tourist guide
-
విజయవాడ: టూరిస్ట్ గైడ్ నందా విష్ణువర్ధన్‌పై దాడి
సాక్షి, విజయవాడ: టూరిస్ట్ గైడ్ నందా విష్ణువర్ధన్‌పై దాడి జరిగింది. నలుగురు వ్యక్తులు బందర్‌రోడ్డులోని ఆఫీసులో విష్ణును రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలోనే ఆఫీస్‌లోని ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఇక, దుండగుల దాడిలో విష్ణు తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్య చికిత్స అందిస్తున్నారు. కాగా, దాడి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని మాచవరం సీఐ గునరామ్ పరిశీలించారు. అయితే, దాడి సందర్భంగా అదంతా సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండగా నిందితులు జాగ్రత్తపడ్డారు. ఇదిలా ఉండగా.. ఆలిండియా హాస్టల్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా విష్ణు ఉన్నాడు. ట్రెక్కింగ్ గైడ్, టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్నాడు. ఇక, మహిళల వ్యవహారం కారణంగానే విష్ణుపై దాడి జరిగినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాజకీయాల్లో యాక్టివ్.. బీజేపీ నేత దారుణ హత్య.. -
టూరిస్టు కారు గుంటలో పడితే.. దాని కట్టిన తాడు సింహం నోటిలో.!
కొన్ని భయంకర ఘటనలు చూస్తే చాలా ఆశ్చర్యంగానూ, భయాన్ని కలిగిస్తాయి. ఒక్కొసారి జరిగే భయంకర ఘటనలను చూస్తే ఇక మన పని అయిపోయిందేమో అని అనిపించేలా ఉంటాయి. అచ్చం అలాంటి ఘటనే దక్షిణాఫ్రికా అడవుల్లో చోటు చేసుకుంది. (చదవండి: బిడ్డ పుట్టాలని సైకిల్ తొక్కింది!... అంతే చివరికి!!) అసలు విషయంలోకెళ్లితే... పర్యాటక దేశమైన దక్షిణాఫ్రికాలోని ప్రసిద్ధిగాంచిన ఆఫ్రికన్ అడవుల గుండా ఒక పర్యాటక బృందం ఎస్యూవీ సఫారీ కారులో పర్యటిస్తోంది. అయితే అనుకోకుండా ఒక గుంటలో కారు ఇరుక్కుపోతుంది. దీంతో ఆ కారు డ్రైవర్ అయిన టూరిస్ట్ గైడ్ గైడ్ జబులానీ సలిండా కెన్నెడీ ఒక తాడు సాయంతో ఏదోలా బయటికి తీస్తాడు. అనుకోకుండా ఇంతలో ఒక మగ సింహ అక్కడికి వస్తుంది. అంతే ఒక్కసారిగా ఆ పర్యాటకులంతా భయంతో కేకలు వేస్తారు. దీంతో గైడ్ కెన్నెడీ కంగారపడవద్దని చెప్పి వాళ్లను లోపలే కూర్చోమని ధైర్యం చెబుతాడు. అయితే ఈ హడవిడిలో వాళ్లు ఆ కారుకి కట్టిన తాడుని వెనక్కి తీయలేకపోతారు. అంతే ఆ తాడు పై ఆ సింహం దృష్టి పడుతుంది. ఇంకేముంది ఆ సింహం ఆ తాడుని నోటితో పట్టుకుని ఎలాగైన కారుని వెళ్లనీయకుండా చేయాలని చూస్తుంది. పాపం చాలా ప్రయాస పడుతుంది. ఒకనోక దశలో అయితే అది కింద పడిపోయి ఈడ్చుకుంటూ పోతుంది. అయినప్పటికి ఆ తాడుని మాత్రం వదలదు. ఈ మేరకు చివరికి సింహానికే చికాకు పుట్టి ఆ తాడుని వదిలేస్తుది. దీంతో ఆ పర్యాటకులు బతుకు! దేవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. (చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు) -
ఒక్కటైన బిహార్ అబ్బాయి.. ఫ్రాన్స్ అమ్మాయి.. ఫోటోలు వైరల్
ప్రేమకు సరిహద్దులు లేవు. అంతటి ప్రేమను వర్ణించేందుకు ప్రమాణాలూ లేవంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమగా చిగురించి జీవితాంతం తోడుగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఎల్లలు లేని ప్రేమ ఊరు, వాడ, దేశాన్నే దాటి విహరిస్తోంది. అయితే ఓ ఇద్దరి ప్రేమ మాత్రం ఏకంగా ఖండంతారాలు దాటింది. బిహార్ అబ్బాయి ఫ్రాన్ అమ్మాయి ప్రేమలో పడిపోయాడు. కట్ చేస్తే ఇద్దరు సంతోషంగా హిందూ సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. చదవండి: స్పెషల్ బ్రిడ్జిలు.. ఇవి మనుషుల కోసం కాదండోయ్.. పీతల కోసం పారిస్‌కు చెందిన మేరీ లోరీ ఆరేళ్ల క్రితం ఇండియాలో పర్యటించేందుకు వచ్చింది. అప్పుడే ఆమెకు ఢిల్లీలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్న రాకేష్ కుమార్ పరిచయమయ్యాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇరువురు ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకునేవారు. మేరి ఇండియా నుంచి వెళ్లిపోయిన వారి స్నేహానికి సరిహద్దులు అడ్డు రాలేదు. రెండు, మూడేళ్ల క్రితం రాకేష్‌కి ఫోన్ చేసిన మేరి.. ఫ్రాన్స్ వచ్చి తనతో పాటు కలిసి టెక్స్టైల్స్ బిజినెస్ ప్రారంభించాలని అతన్ని కోరింది. మేరి కోరిక మేరకు ఫ్రాన్స్ వెళ్లిన రాకేష్ ఆమెతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. చదవండి: ఇదేం రూల్ సామి.. భార్య బర్త్‌డే మర్చిపోతే.. జైళ్లో పడేస్తారా ! ఈ క్రమంలోనే వాళ్లిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. నూరేళ్ల జీవితాన్ని కలిసి పంచుకోవాలనుకున్నారు. ముఖ్యంగా ఇండియాలోని బిహార్ హిందూ సంప్రదాయాల ప్రకారం మేరి పెళ్లి చేసుకోవాలని కోరింది. ఇందుకు ఆమె తన కుటుంబాన్ని కూడా ఒప్పించి పెళ్లి కోసం ఇండియాకు తీసుకొచ్చింది. నవంబర్ 21న వీరిద్దరూ భారతీయ సంప్రదాయం ప్రకారం మూడుమూళ్ల బంధంతో ఒకటయ్యారు. ఫ్రాన్స్ వధువుని, కుటుంబాన్ని చూసేందుకు గ్రామస్తులు, స్థానిక జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. -
Travel Tips: సోలంగ్ వ్యాలీ పర్యాటన ఓ అందమైన అనుభూతి..!
సోలంగ్ టూర్లో అడ్వెంచరస్ స్పోర్ట్స్ హబ్ సోలంగ్ వ్యాలీనే. సోలాంగ్ నది పరివాహక ప్రదేశం ఇది. మనాలికి 13 కిమీల దూరాన ఉంది. కులు–మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువైన తర్వాత సినిమా షూటింగ్‌లు సోలంగ్ వ్యాలీలో జరుగుతున్నాయి. ఇప్పుడా సోలంగ్ వ్యాలీ పర్యాటకుల సాహస క్రీడావిహారానికి కేంద్రమైంది. ట్రెకింగ్, పారాగ్లైడింగ్, క్యాంపింగ్, రివర్ రాఫ్టింగ్, స్నో స్కీయింగ్, గ్రాస్ స్కీయింగ్, హార్స్ రైడింగ్, స్నో స్కూటర్ రేస్, రివర్ క్రాసింగ్, వాల్ క్లైంబింగ్ వంటి ఆటలన్నీ ఆడుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్కడ పారా గ్లైడింగ్ చేశారు. అయితే సమీప గతంలో కాదు, అది గుజరాత్‌కి ముఖ్యమంత్రి కాక ముందు మాట. రొటీన్‌కి భిన్నంగా మనాలి పర్యటనలో రొటీన్‌గా చూసే మంచు కొండల్లో విహారానికి పరిమితం కాకుండా మరికొంచెం ఆసక్తిగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే నగ్గర్ కోటలో బస, సాహసక్రీడలు, ప్రాచీన వారసత్వ నిర్మాణాలు, ఆ ప్రదేశానికి పరిమితమైన వైవిధ్యమైన వాస్తుశైలి, జలపాతాల స్వచ్ఛత, నదిలో విహరింతలను ఆస్వాదించడం సాధ్యమవుతుంది. మాల్ రోడ్డులో ఏమీ కొనకపోయినా సరే... హనీమూన్ కపుల్ చెట్టాపట్టగ చేతులు పట్టుకుని నడవడమే జీవితమంతా గుర్తుండిపోయే మధురానుభూతి. అలాగే కేబుల్ కార్ విహారం కూడా. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! ఇవన్నీ చూడాలి! హిడింబాలయం పాండవులలో రెండవ వాడు భీముని భార్య హిడింబి. ఆమె ఆలయమే ఇది. మనాలి సమీపంలోని దుంగ్రీ అటవీ ప్రాంతంలో ఉంది. మనాలి టూర్ ప్యాకేజ్‌లలో హిడింబ ఆలయం తప్పక ఉంటుంది. హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్స్ మ్యూజియం ఇది హిడింబ ఆలయానికి దగ్గరలోనే ఉంది. ఈ ప్రదేశంలో విలసిల్లిన నాగరకతను పురాతన వస్తువులు, ఆయుధాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. టిబెట్ మఠాలు మనాలిలో స్థిరపడిన టిబెట్ వాళ్ల నివాస ప్రదేశాలివి. నిర్మాణశైలి పరంగా ప్రత్యేకంగా ఉంటాయి. రంగులు కూడా ఆసక్తిగొలుపుతుంటాయి. వశిష్ఠ ఆలయం ఇది ఏకశిలలో తొలిచిన ఆలయం. ఈ ఆలయంతోపాటు ఇక్కడి వేడినీటి గుండాలు ప్రధాన ఆకర్షణ. జోగ్ని జలపాతం మంచుకొండలు, వేగంగా ప్రవహించే నదుల మధ్య ఉధృతంగా నేలకురికే జలపాతం సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేం. స్వయంగా వీక్షించి ఎవరికి వాళ్లు అనుభూతి చెందాల్సిందే. నయింగ్మ టెంపుల్ ఇది మనాలి, మాల్‌రోడ్‌లో ఉన్న బుద్ధుని ఆలయం. నిర్మాణశైలిపరంగా చూసి తీరాల్సిన ఆలయం. శాక్యముని విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. మాల్‌రోడ్‌లో దుకాణాల్లో ఉలెన్ క్లోత్స్, దోర్జీబెల్స్, ప్రేయర్ వీల్స్ వంటి సావనీర్లు, టిబెట్ అగరబత్తులు, తరుణిబట్టిన దారుకళాకృతులు, హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టర్కోయిస్, సిల్వర్ ఆభరణాలు, టిబెట్ వాళ్లు ధరించే ఆభరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలా తినవచ్చు! ఈ పర్యటనలో రకరకాల రుచులను మిస్ కాకూడదు. మౌంట్ వ్యూ రెస్టారెంట్లో టిబెట్, జపాన్, చైనా, ఇటాలియన్, కాంటినెంటల్ ఫుడ్ రుచి చూడవచ్చు. చలిమంట వెచ్చదనంతోపాటు బార్బిక్యూ వంటలను ఆస్వాదించాలంటే బాసిల్ లీఫ్ రెస్టారెంట్‌కెళ్లాలి. మనాలి హిమాలయాల నేపథ్యంలో ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించాలంటే రూఫ్‌టాప్ రెస్టారెంట్లో భోజనం చేయడం మంచి ఆలోచన. ఇది నగ్గర్ రోడ్లో ఉంది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! ఎప్పుడు! ఎలా! హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని సోలంగ్– మనాలి టూర్‌కి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఏడాది సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మాత్రమే. సమీప విమానాశ్రయం భుంటార్ ఎయిర్‌పోర్టు. ఇది మనాలి సిటీసెంటర్‌కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇవన్నీ కొనుక్కోవచ్చు ►మాల్‌రోడ్‌లో దుకాణాల్లో ఉలెన్ క్లోత్స్, దోర్జీబెల్స్, ప్రేయర్ వీల్స్ వంటి సావనీర్లు, టిబెట్ అగరబత్తులు, తరుణిబట్టిన దారుకళాకృతులు, హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ టర్కోయిస్, సిల్వర్ ఆభరణాలు, టిబెట్ వాళ్లు ధరించే ఆభరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ►సింగింగ్ బౌల్: ఇది బౌద్ధానికి ప్రతీక. హిమాచల్ ప్రదేశ్, టిబెట్ రోజువారీ జీవితంలో భాగం. దీని నుంచి వచ్చే శబ్దం, ఆ ప్రకంపనలు వాతావరణాన్ని ఆహ్లాదపరచడంతోపాటు ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రతను కలిగిస్తాయని చెబుతారు. స్నేహితులకు బహుమతిగా ఇవ్వడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ సింగింగ్ బౌల్స్‌ను కొంటారు. ►కులు షాల్: ఉలెన్ దుస్తుల విభాగంలో అడుగుపెడితే దేనిని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. స్వెటర్లు, మఫ్లర్లు, క్యాప్‌లు వందల రకాలుంటాయి. ప్రతిదీ అందంగానే ఉంటుంది. ఈ ట్రిప్‌కు గుర్తుగా కులు, కిన్నౌరి షాల్ తెచ్చుకోవడం మర్చిపోకూడదు. రకరకాల షేడ్లలో ఏ రంగు దుస్తులకైనా మ్యాచ్ అయ్యేటన్ని మోడల్స్ ఉంటాయి. ►ప్రేయర్ వీల్: ఇది టిబెట్ సంప్రదాయంలో ప్రధానమైనది. లోహం, చెక్క, తోలుతోపాటు రాతి చక్రాలు కూడా ఉంటాయి. ఈ వీల్స్ మీద టిబెట్ భాషలో ‘ఓంమణి పద్మే’ అనే మంత్రం ఉంటుంది. ఈ టూర్ గుర్తుగా డ్రాయింగ్ రూమ్‌లో పెట్టుకోవచ్చు. ►దోర్జీ బెల్: ఇది కూడా టిబెట్ సంప్రదాయ వస్తు విశేషమే. గంట ఆకారంలో ఉంటుంది. మనాలిలో ఏ వస్తువైనా సరే ప్రభుత్వం అనుమతి పొందిన స్టోర్లలో మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. మామూలు దుకాణాల్లో ధరలు ఆకాశాన ఉంటాయి. బేరం చేయగలిగిన సామర్థ్యానికి పరీక్ష. గట్టిగా బేరం చేయగలిగితే ధరలను నేల మీదకు దించవచ్చు. కానీ టూర్లో సమయం చాలా విలువైనది. బేరం చేయడం కోసం అంత సమయం వృథా చేయడం అర్థరహితం. మాల్ రోడ్ తర్వాత మనాలిలో హాంగ్‌కాంగ్ మార్కెట్ మీద ఓ కన్నేయవచ్చు. ట్రావెల్ టిప్స్ ►మాల్ రోడ్లో పగలు జరిగినంత షాపింగ్ రాత్రి కూడా జరుగుతుంది. హస్తకళాకృతులు లెక్కలేనన్ని రకాలుంటాయి. ఈ దుకాణాలను చూస్తే పురాతనంగా కనిపిస్తాయి. కానీ అన్నింటిలోనూ యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డు పేమెంట్ చేయవచ్చు. ►మాల్ రోడ్లో దొంగతనాలు ఎక్కువ. ఇక్కడ పర్యటించేటప్పుడు విలువైన వస్తువులను దగ్గర ఉంచుకోకపోవడమే మంచిది. షాపింగ్ సమయంలో చేతిలో ఉన్న బ్యాగ్‌ను పక్కన పెట్టి మరీ వస్తువుల నాణ్యతను పరిశీలిస్తాం. అలాంటి సమయంలో మళ్లీ చూసుకునేటప్పటికి బ్యాగ్ ఉండకపోవచ్చు. ఒక్కోసారి కింద పెట్టిన బ్యాగ్ గురించి మనమే మర్చిపోవచ్చు కూడా. కొంత దూరం వెళ్లిన తరవాత గుర్తుకు వచ్చి వెనక్కి వచ్చినా ప్రయోజనం ఉండదు. చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట! -
Weekend Tourist Spot: గోదావరి తీరం.. శ్రీరాముడి విహారం..
ఈ ఊరిపేరు పోచంపాడు. శ్రీరాముడు వనవాసకాలంలో ఇక్కడ సంచరించాడని స్థానికుల విశ్వాసం. అందుకే పోచంపాడులో నిర్మించిన ప్రాజెక్టు శ్రీరామ్సాగర్గా పేరు తెచ్చుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్‌సాగర్... చక్కటి వీకెండ్ హాలిడే స్పాట్. పిల్లల కేరింతలు, పెద్దవాళ్ల తాదాత్మ్యతతో ఈ టూర్ పరిపూర్ణమవుతుంది. మహాగమనం మహారాష్ట్రలో పుట్టిన గోదావరి గైక్వాడ్, విష్ణుపురి, బాబ్లీ ప్రాజెక్టులను దాటుకుని తెలంగాణలో అడుగుపెట్టి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుతో వేగానికి కళ్లెం వేసుకుంటుంది. పర్యాటకులను అలరిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మల్, జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు తాగునీరు, సాగునీటికి ప్రధాన ఆధారం. పుష్కర సాగర్ పోచంపాడు గోదావరి నది పుష్కరాలకు కూడా ప్రసిద్ధి. గడచిన పుష్కరాలలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది నదిలో స్నానమాచరించారు. పుష్కరాలతో ప్రమేయం లేకుండా నదిస్నానం కోసం పర్యాటకులు ప్రతి శుక్రవారం, ఇతర సెలవు దినాల్లో ఎక్కువగా వస్తారు. భవిష్యత్తులో బోటు షికారు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో బోటింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేసి బాసర వరకు బోట్లు నడపాలని తెలంగాణ టూరిజం నిర్ణయించింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి బాసరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం. ఇంతదూరం బోటు షికారు చేయడం పర్యాటకులకు అంతులేని ఆనందాన్నిస్తుందనడంలో సందేహం లేదు. టూరిజం కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. త్యాగచరిత 1963 జూలై 26న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పోచంపాడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1978కి ప్రాజెక్టు పూర్తయింది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, నందిపేట్, నవీపేట్, ఆర్మూర్, నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం, దిలావర్పూర్, నిర్మల్ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు వ్యవసాయ భూములు, ఇళ్లను త్యాగం చేయడంతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు జీవం పోసుకుంది. ఎంతెంత దూరం! ఎలా వెళ్లాలి! శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జాతీయ రహదారి 44కు మూడు కి.మీ దూరంలో ఉంది. నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే బస్సులు పోచంపాడు∙మీదుగా వెళ్తాయి. ఆదిలాబాద్, నిర్మల్ నుంచి నిజామాబాద్, హైదరాబాద్‌కు వెళ్లే బస్సులన్నీ పోచంపాడు మీదుగానే ప్రయాణిస్తాయి. పోచంపాడు... హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్‌కు 50 కిలోమీటర్లలో, నిర్మల్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. – చంద్రశేఖర్, భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
శ్రీలంకలో మొదటి కరోనా కేసు నమోదు
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) మరో దేశానికి వ్యాప్తి చెందింది. శ్రీలంకలో మొదటి కరోనా కేసు నమోదు అయ్యినట్లు ఆ దేశం ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. ఇటీవల ఇటలీ నుంచి వచ్చిన పర్యటకులను సంప్రదించిన 52 ఏళ్ల టూరిస్ట్ గైడ్‌కు కరోనా సోకినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ వ్యక్తిని ఉత్తర కొలంబోలో ఉన్న ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు వైద్యాధికారులు తెలిపారు. (కరోనా బారిన ఆరోగ్య మంత్రి) వృత్తి రీత్యా టూరిస్ట్ గైడ్ అయిన వ్యక్తి ఇటాలియన్ పర్యాటకుల బృందంతో కలిసి పనిచేసిన అనంతరం వైరస్ బారిన పడినట్లు శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కార్యాలయం తెలిపింది. అలాగే దేశంలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇటలీ పర్యటకులు ఏయే ప్రదేశాలను సందర్శించారనే దానిపై శ్రీలంక అధికారులు ఆరా తీస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా .. చైనా, సౌదీ అరేబియా నుంచి వచ్చే విమానాలను శ్రీలంక ఎయిర్‌లైన్స్ నిలిపివేసింది. కరోనా ప్రభావం ఎక్కువ ఉన్న ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్ నుంచి వచ్చిన వారిని నిర్భంధించడం ప్రారంభించింది. (కరోనా ఎఫెక్ట్ : మాస్క్‌తో చాహల్) ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా 4,250 మందిని బలి తీసుకుంది. అలాగే దాదాపు 100 దేశాలకు వ్యాప్తి చెందింది. భయంకర కరోనా వైరస్‌తో చైనాలో ఇప్పటివరకూ సంభవించిన మరణాల సంఖ్య 3,136కు చేరగా.. ఇటలీలో 10 వేల మందికి వ్యాప్తి చెందగా ఇప్పటి వరకు 631 మంది మరణించారు. మరోవైపు కోవిడ్–19 బారిన పడిన వారి సంఖ్య భారత్‌లో 60కి చేరుకుంది. కరోనా వైరస్ వరుస కథనాల కోసం క్లిక్ చేయండి -
శ్రీలంకలో ఆస్ట్రేలియా విద్యార్థినిపై అత్యాచారం
శ్రీలంకలో అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. అక్కడ అంబలగొండ పట్టణంలో ఓ టూరిస్టు గైడు ఆస్ట్రేలియన్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. స్టడీ టూర్ కోసం ఆస్ట్రేలియా నుంచి శ్రీలంక వరకు వచ్చిన ఆ విద్యార్థిని బీచ్‌కి వెళ్లినప్పుడు అక్కడున్న ఓ టూరిస్టు గైడు తనపై అక్కడున్న సాలిటరీ రాక్ కింద అత్యాచారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని అక్కడి స్థానిక వెబ్సైట్లు తమ కథనంలో పేర్కొన్నాయి. మొత్తం 15 మంది ఆస్ట్రేలియన్ విద్యార్థులు పరిశోధన కోసం ఒక బృందంగా శ్రీలంకకు వెళ్లారు. అందులో ఉన్న ఈ విద్యార్థిని బీచ్ వద్దకు వెళ్లినప్పుడు అక్కడున్న గైడ్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించడంతో వారు ఆమెకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. నిందితుడు అక్కడినుంచి వెంటనే పారిపోవడంతో అతడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.