ప్రేమకు సరిహద్దులు లేవు. అంతటి ప్రేమను వర్ణించేందుకు ప్రమాణాలూ లేవంటారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన పరిచయం, ప్రేమగా చిగురించి జీవితాంతం తోడుగా ఉండేందుకు తోడ్పడుతుంది. ఎల్లలు లేని ప్రేమ ఊరు, వాడ, దేశాన్నే దాటి విహరిస్తోంది. అయితే ఓ ఇద్దరి ప్రేమ మాత్రం ఏకంగా ఖండంతారాలు దాటింది. బిహార్ అబ్బాయి ఫ్రాన్ అమ్మాయి ప్రేమలో పడిపోయాడు. కట్ చేస్తే ఇద్దరు సంతోషంగా హిందూ సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు.
చదవండి: స్పెషల్ బ్రిడ్జిలు.. ఇవి మనుషుల కోసం కాదండోయ్.. పీతల కోసం
పారిస్‌కు చెందిన మేరీ లోరీ ఆరేళ్ల క్రితం ఇండియాలో పర్యటించేందుకు వచ్చింది. అప్పుడే ఆమెకు ఢిల్లీలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్న రాకేష్ కుమార్ పరిచయమయ్యాడు. అలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇరువురు ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకునేవారు. మేరి ఇండియా నుంచి వెళ్లిపోయిన వారి స్నేహానికి సరిహద్దులు అడ్డు రాలేదు. రెండు, మూడేళ్ల క్రితం రాకేష్‌కి ఫోన్ చేసిన మేరి.. ఫ్రాన్స్ వచ్చి తనతో పాటు కలిసి టెక్స్‌టైల్స్ బిజినెస్ ప్రారంభించాలని అతన్ని కోరింది. మేరి కోరిక మేరకు ఫ్రాన్స్ వెళ్లిన రాకేష్ ఆమెతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు.
చదవండి: ఇదేం రూల్ సామి.. భార్య బర్త్‌డే మర్చిపోతే.. జైళ్లో పడేస్తారా !
ఈ క్రమంలోనే వాళ్లిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. నూరేళ్ల జీవితాన్ని కలిసి పంచుకోవాలనుకున్నారు. ముఖ్యంగా ఇండియాలోని బిహార్ హిందూ సంప్రదాయాల ప్రకారం మేరి పెళ్లి చేసుకోవాలని కోరింది. ఇందుకు ఆమె తన కుటుంబాన్ని కూడా ఒప్పించి పెళ్లి కోసం ఇండియాకు తీసుకొచ్చింది. నవంబర్ 21న వీరిద్దరూ భారతీయ సంప్రదాయం ప్రకారం మూడుమూళ్ల బంధంతో ఒకటయ్యారు. ఫ్రాన్స్ వధువుని, కుటుంబాన్ని చూసేందుకు గ్రామస్తులు, స్థానిక జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment