'సింహం చాలా తెలివైనదని.. బతుకు జీవుడా...' అంటూ కామెంట్లు పెడుతున్నారు. -
తిరుమలలో చిరుత సంచారం
-
80 కి.మీ వేగంతో ఎదురుగా సింహం.. కానీ,
గాంధీనగర్: గుజరాత్‌లోని మాధవ్‌పూర్ గ్రామవాసులకు ఇటీవల ఓ భయానక అనుభవం ఎదురైంది. జనవాసాల్లోకి చేరిన ఓ భారీ సింహం.. స్థానికులకు చెమటలు పట్టించింది. గ్రామంలోని ఓ కూడలి వద్ద యువకులు బాతాఖానీ కొడుతుండగా.. ఓ ఇంట్లో చొరబడ్డ మృగరాజు ఉస్సేన్ బోల్ట్‌ను మైమరపించే వేగంతో వారివైపు దూసుకొచ్చింది. అప్పటికే ఆ ఇంట్లోనివారు సింహం వస్తుందర్రో..! అని కేకలు వేయడంతో చచ్చాంరా దేవుడో అనుకూంటూ యువకులు తలోదిక్కు పారిపోయేందుకు యత్నించారు. అయితే, ఆ సింహం మాత్రం ఎవరిపైనా దాడి చేయకుండా.. తన దారిన తను వాయువేగంతో దూసుకెళ్లింది. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఏడు సెకన్ల పాటు ఉన్న ఈ సింహం వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ‘గంటకు 80 కిలో మీటర్ల వేగంతో ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు.. ఆ ఉసేన్ బోల్ట్ కూడా తప్పించుకోవడం కష్టం. అలాంటిది మనోళ్లు ఎలా తప్పించుకున్నారో చూడండి’ అని ఆయన పేర్కొన్నారు. -
80 కి.మీ వేగంతో ఎదురుగా సింహం.. కానీ,
-
మైనర్ అదృశ్యం: ‘జూ’ బోనులో ముక్కలై
లాహోర్ : కనిపించకుండాపోయిన బాలుడు స్థానిక జూలోని సింహపుబోనులో ముక్కలై కనిపించడం కలకలం రేపింది. లాహోర్ సఫారి పార్క్‌లో సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది. సఫారి పార్క్ లాహోర్ డైరెక్టర్ చౌదరి షాఫ్కత్ అందించిన సమాచారం ప్రకారం మరణించిన మైనర్ బాలుడిని బిలాల్ (18) గా గుర్తించారు. అతని బట్టలు ఆధారంగా బాలుడుని తండ్రి గుర్తించగా, అయితే బోనులోకి బిలాల్ ఎలా ప్రవేశించాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని హత్య చేసి అనంతరం బోనులోకి విసిరి వుంటారా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. సోమవారం నుంచి తమ కుమారుడు కనిపించకుండాపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పార్క్ అధికారులను సంప్రదించారు. దీంతో మృతదేహానికి సంబంధించిన తల, చేతులు లాంటి శరీర భాగాలను సింహం బోనులో జూ అధికారులు కనుగొన్నారు. దీంతో పాటు కొడవలి, గడ్డిని కూడా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గడ్డి కోసుకునేందుకు జూ ఫెన్సింగ్ గోడ ఎక్కి పార్కులోకి ప్రవేశించినపుడు బాలుడిపై సింహాలు దాడి చేసి వుంటాయని జూ అధికారులు భావిస్తున్నారు. కాగా బిలాల్ మామయ్య ఇదే పార్కులో ఉద్యోగిగా ఉన్నాడు. -
అదిగో చిరుత.. ఇదిగో జింక
పశ్చిమ ఏజెన్సీలోని పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో ఉన్న పోలవరం, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గల రేంజ్‌ల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో వన్యప్రాణుల కదలికలు ఎక్కువగా ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటి కదలికలను గుర్తించారు. వీటి సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, బుట్టాయగూడెం(పశ్చిమగోదావరి) : జిల్లాలోని పోలవరం, బుట్టాయగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధితో పాటు పాపికొండల నేషనల్ పార్కుగా సుమారు 1.12 లక్షల హెక్టార్లలో అభయారణ్యం విస్తరించి ఉంది. అందులో ఎలుగుబంటులు, కొండ గొర్రెలు, జింకలు, కొండ చిలువలు, అడవి పందులు, ఆగలి, గెద్దలు, నెమళ్లు, చిరుత పులులు, కురుడు పందులు, చుక్కల దుప్పిలు, సాంబాలు, జాకర్స్, ముళ్ల పందులు, ముంగీసలు వంటి జంతువులు అధికంగా ఉన్నట్లు వన్యప్రాణి విభాగం అధికారులు చేసిన సర్వేల్లో బయట పడింది. పాపి కొండల అభయారణ్యంలో చిరుతపులి, జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు, అడవిదున్నలు ఉన్నట్లు గుర్తించారు. 5 ఫారెస్ట్ రేంజ్‌ల పరిధిలో 60 బీట్లలో 2018లో జంతుగణన కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలో ఈ ప్రాంతంలో చిరుత పులులతో పాటు పలు వన్యప్రాణులు ఉన్నట్లు తేలడంతో వాటి సంరక్షణ కోసం గోగులపూడి సమీపంలో బేస్ క్యాంపు, పోలవరం మండలంలోని టేకూరు వద్ద మరో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బేస్ క్యాంపులో ఐదుగురు చొప్పున సిబ్బంది పని చేసేవిధంగా ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేశారు. అభయారణ్యం సంరక్షణ, జంతువుల ఉనికి తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పలు ప్రదేశాల్లో సంచరిస్తున్న అడవి జంతువుల కదలికలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. పాపికొండల అభయారణ్యంలో చిరుతపులి జాడ ఉందని తేలింది. దీనితో పాటు కార్నివోర్స్, అడవి దున్నలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, అడవి కుక్కలు, కుందేళ్లు, లేళ్లు, కనుజులు, అడవి పందుల జాడ కూడా ఉన్నట్లు తేలింది. పోలవరం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కుక్కునూరు అటవీరేంజ్ పరిధిలో నిర్వహించిన జంతు గణనల్లో పోలవరం రేంజ్ పరిధిలో సుమారు 30 అడుగుల గిరినాగులు కూడా ఉన్నట్లు తేలిందని అధికారులు చెప్పారు. కానరాని పెద్ద పులుల జాడ 2018లో నిర్వహించిన జంతు గణనల సర్వేలో జీవజాతుల సంఖ్య పెరిగినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాంతంలో పెద్దపులుల జాడ ఉన్నట్లు ఎక్కడా సమాచారంలేదని అధికారులు చెబుతున్నారు. అయితే పెద్దపులి జాడ కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి తద్వారా సీసీ కెమెరాల ద్వారా బంధించే విధంగా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పారు. అయితే ఈ ప్రాంతంలో పులుల సంచారం కూడా ఉందని, అయితే కెమెరాల్లో బందీ కావడంతో పాటు ఆచూకీ లభిస్తేనే వెల్లడిస్తామని అంటున్నారు. వేసవిలో వణ్యప్రాణుల దాహర్తి తీరుతుందిలా.. వేసవిలో వణ్యప్రాణుల దాహర్తిని తీర్చేందుకు అటవీశాఖ అధికారులు నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తారు. కుక్కలు, వాహనాల బారిన పడకుండా అటవీప్రాంతంలో జంతువులు సంచరించే ప్రాంతంలో సాసర్వెల్(నీటి తొట్టె) ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటితో నింపుతారు. బేస్‌క్యాంప్ సిబ్బందితో కలిసి అధికారులు ప్రతీరోజూ నీటిని పరిశీలించి అందులో చెత్తలేకుండా చూస్తారు. నీటి తొట్టె పక్కనే ఉప్పుముద్దను కూడా ఏర్పాటు చేస్తారు. వన్యప్రాణుల దాహార్తిని తీర్చుకుని ఉప్పుముద్దను నాకుతాయి. దీంతో ఎండ బారి నుంచి కాపాడుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పోలవరం, కన్నాపురం, కుక్కునూరు, వేలేరుపాడు రేంజ్ పరిధిలో సుమారు 70 వరకూ నీటి తొట్టెలు 150 వరకూ చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వన్యప్రాణులకు వేసవిలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తున్నామని వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో వేణుగోపాల్ తెలిపారు. వెంటాడుతున్న నిధుల కొరత వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అధికారులు అనేక అవస్థలు పడుతున్నారు. నీటితొట్టెల్లో నీటిని ట్యాంక్‌ల ద్వారా తరలించేందుకు, ఇతర ఏర్పాట్లకు నిధుల కొరత వెంటాడుతున్నట్లు అధికారులు అంటున్నారు. నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా మంజూరుకాలేదని దీనితో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. జంతు సంరక్షణ కోసం చర్యలు అటవీ ప్రాంతంలోని జంతువులను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణి దాహర్తి తీర్చేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తున్నాం. అలాగే చెక్‌డ్యామ్‌లు, ర్యాపిడ్ ఫీల్డ్ డ్యామ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. అయితే పనులకు సంబంధించి కాస్త నిధుల కొరత ఉన్నమాట వాస్తవమే. గత ఏడాది నుంచి నిధులు మంజూరు కావడంలేదు. – జి.వేణుగోపాల్, డిప్యూటీ రేంజర్ అధికారి వైల్డ్‌లైఫ్, పోలవరం -
సింహం సింగిల్‌గా వస్తుంది.. ఆ వస్తే.. వస్తే ఏంటట..
ఓ సినిమాలో డైలాగ్..పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది అని..ఈ సింహం దాన్ని బాగా నమ్మేసినట్లు ఉంది..సింగిల్‌గానే వెళ్లింది..అప్పుడు ఏం జరిగిందంటే.. మొన్నీమధ్యే..కెన్యాలోని లేక్ నకురు నేషనల్ పార్కులోఊసుపోని సింహం ఒకటి ఊరి మీదకు బయల్దేరిందిఇలా ఇంటి మలుపు తిరిగిందో లేదో..అడవి గేదెల గుంపు ఒకటి ఎదురైంది.. అసలే సింహం.. ఆపై కామన్సెన్స్ తక్కువ..పైగా.. ఎక్కడ నెగ్గాలో..ఎక్కడ తగ్గాలో తెలియదు..దాంతో ఏయ్ అన్నట్లు చూసింది..అవి పోపోవోయ్ అన్నాయి..ఇది గుర్రుమంది.. అంతే.. వాటికి కాలింది.. పాత కక్షలు ఏమైనా ఉన్నాయో ఏమో తెలియదుగానీ..ఒక్కసారిగా మీదకు ఉరికాయి.. సింహానికి తత్వం బోధపడింది..కస్సుమన్నది కాస్త.. కాలికి పనిచెప్పింది.. చేసేదిలేక ఇలా చెట్టెక్కి కూర్చుంది.. సింహం కళ్లలో భయం చూశాక.. గేదెల ఈగో శాటిస్ఫై అయినట్లుంది..దీంతో పోనీలే అని దాన్ని వదిలేసి.. వార్నింగులు గట్రా ఇచ్చేసి..ఇంటి దారి పట్టాయి.(ఈ చిత్రాలను ముంబైకి చెందిన ఫొటోగ్రాఫర్ నీలోత్పల్ బారువా క్లిక్‌మనిపించారు.) -
వైరల్ : అడ్డు తప్పుకున్న ఆడ సింహం..!
-
అయ్యో పాపం.. ఎంత దీనస్థితి!
సుడాన్: అడవికి రారాజు సింహం అంటారు. అలాంటి సింహం పేరు వినగానే దట్టమైన జూలు, దిట్టమైన శరీరాకృతితో ఊహాల్లోకి రాగానే వెన్నులో వణుకు పుడుతుంది. మృగరాజు గంభీరమైన గాండ్రింపు వినపడితే చాలు గుండెల్లో పిడుగు పడినంత పనవుతుంది. ఇక ఆఫ్రికా జాతి సింహాల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వాటిని సినిమాల్లో చూసే అమ్మో అనుకుంటాం. ఆఫ్రికా దేశమైన సుడాన్‌లోని అల్ ఖురేషీ పార్క్‌లో సింహాలు దీనికి భిన్నంగా కన్పిస్తున్నాయి. వాటిని చూస్తే భయపడాల్సింది పోయి అసలు అవి సింహాలా లేక ఏవైనా పెద్ద జాతి పిల్లులా అనేలా తయారయ్యాయి. ఇక ఆ పార్కుకు వచ్చిన సందర్శకులకు వినోదం సంగతి అటుంచితే వాటిని చూసి అయ్యో పాపం అనుకుంటున్నారు. బక్క చిక్కిపోయి ఎముకల గూడులా తయారైన ఆ సింహాల దీనస్థితిని చూసి తట్టుకోలేక ఓ సందర్శకుడు వాటి ఫొటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ సింహాలను చూసి నెటిజన్లంతా షాకవుతూ వాటి పరిస్థతిని చూసి జాలి పడుతున్నారు. ఆర్థిక సంక్షోభంలో సూడాన్.. ప్రస్తుతం సూడాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో అక్కడ ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి తోడు కరెన్సీ కొరత అక్కడి ప్రజలను బాధిస్తోంది. సూడాన్‌లోని అంతర్యుద్ధం లక్షలాది మంది పాలిట శాపంగా మారింది. కడుపు నింపుకోవడానికి నాలుగు మెతుకులు కూడా దొరకని దుస్థితితో మనుషులు అల్లాడిపోతుంటే, మూగజీవాలు కూడా ఆకలికి అలమటించి పోతున్నాయి. సూడాన్ రాజధాని కార్టోమ్లోని అల్ ఖురేషి పార్క్‌లోని సింహాలకు అయితే కొన్ని వారాలుగా తినేందుకు తిండి కూడా లేదు. అంతేకాదు అనారోగ్యానికి గురైన సింహాలకు సరైన చికిత్స, మందులు అందుబాటులో లేవు. ఎముకలు శరీరంలో నుంచి బయటకు చొచ్చుకొచ్చి సింహాలు దీనంగా కన్పిస్తున్నాయి. ఆ పార్క్‌కు వచ్చిన సందర్శకులు వాటి రూపాలను చూసి అయ్యో పాపం అంటున్నారు. సింహాలకు కొన్ని వారాలుగా ఆహారం లేక ఆకలితో అలమటిస్తూ లేవలేని పరిస్థితికి వచ్చాయి. ఒక సింహాన్ని అయితే తాడుతో కట్టేసి దానికి డ్రిప్ ద్వారా ద్రవాలను అందిస్తున్నారు. అక్కడి మృగరాజుల దుస్థితి చూసి జంతు ప్రేమికులు చలించిపోతున్నారు. -
‘అమ్మ’ ప్రేమను చాటిన సింహం
బిడ్డలపై ప్రేమ లేని తల్లి ఉంటుందా అంటే.. సమాధానం చెప్పడం చాలా కష్టం. ఏ తల్లి అయినా తన బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటుంది. మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ తల్లిప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. దీనికి నిదర్శనం ఈ వీడియోనే. తన బిడ్డను నది దాటించే క్రమంలో ఓ ఆడసింహం చేసిన పని అందరిని ఆశ్చర్యపరిచింది. నదిలోని మొసళ్లు ఎక్కడ తన బిడ్డలను మింగేస్తాయోనని చూసుకుంటూ.. జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చింది ఆ ఆడ సింహం. నది దాటే క్రమంలో పిల్ల సింహం ఒక్క క్షణం నిటిలో మునిగితే చాలు.. వెంటనే నోటితోపైకి లాగుతోంది. తన బిడ్డను మొసలి మింగేసిదన్న భయంతో వెంటనే అప్రమత్తమై పిల్ల సింహాన్ని నోటితో పైకి లాగుతోంది. ఈ అసాధారణ దృశ్యం కెన్యాలోని ఎవాసో వద్దగల నైరో నది సమీపంలో చోటు చేసుకోగా.. లుకా బ్రాకాలి అనే ప్రముఖ ఫోటో గ్రాఫర్ తన కెమెరాలో బంధించారు.ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ‘తల్లి ప్రేమను మించింది లేదు’., ‘ సింహం అయినా కూడా ఓ బిడ్డకు తల్లియే కదా’ అని కామెంట్లు పెడుతున్నారు. -
‘అమ్మ’ ప్రేమను చాటిన సింహం
-
చిరుత హత్య కలకలం
-
కుక్కకు బదులుగా సింహం పిల్ల కాపలా!
సాక్షి, న్యూఢిల్లీ : నైజీరియాలోని లాగోస్ నగరంలో రెండు అపార్టుమెంట్ల బ్లాక్ కలిగిన ఓ ఆసామీ భద్రత కోసం కుక్కకు బదులుగా సింహం పిల్లను తెచ్చి పెంచుతున్నారు. రెండేళ్ల వయస్సు కలిగిన ఆ సింహం పిల్లను కనీసం కట్టేయకుండా స్వేచ్ఛగా ఓ చెట్టు కింద వదిలేశారు. ఆ అపార్ట్ ఆవరణలో పిల్లల సంరక్షణ కేంద్రంతోపాటు ఓ ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. పిల్లలేమోగానీ పిల్లలను తీసుకొచ్చే పెద్దలు, తల్లిదండ్రులు ఆ సింహాన్ని చూసి జడుసుకు చస్తున్నారు. అక్కడి నుంచి దాన్ని తొలగించాల్సిందిగా యజమానికి వారంతా కోరగా, అలవాటయితే అది కూడా కుక్కలాగానే మనిషులతోని మంచిగానే ఉంటుందని చెబుతూ వచ్చాడట. ఆ సింహం ప్రస్తుతానికి ఏమనకపోయినా ఏదో రోజు పిల్లలనో, తమనో పీక్కు తింటుందని ఆందోళన చెందిన అపార్ట్మెంట్ వాసులు నేరుగా పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దాంతో అటవి సిబ్బంది వచ్చి ఆ సింహం పిల్లకు మత్తుమందు ఇచ్చి లెక్కి ప్రాంతంలోని జంతు ప్రదర్శన శాలకు దాన్ని తరలించారు. ఈ విషయం తెల్సినప్పటి నుంచి గత రెండు రోజులగా ఆ యజమాని పత్తా లేకుండా పోయాడట. ఆయన ఆచూకి దొరికితే ఆయన్ని వన్య సంరక్షణ చట్టాల కింద అరెస్ట్ చేస్తామని అటవి శాఖ అధికారులు తెలిపారు. ఆ ఆసామీ పేరు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. రెండు నెలల క్రితమే ఆయన ఈ సింహం పిల్లను కొనుక్కొని వచ్చాడట. -
పర్యటనకు వెళ్తే.. పరుగులు పెట్టించింది
బెంగళూరు: సరదాగా పర్యటించడానికి పార్కుకు వెళ్లిన వారికి ఒక్కసారిగి మృత్యువు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది. దాంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరుగందుకున్నారు. మృగరాజు పర్యటనకు వచ్చి వారిని వెంటాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటక బళ్లారిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి జూలాజికల్ పార్కులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... నలుగురు పర్యటకులు పార్కులో పర్యటించేందుకు సఫారిలో వెళ్లారు. ఇంతలో అనుకోకుండా ఓ సింహం సఫారి వైపే పరిగెత్తుకుంటూ రాసాగింది. ఇది గమనించిన వ్యక్తులు మొదట్లో దీన్ని సరదాగా తీసుకుని నెమ్మదిగా వెళ్లడం ప్రారంభించారు. కానీ సింహం వేగంగా సఫారివైపు దూసుకువస్తుండటంతో మృత్యు దేవతే తమను తరుముతున్నట్లు భయంతో వణికిపోయారు. వెంటనే సఫారి వేగాన్ని పెంచి ముందుకు దూకించారు. కానీ మృగరాజు మాత్రం కొద్ది దూరం పాటు ఆ సఫారిని వెంబడించి.. ఆ తర్వాత దాని వేగాన్ని అందుకోలేక ఆగిపోయింది. దాంతో సఫారిలో ఉన్నవారిగా ఒక్కసారిగా బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంతకు సింహం పర్యటకుల వాహనాన్ని ఎందుకు వెంబడించిందనేది మాత్రం తెలియలేదు. మూడు రోజుల క్రితం యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే లక్షలో వ్యూస్, కామెంట్స్ సంపాదించింది. -
సఫారిని వెంబడించిన సింహం
-
తల్లిని భయపెట్టిన బుజ్జి సింహం!
-
తల్లిని భయపెట్టిన బుజ్జి సింహం!
సింహం.. ఈ పేరు వినగానే గుర్తొచ్చేది అధికారం. అడవికి రాజైన సింహం తన పిల్లలకు జంతువులను వేటాడే తత్వాన్ని, ఇతర జీవ రాశులపై అధికారాన్ని ఎలా చేపట్టాలో నేర్పిస్తుంది. అయితే అలాంటి సింహం భయపడటం ఎప్పుడూ చూడలేదు కదూ. కానీ ఇక్కడ అలాంటి దృశ్యమే చోటుచేసుకుంది. ఓ తల్లి సింహం పిల్ల సింహానికి భయపడిపోయింది. అయితే ఆ పిల్ల సింహం మరేదో కాదు దాని సొంత బిడ్డే కావడం.. అది కూడా రెండు నెలల శిశువు మాత్రమే కావడం విశేషం. స్కాట్లాండ్ రాజధాని అయిన ఎడిన్బర్గ్ జాతీయ జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఆడ సింహం తన ముగ్గురు పిల్లలతో హాయిగా సేద తీరుతుంది. ఈ సమయంలో తన దృష్టంతా ముందున్న రెండు పిల్ల సింహాలపై ఉండగా అనూహ్యంగా వెనక ఉన్న మరో పిల్ల సింహం తన తల్లి దగ్గరికి నెమ్మదిగా వచ్చి తల్లిని భయపెట్టాడానికి ప్రయత్నిస్తుంది. అది గమనించని తల్లి సింహం ఒక్క సారిగా ఉలిక్కిపడి కోపంతో వేగంగా వెనక్కి తిరిగి చూస్తుంది. అనంతరం దాడికి ప్రయత్నించి.. ఆనక తన బిడ్డే అని తెలియడంతో సైలెంట్‌గా ఉండిపోతుంది. ఈ హాస్యకరమైన దృశ్యమంతా సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో సదరు జంతు ప్రదర్శన శాల ఈ వీడియోను ట్విటర్, ఫేస్బుక్లో షేర్ చేసింది. అప్పటి నుంచి నెటిజన్లు తెగ నవ్వుకుంటూ దీనిపై లైకులు కామెంట్లు కురిపిస్తున్నారు. ‘మంచి వీడియో! మమ్మల్ని నవ్వించినందుకు ధన్యవాదాలు’.. ‘చిన్నతనం నుంచి ఈ సింహం పిల్ల దాడి చేసే గుణాన్ని అలవర్చుకుంటుంది’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ వీడియోలో కనిపించే తల్లి సింహం పేరు సింహరాశి రాబర్టా. వీటిని 2012 లో ఎడిన్బర్గ్ జంతు ప్రదర్శనశాలకు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టులో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం వీటిలో మూడు మాత్రమే ప్రాణాలతో ఉన్నాయి. -
శ్రీశైలం దేవస్థానం లో చిరుత సంచారం
-
‘ఇది శాఖాహార సింహం అనుకుంటా’
-
‘ఇది శాఖాహార సింహం అనుకుంటా’
గాంధీనగర్: మృగరాజు సింహం విషయంలో తరచుగా ఓ మాట వింటుంటాం. ఆకలేసినంత మాత్రానా సింహం గడ్డి తినదని. కానీ ఈ వీడియో చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే ఈ సింహం తాపీగా గడ్డి నముల్తుంది కాబట్టి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. ఈ వింత సంఘటన గిర్ అడవుల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గుజరాత్లో గిర్ అభయారణ్యంలో ఓ సింహం గడ్డి తింటూ వీడియోకు చిక్కింది. సింహం గడ్డిని నమిలి, బయటకు ఉమ్మేయడం వీడియోలో రికార్డయ్యింది. దాన్ని కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇది శాఖహార మృగరాజేమో’.. ‘ఈ సింహం భార్య డైటింగ్ చేయమన్నట్లుంది. అందుకే ఇలా గడ్డి తింటుంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే జంతుశాస్త్రం తెలిసిన వారు మాత్రం ఇది అంత ఆశ్చర్యపోవాల్సిన సంఘటనేం కాదు అంటున్నారు. పేగులను శుభ్రం చేసుకోవడానికి గాను సింహాలు ఇలా గడ్డిని తింటాయన్నారు. పిల్లి జాతికి చెందిన అన్ని జీవులు గడ్డిని భేదిమందు(విరేచనాలు)గా సేవిస్తాయన్నారు. సింహం లాంటి మాంసాహార జంతువులు ఓ జీవిని చంపి ఆహారంగా తీసుకున్నప్పుడు.. అది అరగకపోతే ఇలా గడ్డిని తింటాయి. ఆ రసం భేది మందుగా పని చేస్తుంది. అందుకే సింహం గడ్డిని నమిలి.. చివరకు బయటకు ఉమ్మేసింది అని తెలిపారు. దీని గురించి షెత్రుంజి రేంజ్ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ (డీసీఎఫ్) సందీప్ కుమార్ మాట్లాడుతూ.. సింహాల కడుపులో ఏదైనా ఇబ్బందిగా ఉంటే వాంతులు చేసుకునేందుకు అప్పుడప్పుడు గడ్డి తింటుంటాయని పేర్కొన్నారు. పచ్చిమాంసం కొన్నిసార్లు వాటి జీర్ణక్రియను ఇబ్బంది పెడుతుందని, అటువంటి సమయంలో దానిని మళ్లీ బయటకు పంపేందుకు ఇలా గడ్డి తింటాయని వివరించారు. ఏది ఏమైనా సింహం గడ్డి తినడం నిజంగా చాలా అరుదైన సంఘటనగానే చెప్పవచ్చు. -
మేకింగ్ ఆఫ్ మూవీ-లయన్ కింగ్
-
ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!
నేలకొరిగిన భారీ మృగరాజు ఎదుట ఇలా గాఢంగా ముద్దు పెట్టుకున్నారు కెనడా దంపతులు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేం పోయేంకాలం? ఇంత వికృతమా? ఇంత దారుణమా? మీరు మనుషులేనా? మీకు మానవత్వముందా? అంటూ నెటిజన్లు ఆ దంపతుల మీద మండిపడుతున్నారు. జంతు ప్రేమికులైతే వారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. మీరు దారుణమైన మనుషులు.. ఆ అందమైన సింహం మిమ్మల్ని తిని ఉంటే బాగుండేదని నెటిజన్లు వారి మీద దుమ్మెత్తిపోస్తున్నారు. వారి ఆగ్రహానికి కారణం లేకపోలేదు. కెనడాలోని అల్బెర్ట్‌కు చెందిన డారెన్, కారోలిన్ కార్టర్ దంపతులు ఈ సింహాన్ని స్వయంగా వేటాడారు. వేటాడి చంపిన అనంతరం సింహం కళేబరం పక్కనే ఇలా గర్వంగా, ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు. ఈ ఫొటోను లెజెలేలా సఫారీ అనే కంపెనీ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసింది. ఈ కంపెనీ ప్రత్యేకత ఏమిటంటే.. అడవిలో సింహాలు, జిరాఫీలు మొదలుకొని.. అనేక రకాల జంతువులను వేటాడి చంపేందుకు అనుమతిస్తుంది. అంటే అడవిలో వేట ఇష్టపడే ఔత్సాహికులు.. ఈ కంపెనీని ఆశ్రయిస్తే.. ఎంచక్కా చట్టపరమైన చిక్కులు లేకుండా ఆ అవకాశాన్ని కల్పిస్తుందన్నమాట. ‘కలహారి ఏడారిలో అడవి మృగరాజును వేటాడటం కంటే మరో గొప్ప అనుభూతి మరొకటి ఉండదు’ అంటూ లెజెలేలా సఫారీ తన ఫేస్బుక్ పేజీలో ఈ ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోపై ఆన్లైన్లో తీవ్రస్థాయిలో విమర్శలు, దూషణలు వ్యక్తం కావడంతో సదరు కెనడా దంపతులు తమ ఇన్స్టాగ్రామ్ పేజీలను ప్రైవేట్ చేశారు. లెజెలేలా సఫారీ తన ఫేస్బుక్ పేజీని తొలగించింది. అయితే, వేటను వ్యాపారంగా చేస్తున్న తమ కంపెనీ వ్యవహారాలు ఇకపై కొనసాగుతాయని, ఔత్సాహికులకు ఇకముందు కూడా మెరుగైన సేవలందిస్తామని ఆ కంపెనీ చెప్పుకొచ్చింది. -
బర్త్ డే: కేక్ తీసి సింహం ముఖానికి కొట్టాడు
అతను ఓ సింహాన్ని పెంచుకున్నాడు. ఆ సింహానికి పుట్టినరోజు చేయాలనుకున్నాడు. అందుకోసం స్నేహితులను కూడా పిలిచాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత మూర్ఖంగా ప్రవర్తించాడు. పెంచుకుంటున్న సింహమే కదా? దాని పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. హ్యాపీ బర్త్ డే టు యూ అంటూ తాను తెచ్చిన కేక్‌ను సింహం ముఖానికి కేసి కొట్టాడు. దాంతో ఆ సింహం అదిరిపదింది. ముఖానికి అంటిన కేక్‌ను దులుపుకుంటూ.. అసహనంగా కదిలింది. పెంపుడు సింహం ఇలా ఇబ్బంది పడుతుంటే.. సదరు యజమాని, అతని స్నేహితులు మాత్రం ఇదేదో వినోదమైనట్టు నవ్వుల్లో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుర్దీస్తాన్కు చెందిన ఓ వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. మూగజీవాల పట్ల క్రూరంగా ప్రవర్తించవద్దంటూ జంతుప్రేమికులు ఒకవైపు ఎంత మొత్తుకుంటున్నా.. కొందరు మాత్రం ఇలా మూర్ఖంగా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జంతువుల పట్ల జాలి చూపండ్రా అంటూ.. సదరు కుర్దీస్తానీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. -
సింహాలు గుంపులుగా వస్తే.. ఇలా ఉంటుంది!
-
ట్రాక్‌పైకి గుంపులు గుంపులుగా సింహాలు..!
సాక్షి, గుజరాత్: సింహం సింగిల్‌గా వస్తుందంటారు.. కానీ సీన్ రివర్సైంది. ఇక్కడ సింహాలు గుంపులు గుంపులుగా వచ్చాయి. అదీ రైల్వే ట్రాక్‌పైకి! విహారానికి వచ్చాయో.. మరెందుకు వచ్చాయో కానీ 20 నిమిషాల పాటు రైల్వేట్రాక్‌పైనే ఉండి రైలు రాకపోకలకు అంతరాయం కలిగించాయి. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో విరావల్ - ధరి రైల్వే మీటర్ గేజ్ దగ్గర ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. కాగా ఈ తతంగాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీయగా అది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘రైలు ఇంజిన్ డ్రైవర్ సింహాల రాకను గుర్తించి రైలు వేగాన్ని తగ్గించాడు. వాటికి ఏ హాని తలపెట్టకుండా హారన్ కొడుతూనే రైలును కొద్ది కొద్దిగా మూవ్ చేశాడు. దాంతో సింహాలు ఇబ్బంది పడ్డాయేమో.. వచ్చిన దారిలోనే అక్కడినుంచి నిష్క్రమించాయి’ అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. -
అక్కడ సింహాలతో ఆడుకోవచ్చు!
గాజా, పాలస్తీనా : అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న పాలస్తీనియన్ రాజ్యం గాజాలోని పార్కులు సందర్శకులకు వినూత్న అనుభవం కలిగిస్తున్నాయి. ఏకంగా సింహాలతో ఆడుకునే వెసలుబాటు కల్పించి ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా దక్షిణ గాజాలోని రఫాలో ఉన్న ఓ జూ పార్కులో ‘ఫెలెస్టీన్’ అనే ఆడ సింహాన్ని జూ నిర్వాహకులు సమీపంలో ఉన్న ఇళ్లకు తీసుకువెళ్లి ఆడిస్తుండటం విశేషం. ఈ విషయం గురించి జూ యజమాని మహ్మద్ జుమ్మా మాట్లాడుతూ... ‘ సింహంలో ఉన్న క్రూరత్వాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నా. అందుకే దాని గోళ్లు కత్తిరిస్తున్నాం. సందర్శకులతో తను స్నేహంగా ఉంటోంది’ అంటూ చెప్పుకొచ్చాడు. పిల్లలు కూడా ఆడుకున్నారు... ఫెలెస్టీన్ను మంగళవారం షికారుకు తీసుకువెళ్లినట్లు దాని శిక్షకుడు ఫయీజ్ అల్- హదద్ వెల్లడించారు. ‘ కొన్ని రోజులుగా ఫెలెస్టీన్ మానసిక స్థితిని అంచనా వేశాను. అందుకే సమీపంలో ఓ అపార్ట్మెంట్కి తీసుకు వెళ్లాను. అక్కడ ఉన్న వారంతా పిల్లలతో సహా ఫెలెస్టీన్తో ఆడుకున్నారు. దాని గోళ్లు కత్తిరించాం కాబట్టి పెద్దగా ప్రమాదం ఉండదు. అయితే పళ్లు మాత్రం అలాగే ఉంచుతాం. కాబట్టి దాని సహజత్వాన్ని కోల్పోదు. అందుకే తగిన జాగ్రత్తలు పాటిస్తాం’ అని పేర్కొన్నాడు. కాగా శిథిలావస్థకు చేరిన జూ పార్కులను పునరుద్ధరించేందుకు.. జంతువులతో ఆడుకోవడం వంటి వెసలుబాటు కల్పిస్తున్న యజమానుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారం కోసం జంతువుల పట్ల కఠినంగా వ్యవహరించడం సరికాదని.. అదేవిధంగా జంతువులను బయట తిప్పడం వల్ల పలువురి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే నిరంతరం బాంబుల మోతతో దద్దరిల్లే గాజాలో పిల్లల ముఖాల్లో కాస్త సంతోషం చూసేందుకే ఇలాంటి కార్యక్రమానికి పూనుకున్నామని జూ నిర్వాహకులు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. -
అడవైనా.. రోడ్డైనా నేనే రారాజు
-
అడవైనా.. రోడ్డైనా రాజు మాత్రం నేనే..!
సింహాన్ని జూలో చూడాలంటేనే చాలా మందికి వణుకోస్తుంది. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సింహాలు అలా రోడ్డు మీద కార్ల మధ్యలోంచి దర్జగా నడుచుకుంటూ వెళ్తుంటే ఎలా ఉంటుంది.. ఇదిగో ఈ వీడియోలో ఉన్నట్లు ఉంటుంది. ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో చోటు చేసుకుంది ఈ సంఘటన. దాదాపు 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో నాలుగు సింహాలు దర్జాగా రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్లాయి. ఆ సమయంలో అక్కడ రోడ్డు మీద దాదాపు పదుల సంఖ్యలో కార్లున్నాయి. కానీ వారంతా మృగరాజులు వెళ్లే వరకూ ఆగి ఆ తర్వాత ముందుకు సాగారు. సింహన్ని జూలో చూడటం కన్నా ఇలా నడిరోడ్డు మీద నడిచి వెళ్తూంటే చూడటం నిజంగా చాలా థ్రిల్‌ని కలిగించిందంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 20 లక్షల మంది చూశారు. -
పుట్టిన చోటును వెతికే సింహం
కొత్త బంగారం 1986. ఐదేళ్ళ సరూ, పక్క ఊరి రైల్వే స్టేషన్లో తప్పిపోయి, పొరపాటున కలకత్తా వెళ్ళే రైలెక్కుతాడు. తన ఊరు ‘గినెస్తలే’ అనీ, తల్లి ‘అమ్మీ’ రాళ్ళు మోస్తూ, తమ నలుగురు పిల్లల్నీ పోషిస్తుందనీ తప్ప మరేదీ తెలియదు. హిందీ తప్ప మరే భాషా రాదు. సరూ కలకత్తా రోడ్లమీదతిరుగుతూ మూడు వారాలు గడిపిన తరువాత, పిల్లాడిని వొక అనా«థాశ్రమంలో పెడుతుంది ప్రభుత్వం. ఆస్ట్రేలియా జంటయిన సూ, జాన్ బ్రియలీ– కుర్రాడిని దత్తు తీసుకుంటారు. సరూ నిజ జీవిత కథ అయిన, ‘ఎ లాంగ్ వే హోమ్’ నవలకి కథకుడు– తన అసలు పేరైన ‘షేరూ’ (సింహం) పలకడానికి నోరు తిరగని సరూయే. ఆ తరువాత, బ్రియలీ దంపతులు మానసిక సంతులనం లేని మాంతోష్ని దత్తు తీసుకుంటారు కానీ అతని ప్రస్తావన ఎక్కువ ఉండదు. సరూకి మాతృదేశం గుర్తుండేలా, సూ– కొడుకు గదిలో అనాథాశ్రమంలో తీసిన అబ్బాయి ఫొటోతో పాటు ఇండియా మ్యాప్ కూడా పెడుతుంది. సరూ తన గత జీవితపు అస్పష్టమైన జ్ఞాపకాలను సజీవంగా ఉంచుకుంటాడు. ‘మరొక దేశానికి, సంస్కృతికి మారడం అంత కష్టం కాలేదు నాకు. ఇండియాలో నా జీవితంతో పోలిస్తే ఆస్ట్రేలియాలోనే చక్కగా గడిపాను. కాకపోతే, అమ్మీ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉండేది. అది అసాధ్యం అని తెలిసిన తరువాత, బతకాలంటే దొరికిన ప్రతీ అవకాశాన్నీ అందిపుచ్చుకోవాలని అర్థం అయింది’ అంటాడు. అతను హాస్పిటాలిటీ మానేజ్మెంట్ చదువుతున్నప్పుడు, గూగుల్ ఎర్త్ రిలీజ్ అవుతుంది. జ్ఞాపకం ఉన్న కొండగుర్తులతోనూ, తన ఇండియన్ క్లాస్మేట్స్ సహాయంతోనూ– ఇండియన్ రైల్వే లైన్ల పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ, శాటిలైట్ ఇమేజెస్ వెతుకుతాడు. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఖాండ్వా పక్కనున్న గణేష్ తలై తన పల్లె అని కనుక్కోడానికి ఆరేళ్ళు పడుతుంది. 2012లో సరూ తన ఊరు వస్తాడు. షేరూ తిరిగి వస్తాడన్న ఆశతో అమ్మీ ఊరు మారదు. సరూ అమ్మీకి ఇల్లు కొనిస్తాడు. ఇంటివారితో వీడియో చాట్లు చేస్తూ అనేకసార్లు ఇండియా వస్తూపోతాడు. ఆఖరికి, అతని ఇద్దరు తల్లులూ కలుసుకుంటారు. సరూ నవల చివర్న చెప్తాడు: ‘‘నా ఊరిని, కుటుంబాన్ని కనుక్కోడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. అయితే, అది నా పాత జీవితానికి తిరిగి వెళ్ళడం కోసం కాదు. జీవితమంతా ఆస్ట్రేలియాలోనే గడిపాను. ఇక్కడ నాకు తెంచుకోలేని కుటుంబ బంధాలున్నాయి... నేనెవరో, ‘ఇల్లు’ అని దేన్ని పిలవాలో అన్నదాని గురించి నాకే అయోమయమూ లేదు. ఒక్క కుటుంబమూ లేని తప్పిపోయిన కుర్రాడిని. ఇప్పుడు నాకు రెండు కుటుంబాలు ఉన్నాయి, రెండు గుర్తింపులు కావు. నేను సరూ బ్రియలీని.’’ సరూ జ్ఞాపకాలనీ, అతని వెతుకులాటనీ చూపిస్తూ, కథనం వెనక్కీ ముందుకీ మారుతుంటుంది. రచయిత సరూ బ్రియలీ కథ– సగం ప్రపంచాన్ని చుట్టివచ్చి, తన గతాన్ని తిరిగి చేజిక్కించుకుని, రెండు భిన్నమైన సంస్కృతులని తనవిగా చేసుకున్న అతని దృఢచిత్తం గురించినది. ఉద్విగ్నభరితంగా ఉండే పుస్తకం –పట్టుదల, ప్రయత్నాల కొదవ లేకపోయినప్పుడు దేన్నైనా సాధించవచ్చన్న ఆశ లేవనెత్తుతుంది. కథనం స్పష్టంగా, సరళంగా ఉంటుంది. ‘కుటుంబం అంటే ఏమిటి!’ అన్న ప్రశ్న పుస్తకమంతటా కనిపిస్తుంది. స్ఫూర్తిదాయకమైన బ్రియలీ ప్రయాణపు పుస్తకం, కట్టుకథకున్నంత ఆశ్చర్యాన్ని కనపరుస్తుంది. నవలని వైకింగ్ 2014లో పబ్లిష్ చేసింది. దీని ఆధారంగా తీసిన ‘లయన్’ సినిమా 2016లో వచ్చింది. - కృష్ణ వేణి -
సింహానికి చిరుత దత్తత!
అహ్మదాబాద్: సాధారణంగా చిరుతపులులను చూస్తే సింహాలు వేటాడతాయి. అయితే గుజరాత్లో ఓ ఆడ సింహం చిరుత పులి పసికూనను కంటికి రెప్పలా చూసుకుంటూ దానికి పాలు కూడా ఇస్తోంది. ఇలా జరగడం చాలా అసాధారణమని అటవీ అధికారులు చెబుతున్నారు. నెలన్నర వయసున్న చిరుతకూన గిర్ అడవిలో ఎలానో తన తల్లి నుంచి వేరుపడింది. దీనిని సింహం అక్కున చేర్చుకుంది. తన పిల్లలతోపాటే దీనికీ పాలిస్తూ, మగ సింహాల దాడి నుంచి కాపాడుతోంది. వారం క్రితం ఈ వింతను అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా విడుదల చేశారు. ‘చిరుతపులి పిల్లపై ఈ సింహం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ కాపాడుతోంది. అలాగే సింహం సంకేతాలు, శబ్దాలను పులి పిల్ల ఎలా అర్థం చేసుకుంటుందోనని మేం ఆశ్చర్యపోతున్నాం. ఏదేమైనా ఇది చాలా అరుదైన ఘటన’ అని గిర్ అడవి పశ్చిమ విభాగ కన్జర్వేటర్ ధీరజ్ మిత్తల్ చెప్పారు. -
సింహం సింగిల్‌గా వస్తే..!!
‘నాన్నా.... పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది’.... సింహం ఎంత పవర్ఫుల్లో చెప్పే పాపులర్ డైలాగ్. అయితే సింగిల్‌గా వస్తే సింహాన్నానైనా సరే ఓ ఆట ఆడుకుంటామని నిరూపించాయి గుంపుగా వచ్చిన హైనాలు. ఒంటరిగా ఉన్న సింహం చుట్టూ చేరి దానికి ముచ్చెటమలు పట్టించాయి. అడవికి రాజైతే కావచ్చు గానీ మా ఐకమత్యం ముందు నీ బలం పనికిరాదన్నట్టుగా సింహంతో ఓ ఆట ఆడుకున్నాయి. అయితే చివర్లో మరో సింహం వచ్చి.. తన స్నేహితుడికి అండగా నిలవడంతో హైనాలు తోక ముడవక తప్పలేదు. సవన్నా గడ్డి భూముల్లో హైనాలకు, రెండు మగ సింహాలకు మధ్య జరిగిన పోరుకు సంబంధించిన ఈ వీడియోను బీబీసీ ఎర్త్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరి ఇంకేం మీరు కూడా ఓ లుక్కేయండి. -
సింహంతో సర్కస్ షో.. చిన్నారిపై పంజా
మాస్కో: సర్కస్‌లో విన్యాసాలు చేయాల్సిన సింహం ఓ చిన్నారిపై దాడి చేసింది. షో చూస్తున్న నాలుగేళ్ల చిన్నారిపై పంజా విసిరి అమాంతం తినేందుకు ప్రయత్నించింది. సిబ్బంది అప్రమత్తం కావడంతో చిన్నారి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. రష్యాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్యాలోని క్రాస్నోడార్ నగరంలోని ఓ గ్రామంలో సింహంతో సర్కస్ షో నిర్వహించారు. ప్రేక్షకులు షోను భలే ఎంజాయ్ చేస్తున్నారు. సింహం ఉన్న బోనులోకి వెళ్లిన ట్రెయినర్ దానితో ఫీట్లు చేయిస్తున్నాడు. షోకి వచ్చిన ఓ నాలుగేళ్ల చిన్నారి కూడా ఆ సింహం చేస్తున్న విన్యాసాలు చూస్తూ చప్పట్లు కొడుతోంది. ఇంతలోనే ట్రేయినర్ దానితో మరో విన్యాసం చేయిద్దామని పక్కకి తీసుకొచ్చాడు. సింహం అలా నేలపై ఒరిగింది. ట్రేయినర్ ప్రేక్షకుల వైపు చూస్తూ ఎదో చెప్పబోతున్నాడు. అంతే వెంటనే పరుగెత్తి బోను దగ్గరలో ఉన్న ఓ చిన్నారిపై పంజా విసిరింది. బోనులోపలకి లాక్కొచ్చి అమాంతం తినేందుకు ప్రయత్నించగా సిబ్బంది రక్షించారు. సింహం పంజా విసరడంతో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయని, వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించామని షో నిర్వాహకులు తెలిపారు. కాగా ప్రేక్షకులకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా షో నిర్వహించడం వల్లే ప్రమాదం జరిగిందని విచారణ కమిటి తేల్చి చెప్పింది. సర్కస్ డైరెక్టర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. రష్యాలో ఇలాంటి ఘటనలు జరగడం సర్వసాధారణం. 2016లో నిర్వహించిన ఓ లైవ్ షోలో ఓ మహిళపై సింహం దాడి చేసింది. ఈ ఘటనలో మహిళా అక్కడికక్కడే మృతి చెందారు. 2012లో మాస్కోలో ఓ చిరుత ఏడేళ్ల బాలుడిపై దాడి చేసింది. అదే ఏడాదిలో జూపార్క్‌లో ఉన్న ఓ పులి మూడేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేసింది. -
జూలో సింహం మృతి
బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులో సింహం అతుల్ (18) వృద్ధాప్యం, గాయాల కారణంగా గురువారం మృతి చెందింది. జూ అధికారులు తెలిపిన మేరకు.. వృద్ధాప్యంతో బాధపడుతున్న సింహం వారం రోజుల నుంచి జూ వైద్యుల పర్యవేక్షణలో చి కిత్స పొందుతోంది. అతుల్‌ను కాపాడేందుకు నెహ్రూ జూలాజికల్ పార్కుతో పాటు విశాఖపట్నం, రాజ్‌కోట్, అలీపూర్, కలకత్తా, డబ్ల్యూబీ నేషనల్ పార్కు అధికారులు కృషి చేసినా ఫలితం లేకపోయింది. అనంతరం సింహానికి జూపార్కులో పోస్టుమార్టం నిర్వహించారు. అభయారణ్యాల్లో సింహాలు 15 ఏళ్ల వరకే జీవిస్తాయని జూపార్కులో మాత్రం అతుల్ 18 ఏళ్లు జీవించిందని అధికారులు తెలిపారు. -
ఏఆర్‌సీలో ఆడ సింహం మృతి
విశాఖపట్నం, ఆరిలోవ : జూపార్కు సమీపంలోని జంతు పునరావాస కేంద్రం(ఏఆర్సీ)లో శుక్రవారం ఓ వృద్ధ ఆడ సింహం మృతి చెందింది. జూ క్యూరేటర్ యశోదభాయి తెలిపిన వివరాలు ప్రకారం.. ఏఆర్‌సీలో ఉన్న మాధురి అనే 27 ఏళ్ల ఆడ సింహం వృద్ధాప్యం కారణంగా శరీర అవయవాలు పాడవడంతో అనారోగ్యానికి గురై మృతి చెందింది. దీన్ని 2001లో కోల్‌కతాలో జెమినీ సర్కస్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. దీని మరణంతో ప్రస్తుతం ఏఆర్‌సీలో ఆరు సింహాలు, మూడు పులులు ఉన్నాయి. -
క్రిమియా తైగన్ సఫారీ పార్క్‌లో సింహం హల్చల్
-
పరుగో.. పరుగు
-
మృగరాజు ఫొటో తీసినా జైలుకే.!
గాంధీనగర్: ఇప్పటికే వేగంగా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో పులి చేరింది. సింహాల సంఖ్యకు ప్రస్తుతానికి ముప్పేమీ లేకున్నా.. సంరక్షించుకోకపోతే అది కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేరే రోజు మరెంతో దూరంలో లేదని హెచ్చరిస్తున్నారు వన్యప్రాణి ప్రేమికులు. అందుకే సింహాల సంరక్షణ కోసం గుజరాత్ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. దాని ప్రకారం.. సింహాలను వేటాడడమే కాదు.. వాటి వెంట పడుతూ మాంసం విసిరినా, ఫొటోలు తీసినా ఇకపై జైలుకే పంపుతారు. అంతేకాదు.. సింహాలతో ప్రదర్శనలు కూడా నిషేధమే. ఈ నిబంధనలు అతిక్రమిస్తే అటవీ సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఏడేళ్లు జైలు శిక్ష పడుతుందని గుజరాత్ ప్రభుత్వం హెచ్చరించింది. సింహాలను రక్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం నాలుగు విభాగాలను ఏర్పాటుచేసింది. కానీ ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకే విభాగంగా మార్చింది. ఈ విషయమై ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి గణ్‌పత్ వాసవ మాట్లాడుతూ.. ‘వేటాడటం అంటే చంపడమే కాదు. ఓ జంతువును హింసించినా అది వేటే అవుతుంది. ఇకపై అటువంటి వాటిని గుజరాత్లో ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమ’న్నారు. -
ఆఫ్రిది అది చట్టవిరుద్దం!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ట్విటర్లో షేర్ చేసిన ఒక పోస్ట్ జంతుప్రేమికుల ఆగ్రహానికి గురైంది. ‘జంతువులను రక్షించడం మర్చిపోకండి, వాటికి మన ప్రేమ ఎంతో అవసరం ఉందంటూ’ జింకకు పాలు తాగిస్తూ దిగిన ఫోటో, తన కూతురు ఫోటోను బూమ్ బూమ్ ఆఫ్రిది షేర్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆల్‌రౌండర్ షేర్ చేసిన ఫోటోలో తన కూతురుతో పాటు ఆమె వెనకాలా ఓ పెద్ద సింహాన్ని గొలుసుతో కట్టేసి ఉంచారు. దీనిపై ఆగ్రహించిన జంతు ప్రేమికులు స్వేచ్చగా అడవిలో తిరగాల్సిన సింహాన్ని ఇలా గోలుసులతో కట్టిపడేస్తే జంతువులను ప్రేమించటం కాదని ఘాటుగా స్పందించారు. ఇక మరికొందరు క్రూర జంతువులను ఇళ్లలో పెంచుకోవడం చట్టవిరుద్దమని ఆఫ్రిదిని కడిగిపాడేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఆఫ్రిది ఎలాంటి వివరణ ఇవ్వలేదు. I’m absolutely appalled with what #ShahidAfridi is doing. You can’t keep a #lion out of its natural habitat all chained up & then claim that u r loving animals. The lion looks weak & so done with life. I feel so bad for it. #PETA #AnimalRights #cricket #Pakistan pic.twitter.com/IiphTknlhX — Mia Utopian (@mia__utopian) June 9, 2018 -
అఫ్రిది ఇంట్లో సింహం.. అభిమానుల షాక్
హైదరాబాద్ : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ట్విటర్లో షేర్ చేసిన ఒక పోస్ట్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల తన కూతురితో గడిపిన క్షణాలను, ఫొటోలను ఈ పాక్ మాజీ క్రికెటర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ‘నచ్చిన వారితో గడపడం చాలా మధురంగా ఉంటుంది. నా కూతురు నా వికెట్ సంబరాలను అనుకరించడం నాకు ఓ గొప్ప అనుభూతినిచ్చింది. జంతువులను సంరక్షించడం మరచిపోకండి. మన ప్రేమను పొందే అర్హత వాటికి ఉంది’ అని జింకకు తాను పాలుపడుతున్న ఫొటో, తన కూతురు సెలెబ్రేషన్ ఫొటోను షేర్ చేశాడు. అయితే ఇక్కడ తన కూతురు ఫొటోలో ఆమె వెనుకాలా ఓ పెద్ద సింహం ఉంది. దీన్ని చూసిన అభిమానులకు వెన్నులో వణుకు మొదలైంది. ‘ఆఫ్రిది సింహాన్ని పెంచుకుంటున్నాడా ఏందీ’ అని ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎవరైనా కుక్క, పిల్లిలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు..కానీ సింహాలు పెంచుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే అఫ్రిది నిజంగానే సింహాన్ని పెంచుకుంటున్నట్లు మరో అభిమాని స్పష్టమైన ఫొటోను షేర్ చేశాడు. Great to spend time with loved ones. Best feeling in the world to have my daughter copy my wicket taking celebrations. And yes don't forget to take care of animals, they too deserve our love and care :) pic.twitter.com/CKPhZd0BGD — Shahid Afridi (@SAfridiOfficial) June 9, 2018 అఫ్రిది చేసిన ట్వీట్.. ఫొటోలో సింహం oh my god..is that a pet lion?!! how cool is that!! 😲 what is it called? you pet both deer and lion? wow!! — banojyotsna (@banojyotsna) June 9, 2018 When a lion met a cricketing lion pic.twitter.com/9wFK2bJaN3 — Saj Sadiq (@Saj_PakPassion) June 10, 2018 -
జూ నుంచి తప్పించుకున్న క్రూర మృగాలు
బెర్లిన్: జూ నుంచి అయిదు క్రూర మృగాలు తప్పించుకున్నాయి. ఈ సంఘటన పశ్చిమ జర్మనీలోని లూనెబాక్ నగరంలోని ఐఫెల్ జూలో శుక్రవారం చోటుచేసుకుంది. సమాచారం పోలీసులకు తెలియడంతో ముమ్మర వేట కొనసాగిస్తున్నారు. జూ నుంచి తప్పించుకున్న వాటిలో రెండు సింహాలు, రెండు పులులు, ఒక జాగ్వార్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గురువారం రాత్రి సంభవించిన వరద కారణంగా క్రూర మృగాల సంరక్షణ కేంద్రంలోని ఇనుప కంచెలు విరిగిపోయాయని, ఇదే అదనుగా భావించి అవి తప్పించుకున్నాయని జర్మన్ మీడియా తెలిపింది. తప్పించుకున్న వాటిలో ఓ ఎలుగు బంటి కూడా ఉంది. అయితే అధికారులు ముందే అప్రమత్తమై దానిని కాల్చి చంపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జంతువులేవైనా కనబడితే సమాచారం అందించాలని కోరారు. అయితే ఎన్ని జంతువులు తప్పించుకున్నాయనే దానిపై అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరోవైపు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, పశువైద్యులు జూలో గాలింపు చర్యలు చేపట్టారు. 74 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జూలో సైబీరియన్ పులులు, సింహాలతో పాటు 60 రకాలైన సుమారు 400 జంతువులు ఉన్నాయి. రెండు సంవత్సరాల క్రితం తూర్పు జర్మనీలోని లీప్జిగ్లోని ఓ జూలో రెండు సింహాలు తప్పించుకోవడంతో అధికారులు ఒక దానిని కాల్చిచంపారు. మరో సింహాన్ని మత్తు ఇచ్చి సజీవంగా పట్టుకోగలిగారు. -
ఆదమరిస్తే..అపాయమే!
‘పులితో సెల్ఫీ దిగాలనుకో.. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు. అదే చనువిచ్చింది కదా అని ఆటాడాలనుకుంటే మాత్రం వేటాడేస్తది’ ఓ సినిమాలో హీరో డైలాగ్ ఇది. అయితే పులితోనే కాదు ఏ జంతువుతో అయినా సెల్ఫీలు, ఆటలు ప్రమాదమే. మచ్చిక చేసుకున్నవైనా, శిక్షణలోనివి అయినా.. క్రూర జంతువుల దగ్గర అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే. కాస్తంత పరధ్యానంగా ఉన్నా, సెల్ఫీల పేరుతో వాటితో ఆటలాడ్డానికి ప్రయత్నించినా అంతే సంగతులు. ఒక్కోసారి ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. అలాంటి వాటికి నిదర్శనంగా నిలిచే కొన్ని సంఘటనలివీ.. సింహానికి షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు.. ఇది రెండేళ్ల కిందట మన హైదరాబాద్‌లోనే జరిగింది. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి(35) నెహ్రూ జులాజికల్ పార్క్ సందర్శనకు వెళ్లాడు. అక్కడ సింహాలున్న ఎన్‌క్లోజర్ ప్రాంతంలోకి హఠాత్తుగా దూకాడు. అప్పటికే పీకల దాకా తాగేసి ఉన్న ఆ వ్యక్తి సమీపంలోని సింహాలను చూస్తూ షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకన్నట్లు చేయి చాపాడు. గమనించిన జూ నిర్వాహకులు వెంటనే సింహాల దృష్టిని మరల్చి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రక్షించారు. చిన్నారి తలను దొరకబుచ్చుకుంది సౌదీ అరే బియాలోని జెడ్డా లో జరిగింది ఈ సంఘటన. జెడ్డా స్ప్రింగ్ ఫెస్టివల్లో భాగంగా పదేళ్ల లోపు చిన్నారులు కొంత మంది ఓ జూ లోకి వెళ్లారు. అక్కడ శిక్షకుడి పర్యవేక్షణలోని ఓ సింహం(ఆరు నెలల వయస్సు) చుట్టూ మూగారు. సరదాగా దానితో ఆడుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఉన్నట్లుండి ఆ సింహం పిల్ల ఓ చిన్నారిపై దాడికి దిగింది. ఆ చిన్నారి తలను నోట కరుచుకుంది. దీంతో భయపడిన మిగిలిన పిల్లలు దూరం జరిగారు. శిక్షకుడు అతికష్టమ్మీద ఆ చిన్నారిని సింహం పిల్ల నుంచి విడిపించగలిగాడు. ఈ ఘటనలో చిన్నారికి ప్రాణాపాయం తప్పినప్పటికీ తలకు అక్కడక్కడా కుట్లు పడ్డాయి. ఎన్‌క్లోజర్‌లో దూకి బలయ్యాడు.. మన దేశ రాజధాని ఢిల్లీలో 2014లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో కలకలం సృష్టించింది. ఇక్కడి నేషనల్ జులాజికల్ పార్క్ సందర్శనకు వచ్చిన ఓ ఇరవయ్యేళ్ల యువకుడు హఠాత్తుగా పులుల ఎన్‌క్లోజర్‌లో దూకాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడున్న ఓ తెల్లపులి కంట పడ్డాడు. ఆ పులి ఓ పదిహేను నిమిషాలు అతనిపై దాడికి దిగలేదు. ఈ లోపు మిగిలిన సందర్శకులు దాన్ని బెదరగొట్టడానికి, దాని దృష్టిని మరల్చడానికీ రాళ్లు, నీళ్ల బాటిళ్లు విసర డం మొదలుపెట్టారు. ఈ క్రమంలో అది హఠాత్తుగా ఆ యువకుడి దగ్గరికి వెళ్లి పంజాతో దాడి చేసి చంపి లాక్కెళ్లింది. పులి దాడికి దిగుతుండగా ఆ యువకుడు నమస్కరిస్తూ ప్రాధేయపడిన వీడియో అప్పట్లో సామా జిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. జూ యజమానిపై దాడి.. ఇది రెండు వారాల కిందట దక్షిణాఫ్రికాలో జరిగింది. ఓ జూ నిర్వాహకుడు(85).. సందర్శకులకు జూ చూపిస్తుండగా సింహాల ఎన్‌క్లోజర్‌లో దుర్వాసన రావడం గమనించాడు. వెంటనే పరధ్యానంగా లోపలికి వెళ్లాడు. సమీపంలోనే ఓ సింహం ఉండడం గమనించి గేటు వైపు పరిగెత్తబోయాడు. ఈ లోపలే అతన్ని దొరకబుచ్చుకున్న సింహం..పంజాతో దాడికి దిగి లోపలికి లాక్కెళ్లింది. ఇంతలో సందర్శకుల్లో ఎవరో తుపాకీతో సింహాన్ని కాల్చడంతో ఆ జూ నిర్వాహకుడు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీసుకోవాల్సిన జాగ్రతలు: జూ, అడవుల సందర్శనకు వెళ్లినపుడు అక్కడి సిబ్బంది చెప్పే సలహాలు, సూచనలు తప్పక పాటించాలి. క్రూర జంతువులకు దగ్గరగా వెళ్లడం, వాటితో సెల్ఫీలు దిగాలనుకోవడం ప్రమాదకరం. అడవి జంతువులను రెచ్చగొట్టేలా ప్రవర్తించకూడదు. సింహాలు, పులులు లాంటి క్రూర జంతువులు ఉన్న ఎన్‌క్లోజర్స్‌లోకి వెళ్లకూడదు. జంతువులకు చేత్తో ఆహారపదార్థాలు తినిపించేందుకు ప్రయత్నించకూడదు. జంతువులను భయపెట్టేలా శబ్దాలు చేయకూడదు. పాటలు పెట్టకూడదు. చిన్నపిల్లలను ఒంటరిగా వదలి వెళ్లకూడదు. -
సాంబా.. చంపేయబోయింది
కేప్‌టౌన్ : మచ్చిక చేసుకున్నవైనా.. మన ఆధీనంలోనే ఉన్నా క్రూర జంతువుల దగ్గర చాలా జాగ్రతగా ఉండక తప్పదు. లేకపోతే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. దక్షిణాఫ్రికాలో తాజాగా జరిగిన ఓ సంఘటన ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. ఓ జూ యజమానిపై సింహం దాడికి దిగగా.. ఆయన అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. బ్రిటన్‌కు చెందిన మైక్ హాడ్జ్(67) కొన్నేళ్లుగా దక్షిణాఫ్రికాలోని లింపోపో ప్రావిన్స్‌లో మారకెలె శాంక్చురీ పేరుతో జూ నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ రకాల జంతువులతోపాటు సాంబా అనే పేరు గల సింహం ఉంది. గత సోమవారం (ఏప్రిల్ 30) జూకు వచ్చిన సందర్శకులకు వివరాలు చెబుతూ.. ఏదో దుర్వాసనను గమనించిన హాడ్జ్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లారు. అదే సమయంలో దూరం నుంచి సింహం రావడం చూసి సహాయం కోసం కేకలు వేస్తూ గేటు వైపు పరిగెత్తాడు. అయితే ఈ లోపలే ఆయన మీద సింహం దాడి చేసి పొదల్లోకి లాక్కెళ్లింది. ఆ తర్వాత కాసేపటికి సందర్శకుల్లో ఎవరో రైఫిల్‌తో కాల్చడంతో సింహం ఆయన్ని వదిలేసింది. తీవ్రంగా గాయపడిన ఆయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, సింహం నుంచి తప్పించుకునేందుకు హాడ్జ్ పరిగెత్తడం, సింహం ఆయన్ని నోట కరుచుకొని లాక్కెడం రికార్డయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
ప్రిడేటర్ పార్కులో సింహం పంజా..
కేప్‌టౌన్ : అనుకోకుండా స్థావరం వైపు వెళ్లిన వ్యక్తిపై సింహం దాడికి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికాలోని ప్రిడేటర్ జాతీయ పార్కులో ఓ వ్యక్తి దారి తప్పి వన్య ప్రాణుల పార్క్‌లోని సింహం ఎన్‌క్లోజర్‌లోకి వచ్చాడు. పారిపోతున్న అతడిని వెంబడించిన సింహం దాడి చేసింది. గత నెల 28న సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో ప్రకారం.. ఓ వ్యక్తి సింహం ఎన్‌క్లోజర్‌లోకి అకస్మాత్తుగా వచ్చాడు. ముందు సింహం ఉన్న చోటుకి ఎదురుగా వెళ్లాడు. అంతలోనే వెనక్కు పరుగెత్తుతూ కనిపించాడు. ఏం జరుగుతోంది అని తెలుసుకునే లోపే ఓ సింహం అతడిని తరమడం ప్రారంభించింది. ప్రాణ భయంతో అతను ‘కాపాడండి.. కాపాడండి’ అంటా అరవడం ప్రారంభించాడు. అతనిపై ఒక్కసారిగా విరుచుకుపడిన సింహం తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
సింహంతో ఆటలా.. జాగ్రత్త..
సౌదీ : వేటితోనైనా ఆటలాడొచ్చు కానీ ఈ క్రూర మృగాలతో ఆటలాడకూడదు. వాటి సంగతి తెలిసి కూడా వాటితో ఆటలు ఆడుకోవాలని చూస్తే ఇలాగే ఉంటది మరీ. వివరాల్లోకి వెళితే.. సౌదీ అరేబియాలోని జెడ్డాలో స్ప్రింగ్ ఫెస్టివల్ జరుగుతోంది. అక్కడ ఫెస్టివల్‌లోనే సింహాలు, పులులను కూడా ప్రదర్శనకు పెట్టారు. కాకపోతే అవి ఎన్‌క్లోజర్ ఉండి అందరినీ అలరిస్తున్నాయి. ఆ ఫెస్టివల్లో కొంతమంది పిల్లలు సింహాలతో ఓ ఆట ఆడుకోవానుకున్నారు. అందుకే సింహం ట్రైనర్‌ను పట్టుకొని ఎలాగోలా ఓ సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూరారు. అప్పుడు మొదలైంది అసలు సినిమా.. ట్రైనర్ అక్కడే ఉన్నాడని అది ఏం చేస్తుందిలే అన్న ధీమాతో సింహాన్ని ఆటపట్టిస్తున్నారు. ఇంతలోనే సింహానికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో ఓ అమ్మాయిని పట్టుకుంది. ఆ అమ్మాయిపై దాడి చేయబోయింది. దీంతో మిగితా పిల్లలు అరవడం మొదలు పెట్టారు. వెంటనే ట్రైనర్ ఆ సింహాన్ని పక్కకు లాగి ఆ అమ్మాయిని రక్షించాడు. ఈ విషయం ఫెస్టివల్ నిర్వాహకులకు తెలిసి పిల్లలను ఎన్‌క్లోజర్‌లోకి పంపించిన ట్రైనర్‌ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సింహంతో ఆటలా.. జాగ్రత్త !
-
సింహం ఎన్‌క్లోజర్‌లో దూకేశాడు..
తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురం జూలో బుధవారం కాసేపు భయోత్పాత వాతావరణం నెలకొంది. ఉన్నట్టుండి ఓ వ్యక్తి సింహపు ఎన్‌క్లోజర్‌లోకి దూకి సింహం వైపు దూసుకెళ్లాడు. పొద్దున్నే ఎవరి ముఖం చూశాడో గానీ సింహం అతనిని గమనించకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వ్యక్తి ఎన్‌క్లోజర్‌లో దూకడం గమనించిన వాచ్‌మన్ అలారం మోగించడంతో జూసిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే జూ సిబ్బంది చాకచక్యంగా సింహాన్ని ఎన్‌క్లోజర్‌లో ఉన్న గదిలోకి పంపించడంతో ప్రాణాపాయం తప్పింది. సిబ్బంది వెంటనే ఎన్‌క్లోజర్‌లోకి దిగి అతనిని పట్టుకున్నారు. ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి ఒట్టుప్పాలానికి చెందిన మురుగన్(45)గా గుర్తించారు. వెంటనే అతనిని చికిత్స నిమత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మురుగన్ ఎందుకు ఎన్‌క్లోజర్‌లోకి దూకాడనే వివరాలు మాత్రం తెలియాల్సిఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మతిస్థిమితం సరిగా లేక ఎన్‌క్లోజర్‌లోకి దూకాడా లేక ఆత్మహత్య చేసుకోవడానికే ఎన్‌క్లోజర్‌లోకి దిగాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
అమ్మగా మారి.. ఆలనా పాలనా..!
-
అమ్మగా మారి.. ఆలనా పాలనా..!
సాక్షి, వెబ్ డెస్క్ : ఫోటోలు చూసి ఆహారంతో సింహా ఆడుకుంటోందనుకుంటే మీరు పొరబడినట్లే..! ఔను. అడవి జంతువుల్లో రారాజుగా గుర్తింపు పొందిన సింహం ఓ చిన్న జింకపిల్లపై వల్లమాలిన ప్రేమను, ఆప్యాయతను పెంచేసుకుంది. ఓ మగ సింహం దాడిలో ఆడ సింహం కూనలు ప్రాణాలు కోల్పోయాయి. ఆ ఘటనతో తీవ్ర ఒత్తిడికి గురైన ఆడ సింహం.. అడవిలో ఒంటరిగా తన కంట పడ్డ జింక పిల్లను రక్షిస్తోంది. ఈ ఆడ సింహం జింక పిల్లపై సింహం కురిపిస్తున్న ప్రేమను ఫొటోగ్రాఫ్ గార్డన్ డొనోవాన్ తన కెమెరాలో బంధించారు. సింహాల ఫొటోలు తీయడం తనకు ఇష్టమని గార్డన్ చెప్పారు. అందులో భాగంగా జింక పిల్లను చంపడానికి వస్తున్న సింహాన్ని చిత్రించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, తాను ఎదురుచూసిన దానికి భిన్నంగా సింహం జింక పిల్లను సంరక్షించడం ప్రారంభించిందని చెప్పారు. నమీబియాలోని ఈటోషా జాతీయ పార్కులో ఈ సింహం, జింక పిల్ల ఉన్నాయి. -
వీళ్లు మామూళోల్లు కాదు.. ఏకంగా సింహాలతోనే..!
-
వీళ్లు మామూలోళ్లు కాదు.. ఏకంగా సింహాలతోనే..!
అహ్మదాబాద్: సింహాలను చూస్తేనే చాలామంది దడుసుకొని ఆమడ దూరం పారిపోతారు. కానీ కొందరు యువకులు మాత్రం సింహాలను చూసి వెర్రిగా ప్రవర్తించారు. సింహాలను బైకుల మీద వెంటాడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో కలకలం రేపుతోంది. గుజరాత్‌లోని ప్రముఖ గిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు బైకర్లు సింహాలను వెంటాడుతూ ఆ దృశ్యాలను తమ సెల్ఫోన్లో బంధించారు. మీదమీదకు వస్తున్న బైకర్ల నుంచి తప్పించుకునేందుకు ఓ సింహం, ఓ ఆడసింహం అడవిలోకి పారిపోయాయి. అమ్రేలి జిల్లాలోని అడవిలో చిత్రీకరించినట్టు భావిస్తున్న 34 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్బుక్లో, యూట్యూబ్‌లో ఈ వీడియోను హల్చల్ చేస్తున్న నేపథ్యంలో గుజరాత్ అటవీశాఖ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. బైకర్ల వివరాలు తెలుసుకొని.. వీడియో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. వీడియోలో ఒక బైక్ నంబర్ కనిపించడంతో ఈ వివరాల ఆధారంగా విచారణ చేపడుతున్నారు. -
సింహాన్ని పిల్లి ఎలా సవాల్ చేసిందో చూడండి!
టెక్సాస్: మృగరాజును సవాల్ చేయడం సాధ్యమేనా.. మనుషుల సంగతి పక్కన పెడితే.. ఏ జంతువు కూడా సింహాన్ని ఢీకొట్టే సాహసం చేయలేదు. అదుపుతప్పితే గజరాజు సైతం మృగరాజు చేతిలో చావు దెబ్బ తినాల్సిందే. అలాంటింది ఒక చిన్న పిల్లి సింహంపైకి తొడకొట్టి దూసుకెళ్లినంత పనిచేసింది. ఒక్కసారి కాదు.. పలుమార్లు సింహాన్ని రెచ్చగొట్టింది. పిల్లి వేషాలకు సింహం కూడా ఒకనొక సందర్భంలో భయపడిందంటే ఆశ్చర్యపోక తప్పదు. అసలు అంత ధైర్యంగా ఆ పిల్లి ఆ పని ఎలా చేసిందబ్బా అని అనుకుంటున్నారా? మరేం లేదు ఆ సింహం చుట్టూ ఇనుప కంచెను అల్లేసిన పెద్ద బోనులో ఉండిపోయింది. పిల్లి బోనుకు ఇవతల ఉంది. టెక్సాస్‌లో ఈ సంబ్రమాశ్చర్యం గొలిపే సంఘటన చోటుచేసుకుంది. టెక్సాస్‌లో ది సెంటర్‌ఫర్ యానిమల్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఉంది. అందులో దేరేక్ క్రాన్ అనే వ్యక్తికి బ్యాగీ అనే ఓ పెంపుడు పిల్లి ఉంది. దానిని గాండ్రుమని గర్జిస్తూ బోనులో తిరుగుతున్న నోయే అనే మృగరాజుపైకి ఉసిగొలిపి దేరేక్ విడిచిపెట్టాడు. దీంతో ఆ పిల్లి వేగంగా సింహంవైపు దూసుకెళ్లింది. అయితే, ఆ సింహం పిల్లిన భయపెడుదామనుకునే లోగానే పిల్లే ఆ పని చేసి సింహాన్ని కొన్ని సెకన్లపాటు అదిరిపోయి ఆగిపోయేలా చేసింది. యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు పలువురుని తెగ ఆకట్టుకుంటోంది. -
సింహం,మొసలి తలపడితే గెలుపెవరిది?
-
సర్కస్‌లో మాస్టర్‌పై సింహం దాడి
-
సర్కస్‌లో మాస్టర్‌పై సింహం దాడి
సర్కస్ ఈవెంట్లలో భాగంగా సింహంతో సర్కస్ చేయిస్తున్న రింగ్ మాస్టర్‌పై సింహం దాడి చేసింది. ఈ ఘటన ఫ్రాన్స్‌లోని డౌల్లెన్స్లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించన వీడియో ఫేస్బుక్లో వైరల్ అయింది. సర్కస్ చేయిస్తున్న మాస్టర్‌పై ఒక్కసారిగా దూకిన సింహం అతని ఛాతీ భాగంలో తీవ్రంగా గాయపర్చింది. ఇంతలో తేరుకున్న సర్కస్ నిర్వహకులు సింహంపైకి పొగను వదిలి మాస్టర్‌ను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన మాస్టర్‌ను ఆసుపత్రికి తరలించారు. మాస్టర్‌పై సింహం దాడి చేయడంతో షాక్‌కు గురైన ప్రేక్షకులు ఆ ప్రాంతం నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతం మాస్టర్ ఆరోగ్య పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్నట్లు సర్కస్ నిర్వాహకులు తెలిపారు. -
సింహంతో జడేజా మరో చెలగాటం..
ప్రముఖ ఇండియన్ క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సింహాంతో ఫోటోదిగి మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి మాత్రం బోణులో ఉన్న సింహంతో అతిసమీపంలోంచి ఈ ఫోటో దిగాడు. ఫెన్సింగ్లోపల ఉన్న సింహాన్ని జడేజా ముద్దాడడానికి ప్రయత్నిస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. క్యాప్షన్ కూడా అవసరం లేదనుకుంటా..అని రాసి మరీ ఫోటోతో పాటూ పోస్ట్ పెట్టాడు. ఇది వరకు కూడా జడేజా ఇలాంటి ఓ సాహసమే చేసి చిక్కుల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. గత ఏడాదిలో గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్ అండ్ సాంక్చ్యూరీ(జీఎన్పీఎస్)లో జడేజా, ఆయన భార్య రీవా సోలంకితో కలిసి జిప్సీలో తిరుగుతూ సింహాలను చూసి ఎంజాయ్ చేశారు. అయితే, అలా వెళుతున్న క్రమంలో మధ్య జిప్సీని ఆపి దిగడమే కాకుండా కొన్ని సింహాలకు 10 నుంచి 13 మీటర్ల దూరంలో తన భార్యతో కలిసి కూర్చొని తాఫీగా నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు. సెల్ఫీలు తీసుకొని సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అయితే, ఈ రకంగా ఫొటోలు దిగడం చట్ట వ్యతిరేకం కావడంతో గుజరాత్ అటవీశాఖ అధికారులు రూ.20,000 జరిమానా విధించారు. అయితే ఇలాంటి ఫోటోలు దిగడమే కాకుండా, సోషల్ మీడియాలో పెడుతూ.. మీరు ఇబ్బందులు పడటమే కాకుండా జూ సిబ్బందిని కూడా ఎందుకు ఇబ్బందిపెడుతున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. -
సింహగీత...
న్యూ ఇయర్ సింహం బొమ్మలు వేస్తుందా? ఈ సింహం వేస్తుంది. జపాన్‌లో ‘సీ లయన్’ల చేత ఫీట్లు చేయించడం, ప్రదర్శనకు పెట్టడం ఆనవాయితీ. పెంపుడు స్వభావం గల ఈ క్షీరదం కొద్దిపాటి శిక్షణతో భిన్న విన్యాసాలు చేయగలదు. 2017 సంవత్సరం రానుంది. జపాన్ వారి చాంద్రమానం ప్రకారం వారికి అది ‘కుక్కుట’నామ సంవత్సరమట. అంటే ‘కోడిపుంజు నామ సంవత్సరం’. ఆ సందర్భంగా జపాన్‌లోని యొకహామా ఆక్వేరియం (ప్రదర్శనశాల)లో సీ లయన్‌తో జపనీస్ భాషలో ‘కోడిపుంజు’ మాటలోని అక్షరాన్ని పేపర్ మీద రాయించారు. అది రాసింది కూడా. చూసేవాళ్లు ఇంత తెలివా అని ఆశ్చర్యపోయారు. సీ లయన్లు భారీ నీటి జంతువులు. ఒక్కోటీ దాదాపు 1000 కిలోల బరువు ఉంటుంది. 10 అడుగుల పొడవు ఉంటుంది. వీటికి తిండి పిచ్చి. ప్రతి తడవకు దాదాపు 15 కిలోల ఆహారాన్ని గుటుక్కుమనిపిస్తాయి. అలాస్కా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీరాల్లో వీటి ఉనికి ఎక్కువ. అయితే అన్నీ జీవాల లానే వీటి సంఖ్య కూడా పడిపోతోంది. సీ లయన్స్ ‘పొలాక్’ అనే జాతి చేపలను తిని జీవిస్తాయి. అయితే చేపల వేటగాళ్లు ఇవే పొలాక్‌లను విస్తారంగా పట్టడం వల్ల సీ లయన్స్‌కు ఆహారం లేకుండా పోతోంది. మనుషులు గోల చేసి ఒత్తిడి పెంచినా, అంతరాయం కలిగించినా సీ లయన్స్ తాము ఉన్న తావును మార్చుకొని దూరం వెళ్లిపోతాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రస్తుతం వీటిని చూడడం ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. అతిథులను చూడగానే మగ సీ లయన్ పెద్దగా వేసే ఊళ విని ఆనందించవచ్చట. -
’నన్ను అలా ఎప్పుడూ చూసి ఉండరు’
లాస్ ఎంజెల్స్: తన రానున్న చిత్రం కోసం పూర్తిగా ఆహార్యాన్ని మార్చుకున్నట్లు బ్రిటన్ ప్రముఖ నటుడు, స్లమ్ డాగ్ మిలినీయర్ తో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన నటుడు దేవ్ పటేల్ చెప్పాడు. లయన్ చిత్రం కోసం తన జుట్టు, గడ్డం పెంచానని, ఈ చిత్రంలో పెద్దవాడిలా కనిపిస్తానని తెలిపాడు. ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ చూడని విధంగా తనను చూస్తారని, ఆ మేరకు దర్శకుడు తనను మార్చాడని చెప్పారు. బ్రిటన్ దర్శకుడు గార్త్ డావిస్ దర్శకత్వంలో లయన్ అనే చిత్రంలో దేవ్ పటేల్ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను దేవ్ మీడియాకు చెప్పారు. ’ మేం నీతో సినిమా చేయాలంటే ముందు నిజంగా నిన్ను పూర్తిగా మార్చాలని ఆడిషన్ తర్వాత డేవిస్ చెప్పారు. దేవ్ పటేల్ ను ఇంతవరకు ఎవరూ చూడని విధంగా చూపించాలనుకుంటున్నానన్నారు. నిజంగా దాంతో పూర్తి మనిషిలా మారాను. వచ్చే ఎనిమిది నెలలపాటు ఎలాంటి డేట్లు ఇవ్వొద్దని వెంటనే నా వ్యక్తిగత మేనేజర్ కు చెప్పాను. లయన్ లాంటి చిత్రాల్లో నటించే అవకాశం చాలా అరుదుగా మాత్రమే వస్తుంది. ప్రతిసారి ఇలాంటివి రావు’ అని దేవ్ చెప్పాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 25న విడుదల కానుంది. -
వైరల్ వీడియో: గల్లీల్లో ఠీవీగా నడుస్తూ..!
ఎవరూలేని ఓ నిర్మానుష్య రాత్రి.. వీధుల్లో ఓ సింహం ఒంటరిగా ఠీవీగా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యం ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. గుజరాత్‌లోని జునాగఢ్ జిల్లాలో సింహం ఒకటి జనావాసాల్లోకి ప్రవేశించింది. అయితే, రాత్రి సమయం కావడంతో జనాల కంట్లో అది పడలేదు. గాఢనిద్రలో అందరూ నిద్రిస్తున్న సమయంలో అది వీధుల్లో ఠీవీగా సంచరించింది. ఓ వ్యక్తి అత్యంత చాకచక్యంగా సింహం కంటపడకుండా అది సంచరిస్తున్న దృశ్యాన్ని తన సెల్ఫోన్లో బంధించాడు. అతను సోషల్ మీడియాలో పోస్టుచేసిన ఈ వీడియో హల్చల్ చేస్తోంది. జునాగఢ్ ప్రాంతం గిర్ అడవి జాతీయ పార్కుకు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి చేరువలో ఉంటుంది. ఇక్కడ ఆసియా సింహాలు అధికంగా ఉంటాయి. ఇవి అప్పుడప్పుడు జనావాసాల్లో ఇలా సంచరించడం కూడా ఇక్కడి స్థానికులకు మామూలు విషయమే! -
గల్లీల్లో ఠీవీగా నడుస్తూ..!
-
సింహం వదిలినా.. చట్టం వదల్లేదు!
సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ముకేశ్‌కు జైలు హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులో సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకి సింహాన్ని రమ్మంటూ హల్చల్ చేసిన ముకేశ్‌కు కోర్టు శనివారం జైలు శిక్ష ఖరారు చేసింది. ఎర్రమంజిల్ కోర్టు న్యాయమూర్తి.. నాలుగు నెలల నాలుగు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 100 జరిమానా విధించారు. వివరాలను దక్షిణ మండలం డీసీపీ వి. సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. బిహార్ ప్రాంతానికి చెందిన ముకేశ్(35) బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి నాగోల్‌లో ఉంటున్నాడు. ఈ ఏడాది మే 22న జూపార్కుకు వచ్చి సింహాల ఎన్క్లోజర్ను చూస్తూ మద్యం మత్తులో అందులోకి దూకాడు. జూ సిబ్బంది పాపయ్య, బషీర్, సింగ్, సారుు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి శివలు చాకచాక్యంగా వ్యవహరిస్తూ సింహాల దృష్టి వేరే వైపు మళ్లించి ముకేశ్‌ను రక్షించారు. పోలీసులు ముఖేశ్‌పై ఐపీసీ 448, 38 సెక్షన్లతో పాటు అటవీ యాక్ట్ 1972 చట్టం కింద కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి రిమాండ్‌లో ఉన్న అతనికి న్యాయమూర్తి శనివారం శిక్ష ఖరారు చేశారు. -
ఏ దేవుడు కరుణించాడో బతికిపోయా!
కెరమెరి: ఎదురుగా పది అడుగుల దూరంలో సింహం. కదలకుండా బొమ్మలా కూర్చుండి పోయాడు.. గంటసేపు సేపు ఊపిరి బిగబట్టి ఓ రైతు ప్రాణాలు రక్షించుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం చిన్నగూడలో బుధవారం చోటు చేసుకుంది. కేస్లాగూడ(ఏ) గ్రామానికి చెందిన సిడాం భీంరావు చిన్నగూడ శివారులోని తన పొలంలో బుధవారం ఉదయం ఎడ్లను మేపుతూ గట్టుపై కూర్చున్నాడు. ఒక్కసారిగా అక్కడకొచ్చిన సింహం గాండ్రిం చింది. పది అడుగుల దూరం నుంచి గుర్రుగా చూస్తూ నిలబడిపోయింది. సింహం దగ్గరికి వచ్చేసరికి ఆ రైతు చచ్చేంత భయపడిపోయాడు. అయినా కదలకుండా.. మెదలకుండా అలాగే ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత సింహం వెనక్కి వెళ్లింది. దీంతో రైతు భీంరావు వెంటనే మైదాన ప్రాంతంలోకి వచ్చాడు. రైతును గమనించిన సింహం మళ్లీ అతడి వద్దకు వచ్చింది. మళ్లీ భీంరావు కదలకుండా ఉండడంతో చుట్టూ తిరిగింది. ఇంతలోనే అటువైపుగా ఓ మేకల మంద రావడంతో సింహం వాటిపైకి లంఘించి ఓ మేకను నోట పట్టుకుని పరుగెత్తింది. భీంరావు గ్రామంలోకి వెళ్లి చెప్పడంతో గ్రామస్తులు వచ్చి వెతికారు. ‘సింహం ఎదురుపడగానే, ఇదే నా చివరి రోజని భగవంతునితోపాటు ఇంటి వాళ్లందరినీ స్మరించుకున్నా. ఏ దేవుడు కరుణించాడో బతికి బయటపడ్డా..’ అని భీంరావు తెలిపాడు. ‘‘నా కళ్ల ముందే మేక పిల్లను సింహం నోట్లో పట్టుకుని వెళ్లింది. ఇటువైపు రావాలంటేనే భయమేస్తోంది.’’ అంటూ జుగాదిరావు అనే రైతు తెలిపాడు. -
మరో భారతీయ కథతో దేవ్ పటేల్
స్లమ్ డాగ్ మిలియనీర్, ద మ్యాన్ హు నో ఇన్ఫినిటీ లాంటి భారతీయ నేపథ్యం ఉన్న చిత్రాలతో ఆకట్టుకున్న బ్రిటీష్ నటుడు దేవ్ పటేల్, మరో భారతీయ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సరూ బ్రియర్లీ అనే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన లయన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఏ లాంగ్ వే హోం నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గార్త్ డేవిస్ దర్శకుడు. కలకత్తా వీదుల్లో తప్పి పోయిన ఓ ఐదేళ్ల కుర్రాడు, ఓ ఆస్ట్రేలియా కుటుంబం చేరదీసే వరకు ఎలాంటి కష్టాలు పడ్డాడు. వేల కిలోమీటర్లు ఎలా ప్రయాణించాడు. 25 ఏళ్ల తరువాత జీవితంలో స్థిరపడిన ఆ యువకుడు తిరిగి తన గతాన్ని గుర్తు చేసుకోని తన కుటుంబం కోసం ఎలాంటి అన్వేషన సాగించాడు అన్న కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ నవంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. హాలీవుడ్ నటులు నికోలే కిడ్మన్, రూనీ మారా, డేవిడ్ వెన్హామ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే అంతే..
కుమమోటో భూకంపం జపాన్ ను కుదిపేసిన విషయం తెలిసిందే. అటువంటి ప్రకృతి బీభత్సాలు జరిగినప్పుడు జనం ఏ వార్త విన్నా నమ్మే అవకాశం ఉంటుంది. అదే అదనుగా తీసుకున్న ఓ వ్యక్తి.. ఓ కాల్పనిక కథను సృష్టించి ఫోటోతోపాటు ట్విట్టర్ లో పోస్టు చేసి అరెస్టయ్యాడు. ఆన్ లైన్లో అసత్య కథనాలు పోస్టు చేస్తే శిక్షతప్పదని జపాన్ పోలీసులు మరోసారి నిరూపించారు. కుమమోటో భూకంపం తర్వాత ట్విట్టర్లో రూమర్లు పోస్టు చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. కనాగావాకు చెందిన 20 ఏళ్ళ వ్యక్తి.. ట్విట్టర్ లో ఓ సింహం చిత్రాన్ని పోస్ట్ చేసి, అది కుమమోటో వీధుల్లో తిరుగుతున్నట్లు చెప్పి జనాన్ని నమ్మించాడు. ఏప్రిల్ 14న కుమమోటోలో సంభవించిన వినాశకరమైన భూకంపం తర్వాత.. అసలే ప్రాణభయంతో ఉన్న ప్రజలను వీధుల్లో సింహం తిరుగుతోందన్న పుకారు నిజంగానే భయభ్రాంతులకు గురి చేసింది. భూకంపం ప్రభావంతో జ్యూ నుంచి తప్పించుకున్న సింహం.. కుమమోటోలోని మా ఇంటి దగ్గరలో కనిపించింది అంటూ ఓ సింహం చిత్రాన్ని పోస్టు చేయడంతోపాటు.. తన పోస్టుకు టైటిల్ కూడా పెట్టాడు. ఇంకేముందీ అసలే భూకంపం భయంతో వణికిపోతున్న ప్రజలు.. అతడు పోస్ట్ చేసిన ట్వీట్ ను 17000 సార్లు రీ ట్వీట్ చేయడంతోపాటు... కుమమోటో జ్యూ అండ్ బొటానికల్ గార్డెన్ కు వందలకొద్దీ ఫోన్లు చేసి, తప్పించుకున్న సింహం గురించి ఆరా తీశారు. ట్విట్టర్ పోస్టుతో సింహం వార్త కలకలం సృష్టించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సింహం వార్త పోస్టు చేసిన వ్యక్తి గురించి ఆరా తీశారు. చివరికి అదంతా తప్పుడు సమాచారం అని నిర్థారించారు. అతడు పోస్టు చేసిన ఫోటో.. సౌత్ ఆఫ్రికా కు చెందిన ఓ చిత్రంలోని దృశ్యంగా తెలుసుకున్నారు. ప్రాక్టికల్ జోక్ వేసి జనాల్ని భయపెట్టినందుకు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. పుకార్లు పుట్టించేవారిని అరెస్టు చెయ్యడం బహుశా ఇదే మొదటిసారి అని స్థానిక మీడియా చెప్తోంది. నిజానికి అటువంటి పుకార్లు పోస్టు చేయడం ఒక్కోసారి తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని, అదీ ఇంటర్నెట్, వెబ్ సైట్లలో పోస్టు చేసే వార్తలు ఒక్క జపాన్ వరకే పరిమితం కాక, ప్రపంచం దృష్టి సారిస్తాయన్న కారణంతో మరోసారి ఎవ్వరూ అటువంటి తప్పు చేయకుండా ఉండేందుకు సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అసత్య కథనాల ప్రచారం ఎవరు చేసినా శిక్ష తప్పదని తెలిసేలా చేశారు. -
నాయకీ... సందడే లేదు
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన త్రిష, రీ ఎంట్రీలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతోంది. పెళ్లి ఆగిపోవటంతో తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టిన చెన్నై చిన్నది మంచి కమర్షియల్ హిట్ ఇవ్వటంలో మాత్రం ఫెయిలవుతోంది. ఒక్క లయన్ తప్ప రీ ఎంట్రీలో ఈ బ్యూటి నటించిన ఏ సినిమా కూడా భారీ కమర్షియల్ హిట్ అనిపించుకోలేకపోయింది. తాజాగా రూట్ మార్చిన ఈ బ్యూటి గ్లామర్ రోల్స్‌ను పక్కన పెట్టి లేడి ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. చాలా కాలంగా తన దగ్గర మేనేజర్‌గా పనిచేస్తున్న గిరిధర్ నిర్మాణంలో నాయకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 8న రిలీజ్‌కు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం వేగం పెంచలేదు. ఇప్పటికే ఆడియో రిలీజ్ అయినా మీడియాలో నాయకీ సందడి కనిపించటం లేదు. చీకటి రాజ్యం సినిమా తరువాత వెండితెర మీద కనిపించని త్రిష నాయకీ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. కానీ చిత్రయూనిట్ ప్రమోషన్ విషయంలో వ్యవహరిస్తున్న తీరుతో త్రిష గుర్రుగా ఉందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. -
బాల నేరస్థులుగా గుర్తించి వదిలేశారు!
గుజరాత్ లో ముగ్గురిని చంపిన ఘటనలో మూడు సింహాలను అరెస్టు చేసిన ఘటనలో రెండింటిని బాల నేరస్తులుగా గుర్తించిన అధికారులు వాటిని ప్రొబేషన్ లో వదిలేసేందుకు నిర్ణయించారు. ముగ్గురు గ్రామస్థులను చంపిన కేసులో గుజరాత్ గిర్ నేషనల్ పార్కులోని మూడు సింహాలకు తీవ్రమైన పనిష్మెంట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. వాటికి జీవిత ఖైదును విధించేందుకు సిద్ధం చేశారు. అందులో భాగంగా వాటిని అబ్జర్వేషన్ లో ఉంచారు. కాగా దోషులుగా భావించిన మూడు సింహాల్లో రెండు చిన్న పిల్లలని తెలుసుకున్న అధికారులు జువైనల్స్ గా గుర్తించి వాటికి శిక్షను లేకుండా చేశారు. గుజరాత్ అభయారణ్యంలో ముగ్గురు మనుషులను చంపి తిన్న సింహాలకు జీవిత ఖైదు వేసేందుకు అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో రెండు బాల నేరస్తులని గుర్తించారు. ఓ మగ సింహం మనిషిని చంపి తినగా, మిగిలినవి అది మిగిల్చిన మాంసాన్ని మాత్రమే తిన్నాయని గమనించిన గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్, వాటికి ప్రొబేషన్ ఇచ్చి తిరిగి సాసన్ గ్రామానికి దగ్గరలోని అడవుల్లో వదిలేయాలని నిశ్చయించింది. అయితే ఆరెండు సింహాలూ అడవిలో ఒకదానికి ఒకటి కలవకుండా ఉండేట్లు చేసి వాటి ప్రవర్తనను కొంతకాలం పరిశీలిస్తామని ఫారెస్ట్ అధికారి ఏపీ సింగ్ తెలిపారు. గత మూడు నెల్ల కాలంలోనే అంబార్ది ప్రాంతంలో నిద్రిస్తున్న వారిపై దాడికి దిగుతున్న సింహాలు ముగ్గురిని హతమార్చడంతో పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకొని, మొత్తం 17 సింహాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే వాటిలో మూడింటిని దోషులుగా తేల్చినా, వాటిలో రెండు బాల నేరస్తులుగా గుర్తించి వాటిని అడవుల్లో వదిలేందుకు సిద్ధం చేశారు. -
పసివాడిపై ఆ సింహానికి అంతకోపమెందుకొచ్చిందో..!
టోక్యో: మనకు తెలియకుండానే మన వెనుకాలే ఎవరో గుట్టుచప్పుడు కాకుండా అడుగులు వేస్తున్నారంటేనే కొంత గుండెల్లో వణుకు పుడుతుంది. అలాంటిది ఒక సింహం అడుగులేస్తే.. అది కూడా తొలుత నెమ్మది ఆ తర్వాత రాకెట్ వేగంగా అమాంతం మీదపడ్డట్లుగా. ఒక బుల్లి బాలుడికి ఇలాంటి అనుభవం ఎదురైంది. అయితే, ఆ సింహం వస్తుందన్న ఆలోచన ఆ బాలుడికి లేదు.. ఆ అడుగుల చప్పుడు వినిపించలేదు.. ఆ సింహం వచ్చి మీద పడలేదు. ఎందుకంటే ఆ సింహానికి బాలుడికి మధ్య ఓ బలమైన గాజుఫలకమే అతడికి శ్రీరామ రక్షలాగా నిల్చుంది. లేదంటే ఆ భారీ సింగానికి అతడు కోడిపిల్లమాదిరిగా నలిగిపోయేవాడు. ఈ ఘటన జపాన్‌లోని చిబా అనే ఓ జూలో చోటు చేసుకుంది. సీసీకెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాన్ని చూసి సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉలిక్కిపడ్డారు. సీసీటీవీలో రికార్డయిన ప్రకారం ఓ రెండేళ్లబాలుడు ఓ సింహాన్ని గాజు ఫలకం ఎన్ క్లోజర్ నుంచి తీక్షణగా చూశాడు. ఆ సమయంలో సింహం కూడా ఎంతో వినమ్రంగా వెనక్కి అడుగులు వేసి రెండు కాళ్లు ముందుకు చాపి ఓ పదడుగుల దూరంలో బుద్ధిగా కూర్చుంది. కానీ, దాని చూపు చూస్తే మాత్రం దాడికి సిద్ధమయిందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అలా సింహాన్ని చూసిన బాలుడు వెనక్కి తిరిగాడో లేదో క్షణం కూడా ఆలస్యం చేయని ఆ సింహం అమాంతం లంఘించి ఆ బాలుడిపైకి వచ్చి మధ్యలో ఉన్న గాజు ఫలకాలనికి బలంగా తగిలింది. ఆ వెంటనే బాలుడిని అందుకోవాలన్న ఆక్రోశంతో పదేపదే గాజు ఫలకాన్ని తట్టింది. ఆ సమయంలో ఓసారి వెనక్కి తిరిగి చూసిన బాలుడు అదిరిపడ్డాడు. ఇలా అక్కడ గాజు ఫలకం ఉందనే విషయ కూడా మరిచి ఆశపడిన సింహం వ్యూహం బెడిసికొట్టింది. -
సింహ‘బలుడు’
హ్యూమర్‌ప్లస్ భార్యకంటే సింహమే మేలని తలంచిన సుబ్బారావు ఒకరోజు జూకి వెళ్లి సింహాల ఎన్‌క్లోజర్‌లో దూకాడు. హఠాత్తుగా తమ ముందు దూకిన ప్రాణిని చూసి సింహం జడుసుకుని ఒక అడుగు వెనక్కి వేసింది. జీవితాన్ని ఈదడం కంటే నీటి గుంతను ఈదడం సులువని భావించిన సుబ్బారావు ఎన్‌క్లోజర్ చుట్టూ వున్న కందకం లోంచి ఈదుకుంటూ వెళ్లి సింహం ముందు నిలబడ్డాడు. ‘‘చూపులు కలిసిన శుభవేళ...’’ అని పాడుకుంటూ సింహానికి షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. అది వెనక్కి తగ్గి ఆలోచనలో పడింది. ‘‘నేను సింహమని తెలిసే వచ్చాడా? తెలియక వచ్చాడా? తెలిసే వస్తే వీడు మహా ధైర్యవంతుడు, వీడ్నేం చేయలేం. తెలియక వచ్చినా ఏమీ చేయలేం. ఎందుకంటే సింహమంటే తెలియనివాడ్ని సింహం ఎలా భయపెట్టగలదు?’’ అని పరిపరి విధాల యోచించింది. అది జూ సింహం. టైంసెన్స్ ఎక్కువ. సమయానికి భోజనం దొరుకుతుంటే మెదడు వేగంగా పనిచేస్తుంది. ఇదంతా దూరం నుంచి మగసింహం చూసింది. తన భార్య ఎదురుగా ఒక మనిషి నిలబడడమా? వీడెవడో సింహస్వప్నంలా ఉన్నాడే అనుకుంటూ సింహావలోకనం చేసుకుంది. పురుషుడు, పౌరుషం ఈ రెండూ వేర్వేరు విషయాలని తెలిసినా, భార్య ముందు నోరు తెరవక చాలాకాలమైనందువల్ల, అవకాశం వచ్చింది కదా అని గర్జించడానికి ప్రయత్నించింది. ఆడసింహం గుర్రున చూసేసరికి ‘మియ్యావ్’ అని సౌండ్ చేసింది. ‘‘వేట గురించి వినడమే తప్ప, ఇంతవరకూ ఆడలేదు... అందుకని..’’ అని నసిగింది మగసింహం. ‘‘మీ తాత ముత్తాతలు కూటికి గతిలేనివాళ్ళు కాబట్టి వేటాడారు. మనకేం ఖర్మ. మూడుపూట్ల తిండి మన దగ్గరకే వచ్చేస్తూ వుంది. కాకపోతే ప్రతిరోజూ నానా చెత్తవెధవల్ని మనకు తెచ్చి చూపిస్తారు. వాళ్లలో వీడొకడు’’ ‘‘సుబ్బారావు ఉత్సాహంగా సింహాలతో ఒక సెల్ఫీ తీసుకుని, ఆ సింహం జూలుతో జడ వేయబోయాడు. మరో సింహం దువ్వెన కూడా తెచ్చి ఇచ్చింది. ‘‘సింహాలు దువ్వెన కూడా వాడతాయా?’’ అడిగాడు. ‘‘కయ్యానికి కాలు దువ్వడం ఎప్పుడో మానేశాం. ఇలా పేలు చూసుకుంటూ జుత్తు దువ్వుకుంటున్నాం...’’ ఇంకా ఏదో చెప్పబోతుండగా ఆడసింహం ఒక చూపు చూసింది. మగసింహం మియ్యావ్ అంది. ‘‘అదేంటి?’’ ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బారావు. ‘‘పెళ్లి తరువాత ఎవడైనా పిల్లే’’ ఇంతలో బయట జనం గట్టిగా కేకలు పెట్టసాగారు. ‘‘బాబ్బాబూ, ట్రేలో తెస్తే తప్ప ఏదీ తినం మేము. మా పరువు తీయకుండా వళ్లిపో’’ అని బతిమలాడితే సుబ్బారావు మళ్లీ ఈదుకుంటూ బయటికి వచ్చాడు. టీవీల వాళ్ళంతా సుబ్బారావు పైకి సింహాల్లా దూకారు. ‘‘ఎందుకు చనిపోవాలనుకున్నావ్?’’ ‘‘పెళ్ళాం వేధిస్తూ వుంది’’ ‘‘ఎలాంటి వేధింపులు’’ ‘‘కుడివైపు తిరిగితే ఎడమ అంటుంది. లెఫ్ట్ తిరిగితే ముందుకి, ముందుకు తిరిగితే వెనక్కి నడవమంటుంది. వెనక్కి నడిస్తే గాల్లో ఎగరమంటుంది’’ ‘‘ఎడ్డెమంటే తెడ్డెమన్నమాట’’. ‘‘తెడ్డెం కాదు, తెడ్డు కట్టెతో బాదుతుంది’’ ‘‘తిరగబడకపోయావా?’’ ‘‘బడ్డాను. రెండుసార్లు ఎమర్జెన్సీ వార్డులో చేరాల్సి వచ్చింది.’’ ఇంతలో బడితెపూజ మహిళా సంఘం వాళ్ళు వచ్చారు. ‘‘దుర్మార్గుడా? భార్యల్ని భర్తలు వేధించడమే హిస్టరీ, భర్తల్ని భార్యలు వేధించడం మిస్టరీ. నువ్వే వేధిస్తున్నావని మీ ఆవిడ కంప్లయింట్ ఇచ్చింది. ఈ అవమానం భరించలేక తాను కూడా సింహాల ఎన్‌క్లోజర్‌లో దూకుతానని పరిగెత్తుకుంటూ జూకి వెళ్ళింది’’ అన్నారు.సుబ్బారావు ఉలిక్కిపడి ‘‘రక్షించండి’’ అని అరిచాడు. ‘‘భార్యపైన అంత ప్రేమ ఉన్నవాడివి, ఎన్‌క్లోజర్‌లో ఎందుకు దూకావు’’ ‘‘నేను రక్షించమంటున్నది సింహాల్ని’’ - జి.ఆర్. మహర్షి -
బ్రూటల్ రివేంజ్
శత్రువులు రౌండప్ చేశారు.. ఇటు గుండె వేగం పెరిగింది. వాళ్ల కాళ్లు కదులుతున్నాయి.. ఇవతల మైండ్ హీట్ పీక్స్ కు చేరింది. వాడు దూకేశాడు.. అంతసేపు తనతో కలిసి గడ్డిమేసినవాణ్ని దారుణంగా గాయపరిచాడు. అంతే తెగింపు తన్నుకొచ్చేసింది. అవతలిది అడవికి రాజు కావచ్చు, కానీ ప్రాణంకోసం పాకులాటలో అవేవీ పట్టింపుకాదు. గెలిచామాలేదా అన్నది పాయింటే కాదు. బతికామా లేదా అన్నదే ముఖ్యం. దున్నపోతు కాలు దువ్వింది, బ్రూటల్ రివేంజ్ కు సిద్ధమైంది. కట్టడిచేసిన సింహం మూకపైకి ఒక్కసారిగా లంఘించింది. తనతోపాటు దున్నపోతుల బృందాన్ని కాపాడుకునేందుకు సింహాలతో శక్తికిమించి పోరాడింది. కొమ్ములతో వాటిని చీల్చిచెండాడింది. ఎత్తికుదేసింది. కానీ టైమ్.. ఆ టైమ్ సింహాలది. ఒక్క దున్నపోతు పోరాడుతుంటే సహాయానికి రాకుండా విడివిడిగా నిల్చున్న మిగతా దున్నపోతులపై సింహాలు కలిసికట్టుగా దాడిచేశాయి. తోటి జీవులు చనిపోవటాన్నిచూసి.. పోరాడుతోన్న దున్నపోతు సత్తువ నీరుగారిపోయింది. చివరికి సింహాలదే పైచేయి అయింది. దున్నపోతుల గుంపులో సగానికి సగాన్ని హతమార్చాయి. మిగతా సగం పారిపోయాయి. దక్షిణాఫ్రికాలోని ప్రఖ్యాత రిజర్వు ఫారెస్ట్ మలామలాలో చోటుచేసుకున్న ఈ దృశ్యాలను బ్రెజిల్ కు చెందిన మహిళా ఫొటోగ్రాఫర్ మారియాంజెలా లీ ఎంతోసాహసోపేతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో అందరినీ ఆకర్షిస్తున్నాయి. -
రారాజు రెచ్చిపోయి.. చచ్చిపాయే!
కెన్యా: కెన్యాలోని ఐసిన్యాలో అంబోస్లే జాతీయ పార్క్‌లో ఓ సింహం తప్పించుకుంది. పక్కనే ఉన్న జనావాసాలపై విరుచకపడింది. రెచ్చిపోయి కనిపించిన వారిపై తన వాడీయైన పంజాను విసిరింది. ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచింది. దాన్ని బంధించాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అటవీ శాఖ అధికారులు దాన్ని కాల్చి చంపేశారు. ఇటీవల జరిగిన ఆ సంఘటన తాలుకు చిత్రాలే ఇవీ.. -
ఆలయానికి జరిమానా వేశారు!
బీజింగ్: సింహాలను ఉంచారన్న ఆరోపణలతో ఓ దేవాలయానికి జరిమానా విధించారు. ఈ ఘటన చైనాలో శనివారం చోటుచేసుకుంది. షాంగ్ఘీ ప్రాంతంలోని ఓ బౌద్ధ దేవాలయంలో కొన్నేళ్లుగా సింహాన్ని ఉంచుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు దేవాలయానికి దాదాపు రూ.30 వేలు జరిమనా విధించారు. ఆలయంలో ఉన్న సింహాన్ని 'జూ'కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2010లో ఈ దేవాలయానికి రెండు సింహాలను అప్పగించగా, ఓ సింహం అనారోగ్యంతో చనిపోయింది. రెండో సింహం ఆలయంలో ఉండిపోయింది. సింహాన్ని ఆలయప్రాంగణంలో ఎందుకు ఉంచుతున్నారని అధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా సింహాన్ని ఆలయంలో బంధించడం విషయంపై విచారణ ప్రారంభించారు. -
సింహాలకు దేవుడు లేడా?
'ఒకడు స్వర్గం చూడాలంటే వాడు కచ్చితంగా మరణించాలి' అని బైబిల్ సామెత. ఇలాంటివే తెలుగు సినిమాల్లోనూ వినబడతాయ.. 'గన్ చూడాలనుకో తప్పులేదు.. కానీ బుల్లెట్ చూడాలనుకోకు చచ్చిపోతావ్' లాంటివి. జననం, మరణం, దైవం, కార్యం కాంబినేషన్లో చెప్పుకోవడానికి బోలెడు డైలాగులున్నాయి మనకు. పాపం ఇలాంటివి ఏ ఒక్కటైనా చెవికి ఎక్కితే అలెక్ క్షేమంగా ఉండేవాడు. ఇంతకీ మనవాడు ఏం చేశాడంటే.. దక్షిణాఫ్రికాకు చెందిన అలెక్ ఎన్ డీవానె క్రైస్తవ మతబోధకుడు. తన ప్రార్థనాశక్తిని నలుగురికీ చూపించుకోవాలనే ఆలోచనతో ఏకంగా సింహంతో ప్రాక్టికల్ చేయబోయాడు. ప్రఖ్యాత కుర్గెర్ సఫారీ పార్కులోకి వెళ్లి.. సింహాలగుంపు ముందు నిల్చొని.. 'దేవుడు నిజంగా శక్తిమంతుడైతే ఈ సింహం నన్నేమీ చెయ్యదు' అంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. అరుపులకు బెదిరిపోయిన సింహాలు అలెక్ వైపు కోపంగా దూసుకొచ్చాయి. అప్పుడు గానీ పూర్తిగా అర్థంకాలేదు మనోడికి.. 'దైవశక్తిని నమ్మాలే గానీ వాస్తవావాస్తల జోలికి వెళ్లకూడదు' అని! అయితే జ్ఞానోదయం అయినంత ఫాస్ట్ గా కాళ్లు పనిచేయలేకపోవడంతో క్రూరజంతువులకు దొరికిపోయాడు. పరుగుపెట్టే ప్రయత్నంలోఉన్న అతనిపై ఓ సింహం పంజా విసిరింది. అంతే, ఒక్క దెబ్బకు పిరుదుల ప్రాంతం నుంచి అరకేజీ మాంసం ముద్ద ఊడిపడింది. జూ సంరక్షుడు తుపాకి పేల్చకుండా ఉండేదుంటే అలెక్ ప్రాణాలు ఈపాటికి గాల్లో కలిసిపోయి ఉండేవి. ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అలెక్.. 'జంతువులపై తనకున్న ఆధిపత్యాన్ని భగవంతుడు నా ద్వారా నిరూపించాలనుకున్నాడు' అని తన చర్యను సమర్థించుకుంటున్నాడు. ఓ గాడ్..! -
పవన్ కళ్యాణ్‌తో లయన్ డైరెక్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చాడు. కేవలం ఒక్క సినిమా.. అది కూడా బిలో యావరేజ్ సినిమా చేసిన దర్శకుడితో సినిమా చేయనున్నాడన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ హీరోగా లయన్ సినిమాను తెరకెక్కించిన సత్యదేవ, పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడట. ఈ విషయాన్ని సత్యదేవ స్వయంగా ప్రకటించారు. గతంలో దాసరి నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా ఉంటుందని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ సినిమా కోసం సత్యదేవ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ 101 సినిమా కూడా తానే డైరెక్ట్ చేస్తానంటూ ప్రకటించాడు సత్యదేవ. పవన్ ప్రస్తుతం సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తరువాత సత్యదేవతో సినిమా చేస్తాడేమో చూడాలి. -
పులి రాకతో ముగ్గురికి ముచ్చెమటలు!
-
పులి రాకతో ముగ్గురికి ముచ్చెమటలు!
నిన్నటికి నిన్న గుజరాత్ తీరంలో ఓ సింహం హల్ చల్ చేయగా.. తాజాగా ఓ పెద్దపులి నాగ్‌పూర్ లో పర్యాటకులకు ముచ్చెమటలు పట్టించింది. మహారాష్ట్ర నాగ్‌పూర్ లోని ఉమ్రెడ్ కర్హాండ్ల అటవీ జంతువుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించేందుకు ఓపెన్ టాప్ జీపులో పర్యాటకులు బయలుదేరి వెళ్లారు. వారు అటవీ అందాలు వీక్షిస్తుండగా ఎక్కడినుంచి వచ్చిందో ఓ పెద్దపులి హఠాత్తుగా దర్శనమిచ్చింది. ఆ పులి నెమ్మదిగా నడుచుకుంటూ జీపు వద్దకు వచ్చింది. అప్పుడు ఆ జీపులో ఇద్దరు పర్యాటకులతోపాటు ఓ పిల్లాడు కూడా ఉన్నారు. జీపులో ఉన్న ముగ్గురిని పెద్దగా పట్టించుకోకుండా పులి మాత్రం వాహనం ముందు అద్దంతో కాసేపు ఆడుకుంది. ఈ కాసేపు ఆ ముగ్గురు ప్రాణాలను అరచేత పట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉలుకు-పలుకు లేకుండా అలికిడి చేయకుండా చిత్రిత ప్రతిమల్లా ఉన్న వారిని పెద్దగా పట్టించుకోకుండానే పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. అదేవిధంగా గుజరాత్ అమ్రెల్లి జిల్లాలోని జఫ్రాబాద్ వద్ద ఓ సింహం సముద్రంలోకి దూకి ఈతకొడుతుండగా.. అటవీ అధికారులు పట్టుకొని సురక్షిత ప్రాంతానికి తరలించిన సంగతి తెలిసిందే. -
తిరుపతి జూలో క్యాన్సర్‌తో సింహం మృతి
తిరుపతి: తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల(ఎస్వీ జూపార్క్)లో శనివారం అనారోగ్యంతో హరి(8) అనే మగ సింహం మృతి చెందింది. ఎస్వీ జూపార్క్‌కు వచ్చే సందర్శకుల కోసం 2014 సంవత్సరంలో హైదరాబాదు జూ నుంచి దీనిని తీసుకొచ్చారు. కొద్ది రోజుల నుంచి ఈ సింహం క్యాన్సర్‌తో బాధపడుతోందని ఎస్వీ జూపార్క్ క్యూరేటర్ వై.శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆహారం కూడా తీసుకోవడం మానేసిందని, దీంతో ప్రతి రోజూ వైద్య పరీక్షలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపారు. మృత్యువు ముంగిట మరో పది ఎస్వీ జూపార్క్‌లో వయసుడిగి, క్యాన్సర్‌తో బాధపడుతూ మరో 10 సింహాలు మృత్యువుకు చేరువయ్యాయి. ఇటీవల జూలో అనేక జంతువులు వివిధ వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయి. రాష్ట్రంలోని మిగతా జూలతో పోల్చితే ఎస్వీ జూపార్క్‌లో సింహాల సంఖ్య ఎక్కువ. అయితే ఇలా అనారోగ్యానికి గురవుతుంటే చివరకు జూలో సింహాలకు బదులు వాటి కళేబరాలే మిగులుతాయని కొందరు జంతుప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మూడు పిల్లలకు జన్మనిచ్చిన సింహం
తిరుపతి : తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 18వ తేదీ జూపార్క్‌లోని శ్రీ అనే సింహం మూడు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయం శుక్రవారం వరకు అధికారులు గోప్యంగా ఉంచారు. దక్షిణ భారత దేశంలోనే ఇది అరుదైన ఘటన కావడంతో జంతు ప్రేమికుల్లో అనందం నింపుతోంది. 2014లో హైదరాబాద్ నుంచి శ్రీ అనే ఆడసింహం, హరి అనే మగ సింహాన్ని ఎస్వీ జూపార్క్‌కు తరలించారు. సీసీ కెమెరాల ద్వారా సింహం, పిల్లల కదిలికలను గమనిస్తున్నారు. రెండు వారాలకు కళ్లు తెరుస్తాయని అటవీ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జన్మించిన పిల్లలు ఒక కిలోలోపు మాత్రమే బరువు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జూపార్క్‌లో మొత్తం 32 సింహాలు ఉన్నాయి. 10 సఫారి నుంచి తెచ్చినవి కాగా, మిగతా 20 సర్కస్ కంపెనీల నుంచి తరలించారు. ఇవేకాకుండా 9 తెల్ల పులులు, 5 బెంగాల్ టైగర్స్ ఉన్నాయి.