Viral Video: Lion Plays Tug of War With Safari Jeep Full of Tourists - Sakshi
Sakshi News home page

నువ్వా!...నేనా.. అంటూ ఒక ఆట ఆడించిన సింహం!

Published Mon, Nov 29 2021 3:43 PM | Last Updated on Mon, Nov 29 2021 6:27 PM

Viral Video Lion Plays Tug Of War With Safari Jeep Full Of Tourists  - Sakshi

కొన్ని భయంకర ఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగానూ, భయాన్ని కలిగిస్తాయి. ఒక్కొసారి జరిగే భయంకర ఘటనలను చూస్తే ఇక మన పని అయిపోయిందేమో అని అనిపించేలా ఉంటాయి. అచ్చం అలాంటి ఘటనే దక్షిణాఫ్రికా అడవుల్లో చోటు చేసుకుంది.

(చదవండి: బిడ్డ పుట్టాలని సైకిల్‌ తొక్కింది!... అంతే చివరికి!!)

అసలు విషయంలోకెళ్లితే...  పర్యాటక దేశమైన దక్షిణాఫ్రికాలోని ప్రసిద్ధిగాంచిన ఆఫ్రికన్‌ అడవుల గుండా ఒక పర్యాటక బృందం ఎస్‌యూవీ సఫారీ కారులో పర్యటిస్తోంది. అయితే అనుకోకుండా ఒక గుంటలో కారు ఇరుక్కుపోతుంది. దీంతో ఆ కారు డ్రైవర్‌ అయిన టూరిస్ట్‌ గైడ్‌ గైడ్ జబులానీ సలిండా కెన్నెడీ ఒక తాడు సాయంతో ఏదోలా బయటికి తీస్తాడు. అనుకోకుండా ఇంతలో ఒక మగ సింహ అక్కడికి వస్తుంది. అంతే ఒక్కసారిగా ఆ పర్యాటకులంతా భయంతో కేకలు వేస్తారు. దీంతో గైడ్‌ కెన్నెడీ కంగారపడవద్దని చెప్పి వాళ్లను లోపలే కూర్చోమని ధైర్యం చెబుతాడు. అయితే ఈ హడవిడిలో వాళ్లు ఆ కారుకి కట్టిన తాడుని వెనక్కి తీయలేకపోతారు.

అంతే ఆ తాడు పై  ఆ సింహం దృష్టి పడుతుంది. ఇంకేముంది ఆ సింహం ఆ తాడుని నోటితో పట్టుకుని ఎలాగైన కారుని వెళ్లనీయకుండా చేయాలని చూస్తుంది. పాపం చాలా ప్రయాస పడుతుంది. ఒకనోక దశలో అయితే అది కింద పడిపోయి ఈడ్చుకుంటూ పోతుంది. అయినప్పటికి ఆ తాడుని మాత్రం వదలదు. ఈ మేరకు చివరికి సింహానికే చికాకు పుట్టి ఆ తాడుని వదిలేస్తుది. దీంతో ఆ పర్యాటకులు బతుకు! దేవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. 

(చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement